Thursday, November 14, 2024

Walking Benefits: 8 ఆకారంలో వాకింగ్‌ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే షాకవుతారు!

నడక వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని అందరికీ తెలుసు. ప్రజలు తమ ఇష్టానుసారం ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చేస్తున్నారు. నడవడం వల్ల చర్మం మెరుపును పెంచడంతోపాటు సులభంగా బరువు తగ్గవచ్చు.

చాలా మంది బరువు తగ్గడానికి నడకను ఎంచుకుంటారు. నడక కూడా ఫిట్‌నెస్‌ను పెంచుతుంది. రోజూ ఇలా నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఇలాగే నడిస్తే రెట్టింపు ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదే 8 సంఖ్య ఆకారంలో నడిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. దీనిని ఇన్ఫినిటీ వాక్ అని కూడా అంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గడం:

ఈ సంఖ్య 8 ఆకారంలో ఉండటం వల్ల వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ ఆకృతిలో నడవడం వల్ల శరీర భాగాలు, కండరాలన్నీ కదులుతాయి. కొవ్వు సులభంగా కరిగిపోతుంది. అందుకే తక్కువ సమయంలో వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంది.

బీపీ నియంత్రణ:

అధిక రక్తపోటు ఉన్నవారు ఈ ఆకారంలో నడవడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని ఓ అధ్యయనం చెబుతోంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఆకృతిలో నడవడం వల్ల గుండెపై భారం తగ్గుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది. అందుకే బీపీ కూడా అదుపులో ఉంటుంది.

కండరాలు ఎక్కువగా కదులుతాయి:

నిండు కడుపుతో నడవడం కంటే ఈ ఫిగర్ 8 ఆకారంలో నడవడం వల్ల కండరాలు ఎక్కువగా పనిచేస్తాయి. వెనుకకు, ముందుకు వంగడం వల్ల పొట్ట దగ్గర కండరాలు, తొడల కండరాలు బలపడతాయి. ఎలాంటి దెబ్బలైనా తట్టుకోగలవు. ఫిట్‌నెస్‌ను పెంచుతుంది. కొవ్వు కరుగుతుంది.

శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది:

ఫిగర్ ఎనిమిది ఆకారంలో నడవడం ఒక వ్యక్తి ఆనందాన్ని పెంచుతుంది. అంతే కాకుండా టర్న్ తీసుకునేటప్పుడు బాడీ బ్యాలెన్స్ తప్పి కిందపడే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల శరీర సమన్వయం పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి.

Team India: టీమ్‌ఇండియాకు రూ.125 కోట్ల బహుమతి ప్రకటించిన బీసీసీఐ

Team India: టీమ్‌ఇండియాకు రూ.125 కోట్ల బహుమతి ప్రకటించిన బీసీసీఐ

టీ20 ప్రపంచ కప్‌ 2024ను సాధించిన భారత జట్టుకు బీసీసీఐ (BCCI) భారీ బహుమతిని ప్రకటించింది. రూ.125 కోట్ల నగదు బహుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్‌ (ట్విటర్‌)లో ప్రకటన చేశారు. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి రెండోసారి పొట్టికప్‌ను సొంతం చేసుకుంది. 2013 తర్వాత టీమ్‌ఇండియా ఐసీసీ ట్రోఫీ నెగ్గడం ఇదే తొలిసారి. దీంతో పొట్టి కప్‌ నెగ్గిన భారత జట్టుకు బీసీసీఐ భారీ మొత్తాన్ని ప్రకటించింది.

‘‘ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024ను గెలిచినందుకుగాను టీమ్ఇండియాకు రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. టోర్నమెంట్ ఆసాంతం జట్టు అసాధారణమైన ప్రతిభ, సంకల్పం, క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించింది. అద్భుతమైన విజయం సాధించిన ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి అభినందనలు’’ అని జై షా ఎక్స్‌లో పోస్టు పెట్టాడు.

మా ప్రభుత్వంలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి తప్పే- మాజీ మంత్రి బొత్స హాట్ కామెంట్స్

Botcha Satyanarayana : ఏపీలో ప్రస్తుత పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారాయన.

”టీడీపీ నాయకులు వైసీపీ పార్టీ ఆఫీసులకి వెళ్లి సందర్శిస్తున్నారు. ప్రైవేట్ ఆస్తిలోకి టీడీపీ నాయకులు రావడం తగదు. ప్రజలు ఎన్నుకున్న నేతలే వ్యవస్థల్లోకి వెళ్లి హంగామా చేయకూడదు. అలాంటి ఘటనలు జగరకుండా చూడాలని కోరుకుంటున్నా. పార్టీ ఆఫీసులు, యూనివర్శిటీల వీసీలపై జరుగుతున్న ఘటనలు దురదృష్టం. మా ప్రభుత్వంలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి తప్పే. ఇంటర్నల్ మీటింగ్స్ లో అలాంటి పనులు చేయొద్దని సూచించాం.

యూనివర్శిటీ వీసీలను ఎంపిక చేసేది గవర్నర్. ద్రవిడ యూనివర్శిటీలో తప్పులు జరిగితే వీసీపై నేనే చర్యలు తీసుకున్నా. నాపై వస్తున్న ఆరోపణలపై నేను స్పందించను. ఫైల్స్ అన్నీ విద్యాశాఖలోనే ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పుడైనా పరిశీలించుకోవచ్చు. కొందరు రిటైర్డ్ అధికారులు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు వారికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. డీఎస్సీ పోస్టులు 6 వేలు మాత్రమే ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం 16 వేల పోస్టులు ఎలా భర్తీ చేస్తుందో నాకు తెలియడం లేదు” అని బొత్స సత్యనారాయణ అన్నారు.

AP TET 2024: ఏపీలో టెట్‌ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?

AP TET 2024: ఏపీలో టెట్‌ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?

అమరావతి: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) కొత్త నోటిఫికేషన్‌ విడుదలకు రంగం సిద్ధమైంది. జులై 1న టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసి.. 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నోటిఫికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌, షెడ్యూల్‌, సిలబస్‌తో పాటు ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షపై అభ్యర్థులకు తగిన సూచనలు, విధివిధానాలను విద్యాశాఖ అధికారులు ఖరారు చేశారు. ఈ సమాచారాన్ని జులై 2 నుంచి https://cse.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అదనపు సమాచారం కోసం కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వరకు గత ప్రభుత్వం టెట్‌ నిర్వహించగా.. 2.35లక్షల మంది హాజరైతే, వారిలో 1,37,903 మంది (58.46శాతం) అర్హత సాధించారు. అయితే, కొత్త ప్రభుత్వం పాత డీఎస్సీని రద్దు చేసి, కొత్తగా 16,347 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో తాజాగా బీఈడీ, డీఎడ్‌ పాసైన అభ్యర్థులతో పాటు ఇటీవల టెట్‌లో ఫెయిలైన వారికి అవకాశం కల్పిస్తూ కొత్తగా టెట్‌ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉంది

రైతన్నలకు శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం

ఏపీలో డ్రాగన్ పంటకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లోని రైతులు వీటిని సాగు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. మార్కెట్ లో డ్రాగన్ పండు ధర రూ.100 నుంచి రూ.150 మధ్య పలుకుతోంది.

ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం డ్రాగన్ పంట సాగుచేసే రైతులకు రాయితీ ఇస్తోంది. దీన్ని సాగు చేయడానికి అవసరమయ్యే ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తోంది. జన్యుపరంగా ఇది మంచి పోషకాల మొక్క. రాయితీపై పంట సాగుచేసేందుకు అర ఎకరాపైన.. ఐదెకరాల లోపు ఉన్న రైతులు అర్హులు.

నీటి అవసరం ఉండదు

ప్రస్తుతం అర ఎకరా సాగుకు రాయితీ అందిస్తున్నారు. డ్రాగన్ పంట సాగుపై ఆసక్తి ఉన్న రైతులు జాబ్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో సమీపంలోని ఉపాధి కార్యాలయాల అధికారులను సంప్రదించాలి. దీన్ని మెట్ట భూముల్లో సాగు చేస్తారు. నీరు పెద్దగా అవసరపడదు. వారానికి ఒకరోజు మొక్కలకు నీరుపెట్టినా చాలు.

నీటి సౌకర్యం చాలా తక్కువగా ఉండి, పొలం ఎక్కువగా ఉన్న రైతులు ఈ మొక్కలను తీసుకొచ్చి ఏడు లేదంటే పది అడుగులకు ఒక మొక్క చొప్పున నాటాలి. ఎంత దూరంగా నాటితే అంత ఎక్కువగా దిగుబడి వస్తుంది. రింగ్ పద్ధతిద్వారా సాగు చేయడం రైతన్నలకు లాభసాటిగా ఉంటుంది. ఎంత పెద్ద వర్షం పడినా ఈ రింగ్ పద్ధతిలో ఎటువంటి నష్టం వాటిల్లదు. అన్నదాతలు కూడా ఈ పద్ధతిలో సాగుచేయడానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.

ఒక రేషన్ కార్డుకు ఒకరే అర్హులు

ఒక రేషన్ కార్డుకు ఒకరే అర్హులు. పంచాయితీ ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా పత్రాలు కార్యాలయంలో అందజేస్తే అర్హులను ఎంపిక చేస్తారు. సాగుకు అవసరమైన పోషకాలను అందిస్తుంటే ఏడాదిలోగా పంట కోతకు వస్తుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలతోపాటు స్థానికంగా ఉండే మార్టుల్లో అమ్మకాలు సాగించవచ్చు. డ్రాగన్ పంటను సాగుచేసిన రైతులు కొందరు సొంతంగా నాలుగు చక్రాల వాహనాల్లో వాటిని నగరాలకు తీసుకువచ్చి సొంతంగా అమ్మకాలు చేపడుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులతోపాటు ఉద్యాన శాఖ అధికారులు, ఉపాధి కార్యాలయ అధికారులను సంప్రదించి పూర్తి వివరాలను పొందొచ్చు.

Ravindra Jadeja: కోహ్లీ, రోహిత్ బాటలో జడ్డూ.. టీ20లకు గుడ్ బై!

Ravindra Jadeja Retires: విరాట్ కోహ్లీ, రోహిత్ బాటలనే మరో భారత క్రికెటర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వరల్డ్ కప్ విజయం సాధించిన ఒక రోజు తర్వాత తాను వీడ్కోలు పలుకున్నట్లు అధికారిక ప్రకటన చేశాడు.

ఎంతో గర్వంగా కెరీర్‌ను ముగిస్తున్నా..
‘టీ20 ప్రపంచకప్‌ గెలుపుతో తన కల నిజమైంది.. దేశం గెలుపు కోసం ఇతర ఫార్మాట్ లలో కృషి చేస్తా. గుండెనిండా కృతజ్ఞత భావంతో టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నా. ఎంతో గర్వంగా కెరీర్‌ను ముగిస్తున్నా. దేశానికి ఆడిన ప్రతిసారి నా అత్యుత్తమ ప్రతిభ కనబరిచాను. ఇక మిగతా ఫార్మాట్లలోనూ అదే తరహాలో ఆడుతా. ఇది నా టీ20 కెరీర్‌లో గొప్ప ఘట్టం. ఇన్ని రోజులు నాకు సపోర్టుగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు’ అంటూ ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ అయ్యాడు జడ్డూ.

శనివారం బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచి రెండో టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ విజయానందంలోనే గొప్ప ముగింపు కోరుకున్న విరాట్ (Virat Kohli), రోహిత్ (Rohit Sharma) టీ20లకు వీడ్కోలు పలికారు. అయితే వీరిద్దరూ ఈ నిర్ణయం తీసుకున్న 24 గంటల్లోనే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇకపై తాను వన్డే, టెస్ట్ సిరీస్ లలోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు.

AP DSC: వైకాపా ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటన రద్దు

AP DSC: వైకాపా ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటన రద్దు

అమరావతి: మెగా డీఎస్సీతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జులై 1న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో.. గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో 6,100 టీచర్‌ పోస్టులు మాత్రమే ఉన్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది.

ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించని వారు, ఈ టెట్‌ ప్రకటన తర్వాత బీఈడీ, డీఈడీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డీఎస్సీతోపాటు టెట్‌ కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెట్, మెగా డీఎస్సీకి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొదట టెట్‌ నిర్వహిస్తారు. ఆ తర్వాత డీఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు 30 రోజులు సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం డీఎస్సీ పరీక్ష ఉంటుంది. జులై 1న మెగా డీఎస్సీ, టెట్‌కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రమాద బీమా.. రూ.775 కడితే చాలు రూ.15 లక్షల బెనిఫిట్‌! IPPB కొత్త స్కీమ్‌

చాలా మంది తమ కుటుంబ భద్రత కోసం.. భవిష్యత్తులో తాము లేకపోయినా తమపై ఆధారపడి కుటుంబ సభ్యులు రోడ్డు పాలు కాకుండా ఉండాలని పలు రకాల పాలసీలు తీసుకుంటూ ఉంటారు.

