Tuesday, September 17, 2024

Credit Card Billing Cycle: క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను ఎలా మార్చాలి? నిబంధనలు ఏమిటి?

క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌కి సంబంధించిన నియమాలలో రిజర్వ్ బ్యాంక్ కొన్ని మార్పులు చేసింది.

ఈ మార్పుల కారణంగా, మీ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌పై సానుకూల ప్రభావం ఉంటుంది. అంటే, మీరు క్రెడిట్ కార్డ్ యూజర్ అయితే ఇది బిల్లింగ్ సైకిల్‌ను ఎలా ప్రభావితం చేస్తుంది. అది ఎలా ప్రయోజనకరంగా మారుతుంది? ఇప్పుడు చూద్దాం. నిజానికి ఆర్బీఐ క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లకు సంబంధించిన కొన్ని నియమాలను ఏప్రిల్ 2022లో తీసుకువచ్చింది. దీని ఉద్దేశం వినియోగదారుకు అతని కార్డ్‌పై మరింత కంట్రోల్ ను ఇవ్వడమే. ఈ నిబంధనలు జూలై 2022లో అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని బ్యాంకులను RBI కోరింది.

నిబంధనల ప్రకారం, క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను మార్చడానికి వన్-టైమ్ ఆప్షన్‌ను ఇవ్వాలని సూచించారు. ఇప్పుడు మార్చి 7 నుండి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలలో RBI కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పు ప్రకారం, బ్యాంకులు వారి క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు వారి బిల్లింగ్ సైకిల్‌లో ఒకటి కంటే ఎక్కువసార్లు మార్పులు చేసే అవకాశాన్ని ఇవ్వాలి.

Personal Loan : చాలా చీప్‌గా ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకోవ‌చ్చు.. అది ఎలా అంటారా?

Personal Loan : మ‌న ప‌నుల‌తో మ‌నం బిజీబిజీగా ఉంటుండ‌గా, మ‌ధ్య‌లో ప‌ర్స‌న‌ల్ లోన్ కోసం కాల్స్ వస్తుండ‌డం వాటి వ‌ల‌న మ‌న‌కు చిరాకు రావ‌డం కూడా జ‌రుగుతుంటుంది. కుటుంబ అవసరాలు, వ్యాపార పెట్టుబడులు, ఇతర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి చాలా మంది ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకుంటారు. మధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లే ఎక్కువ‌గా వాటిపై ఆధార‌ప‌డుతుంటారు. అయితే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే అవసరాలు తీరడంతో పాటు వ్యాపారాలలో కూడా ప్రగతి సాధించవచ్చు. మిగిలిన రుణాలతో పోల్చితే వ్యక్తిగత రుణాలకు ధ్రువీకరణ పత్రాలు పెద్దగా అవసరం ఉండదు. అయితే బ్యాంకులు వీటిని రిస్క్ గా పరిగణిస్తాయి.
త‌నఖా పెట్టుకోవ‌డానికి బ్యాంకుల‌లో ఎలాంటి వ‌స్తువులు ఉండ‌వు కాబ‌ట్టి వ‌డ్డీ రేటుని బ్యాంకులు గ‌ట్టిగానే విధిస్తాయి. అయితే వ్యక్తిగత రుణాలను కూడా తక్కువ వడ్డీ రేటుకు పొందే అవకాశం ఉంది. దానికి కోసం మీరు కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ముందుగా క్రెడిట్ స్కోరు. ప‌ర్స‌న‌ల్ లోన్ ఇచ్చే వారు ముందుగా క్రెడిట్ స్కోరు ప‌రిశీలిస్తారు. దానిని బ‌ట్టే రుణం ఇవ్వాలా వ‌ద్దా అని నిర్ణ‌యిస్తారు. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తి తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గతంలో మనం తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ స్కోరు మంచిగానే ఉంటుంది. ఇక మ‌నం రుణం తీసుకునే ముందు ఇత‌ర రుసుముల గురించి క్లియ‌ర్‌గా ప‌రిశీలించుకోవాలి. వడ్డీ, ఇతర ఖర్చులను ఎంత కలిపారో తెలుసుకోవాలి.

ఇక రుణాలపై వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండవు. ప్రాసెసింగ్ చార్జీలు కూడా మారుతూ ఉంటాయి. రుణం తీసుకునే ముందు వాటినన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏ బ్యాంకు నిబంధనలు అనుకూలంగా ఉన్నాయో, ఎక్కడ తక్కువ చార్జీలు విధిస్తారో త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంటంఉది. ఇక అప్పు తీసుకున్న తర్వాత వాయిదాలు సకాలంలో చెల్లించగలరో, లేదో లెక్కవేసుకొని దానిని బ‌ట్టి ముందుకు వెళ్లాలి. మీకు వస్తున్న ఆదాయం, ఖర్చులతో పాటు అత్యవసరాలకు కూడా కొంత మొత్తాన్ని ప‌క్క‌న పెట్టి ముందుకు సాగాలి

Real Estate News: గృహ కొనుగోలుదార్లకు పిడుగులాంటి వార్త.. ఇలా అయితే కష్టమే మరి..

Cement Prices: అంతకంతకూ పెరుగుతున్న ఖర్చులు సామాన్యుడి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. గృహ నిర్మాణ సామాగ్రి ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఇళ్ల ధరలకు హద్దే ఉండటం లేదు. తాజాగా మరో వార్త ఇప్పుడు గృహ కొనుగోలుదార్లకు నిద్ర పట్టనివ్వడం లేదు.

దేశ వ్యాప్తంగా సిమెంట్ ధరలు పెంచుతున్నట్లు ఆయా కంపెనీలు ప్రకటించి షాక్ ఇచ్చాయి. ప్రాంతాన్ని బట్టి బస్తాకు 10 నుంచి 40 వరకు ప్రియం కానున్నట్లు తెలిపాయి. ఈ నిర్ణయంతో ఇప్పటికే డీలా పడిన గృహ కొనుగోళ్ల డిమాండ్‌ మరింత బలహీనపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ప్రభావం రిటైల్ వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. పెద్దఎత్తున చేపడుతున్న నిర్మాణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్ద దెబ్బగా బిల్డర్లు చెబుతున్నారు.

బలహీన డిమాండ్ కారణంగా వరుసగా 5 నెలల పాటు సిమెంట్ ధరలు క్షీణించాయి. ఈ సుదీర్ఘ కాలం తర్వాత ఇప్పుడు రేట్లు పెరిగాయి. సిమెంట్‌ ధరల పెంపు వల్ల ఇళ్లకు డిమాండ్‌ మరింత తగ్గుతుందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఛైర్మన్ నిరంజన్ హీరానందని పేర్కొన్నారు. ప్రతి 10 రూపాయల సిమెంట్ ధర పెరుగుదల.. నిర్మాణ వ్యయంపై సుమారు 5 రూపాయల మేర ప్రభావం చూపుతుందని కొలియర్స్ ఇండియా MD జతిన్ షా తెలిపారు. వినియోగదారుల మనోభావాలను ఇది ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు. సిమెంట్ ధరలు పెరగడానికి వివిధ అంశాలు కారణమని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ముడి పదార్థాలు, విద్యుత్ మరియు రవాణా ఖర్చుల పెరుగుదల ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీని ప్రభావం అభివృద్ధి చెందుతున్న పరిశ్రమకు సవాలుగా నిలవనుంది. ఈ కారణంగా బిల్డర్‌లు ఈ ధరల హెచ్చుతగ్గులను నావిగేట్ చేయడంతో పాటు నిర్మాణంలో ఉన్న మరియు భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల కొనసాగింపుపై పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రపంచంలోనే భారత్ రెండవ అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా ఉంది. దీనికితోడు గ్లోబల్ ఇన్‌స్టాల్ కెపాసిటీలో 8 శాతానికి పైగా వాటా ఇండియా సొంతం. క్రిసిల్ రేటింగ్స్ ప్రకారం భారతీయ సిమెంట్ పరిశ్రమ FY24లో దాదాపు 80 మిలియన్ టన్నుల (MT) సామర్థ్యాన్ని జోడించింది. గత 10 ఏళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. FY27 చివరి నాటికి సిమెంట్ వినియోగం 450.78 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా.

BREAKING: నేడు ఆకాశంలో మరో అద్భుతం.. భూమికి దగ్గరగా రానున్న గురు గ్రహం

కొన్నేళ్ల ఏళ్ల తరవాత ఆకాశంలో అరుదైన ఘట్టం అవిష్కృతం కాబోతోంది. నేడు భూమికి అతి దగ్గరగా గురు గ్రహం రాబోతోంది. అయితే, సాధారణంగా గురుగ్రహం భూమికి 85 వేల కోట్ల కి.మీ.దూరంలో తిరుగుతూ ఉంటుంది. కాగా, నేడు పరిభ్రమనలో భాగంగా ఇవాళ రాత్రి గురు గ్రహాన్ని భూమి నుంచి వీక్షించే అవకాశం దేశ ప్రజలకు లభించనుంది. చంద్రుడిపై చిన్న నక్షత్రంలా గురు గ్రహం దర్శనమివ్వనుందని ఖగోళ శాస్రజ్ఞులు తెలిపారు.

తల్లిదండ్రులకు గమనిక.. పిల్లలకు ముందు ఇది ఇవ్వండి.. కేంద్ర ప్రభుత్వ ఆదేశం..!!

Blue Aadhaar: దేశంలో అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్ ఒకటిగా మారిపోయింది. బ్యాంకింగ్ పనుల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ఏది పొందాలన్నా అందుకు ఆధార్ తప్పనిసరి. దీనిని ఇతర అవసరాలకు గుర్తింపు కార్డుగా కూడా పరిగణించబడుతోంది.

కేవైసీ ధృవీకరణ కోసం ఉపయోగించే అతి ముఖ్యమైన పత్రం ఆధార్ కార్డ్. గతంలో పెద్దలకు మాత్రమే ఉన్న ఆధార్ కార్డును 2018 నుంచి చిన్న పిల్లలకు అందుబాటులోకి తీసుకురాబడింది. వీటిని బ్లూ ఆధార్ కార్డ్ అని పిలుస్తారు. ఈ ఆధార్ కార్డ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ద్వారా జారీ చేయబడింది. 12 అంకెల ఈ ప్రత్యేక గుర్తింపు కార్డు సంఖ్య వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది.

