Saturday, November 16, 2024

తల్లి పోలీస్.. కొడుకు నక్సలైట్.. OTTని అల్లాడిస్తున్న మూవీని ఇంకా చూడలేదా?

ఇప్పటివరకు మీరు చాలానే నక్సలైట్ బ్యాగ్ డ్రాప్ స్టోరీస్ చూసుంటారు. వాటిలో చాలావరకు కల్పిత కథలే. కానీ, ఇప్పుడు ఓటీటీలో ఒక సినిమా యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన నక్సల్ బ్యాగ్ డ్రాప్ లో వచ్చిన మూవీ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది. ఆ మూవీలో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. అదే తల్లీకొడుకుల సెంటిమెంట్. తల్లి పోలీసు అయితే.. కొడుకు నక్సల్ అవుతాడు. ఆ ఇద్దరి మధ్య జరిగే సంఘర్షణ అందరినీ భావోద్వేగానికి లోనయ్యేలా చేస్తుంది. పోలీసులకు- నక్సలైట్లకు మధ్య జరిగే యుద్ధంలో ఓ నిరుపేద కుటుంబం సమిదలుగా మారిపోతుంది. ఇంత ఇంట్రెస్టింగ్ సినిమా ఇంకా చూడలేదా?

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో బస్టర్ అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ మావోయిస్టులు నియంతల్లా వ్యవహరిస్తూ ఉంటారు. అక్కడ పిల్లలు పుడితే ఇంటికి ఒక బిడ్డని నక్సలిజంలో చేర్చాలి అని బలవంతం చేస్తారు. ఎదురు తిరిగితే హింసించి దారుణంగా చంపుతారు. ఎదిగిన పిల్లల్ని నక్సలిజంలోకి తీసుకెళ్ళి శిక్షణ ఇస్తుంటారు. అయితే ఒక కుటుంబం వీళ్ళ మీద రివర్స్ అవుతుంది. తండ్రి ఒక పోలీసు అధికారిని కలుస్తాడు. పోలీసుని కలిసినందుకు ఆ తండ్రిని ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. ఆ వ్యక్తి కొడుకుని నక్సలైట్లు తీసుకెళ్లిపోతారు.

కొడును కోల్పోయిన ఆ తల్లిని పోలీసు ఆఫీసర్ కలిసి ధైర్యం చెప్తుంది. పోలీస్ ట్రైనింగ్ తీసుకో.. పోలీస్ అయ్యి వాళ్ళ మీద పగ తీర్చుకో అని చెప్తుంది. ఆ కొడుకుకు మొదటి నుంచి నక్సలైట్ అవ్వాలి అనేదే కోరిక. అందుకోసం ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఉవ్విళ్లూరుతూ ఉంటాడు. ఆ తల్లి పోలీసులతో కలిసి నక్సలైట్లను అంతం చేయడానికి యుద్ధం చేస్తుంటుంది. తన కొడుకుని ఎలాగైనా ఆ కూపం నుంచి కాపాడుకోవాలి అనుకుంటుంది. అడవిలో టెంటుల్లో రాత్రి నిద్రపోతున్న 76 మంది ఆర్మీ జవాన్ల మీద ఎటాక్ చేసి తగలబెట్టి, వారిని నరికి, తుపాకులతో కాల్చి చంపేస్తారు.

మావోయిస్టులకి సమర్థించే వర్గానికి, మావోయిస్టు వ్యతిరేక వర్గానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. ఈ యుద్ధంలో పావుగా మారిన ఒక పేదవాళ్ల కొడుకు.. ఆ కొడుకుని ఆ తల్లి, పోలీస్ (ఆదా శర్మ) కాపాడారా? లేక నక్సలైట్ గా వీరి మీద తిరగబడితే చంపేస్తారా? తల్లి చేతిలో ఆ కొడుకు నక్సలైట్ గా చస్తాడా? లేక తల్లి మాట విని మంచి వ్యక్తిగా జీవితం ప్రారంభిస్తాడా? కొడుకుని చదివించాలన్న తల్లి పోరాటం.. నక్సలైట్ అవ్వాలన్న కొడుకు ఆరాటం.. నక్సలిజం నుంచి బస్తర్ అనే ఊరికి విముక్తి కల్పించాలని ఒక పోలీస్ యుద్ధం. చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే మీరు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న బస్తర్: ది నక్సల్ స్టోరీ సినిమా చూడాల్సిందే.

షుగర్ పేషెంట్స్ కూడా మామిడి పండు తినొచ్చు.. ఎలానో తెలుసా?

షుగర్ పేషెంట్స్ కూడా ఎలాంటి భయం లేకుండా మామిడి పండు తినవచ్చట. ఈ హ్యాక్స్ తో మీ షుగర్ లెవల్స్ పెరగకుండా కూడా ఉంటాయట. మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం…

ఎండాకాలం కోసం ఎక్కువ మంది ఎదురుచూసేది కేవలం మామిడి పండు తినడం కోసమే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే… మామిడి పండు కేవలం మనకు సమ్మర్ లో మాత్రమే దొరకుతుంది. మ్యాంగో లవర్స్.. ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా..? వాటిని తిందామా అని అనుకుంటారు. అయితే… ఈ పండు తినాలనే ఇష్టం, కోరిక ఉన్నప్పటికీ… షుగర్ పేషెంట్స్ వాటిని తినలేరు. మామిడి తింటే… వారిలో షుగర్ లెవల్స్ మరింత పెరుగుతాయి. అది ప్రమాదానికి దారి తీస్తుందని భయపడతారు.

