జూలై 1 నుండి 10 సంవత్సరాల పిల్లలకు బ్యాంకు ఖాతాలను అమలు చేయాలని ఆర్‌బిఐ ఆదేశించింది!

RBI: పది సంవత్సరాలకు మించిన పిల్లలు స్వతంత్రంగా బ్యాంక్ ఖాతాలను నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పొదుపు ఖాతాలు (Savings Account), ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు (Fixed Deposit Account) తెరవడం, లావాదేవీలు (Transactions) చేయడం వంటి వాటికి ఇకపై పిల్లలకు అనుమతి ఇవ్వబడుతుంది. ఈ క్రొత్త నియమాలు 2025 జులై 1 నుండి అమలులోకి రావని RBI ప్రకటించింది.


బ్యాంక్ ఖాతా: RBI తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, 10 సంవత్సరాలు పూర్తయిన మైనర్లు తమ పేరుతో ఖాతాలు తెరిచి, డెబిట్ కార్డ్ (Debit Card), ఇంటర్నెట్ బ్యాంకింగ్ (Internet Banking), ఏటీఎం (ATM) వాడకం, చెక్కులు (Cheque Book) వ్రాయడం వంటి సౌకర్యాలను పొందవచ్చు. అయితే, ఖాతా తెరిచేటప్పుడు సంతకం (Signature), ఇతర వివరాలు (KYC Documents) బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది.

10 సంవత్సరాల లోపు పిల్లలకు: 10 ఏళ్లలోపు వయస్సు ఉన్న పిల్లలు ఇప్పటికీ బ్యాంక్ ఖాతాలు తెరవగలరు, కానీ వారి చట్టపరమైన సంరక్షకుడి (Legal Guardian) పర్యవేక్షణలోనే ఖాతా నిర్వహణ జరగాలి. ఏదేమైనా, మైనర్ల ఖాతాలకు ఓవర్ డ్రాఫ్ట్ (Overdraft) అనుమతించబడదు మరియు ఎల్లప్పుడూ ఖాతాలో క్రెడిట్ బ్యాలెన్స్ (Credit Balance) ఉండేలా బ్యాంకులు నిర్ధారించాలి.

కీలక నియమాలు:

  • 10+ ఏళ్ల పిల్లలు స్వతంత్రంగా ఖాతాలు నిర్వహించవచ్చు.
  • పొదుపు ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు తెరవడానికి అనుమతి.
  • ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, ఏటీఎం వాడకం సాధ్యం.
  • 10 ఏళ్లలోపు పిల్లలకు సంరక్షకుడి అనుమతి తప్పనిసరి.
  • మైనర్ల ఖాతాలకు ఓవర్ డ్రాఫ్ట్ లేదు.