2018లో పుట్టినప్పటి నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు బ్లూ ఆధార్ కార్డును ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలు పొందే బ్లూ ఆధార్ కార్డు నమోదు చేసినప్పటి నుంచి కేవలం 5 ఏళ్లు మాత్రమే చెల్లుబాటు అవుతుందని తల్లిదండ్రులు గమనించాలి. దీనిని పొందటానికి ఎలాంటి ప్రధాన పత్రాలు అవసరం ఉండదు. తల్లిదండ్రులు ఉపయోగించే బర్త్ సర్టిఫికేట్ లేదా హాస్పిటల్ డిశ్చార్జ్ స్లిప్ సరిపోతుంది. ఇది కాకుండా పిల్లల బడికి వెళుతుంటే వారి ఐడి కార్డ్ కూడా గుర్తింపుకు స్వీకరించబడుతుంది. ఇప్పుడు ఈ కార్డు పాఠశాల అడ్మిషన్ల కోసం ఉపయోగించబడుతుంది. బ్లూ ఆధార్ కోసం వారి తల్లిదండ్రుల UIDతో లింక్ చేయబడిన ఫోటో మాత్రమే సరిపోతుంది. తర్వాత వారి ఐరిస్, వేలిముద్రలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో బ్లూ ఆధార్ కార్డ్ నమోదు ప్రక్రియ.. 1) బ్లూ ఆధార్ కార్డ్ పొందడానికి ముందుగా మనం అధికారిక వెబ్‌సైట్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

2) తర్వాత “మై ఆధార్”కి వెళ్లండి. “మై ఆధార్” విభాగాన్ని కనుగొని, “అపాయింట్‌మెంట్ బుకింగ్”పై క్లిక్ చేయండి. 3) ఇక్కడ “చైల్డ్ ఆధార్” ఎంచుకోండి. “న్యూ ఆధార్”ని ఎంచుకుని, మీ మొబైల్ నంబర్, సెక్యూరిటీ కోడ్ (క్యాప్చా) నమోదు చేయండి. “కుటుంబ అధిపతితో సంబంధం” కింద, “చైల్డ్ (0-5 సంవత్సరాలు)” ఎంచుకోండి. 4) మీ పిల్లల వివరాలను పూరించండి. పిల్లల పేరు, పుట్టిన తేదీ, చిరునామాను జాగ్రత్తగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు తమ ఆధార్ కార్డులతో పాటు పిల్లల బర్త్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

5) వివరాలన్నీ పూరించిన తర్వాత అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి. సమీపంలోని ఆధార్ సేవా కేంద్రంలో వీలును బట్టి తేదీ, సమయాన్ని ఎంచుకోండి. తర్వాత కేంద్రాన్ని సందర్శించి బ్లూ ఆధార్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోండి.

ఏప్రిల్ నెలలో పుట్టిన వారిలో ఉండే ప్రత్యేక గుణలు ఇవే..

ఏప్రిల్ నెలలో( month of April ) జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ నెలలో వికసించే పువ్వులు, వసంత సాహసాలు మరియు వేసవి ప్రారంభాన్ని తెలియజేస్తాయి.

ఏప్రిల్ లో జన్మించిన వ్యక్తులు వారి ప్రత్యేక లక్షణాల కలయికకు ప్రసిద్ధి చెందారు. వారి ఉత్సాహం మరియు తెలివితేటలతో ప్రసిద్ధి చెందారు. ఏప్రిల్ నెలలో జన్మించిన పిల్లల భవిష్యత్తు, వ్యక్తిత్వం( Children’s future, personality ) మరియు లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ లో జన్మించిన వారు తమ జీవితాంతం తరచుగా జోకులతో మరియు చిలిపిగా ఉంటారు.

ముఖ్యంగా ఏప్రిల్ ఫూల్స్ డే రోజు పుట్టిన వారు ఆనందాన్ని పంచడం అలవాటు చేసుకుంటారు.

ఏప్రిల్ నెలలో పుట్టిన వారు వారి చుట్టూ ఉన్న వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఏప్రిల్ నెలలో జన్మించిన వ్యక్తులు తమ లక్ష్యాలను సాధించడానికి నమ్మశక్యం కాని విధంగా పని చేస్తారు. వారు ఒక దానిపై దృష్టి సారించిన తర్వాత వారు దాన్ని సాధించడానికి ఏమైనా చేస్తారు.అలాగే వీరు మొదలుపెట్టిన పనిని ఎంతో పట్టుదలతో పూర్తి చేస్తారు. ఏ పనిలోనైనా విజయం సాధించడానికి తమను తాము అంకితం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు.

అలాగే ఏప్రిల్ నెలలో జన్మించిన వారు సవాళ్లకు దూరంగా ఉంటారు. ఏప్రిల్ లో జన్మించిన వ్యక్తులు వారి పనులలో సృజనాత్మకతను కలిగి ఉంటారు. కళా, సంగీతం, సాహిత్యం ( Art, Music, Literature )మొదలైన వాటి పై వారి అభిరుచిని పెంచుకుంటూ ఉంటారు. వారు ప్రపంచం పై ప్రత్యేకమైన దృక్పధాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కొత్త మరియు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతారు.

ఏప్రిల్ లో జన్మించిన వ్యక్తుల యొక్క అత్యంత ఆకర్షణీయమైన లక్షణాలలో ఒకటి వారి తేజస్సు. వీరు ప్రజలను తమ వైపుకు ఆకర్షించే సహజ ఆకర్షణను కలిగి ఉంటారు. వారు ఎక్కడికి వెళ్లినా స్నేహితులను సంపాదించుకుంటారు.వీరు స్నేహపూర్వక స్వభావం మరియు స్నేహపూర్వక ప్రవర్తన వీరిని అందరినీ దగ్గర చేస్తుంది. ఏప్రిల్ లో జన్మించిన వ్యక్తులు ఇతరుల పట్ల లోతైన సానుభూతి మరియు కరుణను కలిగి ఉంటారు. అవసరమైన వారికి సహాయం చేయడానికి వీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలాగే వారు వ్యక్తుల భావోద్వేగాలను అర్థం చేసుకునే సమర్ధాన్ని కలిగి ఉంటారు.

Big shock to CM Jagan: జగన్‌కు మరో బిగ్ షాక్, ఈ వారంలో ఉత్తర్వులు..?

Big shock to CM Jagan: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నేతల మధ్య వివాదాస్పద మాటలు పక్కనబెడితే.. ఎన్నికల సంఘం అందరిపై ఓ కన్నేసి ఉంచుతోంది. తాజాగా సీఎం జగన్ మరో షాక్ తగలనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.

ముఖ్యంగా సీఎస్ జవహర్‌రెడ్డి మార్పుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఎస్ పదవి నుంచి ఆయన్ని తప్పించకుండా వేరే రాష్ట్రానికి ఎన్నికల అబ్జర్వర్‌గా కేంద్ర ఎన్నికల సంఘం పంపబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అక్కడి నేతలు బలంగా చెబుతున్నారు. ఇదే జరిగితే జగన్ గెలుపు కష్టమనే అన్నవారు లేకపోలేదు. సీఎస్ జవహర్‌రెడ్డి స్థానంలో నలుగురు పేర్లు పంపించారట. వారిలో సీనియర్ ఐఏఎస్ రజత్ భార్గవ్, అనంతరాములు, ఆర్పీ సిసోడియా, నీరవ్ కుమార్ ప్రసాద్‌లు ఉన్నారు. దాదాపు నీరవ్‌కుమార్ పేరు ఖారైనట్లు తెలుస్తోంది.

సీఎస్ జవహర్‌రెడ్డిని తప్పించడానికి కారణాలు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్ సొంత జిల్లా వ్యక్తి కావడం, రెండోది ప్రధాని నరేంద్రమోదీ చిలుకలూరిపేట సభ ఇష్యూ, మూడోది ఏపీలో పింఛన్ల వ్యవహారం.. ఇవన్నీ కలిసి ఆయన వేటుకు కారణమని చెబుతున్నారు. అయితే ఎన్నికల వేళ అధికారుల బదిలీలు, తప్పించడం సహజమేనని నేతలు చెబుతున్నమాట. గత టీడీపీ హయాంలోనూ సీఎస్‌ను మార్చిన సందర్భాలను ఇక్కడ గుర్తు చేస్తున్నారు పలువురు రాజకీయ నేతలు.
మరోవైపు ఏప్రిల్ మూడోవారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈలోగా డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులను ఎన్నికల సంఘం మార్చే అవకాశముందని పలువురు ఐపీఎస్‌లు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్‌లపై వేటు వేసింది ఎన్నికల సంఘం. కొందరికి పోస్టింగులు ఇవ్వగా, మరికొందరిని పెండింగ్‌లో పెట్టింది. సిన్సియర్ ఐపీఎస్ అధికారి రఘురామ్‌రెడ్డిని అస్సాం ఎన్నికల అబ్జర్వర్‌గా ఈసీ పంపిన విషయం తెల్సిందే. మొత్తానికి సీఎం జగన్ అంతర్గత వ్యూహాన్ని టీడీనీ నేతలు బట్టబయలు చేస్తున్నారు.

Triphala Water : ప్రతిరోజు ఉదయం ఈ త్రీఫల చూర్ణం తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో…?