అందులో ప్రమాద బీమా కూడా ఒకటి. చాలా రకాల కంపెనీలు పలు రకాల ప్రమాద బీమాలను అందిస్తున్నాయి. తాజాగా ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌(ఐపీపీబీ) సరికొత్త ప్రమాద బీమా పాలసీని తీసుకొచ్చింది. అందులో కేవలం రూ.775 కడితే చాలు రూ.15 లక్షల పరిహారం పొందవచ్చు. పైగా పిల్లల పెళ్లికి రూ.లక్ష అదనంగా అందిస్తారు. ఆ పాలసీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

తక్కువ ప్రీమియంతో పేద, మధ్య తరగతి వాళ్లు కూడా బీమా కవరేజ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌. హెల్త్ ప్లస్, ఎక్స్‌ప్రెస్ హెల్త్ ప్లస్‌ అని రెండు రకాల పాలసీలను అందుబాటులో ఉంచింది. ఇందులో హెల్త్‌ ప్లస్‌ మూడు రకాలుగా ఉంటుంది. వద్దనుకుంటే ప్రీమియం చెల్లించాల్సిన పని లేదు. మొదటిది రకంలో బీమా మొత్తం రూ.5 లక్షలు. పాలసీదారుడు దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత అంగ వైకల్యం సంభిస్తే నామినికి రూ.5 లక్షలు అందిస్తారు. దాంతో పాటు రూ.50 వేలు వరకు పిల్లల పెళ్లికి ఇస్తారు. ప్రమాదంలో ఎముకలు విరిగితే రూ.25 వేలు ఇస్తారు. దీని ప్రీమియం పన్నులతో కలిపి ఏడాదికి రూ.355 అవుతుంది.

రెండో రకంలో బీమా మొత్తం రూ.10 లక్షలు ఉంటుంది. ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగ వైకల్యం కలిగినా నామినికి రూ.10 లక్షలు చెల్లిస్తారు. ఎముకలు విరిగితే రూ.25 వేలు ఔట్ పేషంట్ డిపార్ట్‌మెంట్‌తో సంబంధం లేకుండా రూ.1 లక్ష వరకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ బెనిఫిట్స్‌ లభిస్తాయి. అంత్యక్రియల కోసం దాదాపు రూ.5 వేల వరకు క్లెయిమ్ చేయవచ్చు. పిల్లల చదువు కోసం మరో రూ.50 వేలు ఇస్తారు. దీని ప్రీమియం పన్నులతో కలిపి ఏడాదికి రూ.555 అవుతుంది.

ఇక మూడో రకంలో బీమా మొత్తం రూ.15 లక్షలు ఉంటుంది. దురదృష్టవశాత్తు ప్రమాదంలో చనిపోతే లేదా శాశ్వత అంగ వైకల్యం సంభవించినా కుటుంబానికి రూ.15 లక్షలు అందిస్తారు. పిల్లల పెళ్లికి రూ.లక్ష వరకు కవరేజీ లభిస్తుంది. విరిగిన ఎముకలకు రూ.25 వేలు ఇస్తారు. ప్రీమియం పన్నులతో కలిపి ఏడాదికి రూ.755 ఉంటుంది. అయితే.. ప్రీమియం చెల్లిన ఏడాది లోపు ఈ పాలసీ వర్తిస్తుంది. మరో ఏడాదికి కూడా కొనసాగించాలంటే మళ్లీ ప్రీమియం కట్టాలి. ఆటో రెన్యూవల్ కూడా పెట్టుకోవచ్చు. 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వాళ్లు ఈ పాలసీకి అర్హులు. ఇక ఎక్స్‌ప్రెస్ హెల్త్ ప్లాన్ కింద, మీరు టెలీ కన్సల్టేషన్‌లు, వార్షిక హెల్త్ చెకప్స్ లాంటి అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ప్రమాద బీమా తీసుకోనే ముందు నియమనిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలి.

Kailash Mountain Mystery: కైలాస పర్వత రహస్యం ఏంటి..! శివుడు నిజంగానే అక్కడ ఉన్నాడా..?

Kailash Mountain Mystery: కైలాస పర్వత రహస్యం ఏంటి..! శివుడు నిజంగానే అక్కడ ఉన్నాడా..?

Kailash Mountain Mystery: కైలాస పర్వతం స్వయంభువుగా అవతరించింది. దీనిని స్వర్గానికి వెళ్లే నిచ్చెన అని కూడా అంటారు. ఇది అత్యంత క్లిష్టమైన పర్వత శ్రేణి.

Kailash Mountain Mystery: కైలాస పర్వతం స్వయంభువుగా అవతరించింది. దీనిని స్వర్గానికి వెళ్లే నిచ్చెన అని కూడా అంటారు. ఇది అత్యంత క్లిష్టమైన పర్వత శ్రేణి. కైలాస పర్వతం టిబెట్‌ పీఠభూమి నుంచి 22,000 అడుగుల దూరంలో ఉంటుంది. దీనిని చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్నది. సముద్ర మట్టానికి దాదాపు 6,656 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇప్పటి వరకు టిబెట్‌లోని కైలాస పర్వతాన్ని ఎవరూ అధిరోహించలేదు. బౌద్ధ, హిందూ మత గ్రంథాల ప్రకారం.. కైలాస పర్వతం చుట్టూ పురాతన మఠాలు, గుహలు ఉన్నాయని చెబుతారు.

వీటిలో పవిత్ర రుషులు సూక్ష్మ రూపంలో నివసిస్తారట. కొద్దిమంది అదృష్టవంతులు మాత్రమే ఈ గుహలను చూడగలరు. హిందువులు కైలాస పర్వతాన్ని శివుని పవిత్ర నివాసంగా పరిగణిస్తారు. అతను తన భార్య పార్వతి, అతని ప్రియమైన వాహనం నందితో కలిసి శాశ్వతమైన ధ్యానంలో ఇక్కడ నివసిస్తున్నట్లు చెబుతారు. ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు పవిత్ర కైలాస పర్వత యాత్ర కోసం టిబెట్‌లోకి ప్రవేశిస్తారు. కానీ కొద్ది మంది మాత్రమే పవిత్ర శిఖరం ప్రదక్షిణను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. కొంతమంది శిఖరం అధిరోహించడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు.

కైలాస పర్వతంపై ట్రెక్కింగ్ చేయడాన్ని హిందువులు తప్పుగా భావిస్తారు. ఎందుకంటే పర్వతం పవిత్రకు, అక్కడ నివసించే దైవ శక్తికి భంగం కలుగుతుందని వారి నమ్మకం. కైలాస పర్వతం దగ్గర మానస సరోవర్, రాక్షస తాల్ అనే రెండు అందమైన సరస్సులు ఉన్నాయి. మానస సరోవరం 14,950 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మంచినీటి సరస్సుగా చెబుతారు.ఈ పర్వత యాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీ చేతి గోళ్లు, జుట్టు కొన్ని మిల్లీమీటర్లు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన పుణ్య క్షేత్రంగా ఈ ప్రాంతం పూజలను అందుకుంటోంది. కైలాస పర్వత శిఖరంపై కొలువైన డెమ్‌చొక్ ( బుద్ధుని ఉగ్రరూపం) ను బౌద్ధ మతస్థులు పూజిస్తుంటారు. దీనినే ధర్మపాలగా పిలుస్తుంటారు. తమను నిర్వాణానికి చేర్చే పుణ్యధామంగా బౌద్ధ మతస్థులు ఈ క్షేత్రాన్ని బలంగా విశ్వసిస్తుంటారు. తొలి తీర్థాంకరులు ఇక్కడే నిర్వాణం పొందారని జైన మతస్థుల నమ్మిక. గురునానక్ ఇక్కడే ధ్యానం చేశారని కొందరు చెప్తుంటారు.

శాస్త్రవేత్తలకే అంతుచిక్కని కైలాస పర్వతం రహస్యాలు ఇవే

శాస్త్రవేత్తలకే అంతుచిక్కని కైలాస పర్వతం రహస్యాలు ఇవే

కైలాస పర్వతం గురించి చాలా తక్కువ మందికి తెలుసు.. కైలాస పర్వతం శివుని నివాసంగా పరిగణించబడుతుంది. శివ పురాణం, స్కంద పురాణం మరియు మత్స్య పురాణాలలో కైలాస ఖండం అని పిలువబడే ప్రత్యేక అధ్యాయాలు శివుని ఈ అద్భుతమైన నివాసం గురించి ప్రస్తావించాయి.

శాస్త్రవేత్తలకే అంతుచిక్కని రహస్యాలు ఇక్కడ ఉన్నాయి. మానస సరోవరం అని పిలువబడే ఈ పర్వతం యొక్క 6 రహస్యాలు తెలుసుకుందాం.

కైలాస చుట్టూ పెద్ద పర్వతం లేదు

భూమికి ఒక చివర ఉత్తర ధృవం మరియు మరొక చివర దక్షిణ ధ్రువం ఉంటుంది. ఈ రెండింటి మధ్య హిమాలయాలు ఉన్నాయి. కైలాస పర్వతం హిమాలయాల మధ్యలో ఉంది. ఇది భూమికి కేంద్ర బిందువు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కైలాస పర్వతం హిందువులకే కాకుండా జైన, బౌద్ధ, సిక్కు మతాలకు కూడా ప్రత్యేక ప్రదేశం. కైలాస పర్వతం గురించి చెప్పాలంటే, కైలాస పర్వతం ఒక పెద్ద పిరమిడ్ పర్వతం. సాధారణంగా చెప్పాలంటే, కైలాస పర్వతం ఏకాంత పర్వతం, దాని చుట్టూ పెద్ద పర్వతాలు లేవు. శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో ఎందుకు కనుగొనలేకపోయారు.

స్వస్తికలను పోలి ఉండే రెండు రహస్య సరస్సులు

కైలాస పర్వతంపై స్వస్తికలా కనిపించే రెండు రహస్య సరస్సులు ఉన్నాయి. మొదటి సరస్సును మానస సరోవర్ అని పిలుస్తారు, ఇది ప్రపంచంలోనే ఎత్తైన మంచినీటి సరస్సు. ఈ సరస్సు ఆకారం సూర్యుడిని పోలి ఉంటుంది. రెండవ సరస్సు, చంద్రుని పోలి ఉంటుంది, ఉప్పు నీటి ఎత్తైన సరస్సు. ఈ ఉప్పునీటి సరస్సు పేరు రాక్షస సరోవరం. రెండూ సానుకూల మరియు ప్రతికూల శక్తితో సంబంధం కలిగి ఉంటాయి. శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఈ సరస్సుల రహస్యాన్ని ఛేదించలేకపోయారు. ఈ సరస్సులు సహజసిద్ధమైనవా లేక మానవ నిర్మితమా అనే విషయాన్ని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. మరీ ముఖ్యంగా, దక్షిణ దిశ నుండి చూసినప్పుడు, ఈ రెండు సరస్సుల సంగమం ద్వారా ఏర్పడిన స్వస్తిక ఆకారం కనిపిస్తుంది.

కైలాస పర్వతం చుట్టూ అతీంద్రియ శక్తి ఉంది

కైలాస పర్వతం చుట్టూ అతీంద్రియ శక్తి ఉందని, దాని కారణంగా ఎవరూ ఇక్కడికి చేరుకోలేరని ఒక నమ్మకం. ఇక్కడికి చేరుకోవడం ద్వారా కైలాస పర్వత రహస్యాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చాలాసార్లు ప్రయత్నించారు, కానీ ఎవరూ సులభంగా చేరుకోలేకపోయారు. కైలాస పర్వతంలో పుణ్యాత్ములు మాత్రమే జీవించగలరని టిబెట్‌లోని చాలా మంది ప్రవీణులైన సాధువులు చెప్పారు. కైలాస పర్వతం చుట్టూ అతీంద్రియ శక్తుల ప్రవాహం ఉంది, తద్వారా సిద్ధిని పొందిన తర్వాత మాత్రమే అక్కడ నివసించే ఆధ్యాత్మిక గురువును టెలిపతిగా సంప్రదించవచ్చు.

డమరు, ఓంకార ప్రతిధ్వని

కైలాస పర్వతం లేదా మానస సరోవరం సమీపంలో డమరు శబ్దం నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది. అలాగే ఓంకార శబ్దం కూడా ఇక్కడ ప్రతిధ్వనిస్తుంది. ఈ శబ్దాల గురించి శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ఖచ్చితంగా ఏమీ చెప్పలేకపోయారు. దూరం నుండి ఈ శబ్దాలు వింటున్నప్పుడు, ఇది విమానం ఎగురుతున్న శబ్దం అని మీరు అనుకోవచ్చు, కానీ మీరు కళ్ళు మూసుకుని ధ్యానంలో ఈ శబ్దాలను వింటుంటే, మీకు తామరలు మరియు ఓంకారాలు స్పష్టంగా వినబడతాయి. బహుశా ఈ శబ్దాలు మంచు కరుగుతున్నాయని శాస్త్రవేత్తలు ఊహించారు.

