Friday, November 15, 2024

Good Health: విటమిన్ P గురించి విన్నారా.. ఇది కూడా శరీరానికి అవసరమే

విటమిన్లు అన్నీ శరీరానికి ఏదో ఒక విధంగా ఆరోగ్యాన్ని అందించేవి. వాటిలో కొన్నింటికి అధిక ప్రాధాన్యత ఉంటే మరికొన్నింటి గురించి అసలు తెలియదు. అలాంటిదే విటమిన్‌-పి. విట‌మిన్ A, B, C, D,E ఈ వ‌ర‌కు త‌ర‌చూ వింటూనే ఉంటాం. కానీ విట‌మిన్ పి (vitamin p) అనేది ఒక‌టి ఉందని చాలా మందికి తెలియదు. విటమిన్ P లోపం అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, విటమిన్‌ పి కలిగి ఉన్న ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ పి అంటే ఏమిటి.? అది ఏ ఆహారాలలో దొరుకుతుంది..? దాని ప్రయోజనాలను తెలుసుకుందాం.

విట‌మిన్ పి అనేది క‌చ్చితంగా విట‌మిన్ అని కాదు. ఫ్లేవనాయిడ్స్‌ని విట‌మిన్ పి అని కూడా పిలుస్తారు. ఫ్లేవ‌నాయిడ్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేట‌రీ ప్రాప‌ర్టీలు క‌లిగిన ఒక ఫైటో న్యూట్రియంట్. సింపుల్‌గా చెప్పాలంటే ఈ విట‌మిన్ పి అనేది ఎక్కువ‌గా మొక్కల నుంచి ల‌భించే ఆహార ప‌దార్థాల‌లో ఉంటుంది.

ఫ్లేవనాయిడ్లను విటమిన్ పి అని కూడా అంటారు. ఫ్లేవనాయిడ్లు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన ఒక ఫైటో న్యూట్రియంట్. ఈ విటమిన్ పి ప్రధానంగా మొక్కల నుంచి దొరికే ఆహారాలలో కనిపిస్తుంది.విటమిన్ పి తీసుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తనాళాల పనితీరు బాగుంటుంది. విటమిన్ పి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అలాగే ఆస్తమా, కీళ్లనొప్పులు, అలర్జీలను నివారిస్తుంది

బయోఫ్లేవనాయిడ్ లోపం లక్షణాలు విటమిన్ సి మాదిరిగానే ఉంటాయి. అతి పెద్ద లక్షణాలు సులభంగా గాయాలు, రక్తస్రావం. దెబ్బతగిలిన చోట తీవ్రమైన రక్తస్రావం జరుగుతుంది. దీని లోపం ఆర్థరైటిస్‌కు సంబంధించిన వాపుకు కూడా కారణమవుతుంది. దీని తీవ్రమైన లోపం వల్ల స్కర్వీ, చిగుళ్లు, దంతాల సమస్యలు, చర్మం, జుట్టు పొడిబారడం, రక్తహీనత ఏర్పడుతుంది.

విట‌మిన్ పి తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ర‌క్తనాళాల ప‌నితీరు బాగుంటుంది. విట‌మిన్ పి అనేది యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది కాబ‌ట్టి రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఆస్తమా, కీళ్లవాతం, అలెర్జీలు రాకుండా ర‌క్షిస్తుంది.
.
వారికోస్ వీన్స్, చ‌ర్మంపై క‌మిలిన‌ట్లు ఉండ‌టం వంటివి రాకుండా ఆపుతుంది. కంటి శుక్లాలు రాకుండా చూపు త‌గ్గకుండా చేస్తుంది. బ్రెయిన్ ప‌నితీరు బాగుంటుంది. కొన్ని ర‌కాల క్యాన్సర్లు రాకుండా ఆపుతుంది. అయితే క్యాన్సర్‌పై విట‌మిన్ పి చూపు ప్రయోజ‌నాల‌పై ఇంకా ప‌రిశోధ‌న జ‌రుగుతోంది.

నిమ్మజాతికి చెందిన పండ్లలో ఈ విట‌మిన్ పి పుష్కలంగా ఉంటుంది. హై క్వాలిటీ డార్క్ చాక్లెట్‌లోనూ ఇది ల‌భిస్తుంది. కాక‌పోతే ఆ చాక్లెట్‌లో కోకో 70శాతం వ‌ర‌కు ఉండాలి. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ ఇలా బెర్రీ జాతికి చెందిన అన్ని పండ్లలోనూ ఇది ల‌భిస్తుంది. రెడ్ వైన్, ఆకుకూర‌ల్లోనూ పుష్కలంగా ఉంటుంది.

అనేక ముదురు రంగు పండ్లు, కూరగాయల రంగుకు ఫ్లేవనాయిడ్లు అంటే విటమిన్-పి కూడా కారణం. ఈ సమ్మేళనాలు ఆలివ్ నూనె, బెర్రీలు, ఉల్లిపాయలు, కాలే, ద్రాక్ష, టమోటాలు, రెడ్ వైన్, టీ, కోకో, యాపిల్స్, ద్రాక్ష, సోయాబీన్స్, సోయా ఉత్పత్తులు, క్రాన్బెర్రీస్, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ మొదలైన వాటిలో కనిపిస్తాయి. ఇలా వివిధ ర‌కాల కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు, పండ్లు మీ డైట్‌లో భాగంగా చేసుకుంటే బాడీకి కావాల్సిన విట‌మిన్లు అందుతాయి.

Postal ballot ఏపీలో తెరపైకి మరో రగడ.. ఆ అంశంపై కోర్టుకు వెళ్తామంటున్న వైసీపీ..

Postal ballot ఏపీలో తెరపైకి మరో రగడ.. ఆ అంశంపై కోర్టుకు వెళ్తామంటున్న వైసీపీ..

గెజిటెడ్‌ అధికారి సీల్‌, హోదా వివరాలు లేకపోయినా.. బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఈనెల 25న ఆదేశాలు జారీ చేసింది. సీఈవో జారీ చేసిన ఆదేశాలు గతంలో ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజా ఆదేశాలతో ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సడలింపుల విషయంలో ఈసీ పునరాలోచించకపోతే.. కోర్టుకు వెళ్తామంటున్నారు వైసీపీ ముఖ్య నేతలు. ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి కూడా స్పందించారు. ఏ రాష్ట్రంలో లేని సడలింపులు ఇక్కడే ఎందుకని ప్రశ్నించారు. టీడీపీకి ఎలాగూ గెలిచే ఆలోచన లేదన్నారు.

ఏవైనా నియోజకవర్గాల్లో పోటాపోటీ ఉన్నప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్లను అడ్డుపెట్టుకుని మ్యానిపులేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్‎ను అడ్డుపెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై తమ పార్టీ ముఖ్యనేతలు కేంద్ర ఎన్నికల అధికారి రాజీవ్ శర్మను కలిసి వివరిస్తారన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏవిధంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగిస్తారో అదే మాదిరిగానే ఏపీలో పోస్టల్ ఓట్లు లెక్కించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీనా సాయంత్రం 4 గంటల లోగా స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తామంటున్నారు వైసీపీ నేతలు.

Bomb threat to Praja Bhavan: ప్రజాభవన్‌కు బాంబ్ బెదిరింపు.. నిందితుడు అరెస్ట్

Bomb threat to Praja Bhavan: ప్రజాభవన్‌కు బాంబ్ బెదిరింపు.. నిందితుడు అరెస్ట్

Bomb threat to Praja Bhavan:తెలంగాణలో మంగళవారం ప్రజాభవన్, నాంపల్లి కోర్టులో బాంబ్ ఉందంటూ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. కొన్ని గంటల పాటు ప్రజాభవన్, నాంపల్లి కోర్టులో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

చివరికి బాంబ్ లేదని తేల్చడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ఈ కేసులో శివకుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనే బాంబ్ ఉందంటూ ఫేక్ కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

4 వేల కోట్లు.. ఇది దీపిక రేంజ్! మన హీరోలు కలలో కూడా ఇది సాధించలేరు!

ఇండియన్ సినిమాలో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్, డిమాండ్ ఉన్న హీరోయిన్లు కచ్చితంగా వేళ్ల మీద లెక్కేసే సంఖ్యలోనే ఉంటారు. వారిలో కూడా అందరూ కథ, యాక్టింగ్, డ్యాన్స్ పరంగా స్టార్లు- సూపర్ స్టార్లు ఉండి ఉండచ్చు. కానీ, ట్రేడ్ లెక్కలు వచ్చే సరికి ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఒకే ఒక్క పేరు వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు దీపికా పదుకొణె. ఇప్పుడు ఈమె బాక్సాఫీస్ లెక్కలు సౌత్ లో హీరోలు కూడా సాధించలేరు అనేలా ఉన్నాయి. ఇప్పటికే రూ.2500 కోట్ల వరకు గ్రాస్ కలెక్టింగ్ రికార్డులు క్రియేట్ చేసిన ఈ భామ.. ఏకంగా రూ.4 వేల కోట్లు కొల్లకొట్టేందుకు రెడీ అయిపోతోంది. ఇది జరిగితే ఈ భామను కొట్టడం కష్టం మాత్రమే కాదు.. అసాధ్యం అని కూడా చెప్పాలి.

పఠాన్ కి ముందు వరకు దీపికా పరిస్థితి ఒకలా ఉంది. ఏ సినిమా తీసినా ఫ్లాపు అవుతూ వచ్చింది. గెహరాయి, చెపాక్, జీరో సినిమాలు సేమ్ ఫలితాన్ని ఇచ్చాయి. ఇంక భర్త చేసిన సర్కస్ సినిమాలో క్యామియో చేస్తే.. అది కూడా నిరాశ పరిచింది. అటు ప్రొడ్యూసర్ గా కూడా ఆశించిన స్థాయి ఫలితాలు రాలేదు. దాదాపుగా దీపికాకి ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ ని అంటగట్టేందుకు చాలామందే ఉవ్విళ్లూరారురు. కానీ, అలాంటి సమయంలో ఆమె పఠాన్ సినిమాలో ఛాన్స్ దక్కించుంకుంది. ఆ సినిమా ఏకంగా బాక్సాఫీస్ వద్ద రూ.వెయ్యి కోట్లు దాటేసింది. అలాగే జవాన్, ఫైటర్ కూడా అద్భుతమైన కలెక్షన్ రాబట్టాయి. ఈ మూడు సినిమాలు కలిపి బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.2600 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఇప్పుడు దీపిక పదుకొణె ఖాతాలో అరుదైన రికార్డు నమోదయ్యే దాఖలాలు కనిపిస్తున్నాయి. ఎదుకంటే దీపికా పదుకొణె ప్రస్తుతం కల్కీ 2898 ఏడీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ జూన్ 27న విడుదల కాబోతోంది. ప్రస్తుతం కల్కీ సినిమాకీ ఉన్న బజ్, ప్రభాస్ మార్కెట్ వ్యాల్యూ, నాగ్ అశ్విన్ విజన్ చూస్తుంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సత్తా చాటుతుందని అర్థమైపోతోంది. ఈ సినిమా ఎంత లేదన్నా కూడా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద కనీసం రూ.1500 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఈ లెక్కన దీపికా పదుకొణె తన 4 సినిమాలతో రూ.4000 కోట్లు కలెక్ట్ చేసినట్లు అవుతుంది.

