AP News | మంత్రి పదవి రాకపోవడంపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు

AP News | మంత్రి పదవి దక్కకపోవడంపై టీడీపీ సీనియర్‌ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి రాకపోవడంపై తనకు బాధేమీ లేదని స్పష్టం చేశారు.


గతంలో తనకు కూడా 26 ఏండ్లకే మంత్రి పదవి దక్కిందని చెప్పారు. అప్పుడు సీనియర్లంతా బాధపడ్డారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్త రక్తం రావాలని, యువ మంత్రులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో కొంతమంతి అధికారులు ఓవర్‌ యాక్షన్‌ చేశారని తెలిపారు. వారిని చంద్రబాబు క్షమించినా.. తాను మాత్రం క్షమించనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల కోసం అనేక ఇబ్బందులు పడ్డామని తెలిపారు. ఏపీకి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు.

టీడీపీ సీనియర్‌ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడికి చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కకపోవడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. కూటమి అధికారంలోకి వస్తే టీడీపీలో అత్యంత సీనియర్‌ నాయకుడు, చంద్రబాబుకు సమకాలీకుడు అయిన అయ్యన్నపాత్రుడికి మంత్రి పదవి గ్యారంటీ అని చాలామంది ఊహించారు.

కానీ అనూహ్యంగా ఆయనకు కేబినెట్‌లో చోటు దక్కలేదు. విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనితకు మంత్రి పదవి కేటాయించారు. అయ్యన్నపాత్రుడు అసంతృప్తిలో ఉన్నట్లు చర్చ మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన అయ్యన్నపాత్రుడు ఆ వార్తలను ఖండించారు.