అయితే… కొన్ని చిట్కాలు, జాగ్రత్తలు ఫాలో అయితే.. షుగర్ పేషెంట్స్ కూడా ఎలాంటి భయం లేకుండా మామిడి పండు తినవచ్చట. ఈ హ్యాక్స్ తో మీ షుగర్ లెవల్స్ పెరగకుండా కూడా ఉంటాయట. మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం…

డయాబెటిక్ పేషెంట్లు మామిడి పండు తినేటప్పుడు ఆ భాగాన్ని గుర్తుంచుకోవాలి. ఒక మీడియం మామిడి పండులో 50 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయని, కాబట్టి రోజులో ఒకటి లేదా సగం మామిడిపండు తింటే షుగర్ స్పైక్ ఉండదని నిపుణులు చెబుతున్నారు. తినాలి అనే ఆత్రంతో ఎక్కువ తినకుండా.. కాస్త కంట్రోల్ లో ఉంటే.. ఈ సమ్మర్ లో మ్యాంగోని మీరు కూడా ఆస్వాదించవచ్చు.

మీరు మామిడిని ఎప్పుడు తిన్నారో, అందులో హెల్తీ ఫ్యాట్స్ , ఫైబర్ కలిపి తినాలని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండు తినడానికి ముందు, చియా గింజలతో ఒక కప్పు నిమ్మకాయ నీరు త్రాగాలి, లేదా ఇది కాకుండా, మామిడి తినడానికి ముందు నానబెట్టిన బాదం లేదా వాల్‌నట్‌లను తినండి. ఇది ఆకస్మిక గ్లూకోజ్ స్పైక్‌లను నివారిస్తుంది. మ్యాంగో తినాలంటే.. ఇతర ఫుడ్స్ తో దానిని బ్యాలెన్స్ చేయడం ముఖ్యం అనే విషయం గుర్తుంచుకోవాలి.

మామిడి పండు తినడానికి ముందు, ముందుగా నడక లేదా వ్యాయామం చేయండి, ఇది చక్కెర మసాలా నుండి మిమ్మల్ని కాపాడుతుంది. మీరు మామిడిని తిన్నప్పుడల్లా, దానిని పండులా తినండి, మామిడి షేక్ లేదా జ్యూస్‌గా త్రాగవద్దు, ఎందుకంటే ఇందులో చక్కెర చాలా ఉంటుంది. అది మరింత ప్రమాదం.

మీరు మామిడిని తీసుకుంటే, దానితో పాటు ఇతర అధిక కార్బ్ ఆహార పదార్థాలను తీసుకోకండి, మామిడి పండు తినాలంటే.. ఇతర కార్బ్స్ ని కచ్చితంగా కట్ చేయాల్సిందే. లేదంటే…. అయితే మీ రక్తంలో చక్కెర స్థాయి పెరిగుతుంది. కాబట్టి.. ఆ జాగ్రత్త చాలా అవసరం.

అదృష్టవంతులకు పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటాయో తెలుసా?

సముద్ర శాస్త్రం.. జ్యోతిషశాస్త్రంలో ఒక ముఖ్యమైన భాగం. దీనిలో మన శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు ఎన్నో రహస్యాల గురించి చెప్తాయని నమ్ముతారు. ఇలాంటి పరిస్థితిలో.. ఒక వ్యక్తి శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు ఆ వ్యక్తి గురించి ఎన్నో విషయాలను చెప్తాయి. కాగా శరీరంలోని ఏ పుట్టుమచ్చలు వ్యక్తికి శుభ సంకేతాలను ఇస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సముద్ర శాస్త్రంలో.. ఒక వ్యక్తి మొత్తం శరీరాన్ని విశ్లేషించడం ద్వారా, అతని ప్రవర్తన, భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మన శరీరంలో చాలా చోట్ల పుట్టుమచ్చలు ఉంటాయి. సముద్ర శాస్త్రంలో ప్రతి పుట్టుమచ్చకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. కొన్ని పుట్టుమచ్చలను శుభప్రదంగా భావిస్తే.. మరికొన్ని పుట్టుమచ్చలను అశుభంగా భావిస్తారు. సముద్ర శాస్త్రం ప్రకారం.. శరీరంలోని ఏ భాగాలపై పుట్టుమచ్చలు ఉండటం ఒక వ్యక్తికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

నుదిటిపై..

ఒక వ్యక్తి నుదుటిపై పుట్టుమచ్చలు ఉంటే దాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ధన కొరతను ఎదుర్కోనవసరం లేదని సముద్ర శాస్త్రంలో నమ్ముతారు. అలాగే ఒక వ్యక్తికి నాభి పైన లేదా దాని చుట్టూ పుట్టుమచ్చ ఉంటే అది కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అలాంటి వారికి ఆర్థిక సమస్యలు రావు. పేదరికాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడదు.

