అటుకులతో మనం ఎన్నో రకాల స్నాక్స్ తయారు చేసుకుంటూ ఉంటాం. అంతే కాకుండా టిఫిన్స్ కూడా తయారు చేసుకోవచ్చు. దోశలు, ఇడ్లీలు, వడలు ఇలా టిఫిన్స్ తయారు చేసుకుంటారు.
వీటితో తయారు చేసినవి ఎంతో రుచిగా ఉంటాయి. అంతే కాకుండా చాలా తక్కువ సమయంలోనే వంటలు కూడా పూర్తి అవుతాయి. అటుకుల్లో ఎన్నో విలువైన పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అటుకులతో ఎప్పుడూ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా.. ఇలా వెరైటీగా మురుకులు కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. స్నాక్స్‌గా తీసుకోవడానికి ఇవి చక్కగా ఉంటాయి. మరి అటుకులతో మురుకులు ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
అటుకుల మురుకులకు కావాల్సిన పదార్థాలు:
అటుకులు, బియ్యం పిండి, జీలకర్ర, నువ్వులు, కళోంజి విత్తనాలు, ఉప్పు, ఆయిల్, మిరియాల పొడి, ఉప్పు లేని బటర్, వేడి నీళ్లు, పుట్నాల పప్పు.
అటుకుల మురుకులు తయారీ విధానం:
ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈలోపు మురుకుల పిండి కలుపుకుందాం. స్టవ్ మీద మరో కడాయి పెట్టి.. పుట్నాల పప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి పుట్నాల పప్పు తీసుకుని మెత్తగా పౌడర్‌లా జల్లించి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఖాళీగా పెద్దగా ఉండే ప్లేటు తీసుకుని అందులోకి పుట్నాల పప్పును జల్లించుకోవాలి. ఆ తర్వాత ఇందులో బియ్యం పిండి, నువ్వులు, జీలకర్ర, కళోంజి విత్తనాలు, మిరియాల పొడి, బటర్, ఉప్పు వేసి పూరీ పిండిలా కలుపు కోవాలి.
ఇప్పుడు మురుకుల గొట్టాన్ని తీసుకోవాలి. దీనీకి ముందుగా ఆయిల్ రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక.. మురుకుల్లా వత్తుకోవాలి. ఇప్పుడు మంట మీడియంలో పెట్టి.. రెండు వైపులా ఎర్రగా అయ్యేలా వేయించుకోవాలి. చివరిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల మురుకులు సిద్ధం. వీటిని పిల్లకు పెడితో ఎంతో ఇష్టపడి తింటారు.