LK Advani – PM Modi: ఎల్‌కే అద్వానీకి ‘భారత రత్న’: ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన

Bharat Ratna to LK అద్వానీ


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ (Bharat Ratna) ప్రదానం చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ విషయాన్ని తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా ఆయన ప్రకటన చేశారు. ” భారత రత్న గౌరవం అందుకోబోతున్న ఎల్‌కే అద్వానీతో నేను మాట్లాడి అభినందనలు తెలిపాను. మన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది. అద్వానీ జీవితంలో క్షేత్రస్థాయిలో పని చేయడం మొదలుపెట్టి ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేసే అత్యున్నత స్థాయికి ఎదిగారు. మన హోంమంత్రిగా, ఐఅండ్‌బీ(Ministry of Information and Broadcasting) మంత్రిగా కూడా సేవలు అందించారు. పార్లమెంట్‌లో ఆయన అడుగులు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమైనవి, గొప్ప దూరదృష్టితో నిండి ఉన్నాయి” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.