Triphala Water : త్రిఫల అనే పదం మీరు వినే ఉంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ముఖ్యంగా ప్రతిరోజు దీనిని ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో ఈ త్రీఫల గురించి చాలామందికి తెలియదు. కానీ ఆయుర్వేద గ్రంధాలలో త్రిఫల వేయి ఆరోగ్యకరమైన గుణాలను కలిగి ఉంటుందని చెబుతున్నాయి. అయితే వాస్తవానికి ఈ త్రీఫల అనేది సంస్కృత పదం. ఇక ఇది మూడు పండ్ల మిశ్రమం కాబట్టి దీనిని త్రీఫల అని పిలుస్తారు. దీనిని ఉసిరికాయ , తానికాయ , కరక్కాయ..పండ్లతో కలిపి తయారు చేయడం వలన త్రీఫలగా పిలుస్తారు. దీనిలో ఒక్కో పండులో ఉన్న ఒక్కో రకమైన పోషక మరియు ఆరోగ్య గుణాలు ఉండటం వలన ఆరోగ్యానికి ఇది చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. మరి ఈ త్రీఫలను ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Triphala Water : ప్రయోజనాలు…
త్రిఫల చూర్ణాన్ని మూడు పండ్ల మిశ్రమంతో ఎంతో నాణ్యతగా తయారు చేస్తారు. కావున దీని ప్రయోజనాలు కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి.

Triphala Water : జీర్ణ క్రియ మెరుగుపరచడానికి…
త్రిఫల చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకే ప్రతిరోజు ఉదయం త్రిఫల లేదా త్రీఫల నానబెట్టిన నీటిని తాగటం వలన ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయుర్వేద గ్రంధాలలో ఈ త్రీఫల చూర్ణం తీసుకున్న తర్వాత గ్యాస్ మందులు అసలు తీసుకోకూడని సూచించారు. అంతేకాక ఆరోగ్య నిపుణులు సైతం అదే చెబుతున్నారు. కావున త్రిఫల చూర్ణాన్ని తీసుకున్నప్పుడు గ్యాస్ మందుకు దూరంగా ఉండటం మంచిది.
Triphala Water : దంతాల ఆరోగ్యం…
త్రీఫలను ప్రతిరోజూ తీసుకోవడం వలన దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక దంతాలపై ఉండే పసుపు మరకలను తొలగించడానికి , చిగుళ్ల నుండి రక్తస్రావం నివారించడానికి , నోటి దుర్వాసన వంటి సమస్యలను నివారించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాక త్రిఫల చూర్ణాన్ని తీసుకోవడం వలన శరీరంలో ఉండే అదనపు కొవ్వును సులువుగా కరిగించవచ్చు. అంతేకాక ఈ త్రీఫల వలన జీవక్రియ రేటు కూడా మెరుగుపడుతుంది. తద్వారా సులువుగా బరువు తగ్గుతారు.

నేటి పంచాంగం మరియు నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా… (తేదీ 11/04/24)

Today panchangam and Horoscope in Telugu: నేటి పంచాంగం మరియు నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా… (11/04/24)

ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహుర్తం సమయం , యమగండం సమయం, రాహూకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

సూర్యోదయం సమయం : ఉదయం 06:27 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:22 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

నేడు ఏప్రిల్ 11 శుభ సమయాలు

బ్రహ్మ ముహుర్తం సమయం : తెల్లవారుజామున 05:09 గంటల నుంచి ఉదయం 05:57 గంటల వరకు ఉంటుంది.
అభిజిత్ ముహుర్తం సమయం : ఉదయం 11:59 నుంచి మధ్యాహ్నం 12:47 గంటల వరకు ఉంటుంది.

గోధూళి ముహూర్తం సమయం : లేదు.

అమృత కాలం సమయం : ఉదయం 11:21 నుంచి మధ్యాహ్నం 12:51 గంటల వరకు ఉంటుంది.

నేడు ఏప్రిల్ 11 అశుభ సమయాలు
యమగండం సమయం : ఉదయం 06:06 నుంచి ఉదయం 07:39 గంటల వరకు ఉంటుంది.

దుర్ముహర్తం సమయం : ఉదయం 10:13 నుంచి ఉదయం 11:02 గంటల వరకు ఉంటుంది.

రాహూకాలం సమయం : మధ్యాహ్నం 01:49 నుంచి మధ్యాహ్నం 03:22 గంటల వరకు ఉంటుంది.

గులిక్ కాలం సమయం : ఉదయం 09:11 నుంచి ఉదయం 10:44 గంటల వరకు ఉంటుంది.

మేషం
అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల్లో ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.

వృషభం
మిశ్రమ కాలం. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తి చెందకపోవచ్చు. అస్థిరనిర్ణయాలతో సతమతం అవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.

మిథునం
ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. మీ బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదైవారాధన శ్రేయస్సును ఇస్తుంది.

కర్కాటకం
శుభ సమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు.

సింహం
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం.

కన్య
ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన మంచిది.

తుల
శుభకాలం. చిత్తశుద్ధితో పనిచేసి విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి. అధికారుల కోపానికి గురికాకుండా, ఓర్పుగా వ్యవహరించండి. శివారాధన వల్ల మంచి జరుగుతుంది.

వృశ్చికం
మిశ్రమ కాలం. మీ మీ రంగాల్లో శారీరకశ్రమ పెరుగుతుంది. గిట్టనివారితో మితభాషణం అవసరం. స్థానచలనం సూచితం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. శ్రీఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.

ధనుస్సు
ప్రారంభించిన పనులను సులభంగా పూర్తిచేస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీలక్ష్మీదేవి సందర్శనం ఉత్తమం.

మకరం
పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధు,మిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈశ్వరారాధన శుభప్రదం.

కుంభం
శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన శుభకరం.

మీనం
సమయానుకూలంగా ముందుకు సాగండి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. శ్రీలక్ష్మీ సందర్శనం ఉత్తమం.

APPSC Group -2 Prelims Results

ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 ప్రాథమిక పరీక్ష (Prelimis) ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసింది. మొత్తం 92,250 మంది మెయిన్స్కు ఎంపికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమ్స్ జరిగిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జులై 28న ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు.ప్రిలిమ్స్కు రాష్ట్ర వ్యాప్తంగా 4,04,037 మంది హాజరయ్యారు. ఏపీ 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో పరీక్ష జరిగింది.

Chanakya Niti: పొరపాటున కూడా ఈ నలుగురిపై కోపం తెచ్చుకోకండి.. వీరితో వాదన చేస్తే మీకే నష్టమంటున్న చాణక్య

చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి ప్రవర్తన అతని వ్యక్తిత్వానికి గుర్తింపునిస్తుంది. మనిషి ప్రవర్తన ఆధారంగా మంచి చెడులను అనుభవించాల్సి ఉంటుంది. మీరు కూడా మీ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలనుకుంటే ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన నియమాలను ఖచ్చితంగా పాటించండి

విజయం సాధించాలనే అహంకారం లేదా తన దగ్గర డబ్బు ఎక్కువ అనే అహంభావం ఉన్న వారి వద్ద లక్ష్మీదేవి ఉండదు. చాణక్యుడి ప్రకారం డబ్బు ఉందనే అహంకారం మీలో ఉంటే.. మీ తెలివితేటలు భ్రష్టు పట్టడానికి ఎక్కువ సమయం పట్టదు. డబ్బు తెచ్చిన అహంకారంతో ఉన్నవారు ఆ డబ్బుని పోగొట్టుకుని పేదవారు కావచ్చు.

స్నేహితుల మీద కోపం తెచ్చుకోకండి: స్నేహంబంధం జీవితంలో చాలా ప్రత్యేకమైనది. సరదాగా, సంతోషంగా ఉండడమే కాదు.. మీ రహస్యాలను పంచుకోవడం వరకు.. మీ స్నేహితులు మీకు అడుగడుగునా మద్దతు ఇస్తారు. స్నేహితులపై కోపం తెచ్చుకోవడం వల్ల మీరు వారిని శాశ్వతంగా కోల్పోవచ్చు. దీనితో.. విశ్వాసం కలిగిన మంచి వ్యక్తి.. విశ్వసనీయ సంబంధం ముగుస్తుంది.

ఆధునిక కాలంలో నేటి యువత తమ వృద్ధ తల్లిదండ్రుల గురించి తరచుగా సిగ్గుపడుతున్నారు. కాలక్రమేణా.. ప్రతి ఒక్కరి శరీరంలో వృద్ధాప్యం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు కూడా ఇదొక రోజు వృద్ధులు అవుతారు. అందుకే మీ పేరెంట్స్‌ని చూసి సిగ్గుపడడం కానీ.. వారిని మార్చుకోవాలని కానీ ఎప్పుడూ ప్రయత్నించకండి. తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించండి.

How To Control Someone: ఇతరులను ఎలా కంట్రోల్ చేయాలి..? ఈ చాణక్య వ్యూహాలు పాటించండి

Chanakya Niti in Telugu: ఎదుటివారిని ఎలా కంట్రోల్ చేయాలో చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పొందుపరిచారు. ఇతరుల స్వభావాన్ని బట్టి.. మనం మాట్లాడాల్సి ఉంటుంది. మనం చెప్పిన మాట వారు వినాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

Chanakya Niti in Telugu: ఇతరులను ఆకట్టుకునేలా మాట్లాడటం ఒక కళ. ఎదుటివారు మన మాట వినేలా ఒప్పించడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. తమ మాటతీరు ఆకట్టుకునే నేర్పు కొందరిలోనే ఉంటుంది. భారతీయ పురాతన తత్వవేత్త ఆచార్య చాణక్యుడికి ఎవరినైనా తన మాట`వినేలా చేసే శక్తి ఉంది. ఎదుటివారిని అలవోకగా తన నియంత్రణలోకి తెచ్చుకునే సామర్థ్యం ఆయనకు ఉంది. ఆయన బోధనలు, సూక్తులు నేటి యువతకు మార్గం దర్శకంగా నిలుస్తున్నాయి. ఆచార్య చాణక్యుడు ఎలాంటి వ్యక్తినైనా ఆకట్టునేలా ఎలా మాట్లాడలో తన నీతిశాస్త్రంలో వివరించారు. మీరు కూడా మీ మాటను ఇతరుల వినేలా.. మీ నియంత్రణలో ఉండాలని కోరుకుంటున్నారా..? అయితే చాణిక్యుని నీతిశాస్త్రంలోని విషయాలను తెలుసుకోండి. ఈ పద్ధతులను అనుసరించి.. ఎదుటివారిని ఆకట్టుకోండి.

