Bindi Allergy: ఇది ఆడవాళ్లకు మాత్రమే.. బొట్టు తీయకుండా నిద్రపోతున్నారా?

www.mannamweb.com


బొట్టుబిళ్ల పెట్టుకునే ప్రదేశంలో కొన్నిసార్లు దురద, దద్దుర్లు, వాపు, మచ్చలు ఏర్పడుతుంటాయి. బొట్టుపెట్టుకునే ప్రదేశంలో చర్మం పొడిబారడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి.
వీటిని అధిగమించేందుకు ఇలా చేయండి చాలు…


మాయిశ్చరైజర్‌ :
బొట్టుబిళ్ల తీయకుండా అదేపనిగా ఉంచడం వల్ల చర్మం పొడిబారి దురద వస్తుంటుంది. ఇలాంటప్పుడు రాత్రి పడుకునే ముందు బొట్టుబిళ్లను తీసి మాయిశ్చరైజర్‌ రాసి మర్దన చేయాలి. ఇది పొడిబారిన చర్మానికి తేమనందించి దురదను తగ్గిస్తుంది.

నూనె: రోజూ రెండు నిమిషాల పాటు కొబ్బరి లేదా నువ్వుల నూనె రాసి మర్దన చేయాలి. దీనివల్ల చర్మానికి తేమ అంది మచ్చపడకుండా ఉంటుంది.

జెల్‌ : అలోవెరా జెల్‌ను రాసి మర్ధన చేయడం వల్ల అక్కడ ఏర్పడే దద్దుర్లు, మొటిమలు పోతాయి. అలోవెరా జెల్‌లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్‌ గుణాలు చర్మాన్ని దురద, దద్దుర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.

గ్లూ తక్కువగా : బొట్టు బిళ్లలను ఎంపిక చేసేటప్పుడు గ్లూ, గమ్‌ తక్కువగా ఉండే వాటినే ఎంచుకోవాలి. రాత్రి పడుకునే ముందు బొట్టుబిళ్లను తీసేసి మాయిశ్చర్‌ రాసుకుని పడుకోవాలి. ఉదయం బొట్టు బిళ్ల పెట్టుకుంటే ఏ సమస్యా ఉండదు.