Viral News: తాగి డ్యూటికి వచ్చిన ఉపాధ్యాయుడు.. విద్యార్థులు ఏం చేశారంటే

విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు టీచర్లు దారి తప్పుతున్నారు. పీకల దాక తాగి స్కూళ్లకు వస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ములకలపల్లి మండలం తిమ్మంపేట పంచాయతీ రాజీవ్‌‌‌‌నగర్‌‌‌‌ కాలనీ ప్రైమరీ స్కూల్‌‌‌‌లో పత్తిపాతి వీరయ్య ఎస్‌‌‌‌జీటీగా పనిచేస్తున్నాడు.


ములకలపల్లి: విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు టీచర్లు దారి తప్పుతున్నారు. పీకల దాక తాగి స్కూళ్లకు వస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ములకలపల్లి మండలం తిమ్మంపేట పంచాయతీ రాజీవ్‌‌‌‌నగర్‌‌‌‌ కాలనీ ప్రైమరీ స్కూల్‌‌‌‌లో పత్తిపాతి వీరయ్య ఎస్‌‌‌‌జీటీగా పనిచేస్తున్నాడు. అతను శుక్రవారం మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు. నడవలేకుండా పడిపోయిన టీచర్‌‌‌‌ను విద్యార్థులు గమనించి స్థానికులకు సమాచారం అందించారు.

అతన్ని వెంటనే పశువుల కొట్టంలోకి తరలించారు. వీరయ్య రెండేళ్లుగా అదే పాఠశాలలో పనిచేస్తున్నాడని, గతంలో కూడా ఇలాగే తాగి స్కూల్‌‌‌‌కు చాలాసార్లు వచ్చినట్లు విద్యార్థులు చెబుతున్నారు.

ఈ విషయంపై గ్రామస్తులు ఎంఈవో శ్రీరామమూర్తికి ఫిర్యాదు చేశారు. వీరయ్య మీద చర్యలు ఏమి లేవా అని స్థానిక హెడ్ మాస్టర్ కిరణ్ ను అడగ్గా అతను పాఠశాలకు లేటుగా వచ్చాడు కాబట్టి క్యాజువల్ లీవ్ వేశాం అని చెప్పుకొచ్చాడు. వీరయ్య తాగి తూగుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.