కైలాస పర్వతంపై 7 రకాల దీపాలు కనిపిస్తాయి

కైలాస పర్వతంపై కనిపించే 7 రకాల దీపాల గురించి చాలా మంది అనేక కథలు చెబుతారు. కైలాస పర్వతంపై రాత్రిపూట ఏడు రకాల రంగురంగుల లైట్లు కనిపిస్తాయని ప్రజలు చెబుతారు. ఈ దీపాల కాంతి చాలా ప్రకాశవంతంగా ఉంటుంది, దానిలో ప్రతి విషయం స్పష్టంగా కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు కూడా ఈ రహస్యాన్ని గుర్తించలేకపోయారు. ఇది అయస్కాంత శక్తుల వల్ల కావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

కైలాస పర్వతం చుట్టూ స్నోమెన్ తిరుగుతారు

మీరు స్నోమెన్ గురించిన కథలు విని ఉంటారు, కానీ ఇప్పటి వరకు నిజంగా స్నోమెన్ లేదా ఏతి ఉన్నారో ఎవరికీ తెలియదు. హిమాలయ ప్రాంతంలో నివసించే చాలా మంది ప్రజలు కైలాస పర్వతం చుట్టూ తిరుగుతున్న ఒక పెద్ద మంచు మనిషిని చూశారని పేర్కొన్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు స్నోమెన్ ఉన్నారని పేర్కొన్నప్పటికీ, స్నోమాన్ యొక్క రూపకల్పన, చరిత్ర మొదలైన వాటి గురించి శాస్త్రవేత్తలు ఏమీ ధృవీకరించలేదు. దీని అర్థం నిజమైన మంచు మనిషి ఇప్పటికీ ప్రజలకు మిస్టరీగా మిగిలిపోయింది.

చంద్రబాబును కలవాలంటే ముందుగా ఈ నెంబర్ కు కాల్ చేయండి..!!

చంద్రబాబును కలవాలంటే ముందుగా ఈ నెంబర్ కు కాల్ చేయండి..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు సామాన్య ప్రజలను కలుస్తున్నారు. సీఎంకు తమ సమస్యలు చెప్పుకొనేందకు పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. వారి నుంచి సమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా చంద్రబాబు ఆదేశాలు ఇస్తున్నారు.

అయితే..పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న వారి కారణంగా నిజంగా సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చే వారు ఇబ్బంది పడుతున్నారు. దీంతో, వారి కోసం ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను పార్టీ నేతలు ప్రకటించారు.

చంద్రబాబును కలిసేందుకు

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతీ శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు. అక్కడ పార్టీ శ్రేణులతో పాటుగా ఇతరులు నేరుగా ముఖ్యమంత్రికి తమ సమస్యలు చెప్పుకొనేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వందల మంది చంద్రబాబును చుట్టుముట్టి వినతులు, పుష్పగుచ్ఛాలు ఇవ్వాలని చూడటంతో ఆయన కూడా కొద్దిసేపు తొక్కిసలాటలో చిక్కుకుపోయారు. దీనితో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను పై అంతస్థుకు తీసుకువెళ్లారు. సెక్యూరిటీని తోసుకొని కొందరు సందర్శకులు అక్కడకు వెళ్లారు.

టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు

తోపులాటలో బాగా ఇబ్బంది పడ్డామని, ఈసారి ఆ పరిస్థితి రాకుండా చూడాలని కొందరు మహిళలు ఆయనతో చెప్పారు. ఆయన వారికి ఆమేరకు హామీ ఇచ్చారు. దీంతో, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు కీలక ప్రకటన చేసారు. ఇకపై ముఖ్యమంత్రి ని కలిసి తమ సమస్యలు విన్నవించుకొనేవారు ముందుగా 7306299999 అనే టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించాలని సూచించారు. వారి పిర్యాదులను పరిశీలించి, వారిని ప్రాధాన్యత క్రమంలో అనుమతిస్తామని వెల్లడించారు. ప్రతీ వారం 500 మంది వరకు కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

వినతులకు ప్రాధాన్యత

కొత్త ప్రభుత్వం కావటంతో నేరుగా చంద్రబాబును కలిసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు…సామాన్యులు తరలి వస్తున్నారు. అందులో అనేక మంది చంద్రాబుతో ఫొటోలు దిగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వీరి కారణంగా నిజంగా ముఖ్యమంత్రికి అర్జీలు ఇవ్వాలని వచ్చిన వారికి సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనిని గుర్తించిన పార్టీ యంత్రాంగం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు ద్వారా సమస్యలు చెప్పుకొనేందకు వచ్చే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధానం అమలు కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను పార్టీ ఏర్పాటు చేసింది.

Kalki 2898 Ad : కేవలం 7నిమిషాల 4సెకన్ల పాత్రకు కమల్ హాసన్ అన్ని కోట్లు అందుకున్నాడా..!!

‘కల్కి 2898 AD’ లో చాలా మంది స్టార్ యాక్టర్స్ ఉన్నారు. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ స్క్రీన్ పై అదరగొట్టేశారు.

ఫలితంగా కల్కి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ .. ఆ అంచనాలను అందుకుంది. ఈ పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. మహాభారత నేపధ్యంలో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది. ఈ లో నటించిన ప్రతిఒక్కరు.. తమ అద్భుతమైన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగేఈ కోసం నటీనటులు భారీ రెమ్యూనరేషన్ కూడా అందుకున్నారు. ముఖ్యంగా కమల్ హాసన్ ఈ లో కనిపించింది చాలా తక్కువే కానీ భారీ రెమ్యూనరేషన్ అందుకుంది.

ఈ లో ప్రభాస్ భైరవ అనే పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. అలాగే అమితాబ్ బచ్చన్ ఈ మూవీ అశ్వత్థామ పాత్రలో నటించారు. అలాగే కమల్ హాసన్ విలన్ గా కనిపించారు. ఆయన పాత్ర పేరు యాస్కిన్. లో తొలిసారి కనిపించినప్పుడు వృద్ధుడిలా కనిపిస్తాడు. చూసిన వారికి ముసలి విలన్ అని అనుకుంటున్నారు. అయితే చివర్లో ఆయన పాత్ర నిజస్వరూపం తెలిసిపోతుంది. దానికి కారణం ఉంది. అదేంటనేది తెలియాలంటే చూడాల్సిందే.

లో కమల్ హాసన్ పాత్ర కేవలం మూడు సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. ముగిసే సన్నివేశంలో కమల్ హాసన్ కనిపిస్తారు. రెండో భాగం కూడా ఉండటంతో చివరిలో ట్విస్ట్ ఉంటుంది. అయితే మొదటి భాగంలో అతని పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. దర్శకుడు కొన్ని సన్నివేశాల్లో పాత్రలోని బలాన్ని చూపించాడు. రెండో భాగంలో విలన్ పాత్ర ఆధారంగా కథ మొత్తం సాగుతుంది.

మొదటి పార్ట్ లో ఆయన పాత్ర చిన్నగా, నెగిటివ్ రోల్ గా ఉన్నప్పటికీ కమల్ ఒప్పుకోవడం గొప్ప విషయం.. ‘కల్కి 2898 ఏడీ’ లో నటించేందుకు కమల్‌హాసన్‌కు 20 కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చారనే వార్త ప్రచారంలో ఉంది. ‘కల్కి’ లో కమల్ హాసన్ కనిపించేది కేవలం 7నిమిషాల 4సెకన్లు మాత్రమే. ఇంత తక్కువ సమయంలోనే కమల్ హాసన్ కి 20 కోట్లు ఇచ్చారు నిర్మాత అశ్వినీదత్. ‘కల్కి 2898 AD’లో కమల్ హాసన్ కనిపించిన నిడివి తక్కువే అయినా, ఆయన పాత్ర షూటింగ్ చాలా రోజులైంది. నిర్మాత అశ్వినీదత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రెండో భాగం షూటింగ్ ఇప్పటికే 60శాతం పూర్తయింది. 40శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అది గ్రీన్ మ్యాట్ షూటింగ్ కావడంతో, నాగ్ అశ్విన్ కమల్ హాసన్ పాత్ర షూటింగ్‌ను కూడా దాదాపుగా పూర్తి చేసినట్లు సమాచారం. ఈ కారణంగా కమల్‌కు 20 కోట్లు పారితోషికం తీసుకున్నారట.

రూ.15 వేల పెన్షన్.. వారికి మాత్రమే: మంత్రి నిమ్మల

అమరావతి: విడతల వారీగా కాకుండా ఒకేసారి పెంచిన పెన్షన్ మొత్తం అందిస్తున్న ఘనత టీడీపీ ఛీఫ్ నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

గత ప్రభుత్వం విడతల్లో పెన్షన్లు పెంచడంతో దివ్యాంగులు, పేదలు నష్టపోయారని ఆరోపించారు. మంచం పట్టి లేవలేని స్థితిలో ఉన్న వారికి త్వరలోనే రూ.15వేల పెన్షన్ అందించే ఆలోచన ఉందని ఆయన ప్రకటించారు. రేపు ఉదయం 6 గంటల నుంచే పెన్షన్లు అందించడం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

Mobile Offers: జాతరే జాతర.. రూ.6,999కే మూడు కొత్త ఫోన్లు.. ఇవి జాతిరత్నాలు!

Mobile Offers: ఆన్‌లైన్ షాపింగ్ లవర్స్ ఈ కామర్స్ సంస్థలు ఎప్పుడు ఆఫర్లు ప్రకటిస్తాయని ఎదురుచూస్తుంటారు. తక్కువ ధరకే మంచి గ్యాడ్జెట్‌లు దొరికితే క్షణాల్లో బుక్ చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే న్యూస్ ఒకటి చెప్పింది. బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై బంపర్ క్యాష్ బ్యాక్‌లు ప్రకటించింది. మోటరోలా, రెడ్‌మీ, ఐటెల్ ఫోన్‌లపై బిగ్ డీల్స్ ప్రకటించింది. కొనుగోలుదారులు 6,999కే ఈ ఫోన్లను దక్కించుకోవచ్చు. అంతేకాకుండా ఎక్స్‌ఛేంజ్ భోనస్‌లు అందిస్తోంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే మీరు ఈ ఫోన్‌లలో 50 మెగాపిక్సెల్‌ల కెమెరాను పొందుతారు. ఈ స్మార్ట్‌ఫోన్లపై ఉన్న ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

Redmi A3
33 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.6,999. మీరు దీన్ని 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 6100 వరకు బెనిఫిట్ పొందవచ్చు. మీరు ఈ రెడ్‌మీ ఫోన్‌ను రూ. 247 ప్రారంభ EMI వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల గురించి చెప్పాలంటే ఈ ఫోన్ 6.71 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ప్రాసెసర్‌గా ఇది Helio G36 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఫోన్ మెయిన్ కెమెరా 8 మెగాపిక్సెల్స్.

itel S23
ఫ్లిప్‌కార్ట్ డీల్‌లో మీరు ఈ ఫోన్‌ను 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ. 6,999కి కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లో మీకు ఈ ఫోన్‌పై రూ. 1500 డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లకు కంపెనీ 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ EMI రూ. 247. ఫీచర్ల గురించి చెప్పాలంటే ఈ ఐటెల్ ఫోన్‌లో 6.6 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్.

Motorola G04
మీరు ఈ ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్ డీల్‌లో కేవలం రూ.6999కే కొనుగోలు చేయవచ్చు. మీరు ఫోన్ కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే మీకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ మోటరోలా ఫోన్‌ను 247 రూపాయల ప్రారంభ EMI వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో మీరు HD+ రిజల్యూషన్‌తో 6.6 అంగుళాల డిస్‌ప్లే చూస్తారు. అంతేకాకుండా ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 16-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం కంపెనీ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఈ ఫోన్ Unisoc T606 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.

పెన్షన్లపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన టీడీపీ

జులై నెల 1, 2 తేదీల్లో పెన్షన్ తీసుకోనివారు ఇకముందు అనర్హులవుతారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని TDP స్పష్టం చేసింది. 3 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా అన్నీ కలిపి ఒకేసారి ఇస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే చెప్పారని గుర్తుచేసింది.

అయినా వైసీపీ దీనిపై దుష్పచారం చేస్తోందని మండిపడింది. ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా రద్దు చేస్తాం అంటూ వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అంటూ Xలో పోస్ట్ చేసింది.

