Saturday, November 16, 2024

రేవంత్ ను కలిసిన నందమూరి బాలకృష్ణ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలిశారు. మర్యాదపూర్వకంగానే బాలకృష్ణ రేవంత్ రెడ్డిని కలిశారని ముఖ్యమంత్రి కార్యాలయవర్గాలు వెల్లడించాయి.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను చేపట్టిన తర్వాత బాలకృష్ణ ఆయనను కలవలేదు. సినిమా షూటింగ్ లు తర్వాత ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బాలకృష్ణ ఆయనను కలవలేకపోయారు.

మర్యాదపూర్వకంగానే…అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బాలకృష్ణ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. ఏపీ రాజకీయాలపైన వారిద్దరూ కొద్దిసేపు చర్చించుకున్నారని తెలిసింది. దీంతో పాటు సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలు కూడా వీరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.

New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. జూన్‌ 1 నుంచి కొత్త నిబంధనలు..ఉల్లంఘిస్తే భారీ జరిమానా!

మే నెల ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత జూన్ నెల ప్రారంభమవుతుంది. జూన్‌ నెలలో ఎన్నో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఒకవైపు దేశ పొలిటికల్ కారిడార్లలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. మరోవైపు, మొదటి తేదీ నుండి మీ జేబుకు సంబంధించిన అనేక విషయాలలో మార్పులు ఉండబోతున్నాయి. గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు మొదటి తేదీ ఉదయాన్నే నిర్ణయించబడతాయి. ఒకటో తేదీ నుంచి ఆధార్‌కు సంబంధించిన నిబంధనలలో కూడా మార్పులు రానున్నాయి. దీంతోపాటు ట్రాఫిక్ రూల్స్‌లో కూడా అనేక మార్పులు రానున్నాయి. వీటిని పాటించకుంటే సామాన్యుల జేబులపై పెనుప్రభావం పడుతుంది. జూన్ 1 నుంచి ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో కూడా చెప్పుకుందాం.

గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు: గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలో ప్రతి నెలా ఒకటో తేదీన మార్పు ఉంటుంది. దేశీయ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయిస్తాయి. జూన్ 1న రెండు రకాల గ్యాస్ సిలిండర్ల ధరలో మార్పు ఉండవచ్చు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరపై డేటా ప్రకారం, గృహ గ్యాస్ సిలిండర్ ధరలో చివరిసారిగా మార్చి 9న తగ్గుదల కనిపించింది. గత నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్లు చౌకగా మారాయి.
ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్‌పై ఉపశమనం: సామాన్యులకు గొప్ప ఉపశమనం ఇస్తూ, UIDAI ఉచిత ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్‌ తేదీని జూన్ 14 వరకు పొడిగించింది. అంటే ఎవరైనా ఆన్‌లైన్‌లో ఆధార్‌ను అప్‌డేట్ చేస్తే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆధార్ కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకుంటే ఒక్కో అప్ డేట్ కు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
25 వేల జరిమానా విధించే నిబంధన: మరోవైపు, మైనర్ వాహనం నడుపుతున్నట్లు తేలితే, అతనికి భారీ జరిమానా విధించబడుతుంది. ప్రస్తుతం, దేశంలో వాహనం నడపడం లేదా లైసెన్స్ పొందే వయస్సు 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ. మైనర్ ఇలా చేస్తే రూ.25,000 జరిమానా విధించవచ్చు. అలాగే, అతనికి 25 ఏళ్లు వచ్చే వరకు ఎలాంటి లైసెన్సు లభించదు.
ట్రాఫిక్ రూల్స్‌లో కూడా మార్పులు: జూన్ 1 నుంచి ట్రాఫిక్ రూల్స్‌లో మార్పులు రానున్నాయి. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం.. అతి వేగంతో వాహనం నడిపితే రూ.1000 నుంచి రూ.2000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా హెల్మెట్, సీటు బెల్ట్ లేకుండా వాహనం నడిపితే రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో కూడా డ్రైవింగ్ పరీక్షలు: ప్రజలు ఇప్పుడు ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు (కొత్త రూల్ జూన్ 2024లో వర్తిస్తాయి). ఇక్కడ వారి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించుకోవచ్చు. వారికి లైసెన్స్ కూడా జారీ చేయబడుతుంది. గతంలో ఈ పరీక్షలు ఆర్టీఓ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ కేంద్రాల్లోనే జరిగేవి. ఈ నియమం జూన్ 1 నుండి వర్తిస్తుంది., అయితే ఈ పరీక్షలు RTO ద్వారా గుర్తింపు పొందిన ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో మాత్రమే నిర్వహించబడతాయి. ఈ నిబంధన కూడా జూన్ 1 నుంచి మాత్రమే వర్తిస్తుంది.

పిల్లల విషయంలో తల్లిదండ్రులకు తగ్గనున్న భారం! విద్యాశాఖ కీలక ఆదేశం..

ఇప్పుడు సమ్మార్‌ సీజన్‌ పాఠశాలలు సెలవు కావడంతో విద్యార్థులంతా ఈ వేసవి సెలవులను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇక ఈ వేసవి సెలవులు అనంతరం మరి కొన్ని రోజుల్లో అనగా జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.ఇక విద్యార్థులంతా ఈ వేసవి సెలవులను ముగించుకొని తిరిగి విద్యా సంస్థలకు హాజరుకావల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే.. తాజాగా 2024–25 అకడమిక్​ ఇయర్​ క్యాలెండర్‌ను శనివారం రిలీజ్‌ చేసింది. కాగా, అందులో ఇకపై స్కూల్‌ పిల్లలకు ఇది కూడా తప్పనిసరి అనిఈమేరకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక ఈ విద్యా సంవత్సరంలో మొత్తంగా 229 రోజులు వర్కింగ్​ డేస్​గా నిర్ణయించారు. దీంతో దసరా సెలవులు 13 రోజులు, క్రిస్మస్​, సంక్రాంతికి ఐదు రోజుల చొప్పున సెలవులు ఇవ్వనున్నారు. దాంతో పాటు స్కూళ్లలో ప్రతిరోజూ ఐదు నిమిషాలపాటు యోగా, ధ్యానం నిర్వహించాలని ఆ క్యాలెండర్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు ప్రేయర్​ కు ముందుగానీ, ప్రేయర్​ అయ్యాక క్లాసులో కానీ, ఐదు నిమిషాల పాటు విద్యార్థులతో యోగా మెడిటేషన్​ చేయించాలని సూచించారు. దీంతో పాటు ప్రతి నెలా మూడో శనివారం విధిగా నో బ్యాగ్​ డేని అమలు చేయాలని, మొత్తంగా విద్యాసంవత్సరంలో పది నో బ్యాగ్​ డేలను అమలు చేయాలని అందులో పేర్కొన్నారు.

వీటితో పాటు ముఖ్యంగా అన్ని స్కూళ్లూ విద్యార్థులకు రెగ్యులర్​గా హెల్త్​ చెకప్​లను చేయించాలని ఆ అకాడమిక్​ క్యాలెండర్​లో పేర్కొన్నారు. అయితే ప్రైమరీ హెల్త్​ సెంటర్​ (పీహెచ్​సీ)ల నిపుణులతో విద్యార్థులకు చెకప్​లు చేయించి, రిఫరల్​ కేసులుంటే స్థానిక ఏరియా ఆస్పత్రులకు పంపించాలని సూచించారు. ఇక విద్యార్థులకు నిర్వహించే ఈ హెల్త్‌ చెకప్‌ అనేది ఏటా రెండుసార్లు కచ్చితంగా చేయించాలని, అందుకు హెడ్​మాస్టర్లు కో ఆర్డినేట్​ చేయాలని పేర్కొన్నారు. దీంతో పాటు క్యుములేటివ్​ రికార్డ్స్​ కింద ఇప్పటికే ప్రింట్​ చేసిన విద్యార్థుల హెల్త్​ కార్డులను ప్రాపర్​గా మెయింటెయిన్​ చేయాలని అందులో చెప్పుకొచ్చారు.

ఇక పదో తరగతి సిలబస్​ను వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ కల్లా పూర్తి చేయాలని, బోర్డు ఎగ్జామ్స్​కు విద్యార్థులను ప్రిపేర్​ చేసేలా రివిజన్​, ప్రీ ఫైనల్​ ఎగ్జామ్స్​ను కండక్ట్​ చేయాలని సూచించారు. అలాగే ఒకటి నుంచి తొమ్మిదో క్లాస్​ వరకు ఫిబ్రవరి 28 నాటికి సిలబస్​ను కంప్లీట్​ చేసేలా అకాడమిక్​ క్యాలెండర్​ను రూపొందించారు. అందుకోసం విద్యార్థుల హాజరు శాతం పడిపోకుండా స్కూళ్లు చూసుకోవాలని విద్యాశాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే ప్రతి స్కూల్​లోనూ 90 శాతానికిపైగా విద్యార్థుల అటెండెన్స్​ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే ప్రతి రోజూ అరగంట పాటు రీడింగ్​ యాక్టివిటీకి టైం కేటాయించాలని, స్కూల్​ బుక్స్​తో పాటు స్టోరీ బుక్స్​, న్యూస్​ పేపర్లు, మ్యాగజైన్లను చదివించాలని పేర్కొంది.

స్కూల్ వాట్సప్ గ్రూప్ చూడట్లేదని టీచర్ సస్పెన్షన్.

వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యాడని టీచర్ సస్పెన్షన్..!

విజయవాడ : వాట్సాప్ చూడటం లేదని ఓ టీచర్ ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. స్కూల్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యాడని మరో కారణం చెప్పారు. ఈ ఉత్తర్వులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విజయవాడలోని మొగల్రాజపురంలో బీఎస్ఆర్కే మున్సిపల్ హైస్కూల్‌లో పని చేస్తున్న ఎల్‌ రమేష్ అనే ఉపాధ్యాయుడ్ని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇందులో విద్యాశాఖాధికారి చెప్పినప్రధాన కారణం… సదరు ఉపాధ్యాయుడు ఎల్ రమేష్ కొంత కాలం గా ఆరోగ్య సమస్య తో వాట్సాప్ చూడటం లేదట. అంతే కాదు స్కూల్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యారట. స్కూల్ గ్రూపు నుంచి ఎగ్జిట్ అయి.. వాట్సాప్ చూడకపోవడం వల్ల…ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాలను ఆయన మిస్ అవుతున్నారని అంటున్నారు. ఆయనతో కమ్యూనికేట్ చేయడం కష్టంగా ఉందని.. చెబుతున్నారు.

ఇలా ఎందుకు చేశారని ఎల్ రమేష్ ను పై అధికారులు వివరణ కూడా అడిగారు. అయితే తనకు కంటి సమస్య ఉందని మొబైల్ ఫోన్ ను అదే పనిగా వాడవద్దని.. ముఖ్యంగా వాట్సాప్ చూడవద్దని వైద్యుడు సూచించారని రమేష్ వివరణ ఇచ్చారు.

అయితే ఆయన నోటి మాటగానే ఈ వివరణ ఇచ్చారని.. వైద్యుడు ఇచ్చిన సూచనల డాక్యుమెంట్లు సమర్పించలేదని వివరణ తీసుకున్న అధికారి తేల్చారు. ఇది పూర్తిగా నిర్లక్ష్యమేనని అందుకే ఆయనను సస్పెండ్ చేయాల్సిందేనని తీర్మానించి.. నిర్ణయం తీసుకున్నారు.

అధికారుల ఉత్తర్వులు వైరల్ గామారాయి. వాట్సాప్ వాడకపోవడం తప్పు ఎలా అవుతుందన్న ప్రశ్నలు ఉపాధ్యాయ వర్గాల్లోనే వస్తున్నాయి. కమ్యూనికేషన్ ను వాట్సాప్ ద్వారా చేయడం అనేది ఓ ఆప్షనే కానీ.. అదేమీ నిర్బంధం కాదని.. చెబుతున్నారు. వాట్సాప్ లు లేక ముందు కూడా స్కూళ్లు, ఉపాధ్యాయులు ఉన్నారని గుర్తు చేస్తున్నారు.

స్మార్ట్ ఫోన్ వాడాలా వద్దా అన్నది వ్యక్తిగత ఇష్టం.. వాట్సాప్ ఉన్న వారికి ఆదేశాలు వాట్సాప్ లో ఇచ్చి.. లేని వారికి.. మరో పద్దితలో సమాచారం ఇస్తే సరిపోయేదానికి ఇలా సస్పెన్షన వేటు వేయడమేమిటన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

అయితే విద్యాశాఖ మంత్రి ఆదేశాలు తో అధికారులు మాత్రం.. ఆ ఉపాధ్యాయుడు విధుల్లో పూర్తి స్థాయి నిర్లక్ష్యంగా ఉంటున్నారని.. వాట్సాప్ లో ఉండకపోవడం కూడా కారణమని అంటున్నారు. ఏది ఏమైనా.. ఉపాధ్యాయులు ఈ ఉత్తర్వులను చూపించి పై అధికారులు ఎలా వేధిస్తున్నారో ఇంత కంటే సాక్ష్యం ఉంటుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నారు.