ఈ లెక్కన దీపికా సాధించిన ఈ రికార్డును సౌత్ లో ఉన్న హీరోలు కూడా టచ్ చేయడం సాధ్యం కాదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా.. దీపికా- అజయ్ దేవగన్ కాంబోలో వస్తున్న సింగన్ అగైన్ కూడా పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఉన్న ఫ్రాంచైజ్. ఆ మూవీ కూడా రూ.వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న సినిమానే. ప్రస్తుతానికి దీపికా పదుకొనె తన చేతిలో ఉన్న ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చే యోచనలో ఉంది. అందుకే కల్కి ప్రమోషన్స్ లో కూడా దీపికా కనిపించడం లేదు. మరి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయినా దీపికాని తీసుకొస్తారేమో చూడాలి.

Prajwal Revanna | రేపు భారత్‌కు రానున్న ప్రజ్వల్‌ రేవణ్ణ..

Prajwal Revanna | రేపు భారత్‌కు రానున్న ప్రజ్వల్‌ రేవణ్ణ..

Prajwal Revanna | కర్ణాటక సెక్స్‌ స్కాండ్‌ కేసులో (Karnataka Sex Scandal Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్‌) నాయకుడు, హసన్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna) రేపు భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది.

లైంగిక దౌర్జన్యం ఆరోపణల అనంతరం ఏప్రిల్ 26 తర్వాత ఆయన దేశం విడిచి దౌత్య పాస్‌పోర్ట్‌తో విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. అయితే మే 31న తాను తప్పకుండా విచారణకు హాజరవుతానని ఇటీవల ప్రజ్వల్‌ వీడియో విడుదల చేశారు.

ఈ నేపథ్యంలోనే మే 30న జర్మనీలోని మ్యూనిచ్‌ నుంచి అతడు భారత్‌కు బయల్దేరనున్నట్లు పీటీఐ వర్గాలు వెల్లడించాయి. మే 31న ఉదయం 10 గంటలకు అతడు సిట్‌ ముందు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో ప్రజ్వల్‌ కోసం నిఘా పెట్టింది. విమానాశ్రయంలో ప్రజ్వల్‌ ల్యాండ్‌ కాగానే అతడిని అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

దారుణం.. 8 మంది కుటుంబ సభ్యులను చంపి తర్వాత వ్యక్తి ఆత్మహత్య

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అతికిరాతకంగా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని చంపి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

మధ్యప్రదేశ్‌లోని ఛింద్‌వాడాలో ఈ దారుణం జరిగింది. దినేశ్‌ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఎనిమిది రోజుల క్రితమే ఇతనికి వివాహం అయినట్లు తెలుస్తోంది. భార్యతో పాటు సోదరుడు, అతని భార్య, ముగ్గురు పిల్లలు, తల్లిని దినేశ్‌ దారుణంగా గొడ్డలితో నరికి చంపాడని చెబుతున్నారు. ఎనిమిది మంది బోదకల్‌ కచర్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో వరండాలో నిద్ర పోతున్న సమయంలో నరికి చంపాడని చెప్పారు పోలీసులు. ఆ తర్వాత దగ్గరలోనే ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని దినేశ్ సూసైడ్ చేసుకున్నాడు. మరోవైపు ఈ దారుణ హత్యలకు పాల్పడిన వ్యక్తి మతిస్థిమితం లేనట్లుగా మహుల్జీర్ పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇక మృతదేహాలను ఆస్పత్రికి తరలించామన్నారు.

ఈ సంఘటనపై దినేశ్ చిన్నాన్న తల్వీ సింగ్‌ స్పందించాడు. దినేశ్‌ తన అన్న కొడుకు అని చెప్పాడు. ఏడాది ఉంచి మానసికంగా ఇబ్బందులు పడుతున్నాడని చెప్పాడు. కొంతకాలం చికిత్స అందించారనీ.. ఆ తర్వాత సాధారణంగానే ఉన్నాడని చెప్పాడు. మే 21వ తేదీన దినేశ్‌కు పెళ్లి చేశామన్నారు. పెళ్లయిన కొద్ది రోజులకే ఇలాంటి దారుణ ఘటనకు పాల్పడతాడని ఎవరూ ఊహించలేదన్నాడు. పెళ్లయిన తర్వాత రోజు నుంచే మానసిక సమస్యలు బయటపడ్డాయని తల్వీ సింగ్ చెప్పాడు. గొడ్డలితో దినేశ్‌ కుటుంబ సభ్యులను నరికిన తర్వాత తమ అక్క కూతురు చూసిందనీ.. కేకలు వేసిందని చెప్పాడు. అంతలోనే ఆమెను కూడా గాయపర్చి సూసైడ్ చేసుకున్నాడని తల్వీ సింగ్ పటేల్ చెప్పాడు.

T20 World Cup vs IPL Prize Money: టీ20 ప్రపంచకప్ విజేత ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. ఐపీఎల్ కంటే చాలా తక్కువ..

T20 World Cup 2024 Prize Money: IPL 2024 ముగిసింది. ఇప్పుడు ఇది T20 క్రికెట్‌లో అతిపెద్ద కార్నివాల్ అంటే T20 ప్రపంచ కప్ వైపు అందరి చూపు మళ్లింది. T20 ప్రపంచ కప్ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా జట్లు తమ పూర్తి ప్రయత్నాలను చేస్తున్నాయి. ఈ సమయంలో, ఎందరో గొప్ప ఆటగాళ్లు ఆడటం మనం మరోసారి చూడొచ్చు. ప్రైజ్ మనీ గురించి మాట్లాడితే, ఐపీఎల్‌తో పోలిస్తే టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీ చాలా తక్కువగా ఉంది.

ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో ఆ జట్టు గరిష్టంగా రూ. 20 కోట్లు దక్కించుకుంది. రెండో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు రూ.12.5 కోట్లు బహుమతిగా లభించింది. విజేత, రన్నరప్ జట్లతో పాటు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన రాజస్థాన్ రాయల్స్, ఆర్‌సీబీలకు మంచి మొత్తం లభించింది. రెండు జట్లకు ఒక్కొక్కరికి రూ.7 కోట్లు బహుమతిగా లభించాయి.

T20 ప్రపంచ కప్ గురించి మాట్లాడితే, ఇక్కడ ప్రైజ్ మనీ చాలా తక్కువగా ఉంది. నివేదికల ప్రకారం, T20 ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకున్న జట్టుకు 1.6 మిలియన్ డాలర్లు అంటే 13 కోట్ల 30 లక్షల భారతీయ రూపాయలు అందుతాయి. కాగా, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.6.65 కోట్లు లభిస్తాయి. T20 వరల్డ్ కప్ 2024 మొత్తం ప్రైజ్ మనీ 5.6 మిలియన్ డాలర్లు అంటే భారతీయ రూపాయలలో సుమారు రూ. 46 కోట్ల 56 లక్షలు. టీ20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్స్‌లో ఓడిన ఇరు జట్లకు దాదాపు రూ.3.32 కోట్లు అందుతాయి. సూపర్-12లో ఓడిన జట్లకు రూ.58 లక్షలు అందుతాయి. దీన్ని బట్టి ఐపీఎల్‌తో పోలిస్తే టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీ చాలా తక్కువగా ఉంటుందని అంచనా వేయవచ్చు.

IPL ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ అని తేలింది. అందుకే ఇక్కడ ప్రైజ్ మనీ మొత్తం ప్రపంచంలోనే అత్యధికంగా మారింది. డబ్బుల పరంగా చూస్తే మరే ఇతర జట్టు కూడా ఐపీఎల్‌కు దగ్గరగా లేవు. ఈ కారణంగా, ఐపీఎల్ ఫైనల్‌లో ఫ్రాంచైజీ గెలిచినప్పుడల్లా డబ్బుల వర్షం కురిపిస్తుంది. టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుండడంతో ఇప్పటికే అన్ని జట్లూ సన్నద్ధమవుతున్నాయి. భారత జట్టు కూడా పూర్తిగా సిద్ధమైంది.

Sridhar Vembu: రూ.28 వేల కోట్ల ఆస్తి, రూ.9 వేల కోట్ల కంపెనీ – ఇప్పటికీ సైకిల్‌పైనే ప్రయాణం

Sridhar Vembu Lifestyle Of Zoho Corporation: కోటి రూపాయల ఆస్తి సంపాదించగానే కొంతమందికి కొమ్ములు మొలుస్తాయి. ఆస్తి పెరిగే కొద్దీ లగ్జరీ లైఫ్కు అలవాటు పడి మూలాలు మర్చిపోతారు.

తన కంటే తోపు ఇంకెవరూ లేరన్నట్లు ప్రవర్తిస్తారు. కానీ.. భారతీయ వ్యాపార ప్రపంచంలో శ్రీధర్ వెంబు చాలా ప్రత్యేకం. విభిన్నమైన ఆలోచనలతోనే కాదు, నిరాడంబరమైన జీవన విధానంతోనూ ప్రసిద్ధి చెందారు.

శ్రీధర్ వెంబు, తన ఆధ్వర్యంలోని జోహో కార్పొరేషన్ను (Zoho Corporation) 9,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీగా మార్చారు. అంతేకాదు, ఆయన నికర ఆస్తిపాస్తుల విలువ (Sridhar Vembu Net Worth) 28,000 కోట్ల రూపాయలని అంచనా. ఫోర్బ్స్ (Forbes) డేటా ప్రకారం, భారతదేశంలోని ధనవంతుల జాబితాలో శ్రీధర్ వెంబు 55వ స్థానంలో ఉన్నారు. శ్రీధర్ వెంబు సేవలకు ప్రతిగా పద్మశ్రీ పురస్కారం వరించింది. రూ.9 వేల కోట్ల రూపాయల విలువైన కంపెనీకి & రూ.28 వేల కోట్ల ఆస్తికి అధిపతిగా ఉన్నప్పటికీ శ్రీధర్ వెంబు చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.

జోహో కార్పొరేషన్కు వేల కోట్ల రూపాయల లాభం
జోహో కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా (CEO) శ్రీధర్ వెంబు పని చేస్తున్నారు. ఆయన నేతృత్వంలో, జోహో కార్పొరేషన్ ప్రస్తుతం 2,800 కోట్ల రూపాయల లాభాల సంస్థగా అవతరించింది. ప్రపంచంలోని అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటిగా (One of the largest software companies in the world) గుర్తింపు పొందింది. ఇంతటి ఘనత ఉన్నప్పటికీ, శ్రీధర్ వెంబు తన స్వగ్రామం తంజావూరులో నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. సూటు, బూటు కాకుండా తమిళ సంప్రదాయంలో పంచె కట్టుకుంటున్నారు. అతి సాధారణ చొక్కాలు ధరిస్తున్నారు. అంతేకాదు, రాకపోకల కోసం సైకిల్ను ఉపయోగిస్తున్నారు.

కొత్త వాహనం ఫొటోలు వైరల్
ఇటీవల, శ్రీధర్ వెంబు ఒక కొత్త వాహనం కొన్నారు. ఆ వాహనం ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తే అవి తెగ వైరల్ అయ్యాయి. నెటిజన్ల నుంచి లక్షల్లో లైక్స్ వచ్చాయి. జోహో కార్పొరేషన్ CEO ఉపయోగిస్తున్న కొత్త వాహనం… ఎలక్ట్రిక్ ఆటో రిక్షా. శ్రీధర్ వెంబు వద్ద టాటా నెక్సాన్ EV కూడా ఉంది.

శ్రీధర్ వెంబు తమిళనాడులోని తంజావూరులో జన్మించారు. ఐఐటీ జేఈఈ పరీక్షలో 27వ ర్యాంకు సాధించారు. ఆ తర్వాత ఐఐటీ మద్రాస్లో, ఆపై ప్రిన్స్టన్ యూనివర్సిటీలో చదివారు. ఆ తర్వాత, 1994లో క్వాల్కమ్తో (Qualcomm) కలిసి పని చేశారు. కానీ, ఒక స్టార్టప్ను ప్రారంభించాలన్నది ఆతని కోరిక. దీంతో, మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశారు. అప్పటికి, అతని సోదరుడు చెన్నైలో అడ్వెంట్నెట్ (AdventNet) అనే సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్నారు. 1998 సంవత్సరం నాటికి ఆ కంపెనీ బాగా పని చేయడం ప్రారంభించింది.