ఇక జులై నెల 1వ తేదీ నుంచి ఏపీలో పెరిగిన పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఫిక్సయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఈ పింఛన్ల పంపిణీలో పాలుపంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. తానే స్వయంగా పెన్షన్ దారుల ఇంటింటికీ వెళ్లి పంచాలని డిసైడ్ అయ్యారట. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై ఫోకస్ పెట్టిన సీఎం.. పెన్షన్స్ పంపిణీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.అయితే తాడేపల్లి మండలం పెనుమాకలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్ అందించబోతున్నారట సీఎం చంద్రబాబు. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసిన అధికారులు.. సీఎం రాక కోసం అన్ని ఏర్పాట్లు చేశారట. దేశ చరిత్రలో ఓ సీఎం స్వయంగా పెన్షన్ పంపిణీ చేయడం ఇదే తొలిసారి అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Hardik Pandya: ‘మాటలు పడి’లేచిన కెరటం… పాండ్య

Hardik Pandya: ‘మాటలు పడి’లేచిన కెరటం… పాండ్య

బంతికో పరుగు చేస్తే దక్షిణాఫ్రికా మ్యాచ్‌ గెలిచే పరిస్థితి.. ఆ సమయంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) చేతి నుంచి బాల్‌ అందుకున్నాడు. సిక్సర్లతో డీల్‌ చేస్తున్న క్లాసెన్‌ను చక్కటి స్లో బాల్‌తో బోల్తా కొట్టించాడు.

ఆఖరి ఓవర్‌లో కావాల్సింది 16 పరుగులు.. క్రీజులో మిల్లర్‌. మరోసారి వికెట్లకు దూరంగా బంతిని సంధించాడు అదే బౌలర్‌. బౌండరీ దాటి సిక్స్‌ వెళ్లిపోతుందేమో అనుకుంటుండగా.. సూర్య రిలే క్యాచ్‌కు మిల్లర్‌ ఔటయ్యాడు.

భారత్‌ ప్రపంచకప్‌ (T20 World Cup 2024) గెలవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అయితే ఈ రెండు వికెట్లు, ఆ రెండు ఓవర్లు విజయానికి అతి పెద్ద కారణాలు అని చెప్పొచ్చు. ఈ రెండు ఓవర్లు వేసింది హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) అని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మామూలుగా అయితే ఆ రెండు ఓవర్లు, విజయం ఏ బౌలర్‌కైనా స్పెషల్‌. అయితే హార్దిక్‌ పాండ్యకు ఇంకా ఇంకా స్పెషల్‌. ఎందుకంటే ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు పాండ్యను గేలి చేయని నోరు లేదు. జట్టులో ఎందుకు? అని ప్రశ్నించని వ్యక్తి లేడు. ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శనతో గ్రౌండ్‌లోనే నానా మాటలు అన్నారు. కొందరు మాజీలు అయితే తూలనాడారు.

ఇప్పుడు అదుర్స్‌ అంటున్నారు..
హార్దిక్‌ మైదానంలో అడుగుపెడితే గేలి చేయడం.. ముంబయి కెప్టెన్‌గా ఎందుకు వచ్చావంటూ ఎగతాళి చేయడం.. ఆల్‌రౌండర్‌గా విఫలమవడంతో విపరీతంగా విమర్శించడం.. ఈ ఏడాది ఐపీఎల్‌లో జరిగిందిదే. కానీ, ఇప్పుడు అతని బ్యాటింగ్‌ అద్భుతమంటూ.. అతని బౌలింగ్‌ అదుర్స్‌ అంటూ పొగిడేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌ పాత్రకు న్యాయం చేశాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ తేడాకు కారణం హార్దిక్‌ కష్టం. ఈ మార్పునకు కారణం అతడి దృఢ సంకల్పం. తన మీద తను పెట్టుకున్న నమ్మకం. హార్దిక్‌ స్థానంలో మరే ఆటగాడు ఉన్నా పీడకల లాంటి ఆ ఐపీఎల్‌ అనుభవం నుంచి ఇంత త్వరగా కోలుకుని, తిరిగి సత్తాచాటేవాడు కాదేమో! ప్రపంచకప్‌ జట్టులో ఎంపికైనా ఏ పేలవ ప్రదర్శనో చేసి అసలు తుది జట్టులో ఉండేవాడే కాదేమో.

పీడకల లాంటి ఐపీఎల్‌
ఈ సీజన్‌కు ముందు రోహిత్‌ స్థానంలో హార్దిక్‌కు ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీ అప్పజెప్పడంతో ఆ జట్టు, హిట్‌మ్యాన్‌ అభిమానులు తీవ్ర అసంతృప్తి ప్రదర్శించారు. ఆ అసహనాన్ని హార్దిక్‌పై చూపించారు. అతని సారథ్యంలో జట్టు కూడా పేలవ ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచింది. వ్యక్తిగతంగానూ హార్దిక్‌ విఫలమయ్యాడు. 13 ఇన్నింగ్స్‌లో 216 పరుగులు చేయడంతో పాటు కేవలం 11 వికెట్లే పడగొట్టాడు. దీంతో అతడికి ప్రపంచకప్‌లో చోటు దక్కడమూ సందేహంగా మారింది. కానీ అతని నైపుణ్యాలపై నమ్మకముంచిన అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఓ అవకాశం ఇచ్చింది.

జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు వేరే హార్దిక్‌ను చూస్తామని, అతడు పుంజుకుంటాడని ఈ టోర్నీ ఆరంభానికి ముందు మాజీలు అభిప్రాయపడ్డారు. ఆ మాటలను నిజం చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పూర్తి ఆత్మవిశ్వాంతో బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించాడు. ఈ మెగా టోర్నీలో నిలకడగా బౌలింగ్‌ చేసి 8 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. 151.57 స్ట్రయిక్‌ రేట్‌తో 144 పరుగులు చేశాడు. చేసిన పరుగులూ, తీసిన వికెట్లు జట్టు అతి కష్టం మీద ఉన్నప్పటివే అన్న విషయం గుర్తుంచుకోవాలి.

నవ్విన నాప చేనే పండుతుంది అని వినే ఉంటారు.. ఇప్పుడు అదే చేసి చూపించాడు హార్దిక్‌ పాండ్య. తనను గేలి చేసినవారికి గెలిచి చూపించాడు. ఏకంగా కుటుంబ విషయాలను చర్చలోకి లాగిన వారికి విజయంతో చెంప చెళ్లుమనిపించాడు. ఫైనల్‌ మ్యాచ్‌ విజయం తర్వాత పాండ్య కన్నీటిలో గెలిచిన ఆనందం కనిపిస్తుంది. అంతేకాదు ఇన్నాళ్లూ గుండెల్లో దాచుకున్న అవమాన భారాన్ని కూడా దించేసుకున్నాడు అనిపించకమానదు.

Team India: పైసా వసూల్‌.. మ్యాచ్‌ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!

Team India: పైసా వసూల్‌.. మ్యాచ్‌ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఓ హైవోల్టేజీ మ్యాచ్‌ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో భారత్‌ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్‌ను దేశం కోసం గెలిచి చూపింది.

ఫ్యాన్స్‌ ఉసూరుమంటూ టీవీలు ఆఫ్‌ చేయడానికి సిద్ధమైన ప్రతిసారి.. వారిని ఆగండి అంటూ వారించేలా టీమ్‌ ఇండియా మ్యాచ్‌లో కోలుకుంది. మేం దేశం కోసం చివరి వరకు పోరాడతాం.. మమ్మల్ని నమ్మండి అంటూ ఓటమిపై తిరగబడింది. పొట్టి ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో అత్యంత థ్రిల్లింగ్‌ మ్యాచ్‌ల్లో ఇదీ ఒకటి. ఇందులో హీరో ఎవరూ అంటే.. ఒక్కరు కాదు.. లెవన్‌స్టార్స్‌ అని చెప్పే సమష్టి విజయం ఇది. ఈ తరం వాళ్లు మేం 2024 టీ20 ఫైనల్స్‌ లైవ్‌లో చూశాం అని గొప్పగా చెప్పుకొనే స్థాయి ఈ గెలుపుది. ఈ మ్యాచ్‌ను మన పక్షాన నిలబెట్టిన అంశాలు ఇవే..

సంక్షోభంలో కోహ్లీ అవగాహన అద్భుతం..
టీ20 ఫార్మాట్లోనే నరాలు తెగే టెన్షన్‌ ఉంటుంది. కళ్లుమూసి తెరిచేలోపు ఇన్నింగ్స్‌ అయిపోతుంది. నిర్ణయాలు శరవేగంగా తీసుకోవాలి. ఒక చిన్న తప్పుడు వ్యూహం కూడా మ్యాచ్‌ను దూరం చేస్తుంది. రోహిత్‌-కోహ్లీ జోడీ ఫోర్లతో జోరుగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. కానీ, రోహిత్‌, పంత్‌, సూర్య వికెట్లు వెంటవెంటనే కోల్పోవడంతో జట్టు 34/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. భారీ స్కోర్‌ ఆశలు ఆవిరైపోయాయి. స్కోర్‌ 100 దాటక ముందు జట్టు పెవిలియన్‌కు క్యూకట్టకుండా అడ్డుకోవాలి.

ఈ దశలో కోహ్లీ ‘ప్రజెన్స్‌ ఆఫ్‌ మైండ్‌’ ఇక్కడ అద్భుతంగా పనిచేసింది. అనవసరమైన దూకుడును తగ్గించాడు.. మరో వికెట్‌ పడకుండా అక్షర్‌తో కలిసి సింగిల్స్‌, డబుల్స్‌తో స్కోర్‌ బోర్డ్‌ను ఎక్కడా 7 రన్‌రేట్‌ తగ్గకుండా ముందుకు నడిపించాడు. అప్పుడప్పుడు అక్షర్‌ దాడి చేసినా.. తాను బ్యాలెన్స్ కోల్పోలేదు. స్కోర్‌ బోర్డు 100 దాటాక మెల్లగా వేగం పెంచాడు. ఈ క్రమంలో అక్షర్‌ పెవిలియన్‌కు చేరినా.. దూబెతో కలిసి చకచకా పరుగులు చేశాడు. చివరికి వచ్చేసరి రన్‌రేట్‌ 8 దాటించాడు. బార్బడోస్‌ వంటి పిచ్‌లపై ఇది విజయాన్ని ఇవ్వగలదు. ఇక వ్యక్తిగత స్కోర్‌ 50 దాటాక తన స్ట్రైక్‌రేట్‌ను కూడా పెంచుతూ షాట్లు కొట్టడంతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. ఈ జట్టా 34/3గా నిలిచింది? అనిపించింది. ఈ వికెట్‌ పై సగటు 159.. కానీ, భారత్‌ 176 చేసింది. కోహ్లీ అనుభవంతో మ్యాచ్‌పై భారత్‌ పట్టు కొనసాగింది.

రోహిత్‌ లెక్క తప్పలేదు..
దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌లో కట్టడి చేసే బాధ్యత బుమ్రా అండ్‌ కో భుజస్కందాలపై పడింది. అర్ష్‌దీప్‌, బుమ్రా అద్భుతమైన ఆరంభం ఇస్తూ.. హెండ్రిక్స్‌, మార్‌క్రమ్‌ను స్వల్పస్కోర్లకే పెవిలియన్‌కు చేర్చారు. కానీ, టీమ్‌ఇండియా ఆనందం కొద్దిసేపట్లోనే ఆవిరైపోయింది. స్టబ్స్‌, డికాక్‌, క్లాసెన్‌ నిలకడగా షాట్లు కొట్టి అవసరమైన రన్‌రేట్‌ను తగ్గించారు. చివర్లో క్లాసెన్‌కు తోడు కిల్లర్‌ మిల్లర్‌ నిలవడంతో 15వ ఓవర్‌లో అక్షర్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 24 పరుగులు పిండారు. దీంతో అవసరమైన రన్‌రేట్‌ 6కు చేరింది. ఆరు వికెట్లు చేతిలో ఉండటంతో సఫారీల విజయం నల్లేరుపై బండి నడకే అనుకొన్నారు.

అదే సమయంలో పంత్‌ కాలికి పట్టీ వేయించుకోవడానికి మ్యాచ్‌ కొద్దిసేపు ఆగింది. అప్పటికే స్పిన్నర్లు తొమ్మిది ఓవర్లు వేసి 106 పరుగులు ఇచ్చారు. ఆ స్థితిలో రన్‌రేట్‌ను తక్షణమే అడ్డుకొంటే మ్యాచ్‌ తమ చేతిలో మిగిలి ఉంటుందని హిట్‌మ్యాన్‌కు అర్థమైంది. బుమ్రా, అర్ష్‌దీప్‌, హార్దిక్‌, జడ్డూకే ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంతి బుమ్రా చేతికి వెళ్లింది. ఫలితంగా 16వ ఓవర్‌లో సఫారీలకు కేవలం నాలుగు పరుగులే వచ్చాయి. ఆ తర్వాత 17వ ఓవర్‌ బాధ్యతను వైస్‌ కెప్టెన్‌ పాండ్యా అందుకొని.. ప్రమాదకరంగా మారిన క్లాసెన్‌ను తొలి బంతికే ఔట్‌ చేశాడు. పైగా మొత్తంగా 4 పరుగులే ఇచ్చాడు. దీంతో ఒత్తిడి సఫారీల జట్టువైపునకు షిఫ్ట్‌ అయింది.