అమరావతి: విజయవాడలోని మొగల్రాజపురం BSRK ఉన్నత పాఠశాల ఉపాధ్యా యుడు.. స్కూల్ వాట్సాప్ గ్రూప్ లోని మెసేజ్ లు చూడడం లేదని ఆయనను సస్పెండ్ చేయడం వివాదాస్పదంగా మారింది.

దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే సస్పెన్షన్ను రద్దు చేయాలంటూ.. జిల్లా విద్యాశాఖ అధికారులకు యూటీ ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందజేశారు.

తనకు కంటి సంబంధిత సమస్య ఉండడంతో స్మార్ట్ మొబైల్ వాడొద్దని వైద్యులు సూచించారని రమేష్ వివరణ ఇచ్చినా.. వ్యక్తిగత విషయాన్ని సాకుగా చూపిస్తూ సస్పెండ్ చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు మాట్లా డుతూ.. వాట్సప్ గ్రూపు నుంచి రమేష్ అకస్మాత్తుగా వెళ్లి పోవడం, విధినిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండడం, కంటి సమస్య ఉన్నట్లు వైద్యులు సూచించిన ధ్రువీకరణపత్రాలు సమర్పించాలని కోరినా స్పందించకపోవడం వల్లే ఆయ నపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

Aadhaar Card: జూన్ 14 తర్వాత ఆ ఆధార్‌ కార్డులు పనిచేయవా? ఉడాయ్‌ వివరణ..

ఆధార్‌కు (Aadhaar Card) సంబంధించి సోషల్‌ మీడియా సహా బయట ఈ మధ్య తెగ చర్చ జరుగుతోంది. జూన్‌ 14 లోపు వ్యక్తిగత వివరాలు అప్‌డేట్‌ చేయకపోతే కార్డు పని చేయదంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వదంతులను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (UIDAI) కొట్టిపారేసింది.

ఆధార్‌లో (Aadhaar Card) కేవలం ఉచితంగా వివరాలు సవరించుకోవడానికి మాత్రమే జూన్‌ 14 గడువని తెలిపింది. మార్చుకోకపోయినా ఆధార్‌ పనిచేస్తుందని స్పష్టం చేసింది. తర్వాత కూడా వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి నిర్దేశిత రుసుము చెల్లిస్తే సరిపోతుందని వివరించింది. వివరాల మార్పునకు విధించిన జూన్‌ 14 గడువు సమీపిస్తుండటంతో అనేక వదంతులు వ్యాపిస్తున్నాయి.

ఉచితంగా ఆన్‌లైన్‌లో ఆధార్‌ (Aadhaar) వివరాలు అప్‌డేట్‌ చేసుకునేందుకు ఉడాయ్‌ తొలుత 2023 డిసెంబర్‌ 14 వరకు అవకాశం ఇచ్చింది. తర్వాత దాన్ని రెండు దఫాల్లో జూన్‌ 14 వరకు పొడిగించింది. ఆలోపు ఆన్‌లైన్‌లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఆధార్‌ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని ఉడాయ్‌ గతంలో సూచించింది.

కనీసం పదేళ్లకోసారి గుర్తింపుకార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధి (సెంట్రల్‌ ఐడెంటిటీస్‌ డేటా రిపాజిటరీ- CIDR)లోని వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని ఉడాయ్‌ (UIDAI) పేర్కొంది. ఈ ప్రక్రియ వల్ల పౌరుల సమాచారం సీఐడీఆర్‌ వద్ద ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ఉంటుందని వివరించింది. తద్వారా కచ్చితమైన సమాచారం నిక్షిప్తమవడానికి దోహదం చేస్తుందని తెలిపింది.

వివరాలు అప్‌డేట్‌ చేసుకోవడానికి ఉడాయ్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి తాజా గుర్తింపు కార్డు, అడ్రస్‌ వివరాలను సబ్మిట్‌ చేయాలి. రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, కిసాన్‌ పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్‌షీట్‌, పాన్‌/ఇ-పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా.. విద్యుత్‌, నీటి, గ్యాస్‌, టెలిఫోన్‌ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించుకోవచ్చని ఉడాయ్‌ పేర్కొంది. ధ్రువీకరణ పత్రాలను స్కాన్‌ చేసి ‘మై ఆధార్‌’ వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

Cyclone Remal: ఆ తీరం వెంబడి దూసుకెళ్తున్న రెమాల్ తుఫాన్.. ఈ రాష్ట్రాలకు అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది. దీనికి రెమాల్ తీవ్ర తుపానుగా నామకరణం చేశారు వాతావరణ శాఖ అధికారులు. గంటకు 7కిలోమీటర్ల వేగంతో ఈ తీవ్ర తుపాను ప్రయాణిస్తోందని చెబుతున్నారు. బంగ్లాదేశ్ – కేపుపారాకు దక్షిణంగా 260 కిలోమీటర్ల దూరంలో.. వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్స్‎కు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉన్నట్లు తెలిపారు. రెమాల్ తుఫాను ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడునుంన్నట్లు సూచిస్తున్నారు. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలోని సముద్రం మొత్తం అల్లకల్లోలంగా మారింది. తుఫాను గాలి దాటికి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ తీరం వెంబడి గంటకు 95-105 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అత్యధికంగా 115 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ఈరోజు మే 26 అర్ధరాత్రి బంగ్లాదేశ్ కేపూపారా – వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య తీరం దాటనున్నట్లు చెప్పారు. తీరం దాటే సమయంలో మరింత విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఆ సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. అలాగే అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలుల తీవ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర ఒడిశా, వెస్ట్ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు ఇప్పటికే వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. మత్యకారులు, జాలర్లు వేటకు వెళ్లవద్దని ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసింది. 27వ తేదీ వరకు సముద్రంలో వేట నిషిద్దం అని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. తెలంగాణ మీదుగ ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. దీంతో పాటు కేరళ పరిసర ప్రాంతాలపై కూడా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. ఇది పశ్చిమ దిశ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపుగా గాలులు వీస్తున్నట్లు వివరించారు. ఈ ఉపరితల ఆవర్తనంతో ఏపీలో పలుచోట్ల చెదురు మొదురు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే ఒకటి రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఎన్టీఆర్‌పై విరాట్ కోహ్లీ ప్రశంసలు.. వర్ణించడానికి మాటలు సరిపోవంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఎన్టీఆర్‌పై విరాట్ కోహ్లీ ప్రశంసలు.. వర్ణించడానికి మాటలు సరిపోవంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఏమన్నారంటే.. ‘‘ తారక్ నాకు మంచి ఫ్రెండ్. మేమిద్దరం ఓ యాడ్ షూట్‌లో నటించే సమయంలో కలిసినప్పుడు అతని వ్యక్తిత్వానికి ఫిదా అయ్యాను. ఆ తర్వాత అతను నటించి ఆర్ఆర్ఆర్ సినిమా చూశాక తారక్ నటన వర్ణించడానికి మాటలు సరిపోవు అనిపించింది.
ముఖ్యంగా అందులోని నాటు నాటు పాటకు ఆయన వేసిన డాన్స్ ఎంతో మందిని ఆకట్టుకుంది. దీంతో నేను నా భార్య అనుష్కతో కలిసి ఈ పాటకు రీల్ చేశాను. ఆ తర్వాత ఈ పాటకు ఆస్కార్ వచ్చిందని తెలిసి గ్రౌండ్‌లోనే డాన్స్ చేశాను. తారక్‌తో మరోసారి నటించడానికి రెడీగా ఉన్నాను’’ అంటూ ప్రశంసలు కురిపించాడు.

Landslide: కొండచరియల బీభత్సం ఘటన.. 670 మంది సమాధి..!

పసిఫిక్‌ దేశమైన పపువా న్యూ గినియా (Papua New Guinea)లోని ఎన్గా ప్రావిన్స్‌లో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడి (Landslide) బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి ఈ ప్రకృతి విపత్తు కారణంగా తొలుత 100 మందికిపైగా మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. ఈ సంఖ్య భారీగానే ఉన్నట్లు ఐరాస (UN) తాజాగా అంచనా వేసింది. దాదాపు 670 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని ‘అంతర్జాతీయ వలసల సంస్థ (IOM)’ తెలిపింది. దాదాపు నాలుగు ఫుట్‌బాల్ మైదానాల మేర విస్తీర్ణంలో శిథిలాలు పరచుకున్నట్లు సమాచారం.

‘‘ప్రమాద సమయంలో తొలుత 60 ఇళ్లు కొండచరియల కింద నేలమట్టమైనట్లు భావించాం. అయితే, స్థానిక అధికారుల లెక్కల్లో మొత్తం 150 ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయినట్లు తేలింది. దాదాపు 670 మంది సమాధి అయినట్లు వారు భావిస్తున్నారు. ఆరు నుంచి ఎనిమిది మీటర్ల లోతులో చిక్కుకుపోయిన వారు ప్రాణాలతో బయటపడే అవకాశం దాదాపు లేనట్లే’’ అని వలసల సంస్థ అధికారులు వెల్లడించారు. ఆదివారం నాటికి కేవలం అయిదు మృతదేహాలు మాత్రమే వెలికితీసినట్లు సమాచారం. మరోవైపు.. ప్రాణాలతో బయటపడిన వారిని అధికారులు సురక్షితమైన ప్రదేశాలకు తరలిస్తున్నారు.

పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్‌ మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలోని ఎన్గా ప్రావిన్స్‌లో ఈ విపత్తు సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో ప్రాణనష్టం భారీగా వాటిల్లింది. ఒకవైపు మరిన్ని కొండచరియలు విరిగిపడే ముప్పు పొంచివుండటం.. మరోవైపు ప్రావిన్స్‌ రాజధాని వాబాగ్‌ నుంచి ఘటనాస్థలానికి చేరుకునే మార్గంలో తెగల ఘర్షణల కారణంగా బాధితులకు సహాయక సామగ్రి చేరవేయడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు తెలిపారు. సహాయక కాన్వాయ్‌లకు సైనికులు భద్రత కల్పిస్తున్నారు.

ఆమె క్రికెటర్స్‌ పాలిట దేవత..1983 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు కోసం..

బాలీవుడ్‌ దిగ్గజ లెజండరీ గాయని లతా మంగేష్కర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన మధురమైన గానంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె కేవలం గొప్ప గాయని మాత్రమే కాదు గొప్ప క్రికెట్‌ అభిమాని కూడా. భారతదేశం ప్రపంచ క్రికెట్‌లో సూపర్‌ పవర్‌గా లేని రోజల్లో అనూహ్యంగా టీమ్‌ ఇండియా ప్రపంచకప్‌ గెలుచుకుని అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఆ ఘట్టం చరిత్రలో మర్చిపోని గొప్ప రోజు. అయితే ఆ రోజుల్లో బీసీసీఐ వద్ద సరిపడ నిధులు కూడా లేవు. ఇంతటి ఘన విజయం అందించిన ఆటగాళ్లుకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది. ఆ టైంలో మన క్రికెటర్లను సత్కరించేందుకు తన వంతుగా మద్దతు ఇస్తూ ఏం చేశారో తెలుసా..!

జూన్ 25, 1983.. భారత క్రికెట్ చరిత్రలో ఆ రోజును ఎవరు మర్చిపోలేరు. ఇంగ్లండ్ గడ్డపై భారత్ నిలిచి అందరికి షాక్ ఇచ్చింది. ఆ రోజు చిరస్మరణీయమైనది, ప్రత్యేకమైనది. భారత్‌లో క్రికెట్ ఉన్నంత కాలం ఆ రోజుని ఎప్పటికీ మరిచిపోలేం. కపిల్ దేవ్(Kapil Dev) సారథ్యంలో టీమిండియా తొలి ప్రపంచకప్ గెలిచి ఇప్పటికీ 40 ఏళ్లు. జూన్ 25, 1983న లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో వరుసగా రెండుసార్లు ప్రపంచకప్(World Cup) సాధించి మంచి ఊపుమీద ఉన్న వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 43 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది.