2001 ఆర్థిక మాంద్యం సమయంలో అడ్వెంట్నెట్ భారీ నష్టాన్ని చవిచూసింది. తమకు అమ్మేయమంటూ ఇతర సంస్థలు మంచి ఆఫర్లు ఇచ్చినా ఆ కంపెనీని అమ్మలేదు. ఈ సమయంలోనే, జోహో డొమైన్ నేమ్ను శ్రీధర్ వెంబు కొనుగోలు చేశారు. 2009లో, జోహో కార్పొరేషన్లో అడ్వెంట్నెట్ను విలీనం చేశారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 2021 నవంబర్ నాటికి జోహో కార్పొరేషన్ ఆదాయం 1 బిలియన్ డాలర్ల మైలురాయిని చేరింది. అందరూ నష్టపోయిన కొవిడ్-19 సమయంలో ఈ కంపెనీ భారీ ప్రయోజనాలు పొందింది, లాభం రూ. 1,918 కోట్లకు చేరుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జోహో కార్పొరేషన్ లాభాలు వృద్ధి చెందుతూనే ఉన్నాయి, శ్రీధర్ వెంబు సాధారణ జీవన విధానం కొనసాగుతూనే ఉంది.

మందుబాబులకు భారీ షాక్.. ప్రభుత్వం వెంటనే ఆదేశాలు జారీ!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పార్టీలూ, నేతలు భారీగా మనీ పంచడంతో.. మందు బాబులు.. ఆ మనీతో మద్యం కొనుక్కుంటున్నారు. ఇలా వారు ప్రశాంతంగా మద్యం తాగుతూ..

నిద్రలోకి జారుకుంటున్నారు. ఐతే.. వారికి షాక్ ఇచ్చే ఆదేశాలు ఏపీ పోలీస్ అధికారుల నుంచి వెళ్లాయి.

ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు ఏపీ డీజీపీ హరీశ్ గుప్తా తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

జూన్ 3, 4, 5 తేదీల్లో ఏపీలో ఎక్కడా మద్యం అమ్మకాలు జరగకుండా.. అన్ని జిల్లాల్లో నిషేధించాలని అధికారులను డీజీపీ ఆదేశించారు. అంతేకాదు.. తనిఖీలు బాగా చెయ్యాలని కోరారు. హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి, అనుమానితులు ఎవరైనా ఉంటే వారిని అదుపులోకి తీసుకోవాలనీ, అలాగే.. అక్రమ మద్యం నిల్వలు ఉంటే, సీజ్ చెయ్యాలని ఆదేశించారు.

ఇక సోషల్ మీడియాపైనా ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఎవరు ఎలాంటి పోస్టులు పెడుతున్నారో గమనిస్తున్నారు. ఫేక్ పోస్టులు పెట్టిన వారి ఐపీ అడ్రెస్‌లు తెలుసుకొని, వారికి కాల్ చేసి వార్నింగ్ ఇస్తున్నారు. మళ్లీ మళ్లీ అసత్య ప్రచారాలు చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇలా పోలీసులు అన్ని రకాలుగా ఎన్నికలకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఏపీలో జూన్ నెల 4న అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఇందుకు గంట టైమ్ పడుతుంది. ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్లు లెక్కిస్తారు. మధ్యాహ్నం 1 గంట కల్లా.. కౌంటింగ్ పూర్తి చెయ్యాలనే ప్లాన్‌లో అధికారులు ఉన్నారు.

MLC Kavitha: కవిత మామూలు వ్యక్తి కాదు.. ఎమ్మెల్సీ లీలలు బయటపెట్టిన ఈడీ!

MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్‌ అయి తిహార్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిహార్‌జైల్లో ఉన్నారు. బెయిల్‌ కోసం శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో కవితకు బెయిల్‌ రాకుండా ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌), సీబీఐ కూడా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు కవితపై దర్యాప్తు సంస్థలే పైచేయి సాధించాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత తనను అకారణంగా అరెస్టు చేశారని కోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా కవిత లీలలను ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

సాక్షులకు బెదిరింపులు..
కవిత ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవితే కీలకమని తెలిపారు. సమన్లు జారీ చేసిన తర్వాత కీలకమైన నాలుగు ఫోన్లను రెండు రోజుల్లో ఫార్మాట్‌ చేసిందని పేర్కొన్నారు. సాక్షులను బెదిరించడంతోపాటు సాక్షాలను చెరిపివేసే ప్రయత్నం చేశారని వెల్లడించారు.ఆమెకు బెయిల్‌ ఇవ్వకూడదని కోర్టుకు తెలిపారు.

ఆమె సాధారణ మహిళ కాదు..
కవిత సాధారణ మహిళ కాదని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. రాజకీయ సామర్థ్యాలు ఉన్న వ్యక్తని, ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన వ్యక్తి కూతురని పేర్కొన్నారు. విదేశాల్లో ఫైనాన్స్ లో మాస్టర్స్‌ చేసి వచ్చి, రాజకీయాలలో ఉన్నత స్థానాలను చేపట్టిన వ్యక్తి అని వెల్లడించారు. ఈ కేసులో బుచ్చిబాబు, అరుణ్‌ పిళ్లైను బెదిరించి తనకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలం ఉపసంహరించుకునేలా కవిత ఒత్తిడి చేశారని ఈడీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ఈ క్రమంలోనే రామచంద్రపిళ్లై తన వాగ్మూలం ఉపసంహరించుకున్నారని తెలిపింది. కవిత ఒత్తిడితోనే ఈ పనిచేసినట్లు పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం సాగిన 10 నెలల కాలంలో హోల్సేల్‌ వ్యాపారులు మొత్తం రూ.338 కోట్లు నేరపూరితంగా ఆర్జించారని తెలిపారు. అందులో ఇండో స్పిరిట్‌ సంస్థకు రూ.192 కోట్లు దక్కాయని తెలిపారు.

వాట్సాప్‌ చాట్‌లు..
ఆడబ్బు కవితకు చేరినట్లు వాట్సప్‌ చాట్స్‌ ఉన్నాయని తెలిపారు. కవిత బినామీగా ఉన్న రామచంద్ర పెళ్లై ఆమె తరపున రూ.32 కోట్లు పొందారని పేర్కొన్నారు. ఈ విషయం కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబు వాంగ్మూలంలో చెప్పారని తెలిపారు. ఈ రూ. 32 కోట్లలో 4.50 కోట్లు కవిత ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియా అహెడ్‌ సంస్థకు వెళ్లాయని, అందుకు సంబంధించినవాట్సాప్‌ చాట్స్‌ కూడా ఉన్నాయని వెల్లడించారు.

4 ఫోన్లు ఫార్మాట్‌..
గతేడాది మార్చి 21న కవిత దర్యాప్తు సంస్థలకు 9 ఫోన్లు అప్పగించారని తెలిపారు. వాటిలో నాలుగు ఫోన్లు ఫార్మట్‌ చేశారని పేర్కొన్నారు. ఈమేరకు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక కూడా ఉందని చెప్పారు. ఆమె సాక్షాలను తారుమారు చేస్తున్న కారణంగానే కింది కోర్టు ఆమెకు బెయిల్‌ ఇవ్వలేదని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని కవితకు బెయిల్‌ ఇవ్వద్దని ఈడీ, సీబీఐ తరపు లాయర్లు కోర్టును కోరారు.

AP CS Jawahar Reddy: పదవీ విరమణ ముందు ఇరుక్కున్న జవహర్ రెడ్డి

AP CS Jawahar Reddy: ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారి. దాదాపు అన్ని ప్రభుత్వాల్లో ఆయన పనిచేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉండేవారు. అటు రాజకీయాలకు అతీతంగా నడుచుకునేవారు. కానీ వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత వన్ సైడ్ అయ్యారు. జగన్ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎన్నో వివాదాస్పద నిర్ణయాల్లో భాగస్వామ్యం అయ్యారు. ఇప్పుడు పదవీ విరమణ ముందు అవే వివాదం అవుతున్నాయి. మున్ముందు ఆ కేసులు వెంటాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరో నెల రోజుల్లో సి ఎస్ జవహర్ రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. కానీ ఇప్పుడు ఆయనపై ఎన్నో రకాల ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో అసైన్డ్ భూముల కొనుగోలు వెనుక తన కుమారుడి పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అప్పట్లో సి ఎస్ జీవో జారీ వెనుక ఉన్న తతంగం కొంతమంది అధికారులకు తెలుసు. కానీ వారంతా సిఎస్ కు అస్మదీయలే. అయితే ఎక్కడో తేడా కొట్టింది. వారు ఇప్పుడు విపక్షాలకు సమాచారం ఇచ్చారు. పూర్తి ఆధారాలను అందించారు. అప్పటినుంచి సి ఎస్ జవహర్ రెడ్డి చుట్టూ వివాదం అలుముకుంది. నేరుగా సిఎస్ పైనే విమర్శలు చేయడం ప్రారంభించారు. దీంతో పదవీ విరమణ ముందు జవహర్ రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. కానీ తాను ఇన్నాళ్లు నమ్ముకున్న వైసిపి నేతల నుంచి కూడా ఆశించిన సహకారం ఆయనకు అందడం లేదు.

సిఎస్ జవహర్ రెడ్డి తన కుమారుడికి మంచి వ్యాపార జీవితం ఇవ్వాలని భావించారు. సగటు తండ్రిగా అది తప్పులేదు. ముందుగా ఆయనను మైనింగ్ వ్యాపారం లోకి దించారు. తరువాత ఇప్పుడు భూముల కొనుగోలు వ్యవహారం అప్పగించారు. అయితే సీఎస్ గా బాధ్యత తీసుకున్న నాటి నుంచే జగన్ సర్కార్కు వీర విధేయుడుగా మారిపోయారు అన్న ఆరోపణ ఆయనపై ఉంది. పైగా వైసీపీ అంటేనే వ్యాపారాలకు అనుకూలం అన్న పేరు ఉంది. దీంతో అడ్డగోలు జీవోలతో వైసీపీ నేతలకు సహకరించారన్న ఆరోపణ కూడా ఆయనపై ఉంది. ఈ తరుణంలో తన కుమారుడి కోసం ప్రభుత్వపరంగా సిఎస్ జవహర్ రెడ్డి సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. మరో నెలలో పదవీ విరమణ పొందుతుండగా ఈ తరహా ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో చాలామంది అధికారులకు ఎదురైన పరిణామాలే.. జవహర్ రెడ్డి ఎదుర్కోక తప్పదు. ఒకవేళ జగన్ తిరిగి అధికారంలోకి వస్తే పర్వాలేదు. లేకుంటే మాత్రం జవహర్ రెడ్డి రిటైర్ అయిన తర్వాత కూడా కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఆయన ఎక్కువగా ఆందోళనతో ఉన్నట్లు సమాచారం.

ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంటిపై పెట్రోల్‌ బాంబుతో దాడి ఘటన

ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంటిపై పెట్రోల్‌ బాంబుతో దాడి ఘటన ప్రకాశం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి జరిగింది.

బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. వెలిగండ్ల మండలం, పందువ పంచాయతీ పరిధి జంగం నరసాయపల్లి గ్రామంలో తీట్ల నారాయణ అనే ఉపాధ్యాయుడు తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నారు.
రోజులాగే ఇంటి ఆరుబయట నిద్రిస్తుండగా అర్ధరాత్రి 2.15 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు బీరు బాటిల్‌లో పెట్రోల్‌ పోసుకొని వాటికి గుడ్డ చుట్టి నిప్పుపెట్టి ఉపాధ్యాయుని ఇంటిలోపలికి విసిరారు. ఆ బాటిల్‌ పూల చెట్టుకు తగిలి ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు వ్యాపించాయి. ఉలిక్కిపడి లేచిన ఉపాధ్యాయుడు బయటకు వచ్చి చూడగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పరిగెత్తుకుంటూ వెళ్తూ కనిపించారని తెలిపారు. 1995 నుంచి ఐదేళ్లపాటు పందువ పంచాయతీ సర్పంచ్‌గా ఉన్నారు. 2002లో ఆయనకు టీచర్‌ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం గుమ్మళ్లకర్ర ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయంగానే ఈ దాడి జరిగిందేమోనని గ్రామస్తులు భావిస్తున్నారు.కనిగిరి డిఎస్‌పి రామరాజు, పామూరు సిఐ రామానాయక్‌, వెలిగండ్ల ఎస్‌ఐ శివ, ఒంగోలు క్లూస్‌ టీం ఎస్‌ఐ రంజిత్‌ కుమార్‌ సంఘటనాస్థలానికి చేరుకొని బాటిళ్లపై ఉన్న వేలిముద్రలు సేకరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు డిఎస్‌పి రామరాజు తెలిపారు

మరో ప్రాణాంతక వైరస్‌ను రూపొందిచిన చైనా.. మూడు రోజుల్లో మరణమే..

ఇది కరోనా కాదు.. కరోనా రక్కసికి అమ్మ.. అమ్మమ్మ… సోకిందంటే గన్‌షాటే.. నెక్స్ట్ బర్త్‌డే లేనట్టే.. శరణం లేదు.. మూడు రోజుల్లో మరణమేనంట.. మూడేళ్ల పాటు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్‌ పుట్టినిల్లు చైనా.. మరో ప్రాణాంతక వైరస్‌ను రూపొందిచింది.. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనావైరస్ సరిపోనట్లు.. ఇప్పుడు చైనాలోని శాస్త్రవేత్తలు కేవలం మూడు రోజుల్లో ఒక వ్యక్తిని చంపగల కొత్త వైరస్‌ను రూపొందించారు. హెబీ మెడికల్ యూనివర్సిటీలో ఈ అధ్యయనం జరిగింది. ఇది ప్రాణాంతకమైన ఎబోలా వైరస్‌ను అనుకరించేలా సింథటిక్ వైరస్‌ను ఉపయోగించింది. ఈ అధ్యయనం ఉద్దేశ్యం వ్యాధికారక గురించి లోతైన అవగాహన పొందడం అని నివేదించింది. అటువంటి ప్రయోగాల సంభావ్య ప్రమాదాలు, ప్రభావాల గురించి సైన్స్ డైరెక్ట్‌లో ప్రచురించారు.

అధిక మరణాల రేటు, తీవ్రమైన లక్షణాల కారణంగా ఎబోలా వైరస్ ప్రాణాంతక వైరస్‌లలో ఒకటిగా పరిగణిస్తారు. చివరి వ్యాప్తి 2014 -2016 మధ్య సంభవించింది. ఇది అనేక పశ్చిమ ఆఫ్రికా దేశాలను ప్రభావితం చేసింది. ఇది అనేక మరణాలకు దారితీసింది. ఇప్పుడు, హెబీ మెడికల్ యూనివర్శిటీ పరిశోధకులు ఎబోలా వైరస్‌లోని భాగాలను ఉపయోగించి వైరస్‌ను తయారు చేసేందుకు వివాదాస్పద అధ్యయనాన్ని చేపట్టారు. మానవ శరీరంపై ఎబోలా ప్రభావాలను అనుకరించే నమూనాను ఉపయోగించడం ద్వారా వ్యాధి.. పురోగతి, లక్షణాలను పరిశోధించడం దీని ఉద్దేశ్యం. ఈ బృందం ఎబోలా వైరస్ నుండి గ్లైకోప్రొటీన్ (GP)ని తీసుకువెళ్లడానికి సవరించిన వెసిక్యులర్ స్టోమాటిటిస్ వైరస్ (VSV)ని ఉపయోగించింది. వైరస్ కణాలలోకి ప్రవేశించడానికి, సోకడానికి ఈ ప్రోటీన్ ముఖ్యమైనది.

చుంచు ఎలుకల సమూహంపై ఈ ప్రయోగం నిర్వహించారు. ఇందులో ఐదు ఆడ ఎలుకలు కాగా.. ఐదు మగ ఎలుకలు ఉన్నాయి. మొత్తం 10 ఎలుకలను ఈ వైరస్‌తో ఇంజెక్ట్ చేశారు. మానవ ఎబోలా రోగుల మాదిరిగానే తీవ్రమైన లక్షణాలను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత తీవ్రమైన వ్యాధులు, బహుళ అవయవ వైఫల్యం వంటి లక్షణాలను కనుగొన్నారు. ఇది చివరికి కేవలం మూడు రోజుల్లో చిట్టెలుక మరణానికి దారితీసింది. కొన్ని చిట్టెలుకలు వాటి కళ్లలో నుంచి స్రావాలను చూపించాయని, ఇది బలహీనమైన దృష్టికి దారితీసిందని అధ్యయనం కనుగొంది. ఎబోలా వైరస్ వ్యాధి రోగులకు ఇది మరో లక్షణం..

చిట్టెలుక చనిపోయిన తరువాత, పరిశోధకులు వాటి అవయవాలను కోయడం, వైరస్ ప్రభావాన్ని విశ్లేషించారు. గుండె, కాలేయం, ప్లీహము, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కడుపు, ప్రేగులు, మెదడు వంటి కణజాలాలలో వైరస్ పేరుకుపోయినట్లు కనుగొన్నారు. ఇది మానవులలో కూడా వైరస్ వినాశకరమైన ప్రభావాలను ప్రతిబింబిస్తుంది.

బయోసేఫ్టీ లెవల్ 4 (BSL-4) సౌకర్యాలు అవసరం లేకుండా ఎబోలా లక్షణాలను ప్రతిబింబించే జంతు నమూనాను ఏర్పాటు చేయడం అధ్యయనం వెనుక ఉన్న ఉద్దేశ్యం. ఎబోలా వైరస్ వ్యాధి చాలా తీవ్రమైన అనారోగ్యాలలో ఒకటి.. ఇది తరచుగా ప్రాణాంతకం.. దీనికి చాలా సురక్షితమైన ప్రయోగశాలలు అవసరం. ఇంజినీరింగ్ చేసిన వైరస్‌ల సహాయంతో, పరిశోధకులు తక్కువ-భద్రతా పరిసరాలలో లోతుగా అధ్యయనం చేయగల నమూనాను రూపొందించగలరు. ఇది పరిశోధనను విస్తృతంగా, అందుబాటులోకి తెస్తుంది.. దానికి చికిత్స చేయడంలో మరింత పరిధిని అందిస్తుంది.

అధ్యయనం ఫలితం ఎంటంటే చర్యలు.. చికిత్సల అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఇది విజయవంతం అయినప్పటికీ, ప్రమాదవశాత్తు విడుదలయ్యే ప్రమాదం లేదా వైరస్ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉన్నందున భద్రతాపరమైన ఆందోళనల గురించి పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

పరగడపున గోరువెచ్చని నీరు తాగితే ఈ సమస్యలన్నీ దూరం..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఓ గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే చాలా మంచిది. దీని వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.అయితే, కేవలం నీరు తాగడమే కాదు, తాగే నీటి ఉష్ణోగ్రత కూడా చాలా ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారం, ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే ఏయే లాభాలున్నాయో తెలుసుకోండి.

కండరాల నొప్పులు..
గోరువెచ్చని నీరు తాగితే మన పొట్టకి సంబంధించిన కండరాల నొప్పులు దూరమవుతాయి. ఎందుకంటే, గోరువెచ్చని నీరు వల్ల మన శరీరంలోని అన్ని భాగాలకు చేరే రక్తనాళాల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

మలబద్ధకం దూరం..
గోరువెచ్చని నీరు తాగితే శరీరంలోని ట్యాక్సిన్స్ దూరమై ఉబ్బరం, కడుపునొప్పి, అసౌకర్యం వంటి కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. గోరువెచ్చని నీరు ప్రేగు కదలికల్ని కంట్రోల్ చేసి, మలబద్ధకం సమస్యని దూరం చేస్తుంది.

జీర్ణ సమస్యలు దూరం..
గోరువెచ్చని నీరు తాగితే శరీరంలోని అవనసరమైన ట్యాక్సిన్స్ దూరమవుతాయి. దీని వల్ల జీర్ణవ్యవస్థకి మంచిది. మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. మీకు మలబద్ధకం, అసిడిటీ, దగ్గు వంటి సమస్యలు ఉంటే గోరువెచ్చని నీరు తాగితే ఆ సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

బరువు కంట్రోల్..
ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే శరీర బరువు కంట్రోల్ అవుతుంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్నట్లుగా, గోరువెచ్చని నీరు మన శరీర ఉష్ణోగ్రతని పెంచుతుంది. దీంతో మెటబాలిజం కూడా పెరుగుతుంది. దీంతో, మన బాడీలోని అదనపు కేలరీలు కరుగుతాయి. కిడ్నీలు కూడా చక్కగా పనిచేస్తాయి.

చర్మ ఆరోగ్యం..
గోరువెచ్చని నీరు తాగితే ట్యాక్సిన్స్ దూరవుతాయి. ప్రేగు కదలికలు మెరుగవుతాయి. దీంతో మన చర్మం క్లీన్ అవుతుంది. వృద్ధాప్య లక్షణాలకి దూరమయ్యే ట్యాక్సిన్స్ దూరమై చర్మం మెరుస్తుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

AP Elections 2024: ఏపీలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన అమిత్ షా

Amit shah prediction on AP Election Results: 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఏపీ ఎన్నికల కౌటింగ్ జూన్ నాలుగో తేదీ జరగనుండగా.. ఫలితాలపై రాజకీయ విశ్లేషకులు, లీడర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని కొంతమంది చెప్తుంటే.. ఎన్డీయే కూటమిదే అధికారమని మరికొంతమంది వ్యూహకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక వైసీపీ నేతలు అయితే ఏకంగా సంబరాలకు సిద్ధం కండి అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్లు పెడుతున్నారు. జూన్ 9వ తేదీ ఉదయం 9 గంటల 38 నిమిషాలకు విశాఖలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ వైసీపీ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ కూడా చేసింది.

ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికలపై బీజేపీ అగ్రనేత, హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై అమిత్ షా తన అంచనాను వెల్లడించారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో అమిత్ షా ఏపీ ఎన్నికల గురించి ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికలతో పాటుగా మూడు రాష్ట్రాలకు జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తుందని అమిత్ షా చెప్పారు. ఒడిశాలో అధికారాన్ని కైవసం చేసుకుంటామని.. అలాగే టీడీపీ, జనసేనతో కలిసి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయానికి వస్తే ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 17 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని అమిత్ షా జోస్యం చెప్పారు. ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 చోట్లా పోటీచేసింది. అయితే 25 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమికి 17 ఎంపీ సీట్లు రావచ్చని అమిత్ షా అంచనా వేశారు. అలాగే బెంగాల్‌లోని 42 స్థానాల్లో బీజేపీ 24 నుంచి 30 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో పాటు రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ సైతం జోస్యం చెప్పారు. ఏపీలో కూటమికి 15 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని యోగేంద్ర యాదవ్ ఇటీవల వ్యాఖ్యానించారు. తాజాగా అమిత్ షా సైతం 17 చోట్ల గెలుస్తామని చెప్పడంతో.. తెలుగు తమ్ముళ్లల్లో జోష్ నెలకొంది. మరి ఎవరి అంచనాలు ఎంతమేరకు నిజమవుతాయనేదీ జూన్ నాలుగో తేదీన వెల్లడయ్యే ఫలితాల్లో తేలనుంది.

