చేతులు మారిన వైజాగ్‌లోని అతిపెద్ద ఆసుపత్రి

Visakhapatnam Mahatma Gandhi Cancer Hospital: విశాఖపట్నంలోని మహాత్మా గాంధీ కేన్సర్ ఆసుపత్రి, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. చేతులు మారింది. దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ కేన్సర్‌కేర్ చైన్ కంపెనీ హెచ్‌సీజీ గ్రూప్ దీన్ని కొనుగోలు చేసింది.


దీని విలువ 414 కోట్ల రూపాయలు.

విశాఖపట్నం మహాత్మా గాంధీ కేన్సర్ ఆసుపత్రిలో 51 శాతం వాటాను హెచ్‌సీజీ తీసుకుంది. క్రమంగా దీన్ని 86 శాతానికి తీసుకెళ్తుంది. వచ్చే 18 నెలల్లో అదనంగా 34 శాతం వాటా కొనుగోలును హెచ్‌సీజీ గ్రూప్ యాజమాన్యం భావిస్తోంది. ఇందులో భాగంగా తొలి విడతలో 414 కోట్లతో దీన్ని కొనుగోలు చేసింది.

2023- 2024 ఆర్థిక సంవత్సరంలో కోసం విశాఖపట్నం గాంధీ ఆసుపత్రి 42.2 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. ఈబీఐటీడీఏతో 120.2 కోట్ల రూపాయల టోర్నవర్‌ను నమోదు చేసింది. హెచ్‌సీజీ యాజమాన్యం ఇందులో ప్రతి షేరుకు 3 రూపాయలు చొప్పున ఈబీఐటీడీఏను పెంచుకుంటూ వెళ్తుంది.

ప్రస్తుతం వైజాగ్ గాంధీ కేన్సర్ ఆసుపత్రి పూర్తిస్థాయి పడకల సామర్థ్యం 196. కాగా.. దీనికి అదనంగా మరో 25 పడకలను జోడించబోతోంది హెచ్‌సీజీ. వైజాగ్ రీజియన్‌లో బిగ్గెస్ట్ కేన్సర్ ట్రీట్‌మెంట్ ఆసుపత్రిగా నిలవాలనేది ఆ సంస్థ టార్గెట్. విశాఖపట్నంలో ప్రైవేట్ క్యాన్సర్ కేర్ సేవలకు భారీ డిమాండ్ ఉంటోంది. ప్రతి సంవత్సరం కూడా 15 శాతానికి పైగా ఇక్కడ కార్యకలాపాల సంఖ్య పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆసుపత్రిని కొనుగోలు చేసింది హెచ్‌సీజీ.

1986లో విశాఖపట్నం మహాత్మా గాంధీ ఆసుపత్రిలో లీనియర్ యాక్సిలరేటర్లు- 2, పీఈటీ సీటీ స్కానర్- 1, రోబోటిక్స్ సర్జరీ సిస్టమ్- 1, బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్‌ ఉన్నాయి. 12 మంది సర్జికల్, 6 రేడియేషన్, 4 మెడికల్ ఆంకాలజిస్టులతో సహా 31 మంది డాక్టర్లు ఇందులో పని చేస్తోన్నారు.