అప్పటి నుంచే భారత క్రికెట్‌లో కొత్త శకం మొదలైంది. ఈ వన్డే ప్రపంచకప్ గెలవడానికి ముందు, టీమ్ ఇండియా 1975 మరియు 1979 ప్రపంచకప్‌లలో లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ టోర్నీల్లో భారత్ కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఆ రెండు టోర్నీల్లో వెస్టిండీస్(West Indies) ఛాంపియన్‌గా నిలిచింది. అయితే హ్యాట్రిక్ విజయంపై ఆశలు పెట్టుకున్న వెస్టిండీస్‌కు భారత్ గట్టి షాకిచ్చింది. నిజానికి భారత్‌ లీగ్‌లోనే స్వదేశానికి చేరుకుంటారనేది అందరి ఊహగానాలు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ..ఈ టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలిచి తొలి ట్రోఫీని తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించింది.

ఆ ఏడాది ప్రపంచకప్‌ టోర్నీకి ఇంగ్లాండ్‌ ఆతిథ్యమిచ్చింది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్(World Cup Final) జరిగింది. తొలుత భారత జట్టు బ్యాటింగ్ చేసింది. కానీ ఆశించినంత స్థాయిలో స్కోర్‌ చేయలేదు. కేవలం 54.4 ఓవర్లలో 183 పరుగులు మాత్రమే చేసింది. వెస్టిండీస్‌కు ఈ లక్ష్యం పెద్దది కాదు. మంచి మంచి బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అయితే బౌలర్లు మదన్ లాల్, మొహిందర్ అమర్‌నాథ్ ధాటికి విండీస్ 140 పరుగులకే ఆలౌటైంది. భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయి సంబరాలు చేసుకుంది. ఈ ఘన విజయంతో భారత్‌లో యువత ఆసక్తి క్రికెట్‌ వైపు మళ్లింది. అభిమానుల సంఖ్య పెరిగింది.

గల్లీ గల్లీలో క్రికెట్ ఆడేంతగా ఆ ఆటపైక్రేజ్‌ పెరిగిపోయింది. అయితే అప్పట్లో బీసీసీ వద్ద నిధులు లేవు. కనీసం భారత్‌కి ఇంత ఘన కీర్తిని తెచ్చిపెట్టిన ఆటగాళ్లను సత్కరించేందుకు కూడా బీసీసీఐ వద్ద డబ్బులు లేవు. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్‌కేపీ సాల్వే, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న రాజ్‌సింగ్ దుంగార్‌పూర్‌లు లతా మంగేష్కర్‌ను సంప్రదించి ఈ విషయాన్ని చెప్పారు. అందుకు మద్దుతు ఇవ్వడంతో దేశ రాజధానిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో లతా మంగేష్కర్‌ కచేరిని ఏర్పాటు చేసి ఫండింగ్‌ని కలెక్ట్‌ చేశారు. ఈ కచేరీ ద్వారా అప్పట్లో దాదాపు రూ. 20 లక్షలు దాక నిధులను బీసీసీఐ సేకరించింది.

జీవితకాల పాస్‌..
ఆ మొత్తం నుంచి 14 మంది ఆటగాళ్లకు వారి అత్యుత్తమ ప్రదర్శనకు గానూ ప్రోత్సాహకంగా రూ. 1 లక్ష చొప్పున అందించారు. ఇక సంగీత కచేరి కోసం లతా మంగేష్కర్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆ సమయంలో తమకు సహాయం చేసిన లతా మంగేష్కర్‌కు బీసీసీఐ పెద్ద గిఫ్ట్‌ ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా భారత క్రికెట్ జట్టు మ్యాచ్ జరుగుతున్నా.. లతా మంగేష్కర్ చూసేందుకు ఉచిత పాస్ అందించారు. అంటే జీవితకాల పాస్ అన్నమాట.

ఆమె జీవితకాలం ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా ఆమె ఉచితంగా చూడొచ్చు. కానీ ఆమె ఎప్పుడూ ఆ పాస్ ఉపయోగించలేదు. కానీ బీసీసీఐ మాత్రం ఆమె సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. లతా మంగేష్కర్ గౌరవ సూచకంగా భారతదేశంలో ఆడే ప్రతి అంతర్జాతీయ మ్యాచ్‌కు బోర్డ్ ఎప్పుడూ రెండూ టికెట్లను లతా మంగేష్కర్ కోసం రిజర్వు చేసింది. ముఖ్యంగా ప్రపంచ కప్ గెలిచిన కపిల్ దేవ్ బృందం కోసం లతా మంగేష్కర్ సోదరుడు పండిట్ హృద్యనాథ్ ప్రత్యకంగా ఓ పాటే రాయడం విశేషం.ఇలాంటి వాళ్లు తమ కళతోనే గొప్పగొప్ప సేవకార్యక్రమాలు చేసి చరిత్రలో నిలిచిపోవడమే గాక భావితరాలకు గొప్ప స్ఫూర్తిగా ఉంటారు.

ఒక్క ఆలోచనతో రూ.15780 కోట్ల బిజినెస్.. ఎవరీ ‘ప్రతీక్ సూరి’?

ఒక్క ఆలోచనతో రూ.15780 కోట్ల బిజినెస్.. ఎవరీ ‘ప్రతీక్ సూరి’?
చదువు పూర్తయిన తరువాత ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకునే వారు చాలామంది ఉన్నారు. అయితే బిజినెస్ చేసి ఎదగాలని చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు ‘ప్రతీక్ సూరి’. ఇంతకీ ఈయన ఎవరు? ఈయన చేస్తున్న బిజినెస్ ఏంటి? వ్యాపారంలో ఎలా సక్సెస్ సాధించారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఢిల్లీకి చెందిన ప్రతీక్ సూరి తన పాఠశాల విద్యను బరాఖంబా రోడ్‌లోని మోడరన్ స్కూల్‌లో పూర్తి చేశారు. ఆ తరువాత 2006లో అతను దుబాయ్‌లోని బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్‌ చదవడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి వెళ్లాడు
దుబాయ్‌లో చదువుకునే రోజుల్లోనే.. సుమారు 200 విభిన్న దేశాలకు చెందిన వ్యక్తులతో కూడిన యూఏఈ జనాభాలోని అపారమైన వైవిధ్యం అతనిని ఎంతగానో ఆకర్షించింది. ఆ సమయంలోనే గ్లోబల్ కమ్యూనిటీలో లీనమవ్వడం కావలసిన అపరిమితమైన అవకాశాల గురించి కూడా తెలుసుకున్నారు.

చదువు పూర్తయిన తరువాత.. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచించి.. అనుకున్న విధంగానే 2012 ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే ‘మాసర్’ (Maser) సంస్థను స్థాపించారు. ఈ సంస్థ అతి తక్కువ కాలంలోనే ఆఫ్రికన్ మార్కెట్‌లో కూడా విస్తరించింది.

కంపెనీ ఉత్పత్తి అయిన స్మార్ట్ టీవీ.. ఆఫ్రికన్ మార్కెట్‌లో అనూహ్యమైన ఆదరణ పొందగలిగింది. ఆ సమయంలో కంపెనీ ఏకంగా 8,00,000 యూనిట్ల బ్రాండ్ స్మార్ట్ టీవీలను విక్రయించగలిగింది. ఆ తరువాత ఆఫ్రికన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులు పెట్టడంతో మాసర్ కంపెనీ మరింత గణనీయమైన పురోగతిని సాధించగలిగింది.

ప్రతీక్ సూరి అచంచలమైన కృషి వల్ల కంపెనీ రోజు రోజుకి అభివృద్ధి వైపు అడుగులు వేసింది. వ్యాపార రంగంలో విజయవంతమైన బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసింది. 2023లో మాసర్ నికర విలువ ఏకంగా 1.9 బిలియన్ డాలర్లకు చేరింది. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.15,780 కోట్లు. పోటీ వ్యాపార ప్రపంచంలో తనదైన ముద్ర వేయడానికి ఎదురయ్యే అడ్డంకులను ధిక్కరించి సెల్ఫ్ మేడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన ప్రతీక్ సూరి కథ నేడు వ్యాపార ప్రపంచంలో ఎంతోమందికి ఆదర్శప్రాయం.

Special Police Officers: ఏపీలో పోలీస్ శాఖ అలర్ట్.. జిల్లాలకు ప్రత్యేక ఆఫీసర్ల నియామకం!

Special Police Officers Appointed to Districts: ఏపీలో ఈ నెల 13న అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, పోలింగ్ రోజు, ఆ తరువాత ఏపీలో పలు చోట్లా హింసాత్మక సంఘటనలు చెలరేగిన విషయం కూడా తెలిసిందే. జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించారు. ఇందుకు సంబంధించి ఆ రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

56 మంది ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించినట్లు సమాచారం. అందులో పల్నాడుకు అత్యధికంగా 8 మంది పోలీస్ అధికారులను నియమించినట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక పోలీస్ అధికారులుగా నియమించబడ్డ పోలీస్ అధికారులు వెంటనే ఆయా జిల్లాలకు వెళ్లి ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని సూచించినట్లు సమాచారం. అయితే, సున్నితమైన నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని అందులో ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద, పరిసర ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని, ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

కాగా, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఆ కేంద్రాల్లో నిబంధనల ప్రకారం టేబుల్స్ ఏర్పాటు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు టేబుల్స్ ఏర్పాటు విషయమై రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా పలు సూచనలు చేసిన విషయం విధితమే. ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో ఓట్ల లెక్కింపు పాదరదర్శకంగా జరగాలని పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని కూడా వీడియోగ్రఫీతో చిత్రీకరించాలని ఆయన సూచించిన విషయం విధితమే.

సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై జీవితకాలం ప్రతి నెలా రూ. 5 వేలు

దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నాయి. ఈ క్రమంలోనే.. పేద ప్రజల దగ్గర నుంచి చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధుల వరకు ఎన్నో స్కీమ్ లను ప్రారంభిస్తున్నారు.

ఇలా ఇప్పటికే రైతుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు లైఫ్‌ లాంగ్‌ సెక్యూర్‌ గా ఉండే అనేక పథకాలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే జాబ్‌ ప్రొఫెషన్‌లో ఉన్న వ్యక్తులు వృద్ధాప్యంలో ఆర్థికంగా హాయిగా జీవితం గడిపేందకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన స్కీమ్‌ అందుబాటులోకి తీసుకువచ్చిది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

సాధారణంగా ప్రతి ప్రొఫెషన్‌కు జాబ్‌ రిటైర్‌మెంట్‌ ఉంటుంది. ఇక ఆ సమయంలో సంపాదించిన కొంత మొత్తాన్ని ఆరోగ్యం, ఇతర ఖర్చులకు ఇబ్బందులు లేకుండా దాచుకోవాలని చాలామంది భావిస్తుంటారు. అందుకోసం ప్రభుత్వ ఆధ్వార్యంలో ఉండే ఏదైనా స్కీమ్స్‌ లో ఇన్వేస్ట్‌ చేయాలని చూస్తుంటారు. ఈ ​‍క్రమంలోనే భారతదేశంలో ఆర్గనైజ్డ్‌ సెక్టార్‌లో పనిచేసే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక రకాల స్కీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే అసంఘటిత రంగంలోని ప్రజలకు, ముఖ్యంగా చిన్న వ్యాపారులు, కార్మికులకు ఈ పెట్టుబడి పథకాల గురించి పెద్దగా అవగాహన లేదు. ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని రూపొందించింది. అసంఘటిత రంగానికి సంబంధించిన ఉద్యోగులు లేదా కార్మికులకు ఈ స్కీమ్‌ ఓ వరమని చెప్పొచ్చు.

ఎందుకంటే.. ఈ స్కీమ్‌ లో అతి తక్కువ మొత్తం రూ.210 పెట్టుబడి పెట్టడం ద్వారా, ప్రతి నెలా రూ.5,000 పెన్షన్ పొందవచ్చు. అంటే జీవితాంతం ప్రతి సంవత్సరం రూ.60,000 పెన్షన్ వస్తుంది. కాగా, అందుకు ప్రతి నెలా కేవలం రూ.210 డిపాజిట్ చేస్తే చాలు..మీ పదవి విరమణ తర్వాత అనగా.. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెల గరిష్టంగా రూ.5,000 పెన్షన్ పొందవచ్చు. ఇక ఈ అటల్‌ పెన్షన్‌ యోజన నిబంధనల ప్రకారం, మీరు 18 ఏళ్ల వయస్సులో నెలకు గరిష్టంగా రూ.5,000 పెన్షన్‌ పొందాలని నిర్ణయించుకుంటే, ప్రతి నెలా రూ.210 చెల్లించాలి. ఇలా మూడు నెలలకు ఓ సారి చెల్లించాలి అనుకుంటే రూ.626, ఆరు నెలలకు ఎంచుకుంటే రూ.1,239 చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు రిటైర్‌మెంట్‌ తర్వాత నెలకు రూ.1,000 పెన్షన్ సరిపోతుందనుకుంటే.. 18 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి ప్రారంభిస్తే, నెలకు రూ.42 చెల్లిస్తే సరిపోతుంది.