చెంపపై..

సముద్ర శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తికి కుడి చెంపపై పుట్టుమచ్చ ఉంటే దాన్ని శుభ సంకేతంగా భావిస్తారు. ఇలాంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. అయితే ఎడమ బుగ్గపై పుట్టుమచ్చ ఉండటం శుభ సంకేతంగా పరిగణించబడదు. ఓషనోగ్రఫీ నమ్మకాల ప్రకారం.. ఈ వ్యక్తి డబ్బు విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఛాతీ మధ్యలో..

సముద్ర శాస్త్రం ప్రకారం.. ఛాతీ మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి చాలా అదృష్టవంతుడుగా పరిగణించబడతాడు. ఈ వ్యక్తులకు జీవితంలో మంచి గౌరవం లభిస్తుంది. అలాగే గొంతు దగ్గర పుట్టుమచ్చ ఉంటే కూడా శుభ సంకేతమేనంటారు. ఇలాంటి వ్యక్తి తన జీవితంలో చాలా డబ్బును సంపాదిస్తాడు.

ముక్కుపై..

ముక్కుకు కుడి వైపున పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి జీవితంలో బాగా సంపాదిస్తాడని సముద్ర శాస్త్రం నమ్ముతుంది. అలాగే కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే అది మీ జీవితంలో ఆనందం,శ్రేయస్సును సూచిస్తుంది.

Rain Alert: ప్రజలకు కూల్ న్యూస్.. మూడు రోజుల పాటు ఫుల్లుగా వర్షాలు.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్..

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది.. ఉపరితల ద్రోణి ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మరోవైపు రేపు శ్రీకాకుళం 8, విజయనగరం 6, మన్యం 12, అల్లూరి జిల్లా 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలిపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

సోమవారం సాయంత్రం 6 గంటల నాటికి శ్రీసత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలంలో 42.5మిమీ, చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో 38.2మిమీ, కోనసీమ మండపేట, విజయనగరం కొత్తవలసలో 30.5మిమీ, అల్లూరి జిల్లా అడ్డతీగలలో 27.2మిమీ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 26మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. దాదాపు 30 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడినట్లు తెలిపారు.

ఇదిలాఉంటే.. రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది..

తక్కువ ధరకే కారు కొనాలనుకుంటున్నారా ? రూ.5 లక్షల్లోపు బెస్ట్ కార్లు ఇవే..

ఈ రోజుల్లో ప్రతి ఇంటికి కనీసం ఒక ఫోర్ వీలర్ వాహనం తప్పనిసరి. సొంతంగా కార్ కొనాలనుకునే వారు చాలా మంది ఉన్నప్పటికీ, భారతదేశంలో అందుబాటులో ఉన్న తక్కువ బడ్జెట్ బెస్ట్ కార్లు ఏవో తెలుసా…
Renault KWID దీని ధర – 4.64 లక్షలు. రెనాల్ట్ కార్లు వాటి లుక్స్ ఇంకా ధరల కారణంగా భారతీయ మార్కెట్లో వీటినకి ప్రాధాన్యతనిస్తారు. దేశంలో ఈ వాహనానికి మంచి డిమాండ్ కూడా ఉంది. తక్కువ ధరలో కార్లు కొనాలనుకునే వారు దీన్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవచ్చు.

3.39 లక్షల ధరతో మారుతి ఆల్టో కార్ పెట్రోల్ ఇంజన్ అలాగే సిఎన్‌జి ఇంజన్‌తో వస్తుంది. పెట్రోల్ ఇంజన్లు 796 సిసి, 1061 సిసి, సిఎన్‌జి ఇంజన్ 796 సిసితో వస్తున్నాయి. ఈ కార్ మాన్యువల్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఆల్టో కార్ మైలేజ్ సిఎన్‌జి/ పెట్రోల్ వేరియంట్‌పై ఆధారపడి 18.9 kmpl నుండి 26.83 kmpl వరకు ఇస్తుంది.

హ్యుందాయ్ శాంత్రో ధర రూ. 4.89 లక్షలు. హ్యుందాయ్ శాంత్రో 4-సిలిండర్, 1.1-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 68 bhp పవర్, 99 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది

మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో ధర 3.99 లక్షలు. S-ప్రెస్సో పవర్‌ట్రెయిన్ 1.0 లీటర్ K10B పెట్రోల్ ఇంజన్ తో లభిస్తుంది. ఈ ఇంజన్ 67 బిహెచ్‌పి పవర్, 90 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. దీనిని 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMTతో అందిస్తున్నారు. అంతే కాకుండా ఈ కారు ఫ్యాక్టరీ ఫిట్టేడ్ CNG కిట్‌తో వస్తుంది. LXI, LXI (o) మరియు VXI (o) అనే మూడు వేరియంట్‌లలో లభిస్తుంది.

ఇక్కడ పేర్కొన్న ధరలు అన్ని ఢిల్లీ ఎక్స్ షోరూమ్ చెందినవి.