ఎదుటివారితో మాట్లాడుతుంటే.. వారు ఎలాంటి వారో క్షణాల్లోనే తెలుసుకోవచ్చు. వ్యక్తి స్వభావాన్ని బట్టి మనం మాట్లాడాలి. అందరికీ ఒకే రీతిలో ఆకట్టుకోలేం. ఇతరులకు మనం ఏ విషయం అయినా చెప్పే ముందు పూర్తి సమాచారం అందించాలి. మనం ఎన్ని చెప్పినా.. కొంతమంది తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు ఇతరులు చెప్పిన మాటలు పట్టించుకోరు. అలాంటి వారి ధోరణిని మార్చాలంటే.. మనకు ముందు విషయ పరిజ్ఞానం ఉండాలి.

అత్యాశ గల వ్యక్తులతో ఇలా..

ముల్లును ముల్లుతోనే తీయాలని అంటారు. అత్యాశ గల వ్యక్తికి ఏదైనా ఆశ చూపితినే లొంగుతారు. వారు మాటలకు అస్సలు పడిపోరు. అంటే డబ్బు లేదంటే వారు కోరుకున్నది ఇచ్చినప్పుడే మీ చెప్పిన విషయాలను అంగీకరిస్తారు.

తెలివి తక్కువ వారితో..

తెలివి తక్కువ వ్యక్తులను ఒప్పించాలంటే.. వారి మనస్తత్వానికి తగిన విధంగా వ్యవహరించాలి. వారికి నచ్చిన పనిని మీరు చేస్తే.. వాళ్లకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అప్పుడే మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు మీరు చెప్పినదల్లా చేస్తారు.

తెలివైన వ్యక్తులతో ఇలా..

తెలివైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వారితో మీరు తెలివిగానే మాట్లాడాలి. తెలివితో మీరు చెప్పే విషయాలను వారు అంగీకరిస్తారు. అతి తెలివి ప్రదర్శించకుండా.. వాళ్లకు నిజాలే చెప్పాలి. మీకు కూడా అన్ని విషయాల గురించి తెలియకపోతే.. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మాట వినరు. మిమ్మల్ని చులకనగా కూడా చూస్తారు.

గర్విష్ఠులతో ఇలా..

అహంకారం ఉన్న వ్యక్తులను ఒప్పించడానికి ముందు మీ గర్వం పక్కనపెట్టాల్సి ఉంటుంది. వారిని మీ నియంత్రణలోకి తెచ్చుకోవాలంటే.. వాళ్లను గౌరవించాలి. వారికి నమస్కరించి.. కాస్త పొగడాలి. వారిని పొగడ్తలతో ముంచేస్తూ.. తల వంచినట్లు ప్రవర్తించాలి. ఇలా చేస్తే వాళ్లే వాళ్లకు తెలియకుండా మీ మాటలకు బానిసలుగా మారిపోతారని చాణక్య నీతి చెబుతోంది. అహంకారులు సాధారణంగా ఎవరి మాట వినరు. తమ ఎంచుకురన్న మార్గమే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. అందుకే వారికి ఇచ్చే విలువను వారి ఇచ్చి.. మీ వ్యవహరాలను చక్కదిద్దుకోవచ్చు.

చాణక్య నీతి: విజయం సాధించాలంటే చాణక్య చెప్పిన 4 మార్గాలు..! ఏంటో తెలుసుకోండి..

చాణక్య నీతి: ఆచార్య చాణక్యుడు మంచి వ్యూహకర్త, ఆర్థికవేత్త. అంతే కాదు.. నిజ జీవితంలో ఎలా వ్యవహరించాలో వివరిస్తూ చాలా పుస్తకాలను రచించారు. అతను చెప్పిన నీతి వ్యాఖ్యల కారణంగా ఆయనకు కౌటిల్యుడు అని పేరు వచ్చింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ గ్రంధంలో అనేక అంశాలను ఆచార్యుడు ప్రస్తావించారు. ఆయన రాసిన చాణక్య నీతి ఇప్పటికీ ప్రజలకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. అయితే జీవితంలో విజయం సాధించాలంటే ఆచార్య చాణక్య 4 మార్గాలను సూచించారు. వాటి గురించి తెలుసుకుందాం.

1. మతం మార్గం విజయాన్ని సాధించడానికి అధర్మ మార్గాన్ని ఎప్పటికీ ఎంచుకోరాదని ఆచార్య చాణక్య సూచించారు. అటువంటి విజయం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా వెళ్లిపోతుందని చెప్పారు. మతం మార్గం కొంచెం కష్టమైనది కావొచ్చు కానీ అది మీ కీర్తిని చాలా దూరం తీసుకువెళుతుంది.

2. క్రమశిక్షణ అవసరం క్రమశిక్షణ లేని వ్యక్తులు జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆచార్య చెప్పారు. విజయం సాధించాలనుకుంటే ప్రతి ఒక్క నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమయాన్ని అస్సలు వృథా చేయరాదన్నారు. క్రమశిక్షణ లేకుంటే జీవితంలో విజయం సాధించడం అసాధ్యమన్నారు.

3. ఓటమికి భయపడవద్దు.. ఒక వ్యక్తి లక్ష్యాన్ని సాధించే క్రమంలో చాలాసార్లు ఓటమిని ఎదుర్కోవలసి వస్తుంది కానీ దాని గురించి ఎప్పుడు భయపడవద్దని ఆచార్య చాణక్య సూచించారు. ఓడిపోవడం కూడా మీ అభ్యాస ప్రక్రియలో ఒక భాగమని చెప్పారు. జీవితంలో సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి దానికోసం నిత్యం కష్టపడాలని తెలిపారు.

4. సోమరితనం విడనాడాలి సోమరితనం ఉన్న వ్యక్తి పనిని పలుమార్లు వాయిదా వేస్తాడు. కానీ అది సరైన పద్దతి కాదని ఆచార్య చాణక్య సూచించారు. మీరు జీవితంలో విజయం సాధించాలంటే సోమరితనం విడనాడాలని చెప్పారు. సోమరితనం వల్ల ఒక వ్యక్తి ఎప్పుడు విజయం సాధించలేడని తెలిపాడు. అంతేకాదు సోమరితనాన్ని అతి పెద్ద శత్రువుగా భావించారు.

Andhra Pradesh: అయ్యో పాపం.. కూల్ డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగిన రెండేళ్ల బాలుడు.. తీవ్ర విషాదం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కూల్ డ్రింగ్ అనుకుని రెండేళ్ల బాలుడు పెట్రోల్ తాగిన సంఘటన ఆ ఇంట్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషాదకర ఘటన నెల్లూరు నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఇరుగాళమ్మ కట్టకు చెందిన షేక్ కరిముల్లా, అమ్ము దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరిముల్లా చికెన్ దుకాణం నడిపిస్తుండగా..అమ్ములు చేపల దుకాణంలో పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ హాయిగా జీవిస్తున్నారు.

అయితే, ఈ నెల 7వ తేదీ సాయంత్రం అమ్ము ఇరుగాళమ్మ ఆలయం దగ్గర పనిచేస్తుండగా…ఆమె కొడుకు కాలేషా తన వద్దే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ ఒక బాటిల్లో ఉన్న పెట్రోల్ చూసిన బాలుడు.. అది కూల్ డ్రింక్ అనుకుని తాగాడు.. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన తల్లి బాలుడిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. బాధిత తల్లిదండ్రులు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మరణంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

Life style: కాళ్లలో కనిపించే ఈ లక్షణాలు.. లివర్‌ డ్యామేజ్‌కు సంకేతాలు..

శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలు ముందస్తు వ్యాధులకు సంకేతాలుగా నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల వ్యాధులకు సంబంధించి శరీరం ముందుగానే మనల్ని ఈ లక్షణాల ద్వారా అలర్ట్ చేస్తుంది.

అలాంటి వాటిలో కొన్ని లక్షణాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మారుతోన్న జీవనశైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా లివర్‌ సంబంధిత వ్యాధులతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే లివర్‌ సమ్యలను ముందుగానే గుర్తిస్తే.. చికిత్స కూడా త్వరగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ లివర్‌ వ్యాధిని ముందుగా గుర్తించే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కాలేయం దెబ్బతినడం ప్రారంభమైనప్పుడు. పాదాలు, చీలమండలు, అరికాళ్లు ఉబ్బుతాయి. ఇవి కాలేయ సంబంధిత వ్యాధుల సంకేతాలు కావచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ వ్యాధి కారణంగా కాలేయ వ్యాధి సిర్రోసిస్‌తో పాటు కాలేయ క్యాన్సర్‌గా మారుతుంది. దీని కారణంగా కాలు వాపు ప్రారంభమవుతుంది.

* హెపటైటిస్ వ్యాధి ప్రాథమిక లక్షణాల్లో కాళ్లలో దురద కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు కాలేయ వ్యాధి ఉన్న వారికి చేతులు, కాళ్ల చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దురద ఎక్కువగా వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

* లివర్‌ వ్యాధి ప్రారంభ లక్షణాల్లో అరికాళ్లలో నొప్పి కూడా ఒకటని పుణులు చెబుతున్నారు. కాలేయం సరిగా పనిచేయని సమయంలో కాళ్లలో ద్రవాలు పేరుకు పోవడం ప్రారంభమవుతాయి. దీంతో అరికాళ్లు ఉబ్బడంతో పాటు నొప్పి కూడా మొదలవుతుంది. కాబట్టి ఈ లక్షణం కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత చికిత్స చేయించుకోవాలి.

* ఇక లివర్‌ వ్యాధికి అత్యంత సాధారణ కారణాల్లో హెపటైటిస్‌ కూడా ఒకటి. డయాబెటిక్ పేషెంట్‌కు కాలేయంలో ఎలాంటి సమస్య వచ్చినా పాదాలలో జలదరింపు, తిమ్మిరి మొదలవుతుంది. డయాబెటిక్ రోగులలో ఈ సమస్య తరచుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

BREAKING: పవన్ కల్యాణ్‌కు ఈసీ నోటీసులు.. వివరణ ఇవ్వాలని 48 గంటల డెడ్ లైన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల అనకాపల్లిలో నిర్వహించిన సభలో పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు.

ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్ పై చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని పవన్‌ను ఈసీ ఆదేశించింది. కాగా, పవన్ కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

ముంబైకి గుడ్‌బై.. ఎవరూ ఊహించని జట్టులో చేరనున్న రోహిత్‌ శర్మ?!

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ముంబై ఇండియన్స్‌ జట్టును వీడనున్నాడా? ఐపీఎల్‌-2025 ఆరంభానికి ముందై ఎంఐతో తెగదెంపులు చేసుకోనున్నాడా?.. అవమానాన్ని తట్టుకోలేక ఫ్రాంఛైజీకి గుడ్‌బై చెప్పాలనుకుంటున్నాడా?..

ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌ ఆరంభమైన నాటి నుంచే హిట్‌మ్యాన్‌ గురించి క్రీడా వర్గాల్లో ఈ చర్చ నడుస్తూనే ఉంది.

కాగా ఐపీఎల్‌-2024కు ముందు గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి హార్దిక్‌ పాండ్యాను భారీ ధరకు ట్రేడ్‌ చేసుకున్న ముంబై ఇండియన్స్‌.. రోహిత్‌ శర్మపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఏకంగా ఐదుసార్లు జట్టుకు ట్రోఫీ అందించిన రోహిత్‌ను కాదని పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది.

ఇందుకు బదులుగా రోహిత్‌ ఫ్యాన్స్‌ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ముంబై ఫ్రాంఛైజీ తీసుకున్న నిర్ణయంపై తమకున్న కోపాన్ని పాండ్యాపై నేరుగానే ప్రదర్శిస్తున్నారు అభిమానులు. మైదానంలో అతడిని హేళన చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు. రోహిత్‌ వద్దని వారించినా వారు వినే స్థితిలో లేరు.

ఇదిలా ఉంటే.. రోహిత్‌ శర్మ పట్ల కూడా హార్దిక్‌ ప్రవర్తన కాస్త భిన్నంగానే ఉంది. పదే పదే అతడి ఫీల్డింగ్‌ పొజిషన్‌ మార్చడంతో పాటు ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సేవలను కూడా సరిగ్గా వాడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

ఇక ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడి.. నాలుగో మ్యాచ్‌లో గెలిచినా
రోహిత్‌ ముఖంలో పెద్దగా సంతోషం కనిపించకపోవడం
జట్టులోని విభేదాలను తేటతెల్లం చేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.

ఎవరూ ఊహించని జట్టులోకి రోహిత్‌?
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రచారం తెర మీదకు వచ్చింది. ఐపీఎల్‌-2025 మెగా వేలంలో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు రోహిత్‌ శర్మను సొంతం చేసుకోనుందని అందులోని సారాంశం. ఈ వార్త పుట్టుకు రావడానికి ఓ కారణం ఉంది.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా లక్నో కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. ఐపీఎల్‌లో మీరు ఏ ఆటగాడిని సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఇంటర్వ్యూయర్‌ అడగ్గా.. ”ఒక్కరి పేరు మాత్రమే చెప్పాలా?

ఎవరి పేరైనా చెప్పవచ్చా? నేను ఎవరి పేరు చెబుతానని మీరు అనుకుంటున్నారు” అని లాంగర్‌ తిరిగి ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా.. ”మేము చాలా మంది పేర్లు అనుకుంటున్నాం గానీ రోహిత్‌ శర్మను మీరు జట్టులో చేర్చుకోగలరా?” అని పేర్కొన్నారు.

దీంతో ఆశ్చర్యపోయిన లాంగర్‌.. ”ఏంటీ రోహిత్‌ శర్మనా? ఒకే అతడిని ముంబై నుంచి మేము ట్రేడ్‌ చేసుకుంటాం. నాకు తెలిసి ఈ డీల్‌ మీరే కుదర్చగలరు” అని సరదాగా సమాధానమిచ్చాడు. ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. కాగా 2011లో ముంబై ఇండియన్స్‌ జట్టులో చేరిన రోహిత్‌ శర్మ 13 సీజన్లుగా అదే జట్టుకు ఆడుతున్నాడు. కెప్టెన్‌గా ఐదుసార్లు టైటిల్‌ గెలిచాడు.

ఐదు వేల సంవత్సరాల నాటి ఆకులు రాలని మహా వృక్షం..!

శ్రీ కృష్ణ పరమాత్మ దేవ లోకం నుండి తెచ్చి సత్యభామకు బహూకరించిన పారిజాత వృక్షం ఉత్తర ప్రదేశ్ లో నీ బారబంకి జిల్లాలో కింటూర్ అనే గ్రామంలో ఉంది. ప్రపంచంలో కెల్లా అతి విలక్షణమైన వృక్షం గా దీనిని వర్ణిస్తారు శాస్త్రజ్ఞులు.ప్రపంచం లో ఏ వృక్షానికి లేని ప్రత్యేకత దీని సొంతం.

దీనికి ఏ విధమైన పండ్లు కాయవు. ఈ చెట్టు క్రింద భాగంలో ఆకులు చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. పై భాగాన ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి. దీని పువ్వులు కూడా బంగారు ,తెలుపు రంగులో చూడగానే ఆకర్షిస్తాయి.ఇవి జూన్, జూలై మాసములలో పూస్తాయి. వీటి సువాసన చాలా దూరం వరకు వస్తుంది.

ఈ వృక్షం యొక్క వయస్సు 1000 నుంచి 5000 సంవత్సరాలు గా చెబుతారు.దీని చుట్టుకొలత 50 అడుగులు,ఎత్తు 45 అడుగులుగా చెప్ప బడుతుంది.ఈ వృక్షం యొక్క ఇంకో ప్రత్యేకత ఏమిటంటే దీని ఆకులు కానీ,కొమ్మలు కానీ ఎండిపోయి రాలవు.వాటంతట అవే కుచించుకుపోయి కాండంలో కలసిపోతాయి.

బాలుడిపై దూకిన పులి, ఇంతలో ఏమైందంటే… వైరల్ వీడియో…!

ఈ భూమి మీద ప్రమాదకర జంతువులలో పులి ఒకటి. దానితో ఆటలు ఆడటం అనేది ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే. అందుకే పులిని చాలా మంది దూరం నుంచి చూడటానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. దాని దగ్గరకు వెళ్ళే సాహసం మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోను చేయరు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే పులితో ఆటలు ఎంత ప్రమాదకరమో అర్ధమవుతుంది.

ఐర్లాండ్‌లోని డబ్లిన్ జూలో ఏడేళ్ళ బాలుడు జూ కి వెళ్ళాడు. ఈ సమయంలో గాజు గోడకు ఆనుకుని ఉండి పిల్లాడు ఫోజులు ఇస్తున్నాడు. ఇది గమనించిన ఒక పులి, అతని మీద దూకడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇది వీడియో లో స్పష్టంగా కనపడుతుంది. తెలివిగా అక్కడికి వచ్చిన పులి, ఒక్కసారిగా బాలుడి మీదకు దూకడానికి ప్రయత్నిస్తుంది. అయితే అడ్డుగా గాజు గోడ ఉండటంతో పులి ఆగిపోతుంది.

ఈ నెల 23 న ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అయితే పులి రావడాన్ని మాత్రం బాలుడు గ్రహించాడు. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న ఆ బాలుడు పులి వచ్చి దూకగానే అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. వీడియో చివర్లో అతను నవ్విన నవ్వే, అతనిలో ఏ స్థాయిలో ధైర్యం ఉందో స్పష్టంగా చెప్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటనలో బాలుడు గాయపడలేదు.

 

ఒక్క అరటిపండు రేటు రూ.85 లక్షలు… ఎందుకో తెలుసా ?

ఇటీవల మియామీ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీలో ఇటలీకి చెందిన ప్రముఖ కళాకారుడు మౌరీజియో క్యాటెల్యాన్ కళాఖండాన్ని సృష్టించాడు. దీనికి ‘కమెడియన్’ అనే పేరు పెట్టాడు. అలాగే రేటు రూ.85 లక్షలు ఫిక్స్ చేశారు. ఇందులో అద్భుతమేమీ లేదు. సాధారణమైన అరటిపండు, టేపు మాత్రమే. కాకుంటే వాటిని అమూల్యమైన కళాఖండాల మధ్య ఉంచడంతో వీటికి క్రేజ్ వచ్చింది. అయితే ఊహించని విధంగా రూ.85 లక్షలకు అమ్ముడుపోయింది. పైగా ఈ ఆర్ట్‌ వర్క్‌ను ప్రదర్శనకు పెట్టిన ఆర్ట్‌ గ్యాలరీ.. ఈ పీస్‌కు ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను కూడా జారీ చేయనున్నట్టు తెలిపింది. అయితే దీన్ని మౌరిజియా కాటెలాన్‌ అనే కళాకారుడు ప్రదర్శనకు పెట్టగా ఎంతోమంది దాన్ని కొనలేకపోయామని నిరాశ చెందుతూ దానిముందు నిల్చుని ఫొటోలు తీసుకుని సంతృప్తి చెందుతున్నారు.

ఇక ఎగ్జిబిషన్ చివరి రోజు కావడంతో ఈ కళాకండాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. అయితే గుంపులో గోవింద లాగా ఓ వ్యక్తి ఆ అరటిపండును తీసుకుని తినేశాడు.అతడిపేరు డేవిడ్ డటూనా అని, అతడో డ్రామా ఆర్టిస్టు అని తెలిసింది. డేవిడ్ డటూనా అక్క‌డ‌కు వ‌చ్చి గబుక్కున గోడకు అతికించిన ఆ అరటిపండును తీసుకొని ఆరగించాడు. డేవిడ్‌ చేష్టకు అక్కడి నిర్వాహకులు షాక్‌ అయితే, చూసేందుకు వచ్చిన ప్రజలు నవ్వు ఆపుకోలేకపోయారు. అయితే, డేవిడ్‌పై నిర్వాహకులు ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోలేదు. కాకపోతే అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని అతడిని ఆదేశించారు. అదే గోడపై అదే చోట టేప్‌తో మరో అరటి పండును అతికించినా అది అమ్ముడవలేదు.