ఇక వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015-16 బడ్జెట్‌లో అటల్ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కాగా, ఈ స్కీమ్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నిర్వహిస్తుంది. అంతేకాకుండా.. అటల్ పెన్షన్ యోజన కింద ఓ వ్యక్తి ప్రతి నెలా రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. భారత ప్రభుత్వం కనీస పెన్షన్ ప్రయోజనానికి హామీ ఇస్తుంది. ఈ పథకం కింద రూ.1,000, రూ.2000, రూ.3,000, రూ.4,000, రూ.5,000 పెన్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు అనే దానిపై మీరు అందుకునే పెన్షన్‌ ఆధారపడి ఉంటుంది. చిన్న వయస్సులో ఇన్వెస్ట్‌ చేస్తే పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ చెల్లించాల్సిన అమౌంట్‌ పెరుగుతూ పోతుంది.

అయితే 18- 40 సంవత్సరాల భారత పౌరులు ఎవరైనా అటల్‌ పెన్షన్‌ యోజనలో చేరవచ్చు. కనీసం 20 సంవత్సరాల పాటు తప్పనిసరిగా కాంట్రిబ్యూట్‌ చేయాలి. 60 సంవత్సరాల నుంచి పెన్షన్‌ అందుతుంది. ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్‌ అకౌంట్‌, వ్యాలీడ్‌ మొబైల్ నంబర్ కూడా అవసరం. పన్ను చెల్లింపుదారులు అయి ఉండకూడదు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై కీలక సూచనలు చేసిన ఈసీ.. అవేమిటంటే?

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై కీలక సూచనలు చేసిన ఈసీ.. అవేమిటంటే?

Election Commission : ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా.. జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ఈ సారి ఎన్నికల్లో గతంకంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లుకూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. సుమారు 5లక్షల40వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. ఇదిలాఉంటే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఎన్నికల కమిషన్ కీలక సూచనలు చేసింది. ఈసీ మార్గదర్శకాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈవో ముకేశ్ కుమార్ మీనా పంపించారు.

ఎన్నికల సంఘం సూచనలు ఇవే..
• గెజిటెడ్ అధికారి స్టాంప్ వేయలేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్ ను చెల్లని ఓటుగా పరిగణించవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
• ఫాం 13Aపై ఆర్వో సంతకం సహా పూర్తి వివరాలు నింపిఉంటే స్టాంప్ లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని ఈసీ స్పష్టం చేసింది.
• పోస్టల్ బ్యాలెట్ పేపర్ పై ఆర్వో సంతకం సహా బ్యాలెట్ ను ధృవీకరించేదుకు రిజిస్టర్ తో సరిపోల్చుకోవాలని వెల్లడించింది.
• పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫాం-సీ పై ఓటరు సంతకం లేదని బ్యాలెట్ ను తిరస్కరించ రాదని వెల్లడించింది.
• ఫాం 13Aలో ఓటర్ సంతకం లేకపోయినా, గెజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా, బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకపోయినా బ్యాలెట్ తిరస్కరించరాదు.
• పోస్టల్ బ్యాలెట్ పేపరుపై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయక పోయినా, ఆ ఓటు తిరస్కరణ కు గురి అవుతుందని ఈసీ స్పష్టం చేసింది.

Big News: విద్యార్థులకు బిగ్ అలర్ట్‌.. ప్రభుత్వ పాఠశాలల సమయాల్లో మార్పులు

Big News: విద్యార్థులకు బిగ్ అలర్ట్‌.. ప్రభుత్వ పాఠశాలల సమయాల్లో మార్పులు

వేసవి సెలవులు దాదాపు ముగిసే దశకు వచ్చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12న ప్రభుత్వ పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలోనే విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాల పని వేళల్లో మార్పులకు ఆమోదం తెలిపినట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఇది వరకు పాఠశాలలు ఉదయం 9.30కి తెరుచుకుని 4.30కి మూతపడేవి. కానీ, తాజా నిర్ణయం ప్రకారం.. ఉదయం 9 గంటలకే పాఠాశాలలు తెరచుకుని 4.45 వరకు మూతపడనున్నాయి. విద్యార్థులు ఉదయం 9.30 కి స్కూలుకు వెళ్లడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు చులకన భావం ఏర్పడుతోందనే విషయం విద్యాశాఖ అధికారుల దృష్టికి వచ్చింది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వం పాఠశాలలను నడపాలని అధికారులు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వివరించారు. ఈ క్రమంలోనే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను 2024 – 2025 విద్యా సంవత్సరం నుంచి ఉదయం 9.00 గంటలకే ప్రారంభించాలనే ప్రతిపాదనకు ఆయన ఆమోదం కూడా తెలిపారు.

Health Tips: 40 ఏళ్లు దాటాయంటే ఇవి కచ్చితంగా తినాలి.. లేదంటే ఈ వ్యాధుల బెడద తప్పదు..!

Health Tips: వయసు పైబడిన కొద్దీ మనిషి బలహీనంగా మారుతూ ఉంటాడు. ఇది సహజంగా జరిగే ప్రక్రియే. వయసుతో పాటు చర్మం, జుట్టు, ముఖం మారుతూ ఉంటాయి. వీటితో పాటు శరీరం లోపల కూడా చాలా మార్పులు జరుగుతుంటాయి.

అవయవాల పనితీరు మందగిస్తుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారు కొన్ని సూపర్ ఫుడ్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

40 ఏళ్ల తర్వాత మహిళలు బోలు ఎముకల వ్యాధి, రొమ్ము క్యాన్సర్, రక్తహీనత, స్ట్రోక్, గుండె జబ్బులు, మధుమేహంతో బాధపడుతుంటారు. ఈ వ్యాధులన్నీ క్రమంగా శరీరాన్ని బలహీనంగా, నిర్జీవంగా మారుస్తాయి. వీటిని నివారించాలంటే మహిళలు తప్పనిసరిగా ఐరన్, క్యాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు మొదలైనవి తీసుకోవాలి. వీటి కోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

ఆకుకూరలు

ఐరన్, విటమిన్లు, కాల్షియం, ప్రొటీన్లు పచ్చి ఆకు కూరల నుంచే లభిస్తాయి. కూరలు, చట్నీ రూపంలో వీటిని వండుకుని తినవచ్చు. ఇది మీ హిమోగ్లోబిన్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ కౌంట్ పెంచుతాయి.

గుడ్డు

40 ఏళ్ల తర్వాత ఉడకబెట్టిన గుడ్డు కచ్చితంగా తినాలి. ఈ సూపర్ ఫుడ్ లో ప్రొటీన్, విటమిన్ డి, బయోటిన్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఉడకబెట్టిన కోడిగుడ్లను తినడం వల్ల కండరాలు తగ్గకుండా శరీరంలో బలంగా తయారువుతుంది.

పప్పు

మూంగ్ పప్పు, ఉరద్ పప్పు, చనా పప్పులో చాలా పోషకాలు దాగి ఉంటాయి. ప్రతిరోజు ఈ పప్పులతో వండిన వంటకాలను తీసుకోవాలి. ఇవి విటమిన్లు, మినరల్స్‌తో పాటు పెద్ద మొత్తంలో ఫైబర్‌ను శరీరానికి అందిస్తాయి. దీనివల్ల మలబద్దక సమస్యను నివారించవచ్చు.

పెరుగు, మజ్జిగ

సరైన జీర్ణక్రియను నిర్వహించడానికి ప్రతిరోజు పెరుగు, మజ్జిగ తీసుకోవాలి. వీటిలో కాల్షియంతో పాటు ప్రో-బయోటిక్స్ ఉంటాయి . ఇది జీర్ణక్రియకు అవసరమైన బ్యాక్టీరియా సంఖ్యను అందిస్తుంది. దీంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.

యాంటీఆక్సిడెంట్లు ఆహారం

డార్క్ చాక్లెట్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు మొదలైనవి యాంటీఆక్సిడెంట్లను అందించే కొన్ని ఆహారాలు. ఇది రొమ్ము క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. వీటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఈ డైట్ మెయింటెన్ చేస్తే కచ్చితంగా 40 ఏళ్ల తర్వాత కూడా హ్యాపీగా జీవించవచ్చు.

ఆ 4 నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీదే అధికారం..! ఏపీ ఎన్నికల్లో ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

Ap Election Resluts 2024: ఏపీ ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? నాలుగున్నర దశాబ్దాలుగా ఒకే జిల్లాలో ఆ నాలుగు నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీయే ఇప్పటివరకు అధికారం చేపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరి చూపు ఆ సెగ్మెంట్లపైనే ఉంది. మరి సెంటిమెంట్ నియోజకవర్గాలు ఏవి? ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి?

46ఏళ్లుగా వస్తున్న సెంటిమెంట్..
ప్రజలు, పార్టీల్లో సెంటిమెంట్ అంటే ఒక నమ్మకం, విశ్వాసం. ఇదే సెంటిమెంట్ ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియజేయబోతోంది. అవును.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే అధికారం. ఈ సెంటిమెంట్ ఇప్పటిది కాదు. నాలుగున్నర దశాబ్దాల నుంచి వస్తున్నది. అందుకే ఆ నాలుగు నియోజకవర్గాల్లో గెలిస్తే అధికారంలోకి వచ్చినట్లే అన్నట్లు పార్టీలు భావిస్తాయి.

అక్కడ ఎవరు గెలిస్తే వారిదే అధికారం..
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాల్లో గత 46ఏళ్లుగా ఒకే పార్టీ గెలుస్తూ వస్తోంది. విచిత్రం ఏంటంటే.. ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తోంది.

1978లో అధికారంలోకి కాంగ్రెస్.. 1983, 85లో టీడీపీ ప్రభుత్వం..
1978 ఎన్నికల్లో ఈ నాలుగు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1983, 85 ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలవగా ఆ పార్టీయే అధికారాన్ని దక్కించుకుంది. 1989లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థులే గెలవగా.. అధికారం హస్తగతమైంది. 1994, 1999లలో టీడీపీ అభ్యర్థులు గెలవగా.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ సీఎం అయ్యారు. 2009లో ఇదే సెంటిమెంట్ రిపీట్ అయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా, మరోమారు రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు.

2019లో వైసీపీ గెలుపు..
ఏపీ విభజన తర్వాత కూడా ఈ నాలుగు సెంటర్లలో సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది. 2014లో ఇక్కడ టీడీపీ అభ్యర్థులే గెలవగా.. చంద్రబాబు మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో ఈ నాలుగింటిలో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో రాష్ట్రంలోనూ వైసీపీ ప్రభుత్వమే ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులు గెలుస్తారన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది.

ఏలూరు, భీమవరం, ఉంగుటూరులో కూటమి అభ్యర్థులదే గెలుపు?
ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంటే.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగాయి. అయితే, ఈ నాలుగు నియోజకవర్గాల్లో కేవలం ఏలూరులో మాత్రమే టీడీపీ పోటీలో ఉంది. మిగిలిన మూడు స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఏలూరులో టీడీపీ అభ్యర్థి బడేటి చంటి, భీమవరంలో జనసేన అభ్యర్థి పులవర్తి రామాంజనేయులుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉంగుటూరులో జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు వైసీపీ అభ్యర్థిపై పైచేయి సాధిస్తారని ప్రచారం జరుగుతోంది. అటు పోలవరంలో మాత్రం వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి గెలుస్తారంటూ భారీగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి.

ఈసారి గెలిచేది ఎవరు?
సర్వేలు, బెట్టింగ్ ల ప్రకారం పోలవరం వైసీపీ గెలిస్తే.. మిగిలిన మూడు కూటమి గెలిస్తే 46ఏళ్ల సెంటింట్ కు బ్రేక్ పడే ఛాన్స్ ఉంది. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ వైసీపీ గెలిస్తే.. దాదాపు ఆ పార్టీయే అధికారం చేపడుతుంది. లేకపోతే నాలుగింటిలోనూ కూటమి అభ్యర్థులే గెలిస్తే.. సెంటిమెంట్ రిపీట్ అవుతుంది.

ఈ ఎన్నికల్లో 46ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుంది?
ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా విభిన్న ప్రాంతాలు. ఏలూరు నగరం కాగా, భీమవరం పట్టణం, ఉంగుటూరు గ్రామీణ ప్రాంతం కాగా పోలవరం ఏజెన్సీ ప్రాంతం. ఇలా నాలుగు నియోజకవర్గాల్లోనూ విభిన్న ప్రాంత ఓటర్లు ఉన్నారు. విభిన్న ఓటర్లు ఉన్నా తీర్పు మాత్రం విలక్షణంగా ఒకే రిజల్ట్ ఉండటంతో ప్రస్తుతం అందరి చూపు ఈ నియోజకవర్గాలపైనే ఉంది. మరి ఈ ఎన్నికల్లో 46ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుంది? లేక అంచనాలను తలకిందులు చేస్తూ సెంటిమెంట్ కు బ్రేక్ పడుతుందా? తెలియాలంటే జూన్ 4వరకు ఆగాల్సిందే.