TS Cabinet Meet: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే

TS Cabinet Meet: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే

హైదరాబాద్: ఎన్నికల సంఘం షరతుల మేరకు నిర్వహించిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ భేటీలో సుమారు 4 గంటలపాటు పలు అంశాలపై మంత్రులు చర్చించారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న సోనియా గాంధీని తెలంగాణకు పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. వచ్చే సీజన్ నుంచి సన్నవడ్లపై రూ.500 బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ సాఫీగా కొనసాగేందుకు కలెక్టర్లు బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు మీడియాకు వెల్లడించారు. రేపటి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సబ్‌కలెక్టర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని మంత్రులు తెలిపారు. ఇక నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. రైతులు లూజు విత్తనాలు కొనొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

మరోవైపు విద్యకు పెద్దపీట వేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా స్కూళ్ల నిర్వహణ చేపట్టేందుకు కేబినెట్ నిర్ణయించిందని మంత్రలు వెల్లడించారు. జూన్ 12 స్కూళ్లు ప్రారంభమయ్యే సమయానికి తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇక జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని కేబినెట్ నిర్ణయించింది.

రాష్ట్ర అవతరణ వేడుకలకు కేసీఆర్‌కు ఆహ్వానం: మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం తరపున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. పాఠశాలలు పున:ప్రారంభమయ్యే జూన్ 12 లోగా విద్య వ్యవస్థలో మార్పులు చూపించాలని కెబినెట్ నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. ‘‘మంత్రి వర్గ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ధాన్యం కొనుగోలు విషయంలో ఒక్క గింజ కూడా తరుగు లేకుండా తీసుకుంటాం. మూడు రోజుల్లో పేమెంట్ అయ్యేలా చూస్తాం. స్టాండింగ్ క్రాప్ అంశంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. వ్యవసాయ శాఖ మంత్రి అకాల వర్షాలపై సమీక్షిస్తున్నారు. విద్య వ్యవస్థకు సంబంధించి అన్ని చర్యలు పక్కాగా ఉంటాయి. పాఠశాల, సాంకేతిక, హై యర్ ఎడ్యుకేషన్‌ను గత ప్రభుత్వం విస్మరించింది. బోధన, బోధనేతర అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో మానవ వనరులపై సమీక్ష నిర్వహిస్తాం. ఇందుకోసం రూ.600 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది’’ అని శ్రీధర్ బాబు తెలిపారు.

ఇక మేడిగడ్డ అంశంలో ఎన్‌డీఎస్ఏ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళతామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కేవలం సాంకేతిక పరమైన నిర్ణయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా అన్ని అంశాలను ఇంజనీర్లతో మాట్లాడి ముందుకు వెళతామని తెలిపారు. మెడిగడ్డ, అన్నారం , సుందిళ్ళలను సందర్శిస్తామని ఆయన తెలిపారు.

ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతాం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ‘‘ ధాన్యం కొనుగోలు అన్ని చోట్లా జరుగుతుంది. ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల చేయాల్సి ఉంది. ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్ చేసినవి అన్నీ డ్రామాలు. పదేళ్లు మీరు రైతుల కోసం ఏం చేశారో తెలుసు. ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి తీరుతాం. డీఎస్సీ నోటిఫికేషన్‌పై మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. గత పదేళ్లు ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. కేబినెట్ భేటీకి సంబంధించిన చాలా అంశాలను జూన్ 5 న తెలియజేస్తాం. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తాం’’ అని అన్నారు.

UK Blood scandal: ఆ రక్తంతో వేల మందికి హెచ్‌ఐవీ.. ఏంటీ ‘రక్తం కుంభకోణం’?

UK Blood scandal: ఆ రక్తంతో వేల మందికి హెచ్‌ఐవీ.. ఏంటీ ‘రక్తం కుంభకోణం’?
నాలుగు దశాబ్దాల క్రితం బ్రిటన్‌లో వెలుగుచూసిన ‘రక్తం కుంభకోణం’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. కలుషిత రక్తాన్ని ఎక్కించిన కారణంగా వేలాదిమంది హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ బారినపడిన ఈ దారుణ పరిణామానికి సంబంధించి తుది నివేదిక వెల్లడైంది. బ్రిటన్‌ ఆరోగ్య విభాగం చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఘటనగా నిలిచిన ఆ ఉదంతంపై అక్కడి ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించింది.

అసలేం జరిగింది..?
రక్తం గడ్డకట్టే సామర్థ్యం లేని ‘హిమోఫిలియా’ వ్యాధి బాధితుల కోసం బ్రిటన్‌ ప్రభుత్వం 1970 దశకంలో కొత్త (blood plasma) చికిత్సను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించి ఫ్యాక్టర్‌ VIII పేరుతో రూపొందించిన రక్తాన్ని బ్రిటన్‌ ఆరోగ్య కేంద్రం (నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌) అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. దీన్ని రక్తమార్పిడి అవసరమైన వేలాది మంది బాధితులకు అందించారు. అయితే, ఈ చికిత్స తీసుకున్న కొన్నేళ్ల తర్వాత అనేక మందిలో దుష్ర్పభావాలు కనిపించడం మొదలైంది.

