OTT Telugu Movies: ఈ వారం ఓటీటీలో చూడాల్సిన 6 తెలుగు సినిమాలు, వెబ్ సిరీసులు ఇవే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Telugu Movies This Week: ఓటీటీ కంటెంట్‌కు లాంగ్వేజ్ బేరియర్ లేదు. ఏ భాషా చిత్రమైన అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇతర సౌత్, నార్త్ భాషల్లోని సినిమాలకు కూడా మంచి క్రేజ్ ఉంది.


డిఫరెంట్ జోనర్లలో వచ్చే ఏ సినిమాను వదిలిపెట్టరు ఓటీటీ ఆడియెన్స్. ఇక ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు, వెబ్ సిరీసులు వివిధ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ అలరిస్తుంటాయి.

అయితే, ఏపీ, తెలంగాణ ప్రేక్షకులు మాత్రం కాస్తా తెలుగు సినిమాలపై ఆసక్తి చూపుతుంటారు. మరి అలాంటి వారి కోసం ఈ వారం కచ్చితంగా చూడాల్సిన ఆరు సినిమాలు, వెబ్ సిరీసులను తీసుకొచ్చాం. వివిధ జోనర్లలో ఉన్న ఈ బెస్ట్ 6 సినిమాలు వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి, ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌పై లుక్కేస్తే..

బాక్ ఓటీటీ

తమన్నా, రాశీ ఖన్నా కలిసి భయపెట్టిన సినిమా బాక్. ఇది తమిళంలో సూపర్ హిట్ ఫ్రాంఛైజీ అయిన అరణ్మనైకి నాలుగో సినిమాగా వచ్చిన అరణ్మనై 4కు (Aranmanai 4 OTT) తెలుగు టైటిల్. సుందర్ సి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో తమన్నా, రాశీ ఖన్నా అదిరిపోయే గ్లామర్‌తో పాటు హారర్ సన్నివేశాలతో వణికించేశారు.

కామెడీ హారర్ జోనర్‌లో వచ్చిన ఈ బాక్ మూవీ (Baak OTT) జూన్ 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో (Disney Plus Hotstar OTT) స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌తోపాటు అన్ని రకాల ప్రేక్షకులు చూసేందుకు మంచి ఆప్షన్.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీ

విశ్వక్ సేన్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. జూన్ 14 నుంచి ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ (Gangs Of Godavari OTT) స్ట్రీమింగ్ అవుతోంది. తొలి రోజు నుంచి అత్యధిక ప్రేక్షకుల వీక్షణతో సినిమా ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పటికీ టాప్ 2 ట్రెండింగ్‌లో ఉంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ.

గం గం గణేశా ఓటీటీ

ఆనంద్ దేవరకొండ నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా గం గం గణేశా (Gam Gam Ganesha OTT Streaming). ఉదయ్ శెట్టి అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో (Amazon Prime OTT) జూన్ 20 నుంచి స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్సే తెచ్చుకుంటోంది. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్‌గా నటించారు.

యక్షిణి వెబ్ సిరీస్ ఓటీటీ

హారర్ అండ్ ఫాంటసీ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన తెలుగు వెబ్ సిరీస్ యక్షిణి (Yakshini OTT). హాట్ బ్యూటి వేదిక, మంచు లక్ష్మీ, రాహుల్ విజయ్, యాక్టర్ అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక శాపం నుంచి విముక్తి కావడానికి వంద మగవాళ్లతో శృంగారం చేసి తర్వాత హతమార్చే అలాకాపురి కన్య కథగా వచ్చిన ఈ సిరీస్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు.

పరువు వెబ్ సిరీస్ ఓటీటీ

మెగా బ్రదర్ నాగబాబు, నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య కీలక పాత్రల్లో నటించిన తెలుగు మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ పరువు (Paruvu Web Series OTT). ప్రముఖ ఓటీటీ జీ5లో (Zee5 OTT) జూన్ 14 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తంగా 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్‌ను చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మించారు. ఈ వీకెండ్‌లో చూసేందుకు ఈ వెబ్ సిరీస్ కూడా ఒక మంచి ఎంపిక.

రష్ మూవీ ఓటీటీ

డైరెక్టర్ రవిబాబు నిర్మాతగా వ్యవహరిస్తూ.. కథ, స్క్రీన్ ప్లే అందించిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ రష్. నేరుగా ఓటీటీలో విడుదల అయిన ఈ సినిమా (Rush OTT Streaming) ఒక యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ అని రివ్యూలు చెబుతున్నాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్‌లో (ETV Win OTT) అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతున్న రష్ సినిమా కూడా ఈవారం చూసేందుకు బెస్ట్ ఆప్షన్.