Viral Video: మార్క్‌లిస్ట్‌ కోసం స్కూలుకు వెళ్లిన యువతిపై లైంగికదాడి

Viral Video: మార్క్‌లిస్ట్‌ కోసం స్కూలుకు వెళ్లిన యువతిపై లైంగికదాడి
పదో తరగతి మార్క్స్ లిస్ట్ తీసుకునేందుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలికపై సహచర విద్యార్థే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బలవంతంగా తరగతి గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో నలుగురు యువకులు ఈ ఘటనను వీడియో తీసి బెదిరింపులకు గురిచేశారు. ప్రస్తుతం అందరూ కటకటాలు లెక్కించుకుంటున్నారు.
ఈ ఘటన ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి మార్కుల జాబితాను తీసుకునేందుకు స్కూలుకు వచ్చింది. ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్తుండగా అప్పటికే అక్కడున్న సహచర విద్యార్థి ఆమెను తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఈ ఘటనను మరో నలుగురు యువకులు వీడియో తీశారు. ఆ తర్వాత ఆ దృశ్యాలు చూపించి బాలికను లైంగికంగా వేధించడం మొదలుపెట్టారు. అంతేకాదు, వాటిని బాధిత బాలిక తల్లిదండ్రులకు చూపించి డబ్బులు డిమాండ్ చేశారు. రూ. 2 లక్షలు ఇస్తామని చెప్పినా, సరిపోవని, ఇంకా పెద్దమొత్తంలో కావాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగకుండా వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు. వీడియో తీసిన నలుగురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Indian Railways: గుడ్‌న్యూస్‌.. రైలు బయలుదేరే 5 నిమిషాల ముందు టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.. ఎలాగంటే!

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే భారతీయ రైల్వే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైలు ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. రవాణా ఛార్జీలు తక్కువగా ఉన్న కారణంగా ప్రతి ఒక్కరు రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. సామాన్యులు సైతం ఎక్కువ ఈ రైలు ప్రయాణమే చేస్తుంటారు. అయితే ఎక్కడికైనా రైలు ప్రయాణం చేయాలంటే ముందుగా టికెట్స్‌ బుక్‌ చేసుకుంటాము. టికెట్స్‌ కోసం కొన్ని నెలల ముందుగానే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సమయాల్లో నెల ముందు బుక్‌ చేసుకుంటాము.

ఈ బుకింగ్‌లో తత్కాల్‌ సదుపాయం కూడా ఉంటుంది. ఒక రోజు ముందు ప్రయాణం చేయాలంటే బుకింగ్‌ చేసుకునేందుకు అవకాశం ఉండదు. అలాంటి సమయంలో తత్కాల్‌ టికెట్‌ను బుక్‌ చేసుకోవాలి. అదే కొన్ని గంటల ముందు రైలు ప్రయాణం చేయాల్సి వస్తే టికెట్‌ బుకింగ్‌ చేసుకునేందుకు అవకాశం ఉండదు. అలాంటి సమయంలో రైలు బయలుదేరడానికి ఓ 5 నిమిషాల ముందు కూడా టికెట్‌ను బుక్‌ చేసుకోవచ్చు. అదేలాగో చూద్దాం.

చాలా మంది రైలు ప్రయాణం కోసం ముందుగానే టికెట్స్‌ బుక్‌ చేసుకుని టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకునేవారు కూడా ఉంటారు. అలాంటి సందర్భంలో ఖాళీగా ఉన్న టికెట్లను విక్రయించేందుకు రైల్వే శాఖ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రతి ట్రైన్‌ టికెట్‌ బుకింగ్‌ కన్ఫర్మేషన్‌ కోసం రైల్వే రెండు ఛార్ట్‌లను రెడీ చేస్తుంటుంది. ఫస్ట్‌ ఛార్ట్‌ అనేది రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు రెడీ చేస్తుంది. ఇక రెండో ఛార్ట్‌ రైలు స్టార్ట్‌ అవ్వడానికి ముందు తయారు చేస్తుంది. గతంలో అరగంట ముందు వరకు మాత్రమే టికెట్‌ బుకింగ్‌కు అనుమతించేవారు. ఇప్పుడు రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందు వరకు ఆ వెసులుబాటు కల్పిస్తున్నారు రైల్వే అధికారులు. రైలు బయలుదేరే ఐదు నిమిషాల ముందు కూడా టికెట్లు అందుబాటులో ఉంటే ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌లో కూడా బుక్‌ చేసుకునే సదుపాయం తీసుకువచ్చింది రైల్వే. అయితే బోర్డింగ్ స్టేషన్ నుంచి మాత్రమే బుక్ చేసుకోవచ్చు. మధ్య స్టేషన్ నుంచి కావాలంటే అనుమతి ఉండదు. ఇక వేళ మధ్య స్టేషన్ నుంచి టికెట్ కావాలంటే టీటీఈని సంప్రదించాల్సి ఉంటుంది.

ఎలా తెలుసుకోవాలంటే?

అయితే రైలు బయలుదేరడానికి చివరి నిమిషంలో టికెట్‌ బుక్‌ చేసుకోవాలంటే ముందుగా ట్రైన్‌లో సీట్లు ఖాళీగా ఉన్నాయా?లేదా అనే విషయాన్ని తెలసుకోవడం చాలా ముఖ్యం. రైల్వే అధికారులు రెడీ చేసిన ఆన్‌లైన్‌ ఛార్ట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. దీనికోసం ముందుగా మీరు ఐఆర్‌సీటీసీ యాప్‌ ఓపెన్‌ చేసి ట్రైన్‌ సింబల్‌పై క్లిక్‌ చేయాలి. అప్పుడు ఛార్ట్‌ వేకెన్సీ సదుపాయం కనిపిస్తుంది. లేదా నేరుగా ONLINE CHARTS వెబ్‌సైట్‌లోకి వెళ్లి కూడా చెక్‌ చేసుకోవచ్చు. అక్కడ ట్రైన్‌ పేరు/నంబర్‌, తేదీ, ఎక్కాల్సిన స్టేషన్‌ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత GET TRAIN CHARTపై క్లిక్‌ చేయాలి. అప్పుడు వెంటనే మీరు కెటగిరిల వారీగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు కనిపిస్తాయి. ఒక వేళ ఖాళీ సీటు ఉంటే టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఒకవేళ సీట్లు లేకపోతే అక్కడ జీరో కనిపిస్తుంది. కోచ్‌ నంబర్‌, బెర్త్‌… మొత్తం వివరాలు అక్కడే కనిపిస్తాయి. ట్రైన్‌ ప్రారంభం అయ్యే స్టేషన్లలో ఎక్కేవారికే ఈ ఆప్షన్‌ ఉపయోగకరంగా ఉంటుంది.

Egypt pyramids: ఈజిప్టు పిరమిడ్స్ రహస్యాల్లో కీలక మలుపు.. భారీ నిర్మాణ సామాగ్రి తరలింపు మిస్టరీ వీడింది..

Egypt pyramids: ప్రపంచంలో ఈజిప్టు పిడమిడ్స్ మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. అసాధారణమైన ఈ నిర్మాణాలను ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఎలా నిర్మించారనేది ఇప్పటికీ సందేహాలను వస్తూనే ఉంటాయి. పరిశోధకులు వీటికి అనేక థీయరీలు కనిపెట్టినా, అనుమానాలు అలాగే ఉన్నాయి. భారీ సైజు బండరాళ్లు, వాటిని నిర్మించేందుకు ఉపయోగించే సామాగ్రిని ఎడారి ప్రాంతంలో ఎలా తరలించారనేది తెలియడం లేదు. పురాతన కాలంలో ఈజిప్టును పాలించిన ఫారో రాజులు ఈ పిరమిడ్లను నిర్మించారు. ఈ రాజవంశం గురించి కూడా అనేక రహస్యాలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. 2550 బీసీలో ఫారో ఖుఫూ వీటి నిర్మాణాన్ని ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మిస్టరీలో కీలక పరిణామం ఎదురైంది. ఈజిప్టు వరప్రధాయినిగా ఉన్న ‘‘నైలు నది’’ పిరమిడ్స్ నిర్మాణానికి ఉపయోగపడిందని పరిశోధకులు నిర్ధారించారు. ఆధునిక నైలు నదికి చెందిన ఒక నదీపాయ, ఆ కాలంలో పిరమిడ్లు ఉన్న స్థలానికి దగ్గరగా ప్రవహించినట్లు తేలింది. గిజా పిరమిడ్ కాంప్లెక్స్‌తో సహా ఈజిప్ట్‌లోని 31 పిరమిడ్‌లు వాస్తవానికి నైలు నది యొక్క 64-కిమీ-పొడవు ఉన్న నైలు నదీకి చెందిన ఒక శాఖ ఈ ప్రాంతం నుంచి ప్రవహించేదని, కాలానుగుణంగా ఇప్పుడు అది ఎడారి ఇసుక కింద పాతిపెట్టబడిందని కమ్యూనికేషన్స్ ఎర్త్ & ఎన్విరాన్‌మెంట్‌‌లో ప్రచురించబడిన ఓ పరిశోధన పత్రం వెల్లడించింది.

గిజా, లిష్ట్ మధ్య ప్రసిద్ధ ఈజిప్షియన్ పిరమిడ్స్ ఉన్న ప్రాంతానికి సమీపంలో ఒకప్పుడు ప్రవహించిన పురాతన నైలు నది శాఖకు సంబంధించిన ఆధారాలను పరిశోధకులు కనుగొన్నారు. దాదాపుగా 4700 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ అద్భుత కట్టడాలు ప్రస్తుతం పశ్చిమ ఎడారి ప్రాంతంలోని అంచున ఉన్నాయి. ఉపగ్రహ చిత్రాలు, జియోఫిజికల్ సర్వేలు, సెడిమెంట్ కోర్‌లను అద్యయనం చేయడం ద్వారా, ఎమాన్ ఘెనిమ్, అతని సహచరులు ఆధునిక ఉపరితలం కింద నదీ అవక్షపాలు, పూర్వపు నదీపాయల ఉనికిని నిర్ధారించారు. వారు ఈ పూర్వపు శాఖలకు ‘‘అహ్రామత్’’ అని పేరుపెట్టారు. అరబిక్‌లో దీని అర్థం పిరమిడ్.

పిరమిడ్ల నిర్మాణానికి ఈ నదీ పాయ ద్వారా సులభంగా పరికరాలను, రాళ్లను చేర్చినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. అనేక పిరమిడ్‌లు నదీ తీరాలకు నేరుగా చేరుకునే కాజ్‌వేలను కలిగి ఉన్నాయి. నిర్మాణసామాగ్రిని తరలించడానికి ఈ జలమార్గాలు ఉపయోగించినట్లు తెలుస్తోంది. 4,200 సంవత్సరాల క్రితం పెద్ద కరువు ఏర్పడి, గాలిలో ఇసుక తూర్పుకి వచ్చి చేరడం వల్ల ఈ నదీ శాఖ అనవాళ్లు తుడిచిపెట్టుకుపోయాయని పరిశోధకులు భావిస్తున్నారు.

Hardik-Natasa Divorce Rumours: హార్దిక్‌ పాండ్యా విడాకులు?.. భరణం కింద ఏకంగా అంత మొత్తమా?

టీమిండియా వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి వ్యక్తిగత జీవితం గురించి వదంతులు పుట్టుకొస్తున్నాయి. భార్య నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్‌కు విభేదాలు తలెత్తాయని.. వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది.

నటాషా తన సోషల్‌ మీడియా ఖాతాలలో పాండ్యా ఇంటి పేరును తొలగించిందని.. తద్వారా తాము విడిపోయామని పరోక్షంగా హింటిచ్చిందని ‘రెడిట్’‌ పోస్ట్‌ ద్వారా నెటిజన్లు ఓ అంచనాకు వచ్చారు.

హార్దిక్‌ పాండ్యాను ఎంకరేజ్‌ చేసేందుకు ఐపీఎల్‌-2024 మ్యాచ్‌లకు నటాషా రాలేదని.. అతడితో కలిసి ఉన్న ఫొటోలు కూడా పోస్ట్‌ చేయడం లేదంటూ ఇందుకు కారణాలు వెతికే ప్రయత్నం చేశారు.