3 వేల మంది మృతి..
ఫ్యాక్టర్‌ VIII చికిత్స తీసుకున్న అనేకమంది కాలేయ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నట్లు గుర్తించారు. కొన్నేళ్ల తర్వాత అది ‘హెచ్‌ఐవీ (1980ల్లో దాన్ని ఎయిడ్స్‌కు కారక వైరస్‌గా గుర్తించారు)’, ‘హెపటైటిస్‌-సీ’గా నిర్ధరించారు. బాధితుల సంఖ్య 30 వేలకు పైగా ఉన్నట్లు అంచనా. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఇన్‌ఫెక్షన్‌కు గురైనవారిలో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నట్లు గుర్తించారు. ఇలా కొన్నేళ్లలోనే దాదాపు 3వేల మంది బాధితులు చనిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి. దేశ ఆరోగ్య చరిత్రలో ఇదో అతిపెద్ద ‘రక్తం కుంభకోణం’గా దీన్ని పేర్కొంటున్నారు.

రక్తం కలుషితం..
ఫ్యాక్టర్‌ VIII చికిత్సకు ఉపయోగించిన రక్తంలో ఖైదీలతో పాటు మత్తు బానిసలు వంటి ప్రమాదకర దాతల నుంచి స్వీకరించిన ప్లాస్మాను ఫార్మా కంపెనీలు వినియోగించినట్లు గుర్తించారు. ఇలా వేల మంది దాతల నుంచి గ్రహించిన ప్లాస్మా కావడం.. అందులో ఒక్కరికి ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా అనేకమందికి సోకే ప్రమాదం ఉందని గ్రహించారు. ప్రసవం, సర్జరీలు, ప్రమాదాల బారినపడిన రోగులకు ఈ కలుషిత రక్తం, ప్లాస్మా ఉత్పత్తులు ఎక్కించడం ద్వారా అనేకమంది హెచ్‌ఐవీ, హెపటైటిస్ బారిన పడినట్లు తేలింది.

ముందస్తు హెచ్చరికలు చేసినా..
అనేక మంది నుంచి సేకరించిన ప్లాస్మాను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవద్దని 1953లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. అయినప్పటికీ.. బ్రిటన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి చికిత్సకు అవసరమైన ప్లాస్మాను దిగుమతి చేసుకొందనే ఆరోపణలు వచ్చాయి. ఆ రక్తం కలుషితమైందని ముందస్తు హెచ్చరికలు వచ్చినప్పటికీ.. అందుకు ఆధారాలు లేవని బ్రిటన్‌ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేసింది. ముప్పు గురించి కూడా బాధితులకు అందించలేదు. వారికి సరైన చికిత్స, సహాయం అందించడంలోనూ ప్రభుత్వం విఫలమైందనే వాదన ఉంది. అంతేకాకుండా కలుషిత రక్తం ఉదంతాన్ని అప్పటి ప్రభుత్వాలు, అధికారులు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని బాధితులు ఆరోపించారు.

ఈ వైద్య నిర్లక్ష్యం గురించి వాస్తవాలు బయటపెట్టాలని.. పరిహారం ఇవ్వాలని 1980 నుంచీ బాధితులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. చివరకు 2017లో ప్రధాని థెరిసా మే నేతృత్వంలోని ప్రభుత్వం.. పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. దాదాపు 5వేల మంది బాధితులు, సాక్షుల నుంచి వివరాలు సేకరించి నివేదిక రూపొందించింది. తాజా పరిణామంపై బాధితులు హర్షం వ్యక్తంచేశారు. తమ ఆత్మీయులను గుర్తుచేసుకుంటూ.. ఫ్లకార్డులు ప్రదర్శించారు. ‘సత్యం గెలిచిన రోజు’ అంటూ 1500 మంది బాధితుల తరఫున పోరాటం చేసిన డెస్‌ కొల్లిన్స్‌ అనే న్యాయవాది పేర్కొన్నారు.

Amit Shah: మళ్లీ వచ్చేది మోదీ సర్కార్‌.. పీవోకే విలీనం పక్కా: అమిత్‌ షా

Amit Shah: మళ్లీ వచ్చేది మోదీ సర్కార్‌.. పీవోకే విలీనం పక్కా: అమిత్‌ షా

సార్వత్రిక ఎన్నికల సమయంలో పీవోకే అంశాన్ని లేవనెత్తిన భాజపా.. ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి అమిత్‌ షా (Amit Shah) ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. కచ్చితంగా పీవోకే మన దేశంలో విలీనం అవుతుందని పేర్కొన్నారు. హరియాణాలోని కర్నల్‌లో సోమవారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న షా.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

‘‘జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ‘ఆర్టికల్‌ 370’ను కాంగ్రెస్‌ తన హయాంలో రద్దు చేయలేకపోయింది. అందుకు కారణం బుజ్జగింపు రాజకీయాలే. అక్కడ ఉగ్రవాద చర్యలు పెరిగిపోయినప్పటికీ అడ్డుకోలేపోయింది. కానీ, మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఆర్టికల్‌ను రద్దు చేశారు. ప్రస్తుతం కశ్మీర్‌లో మన త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. మళ్లీ వచ్చేది మోదీ సర్కార్‌. త్వరలో పీవోకే భారత్‌లో విలీనం అవుతుంది’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.

