Astro Tips: చిటికెడు పసుపుతో ఇలా చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది.. ప్రతి కల నెరవేరుతుంది.. పూర్తి వివరాలివే..!
హిందూ మతంలో పసుకు ప్రత్యేక స్థానం ఉంది. వంటి గది నుంచి దేవుడి గది వరకు అన్ని అవసరాలకు పసుపును వినియోగిస్తారు. అంతకంటే ముఖ్యంగా పసుపును పవిత్రమైనదిగా భావిస్తారు.
హిందువులు తమ ఇళ్లలో జరుపుకునే ప్రతి శుభకార్యంలో పసుపును శుభ సూచికగా వినియోగిస్తారు. అయితే, పసుపు ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అదృష్టాన్ని కూడా ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పసుపు బృహస్పతి గ్రహానికి సంబంధించినది. దీని ప్రభావం వల్ల వ్యక్తులపై ఎక్కువగా ఉంటుందని, పసుపుతో కొన్ని పరిహారాలు చేస్తే పట్టిందల్లా కొంగుబంగారంలా మారుతుందని చెబుతున్నారు పండితులు. పసుపు తో ఏం చేస్తే, ఎలా చేస్తే దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీ లేదా మీ కుటుంబ సభ్యుల వివాహానికి ఆటంకాలు ఎదురవుతుంటే.. ఆ సమస్య తొలగిపోవడానికి ప్రతి గురువారం గణపతిని ప్రత్యేకంగా పూజించాలి. ఆ సమయంలో గణేషుడికి చిటికెడు పసుపును సమర్పించాలి. ఈ పూజా విధానంతో గణపతి సంతృప్తి చెంది.. సదరు వ్యక్తి జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం.
2. హిందూ విశ్వాసం ప్రకారం.. ప్రతిరోజూ దేవుడి పూజలో పసుపును సమర్పించి, దానిని ప్రసాదంగా భావించి, తిలకం రూపంలో నుదుటిపై పెట్టుకుంటే అంతా శుభం జరుగుతుంది. వివాహానికి వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.
3. రాత్రి నిద్రిస్తున్నప్పుడు ఎవరికైనా చెడు కలలు వస్తే.. వాటిని నివారించడానికి సదరు వ్యక్తి తన మంచం తలపై మోలీతో చుట్టిన పసుపు ముడిని ఉంచాలి. ఇలా చేయడం వల్ల దుష్టశక్తుల నుంచి, చెడు కలల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం.
4. జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉండటం వల్ల కూడా కష్టాలు ఎదురవుతాయి. దీని కారణంగా ఆనందం, అదృష్టం తగ్గుతున్నాయని మీరు భావిస్తే.. ప్రతిరోజూ చిటికెడు పసుపును నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఈ పరిహారం చేసిన వెంటనే జీవితంలో పెద్ద మార్పు వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు.
5. ఇంట్లో సమస్యలు ఎక్కువ అవుతున్నాయా? అయితే, ప్రతి గురువారం ఇంట్లో ప్రతి మూలలో పసుపు కలిపిన గంగాజలాన్ని చల్లాలి. ఈ పరిహారం చేయడం వల్ల దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది. ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వస్తుంది. అదృష్టం, ఐశ్యర్యం సిద్ధిస్తాయి.
గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం కేవలం మత విశ్వాసాలు, ప్రజల నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.