Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. జూన్‌లో బ్యాంకులు ఎన్ని రోజులు మూసి ఉంటాయో తెలుసా?

www.mannamweb.com


ప్రతినెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. చాలా మంది ప్రతి రోజు వివిధ లావాదేవీ నిమిత్తం బ్యాంకులకు వెళ్తుంటారు. అయితే బ్యాంకు పనుల కోసం వెళ్లేవారు ప్రతి నెల రాగానే బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల సమయం ఆదాతో పాటు ఆర్థిక నష్టం కలుగకుండా చేసుకోవచ్చు.

ఇక మే నెల ముగియబోతోంది. జూన్‌ నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉండనున్నాయో ఆర్బీఐ జాబితాను విడుదల చేస్తుంటుంది. జూన్‌లో 10 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇందులో, ఆదివారం, రెండవ, నాల్గవ శనివారం కారణంగా 6 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి.

పండుగల కారణంగా మిగిలిన రోజుల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. జూన్ నెలలో 10 బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోండి. జూన్ 2న ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. 8 జూన్ రెండవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. 9 జూన్ ఆదివారం దేశ వ్యాప్తంగా బ్యాంకులు బంద్‌.

జూన్‌ 15న YMA డే లేదా రాజా సంక్రాంతి కారణంగా భువనేశ్వర్, ఐజ్వాల్ జోన్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి. జూన్‌16న ఆదివారం, జూన్‌ 17న బక్రీ ఈద్ కారణంగా, దేశవ్యాప్తంగా దాదాపు బ్యాంకులు మూసి ఉంటాయి.

జూన్‌ 18న బక్రీ ఈద్ కారణంగా జమ్ము మరియు శ్రీనగర్ జోన్‌లలో బ్యాంకులు బంద్‌. జూన్‌ 22న నాల్గవ శనివారం, జూన్‌ 23, 30న ఆదివారం కారణంగా సాధారణంగా బ్యాంకులు బంద్‌ ఉంటాయి.