Black Neck Home Remedies: మెడ భాగంలోని నల్లటి చర్మం కాంతి వంతంగా మారాలంటే ఇలా చేయండి

మెరిసే కాంతి వంతమైన చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చర్మం మెరిసేందుకు చాలా ప్రయత్నాలు సైతం చేస్తుంటారు. కానీ వీటన్నింటి మధ్య మనం మన మెడను జాగ్రత్తగా చూసుకోవడం మరచిపోతారు.

మెడ భాగం నల్లగా మారి ఉంటుంది. ఇది చాలా మందికి ముఖ్యంగా మగవారికి తప్పకుండా ఉండే సమస్య. ఎండాకాలంలో వడదెబ్బతో పాటు అనేక ఇతర కారణాల వల్ల మెడ నల్లగా మారుతుంటుంది. మెడ నల్లబడటానికి గల కారణాలు, దానిని తొలగించే మార్గాల గురించి తెలుసుకుందాం. మీ మెడ నట్లగా మారినట్లయితే.. మీ చర్మాన్ని మెరిసేలా చేసేందుకు ఈ నేచురల్ హోం రెమెడీస్ ట్రై చేయండి.

నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. నల్లని మెడపై నిమ్మరసం రాసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయవచ్చు. మంచి ఫలితం లభిస్తుంది. ఒక టీస్పూన్ పెరుగులో అర టీస్పూన్ పసుపు కలపండి. వాటిని పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ని బ్లాక్ నెక్‌పై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. బంగాళాదుంప ముక్కలను లోతైన మెడపై రుద్దండి. బంగాళదుంప రసంలో ఉండే మూలకాలు చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి. ముదురు నలుపు మెడపై వెచ్చని క్రీమ్‌ను మసాజ్ చేయండి. ఇది చర్మానికి తేమను అందించడంతో పాటు ఛాయను మెరుగుపరుస్తుంది. కొబ్బరి నూనెలో విటమిన్ ఈ ఉంటుంది. ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది. నల్లని మెడపై గోరువెచ్చని కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి. ఈ ఇంట్లోనే దొరికే వస్తువులతో ఈ చిట్కాలను తప్పక పాటించండి. ఈ సమస్య తీవ్రంగా ఉంటే లేదా ఈ చర్యలు సహాయం చేయకపోతే.. వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

Coffee: నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా.. ?

Coffee Side Effects: నిద్ర లేవగానే ముందుగా ఒక కప్పు కాఫీ తాగుతున్నారా ? అవును అయితే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా రకాలుగా హాని కలుగుతుంది.

చాలా మందికి కాఫీ లేకుండా ఉదయం అసంపూర్ణంగా అనిపిస్తుంది. ఇది శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.

అంతే కాకుండా వారికి తాజా అనుభూతిని ఇస్తుంది. కానీ ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ అలవాటు యాసిడ్ రిఫ్లక్స్‌ను పెంచుతుంది. అంతే కాకుండా కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. మీరు ఉదయాన్నే ఒక కప్పు కాఫీకి అలవాటు పడిన వారైతే అది ఎలా హానికరమో తెలుసుకుందామా..

కాఫీ తాగడం వల్ల కలిగే నష్టాలు

1.ఆందోళన, భయం:

కెఫిన్.. ఇది చురుకుదనం, శక్తి స్థాయిలను పెంచుతుంది. అయినప్పటికీ, ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల దాని ప్రభావం పెరుగుతుంది. ఇది ఆందోళన, భయాన్ని పెంచుతుంది. రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుంది. దీని వలన ఏకాగ్రత ఉండదు.

2. అసిడిటీ ప్రమాదం:

ఖాళీ కడుపుతో కాఫీ తీసుకోవడం వల్ల పొట్టలో ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. కెఫిన్ కడుపు లైనింగ్‌ను చికాకు పెడుతుంది. అసౌకర్యం, గుండెలో మంట, యాసిడ్ రిఫ్లక్స్‌ను కూడా కలిగిస్తుంది.

3. జీర్ణ సమస్యలు:

ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి వంటి జీర్ణ సమస్యలతో ఇప్పటికే బాధపడుతున్న వ్యక్తులకు ఇది హాని కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల వీరి సమస్య మరింత పెరుగుతుంది.

4. రక్తంలో చక్కెర స్థాయి:

కెఫిన్ ఇన్సులిన్ సెన్సిటివిటీ, గ్లూకోజ్ జీవక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. ఖాళీ కడుపుతో కాఫీ సేవించినప్పుడు అది రక్తంలో చక్కెరను వేగంగా పెంచడానికి కారణమవుతుంది. దీనివల్ల అలసిపోయి చిరాకుగా కూడా అనిపించవచ్చు. అందుకే ఈ లక్షణాలను తగ్గించడానికి ఎక్కువ చక్కెర లేదా కెఫిన్‌ని కోరుకుంటారు.

5.డీహైడ్రేషన్:

ఖాళీ కడుపుతో కాఫీని తీసుకుంటే అది డీహైడ్రేషన్ ను పెంచుతుంది. ముఖ్యంగా రోజంతా తగినంత ద్రవాలు తీసుకోకపోతే.. తలనొప్పి, మైకము, అలసట వంటి లక్షణాలను ఇది కలిగిస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యం మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది.

(Disclaimer : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడినది. MannamWeb.com దీన్ని ధృవీకరించడం లేదు.)

T20 World Cup 2024: 20 జట్లు, 55 మ్యాచ్‌లు.. పొట్టి సమరానికి రంగం సిద్ధం.. పూర్తి షెడ్యూల్ ఇదే..

T20 World Cup 2024: IPL 2024 ముగిసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలుచుకుంది, అయితే క్రికెట్ ఉత్కంఠ ఇంకా ముగిసిపోలేదు.

ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆటగాళ్లు ఇప్పుడు తమ దేశ జెండాను ఎగురవేయాలనే ఉద్దేశ్యంతో మైదానంలోకి దిగిందుకు సిద్ధమయ్యారు. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచేందుకు జట్లు పోటీపడనున్నాయి. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం దాదాపు అన్ని జట్లు తమ ఇళ్ల నుంచి బయల్దేరి వెళ్లాయి. ఆటగాళ్లు పూర్తి పట్టుదలతో సన్నద్ధమయ్యారు. హై వోల్టేజీ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది.

ఈ ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు రంగంలోకి దిగనున్నాయి. అమెరికాలో ఇంత పెద్ద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఇదే మొదటిసారి. టోర్నీలో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ బేస్ బాల్ పిచ్చి దేశంలో టీ20 ప్రపంచకప్ నిర్వహించడం క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు అమెరికాకు సువర్ణావకాశం.

టీ20 ప్రపంచకప్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?

ఐసీసీ టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి జూన్ 29 మధ్య జరగనుంది. అమెరికా, వెస్టిండీస్‌లో జరిగే ప్రపంచకప్‌లో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇది రెండు దేశాల్లోని 9 వేర్వేరు ప్రదేశాల్లో నిర్వహించనున్నారు. ఆంటిగ్వా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్, ట్రినిడాడ్-టొబాగో, సెయింట్ విన్సెంట్-గ్రెనడైన్స్ ప్రదేశాలలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

టోర్నమెంట్‌లో పాల్గొనే జట్లు..

ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొనడం ఇదే తొలిసారి. అన్ని జట్లను ఐదు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. జూన్ 1, 18 మధ్య అన్ని జట్లు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీని తర్వాత జూన్ 19 నుంచి 29 మధ్య సూపర్ 8, సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 29న బార్బడోస్‌లో జరగనుంది.

• గ్రూప్ A – భారతదేశం, పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్, యూఎస్‌ఏ

• గ్రూప్ B – ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్

• గ్రూప్ C – న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, పాపువా న్యూ గినియా, ఉగాండా

• గ్రూప్ D – దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్

టీమిండయా గ్రూప్ మ్యాచ్‌ల షెడ్యూల్..

• జూన్ 5 – ఇండియా vs ఐర్లాండ్ – న్యూయార్క్ – రాత్రి 8 గంటలు

• జూన్ 9 – ఇండియా vs పాకిస్తాన్ – న్యూయార్క్ – రాత్రి 8 గంటలు

• జూన్ 12 – ఇండియా vs యూఏస్‌ఏ – న్యూయార్క్ – రాత్రి 8 గంటలు

• జూన్ 15 – ఇండియా vs కెనడా – ఫ్లోరిడా – రాత్రి 8 గంటలు.

T20 ప్రపంచ కప్ 2024 పూర్తి షెడ్యూల్..

తేదీ మ్యాచ్ స్థలం

1 జూన్ అమెరికా vs కెనడా డల్లాస్

2 జూన్ నమీబియా vs ఒమన్ బార్బడోస్

2 జూన్ వెస్టిండీస్ vs పాపువా న్యూ గినియా గుయానా

జూన్ 3 శ్రీలంక vs సౌతాఫ్రికా న్యూయార్క్

జూన్ 3 ఆఫ్ఘనిస్తాన్ vs ఉగాండా గుయానా

జూన్ 4 నెదర్లాండ్స్ vs నేపాల్ డల్లాస్

జూన్ 4 ఇంగ్లాండ్ vs స్కాట్లాండ్ బార్బడోస్

జూన్ 5 ఇండియా vs ఐర్లాండ్ న్యూయార్క్

జూన్ 5 ఆస్ట్రేలియా vs ఒమన్ బార్బడోస్

జూన్ 5 పాపువా న్యూ గినియా vs ఉగాండా గుయానా

జూన్ 6వ తేదీ అఅమెరికా vs పాకిస్తాన్ డల్లాస్

జూన్ 6వ తేదీ నమీబియా vs స్కాట్లాండ్ బార్బడోస్

7 జూన్ న్యూజిలాండ్ vs ఆఫ్ఘనిస్తాన్ గుయానా

7 జూన్ శ్రీలంక vs బంగ్లాదేశ్ డల్లాస్

7 జూన్ కెనడా vs ఐర్లాండ్ న్యూయార్క్

జూన్ 8వ తేదీ నెదర్లాండ్స్ vs సౌతాఫ్రికా న్యూయార్క్

జూన్ 8వ తేదీ ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ బార్బడోస్

జూన్ 8వ తేదీ వెస్టిండీస్ vs ఉగాండా

జూన్ 9 భారతదేశం vs పాకిస్థాన్ న్యూయార్క్

జూన్ 9 ఒమన్ vs స్కాట్లాండ్ ఆంటిగ్వా, బార్బుడా

జూన్ 10 దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్ న్యూయార్క్

11 జూన్ పాకిస్తాన్ vs కెనడా న్యూయార్క్

11 జూన్ శ్రీలంక vs నేపాల్ ఫ్లోరిడా

12 జూన్ అమెరికా vs ఇండియా న్యూయార్క్

12 జూన్ వెస్టిండీస్ vs న్యూజిలాండ్ ట్రినిడాడ్, టొబాగో

13 జూన్ ఇంగ్లండ్ vs ఒమన్ ఆంటిగ్వా, బార్బుడా

13 జూన్ బంగ్లాదేశ్ vs నెదర్లాండ్స్ సెయింట్ వించెట్

14 జూన్ అమెరికా vs ఐర్లాండ్ ఫ్లోరిడా

14 జూన్ దక్షిణాఫ్రికా vs నేపాల్ సెయింట్ వించెట్

14 జూన్ న్యూజిలాండ్ vs ఉగాండా ట్రినిడాడ్, టొబాగో

జూన్ 15 ఇండియా vs కెనడా ఫ్లోరిడా

జూన్ 15 నమీబియా vs ఇంగ్లాండ్ ఆంటిగ్వా, బార్బుడా

జూన్ 15 ఆస్ట్రేలియా vs స్కాట్లాండ్ సెయింట్ లూసియా

16 జూన్ పాకిస్థాన్ vs ఐర్లాండ్ ఫ్లోరిడా

16 జూన్ బంగ్లాదేశ్ vs నేపాల్ సెయింట్ వించెట్

16 జూన్ శ్రీలంక vs నెదర్లాండ్స్ సెయింట్ లూసియా

17 జూన్ న్యూజిలాండ్ vs పాపువా న్యూ గినియా ట్రిండాడ్, టొబాగో

17 జూన్ వెస్టిండీస్ vs ఆఫ్ఘనిస్తాన్ సెయింట్ లూసియా

T20 వరల్డ్ కప్ 2024 సూపర్-8 షెడ్యూల్..