ఆ దేశ జనాభా కేవలం 23 మంది… అక్కడికి వెళ్ళాలి అంటే వీసా కూడా కావాలి…!

ఒక దేశం అంటే ఎంత మంది ఉంటారు…? వంద కోట్ల నుంచి లక్షల వరకు జనాభా ఉంటారు. దేశాల గురించి ప్రస్తావన వస్తే కచ్చితంగా ముందు వినపడేది జనాభా యెంత అనే ప్రశ్న. చాలా దేశాలు జనాభాతోనే పాపులర్ అయ్యాయి. పెద్ద పెద్ద దేశాల్లో అయితే అక్కడ రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాల్లో లక్షల నుంచి వేల వరకు జనాభా ఉంటారు. కాని ఒక దేశంలో కేవలం 23 మంది ఉంటారు. అవును మీరు చదివింది నిజం… ఒక పెద్ద కుటుంబం అంత మందే అక్కడ దేశం… ఇంతకి ఆ దేశం ఏంటి అంటారా…? ఆస్ట్రేలియా దేశంలో ఉండే హట్ రివర్ ప్రావిన్స్.

1970లో లియోనార్డ్ కాస్లీ తన వ్యవసాయ క్షేత్రాన్ని ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించాడు. ఇక అప్పటి నుంచి ఈ దేశానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది… ఒక ప్రత్యేక జెండా ఉంటుంది, ప్రత్యేక కరెన్సీ కూడా ఉంటుంది. ఆస్ట్రేలియా నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే… కచ్చితంగా వీసా కావాలి. అక్కడి నుంచి ఏ దేశం వెళ్ళాలి అన్నా సరే వీసా కావాల్సి ఉంటుంది. 23 మంది జనాభా మాత్రమె ఉండే ఆ దేశంలో కేవలం అయిదు ఇళ్ళు మాత్రమే ఉంటాయి. గోధుమ ఉత్పత్తి కోటాకు సంబంధించిన వివాదంపై అతను ఆస్ట్రేలియా నుండి విడిపోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఈ దేశం ఏర్పాటు జరిగింది.

ఇక తన కుటుంబానికి ఆయన బిరుదులు కూడా ఇచ్చుకున్నాడు. ఆస్ట్రేలియా రాష్ట్రంలోని నార్తాంప్టన్ పట్టణానికి సమీపంలో ఉంది. ఇది 75 చదరపు కిలోమీటర్ల (29 చదరపు మైళ్ళు) వైశాల్యాన్ని కలిగి ఉంది. అయితే ఈ దేశాన్ని ఆస్ట్రేలియా గాని ఇతర ఏ దేశాలు దేశంగా గుర్తించలేదు. ఆస్ట్రేలియా హైకోర్టు మరియు వెస్ట్రన్ ఆస్ట్రేలియా సుప్రీంకోర్టు ఇది ఆస్ట్రేలియా చట్టాలకు లోబడి ఉండదని చెప్పడం విశేషం. అయినా సరే అక్కడి ప్రజలు స్వతంత్రంగా బ్రతకడానికే ఎక్కువగా ఇష్టపడ్డారు. ఫిబ్రవరి 2017 లో, 91 సంవత్సరాల వయస్సులో మరియు 45 సంవత్సరాలు పాలించిన తరువాత, కాస్లీ తన చిన్న కుమారుడు, ప్రిన్స్ గ్రేమ్కు సింహాసనాన్ని అప్పగించాడు. కాస్లీ 13 ఫిబ్రవరి 2019 న మరణించారు.

హిట్లర్ ఆమెను అంత ప్రేమించాడా…? చివరికి ఆమెతోనే చనిపోయాడు…!

అడాల్ఫ్ హిట్లర్” అతని గురించి వింటే ఒకప్పుడు ప్రపంచం మొత్తం వణికిపోయేది. అతని క్రూరత్వం గురించి ప్రపంచానికి పెద్దగా పరిచయం కూడా చెయ్యాల్సిన పని లేదు, సామాజిక మాధ్యామాలు ప్రచారాలు ఏమీ లేకుండానే హిట్లర్ ఎంత భయంకరమైన వ్యక్తి అనేది అప్పట్లోనే నోటి మాట ద్వారా ప్రపంచం తెలుసుకుంది. అలాంటి వ్యక్తి ఒక గొప్ప ప్రేమికుడు అంటుంది చరిత్ర… తన భార్యను తను ఎంత ప్రేమిస్తాడో చరిత్ర చెప్తుంది. హిట్లర్ కంటే ఇవా బ్రువాన్ 23 ఏళ్ల చిన్నది అయిన ఆమె… హిట్లర్ ని ఎంతగానో ప్రేమించింది.

ఇవా 17ఏళ్ల వ‌యసున్న‌ప్పుడు హిట్ల‌ర్ ని ఆమె కలవగా అప్పుడు హిట్లర్ వయసు 40 ఏళ్ళు. ఆమె ఫొటోగ్ర‌ఫీ అసిస్టెంట్‌గా ప‌నిచేసేది. మొద‌టిచూపులోనే ప్రేమ‌లో ప‌డిపోయింది. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పింది. అందుకు ఇంట్లో వాళ్ళు అంగీకరించలేదు. కాని ఆమె మాత్రం పట్టు వీడలేదు. తాను ఎంతగానో ప్రేమించే హిట్లర్ ని వివాహం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఆయన కోసం 16 ఏళ్ళు ఎదురు చూసింది. ఆ తర్వాత తర్వాత హిట్లర్ ఆమెను ఇష్టపడ్డాడు. ఆమెఉ తనకు కాళీ దొరికిన సమయంలో ఎంతగానో ప్రేమించేవాడు. అయితే ఆమెకు కొన్ని షరతులు విదించెవాడు.

ఆమె చుట్టూ ఎప్పుడు కొంత మంది యువకులను నియమించే వాడు. ఆమె మద్యం తాగడం, ఇతరులతో మాట్లాడటం, వినోదాలకు అలవాటు పడటం వంటివి హిట్లర్ కి నచ్చేవి కాదట. ముందు ఆమెను యూదు కుటుంబానికి చెందిన వ్యక్తి అని భావించిన హిట్ల విచారణ చేసి ఆమె ఆర్యులు అని తెలుసుకున్న తర్వాత వివాహం చేసుకున్నాడు. అది కూడా ఆయన చివరి రోజుల్లో ఆత్మహత్య చేసుకునే ముందు ఆమెను పెళ్లి చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన తన డైరీలో కూడా ప్రస్తావించారు. అలాగే తాము ఇద్దరినీ ఎక్కడ ఖననం చెయ్యాలో కూడా వీలునామాలో రాసి చనిపోయాడు హిట్లర్. జంట ఏప్రిల్ 29, 1945 న ఇద్ద‌రూ క‌లిసి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

ఆర్టీసీ బస్సుల నెంబర్ ప్లేట్ లో ‘Z’ అనే అక్షరం ఎందుకుంటుందో తెలుసా?

ఆర్టీసీ బస్సుల నెంబర్ ప్లేట్ లో Z అనే అక్షరాన్ని ఎప్పుడైనా గమనించారా? గమనిస్తే.. ప్రతి ఆర్టీసీ బస్సు మీద ఆ అక్షరం ఎందుకుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీని గురించి తెలుసుకోవాలంటే మనం 87 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించిన నిజాం రాజులు… హైదరాబాద్ రాష్ట్రంలో రవాణా కోసం రోడ్డు, రైలు మార్గాలను వేశారు. దాని కోసం నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్ పోర్టు అనే ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా 1932 లో మొదటి సారిగా హైదరాబాద్ లో సిటీ బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఆ బస్సులను అప్పుడు హైదరాబాద్ స్టేట్ ను పాలిస్తున్న చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్… తన తల్లి జహ్రా బేగం పేరు మీద నమోదు చేయించాడు. అందుకే… తన తల్లి పేరు వచ్చేలా Z అనే పేరు వచ్చేలా బస్సు నెంబర్లను రిజిస్టర్ చేయించారు. దీంతో కొత్త బస్సును ప్రవేశపెట్టినప్పుడల్లా.. అలాగే Z వచ్చేలా నెంబర్ ప్లేట్ ను తయారుచేసేవాళ్లు. ఆ సంప్రదాయం అలాగే కొనసాగేది.

తర్వాత నిజాం.. హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వానికి అప్పగించే సమయంలో ఓ కండిషన్ పెట్టాడు. హైదరాబాద్ సంస్థానం పరిధిలో ప్రజా రవాణా కోసం ఆర్టీసీ ద్వారా ఉపయోగించే ఏ బస్సుకైనా Z అనే అక్షరాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలని ప్రభుత్వానికి తెలిపాడు. దీంతో ఆ సంప్రదాయం అలాగే ఇప్పటికీ కొనసాగుతూ వస్తున్నది. అందుకే ఇప్పటికీ.. తెలంగాణ, ఏపీల్లోని ఆర్టీసీ బస్సుల నెంబర్ ప్లేట్ లో Z అనే అక్షరం ఖచ్చితంగా ఉంటుంది.

బైక్ నడుపుతున్న కుక్క… వైరల్ అవుతున్న వీడియో..

చాలా రోజుల క్రితం ఓ శున‌కం బైక్ న‌డుపుతున్న వీడియో ఒక‌టి వైర‌ల్ అయిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ శునకం దాన్ని మించిపోయింది. నిజంగానే ఈ కుక్క మామూలుది కాదు. జంతువులకు సాధ్యంకాదు అన్న పనిని చేసి చూపించి ఔరా అనిపించింది. వాస్త‌వానికి అప్పటి కుక్క డబుల్ రైడింగ్ చేస్తే, ఈ కుక్క ఏకంగా ట్రిపుల్ రైడింగ్ చేసింది. ఈ ఘటన బ్రెజిల్ లో జరిగినట్టు తెలుస్తుండగా, ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న విషయం మాత్రం తెలియరాలేదు.