సరైన సమయంలో బుమ్రాస్త్రం..!
ఇక తురుపు ముక్క బుమ్రాకు ఒక్క ఓవరే మిగిలి ఉంది. అతడితో 20వ ఓవర్‌ వేయించేందుకు దాచొచ్చు. కానీ, రోహిత్‌ ఆలోచన వేరేగా ఉంది. మిల్లర్‌ క్రీజులో ఉండగా.. కుర్రాడైన అర్ష్‌దీప్‌ ఇప్పుడు పరుగులు కట్టడి చేయకపోతే మ్యాచ్‌ 20వ ఓవర్‌ వరకు పోయే పరిస్థితి రాదు. అప్పుడు బుమ్రా ఓవర్‌ను ఆపి ఉపయోగం ఉండదు. అందుకే.. బంతిని తిరిగి జస్సీ చేతికే ఇచ్చాడు. అతడు కూడా డాట్‌ బాల్స్‌తో తన చివరి ఓవర్‌ ప్రారంభించాడు. యాన్సెన్‌పై ఒత్తిడి పెంచి.. ఓ అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో అతడి బెయిల్స్‌ ఎగరగొట్టాడు. ఆ ఓవర్‌లో సఫారీలకు వచ్చింది రెండు పరుగులే. వారు ఇంకా 12 బంతుల్లో 20 రన్స్‌ చేయాలి. ఈ సమయంలో అర్ష్‌దీప్‌ చేతికి బంతిని అందించాడు. కేవలం పరుగులు కట్టడి చేయడమే అతడి బాధ్యత. కొత్తగా క్రీజులోకి వచ్చిన మహారాజ్‌ను లక్ష్యంగా చేసుకొని సర్దార్‌ డాట్‌బాల్స్‌ వేశాడు. మిల్లర్‌ షాట్లు కొట్టేందకు వీలు లేకుండా లోపలికి వచ్చే బంతులు విసిరాడు. ఫలితంగా 19వ ఓవర్‌లో దక్షిణాఫ్రికా 4 పరుగులతో సరిపెట్టుకొంది.

టెన్షన్‌ ఓవర్‌.. సూపర్‌ క్యాచ్‌
6 బంతుల్లో 16 పరుగులు చేయాలి. మిల్లర్‌ క్రీజులో ఉన్నాడు. హార్దిక్‌ తొలి బంతే ఊరిస్తూ లోవైడ్‌ ఫుల్‌టాస్‌ వేశాడు. ఈ ఉచ్చులోపడ్డ మిల్లర్‌ భారీషాట్‌కు యత్నించాడు. బౌండరీకి మిల్లీమీటర్ల దూరంలో క్యాచ్‌ అందుకొన్న సూర్య బ్యాలెన్స్‌ చేసుకోలేకపోయాడు.. దీంతో తిరిగి బంతిని గాల్లోకి ఎగరేసి బౌండరీ దాటేశాడు. బాల్‌ నేలను తాకేలోపే తిరిగి మైదానంలోకి దూకుతూ ఒడిసి పట్టేశాడు. ఈ రిలే క్యాచ్‌తో మ్యాచ్‌ ఒక్కసారిగా భారత్‌ పక్షానికి మళ్లింది. ఆ బాల్‌కు తర్వాత ఒక ఫోర్‌ ఇచ్చినా.. ఐదో బంతిని ఆఫ్‌స్టంప్‌ బయటకు విసిరాడు. భారీ షాట్‌కు యత్నించిన రబాడ సూర్యకు క్యాచ్‌ ఇవ్వడంతో భారత్‌ విజయం ఖాయమైంది. మ్యాచ్‌లో ఎక్కడా భారత్‌ ఒత్తిడిని బయటకు కనిపించనీయలేదు. చివరి వరకు పోరాడుదామానే తెగింపును ప్రదర్శించింది.

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వాహనాలపై చట్ట పరమైన చర్యలకు రంగం సిద్ధం చేస్తుంది. ప్రతి వాహనాలపై ప్రభుత్వ వాహనం, పోలీస్ అంటూ రాస్తున్నారని, దీనిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

వాహనాలను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

వాహనాలకు…ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వాహనం స్టిక్కర్ తొలగించేందుకు అధికారులకు కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన AP 18 పోలీస్ వాహనాల మినహా పోలీస్ అని రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వచ్చే నెల ఐదో తేదీ లోపు ప్రభుత్వ వాహనం, పోలీసులు, స్టిక్కర్స్ ను తొలగించాలని సూచించారు.

Punganur Politics: పుంగనూరులో హై టెన్షన్.. తిరుపతిలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి హౌజ్ అరెస్ట్..

పుంగనూరు నివురు గప్పిన నిప్పులా మారింది. టీడీపీ-వైసీపీ మధ్య పొలిటికల్ వార్ పీక్స్‌కి చేరింది. రాజకీయ కక్షతో వైసీపీ నేతలపై టీడీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు ఎంపీ మిథున్‌రెడ్డి. భౌతిక దాడులే కాదు ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో ఉండే పరిస్థితి ఇప్పుడు పుంగనూరులో వచ్చిందన్నారు. ఓ ఎంపీగా నియోజకవర్గంలో తిరిగే రైట్ లేదా అని ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగితే వారిని పరామర్శించకుండా హౌజ్ అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానంటూ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. దేనికైనా రెడీ అని.. తనను అరెస్ట్ చేసినా.. ఆఖరికి చంపినా డోంట్ కేర్ అన్నారు. తాను చనిపోయినా ప్రజాసేవ చేసేందుకు తన ఇంటి నుంచి ఎవరో ఒకరు వస్తారని చెప్పారు. చంద్రబాబు ట్రాపులో చల్లా బాబు పడొద్దని..అది ఆయనకే నష్టమన్నారు. ఒక ఎంపీగా నా నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను కలిసే హక్కు తనకు ఉందని.. కానీ కలవకుండా తనను హౌస్ అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

మరోవైపు.. వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ-జనసేన కార్యకర్తలు పుంగనూరులో నిరసనకు దిగారు. మాజీమంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలు పుంగనూరులో అడుగు పెట్టొద్దని రోడ్డుపై బైఠాయించారు. అంబేద్కర్ సర్కిల్‌లో ధర్నాకు దిగారు.పెద్దిరెడ్డి గోబ్యాక్.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినదించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో పుంగనూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Financial Rules Changes: జూలై 1 నుంచి ఈ మార్పులు తెలుసుకోకపోతే మీ జేబుపై మరింత భారం పడటం ఖాయం

రేపటి నుంచి జూలై నెల ప్రారంభం కాబోతుంది జూలై నెల ఒకటో తేదీ నుంచి పలు మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జూలై నెలలో సిలిండర్ ధర మార్పు జరుగుతుంది.

అలాగే క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు నియమాలు మారుతున్నాయి. దీంతో పాటు ఈ నెలలోనే ఇన్ కమ్ టాక్స్ కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇలా జూలై ఒకటో తేదీ నుంచి మీ నిత్య జీవితంలో అలాగే ఆర్థిక వ్యవహారాల్లో వచ్చే మార్పులను ముందుగానే మనం తెలుసుకుందాం. తద్వారా ఇప్పటినుంచి మీరు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది.

సిలిండర్ ధర: LPG సిలిండర్ల కొత్త ధరలు ప్రతి నెల మొదటి రోజున ప్రకటిస్తారు. అందువల్ల జూలై నుండి ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనే విషయం తేలుతుంది.

క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు నియమాలు: కొత్త క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు నిబంధనలు జూలై 1 నుండి అమలులోకి వస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం, అన్ని బ్యాంకులు భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ ద్వారా క్రెడిట్ కార్డ్ చెల్లింపులను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది.

మొబైల్ నంబర్ పోర్టబిలిటీలో పలు మార్పులు: జూలై 1 నుంచి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ నిబంధనలు మారనున్నాయి. SIM కార్డ్ దొంగిలించబడినా లేదా పాడైపోయినా, లాకింగ్ వ్యవధి 7 రోజుల వరకూ ఉంటుంది. కాబట్టి 7 రోజుల తర్వాత మీరు కొత్త సిమ్ పొందే అవకాశం లభిస్తుంది.

మొబైల్ రీఛార్జీలు మరింత భారం: Jio, Airtel Vi రీఛార్జ్ ప్లాన్‌లను మరింత ఖరీదైనవిగా మార్చాయి. వచ్చే నెల నుంచి మొబైల్ రీఛార్జ్‌లు ఖరీదైనవి.

PNB ఖాతాదారులకు అలర్ట్
ఏప్రిల్ 30, 2024 నాటికి 3 సంవత్సరాలుగా వినియోగంలో లేని ఖాతాలను మూసివేస్తామని PNB తెలిపింది. దీని గడువు 30 జూన్ 2024గా నిర్ణయించారు.

Paytm వాలెట్ వాడేవారికి అలర్ట్ :
జీరో బ్యాలెన్స్‌తో ఇన్‌యాక్టివ్‌గా ఉన్న వాలెట్‌లు గత సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు లావాదేవీలు జరగకుండా ఉంటే, అలాంటి వాలెట్ లు జులై 20, 2024న మూసివేస్తామని Paytm పేమెంట్స్ బ్యాంక్ ప్రకటించింది. ఇప్పటికే పేటీఎం అలాంటి యూజర్లందరికీ సందేశం పంపింది.

SBI కార్డ్ క్రెడిట్ కార్డ్ నియమాలు
జూలై 1, 2024 నుండి కొన్ని క్రెడిట్ కార్డ్‌లకు ప్రభుత్వ లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు నిలిపివేస్తామని SBI కార్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్డ్‌లలో ఎయిర్ ఇండియా SBI ప్లాటినం కార్డ్, ఎయిర్ ఇండియా SBI సిగ్నేచర్ కార్డ్, సెంట్రల్ SBI సెలెక్ట్+ కార్డ్, చెన్నై మెట్రో SBI కార్డ్, క్లబ్ విస్తారా SBI కార్డ్, క్లబ్ విస్తారా SBI కార్డ్ ప్రైమ్ ఢిల్లీ మెట్రో SBI కార్డ్ ఉన్నాయి.

ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు
ICICI బ్యాంక్ జూలై 1, 2024 నుండి అనేక క్రెడిట్ కార్డ్ సేవలపై మార్పులను ప్రకటించింది. వీటిలో ఒకటి అన్ని కార్డులపై (ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్ క్రెడిట్ కార్డ్ మినహా) కార్డు రీప్లేస్‌మెంట్ రుసుము రూ.100 నుండి రూ.200కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ITR గడువు
2023-24 ఆర్థిక సంవత్సరానికి (AY 2024-25) ITR ఫైల్ చేయడానికి గడువు 31 జూలై 2024. కానీ మీరు గడువులోగా సమర్పించడంలో విఫలమైతే, మీరు డిసెంబర్ 31, 2024 వరకు ఆలస్యంగా రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు.

అస్సలు వదలేడం లేదుగా.. వరల్డ్ కప్‌ ఫైనల్‌లో సౌతాఫ్రికా ఓడినా జగన్‌పైనే ట్రోలింగ్.. మరి దారుణంగా..

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఓటమితో ఆ పార్టీ అధినేత జగన్‌ తీవ్ర నిరాశ చెందిన సంగతి తెలిసిందే. వై నాట్ 175 అంటూ విజయంపై నమ్మకంతో ఎన్నికల బరిలో నిలిచిన జగన్‌కు..

ఎన్నికల ఫలితాలు మాత్రం ఊహించని షాక్‌ ఇచ్చాయి. 2019లో రికార్డు స్థాయిలో 151 స్థానాలు కైవసం చేసుకున్న వైసీపీ.. ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. మరోవైపు కూటమి మాత్రం 164 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. కూటమిలో భాగమైన జనసేన 21 సీట్లలో పోటీ చేసి అన్ని సీట్లలో విజయం సాధించి.. 100 శాతం స్ట్రైక్ రేటును సాధించింది. అప్పటి నుంచి వైఎస్‌ జగన్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ సాగుతుంది.