మైనారిటీ ఓటు బ్యాంకును పొందేందుకే కాంగ్రెస్‌ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనలేదని షా ఆరోపించారు. ‘‘ఖర్గే జీ.. మీరు ఎనిమిది పదుల వయసులో ఉన్నా.. దేశ పరిస్థితి గురించి సరిగా అర్థం చేసుకోలేపోయారు. కానీ, హరియాణా యువత కశ్మీర్‌ కోసం తమ ప్రాణాలు ఇవ్వగలరు’’ అని విమర్శించారు.

Airtel: 84 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ నుంచి అదిరిపోయే ఆఫర్

మొత్తం 380 మిలియన్ల మంది కస్టమర్లతో దేశంలోనే రెండవ అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం కొత్త కొత్త ఆఫర్లను పరిచయం చేస్తుంటుంది. వేగవంతమైన ఇంటర్నెట్‌తో పాటు మంచి కనెక్టివిటీ అందించే ఎయిర్‌టెల్ కస్టమర్ల విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని చక్కటి ప్లాన్‌ను అందుబాటులో ఉంచింది. రీఛార్జ్ ఆఫర్‌లో భాగంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్ర్కిప్షన్ కూడా అందించింది. అదిరిపోయే ఆ ప్లాన్‌కు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

84 రోజుల వ్యాలిడిటీతో రూ.999 రీఛార్జ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద అదనపు డేటాతో పాటు పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్ లభిస్తోంది. రూ.999 రీఛార్జ్‌తో మొత్తం 210జీబీ డేటా లభిస్తుంది. అంటే రోజుకు 2.5జీబీ డేటాతో సమానం. అధిక డేటా వాడేవారికి ఈ ప్లాన్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌‌లు లభిస్తాయి.

అంతేకాదు అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది. ఎక్కువగా ఓటీటీ కంటెంట్‌ను వీక్షించేవారికి ఈ ఉపయోగపడుతుంది. ప్రైమ్ వీడియోలో అదనపు ఖర్చు లేకుండా లేటెస్ట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడవచ్చు.

Ap Elections: ‘కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు’

Intelligence Alert To Election Comission: ఏపీలో ఎన్నికల కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ.. ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక తాజాగా ఇచ్చింది. కౌంటింగ్ కు ముందు తర్వాత కాకినాడ సిటీ (Kakinada), పిఠాపురం (Pithapuram) నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే ఛాన్స్ ఉందని అప్రమత్తం చేసింది. ఆయా నియోజకవర్గాల్లోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటతో సహా పలు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. దీంతో ఎన్నికల సంఘం ఆ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో గొడవలు చేసిన, ప్రేరేపించిన వ్యక్తులపై నిఘా ఉంచాలని పోలీసులకు సూచించింది. కాగా, జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ కొనసాగుతోంది. సీసీ కెమెరాలతో భద్రతా సిబ్బంది నిరంతరం స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

ఈసీ అలర్ట్

ఇంటెలిజెన్స్ నివేదికతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఆ రెండు నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన అధికారులు.. పోలీసులకు కీలక సూచనలు ఇచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో ఎవరెవరికి నేర చరిత్ర ఉందనే దానిపై ఆరా తీస్తున్నారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరిస్తున్నారు. పోలింగ్ రోజు, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా అవి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులకు ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

సిట్ నివేదిక సిద్ధం

మరోవైపు, రాష్ట్రంలో ఈ నెల 13న పోలింగ్ రోజు, అనంతరం జరిగిన అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదికను సోమవారం డీజీపీకి విచారణ బృందం అందించనుంది. అలాగే, సీఎస్ కు కూడా నివేదిక అందించనుండగా.. ఆయన ద్వారా సీఈవో, సీఈసీకి నివేదిక చేరనుంది. డీజీపీకి నివేదిక సమర్పించిన అనంతరం సిట్ అధికారులు ప్రెస్ నోట్ విడుదల చేయనున్నారు. అయితే, పూర్తి స్థాయి నివేదికను అందించేందుకు మరిన్ని రోజులు గడువు కోరే అవకాశం ఉందని సమాచారం. గత రెండు రోజులుగా 3 జిల్లాల్లో పర్యటించిన సిట్ సభ్యులు.. నేతలు, స్థానికులు, పోలీసుల నుంచి వివరాలు సేకరించారు. ఆయా ఘటనా స్థలాలను పరిశీలించి అల్లర్లకు సంబంధించిన వీడియోలను పరిశీలించారు. అటు, ప్రాథమిక విచారణ పూర్తైన క్రమంలో.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కేసుల విచారణపై కూడా సిట్ సమీక్ష పూర్తి చేయనుంది. ఈ కేసుల విచారణపై ఇక ముందు కూడా పర్యవేక్షణ కొనసాగనుంది. రానున్న రోజుల్లో మరింత లోతుగా విచారణ చేయనున్నారు. మరోవైపు, పోలింగ్ అనంతరం అల్లర్లపై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్థానిక పోలీసులకు దీనికి సంబంధించి పలు సూచనలు చేశారు. అల్లర్లలో ప్రమేయం ఉన్న రాజకీయ నేతల అరెస్టుపై కూడా సిట్ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులకు తగు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

MS Dhoni-IPL: ఐపీఎల్ నుంచి ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై బిగ్ అప్‌డేట్!