వదంతులు మాత్రమేనంటూ
అయితే, ఇవన్ని వట్టి పుకార్లేనని హార్దిక్‌ పాండ్యా అభిమానులు కొట్టిపారేస్తున్నారు. ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌‌గా నియమితుడైన తర్వాత హార్దిక్‌ పాండ్యా దారుణమైన ట్రోలింగ్‌కు గురైన విషయం తెలిసిందే.

పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవడంతో అతడిపై విమర్శలు మరింత పదునెక్కాయి. ఈ నేపథ్యంలో.. ఆ ప్రభావం భార్య నటాషా, కుమారుడు అగస్త్యపై పడకుండా ఉండేందుకు పాండ్యానే స్వయంగా తనతో ఉన్న ఫొటోలు పోస్ట్‌ చేయవద్దని భార్యకు సూచించినట్లు తెలుస్తోంది.

అయితే.. ఇన్నాళ్లూ విభేదాలంటూ వార్తలు రాగా..ఈసారి గాసిప్‌ రాయుళ్లు మరో ముందుడుగు వేశారు. హార్దిక్‌ పాండ్యా తీరు నచ్చని నటాషా.. ఇప్పటికే విడాకుల కోసం దరఖాస్తు చేసిందని వదంతులు వ్యాప్తి చేస్తున్నారు.

భరణం కింద ఆస్తిలో 70 శాతం
ఈ క్రమంలో భరణం కింద హార్దిక్‌ పాండ్యా ఆస్తి(స్పోర్ట్స్‌కీడా నివేదిక ప్రకారం సుమారు రూ. 91 కోట్లు)లో 70 శాతం మేర(దాదాపు 63 కోట్లు) ఇవ్వాలని కోరిందని.. ఇందుకు అతడు కూడా సుముఖంగానే ఉన్నట్లు నెట్టింట రూమర్లు సృష్టిస్తున్నారు. అయితే, ఈ విషయంపై ఇటు హార్దిక్‌ పాండ్యా గానీ.. అటు నటాషా గానీ పెదవి విప్పకపోవడం గమనార్హం.

మరోవైపు.. ఇటీవల నటాషా నుదిటిన బొట్టుతో ఉన్న ఫొటో పోస్ట్‌ చేస్తూ.. ‘‘అతడి ప్రేమ వల్లే ఇలా’’ అంటూ క్యాప్షన్‌ జత చేసింది. దీంతో అభిమానులు పాండ్యాను ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్‌ చేసిందని భావిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో విష్‌ చేయని హార్దిక్‌.. ఒంటరిగానే రీచార్జ్‌ అవుతున్నట్లుగా
అయితే, వాలంటైన్స్‌ డే తర్వాత.. నటాషా పుట్టినరోజున సైతం హార్దిక్‌పాండ్యా ఆమెకు విష్‌ చేస్తూ పోస్ట్‌ పెట్టకపోవడం గమనార్హం. కేవలం కొడుకుతో ఉన్న ఫొటోలు మాత్రమే ఇటీవల పోస్ట్‌ చేసిన హార్దిక్‌.. శుక్రవారం మరో ఫొటోతో ముందుకు వచ్చాడు. ప్రస్తుతం రీచార్జ్‌ అవుతున్నా అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. అయితే, ఇందులో నటాషా గానీ, అగస్త్య గానీ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

తదుపరి ఐసీసీ ఈవెంట్లో
మామూలుగా అయితే, ఆట నుంచి విరామం దొరకగానే హార్దిక్‌ పాండ్యా తన భార్య, కుమారుడితోనే ఎక్కువ సమయం గడుపుతాడు. హార్దిక్‌- నటాషాలలో ఎవరో ఒకరు అధికారికంగా స్పందిస్తే తప్ప ఈ వదంతులకు చెక్‌ పడదు.

కాగా హార్దిక్‌ సెర్బియా మోడల్‌ నటాషాను ప్రేమించి 2020లో పెళ్లాడాడు. పెళ్లికి ముందే తల్లిదండ్రులైన వీరు గతేడాది ఘనంగా మరోసారి వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. హార్దిక్‌ పాండ్యా తదుపరి జూన్‌ 1 నుంచి మొదలుకానున్న టీ20 ప్రపంచకప్‌-2024కు సిద్ధం కానున్నాడు.

Vitamin-D: సూర్యరశ్మి లేకపోతేనే కాదు.. ఈ కారణాల వల్ల కూడా విటమిన్-డి లోపం వస్తుంది..!

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అనేక రకాల పోషకాలు అవసరం అవుతాయి. వీటిలో విటమిన్లు, ప్రోటీన్లు, మాంసకృత్తులు ఇలా చాలా ఉంటాయి. ఏ ఒక్కటి లోపించినా ఆరోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్లలో ముఖ్యంగా విటమిన్-డి శరీరానికి చాలా అవసరం. ఎముకలు దృఢంగా ఉండటమే కాదు, శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం వల్ల కండరాలు-ఎముకల బలహీనత, నిద్రలేమి, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం, డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ విటమిన్ లోపం ఉన్నవారు మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురవుతారు. విటమిన్-డి లోపం సూర్యరశ్మి లేకపోవడం వల్ల మాత్రమే వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ విటమిన్-డి లోపం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..

శరీరంలో విటమిన్ డి లోపానికి ఆహారం, జీవనశైలిలో ఆటంకాలు ఏర్పడటం వంటివి కారణం అవుతాయి. సూర్యరశ్మి విటమిన్ డి యొక్క ఉత్తమ, సహజ మూలం. సూర్యరశ్మిని తగినంతగా బహిర్గతం చేయని వ్యక్తులలో లోపం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది కాకుండా, కొన్ని ఇతర పరిస్థితులు కూడా విటమిన్ డి లోపానికి కారణమవుతాయి. పోషకాహార లోపం ఉన్నవారిలో, మూత్రపిండ వైఫల్యం లేదా ఇతర మూత్రపిండ వ్యాధులు ఉన్నవారిలో. కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్నవారిలో కూడా విటమిన్-డి లోపం ఏర్పడుతుంది.

HOME » HEALTH » VITAMIN D: THESE REASONS ALSO CAUSE VITAMIN D DEFICIENCY SRN SPL
మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం.
ఫోన్|| 9390 999 999, 8008 56 7898
Vitamin-D: సూర్యరశ్మి లేకపోతేనే కాదు.. ఈ కారణాల వల్ల కూడా విటమిన్-డి లోపం వస్తుంది..!
ABN , Publish Date – May 25 , 2024 | 03:01 PM

విటమిన్లలో ముఖ్యంగా విటమిన్-డి శరీరానికి చాలా అవసరం. ఎముకలు దృఢంగా ఉండటమే కాదు, శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం వల్ల కండరాలు-ఎముకల బలహీనత, నిద్రలేమి, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం, డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ విటమిన్ లోపం ఉన్నవారు మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురవుతారు.

Vitamin-D: సూర్యరశ్మి లేకపోతేనే కాదు.. ఈ కారణాల వల్ల కూడా విటమిన్-డి లోపం వస్తుంది..!
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అనేక రకాల పోషకాలు అవసరం అవుతాయి. వీటిలో విటమిన్లు, ప్రోటీన్లు, మాంసకృత్తులు ఇలా చాలా ఉంటాయి. ఏ ఒక్కటి లోపించినా ఆరోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్లలో ముఖ్యంగా విటమిన్-డి శరీరానికి చాలా అవసరం. ఎముకలు దృఢంగా ఉండటమే కాదు, శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం వల్ల కండరాలు-ఎముకల బలహీనత, నిద్రలేమి, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం, డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ విటమిన్ లోపం ఉన్నవారు మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురవుతారు. విటమిన్-డి లోపం సూర్యరశ్మి లేకపోవడం వల్ల మాత్రమే వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ విటమిన్-డి లోపం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..

శరీరంలో విటమిన్ డి లోపానికి ఆహారం, జీవనశైలిలో ఆటంకాలు ఏర్పడటం వంటివి కారణం అవుతాయి. సూర్యరశ్మి విటమిన్ డి యొక్క ఉత్తమ, సహజ మూలం. సూర్యరశ్మిని తగినంతగా బహిర్గతం చేయని వ్యక్తులలో లోపం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది కాకుండా, కొన్ని ఇతర పరిస్థితులు కూడా విటమిన్ డి లోపానికి కారణమవుతాయి. పోషకాహార లోపం ఉన్నవారిలో, మూత్రపిండ వైఫల్యం లేదా ఇతర మూత్రపిండ వ్యాధులు ఉన్నవారిలో. కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్నవారిలో కూడా విటమిన్-డి లోపం ఏర్పడుతుంది.

విటమిన్-డి ఆహారాలు..

ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకోవడం ద్వారా విటమిన్ డి ని భర్తీ చేసుకోవచ్చు. ట్యూనా, సాల్మన్, గుడ్లు, పాలు, ఇతర పాల ఉత్పత్తులు, కొవ్వు చేపలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డితో సహా శరీరానికి అవసరమైన చాలా పోషకాలు గింజలు, విత్తనాల నుండి లభ్యమవుతాయి. ప్రతి వారం కనీసం మూడు రోజులు ఉదయం సూర్యకాంతిలో 15 నిమిషాలు గడపాలని వైద్యులు చెబుతున్నారు.

Gold Rate Today: కుప్పకూలుతున్న బంగారం ధర… నేటి ధరలు ఇవే.. తులం రేటు ఎంతంటే?

Gold Rate Today: పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వరుసగా మూడో రోజు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో దేశీయంగా ధరలు దిగివస్తున్నాయి. రికార్డ్ గరిష్ఠాల నుంచి గోల్డ్ రేట్లు పడిపోతుండడం పసిడి ప్రియులకు ఊరటగా చెప్పవచ్చు. ఇన్నాళ్లు ధరలు పెరుగుతుండడంతో పసిడి, వెండి కొనేందుకు వెనకడుగు వేసిన వారికి కొనుగోలు చేసేందుకు మంచి అవకాశంగా బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ ధరలు పెరగకముందే కొనుగోలు చేయడం మంచిదంటున్నారు. ఓవైపు చూస్తే ఇప్పుటీ ధరలు భారీగానే ఉన్నప్పటికీ గత 15 రోజుల క్రితం నాటి ధరలతో చూసుకుంటే మాత్రం భారీగానే దిగివచ్చాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో మన హైదరాబాద్‌లో ఇవాళ అంటే మే 25వ తేదీన తులం బంగారం ధర ఎంతకు దిగివచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కీలక సూచనలు ఇస్తున్న క్రమంలో బంగారం ధరలు దిగివస్తున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2334 డాలర్లు పలుకుతోంది. ఇటీవలే స్పాట్ గోల్డ్ రేటు 2400 స్థాయి వరకు ఎగబాకిన సంగతి తెలిసేంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 30.38 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. మరోవైపు.. రూపాయి విలువ కాస్త కోలుకుని ప్రస్తుతం రూ. 83.093 వద్ద అమ్ముడవుతోంది.

హైదరాబాద్ మార్కెట్ల బంగారం ధరలు వరుసగా దిగివస్తున్నాయి. గత మూడు రోజుల్లోనే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.2720 మేర తగ్గింది. ఇవాళ ఒక్కరోజే రూ.980 మేర తగ్గి రూ. 72,440 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 900 తగ్గి రూ. 66 వేల 400 వద్ద ట్రేడింగ్ అవుతోంది. మరోవైపు.. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ.980 తగ్గి రూత 72 వేల 590 వద్దకు దిగివచ్చింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.900 తగ్గి రూ. 66,550 వద్దకు దిగివచ్చింది.

బంగారం దారిలోనే వెండి సైతం భారీగా దిగివస్తోంది. క్రితం రోజుల కిలో వెండి రేటు రూ. 3300 మేర పడిపోయిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో రూ.500 మేర దిగివచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ. 96,500 వద్దకు దిగివచ్చింది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండి ధర ఇవాళ రూ. 500 తగ్గి రూ. 92 వేల వద్ద ట్రేడింగ్ అవుతోంది.

ఏపీలో ఆ పార్టీదే విజయం.. ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ సంచలన జోస్యం

ఏపీలో ఆ పార్టీదే విజయం.. ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ సంచలన జోస్యం
AP 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఇటీవల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. దీంతో జూన్ 4న వెలువడే ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయి..? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు..? అన్న చర్చలు రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజల్లో మొదలయ్యాయి. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఫలితాలకు ముందే ఆయన జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని యోగేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. టీడీపీ 15 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తోందని చెప్పారు. ఇక, సెంట్రల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఎన్డీఏకి గతంలో కన్నా 80 సీట్లు తగ్గే అవకాశం ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఒడిషా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 20కి పైగా స్థానాల్లో బీజేపీ గెలిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీకి సొంతంగా మెజార్టీ రాదని కీలక వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్‌లో అధికారం దక్కించుకోవాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 272 కన్నా తక్కువగానే ఈసారి బీజేపీకి సీట్లు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. 2019లో వచ్చిన 303 స్థానాల్లో 65 సీట్లు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మరీ యోగేంద్ర యాదవ్ జోస్యం నిజమవుతుందో లేదో తెలియాలంటే జూన్ 4న ఫలితాలు వెలువడే వరకు వెయిట్ చేయాల్సిందే.