తేదీ మ్యాచ్

19 జూన్ A2 vs D1

19 జూన్ B1 vs C2

20 జూన్ C1 vs A1

20 జూన్ B2 vs D2

21 జూన్ B1 vs D1

21 జూన్ A2 vs C2

22 జూన్ A1 vs D2

22 జూన్ C1 vs B2

23 జూన్ A2 vs B1

23 జూన్ C2 vs D1

జూన్ 24 B2 vs A1

జూన్ 24 C1 vs D2

BREAKING: ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన MLA పిన్నెల్లి.. నరసరావుపేటలో భారీ బందోబస్తు..!

ఈవీఎం ధ్వంసం కేసు తర్వాత అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు.

ఏపీ హైకోర్టు ఆదేశాలతో పల్నాడు జిల్లా ఎస్పీని పిన్నెల్లి ఇవాళ కలిశారు. బెయిల్ షరతుల ప్రకారం ఎస్పీ ఆఫీస్‌లో సంతకం చేసి వెళ్లిపోయారు. కాగా, ఈవీఎం ధ్వంసం కేసు తర్వాత ఎమ్మెల్యే పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో పిన్నెల్లి కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు లుక్ ఔట్ నోటీసులు సైతం జారీ చేశారు. పోలీసుల కళ్లు గప్పి తిరుగుతూనే పిన్నెల్లి ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టు ఆశ్రయించారు.

పిన్నెల్లి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు జూన్ 5వ తేదీ వరకు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 5 వరకు ప్రతి రోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేసి వెళ్లాలని హైకోర్టు పిన్నెల్లిని ఆదేశించింది. దీంతో ఇన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి.. కోర్టు ఆర్డర్‌తో ఎట్టకేలకు ఇవాళ ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లిపోయారు. పిన్నెల్లి అజ్ఞాతం వీడి బయటకు రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు నరసరావుపేటలో భారీగా పోలీసులను మోహరించారు

ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి గుడ్‌న్యూస్.. జూన్ నెల పింఛన్లపై కీలక నిర్ణయం

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకావడంతో ఏప్రిల్ నెల నుంచి వాలంటీర్లను ఎన్నికల సంఘం పక్కన పెట్టింది. వారితో పింఛన్లు పంపిణీ చేయొద్దని ఆదేశించింది.. దీంతో ఏప్రిల్ 1న గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్లను పంపిణీ చేశారు. మే నెలలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బుల్ని జమ చేశారు. ఈ నెల కూడా అదే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం పింఛన్లను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఏపీలో పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం కూడా మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలలో ఆదేశాల ప్రకారం.. గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర పింఛన్లు పంపిణీ చేయాలని సూచించింది. దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడేవారు, నడవలేనివారికి ఇంటి దగ్గరే పంపిణీ చేయాలని తెలిపింది. ఆ నెల గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర పింఛన్లను పంపిణీ చేశారు. మే నెలలో ప్రభుత్వం బ్యాంకు అకౌంట్‌లలో పింఛన్ డబ్బుల్ని జమ చేసింది. దీంతో పింఛన్ లబ్ధిదారులు బ్యాంకులకు క్యూ కట్టడంతో అక్కడ రద్దీ పెరిగింది.. కొందరికి బ్యాంక్ అకౌంట్‌ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. మరి జూన్ నెల పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. జులై నెల నుంచి అధికారం చేపట్టబోయే ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేయనుంది. వైఎస్సార్‌సీపీ తాము అధికారంలోకి రావడం ఖాయమని.. మళ్లీ వాలంటీర్లతో ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయిస్తామని చెబుతోంది. అటు టీడీపీ కూటమి తాము ఇచ్చిన హామీ ప్రకారం.. జులై నెల నుంచి పింఛన్‌ను రూ.3 వేల నుంచి 4వేలకు పెంచి ఇంటింటికి పంపిణీ చేస్తామంటోంది. అదే దివ్యాంగులకు అయితే రూ.6వేలు పింఛన్ ఇస్తామని చెబుతోంది. అంతేకాదు పెంచిన పింఛన్ ఏప్రిల్ నెల నుంచి ఇస్తామని.. జులై నెలకు సంబంధించి రూ.4వేలు.. మూడు నెలలకు సంబంధించి పెంచిన పింఛన్ రూ.వెయ్యి కలిపి రూ.7 వేలు ఇస్తామని చెబుతుంది. జూన్ 4న ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది తేలనుంది.

Palnadu District: APలో అరుదైన వ్యాధి! పల్నాడు జిల్లాలోని ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు!

కాలంలో మార్పులు రావడంతో ప్రపంచం వ్యాప్తంగా అనేక కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. కొన్ని రకాల వ్యాధులకు జనం భయపడిపోతున్నారు. ఇప్పటికే అనేక రకాల వింత వ్యాధులు వచ్చి జనాలను భయాందోళనకు గురి చేస్తుంటాయి.

కొత్త వ్యాధులతో పాటు ఎక్కడొ కనిపించే అతి అరుదైన వ్యాధులు కూడా ఇతర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు కలవరపాడుకు గురవుతుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో కూడా ఓ అరుదైన వ్యాధి బయటపడింది. ఎక్కడో నార్త్ ఇండియా రాష్ట్రమైన పంజాబ్ లో అరుదుగా కనిపించే వ్యాధి అందరిని కలవర పెడుతుంది. మరి.. ఈ వ్యాధి అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కొన్ని కొన్ని ప్రాంతాల్లో అరుదైన వ్యాధులు కనిపిస్తుంటాయి. అవి ఇతర ప్రాంతాల్లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. మహా అయితే పక్కన ఉన్న ప్రాంతంలో ఆ వింత వ్యాధుల లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ సంబంధం లేని ప్రాంతాల్లో వ్యాధి బయటపడినప్పుడు అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. అలాంటి ఘటనే పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. మనదేశంలో పంజాబ్ రాష్ట్రంలో సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్ అనే వ్యాధి అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఆ వ్యాధి ఇప్పుడు పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండాకు చెందిన ఇద్దరు పిల్లల్లో సికిల్ హిమోగ్లోబిన్ డి-పంజాబ్ అనే ఈ వ్యాధిని గుర్తించినట్లు గుంటూరు సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు.

సోమవారం జీజీహెచ్ వైద్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వ్యాధికి సంబంధించిన పలు విషయాలను, అలానే పిల్లలకు సోకిన అంశాలను వెల్లడించారు. శ్రీరాంపురం తండాకు చెందిన ఇద్దరు చిన్నారులు రక్తహీనత సమస్యతో ఇటీవల ఆస్పత్రికి వచ్చారని తెలిపారు. ఈక్రమంలో ఆ పిల్లల ఇద్దరికి వైద్యులు రక్త పరీక్షలు చేయగా ఈ అరుదైన వ్యాధి విషయం బయటపడిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు. ఇది చాలా అరుదైన వ్యాధిగా వైద్యులు తెలిపారు. దీనికి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే సరైన చికిత్సని ఆయన తెలిపారు.

ప్రస్తుతం జీజీ ఆస్పత్రిలో బోన్ మ్యారో ట్రాన్స్ ఫ్లాంటేషన్ విధానం అందుబాటులో లేదని వివరించారు. ప్రస్తుతం రెడ్ సెల్స్ ఎక్కించడం ద్వారా తాత్కాళికంగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు. ఇక ఈ చిన్నారుల్లో ఈ అరుదైన వ్యాధి బయటపడటంతో శ్రీరాంపుర తండా పరిసరాల్లోని చిన్నారులందరికీ రక్త పరీక్షలు నిర్వహించాలని జీజీహెచ్ వైద్యులు తెలిపారు. ఆ టెస్ట్ ల ద్వారానే ఇంకా ఎంతమందిలో ఇలాంటి సమస్య ఉందనే విషయం బయటకు వస్తుందని తెలిపారు.

సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్ అంటే ఏమింటంటే.. ఇదో జన్యుపరమైన వ్యాధి. తల్లిదండ్రుల్లో ఈ వ్యాధి ఉంటే వారికి పుట్టే పిల్లలకు వంశపారపర్యంగా సంక్రమించే ఛాన్స్ లు ఉన్నాయి. ఈ సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్ వ్యాధి సోకిన వారిలోని రక్తంలో హిమోగ్లోబిన్ 5శాతం కంటే తక్కువగా ఉంటుంది. రెడ్ సెల్స్ సంఖ్య తగ్గుతూ ఉంటుంది. దీంతో ఈ వ్యాధికి గురైన వారు ఆరోగ్య సమస్యలకు గురవుతుంటారు. అంతేకాక త్వరగా అలిసిపోతుంటారు. ఈ వ్యాధి పాకిస్థాన్, భారత్ లోని పంజాబ్ ప్రాంతం, నార్త్ చైనా, నార్త్ అమెరికా వంటి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇండియాలో పంజాబ్ ప్రాంతంలో అప్పుడప్పుడూ ఈ వ్యాధి వెలుగుచూస్తూ ఉంటుంది. అందుకే దీనిని సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్ అని పిలుస్తుంటారు. మొత్తంగా ఎక్కడొ పంజాబ్ లో కనిపించే ఈ వ్యాధి ఏపీలో బయటపడటంతో పల్నాడు వాసులు కలవరపడుతున్నారు.

Blood Tests: నూరేళ్లు బతకాలంటే ప్రతీ యేట ఈ 5 రకాల రక్త పరీక్షలు చేయించుకోవాలి! ఏవేవంటే..

మన శరీరంలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. కొన్ని సార్లు ప్రాణాంతక వ్యాధులు లోలోపల వృద్ధి చెందుతాయి. అన్నిసార్లు ఇలా జరగకపోయినా.. వ్యాధిని సకాలంలో గుర్తించడం చాలా అవసరం.

అందుకు మీ శరీరంలో ఎలాంటి వ్యాధిలేకపోయినా ప్రతి యేట కొన్ని ముఖ్యమైన రక్త పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. USG నుంచి యూరినాలిసిస్ వరకు అవయవాల ఎక్స్-రేల వరకు, వ్యాధిని నిర్ధారించడంలో సహాయపడే వివిధ రకాల పరీక్షలు సూచిస్తున్నారు నిపుణులు. ఇందులో రక్త పరీక్షలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా షుగర్‌, కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్ వంటి వాటి స్థాయిలను నిర్దారించడానికి రక్త పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఈ రక్త పరీక్షలు చేయించుకోవడం వల్ల సకాలంలో వ్యాధి ప్రమాదాన్ని నివారించవచ్చు. ప్రతి సంవత్సరం చేయించుకోవల్సిన రక్త పరీక్షలు ఇవే..