MS Dhoni-IPL: ఐపీఎల్ నుంచి ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై బిగ్ అప్‌డేట్!

టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఐపీఎల్ నుంచి నిష్ర్కమించినట్టేనా?. ఐపీఎల్ కెరియర్‌కు ముగింపు పలకనున్నాడా?. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమవనున్నాడా?… శనివారం ఆర్సీబీ చేతిలో ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశం కోల్పోయిన తర్వాత క్రికెటర్ వర్గాలు, అభిమానుల్లో వ్యక్తమవుతున్న సందేహాలివీ. అయితే ధోనీ రిటైర్మెంట్‌పై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్గాల నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది.

‘‘ఐపీఎల్ నుంచి వైదొలగుతున్నట్లు సీఎస్కే జట్టులో ధోనీ ఎవరికీ చెప్పలేదు. రిటైర్మెంట్‌పై తుది నిర్ణయం తీసుకునే ముందు కొన్ని నెలలపాటు వేచి చూస్తానని మేనేజ్‌మెంట్‌కు ధోనీ చెప్పాడు.వికెట్ల మధ్య పరిగెత్తడంలో ధోనీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇదే అతడికి సానుకూల అంశం.

ధోనీ ఇచ్చే సమాచారం కోసం వేచిచూస్తాం. అతడు ఎప్పుడూ జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటాడు. ఏం జరుగుతుందో వేచిచూద్దాం’’ అని ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎస్కే అధికారి పేర్కొన్నారు.

కాగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓటమితో సీఎస్కే ప్లే ఆఫ్స్ అవకాశాన్ని కోల్పోయింది. దీంతో ఎంఎస్ ధోనీ చెన్నై నుంచి రాంచీ వెళ్లిపోయాడు. దీంతో ఇకపై ఐపీఎల్‌లో ధోనీ ఆటను చూడలేమంటూ మీడియాతో పాటు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే.

AP News: ఏపీలో నిలిచిపోనున్న ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలు

AP News: ఏపీలో నిలిచిపోనున్న ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలు
AP News: Arogyasree, EHS services to stop in AP

అమరావతి: ఆరోగ్యశ్రీ (Arogyashri) , ఈహెచ్ఎస్ (EHS) కింద అందించే సేవలను ఈనెల 22నుంచి రాష్ట్రంలో నిలిపివేయాలని నెట్‌వర్క్ ఆస్పత్రులు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మి షాకు స్పెషాలిటీ ఆస్పత్రుల అసోషియేషన్ లేఖ రాసింది. తాము మే 2వ తేదీన సేవలు నిలిపి వేస్తామని ప్రకటిస్తే కేవలం రూ. 50 కోట్లు మాత్రమే ఈహెచ్ఎస్ కింద చెల్లించారని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద నయాపైసా కూడా చెల్లించలేదని అన్నారు. ఆరోగ్య శ్రీ కింద రూ.1500 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

ఈ బకాయిలు చెల్లించాలని చాలా సార్లు కోరినప్పటికీ ఉపయోగం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాసేపటి క్రితం లేఖ కాపీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల కమిషన్ సీఈవో, వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు పంపామని యాజమాన్యాల సంఘం పేర్కొంది. ఈహెచ్‌ఎస్‌ బిల్లులూ (EHS Bills) బకాయిలున్నాయని, ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో ఆస్పత్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. బిల్లుల పెండింగ్‌తో ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని.. ట్రస్ట్‌ బకాయిపడ్డ రూ.1,500 కోట్లను వెంటనే చెల్లించి, సమస్యల పరిష్కారానికి సహకరించాలని స్పెషాలిటీ ఆస్పత్రుల అసోషియేషన్ కోరింది.

ఈ దంపతులు మహా ముదుర్లు… ఏకంగా రూ. 200 కోట్లతో ఉడాయించారు

ఎంత చెబుతున్నా.. ఇన్ని మోసాలు జరుగుతున్నాయని తెలిసినా కూడా అత్యాశకు పోతున్నారు జనాలు. రూపాయికి రెండు రూపాయలు ఇస్తామంటే.. ఆస్తులు అమ్మి మరీ డబ్బులు ఇస్తున్నారు. చివరకు నట్టేట ముంచేసరికి లబోదిబోమంటున్నారు. అత్యధిక వడ్డీ ఆశ చూపి భార్యా భర్తలు కోటి, రెండు కోట్లు కాదు ఏకంగా రూ. 200 కోట్లతో ఉడాయించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లో ఇద్దరు దంపతులు.. ఓ ఫైనాన్స్ కంపెనీని స్థాపించి ప్రజల నుండి డబ్బులు వసూలు వేసి బిషాణా ఎత్తేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యాభర్తలైన నేతాజీ మేక, నిమ్మగడ్డ వాణీ బాల భాగ్యనగరిలో ఉంటున్నారు.