జనసేనకు వచ్చిన సీట్లకు కూడా వైసీపీకి రాలేదని, ఆడుదాం ఆంధ్ర అని జగన్ క్రికెట్ టీమ్ తయారుచేసుకున్నాడని.. ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే టీవీ షోలలో సైతం వైసీపీని, లక్ష్యంగా చేసుకుని పంచు డైలాగ్‌లు పేలుతున్నాయి. అది కూడా ఇటీవలి ఎన్నికల్లో వైసీపీకి సపోర్టు చేసిన కమెడియన్ రియాజ్ ముందే కావడం.. అతడు కూడా ఆ కామెంట్స్‌ను ఫన్నీ వేలోనే ట్రీట్ చేస్తున్నారు.

శ్రీదేవి డ్రామా కంపెనీలో.. రియాజ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందని చెప్పగానే, ఆది.. ఎన్ని 11 మార్కులు మార్కులు వచ్చాయా? అని తనదైన శైలిలో పంచ్‌లు వేశారు. సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా చేస్తున్న ఫ్యామిలీ స్టార్ షోలో కూడా ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది.. రియాజ్ మెన్న ఎగ్జామ్‌లో ఎన్ని మార్కులు వచ్చాయని అడిగితే.. దానికి 175కి 10 వచ్చాయని యాదమ రాజు చెప్పారు. అదే ప్రోగ్రామ్‌లో.. సుధీర్ సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటామని ఎప్పుడైనా అనిపించిందా? అని రియాజ్‌ను అడుగగా.. 4వ తేదీ (ఎన్నికల ఫలితాల తేదీ) తర్వాత అనుకున్నానని అతడు చెబుతాడు. అలాగే.. తాను ఎవరికి సపోర్టు చేయాలని రియాజ్ అడగగా.. వాడు ఎవరికి సపోర్టు చేసిన అది ఓడిపోతుందని యాదమ రాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక, జబర్దస్త్‌లో ఓ స్కిట్‌లో ఉండనీలెమ్మా.. ఉండనీలెమ్మా అని జగన్‌ను ఇమిటేట్ చేసేలా రియాజ్ చేయడం కూడా జరిగింది.

ఇదిలాఉంటే, తాజాగా టీ20 క్రికెట్ వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాపై టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ ఫర్ ఏ రిజన్ ( Jagan For a Reason) అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని.. ఏపీలో జగన్ కూడా మూడు రాజధానులు ప్లాన్ చేశారని, సౌతాఫ్రికా పేరు ఇంగ్లీష్‌లో మొత్తం 11 లెటర్లు ఉంటాయని, వైసీపీకి కూడా 11 సీట్లు వచ్చాయని.. ”జగన్ ఫర్ ఏ రిజన్” అని కామెంట్స్ చేస్తున్నారు.

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

ఈతకు వెళ్లిన సమయంలో ప్రమాదం

కల్లూరు రూరల్‌: ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి శ్రీనాథరాజు కిరణ్‌ (20) శనివారం అమెరికాలో మృతి చెందాడు. కల్లూరు మండలంలోని చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్‌ అమెరికాలో మిస్సోరీ స్టేట్‌లో ఉన్న శ్యాండిల్‌ ఎస్‌ టౌన్‌లో ఉంటూ ఎంఎస్‌ చదువుతున్నాడు.

గతేడాది నవంబర్‌లో అమెరికా వెళ్లిన కిరణ్‌ తాను నివసిస్తున్న ప్రదేశానికి సమీపంలో ఈత కొట్టేందుకు ముగ్గురు మిత్రులతో కలిసి వెళ్లాడు.

అయితే, ఈతకొలను ఎనిమిది అడుగుల మేర ఉండగా అందరూ దిగడంతో కిరణ్‌కు ఈత రాక నీళ్లలో మునిగిపోయాడు. మిగిలిన మిత్రులకు కూడా ఈత రాకపోవడంతో నీట మునుగుతున్న కిరణ్‌ను చూస్తూ నిస్సహాయులుగా మిగిలిపోయారని తెలుస్తోంది. కాగా, కిరణ్‌ తండ్రి లక్ష్మణ్‌రాజు గతంలోనే చనిపోగా తల్లి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది. వీరి బాధ్యతలను కిరణ్‌ తాత కృష్ణమూర్తిరాజు చూస్తున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కిరణ్‌ చనిపోయినట్లు సమాచారం అందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

ఈ వరల్డ్ కప్ విజయం వెనుక.. శాపం తీసుకున్న ఓ అశ్వత్థామ ఉన్నాడని తెలుసా? అతను ఎవరంటే?

వంద కోట్ల మందికి పైగా భారత క్రికెట్‌ అభిమానుల కలను నిజం చేస్తూ.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ ఓటమి బాధకు కసి తీర్చుకుంటూ.. టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను సాధించింది.

శనివారం బార్బోడోస్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో నమ్మశక్యం కాని రితీలో గెలిచి.. విశ్వవిజేతగా అవతరించింది. 2007లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ను టీమిండియా ధోని కెప్టెన్సీలో నెగ్గింది. మళ్లీ ఇన్నేళ్లు అంటే దాదాపు 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమిండియా పొట్టి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మపై, ఫైనల్‌లో అదరగొట్టిన విరాట్‌ కోహ్లీ, అలాగే బుమ్రా, హార్ధిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, అర్షదీప్‌ సింగ్‌లపై అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ, అసలు ఈ విజయం వెనుక.. ఎన్నో తిట్లు, శాపాలను భరించి.. భారత జట్టుకు మేలు చేసిన ఓ అశ్వత్థామ ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. మరి ఆ అశ్వత్థామ ఎవరు? ఇప్పుడు టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ గెలవడం కోసం అతను ఎన్ని తిట్లు తిన్నాడు, ఎన్ని అవమానాలు భరించాడో తెలుసుకుందాం..

సౌరవ్‌ గంగూలీ.. చాలా మందికి టీమిండియా మాజీ కెప్టెన్‌గా, బీసీసీఐ మాజీ అధ్యక్షుడిగానే తెలుసు. కానీ, ఆటగాడిగా సచిన్‌కు పోటీ ఇచ్చి, ఒకానొక సమయంలో సచిన్‌ను డామినేట్‌ చేశాడు.. కెప్టెన్‌గా టీమిండియా తలరాతనే మార్చేశాడు. బీసీసీఐ అధ్యక్షుడి డొమెస్టిక్‌ క్రికెట్‌ను గతి మార్చాడు.. దాంతో పాటే టీమిండియా భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇలా అనుక్షణం.. ఏ హోదాలో ఉన్నా.. టీమిండియా ఎదుగుదల, భవిష్యత్తు కోసమే పరితపించి పోయాడు. అలా బీసీసీఐ అధ్యక్షుడిగా అతను తీసుకున్న కీలక నిర్ణయమే నేడు టీమిండియాకు టీ20 వరల్డ్‌ కప్‌ అందించింది. ఆ నిర్ణయం ఏంటంటే.. టీ20 కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ తప్పుకున్న తర్వాత రోహిత్‌ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించడం. రోహిత్‌లోని గొప్ప నాయకత్వ లక్షణాలను గుర్తించిన దాదా.. రోహిత్‌ను టీమిండియా సారథిగా నియమించాడు. ఆ నిర్ణయమే ఇప్పుడు కప్పు రూపంలో ఫలితం ఇచ్చింది.

అయితే.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీని గంగూలీ కావాలనే తప్పించాడని చాలా విమర్శలు వచ్చాయి. విరాట్‌ కోహ్లీ సైతం విషయంపై బహిరంగంగా బీసీసీఐపై విమర్శలు చేశాడు. తన విరాట్‌ కోహ్లీ అభిమానులు, మరికొంత మంది క్రికెట్ ఫ్యాన్స్‌.. గంగూలీపై తీవ్ర విమర్శలకు దిగారు. టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ అని కూడా చూడకుండా.. సోషల్‌ మీడియా వేదికగా దారుణమైన తిట్లుతో విరుచుకుపడ్డాడు. కోహ్లీ అభిమానులు ఒక ఏడాది పాటు దాదాను ట్రోల్ చేశాడు. ఐపీఎల్‌ సందర్బంగా కోహ్లీ సైతం దాదా ముందు నుంచి వెళ్తుంటే కాలు మీద కాలేసుకుని అలాగే కూర్చోని అవమానించాడు. అవన్ని మౌనంగా భరించిన గంగూలీ టీమిండియా భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచించాడు. కోహ్లీని తాను కెప్టెన్సీ నుంచి తీసేయలేదని చెప్పినా.. వినకుండా దాదాపై కోహ్లీ అభిమానులు సోషల్‌ మీడియాలో పచ్చిబూతులు తిట్టారు. కానీ, ఆ నాడు కోహ్లీ స్థానంలో రోహిత్‌ను కెప్టెన్‌ చేయాలని గంగూలీ తీసుకున్న నిర్ణయమే ఈనాడు.. టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచేందుకు దోహద పడింది. 2023లో వన్డే వరల్డ్‌ కప్‌ కొద్దిలో మిస్‌ అయింది కానీ.. లేదంటే దాదా నిర్ణయానికి మరో లెక్క ఉండేది. మరి టీమిండియా కప్పులు గెలిచేందుకు గంగూలీ తీసుకున్న నిర్ణయాలు, అందుకు ఫలితంగా అతను పొందిన అవమానాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

చేతులు మారిన వైజాగ్‌లోని అతిపెద్ద ఆసుపత్రి

Visakhapatnam Mahatma Gandhi Cancer Hospital: విశాఖపట్నంలోని మహాత్మా గాంధీ కేన్సర్ ఆసుపత్రి, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. చేతులు మారింది. దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ కేన్సర్‌కేర్ చైన్ కంపెనీ హెచ్‌సీజీ గ్రూప్ దీన్ని కొనుగోలు చేసింది.

దీని విలువ 414 కోట్ల రూపాయలు.

విశాఖపట్నం మహాత్మా గాంధీ కేన్సర్ ఆసుపత్రిలో 51 శాతం వాటాను హెచ్‌సీజీ తీసుకుంది. క్రమంగా దీన్ని 86 శాతానికి తీసుకెళ్తుంది. వచ్చే 18 నెలల్లో అదనంగా 34 శాతం వాటా కొనుగోలును హెచ్‌సీజీ గ్రూప్ యాజమాన్యం భావిస్తోంది. ఇందులో భాగంగా తొలి విడతలో 414 కోట్లతో దీన్ని కొనుగోలు చేసింది.

2023- 2024 ఆర్థిక సంవత్సరంలో కోసం విశాఖపట్నం గాంధీ ఆసుపత్రి 42.2 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. ఈబీఐటీడీఏతో 120.2 కోట్ల రూపాయల టోర్నవర్‌ను నమోదు చేసింది. హెచ్‌సీజీ యాజమాన్యం ఇందులో ప్రతి షేరుకు 3 రూపాయలు చొప్పున ఈబీఐటీడీఏను పెంచుకుంటూ వెళ్తుంది.

ప్రస్తుతం వైజాగ్ గాంధీ కేన్సర్ ఆసుపత్రి పూర్తిస్థాయి పడకల సామర్థ్యం 196. కాగా.. దీనికి అదనంగా మరో 25 పడకలను జోడించబోతోంది హెచ్‌సీజీ. వైజాగ్ రీజియన్‌లో బిగ్గెస్ట్ కేన్సర్ ట్రీట్‌మెంట్ ఆసుపత్రిగా నిలవాలనేది ఆ సంస్థ టార్గెట్. విశాఖపట్నంలో ప్రైవేట్ క్యాన్సర్ కేర్ సేవలకు భారీ డిమాండ్ ఉంటోంది. ప్రతి సంవత్సరం కూడా 15 శాతానికి పైగా ఇక్కడ కార్యకలాపాల సంఖ్య పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆసుపత్రిని కొనుగోలు చేసింది హెచ్‌సీజీ.

1986లో విశాఖపట్నం మహాత్మా గాంధీ ఆసుపత్రిలో లీనియర్ యాక్సిలరేటర్లు- 2, పీఈటీ సీటీ స్కానర్- 1, రోబోటిక్స్ సర్జరీ సిస్టమ్- 1, బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్‌ ఉన్నాయి. 12 మంది సర్జికల్, 6 రేడియేషన్, 4 మెడికల్ ఆంకాలజిస్టులతో సహా 31 మంది డాక్టర్లు ఇందులో పని చేస్తోన్నారు.

TTD: టీటీడీ నూతన ఛైర్మన్ గా ఆయనే!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీటీడీ నూతన చైర్మన్ ఎవరు అన్నది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఏపీలో వైసిపి ఓటమిపాలు కావడంతో గతంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఆ తరువాత టిటిడి రేసులో అనేక మంది పేర్లు వినిపించాయి .