‘CBC’ టెస్ట్‌

రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్ల పరిమాణాన్ని కొలవడానికి CBC పరీక్ష అవసరం. ఈ పరీక్ష ద్వారా రక్తంలో ఏదైనా ఇన్ఫెక్షన్‌ని సులభంగా గుర్తించవచ్చు. రక్తం గడ్డకట్టే సామర్థ్యం కూడా ఈ రక్త పరీక్ష ద్వారా తెలుస్తుంది.

లిపిడ్ ప్రొఫైల్

ఈ రోజుల్లో కొలెస్ట్రాల్ సమస్య ప్రతి ఇంట్లో ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ఎంత పెరిగిందో తెలుసుకోవాలంటే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవల్సి ఉంటుంది. మీరు ప్రతి సంవత్సరం ఈ రక్త పరీక్ష చేయించుకుంటే కొలెస్ట్రాల్ సమస్య నుంచి మిమ్మల్ని మీరు సకాలంలో రక్షించుకోవచ్చు.

గ్లూకోజ్

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడాన్ని గుర్తించకపోతే మధుమేహం శరీరంపై నిశ్శబ్దంగా దాడి చేస్తుంది. ప్రతి సంవత్సరం గ్లూకోజ్‌ని చెక్ చేయడం ద్వారా చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులను సులభంగా గుర్తించవచ్చు. కాబట్టి నిర్ణీత వ్యవధిలో ఉపవాసం గ్లూకోజ్, HbA1c రక్త పరీక్షలను చేయించుకోవాలి.

థైరాయిడ్

థైరాయిడ్ హార్మోన్లు జీవక్రియ రేటును నిర్వహించడం నుంచి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడం వరకు అన్నింటికీ అవసరం. ఈ హార్మోన్ పరిమాణం పెరిగినా లేదా తగ్గినా శరీరంలో రకరకాల సమస్యలు తలెత్తుతాయి. బరువు పెరగడం నుంచి మానసిక కల్లోలం వరకు అనేక సమస్యలు ఈ హార్మోన్‌ వల్ల సంభవిస్తాయి. కాబట్టి ప్రతి సంవత్సరం థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను తనిఖీ చేసుకోవడానికి రక్త పరీక్ష చేయించుకోవాలి.

CMP టెస్ట్

శరీరంలో సోడియం, పొటాషియం, క్లోరైడ్, బైకార్బొనేట్, క్రియాటినిన్, నైట్రోజన్, బిలిరుబిన్, అల్బుమిన్, ప్రొటీన్ వంటి మూలకాలు సరైన మోతాదులో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి CMP రక్త పరీక్ష అవసరం.

Ajith Kumar: బైకే కాదు అజిత్ హెల్మెట్ కూడా యమా కాస్ట్లీ గురూ..! నెల జీతం పెట్టినా అది కొనలేం.!!

కొంతమంది స్టార్ నటీనటులు రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం లేదా.. ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. మరికొంతమంది రియాల్టీ షోలు చేస్తూ స్టార్ డమ్, క్రేజ్ పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

కానీ అజిత్ కుమార్ మాత్రం చాలా మంది స్టార్ యాక్టర్స్ కి పూర్తి భిన్నంగా ఉంటాడు. దళపతి విజయ్‌, రజనీకాంత్‌తో పాటు స్టార్‌ డమ్ ఉన్న నటుల్లో అజిత్ ఒకరు. మిగిలిన హీరోల్లా కాదు. హీరో అజిత్‌ తన పని తాను చేసుకుంటున్నాడు. షూటింగ్ ఉన్నప్పుడు వచ్చి నటించి, ఆ తర్వాత షూటింగ్ అయిపోగానే బైక్ రైడింగ్ కి వెళ్లిపోతారు. ఇప్పటికే అజిత్ రైడింగ్ చేసిన చాలా వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇండియాలోని పలు రాష్ట్రాలకు బైక్ టూర్ వెళ్లిన అజిత్.. విదేశాల్లో కూడా బైక్ నడిపాడు. రీసెంట్ గా ఓ షూటింగ్ లో బిజీగా ఉన్న అజిత్ హైదరాబాద్ వీధుల్లో బైక్ నడుపుతూ ఎంజాయ్ చేశాడు. అజిత్ తన ఖరీదైన బైక్‌ను నడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అజిత్ బైక్ ధరపై ఇప్పటికే చాలా వచ్చాయి, అయితే ఇప్పుడు అతని హెల్మెట్ ధర గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. అజిత్ ఎక్కువగా బిఎమ్‌డబ్ల్యూ బైక్‌ను నడుపుతాడు. అతని దగ్గర మూడు కంటే ఎక్కువ బిఎమ్‌డబ్ల్యూ బైక్‌లు ఉన్నాయి. అజిత్ హైదరాబాద్‌లో 12 లక్షల బిఎమ్‌డబ్ల్యూ బైక్‌ను నడుపుతూ కనిపించాడు. అయితే ఈసారి మాత్రం కేవైటీ బ్రాండ్ హెల్మెట్ ధరించి కనిపించాడు. ఇది మామూలు హెల్మెట్ కాదు. ఈ హెల్మెట్ ధర 35 వేల రూపాయలు.

ఈ హెల్మెట్‌లో కార్బన్ ఫైబర్‌ని ఉపయోగిస్తారు. దాని పై భాగం చాలా గట్టిగా ఉంటుంది. అయితే ఈ హెల్మెట్ చాలా తేలికగా ఉంటుంది. ముందు గ్లాస్ పై ఎక్కువ గీతలు ఉండవు. అలాగే పొగమంచు పడినా కూడా దాని మీది అది నిలవదు. హెల్మెట్ లోపల బ్లూటూత్ స్పీకర్ , మైక్‌తో పాటు కూలింగ్ గ్లాస్ ఉంటాయి. హెల్మెట్‌లో అద్భుతమైన వెంటిలేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. అందుకే ఈ హెల్మెట్ ధర కాస్త ఎక్కువ.

ప్రస్తుతం అజిత్ ‘గుడ్, బ్యాడ్ అగ్లీ’ అనే లో నటిస్తున్నాడు. గతంలో అజిత్ నటించిన ‘తునీవు’ 2023లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. లో మిగిలిన నటీనటుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ తర్వాత అజిత్ ‘విడ మయూర్చి’ లో నటించనున్నాడు.

Pandemic: ప్రపంచ దేశాలకు హెచ్చరిక.. రాబోతున్న మరో సంక్షోభం ?

Pandemic: కరోనా తరహా మరో సంక్షోభం ప్రపంచ దేశాలు ఎదుర్కోక తప్పదని బ్రిటన్ ప్రభుత్వ మాజీ చీఫ్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రపంచ దేశాలు ఏర్పాట్లు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతే కాకుండా సంక్షోభ నివారణ ఏర్పాట్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. అందులో భాగంగానే పలు కీలక అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

రాబోయే ప్రమాదాలను ముందుగా గుర్తించేందుకు పటిష్ట నిఘా వ్యవస్థ ఉండాలని అన్నారు. సంక్షోభం తలెత్తినప్పుడు తక్షణం స్పందించే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అందుకు తగిన వైద్య పరీక్షల నిర్వహణ సామర్థ్యం, చికిత్సలు, టీకాలు అన్నీ అందుబాటులో ఉంటే.. లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్ వంటివి పాటించే అవసరం ఉండదన్నారు.

2021లో తాను చేసిన సూచనలన్నీ 2023 నాటికే ప్రపంచ దేశాలు మరిచిపోయాయన్నారు. కానీ ప్రస్తుతం ప్రపంచ దేశాలు సైనిక అవసరాల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉంటారో..సంక్షోభం విషయంలో అంతే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.ఆర్మీ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూనే సంక్షోభ నివారణలపై దృష్టి పెట్టాలని తెలిపారు. సంక్షోభం సమయంలో వివిధ దేశాలు కలిసికట్టుగా పనిచేసేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు.

కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. తన రూపాలను మార్చుకుంటూ పంజా విసురుతోంది. అయితే ఇటీవల సింగపూర్ సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోని పాట్రిక్ వాలెన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో KCR పేరు.. కోర్టులో సంచలన విషయాలు చెప్పిన ఈడీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ సంచలన విషయాలను బయటపెట్టింది. ఈకేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుతో సంబంధాలు ఉన్నట్లుగా తెలియజేసింది.

లిక్కర్ స్కాంలో మరో పెద్ద తలకాయ..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ సంచలన విషయాలను బయటపెట్టింది. ఈకేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుతో సంబంధాలు ఉన్నట్లుగా తెలియజేసింది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ సర్కారుకు సంబంధించి సీఎం కేజ్రీవాల్, డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జైలుకు పంపింది ఈడీ. తాజాగా ఈ కేసుకు సంబంధించి కొత్త విషయాలను ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఇన్ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్. ఢిల్లీ లిక్కర్ పాలసీ, రిటైల్ వ్యాపారం గురించి కవిత ముందుగానే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా వెల్లడించింది. అసలు ఈ కేసులో కేసీఆర్ పాత్ర కూడా కీలకమే అనే విషయాన్ని కోర్టుకు తెలియజేసింది.

కేసీఆర్ పాత్ర ఎంత ఉంది..

ఢిల్లీ లిక్కర్ పాలసీ, రిటైల్ వ్యాపారం గురించి కవిత కేసీఆర్ కు ముందుగానే చెప్పినట్లు.. అలాగే కవిత టీంలోని సభ్యులుగా ఉన్న వారిని ఢిల్లీ కేసీఆర్ నివాసంలో పరిచయం చేసినట్లుగా ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వీటితో పాటు మరికొన్ని వీస్తుపోయే నిజాల్ని వెల్లడించింది.బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లిని పరిచయం చేయగా వారి నుంచే మద్యం వ్యాపారం వివరాలు కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఇక ఈకేసులో కింగ్ పిన్ గా ఉన్న కవితకు ఇప్పుడు బెయిల్ ఇస్తే ఈకేసుపై తీవ్రప్రభావం పడే అవకాశం ఉందని వాదనలు వినిపించింది. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో తీర్పును మే 30కి వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంపై లోక్ సభ ఎన్నికల ప్రచారం సమయంలో కేసీఆర్ స్పందించారు. తన కూతురు కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని గులాబీ బాస్ చెప్పారు. అయితే ఇప్పుడు ఈడీ, సీబీఐ ఈకేసులో కేసీఆర్ పేరును కూడా తెరపైకి తేవడం చూస్తుంటే ఆయన చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

AP SCERT 10TH CLASS NEW TEXT BOOKS DOWNLOAD

AP SCERT 10TH CLASS NEW TEXT BOOKS DOWNLOAD

Introduction

In the ever-evolving landscape of education, it is crucial for students to have access to the latest and most relevant textbooks to aid in their learning journey. The recent update in the Andhra Pradesh State Council of Educational Research and Training (AP SCERT) 10th class textbooks has brought about significant changes that aim to enhance the quality of education for students. Let’s delve the details of how to download these new textbooks and explore the benefits they offer.

 AP 10th Class New Text Books 2024 Download Links

Class Text Book Title Download Link
10 AP SCERT 10th Class Telugu textbook Click here to download
10 AP SCERT 10th Class English Nontail book Click here to download
10 AP SCERT 10th Class English Textbook Click here to download
10 AP SCERT 10th Class English Workbook Click here to download
10 AP SCERT 10th Class Hindi textbook Click here to download
10 AP SCERT 10th Class Maths SEM-1 textbook Click here to download
10 AP SCERT 10th Class Maths SEM-2 textbook Click here to download
10 AP SCERT 10th Class Physics textbook Click here to download
10 AP SCERT 10th Class Biology Textbook BM Click here to download
10 AP SCERT 10th Class Social Economics textbook Click here to download
10 AP SCERT 10th Class Social Geography textbook Click here to download
10 AP SCERT 10th Class Social History textbook Click here to download
10 AP SCERT 10th Class Social Politics textbook Click here to download

AP EAMCET: AP EAP CET Results ఏపీ ఈఏపీసెట్ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి !

