Dhanush: తిరుపతి నడిరోడ్డుపై భిక్షాటన చేశా

తడు హీరో ఏంట్రా? అన్నవారితోనే.. హీరో అంటే ఇతడిలా ఉండాలి అనిపించుకున్నాడు ధనుష్‌ (Dhanush). నిజానికి ఈయన హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివి మంచి చెఫ్‌ అవ్వాలనుకున్నాడు.


కానీ ఫ్యామిలీది సినిమా బ్యాక్‌గ్రౌండ్‌. తండ్రి కస్తూరి రాజా.. దర్శకనిర్మాత, అన్న సెల్వరాఘవన్‌ కూడా డైరెక్టర్‌గా ప్రయత్నించాలనుకుంటున్నాడు. తమ్ముడు కూడా సినిమాల్లో ఉంటే బాగుంటుందన్నాడు. నటుడిగా ట్రై చేయమన్నాడు.

స్టార్‌డమ్‌
అలా తండ్రి డైరెక్షన్‌లో తొలి చిత్రం (తుళ్లువదో ఇలమై), అన్న డైరెక్షన్‌లో రెండో మూవీ (కాదల్‌ కొండైన్‌) చేశాడు. ఈ సినిమాల విజయంతో తనలోనూ కాన్ఫిడెంట్‌ పెరిగింది. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాడు. తక్కువ కాలంలోనే టాప్‌ స్టార్‌గా ఎదిగాడు. సినిమా కోసం ఎలాంటి ట్రాన్స్‌ఫార్మేషన్‌కైనా సిద్ధమవుతాడు. కోలీవుడ్‌లో సిక్స్‌ ప్యాక్‌ ట్రెండ్‌ మొదలు పెట్టిందే ఈ హీరో (పొల్లాధవన్‌ మూవీలో ధనుష్‌ ఆరు ఫలకల దేహంతో కనిపిస్తాడు)! అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఈ హీరో నటించిన లేటెస్ట్‌ మూవీ కుబేర. ఇందులో ధనుష్‌ యాచకుడిగా కనిపిస్తాడు.

తిరుపతిలో భిక్షాటన
సినిమా షూటింగ్‌లో భాగంగా తిరుమలలోనూ ధనుష్‌ భిక్షాటన చేశాడు. ఇటీవల కుబేర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ధనుష్‌ మాట్లాడుతూ.. శేఖర్‌ కమ్ములకు ఉన్న మంచి పేరు చూసి ఈ సినిమా అంగీకరించాను. కానీ, చివరకు నన్ను తిరుపతి నడిరోడ్డుపై అమ్మా, అయ్యా అంటూ భిక్షాటన చేసేలా చేశాడు అని సరదాగా చెప్పుకొచ్చాడు. కాగా తిరుపతిలోని అలిపిరి వద్ద జనవరి నెలాఖరులో ధనుష్‌ భిక్షాటన చేసిన సీన్లు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే ధనుష్‌ కష్టం ఊరికే పోలేదు. జూన్‌ 20న రిలీజైన కుబేర గ్రాండ్‌ సక్సెస్‌ అవడం ఖాయంగా కనిపిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.