టీటీడీ నూతన చైర్మన్ గా అశోక్ గజపతిరాజు పేరు

ముఖ్యంగా జనసేన నాయకుడు నాగబాబు పేరు, ప్రముఖ నిర్మాత అశ్విని దత్ పేరు, అలాగే ఓ టీవీ ఛానల్ యజమాని పేరు టిటిడి రేసులో బాగా వినిపించింది. ఇక ప్రస్తుతం టీటీడీ నూతన చైర్మన్ గా పూసపాటి అశోక్ గజపతిరాజుకు అవకాశం ఇస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా నిలిచిన సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఎంతో కీలకమైనది.

టీటీడీ చైర్మన్ పై అందరిలో ఆసక్తి

అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ పదవి ఎవరికి ఇవ్వబోతున్నారు అన్నది ప్రస్తుతం ఏపీలో ఆసక్తికరంగా మారింది. అయితే అటువంటి ప్రతిష్టాత్మకమైన టిటిడి చైర్మన్ పదవిని కేంద్ర మాజీ మంత్రి విజయనగరం పూసపాటి సంస్థానాధీశుడు అయిన అశోక్ గజపతి రాజుకు ఇస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అశోక్ గజపతిరాజు ఇటీవల జరిగిన ఎన్నికలలో పోటీ చేయలేదు. విజయనగరం జిల్లాలో పార్టీని గెలిపించడానికి ఆయన కీలకంగా పనిచేశారు.

ఆయనకు టీటీడీ చైర్మన్ ఇస్తే సముచితంగా ఉంటుందన్న యోచన

సింహాచలానికి వంశ పారంపర్య ధర్మకర్తగా ఉన్న ఆయన ఉత్తరాంధ్రలో అనేక దేవాలయాలకు ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉండే అశోక్ గజపతిరాజుకు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగిస్తే సముచితంగా ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. పూసపాటి అశోక్ గజపతి రాజుకు టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇస్తే ఎవరి నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం కాదని భావిస్తున్నట్లుగా సమాచారం.

టీటీడీ ప్రతిష్టని పెంచే వారికే అవకాశం ఇవ్వాలంటున్న ఏపీ వాసులు

ఇదే కనుక నిజమైతే త్వరలోనే అశోక్ గజపతిరాజును టీటీడీ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ గా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినా, మళ్లీ టిటిడి చైర్మన్ గానే ఆయనకు అవకాశం వస్తుందని భావిస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా టీటీడీ ప్రతిష్టని ఇనుమడింపజేసేలా, తిరుమల శ్రీవారిని సామాన్యులకు అందుబాటులో ఉంచేలా, తిరుమలలో హిందూ ధర్మాన్ని పరిరక్షించేలా టీటీడీ చైర్మన్ ని ఎంపిక చేయాలని ఏపీ వాసుల నుండి అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Nava Grahalu: నవ గ్రహాల అనుగ్రహం కావాలా? సింపుల్‌గా ఇలా చెయ్యండి చాలు.. అన్ని సమస్యలు తొలగిపోతాయ్

Nava Grahalu: నవ గ్రహాల అనుగ్రహం కావాలా? సింపుల్‌గా ఇలా చెయ్యండి చాలు.. అన్ని సమస్యలు తొలగిపోతాయ్

Nava Grahalu: జ్యోతిష్యశాస్త్రలో నవ గ్రహాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఒక మనిషి పుట్టిన దగ్గరి నుంచి చనిపోయే వరకు వాళ్ళ భూత, భవిష్యత్, వర్తమానాలను గ్రహాల కదలిక ఆధారంగా జ్యోతిష్యులు అంచనా వేస్తారు.

అయితే కొందరి జాతకాలలో గ్రహాలు బాగా లేవని వారి కష్టాలు ఆయా గ్రహాల నీచత్వ కారణంగానే అని పండితులు చెప్తుంటారు. వాటి నివారణ కోసం పెద్ద పెద్ద పూజలు చేయించుకోమని సూచిస్తుంటారు. అయితే ఆ పూజలకు వేలకు వేల రూపాయలు ఖర్చు అవుతుంటాయి. కొన్ని సార్లు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కూడా పూజలు హోమాలు చేస్తుంటారు. అంత డబ్బు ఖర్చు పెట్టి పూజలు యాగాలు చేయలేని వారికోసమే పరిహార శాస్త్రంలో చిన్న చిన్న రెమిడీలు ఉన్నాయని తంత్ర శాస్త్రికులు చెప్తున్నారు. ఆ రెమిడీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్యుడు:

నవగ్రహాలలో అత్యంత ముఖ్యమైనది రవి గ్రహం. అధికారానికి, ఆరోగ్యానికి, రాజకీయంగా ఎదుగుదలకు రవి కారకుడు. రవి గ్రహ అనుగ్రహం కోసం తల్లిదండ్రులను గౌరవించాలి. వారికి ఎప్పుడూ సేవ చేస్తుండాలి. జాతకంలో సూర్యుడి స్థితిని అనుసరించి ఎవరి నుంచి ఏ వస్తువు ఉచితంగా తీసుకోకూడదు.

చంద్రుడు:

నవగ్రహాల్లో చంద్రుడు రెండవ గ్రహం. చంద్రడు మనః కారకుడు. క్రీడా, సినీ రంగాల్లో రాణించడానికి చంద్రబలం చాలా అవసరం. చంద్ర గ్రహ అనుకూలత కోసం ఎప్పుడూ తల్లిదండ్రులను గౌరవించాలి. జాతకంలో చంద్రుడు యొక్క స్థితిని తెలుసుకుని పాలు, నీళ్ళు ఎవరికీ ఉచితంగా ఇవ్వకూడదు. మాంసాహారం తినరాదు.

కుజుడు:

నవగ్రహాల్లో మూడో గ్రహం కుజుడు. కుజుడు భూమి సంబంధమైన సంపదలకు కారకుడు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలన్నా.. కోట్లు సంపాదించాలన్నా సంపూర్ణమైన కుజ బలం ఉండాల్సిందే.అయితే జాతక చక్రంలో కుజుడి యొక్క స్థితిని ఆధారంగా కొందరు చక్కెర వ్యాపారం చేయరాదు. మరియు వికలాంగులకు దూరంగా ఉండాలి.

బుధుడు:

నవ గ్రహాల్లో అత్యంత తెలివైన గ్రహం బుధుడు. వ్యాపారంలో రాణించాలన్నా.. అఖండమైన పరిజ్ఞానాన్ని పొందాలన్నా బుధ గ్రహ బలం ముఖ్యం. ఇక జాతకంలో బుధ గ్రహం యొక్క స్థితిని ఆధారంగా చూసుకుని మాంసాహారం గుడ్లు చేపలు తినరాదు. మేనమామను ఆదరించాలి. యోగక్షేమాలు చూసుకోవాలి. అప్పుడే బుధుడు కరుణిస్తాడని పండితులు చెప్తున్నారు.

గురువు:

నవగ్రహాల్లో అత్యంత శుభప్రదమైన గ్రహం గురు గ్రహం. గురు గ్రహాన్నే బృహస్పతి అంగారక గ్రహం అని కూడా పిలుస్తారు. అఖండమైన ఆర్థిక యోగాన్ని, విద్యాయోగాన్ని కలిగించేదే గురుగ్రహం. గురు గ్రహ అనుగ్రహం కోసం ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలి. రోజు పసుపును పాలతో కలిపి నుదుటన బొట్టు పెట్టుకోవాలి. ఆడవారు అయితే ముఖానికి పసుపు రాసుకోవాలి.

శుక్రడు:

సమస్త భోగభాగ్యాలను ప్రసాదించేదే శుక్ర గ్రహం. ఒక మనిషి అఖండమైన రాజయోగంతో బతుకుతుంటే అయనకు శుక్రదశ తిరిగింది అంటారు. అత్యంత విలాసవంతమైన జీవితాన్ని కూడా శుక్రుడే అనుగ్రమం వల్లే కలుగుతుంది. అటువంటి శుక్రుడి అనుగ్రహం కలగాలంటే ఇంటి ఆడ పిల్లలను గౌరవించాలి. ఆదరించాలి. ఒకవేళ ఇంటిలో ఆడపిల్లలు లేకుంటే మేనత్తను గౌరవించాలి. అత్త కూడా లేకుంటే కన్నతల్లిని గౌరవించాలి. అప్పుడే శుక్రుడి అనుగ్రమం లభిస్తుందంటున్నారు పండితులు.

శని:

నవగ్రహాల్లో శని ఎంతటి భయాన్ని కల్గిస్తాడో అంతకన్నా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే గ్రహం. మనిషి ఆయుర్ధాయానికి శని గ్రహమే కారణం. అటువంటి శని గ్రహం అనుకూలించాలి అంటే ఇంట్లో పని మనుషులను చికాకు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పనివారికి తగినంత జీతం ఇవ్వాలి. ఇంట్లో పని వారు లేకుంటే బీద సాదలను వికలాంగులను ఆదరించాలి. అప్పుడే శని చల్లని చూపు మన మీద పడుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు.

రాహువు:

మనుషుల అనూహ్య ఎదుగుదలకు, పతనానికి రాహువే కారకుడు. క్రమశిక్షణకు కారకుడు రాహు గ్రహం. అంటువంటి రాహు గ్రహం అనుగ్రహం కోసం జాతకంలో రాహువు స్థితి ఆధారంగా బ్లూ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్సులు వేసుకోరాదు. అలాగే కుక్కలను పెంచరాదు. కుక్కలను పెంచినట్లయితే రాహువు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు.

కేతువు:

నవగ్రహాల్లో ఆఖరి గ్రహం కేతు గ్రహం. జాతకంలో కేతువు ఉచ్చ స్థితిలో ఉంటే ఆ వ్యక్తి ఏ రంగంలో ఉన్నా నెంబర్ వన్ పొజిషన్కు వెళ్తాడని జ్యోతిష్యులు చెప్తున్నారు. అటువంటి కేతు గ్రహం అనుగ్రహం కోసం జాతకంలో కేతువు ఉన్న స్థితి ఆధారంగా తప్పుడు వాగ్దానాలు చేయకూడదట. అలాగే సంతానం లేని వారి నుంచి భూమిని కొనరాదని జ్యోతిష్యులు చెప్తుంన్నారు.

ఈ చిన్న పరిహారాలు పాటిస్తే.. నవగ్రహాల అనుగ్రహం కలగడంతో పాటు జీవితంలో ఉన్నతి స్థితికి వెళ్తారని పండితులు చెప్తున్నారు. వీటిని పాటించే ముందు తమ వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్యుల దగ్గర తెలుసుకున్న తర్వాతే పాటించాలని సూచిస్తున్నారు.

వందల వ్యాధులను నయం చేసే శక్తి ఈ ఆకుల్లో..ఖరీదైన మెడిసిన్స్ కూడా దీనిముందు జుజుబీ

Hidden benefits of moringa leaf: అనేక చెట్లు,మొక్కలలో ఔషద గుణాలు ఉంటాయి..వాటిని సరిగ్గా వినియోగించడం ద్వారా అనేక వ్యాధుల నుండి బయటపడవచ్చు. అలాంటి ఔషద గుణాలు కలిగిన చెట్లలో మునగ ఒకటి.

మునగ చెట్టుని దేశీయ ఔషధాల నిధి అని పిలుస్తారు. వందల సంవత్సరాలుగా సాంప్రదాయ వైద్యంలో మునగ ఉపయోగిస్తున్నారు. ఈ చెట్టు అన్ని భాగాలలో ప్రయోజనకరమైన అంశాలు కనిపిస్తాయి. మునగ ఆకులు(moringa leaf), పువ్వులు, బెరడు, వేర్లను వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. మునగ ఆకులను ఎండబెట్టి గ్రైండ్ చేయడం ద్వారా పొడిని తయారు చేస్తారు. ఏళ్ల తరబడి తినవచ్చు.

మునగ చెట్టులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీని ఆకులు అత్యంత అద్భుతంగా పరిగణించబడతాయి. మునగ ఆకులలో కాల్షియం, ఐరన్, పొటాషియం, అనేక ఉపయోగకరమైన విటమిన్లు ఉన్నాయని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీని ఆకులను మలేరియా,టైఫాయిడ్ జ్వరంలో ఉపయోగిస్తారు. ఈ ఆకులు అధిక రక్తపోటు, మధుమేహం నుండి ఉపశమనాన్ని కూడా అందిస్తాయి. మునగ ఆకులను గ్రైండ్ చేసి తయారు చేసే పౌడర్‌లో ప్రొటీన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్, పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం..మునగ ఆకు పొడి(Moringa powder) లేదా పౌడర్ తీసుకోవడం కాలేయం, మూత్రపిండాలు, గుండె,ఊపిరితిత్తుల కణజాలాలను రక్షించడంలో సహాయపడుతుంది. మునగ ఆకులను సహజ నొప్పి నివారిణిగా కూడా పరిగణిస్తారు. మునగ ఆకులను క్రిమినాశక మందుగా కూడా ఉపయోగించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక పరిశోధన ప్రకారం.. మునగ పొడిని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

మునగ ఆకు పొడి రోగనిరోధక శక్తిని పెంచేదిగా కూడా పరిగణించబడుతుంది. ఈ పౌడర్‌లో విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్స్ మరియు ఇతర బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయని ఆధునిక పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ సమ్మేళనం రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు, ఇన్సులిన్ నిరోధకత, ఆల్కహాల్ లేని కాలేయ వ్యాధి, క్యాన్సర్, వాపు వంటి వ్యాధుల ట్రీట్మెంట్ లో ప్రయోజనకరంగా ఉంటుంది. మునగ ఆకు పొడి వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలను తీసుకోవడం వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. గ్యాస్ట్రిక్ అల్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా నుండి రక్షించడంలో కూడా ఇది చాలా సహాయకారిగా ఉంటుంది.