AP EAMCET Results 2024: ఏపీలో ఇటీవల ఈఏపీసెట్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే..అయితే ఇప్పటికే అధికారులు ప్రిలిమినరీ కీ కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫలితాలను ఈ రోజు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అభ్యర్థులు ఫలితాల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఫలితాలతో పాటు..కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా అధికారులు విడుదల చేసే అవకాశం ఉంది.

ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ పరీక్షలను మే 16, 17 తేదీల్లో 4 సెషన్లలో నిర్వహించారు. ఇక ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు..మే 18 నుంచి 23 వరకు 9 సెషన్లలో నిర్వహించారు. రోజుకు రెండు సెషన్లలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు రెండో సెషన్ నిర్వహించారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ మే 24న ఈ పరీక్షలకు సంబంధించిన కీ కూడా విడుదల చేశారు. అయితే అధికారులు వీటి రిజల్ట్స్ ప్రకటించనున్నారు.

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ AP EAMCET యొక్క BiPC, MPC స్ట్రీమ్‌ల ఫలితాలు ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత అభ్యర్థులు తమ AP EAMCET 2024 ర్యాంక్ కార్డ్‌ని అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వారి ర్యాంక్ కార్డును యాక్సెస్ చేయడానికి, అభ్యర్థులు వారి దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి. ఫలితాల ప్రకటన తర్వాత ఆన్‌లైన్‌లో స్కోర్‌కార్డ్ లింక్‌ని యాక్టివేట్ చేస్తారు.

తల్లిదండ్రులారా తస్మాత్ జాగ్రత్త.. బూచోళ్లు తిరుగుతున్నారు..! పిల్లల కిడ్నాప్‌ ముఠా గుట్టురట్టు

తల్లిదండ్రులారా ఇది హెచ్చరిక మీకు.. వేసవి సెలవులు కదా అని పిల్లల్ని ఆడుకోవడానికి ఒంటరిగా బయటకు పంపిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..! బూచోల్లొస్తున్నారు. పిల్లల్ని ఎత్తుకెళ్లి నిలువునా అమ్మేసే బూచోళ్లు తిరుగుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పిల్లల్ని విక్రయిస్తున్న ఓ ముఠాను పట్టుకుంటే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పిల్లలు లేని దంపతులే టార్గెట్‌గా కిడ్నాప్ ముఠాలు విచ్చలవిడిగా విజృంభిస్తున్నాయి. పేదలు, అమాయకుల పిల్లల్ని ఎత్తుకొచ్చి నిలువునా అమ్మేస్తున్నాయి కిడ్నాప్ ముఠాలు. తాజాగా హైదరాబాద్ మేడిపల్లి కేంద్రంగా పిల్లలను అక్రమంగా తరలిస్తున్న ఓ ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఢిల్లీ, పూణే నుంచి చిన్న పిల్లలను తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తోంది ఓ కిలాడీ ముఠా. 3 నెలల పసికందుల నుంచి ఏడాది పిల్లల వరకు విక్రయిస్తోందీ గ్యాంగ్. ఈ ముఠాపై పక్కా నిఘా పెట్టిన పోలీసులు.. 16 మంది చిన్నారులను కాపాడారు.

శోభారాణి, స్వప్న,షేక్ సలీం సహా 11 మంది నిందితులు పిల్లల విక్రయ రాకెట్‌లో భాగమైనట్టు పోలీసుల విచారణలో తేలింది. పీర్జాదిగూడలోని ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ అడ్డాగా ఆర్‌ఎంపీ శోభారాణి ఎప్పటి నుంచో ఈ దందా నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పిల్లలు లేనివారికి అక్రమంగా చిన్నారులను అమ్మేసి లక్షలకు దండుకుంటున్నారు. ఇప్పటివరకు 50 మందిని విక్రయించినట్టు విచారణలో తేలింది.

కాపాడిన 16 మంది పిల్లలను వారి తల్లిదండ్రుల దగ్గరకు అప్పజెప్తుంటే.. కొనుగోలు చేసిన దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పోసి కొన్నాం. పైగా ఇన్ని రోజులు మమకారంతో పెంచుకున్నాం మా పరిస్థితి ఏంటంటూ బోరున ఏడుస్తున్నారు.

అయితే అక్రమంగా పిల్లలు కొన్నందుకు వాళ్ల మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. ఎవరికైనా పిల్లలు లేకపోతే.. దత్తత తీసుకోవాలనిపిస్తే.. చట్టబద్ధంగా తీసుకోవాలి. అంతేగానీ ఇలా అక్రమంగా కొనుగోలు చేసి నేరాలకు పాల్పడొద్దంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు..

రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు.. ఇకపై అవి కనిపించవా?

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జూన్ 2వ తేదీన అవతరణ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అందుకు సంబంధించిన అన్నింటినీ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవల్​లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర గీతం, కొత్త అధికారిక చిహ్నాన్ని కూడా తీసుకురానున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర గీతాన్ని స్వరపరచడానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణితో చర్చలు కూడా జరిపారు.

తెలంగాణ అధికారిక చిహ్నం మార్పుతో పాటు పలు అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో చిట్​చాట్ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాచరికం ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం ఉండబోతోందన్నారు. తెలంగాణ అంటేనే త్యాగాలు, పోరాటాలని.. ఇక్కడ రాచరిక ఆనవాళ్లకు చోటు లేదని చెప్పారు. అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం కూడా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్​కు చెందిన ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిప్సిపల్​కు రాజముద్ర రూపకల్పన బాధ్యతల్ని అప్పగించామని రేవంత్ పేర్కొన్నారు. సమ్మక్క-సారక్క, నాగోబా జాతర స్ఫూర్తి ప్రతిబింబించేలా తెలంగాణ చిహ్నాన్ని తయారు చేస్తున్నామని రేవంత్ వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఎంఎం కీరవాణి రూపొందిస్తున్నారనే వార్తలపై రేవంత్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతల్ని ‘జయజయహే తెలంగాణ’ పాట రాసిన అందెశ్రీకే ఇచ్చామన్నారు. ఎవరితో మ్యూజిక్ కంపోజ్ చేయించాలనేది ఆయన నిర్ణయానికే వదిలేశామని స్పష్టం చేశారు. కీరవాణిని అందెశ్రీనే ఎంపిక చేశారని, అందులో తన పాత్ర లేదని వెల్లడించారు. ఇక, రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా పాలన సాగుతోందన్నారు రేవంత్. విపక్షాలకు విమర్శించే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఎక్స్​పర్ట్స్ తేల్చినదే పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్తామన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ వెన్నెముక విరిగిందన్న ముఖ్యమంత్రి.. ఈ విషయాన్ని తాను ముందే చెప్పినట్లు గుర్తుచేశారు.

Best Horror Thriller In OTT: దెయ్యాల అడవిలో ఆడపిల్ల పోరాటం! OTTలో సూపర్ హర్రర్ మూవీ!

థియేటర్స్ కు అయినా అప్పుడప్పుడు సినిమాలు లేక బ్రేక్ ఉంటుందేమో కానీ, ఓటీటీ లో మాత్రం అసలు గ్యాప్ రాదు. ప్రతి వారం డజన్లలో సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ప్రేక్షకులు కూడా వాటికీ తగిన ఆదరణను ఇస్తూనే ఉన్నారు. ఇక ఉన్న సినిమాలు బోర్ కొట్టేసి కొత్త కంటెంట్ ను చూడాలనుకుంటే మాత్రం పాత సినిమాలను చూడాల్సిందే. ఇప్పటికే ఓటీటీ లో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. చాలా ఎక్కువ కంటెంట్ ఉంది కాబట్టి.. వాటిలో కొన్ని సినిమాలను ప్రేక్షకులు మిస్ చేసే అవకాశం ఉంది. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా మీరు మిస్ చేసిన సినిమాల లిస్ట్ లో ఉందేమో ఓ లుక్ వేసేయండి. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలను చూసేవాళ్లకు ఈ సినిమా బాగా నచ్చేస్తుంది. సారా, జెస్ ఇద్దరూ ట్విన్ సిస్టర్స్. జెస్ జపాన్ లోని ఓ స్కూల్ లో టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. అయితే ఆమె స్కూల్ క్యాంపులో భాగంగా ఓ అడవిలో ఉన్న పర్వతం దగ్గరకు వెళ్తుంది. ఈ క్రమంలో ఆమె అనుకోకుండా దారి తప్పిపోతోంది. ఆ ప్రాంతాన్ని అవోకి గహర అని అంటారు. దీనితో ఈ కేసును సాల్వ్ చేయడానికి పోలీస్ ఆఫీసర్స్ రంగంలోకి దిగుతారు. అయితే జెస్ వెళ్లిన ఆ ప్రాంతానికి కేవలం సూసైడ్ చేసుకునే వారు మాత్రమే వెళ్తారంటూ చెప్పుకొచ్చారు పోలీసులు. కాబట్టి జెస్ కూడా అందుకే వెళ్లిందని.. బహుశా ఆమె కూడా చనిపోయి ఉంటుందని ఓ పోలీస్ ఆఫీసర్ సారాకు చెబుతాడు. అయితే సారా ఈ విషయాన్నీ అంగీకరించదు. ఎందుకంటే వారిద్దరూ ట్విన్స్ కాబట్టి .. జెస్ కు ఏదైనా జరిగితే అది ఖచ్చితంగా సారాకు తెలుస్తుందని చెప్తుంది. ఆమె బ్రతికే ఉందని సారా బలంగా నమ్ముతూ.. జెస్ ను వెతుక్కుంటూ జపాన్ వెళ్తుంది.

జపాన్ వెళ్లిన సారాకు.. జెస్ వెళ్లిన ఆ ప్రాంతం గురించి రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు తినడానికి తిండి కరువై, ఇంట్లో ముసలి వాళ్ళను, వికలాంగులను ఆ అడవిలో వదిలేసే వారని.. వారంతా ఆకలితో చనిపోయి దెయ్యాలై కోపంతో తిరిగివచ్చేవారని ఇలా రకరకాలుగా వింటుంది. ఈక్రమంలో అక్కడ ఆమెకు ఓ అమేరికన్ జర్నలిస్ట్ పరిచయం అవుతుంది. సారా కథ విన్న తర్వాత.. ఆ జర్నలిస్ట్ తన డాక్యుమెంటరీ కోసం సారా హెల్ప్ కావాలని.. ఓ గైడ్ ను ఏర్పాటు చేసుకుని ఆ ఫారెస్ట్ లోకి వెళదామని చెప్తాడు. దీనితో వారిద్దరూ ఆ అడవిలోకి వెళ్ళడానికి రెడీ అవుతారు. అక్కడే ఉన్న ఓ యువతి ఇదొక మాయ అడవి అని ఉన్నవి లేనట్లుగా కనిపిస్తాయని హెచ్చరిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది ? జెస్ ను వెతుక్కుంటూ వెళ్లిన సారాకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ? సారా జెస్ ను కనిపెట్టిందా ? లేదా సారా కూడా ఆ అడవిలో బలైపోయిందా ? ఆమెతో వచ్చిన జర్నలిస్ట్ కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి ? ఇవన్నీ తెలియాలంటే “ది ఫారెస్ట్” అనే ఈ సినిమాను చూడాల్సిందే.

Health

సినిమా