Benefits of Barley Seeds: బార్లీ గింజలను నానబెట్టి తినడం వల్ల కలిగే లాభాలు.!

www.mannamweb.com


Benefits of Barley Seeds: బార్లీ గింజలు మనకు ఆహారంగా, ఔషధంగా కూడా ఉపయోగపడతాయి.
ఇవి గడ్డి జాతి గింజలు. వీటిలో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. బార్లీ గింజలను తడి లేని, గాలి తగలని డబ్బాలో నిల్వ చేసుకోవడం వల్ల పోషకాలను కోల్పోకుండా కొన్ని నెలల వరకు తాజాగా ఉంటాయి.బార్లీ గింజలు అరుగుదల శక్తిని పెంచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

Health Benefits of Barley Seeds.

వీటిలో ఉండే బి విటమిన్స్ నీటిలో కరిగే తత్వాన్ని కలిగి ఉంటాయి. కనుక వీటిని నీటిలో ఉడికించినప్పుడు నీటితో సహా తీసుకోవాలి.

ఒక కప్పు ఉడికించిన బార్లీ గింజల్లో 4.5 గ్రా.ల పీచు పదార్థాలు, 12.5 మిల్లీ గ్రాముల పోలేట్ ఉంటాయి. అంతేకాకుండా ఈ బార్లీ గింజల్లో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి.

గ్లూటెన్ పదార్థాల ఎలర్జీ ఉన్న వారు వీటిని తీసుకోకూడదు. బార్లీ గింజలను నాన బెట్టిన నీటిని రోజూ తాగడం వల్ల శరీరంలో ఎక్కువగా ఉన్న నీటి శాతం తగ్గుతుంది. ఒంట్లో నీరు చేరిన గర్భిణీ స్త్రీలు ఈ బార్లీ గింజలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అంతే కాక అనారోగ్య సమస్యల కారణంగా బలహీనంగా, నీరసంగా ఉన్న వారు ఈ బార్లీ నీటిని తాగడం వల్ల నీరసం తగ్గుతుంది. జ్వరం వచ్చిన వారికి ఆహారంలో భాగంగా బార్లీని ఇవ్వడం వల్ల జ్వరం నుండి త్వరగా కోలుకుంటారు.

బార్లీని పాలతో కలిపి తీసుకోవడం వల్ల బాలింతల్లో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.మన శరీరంలో ఉండే కాలేయంలో, రక్తంలో కొవ్వు చేరకుండా చేయడంలో ఈ బార్లీ గింజలు ఎంతగానో సహాయపడతాయి. రెండున్నర లీటర్ల నీటిలో ఒక కప్పు బార్లీ గింజలను వేసి సగం అయ్యే వరకు మరిగించి వడకట్టాలి.

Benefits of Barley seeds(water)

ఇలా వడకట్టిన నీటిని తాగడం వల్ల ప్రేగు కదలికలు పెరిగి జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. బార్లీ గింజల నుండి చేసిన గంజిలో మజ్జిగను, నిమ్మ రసాన్ని కలిపి తీసుకోవడం వల్ల మూత్ర సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

మూత్ర విసర్జన కష్టంగా ఉన్న వారు బార్లీ గింజల కషాయంలో బెల్లం, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అంతే కాకుండా మద్యపానం తయారీలో కూడా ఈ బార్లీ గింజలను ఉపయోగిస్తారు.

పిల్లలకు ఆహారంలో భాగంగా ఇచ్చే పాలలో, సూప్ లలో బార్లీ గింజలను ఉపయోగించడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది.

బార్లీ గింజల నుండి తీసిన నూనెను వాడడం వల్ల శరీరంలో కొలెస్త్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.వివిధ రకాల సూప్ ల తయారీలో కూడా బార్లీ గింజలను ఉపయోగిస్తారు.