వీడియో మాత్రం వైరల్ అవుతోంది. నేషనల్ హైవేపై, దాని యజమాని, మరొకరు వెనుక కూర్చుని ఉండగా, ఈ శునకం దర్జాగా బైక్ హ్యాండిల్స్ పట్టుకుని, ముందు కూర్చుని బైక్ ను నడుపుతోంది. ఈ వీడియోను జో బర్గ్ అనే యువతి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. కుక్కకు హెల్మెట్ ఎక్కడుందని కొందరు, ఈ తరహా పిచ్చి పనులు చేయవద్దని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

1000 ఏళ్ల మమ్మీ కధ… మమ్మీలుగా మారే పద్ధతి తెలిస్తే భయం పుట్టాల్సిందే….!!!

మమ్మీ లు అనగానే మనకి గుర్తుకు వచ్చేది మమ్మీ సినిమాలో ఉండే ఈజిప్ట్ మమ్మీ లు. ఒక చనిపోయిన దేహానికి రకరకాల లేపనాలు పూసి వాటి శరీరం దెబ్బతినకుండా భద్రంగా జాగ్రత్తపరుస్తారు. మరి కొన్ని మమ్మీలు శిక్షలో భాగంగా పూడ్చి పెట్టబడుతాయి. కానీ తాజాగా చైనా లో దొరికిన ఓ మమ్మీ కధ వేరుగా ఉంది. ఆ మమ్మీ ని పూర్తిస్థాయిలో పరిశీలించిన పరిశోధకులకి కళ్ళు చెదిరే వాస్తవాలు బయటపడ్డాయి.

చైనాలో ఓ బౌద్ధ సన్యాసికి చెందిన మమ్మీ ఒకటి బయటపడింది.ముందుగా అది పద్మాసనంలో కూర్చుని ఉన్న బొమ్మ అనుకున్నారు. కానీ పరిశోధించి తరువాత ఒక్కొక్క నిజం తెలుసుకుని ఆశ్చర్య పోయారు. ఆ బొమ్మని పూర్తిగా స్కాన్ చేయగా లోపల అస్థిపంజరం ఉన్నట్లుగా గుర్తించారు. అది దాదాపు 1000 ఏళ్ల నాటి మమ్మీ అని గుర్తించారు. ఇక్కడ ఆశ్చర్యపడే విషయం ఏమిటంటే…

ఆ కాలంలో బౌద్ధ సన్యాసులు తామంతట తాముగా మమ్మీలు గా మారే వారట. అప్పట్లో ఆ పద్ధతిని ఆచారంగా భావించే వారట. ఎంతో దీక్షతో పట్టుదలతో ,అతి కష్టం మీద జరిగే ప్రక్రియ అంటున్నారు పరిశోధకులు. అలా మారడానికి గాను వాళ్ళు ముందుగా కొవ్వు కరగడానికి ఒక 1000 రోజుల పాటు కేవలం డ్రై ఫ్రూట్స్ తీసుకునే వారట. మరో వెయ్యి రోజులు వృక్షాల వేళ్ళు బెరడు మాత్రమే తీసుకునే వారట.ఇలా చేయడం వలన శరీరంలో ఉండే తేమ , ఆమ్లాలు బయటకి వచ్చి శరీరం నిర్జీవంగా అయ్యేదట. ఆ తరువాత ఇలాంటి ప్రతిమలోకి వెళ్లి బయట నుంచీ గాలి వచ్చేలా మార్గాన్ని చేసుకుని , ఒక గంట ఏర్పాటు చేసుకుని వారట. చబిపోయే వరకూ ఆ గంట మొగుతూ ఉంటుందని, అప్పటి వరకూ అలా ధ్యానంలోనే ఉండేవారని చనిపోయాక గంట మొగడం ఆగిపోతుందని పరిశోధకులు తెలిపారు.

త‌లుపులు, తాళాలు లేని ఊరు.. ఆశ్చ‌ర్య‌పోయే నిజాలు..!

ఇది ఒక గ్రామం. ఈ ఊరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒకటి కూడా లేవు. కేవలం ప్రజల ఇళ్లకే కాకుండా పోస్టాఫీసు, ఆసుపత్రి తదితర ప్రభుత్వ భవనాలకు కూడా ఎటువంటి ద్వారాలు ఉండవు. మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు. ప్రజలు పక్క ఊరికి వెళ్లినా కూడా ఇంటికి తలుపులను బిగించి వెళ్లరు. గొళ్లెం, తాళాల ఊసే లేదు. ఈ గ్రామం మన దేశంలోనే ఉంది.
ఆ ఊరే `శనిసింగనాపూర్`. శింగనాపూర్ షిరిడి మరియు ఔరంగాబాద్ మధ్యలో నెలకొని ఉంది. అక్కడ ఉన్న ఒక దైవం తమ సంపదను రక్షిస్తోందన్న నమ్మకమే ప్రజలను ఇంటికి తలుపులు చేయించడం లేదు. ఒకవేళ దొంగ తనం చేస్తే అక్కడ వుండే శనిదేవుడు శనిరూపంలో శిక్షిస్తాడని భక్తులనమ్మకం. అంత పవర్ ఆ శనిసింగనాపూర్ శనిదేవుడిది. మహారాష్ట్రలోని, శని శింగనాపూర్ లో ఉన్న ఈ ఆలయం శని దేవుని ముఖ్య పుణ్యక్షేత్రం.

ఇక్కడ ఆ పరమాత్ముడు అరుబయటనే ఉంటాడు. ఎటువంటి ప్రత్యేక దేవాలయం ఉండక పోవడం ఇక్కడ ఉన్న విశిష్టత. శని శింగనాపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనము లేదా దోపిడి జరగలేదు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకుని చనిపోయారు. ఇతరులు చాలామంది దీర్ఘకాల అనారోగ్యం, మానసిక సమతుల్యత లేకపోవడం వంటి వివిధరకాల శిక్షలు అనుభవించారు. శనీశ్వరుని కృపకు పాత్రులు కావాలనుకునే వేలమంది భక్తులు ప్రతిరోజూ ఈ శని శింగనాపూర్‌ను దర్శిస్తారు. ఇది ఇక్క‌డ విశిష్ట‌త‌..!

ఆ పదిపైసలు బిళ్ళ ఖరీదు..10 కోట్లు..స్పెషల్ ఏమిటంటే…!!!!

మీరు చదివింది నిజమే, కేవలం ఒకే ఒక్క పదిపైసలు బిళ్ళ కోట్ల రూపాయలు పలికింది. పదిపైసలు బిళ్ళ కోట్లు పలకడం ఏమిటి అంటూ ఇంట్లో ఎక్కడో ఉన్న పాత పదిపైసలు బిళ్ళలు వెతికే పని మాత్రం పెట్టుకోకండి. ఆ పదిపైసలు బిళ్లలో ఒక స్పెషాలిటీ ఉంది ఏమిటా స్పెషాలిటీ అంటే. అమెరికాలోని షికాగో లో ఓ వేలం పాట నిర్వహించారు. ఈ వేలంపాటలో ఎన్నో పురాతన వస్తువులు అందుబాటులో ఉంచారు నిర్వాహకులు.

అక్కడ ఉన్న వస్తువులు అన్నిటిలో అందరూ కేవలం ఒక పదిపైసలు బిళ్ళని దక్కించుకోవాలని ఆరాట పడుతున్నారు. ఎవరికీ వారు పోటీ పడుతున్న సమయంలో ఎక్కడి నుంచీ వచ్చాడో కానీ ఒక పెద్దాయన అందరికన్నా ఎక్కువ మొత్తంలో పాడి ఆ పదిపైసలు దక్కించుకున్నాడు. ఇంతకీ ఆ పెద్దాయన ఎంత మొత్తం పాట పాడాడో తెలుసా. అక్షరాలా 10 కోట్లు..ఆ వస్తువు ఖరీదు ఎందుకు అంత రేటు పలికిందంటే.

ఆ బిళ్ళ సుమారు 1894 లో ముద్రించారట అంతేకాదు అలాంటి బిళ్ళలు కేవలం 24 మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయని, ఈ నాణేలని డైమ్ అంటారని తెలిపారు నిర్వాహకులు. వీటి వులువ అప్పట్లో చాలా అధికంగా ఉండేదట కేవలం ధవంతుల ఇళ్ళలో మాత్రమే ఈ నాణాలు ఉండేవని అందుకే దీని ధర కోట్లు పలికిందని అంటున్నారు చరిత్ర కారులు.

అవినాష్ రెడ్డికి బెయిలు రద్దైతే..?

మాజీ మంత్రి, ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా చిన్నాన్న అయిన వైఎస్ వివేకా హత్య కేసు రానున్న ఏపీ ఎన్నికలలో ప్రధాన అజెండాలలో ఒకటి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా కడప జిల్లాలో మాత్రం వివేకా హత్య కేసు ప్రధాన ఎన్నికల అంశంగా మారింది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా కడప లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రంగంలో ఉన్నారు. దీంతో కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం మొత్తం వైఎస్ వివేకా హత్య కేసు చుట్టూనే సాగుతున్నది. వైఎస్ షర్మిలకు మద్దతుగా వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత కూడా ప్రత్యక్ష ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ తన తండ్రి హంతకుడు అవినాష్ రెడ్డే అంటూ నేరుగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు.

దీంతో అనివార్యంగా వైసీపీ కూడా వివేకా హత్యపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో పడింది. వైఎస్ అవినాష్ రెడ్డి కానీ, ఇతర నేతలు కానీ ఇస్తున్న వివరణలు ఏ మాత్రం హేతుబద్ధంగా ఉండటం లేదు. ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా మేనమామ అయిన రవీద్రనాథ్ రెడ్డి బహిరంగంగానే వేదికపై అవినాష్ ను పక్కన పెట్టుకునే చెప్పిన విషయాలు వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయాన్ని బట్టబయలు చేశాయి. సాక్ష్యాల నాశనం జరుగుతుంటే పాపం అవినాష్ ఏం చేయాలో తెలియక చూస్తూ నిలబడిపోయారంటూ రవీంధ్రనాథ్ రెడ్డి చేసిన సమర్థింపు వివేకాహత్య కేసులో అవినాష్ ప్రమేయం ఉందన్న నిర్ణారణకు అందరూ వచ్చేలా చేసింది.

