రజనీకాంత్ రికార్డును బద్దలు కొట్టాడు బాలయ్య

సౌత్ ఇండియాలో రెమ్యునరేషన్ ఎక్కువగా తీసుకునే హీరోల్లో రజినీ కాంతే ముందుంటారు. పూర్తి సినిమాకే కాదు.. ఓ సినిమాలో గెస్ట్‌ అప్పియరెన్స్ ఇచ్చినా.. రజినీ కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటారు. తన కూతురు డైరెక్షన్లో తాను చేసిన లాల్ సలామ్‌ సినిమాలో అలా కనిపించినందుకే ఏకంగా 40 కోట్ల రూపాయలను పారితోషకంగా తీసుకున్నాడు. అయితే రజినీ క్రియేట్ చేసిన ఈ రెమ్యునరేషన్ రికార్డ్‌ను ఇప్పుడు బాలయ్య క్రాస్ చేశాడు. రజినీ, నెల్సన్ కాంబోలో తెరకెక్కే జైలర్ 2 సినిమాలో.. గెస్ట్ రోల్ చేస్తున్న బాలయ్య.. ఆ రోల్ కోసం ఏకంగా 50 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా అందుకుంటున్నట్టు టాక్. దీంతో ఇప్పుడు బాలయ్య నేమ్‌ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోగిపోతోంది. దాంతో పాటే బాలయ్య అభిమానులను మీసం మెలేసి.. తొడకొట్టేలా చేస్తోంది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.