Bird Flu Call Center: ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు.. కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, చికెన్ తినోద్దని ప్రజలకు విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు కీలక సలహా ఇచ్చింది.
బర్డ్ ఫ్లూ వైరస్‌పై సందేహాలను నివృత్తి చేయడానికి కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలు మరియు కోళ్ల పెంపకందారుల సందేహాలను నివృత్తి చేయడానికి విజయవాడలో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ టి. దామోదర్ నాయుడు తెలిపారు.


సందేహాలు ఉన్నవారు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య 08662472543, 9491168699 నంబర్‌లను సంప్రదించాలి. కొన్ని రోజులు కోళ్లకు దూరంగా ఉండాలని కూడా ఆయన సూచించారు. బర్డ్ ఫ్లూ వైరస్ ప్రశ్నల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని కాల్ సెంటర్