ఇదంతా ఒకెత్తయితే సీబీఐ వివేకా హత్య కేసులో సాక్షుల భద్రతపై వ్యక్తం చేసిన ఆందోళన అవినాష్ బెయిలు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయన్న సంగతిని తేటతెల్లం చేసింది. నిజంగానే అవినాష్ బెయిలును కోర్టు రద్దు చేస్తే.. వైసీపీ పరిస్థితి ఏమిటి? అన్న ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అవినాష్ బెయిలు రద్దై ఆయన జైలుకు వెడితే.. ఇక కడప జిల్లాలో విజయంపై వైసీపీ ఆశలు వదిలేసుకోవలసిందేనన్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణులలోనే వ్యక్తం అవుతోంది. అన్నిటికీ మించి అవినాష్ బెయిలు రద్దై జైలుకు వెడితే కడప లోక్ సభ బరిలో అవినాష్ స్థానంలో మరో అభ్యర్థిని వైసీపీ నిలబెట్టాల్సి ఉంటుంది. అదే జరిగితే వైసీపీకి జిల్లా వ్యాప్తంగా తేరుకోలేని నష్టం వాటిల్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్కార్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నదన్న విషయాన్ని సర్వేలన్నీ చెబుతున్నాయి. అయితే రాయలసీమలో మరీ ముఖ్యంగా కడప జిల్లాలో మాత్రం ఇప్పటికీ మొగ్గు వైసీపీ వైపు ఉంది. సర్వేలు సైతం అదే చెబుతున్నాయి. కానీ షర్మిల కడప లోక్ సభ బరిలో దిగడం, వైఎస్ వివేకాహత్య వెనుక ఉన్నది అవినాష్ రెడ్డే అని బహిరంగంగా విమర్శలు చేయడమే కాకుండా, వైఎస్ బిడ్డ వైపు ఉంటారా, వివేకా హంతకుడి వైపు ఉంటారా? అంటూ ఆమె ప్రజలకు సంధిస్తున్న ప్రశ్నాస్త్రం కడప లోక్ సభ నియోజకవర్గంలో పరిస్థితులను మార్చేసే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అవినాష్ బెయిలు రద్దు అయ్యి అరెస్టయితే మాత్రం వైసీపీ కడపపై ఆశలు వదిలేసుకోవలసిందేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మ‌న దేశంలో ఉన్న టాప్ 5 డేంజ‌ర‌స్ రోడ్లు ఇవే..!

ప‌ర్వ‌తసానువుల్లో ఉండే రోడ్లంటే అంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. ఆద‌మరిచి డ్రైవ్ చేస్తే వాహ‌నం లోయ‌లోకి ప‌డిపోతుంది. క‌నుక అలాంటి రోడ్ల‌పై ప్ర‌యాణించేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

ఎటు చూసినా ప‌చ్చ‌ని ప్ర‌కృతి.. ర‌మ‌ణీయ‌మైన వాతావ‌ర‌ణం.. మేఘాల్లో క‌లుస్తున్నాయా అన్న‌ట్లుగా ఉండే ఎత్తైన ప‌ర్వతాలు.. వాటిపై పాములాంటి మెలిక‌ల‌తో ఉండే రోడ్లు.. అలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో కారులో జామ్ అని వెళ్తుంటే వ‌చ్చే మ‌జాయే వేరు. అయితే అలాంటి మెలిక‌లు తిరిగిన రోడ్ల‌లో మ‌న‌కు ఎంత ఆహ్లాదం ల‌భిస్తుందో.. అంత‌క‌న్నా డేంజ‌ర్ ఆ రోడ్ల‌లో పొంచి ఉంటుంది. అవును మ‌రి. ప‌ర్వ‌తసానువుల్లో ఉండే రోడ్లంటే అంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. ఆద‌మరిచి డ్రైవ్ చేస్తే వాహ‌నం లోయ‌లోకి ప‌డిపోతుంది. క‌నుక అలాంటి రోడ్ల‌పై ప్ర‌యాణించేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. అయితే అలాంటి రోడ్లు ఎక్క‌డున్నాయి ? అనేగా మీ డౌట్‌..! ఏమీ లేదండీ.. మీరు అంత‌గా డౌట్ ప‌డాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే అలాంటి ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌లుపులు ఉన్న రోడ్లు మ‌న దేశంలోనే ఉన్నాయి. వాటి గురించే ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

1. జొజి లా

లెహ్ నుంచి శ్రీ‌న‌గ‌ర్ వెళ్లే దారిలో ఈ రోడ్డు ఉంటుంది. ఇది స‌ముద్ర మ‌ట్టానికి సుమారుగా 11వేల అడుగుల ఎత్తులో ప‌ర్వ‌తాల‌పై ఉంటుంది. ఈ రోడ్డులో ప్ర‌యాణించేట‌ప్పుడు చ‌క్క‌ని ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌మైన దృశ్యాలు మ‌న‌కు క‌నిపిస్తాయి. కానీ ఈ రోడ్డు మాత్రం ప్ర‌యాణించేందుకు చాలా డేంజ‌ర్‌గా ఉంటుంది. మీరు సాహ‌సికులు అయితే ఈ రోడ్డులో వెళ్ల‌వ‌చ్చు. కానీ ప్ర‌యాణంలో కింద‌కు మాత్రం చూడ‌కండి. క‌ళ్లు తిరుగుతాయి. ఇక ఈ రోడ్డులో ప్ర‌యాణించేట‌ప్పుడు అప్పుడ‌ప్పుడు మ‌న‌కు అనేక ప్ర‌కృతి విప‌త్తులు కూడా ఎదుర‌వుతుంటాయి. బుర‌ద‌గా ఉండే రోడ్లు, మంచు తుపాన్లు, కొండ‌చ‌రియ‌లు విరిగి ప‌డ‌డం, బ‌ల‌మైన గాలులు మ‌న‌ల్ని ప‌ల‌కరిస్తాయి. వీటిని త‌ట్టుకుని వెళ్ల‌గ‌లం అనుకుంటేనే ఈ రోడ్డులో ప్ర‌యాణించాలి.

2. కిన్నౌర్ రోడ్డు

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు నైరుతి దిశ‌లో ఈ రోడ్డు ఉంటుంది. ఇక్క‌డి ప‌ర్వ‌తాల‌పై ఉండే రాళ్ల‌ను తొలిచి రోడ్డును వేశారు. అందువ‌ల్ల మ‌లుపులు మ‌రీ ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే రోడ్డు మార్గంలో కొన్ని చోట్ల షార్ప్, బ్లైండ్ ట‌ర్న్‌లు ఉంటాయి. వాటి వద్ద ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రుగుతుంటాయి. ఇక సాహ‌సం చేసేవారికి ఈ రోడ్డు స‌వాల్ విసురుతుంది. ఎక్స్‌పీరియెన్స్ ఉన్న డ్రైవ‌ర్లే ఈ రోడ్డులో వాహ‌నాన్ని న‌డ‌పాలంటే జంకుతారు. క‌నుక ధైర్యంగా ఉంటేనే ఈ రోడ్డులో వాహ‌నం న‌డ‌పాలి.

3. ఖార్దుంగ్ లా

ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన ప్ర‌దేశాల‌లో ఉన్న రోడ్డుల‌లో ఈ రోడ్డు కూడా ఒక‌టి. దీన్ని ఇండియ‌న్ ఆర్మీ వారు నిర్మించారు. అందుకు వారు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఈ రోడ్డు ఉండే ప‌ర్వ‌త శ్రేణులు స‌ముద్ర మ‌ట్టానికి సుమారుగా 18,380 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఇక అంత ఎత్తులో చ‌లి బాగా ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే ఆక్సిజ‌న్ స్థాయిలు త‌క్కువ‌గా ఉంటాయి. దీంతో ఈ రోడ్డులో ప్ర‌యాణించే వారు వాహ‌నాల్లో ఆక్సిజ‌న్ మాస్కుల‌ను పెట్టుకుంటారు.

4. లెహ్‌-మ‌నాలి హైవే

ఈ రోడ్డు దాదాపుగా 479 కిలోమీట‌ర్ల పొడ‌వు ఉంటుంది. ఈ రోడ్డులో ప్ర‌యాణించేట‌ప్పుడు కూడా మ‌న‌కు చ‌క్క‌ని ప్ర‌కృతి అందాలు క‌నిపిస్తాయి. కానీ అదే స్థాయిలో డేంజ‌ర్లు కూడా ఉంటాయి. మెలిక‌లు తిరుగుతూ రోడ్డుపై వెళ్తుంటే ఎంత‌టి అనుభ‌వం ఉన్న డ్రైవ‌ర్‌కైనా భ‌యం వేస్తుంది.

5. రోహ్‌తంగ్ పాస్

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో హిమాల‌య ప‌ర్వ‌త శ్రేణుల్లో సముద్ర మ‌ట్టానికి దాదాపుగా 3978 మీట‌ర్ల ఎత్తులో ఈ రోడ్డు ఉంటుంది. ఇది ఇండియాలోనే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన రోడ్డుగా పేరుగాంచింది. ఈ రోడ్డుపై ప్ర‌యాణించాలంటే వాహ‌న‌దారుల‌కు గ‌ట్స్ ఉండాలి. ఎందుకంటే ఈ రోడ్డుపై ఉండే మ‌లుపుల్లో ప్ర‌యాణించ‌డం అంత సుల‌భం కాదు. ఎదురుగా వ‌చ్చే వాహ‌నాల‌ను త‌ప్పించుకుంటూ చాక‌చ‌క్యంగా వాహ‌నం న‌డపాలి. అదుపు త‌ప్పినా, చిన్న త‌ప్పు చేసినా వాహ‌నం లోయ‌లోకి ప‌డిపోతుంది. ఇక ఈ రోడ్డు ఉన్న ప‌ర్వ‌త శ్రేణుల పైభాగం నుంచి త‌ర‌చూ కొండ చ‌రియ‌లు కింద ప‌డుతుంటాయి. దీంతో అనేక ప్ర‌మాదాలు కూడా జ‌రుగుతుంటాయి. సాహ‌సం చేయాల‌నుకునే వారికి ఈ రోడ్డు మంచి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది.

Health

సినిమా