మంత్రివర్గం నుంచి సీతక్క ఔట్ – కీలక పదవి, రేవంత్ ఛాయిస్..!?

తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. జూన్ 4న ఎన్నికల ఫలితాల తరువాత కీలక నిర్ణయాల దిశగా సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నారు. పార్టీ, పాలనా పరంగా ఆసక్తి నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. పీసీసీ చీఫ్..సీఎంగా రేవంత్ ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. ఇక..ఎన్నికలు పూర్తి కావటంతో పూర్తిగా పాలనకు పరిమితం కావాలని భావిస్తున్నారు. ఈ దశలో తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ నియామకం పైన కసరత్తు మొదలైంది.

నూతన పీసీసీ చీఫ్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ..ప్రభుత్వంలో రేవంత్ మార్క్ నిర్ణయాలు అమలు అవుతున్నాయి. రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన పార్టీ హైకమాండ్ సీఎం అభిప్రాయాలకు ఆమోదం తెలుపుతోంది. రేవంత్ సీఎం అయిన తరువాత పీసీసీ చీఫ్ గా మరొకరికి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన పైన చర్చ జరిగింది. అయితే, పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకూ పీసీసీ చీఫ్ పదవిలోనూ కొనసాగాలని పార్టీ నాయకత్వం రేవంత్ కు నిర్దేశించింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావటంతో నూతన పీసీసీ చీఫ్ పదవి ఎంపిక పైన కసరత్తు మొదలైంది. రేవంత్ ను సీఎంగా చేసే సమయంలో భట్టికి డిప్యూటీ సీఎం తో పాటుగా పీసీసీ చీఫ్ పదవి పైన హామీ లభించినట్లు ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు రేవంత్ కేబినెట్ మొత్తం కలిసి కట్టుగా పని చేస్తోంది.
సీతక్కకు పార్టీ పగ్గాలు..?
ఇక..పీసీసీ చీఫ్ పదవి ఖరారులోనూ రేవంత్ మాటకే అధినాయకత్వం ఆమోదం తెలపనుంది. అందులో భాగంగా పీసీసీ పదవి కోసం సీనియర్ నేతలు జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీలు పీసీసీ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ, అనూహ్యంగా రేవంత్ ఛాయిస్ గా మంత్రి సీతక్క పేరు తెర మీదకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గిరిజన మహిళకు పీసీసీ పగ్గాలు అప్పగించటం ద్వారా సానుకూలత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పీసీసీ పదవి కోసం పోటీ పడుతున్న నేతలు సైతం సీతక్కను ఎంపిక చేస్తూ సహకారం అందిస్తారని భావిస్తున్నారు. సీతక్క పైన పార్టీలో అందరికి సదభిప్రాయం ఉంది. పార్టీ కోసం కష్టపడి పని చేస్తారనే నమ్మకంతో పాటుగా రేవంత్ కు నమ్మినబంటుగా పేరుంది.
రేవంత్ ఛాయిస్ ఏంటి
దీంతో..ఇతరుల నుంచి అభ్యంతరం రాకుండా సీతక్కను మంత్రి పదవి నుంచి తొలిగించి పీసీసీ చీఫ్ బాద్యతలు కేటాయిస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది. అయితే, మంత్రిగా కొనసాగుతూనే పీసీసీ చీఫ్ పదవి అప్పగించేలా మరో వాదన కూడా వినిపిస్తోంది. అయితే, ఎన్నికల ఫలితాల తరువాత ముందుగా పీసీసీ చీఫ్ నియామకం..ఆ వెంటనే మంత్రివర్గ విస్తరణ..నామినేటెడ్ పదవుల భర్తీ దిశగా వరుస నిర్ణయాలు ఉంటాయని సమాచారం. అయితే, సీతక్క ఎంపిక పైన పార్టీ హైకమాండ్ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యులతో చర్చించి..ఏకాభిప్రాయంతో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. సీతక్క కే పార్టీ పగ్గాలు అప్పగిస్తే..తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తొలి గిరిజన మహిళా గుర్తింపు పొందనున్నారు.

తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్‌ విడుదలైంది

తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్‌ విడుదలైంది. జూన్‌ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది 23 ఏప్రిల్‌ వరకు కొనసాగనున్నాయి.

తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్‌ను అధికారులు విడుదల చేశారు. జూన్‌ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది 23 ఏప్రిల్‌ వరకు కొనసాగనున్నాయి.

అక్టోబర్‌ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు
డిసెంబర్‌ 23 నుంచి 27 వరకు 5 రోజుల క్రిస్మస్‌ సెలవులు
వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
28 ఫిబ్రవరి 2025లోపు పదో తరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షలు
2025 మార్చిలో పదో తరగతి పరీక్షలు
ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉన్నత పాఠశాలల సమయం
అప్పర్‌ ప్రైమరీకి ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 వరకు తరగతులు

విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం! స్కూల్లో చేరిన తొలి రోజే

ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక పాఠశాలల రూపురేఖలే మారిపోయాయి. నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూల్స్ కి తగ్గట్టు అత్యాధునికంగా తీర్చిదిద్దడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన, మార్కులు, ర్యాంకుల విషయంలో ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడడం ఇలా చాలానే మార్చారు జగన్. తాగునీటి వసతి, టాయిలెట్స్, మంచి క్లాస్ రూములు, విద్యార్థులకు ట్యాబ్ లెట్స్ పంపిణీ ఇలా చాలా విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు. గడిచిన ఇన్నేళ్ళలో ఏ ప్రభుత్వం చేయని పని జగన్ సర్కార్ చేసి చూపించింది. ఒకప్పుడు స్కూల్ కి వెళ్లడం కంటే జైలుకెళ్లినట్టు ఫీలయ్యేవారు. జైళ్లను తలపించేలా ఆ టాయిలెట్లు దారుణంగా ఉండేవి. కొన్ని పాఠశాలల్లో అయితే తాగు నీరే ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రతీ స్కూల్లో మినరల్ వాటర్ సదుపాయం ఉంది. వాటర్ ప్లాంట్స్ ప్రత్యేకంగా ఉన్నాయి. విద్యార్థుల కోసం తరగతి గదులు మారిపోయాయి, పేద, మధ్యతరగతి వాళ్ళ జీవితాలు మారిపోయాయి.

ప్రభుత్వ బడుల్లో చదివితే ఏమవుతారో.. పిల్లల జీవితం ఏటైతాదో అని భయపడి కష్టమైనా ప్రైవేట్ పాఠశాలల్లో చదివించేవారు. ఫీజుల భారం భరించలేక మధ్యతరగతి వాళ్ళు పేదలుగా మారిపోతున్నారు. అలాంటి వారికి జగన్ సర్కార్ అమ్మ ఒడి పేరుతో చేయూతనిచ్చింది. ఏటా 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించింది. పుస్తకాలు, యూనిఫార్మ్, మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం ఇలా చాలానే చేసింది ఏపీ ప్రభుత్వం. తాజాగా ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎండాకాలం సెలవులు ముగిసే సమయం దగ్గర పడింది. మరికొన్ని రోజుల్లో పాఠశాలలను తెరవనున్నారు. ఇప్పటికే కొత్త అడ్మిషన్ల హడావుడి మొదలైంది. ఇక అడ్మిషన్ల హడావుడి అయిపోతే తర్వాత పిల్లలకు యూనిఫార్మ్, పుస్తకాల పంపిణీ హడావుడి మొదలవుతుంది.

ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాలలు తెరిచిన మొదటి రోజునాడే పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. గతంలో స్కూల్స్ తెరిచినా కూడా సకాలంలో పాఠ్యపుస్తకాల పంపిణీ కరిగేది కాదు. నెల, రెండు నెలలు ఆగవలసి వచ్చింది. అయితే ఎప్పుడైతే జగన్ ప్రభుత్వం ఏర్పడిందో.. అప్పుడే పాఠశాలలపై దృష్టి సారించారు. పాఠశాలలు తెరిచిన మొదటిరోజునే పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఈ ఏడాది కూడా స్కూలు తీసిన మొదటి రోజునాడే పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. వేసవి సెలవుల తర్వాత అడ్మిషన్లు తీసుకోవడం.. కొత్త క్లాస్ కి విద్యార్థులు ప్రమోట్ అవ్వడం ఇవన్నీ చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అదే సమయంలో కొత్త టెక్స్ట్ బుక్ లు ఎప్పుడు వస్తాయా అని ఆతురతగా ఎదురుచూస్తుంటారు.

చాలా రోజులు ఎదురుచూస్తేనే గానీ తెలియదు. పైగా టెక్స్ట్ బుక్ లు వచ్చేలోపు చాలా సమయం వృధా అవుతుంది. ఇలాంటి పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం వెంటనే పిల్లల పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వ పాఠశాలలు తెరిచిన మొదటి రోజు నాడే పాఠ్య పుస్తకాలను అందజేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే 2024-2025 సంవత్సరానికి సంబంధించిన మొదటి సెమిస్టర్ టెక్స్ట్ బుక్ లను మండల లెవల్ స్టాక్ పాయింట్లకు పంపించడం జరిగిందని.. పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ఏపీ సర్కార్ తెలిపింది. ప్రైవేట్ పాఠశాలలకు కూడా టెక్స్ట్ బుక్స్ అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. కాగా ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

EPFO: ఆధార్ అలర్ట్.. మీ ఖాతాను లింక్ చేసుకోలేదా

పీఎఫ్ ఖాతాదారులు తమ యూఏఎన్ నంబర్‌ని ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. లేదంటే పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేసేటప్పుడు సమస్యలు ఎదురవుతాయి.

సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 సెక్షన్ 142 ప్రకారం ఉద్యోగులు, సంస్థలో పని చేస్తున్న కార్మికులు ఈపీఎఫ్ అకౌంట్‌కి ఆధార్ లింక్ చేసుకోవడం తప్పనిసరి. లింక్ ప్రాసెస్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్లో చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో లింక్ చేసుకునే విధానం తెలుసుకుందాం..

EPFO అధికారిక వెబ్‌సైట్ లింక్‌ని సందర్శించండి

UAN, పాస్‌వర్డ్ ఉపయోగించి మీ ఖాతాకు లాగిన్ చేయండి.

“Manage” విభాగానికి వెళ్లి, డ్రాప్‌డౌన్ మెను నుండి “KYC”ని ఎంచుకోండి.

డాక్యుమెంట్ టైప్‌గా “ఆధార్”ని ఎంచుకుని,ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

వివరాలను సమర్పించడానికి “సేవ్” బటన్‌పై క్లిక్ చేయండి.

ఆధార్ వివరాలు EPFO ​​ద్వారా ధృవీకరిస్తారు. తద్వారా UANకి ఆటోమెటిక్‌గా లింక్ అవుతుంది.

UMANG యాప్‌తో..

ఫోన్‌లో UMANG యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

EPF ఖాతాతో లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి. మీ ఖాతాకు లాగిన్ చేయడానికి MPINని కూడా ఉపయోగించవచ్చు.

UMANG యాప్‌లో లాగిన్ అయిన తర్వాత, All Services ట్యాబ్‌కు వెళ్లి, EPFO ​ఎంపికపై నొక్కండి

e-KYC సేవల విభాగం కింద ఆధార్ సీడింగ్ ఆప్షన్‌ను ఎంచుకోండి

UAN నంబర్‌ని నమోదు చేసి, గెట్ OTP బటన్‌ని నొక్కండి.

మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.

ఆధార్ నంబర్‌ను నమోదు చేసి సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

OTPని ఎంటర్ చేయడం ద్వారా ఆధార్ నంబర్‌ను ధృవీకరించండి.

చివరికి ఆధార్ నంబర్ యూఎఎన్‌కి లింక్ అవుతుంది.

ఆఫ్‌లైన్‌లో..

ఆఫ్‌లైన్‌లో ఆధార్, యూఏఎన్ లింక్ చేయాలనుకుంటే ఈపీఎఫ్ఓ కార్యాలయం లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కి వెళ్లండి.

అక్కడ అందుబాటులో ఉన్న ఆధార్ లింకింగ్ ఫారమ్‌ను నింపండి.

ఆధార్ కార్డ్ స్వీయ ధృవీకరణతోపాటు ఆధార్ లింకింగ్ ఫారమ్‌ను సమర్పించండి.