Rohit Sharma: వీడియో: కప్పు కొట్టిన తర్వాత పిచ్‌పై మట్టి తిన్న రోహిత్‌! ఎందుకలా చేశాడంటే..?

ఈ రోజు కోసం 13 ఏళ్లుగా ఎదురు చూశారు కోట్లాది మంది భారతీయులు. అందని ద్రాక్షగా మారిన వరల్డ్ కప్​ను ఎప్పటికైనా అందుకోకపోరా అని అనుకున్నారు. ఒకట్రెండు సార్లు కప్పు దగ్గరి దాకా వచ్చి మిస్సవడంతో వాళ్ల హార్ట్ బ్రేక్ అయింది.

అయితే ఆటగాళ్ల మీద నమ్మకం ఉంచారు. ఈసారి కప్పు మిస్సవ్వొద్దని అనుకున్నారు. రోహిత్ సేన టైటిల్ నెగ్గుతుందని విశ్వసించారు. ప్రపంచ కప్ కల తీరుస్తారని ఆశలు పెట్టుకున్నారు. వారి నమ్మకం వమ్ముకాలేదు. భారత్ టీ20 వరల్డ్ కప్-2024ని ముద్దాడింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మెగా ఫైనల్​లో 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి నయా ఛాంపియన్​గా అవతరించింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఆనందం పట్టలేక ఏడ్చేశారు.

భారత్విజయాన్ని అభిమానులు ఫుల్​గా సెలబ్రేట్ చేసుకున్నారు. వీధుల్లోకి వచ్చి జాతీయ పతాకం చేతపట్టి భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీమ్ ఛాంపియన్స్​గా నిలవడంతో భారత ఆటగాళ్లు కూడా సంబురాల్లో మునిగిపోయారు. ఒకర్నొకరు పట్టుకొని ఏడ్చేశారు. ఎగురుతూ, కేరింతలు కొడుతూ గ్రౌండ్ మొత్తం కలియదిరిగారు. ఇది నిజమేనా అని నమ్మలేకపోయారు. కప్పు చేతపట్టి సాధించామంటూ నినాదాలు చేశారు. ఈ తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఓ పని వైరల్ అవుతోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత హిట్​మ్యాన్ పిచ్ దగ్గరకు వెళ్లాడు. అక్కడి మట్టిని అతడు నోట్లో వేసుకొని రుచి చూశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

పిచ్​ నుంచి కాసింత మట్టిని తీసుకొని రుచి చూసిన రోహిత్.. ఆ తర్వాత దండం పెట్టాడు. తమకు ఇంతటి విజయాన్ని అందించిన వికెట్​కు అతడు గౌరవపూర్వకంగానే ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఆఖర్లో వెళ్తూ వెళ్తూ అతడు నమస్కరించడం దీనికి ప్రూఫ్​గా చెప్పొచ్చు. ఇది చూసిన నెటిజన్స్.. రోహిత్​కు హ్యాట్సాఫ్​ అంటున్నారు. అందరూ సంబురాల్లో మునిగిపోయినా.. హిట్​మ్యాన్​ పిచ్​కు థ్యాంక్స్ చెప్పడం, రెస్పెక్ట్ ఇవ్వడం హైలైట్ అని అంటున్నారు. కప్పు కల తీర్చిన వికెట్​కు నమస్కరించడం, ఆ మట్టిని రుచి చూడటం ద్వారా దానిపై మమకారాన్ని, గౌరవాన్ని చెప్పకనే చెప్పాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఫైనల్ విక్టరీ తర్వాత రోహిత్ ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. గ్రౌండ్​లో నేలపై పడుకొని ఏడ్చేశాడు. సహచరులను పట్టుకొని తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ క్రమంలో లాస్ట్ ఓవర్​తో మ్యాచ్​ను మలుపు తిప్పిన హార్దిక్​కు కిస్ కూడా ఇచ్చాడు

How to get rid of lizards: ఇంట్లో బల్లుల బెడద..? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా తరిమికొట్టండి..

చాలా మందికి బల్లులంటే భయం. గోడలపై పాకుతూ ఇళ్లంతా తిరిగే బల్లిని చూస్తే కొందరు నిద్రకూడా పోరు. వాటి ఉనికి చాలా మందికి అసహ్యం కలిగిస్తుంది. ఎక్కడ్నుంచో వచ్చి ఇళ్లల్లో దూరిన బల్లులు ఇబ్బంది పెడుతుంటాయి.

ఇవి చూడటానికి చాలా చిరాగ్గా ఉంటాయి. అంతేకాదు.. ఈ బల్లి కూడా విషపూరితమైనది కూడా. పొరపాటున బల్లి రుచి చూసినా, లేదంటే బల్లి పడిన ఆహారం ఆరోగ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా వంటింట్లో స్టవ్ కింద లేదా గోడల మీద ఇలాగ ప్రతి చోట బల్లులు తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ బల్లిని త్వరగా వదిలించుకోండి.

బల్లులు అసహ్యకరమైన జీవి మాత్రమే కాదు. అవి చాలా విషపూరితమైనవి కూడా. అలాంటి బల్లిని తరిమికొట్టేందుకు నెమలి ఈకలను ఉపయోగించవచ్చు. నెమలి ఈకలను చూడగానే బల్లులు పారిపోతాయి. కాబట్టి బల్లులను వదిలించుకోవడానికి ఇంట్లో అక్కడక్కడ గోడపై నెమలి ఈకలను ఉంచవచ్చు. నిజానికి, నెమళ్ళు బల్లులను తింటాయి. కాబట్టి బల్లులు నెమలి ఈకలను వాసన చూసినప్పుడు అవి పారిపోతాయి. ఇకపై ఆ ప్రదేశానికి రాదు. మీ ఇంటికి బల్లులు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో నెమలి ఈకలను ఉంచండి. ఇల్లు అందంగా కనిపిస్తుంది, బల్లులు కూడా పారిపోతాయి.

బల్లులను వదిలించుకోవడానికి గుడ్డు పెంకులు కూడా ఉపయోగించవచ్చు. ఆమ్లెట్ తయారు చేసేటప్పుడు, గుడ్డుకు ఒక వైపున చిన్న రంధ్రం చేసి అందులని గుడ్డు సొనను బయటకు తీయండి. ఇంట్లో బల్లులు పదే పదే వచ్చే అన్ని ప్రదేశాలలో ఆ పెంకు ఉంచండి. అలాగే, మొక్కల చుట్టూ బల్లులు ఎక్కువగా ఉంటాయి. దీనికి కోడి గుడ్డు పెంకు ఆ మొక్కల దగ్గర పెట్టి ఉంచాలి. దీనివల్ల బల్లులు ఆ దగ్గరకు రావు

మీ గది చుట్టూ, ప్రతి డ్రాయర్‌లో అల్మారాలో లేదా మూలలో కొన్ని నాఫ్తలీన్ ఉండలను వేయండి. ఈ నాఫ్తలీన్ బాల్స్ బలమైన వాసనను బల్లులు తట్టుకోలేవు. దాంతో దెబ్బకు అవి పారిపోవాల్సి వస్తుంది. అంతేకాదు, ఈ నాఫ్తలీన్ బాల్స్‌తో ఇళ్లంతా మంచి సువాసన కూడా ఉంటుంది.

మీరు బల్లులను తరిమికొట్టేందుకు కాఫీ పౌడర్‌ను కూడా వాడొచ్చు. బల్లులు కాఫీ వాసనను తట్టుకోలేవు. కాఫీ, పొగాకు కలపండి. కొద్దిగా నీటితో చిన్న బాల్స్ చేయండి. ఆబాల్స్‌ని గది మూలలో ఉంచండి. బల్లి పారిపోవటం మీరు గమనిస్తారు.

అలాగే, పెప్పర్‌ స్పెతో కూడా బల్లుల్ని తరిమి కొట్టొచ్చు. ఒక స్ప్రే బాటిల్‌లో నీళ్లు పోసి అందులో మిరియాల పొడి వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బల్లులు వచ్చే ప్రదేశాలలో పిచికారీ చేయండి. కొన్ని రోజుల తర్వాత బల్లి మళ్లీ రాదు.

ఉల్లి, వెల్లుల్లి వాసన ఎంత బలంగా ఉంటుందంటే దాని వాసన చూసిన బల్లులు ఆ ప్రాంతానికి రావు. బల్లులు తరచుగా కనిపించే ప్రదేశాలలో తరిగిన ఉల్లిపాయ లేదా వెల్లుల్లి రెబ్బలను వేలాడదీయండి. దీని ఘాటైన వాసన బల్లులు ఇంట్లోకి రాకుండా చేస్తుంది.

Tomato Juice : ఈ రసాన్ని ఒక గ్లాస్ తీసుకుంటే చాలు. కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టినట్లే.!

Tomato Juice : ప్రస్తుత కాలంలో మన జీవనశైలి,ఆహార అలవాట్ల వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం.ఈ సమస్యలలో ఒకటి కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ అనేది పెరగటం వలన గుండె సమస్యలు, గుండెపోటు లేక రక్తనాళం లోపల కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది.

దీంతో శరీరంలోని రక్త ప్రసరణ అనేది ఎంతో మందగిస్తుంది. దీనితో పాటుగా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వలన కళ్ళు,చర్మం ఇతర అవయవాలు కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. అందువలన కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవడానికి వ్యాయామంతో పాటుగా మంచి ఆహారం కూడా తీసుకోవాలి…

Tomato Juice కొలెస్ట్రాల్ పెరిగితే గుండెకు ప్రమాదం

ప్రపంచ వ్యాప్తంగా ప్రజల గుండె ఆరోగ్యం అనేది ఎంతో నశిస్తుంది. ప్రస్తుతం 30 సంవత్సరాల లోపు వారిలో గుండెపోటు సమస్యలు పెరుగుతున్నాయి. అయితే కొలెస్ట్రాల్ పెరిగితే ముందు చాతిలో నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాక ఇది ఊబకాయం, గుండెపోటు ప్రమాదాలను కూడా పెంచుతుంది…

ఈ వెజిటేబుల్ జ్యూస్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది : శరీరంలో పేర్కొన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో టమాటాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అందువల్ల నీరు, ఖనిజ పోషకాలు ఉన్నటువంటి టమాటా రసాన్ని తీసుకోవటం వలన కొలస్ట్రాల్ ను నియంత్రించవచ్చు…

పరిశోధన ఏమి చెబుతుంది : కొన్ని అధ్యయనాల ప్రకారం చూసినట్లయితే, రెగ్యులర్ గా ఒక కప్పు టమాటా రసం తీసుకోవటం వలన శరీరంలో కొలెస్ట్రా ల్ స్థాయిలను 10 శాతం వరకు నియంత్రించవచ్చు. ఈ టమాటా లో ఉండే ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అయిన లైకోపిన్ కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం చూసినట్లయితే, ఒక్క రోజులో 25 mg కంటే అధిక లైకోపిన్ తీసుకోవడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది అని అధ్యయనంలో తేలింది. అంతే కాక మంచి కొలెస్ట్రాల్ పరిమాణం కూడా పెరుగుతుంది అని అధ్యయనంలో తేలింది. అయితే ఈ టమాటా రసాన్ని ఎక్కువ గా తీసుకోకూడదు.

Tomato Juice : ఈ రసాన్ని ఒక గ్లాస్ తీసుకుంటే చాలు… కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టినట్లే…!

టమాటా రసం ఎలా తాగాలి : నిపుణుల అభిప్రాయ ప్రకారం చూసినట్లయితే, చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి తాజాగా ఉన్న కొన్ని టమాటాలను తీసుకొని కొద్దిగా నీటిని కలిపి మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటా రసాన్ని తీసుకునేటప్పుడు దానిలో ఉప్పు, పంచదార లాంటివి ఏమీ కూడా కలపకూడదు అని గుర్తుంచుకోవాలి. ఇంకా చెప్పాలంటే. టమాట సూప్ లాంటివి కూడా చేసుకొని తీసుకుంటే చాలా మంచిది…

Health

సినిమా