EPFO అధికారి లేదా CSC ప్రతినిధి వివరాలను ధృవీకరిస్తారు. ఆధార్ నంబర్‌ను మీ UANకి మాన్యువల్‌గా లింక్ చేస్తారు.

లింకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్ధారణను అందుకుంటారు.

EPF, ఆధార్ లింకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత EPFO వెబ్‌సైట్‌లోని మీ ప్రొఫైల్‌లో ఆధార్ ఆప్షన్ పక్కన వెరిఫైడ్ అనే పదం కనిపిస్తుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు కూడా మెసేజ్ రూపంలో నిర్ధారణ వస్తుంది.

the San Jose: 200 టన్నుల బంగారంతో నీట మునిగిన నౌక.. సముద్రగర్భంలో నిధి కోసం ముమ్మర వేట..!

టన్నుల కొద్దీ బంగారం, రత్నాలతో స్పానిష్‌కు బయల్దేరిన ఓ నౌక దాదాపు 300 ఏళ్ల క్రితం శత్రు దాడిలో దెబ్బతిని సముద్రంలో మునిగిపోయింది. నాటినుంచి అత్యంత విలువైన ఆ నిధి సముద్రగర్భంలోనే నిక్షిప్తమై ఉంది. కొన్నేళ్ల కిందట దానిని గుర్తించినా.. వాటాల్లో తేడా వచ్చి ఎవరూ వెలికి తీయలేదు. తాజాగా దానిని దక్కించుకొనేందుకు ఓ దేశం వేగంగా పావులు కదుపుతుండటం వార్తల్లో నిలిచింది.

కరేబియన్‌ సముద్రంలో మునిగిన శాన్‌జోస్‌ అనే పురాతన నౌకను తాము పరిశోధించడం మొదలుపెడతామని కొలంబియా ఇటీవల ప్రకటించింది. ఈ ప్రకటనతో అమెరికా, స్పెయిన్‌, పెరూ సహా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇందుకో కారణం ఉంది. 1708వ సంవత్సరంలో స్పెయిన్‌కు చెందిన నౌక పెరూలోని దాదాపు 200 టన్నుల బంగారం, వెండి, రత్నాలను తీసుకొని కొలంబియాకు బయల్దేరింది. తూర్పున ఉన్న కరీబియన్‌ తీర నుంచి ప్రయాణం మొదలు పెట్టిన ఈ నౌకపై శత్రువులు దాడి చేయడంతో 600 మంది సిబ్బందిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఆ సంపద మొత్తం నాటినుంచి సముద్రగర్భంలో 600 మీటర్ల లోతున నౌక శిథిలాల కిందే ఉండిపోయింది. దీనికి ఉన్న దాదాపు 64 భారీ రాగి తుపాకులు కూడా అక్కడే పడిపోయి ఉన్నాయి. ఆ సమయంలో ఈ నౌకతో పాటు బంగారంతో ఉన్న మరో నౌక దాడి నుంచి తప్పించుకొంది.

తాజాగా కొలంబియా ప్రభుత్వం ఈ నిధి నిక్షిప్తమై ఉన్న ఓడపై పరిశోధన చేపట్టినట్లు ఇటీవల ప్రకటించింది. దీనిలోభాగంగా ది కొలంబియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంత్రోపాలజీ అండ్‌ హిస్టరీ (ఐసీఏఎన్‌హెచ్‌) సంస్థ ప్రత్యేకమైన రిమోట్‌ సెన్సర్లను వాడి నౌకను ఫొటోగ్రఫీ చేయనుంది. దీని ఆధారంగా తర్వాత శోధన కొనసాగుతుందని పేర్కొంది. అనంతరం ఈ నౌక నుంచి పురాతన వస్తువులు, సంపదను వెలికితీస్తాయన్నారు. ఇక ఈ నౌక మునిగిపోయిన ప్రదేశాన్ని ఇప్పటికే ఐసీఏఎన్‌హెచ్‌ రక్షిత పురాతత్వ ప్రదేశంగా ప్రకటించింది.

అసలు ఈ సంపదపై హక్కులు ఎవరివీ..
1981లో అమెరికాకు చెందిన సముద్ర గర్భాన్వేషణ సంస్థ సీసెర్చి ఆర్మడా(ఎస్‌ఎస్‌ఏ) ఈ నౌక శకలాలు కనుగొన్నట్లు ప్రకటించింది. కొలంబియా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైంది. ఆ దేశ పార్లమెంట్‌ ఈ నిధిపై పూర్తి హక్కును ప్రకటించింది. కేవలం 5శాతం ఫీజు కింద ఎస్‌ఎస్‌ఏ సంస్థకు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో ఆ సంస్థ అమెరికా కోర్టులో కేసు వేయగా.. రెండుసార్లు ఆ సంపదపై కొలంబియాదే హక్కు అని తేల్చిచెప్పింది.

ఆ తర్వాత 2015లో తాము శాన్‌జోస్‌ నౌక శకలాలను స్వయంగా కనుగొన్నామని కొలంబియా ప్రకటించింది. భారీ రాగి తుపాకులు వంటి పరికరాలు అక్కడ ఉన్నట్లు పేర్కొంది. ఇందుకోసం బ్రిటిష్‌, అమెరికా కంపెనీల సాయం తీసుకొన్నట్లు వెల్లడించింది. దీంతో ఎస్‌ఎస్‌ఏ సంస్థ పర్మినెంట్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌లో 10 బిలియన్‌ డాలర్లకు కొలంబియాపై కేసు వేసింది. మరోవైపు స్పెయిన్‌, పెరూ ప్రభుత్వాలు కూడా ఆ నౌకపై యాజమాన్య హక్కులు తమవే అని చెబుతున్నాయి. కానీ, ఈ నౌక మునిగిపోయిన ప్రాంతాన్ని కొలంబియా, ఎస్ఎస్‌ఏ కంపెనీ ఇప్పటివరకు అత్యంత గోప్యంగా ఉంచాయి.

Summer Halth Tips : ఎండలోంచి రాగేనే నీరు తాగేస్తున్నారా.. అలా అయితే ఈ ఇబ్బంది తప్పదు.. !

వేడి వాతావరణంలో ముఖ్యంగా వేసవిలో ప్రజలందరికీ పరీక్షా సమయం ఎందుకంటే పెరిగిన వేడి కారణంగా చెమట, తేమ కారణంగా దాహం తీవ్ర చికాకును తెప్పిస్తాయి. కొందరిలో ఒత్తిడి కూడా ఉంటుంది. దీనికి ద్రవాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండీలి. హైడ్రేట్ గా ఉండేందుకు ఇదో మార్గం. కాకపోతే చాలా తక్కువమంది మాత్రమే ఈ నియమాన్ని పాటిస్తూ వాతావరణాలనికి తగినట్టుగా నీటిని తీసుకుంటూ ఉంటారు. వేసవి లేదా వేడి వాతావరణం పరిస్థితిని తీవ్రతరం చేస్తుంది. అసౌకర్యాన్ని పెంచుతుంది.

శరీరం ఉత్తేజంగా, ఉత్సాహంగా ఉండాలంటే మాత్రం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఏ సీజన్ అయినా నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వేసవిలో ఎక్కువ నీరు త్రాగాలి. ఎందుకంటే వాతావరణంలో వేడి కారణంగా శరీరంలో నీటిలోపం మొదలవుతుంది. అందువల్ల శరీరాన్ని చల్లగా ఉంచడానికి పుష్కలంగా నీరు త్రాగాలి.

ఎండాకాలం దాహం వేయడం మామూలే. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే నీటిని తగు మొతాదులో తాగుతూ ఉండాలి. ఎండ బాగా ఉన్న సమయంలో బయటి నుంచి ఇంటికి వచ్చాకా కాసేపు ఉష్ణోగ్రతలో కూర్చోవాలి. ఆ తర్వాత శరీర ఉష్ణోగ్రత సాధారణమైన తర్వాత మాత్రమే నీరు తీసుకోవాలి.

వేసవిలో ఎక్కువ సేపు ఎండలో ఉండటం వల్ల కూడా డీహైడ్రేషన్ బారిన పడవచ్చు. దీన్ని తగ్గించాలంటే నీరు క్రమంగా తాగటం ముఖ్యం. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందుతూనే నీటి తీసుకోవాలి. అయితే వేడిలో నుంచి నీడకు రాగానే వెంటనే నీరు తాగకూడదు. ఇలా చేయడం వల్ల జలుబు, దగ్గు సమస్య మొదలవుతుంది.

అవసరం అయితేనే తప్ప ఇల్లు కదలకుండా ఇంటి పట్టునే ఉండాలి. రోజులో అత్యంత వేడిగా ఉండే సమయం ఉదం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటలు.. ఈ మధ్యకాలంలో ఇంటిపట్టునే ఉండి లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి.

1. ఎండ నుండి బయటకు వచ్చిన వెంటనే నీరు తాగకూడదు..

2. సాధారణ ఉష్ణోగ్రతలో కాసేపు కూర్చున్న తర్వాత అప్పుడు నీటిని తీసుకోవాలి.

3. వేడివాతావరణంలో నీటిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్, కళ్లు తిరగడం వంటి సమస్యలు ఉంటాయి. దీనితో జ్వరం, వాంతులు, జలుబు, దగ్గు వంటివి పెరిగే అవకాశం ఉంది.

చదవడం, రాయడం రాదు.. కానీ పదిలో 99.5% మార్కులు..! ఎలా అంటే?

దేశంలో డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమే అన్న సంగతి తెలిసిందే. డబ్బుంటే కొండమీది కోతినైనా కొని తేవొచ్చు అంటారు పెద్దలు. ఈ మధ్య కాలంలో కొంతమంది డబ్బు కోసం పలు అన్యాయాలకు.. అక్రమాలకు పాల్పపడుతున్నారు. దొంగతనాలు, హైటెక్ మోసాలు, వ్యభిచారం, డ్రగ్స్ దందా ఇలా ఎన్నో రకాల దందాలు చేస్తు లక్షలు సంపాదిస్తున్నారు. కొంతమంది దొంగ సర్టిఫికెట్స్ తో కోట్లు దండుకుంటున్నారు. పది తరగతి నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ ఇలా ఎలాంటి సర్ఫిఫికెట్లు అయినా సరే అంగట్లో సరుకుల్లా దొరుకుతున్న విషయం తెలిసిందే. కొంతమంది దొంగ సర్టిఫికెట్స్ తో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారు కూడా ఉన్నారు. కర్ణాటకలో ఆసక్తికర సంఘటన చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరులో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. కొప్పల్ కోర్టులో ప్యూన్ ప్రభు లక్ష్మీకాంత్ లొఖరే (23) కు పదిలో వచ్చిన మార్కులు చూసి జడ్జీ ఆశ్చర్యపోయాడు. అంతేకాదు సదరు ప్యూన్ కి అస్సలు చదవడం రాదు, రాయడం రాదని తెలిసి జడ్జీ అవాక్కయ్యాడు. రాయ్‌చూర్ జిల్లాలోని సింధనూర్ తాలూకాకు చెందిన ప్రభు కు పదవ తరగతిలో 99.5 శాతం మార్కులు వచ్చాయి. ఈ క్రమంలోనే 10వ తరగతి మార్కుల ఆధారంగా ప్యూన్ రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం తుది మెరిట్ జాబితాలో ఏప్రిల్ 22, 2024న అతని పేరు రావడంతో ఉద్యోగానికి ఎంపిక అయ్యాడు. ఉద్యోగం చేస్తున్న కొద్ది రోజులకే అయ్యవారి భాగోతం బయటపడింది.

కోర్టులో ప్రభుత్వ ఉద్యోగం.. హ్యాపీగా ఉందని ఫిక్స్ అయిన ప్రభు కి జడ్జీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ప్రభు కి రాయడం, చదవడం రాదని తెలుసుకున్న జడ్జీ ఎలా రిక్యూట్‌మెంట్ అయ్యాడు.. అతని అర్హతలు ఏంటీ అన్న దానిపై విచారణ జరిపారు. అప్పుడు ప్రభు టెన్త్ సర్టిఫికెట్ చూసి షాక్ తిన్నాడు. అంతేకాదు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జడ్జీ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రభు ఏడో తరగతి తర్వాత నేరుగా పదో తరగతి పరీక్ష రాసి 625 మార్కులకు 623 మార్కులను సాధించినట్లు ఎప్ఐఆర్ లో పేర్కొన్నారు. అంతేకాదు ప్రభుకి కన్నడం చదవడం, రాయడం రాదు, ఇంగ్లీష్ కూడా పెద్దగా తెలియదు. దొంగ సర్టిఫికెట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందారా? అనే దానిపై విచారణ జరపాలని న్యాయమూర్తి డిమాండ్ చేశారు. పోలీసులు ప్రభు ఎడ్యూకేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Health

సినిమా