అబిడ్స్‌లోని తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ (టెస్కాబ్)లో వాణీ బాల జనరల్ మేనేజర్‌గా పని చేస్తుంది. ఆమె భర్త నేతాజీకి శ్రీ ప్రియంక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ఉంది. అందులో డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ చెల్లిస్తామని ప్రలోభ పెట్టింది వాణీ బాల. అధిక వడ్డీ ఆశ చూపించడంతో వెనకా ముందు ఆలోచించకుండా టెస్కాబ్ అధికారులు, పలు జిల్లాల డీసీసీబీల సిబ్బంది, బ్యాంకు కస్టమర్లు, ఇరుగు పొరుగు, తెలిసిన వారంతా ఆ సంస్థలో డిపాజిట్లు చేశారు. అలా 517 మంది నుండి రూ. 200 కోట్లను వసూలు చేశారు. అయితే వాణీ బాల మరో నెల రోజుల్లో పదవీ విరమణ పొందనుండగా.. హఠాత్తుగా సెలవులు తీసుకుంది. కొన్ని రోజులకే ఫైనాన్స్ కంపెనీ కూడా మూత పడింది. వాణీ బాల లాంగ్ లీవ్ పెట్టడం.. సంస్థ మూత పడటంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.

వారికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తాము మోసపోయామని గుర్తించారు కస్టమర్లు. అధిక వడ్డీ ఆశ చూపడంతో తామంతా మోసపోయామని గగ్గోలు పెడుతున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. 517 మంది నుండి రూ. 200 కోట్లను కొల్లగొట్టి ఉడాయించారు దంపతులు. ఇద్దరు ఫోన్లకు రెస్పాన్స్ కావకపోవడంతో పాటు సంస్థకు తాళాలు వేసి ఉండటంతో మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంత మంది బాధితులు ఫిర్యాదులు చేశారు. ఇంకా చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. వాణీబాల, ఆమె భర్త నేతాజీ, కొడుకు శ్రీహర్షపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇందులో కొడుకు శ్రీహర్ష పాత్ర ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

Twist in Rave Party: అమ్మ దొంగ.. దొరికిపోయిన నటి హేమ.. అదిరిన బెంగుళూరు పోలీసుల ట్విస్ట్..!

Twist in Rave Party Hema Photo Released: సోమవారం ఉదయం నుంచీ ఒకటే బ్రేకింగ్ న్యూస్. అదే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ. అక్కడ పోలీసులకు చిక్కిన కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు, స్పాట్ లో ఉన్న కారులో ఏపీకి చెందిన ఎమ్మెల్యే పాస్ పోర్టు లభ్యమవ్వడం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి దారితీశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీకి సమీపంలో ఉన్న జీఆర్ ఫామ్ హౌస్ లో హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్ డే పార్టీ పేరుతో భారీగా రేవ్ పార్టీని నిర్వహించాడు. ఈ పార్టీకి హైదరాబాద్ నుంచి యువతీ, యువకులను స్పెషల్ గా ఫ్లైట్ లో బెంగళూరుకు తరలించాడు.

ఈ పార్టీకి 100 మందికి పైగా హాజరవ్వగా.. వారందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీకి హాజరైన ప్రముఖుల్లో టాలీవుడ్ కు చెందిన హేమ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సహా పలువురు ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇలా మీడియాలో కథనాలొచ్చాయో లేదో.. అలా హేమ నేను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇక్కడ వరకూ బాగానే ఉంది. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని వీడియో చేసిన హేమకు పోలీసులు మైండ్ బ్లాంక్ అయ్యే షాకిచ్చారు.

హేమ రిలీజ్ చేసిన వీడియోలోనూ.. పార్టీలో దొరికారని పోలీసులు విడుదల చేసిన ఫొటోలోనూ హేమ సేమ్ డ్రస్ లో కనిపించింది. అంతే కాదు. పార్టీ జరిగిన బిల్డింగ్ వద్ద ఉన్న బ్యాగ్రౌండ్ కూడా హేమ చేసిన వీడియోలో మ్యాచ్ అవుతుంది. ఇప్పుడిదే నెట్టింట వైరల్ అవుతోంది. అటు కన్నడ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో, తెలుగు మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పిన హేమకు.. పోలీసులు ఇలా షాకిచ్చారు.

Chettinad Karam Podi: బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచిగా ఉండే కమ్మనైన చెట్టినాడ్ కారం పొడి..

ఇడ్లీ, దోశల్లోకి చట్నీతో పాటు ఎంతో కమ్మగా ఉండే కారం పొడి ఉంటే ఆహా రుచే వేరు. అందులోనూ ఎప్పుడు చేసేది కాకుండా.. ఈ చెట్టినాడ్ ఇడ్లీ పొడి కాస్త కొత్తగా వెరైటీగా ఉంటుంది. దీన్ని అన్నంతో కూడా తినవచ్చు. ఒక్కసారి చేసుకున్నారంటే దాదాపు నెల రోజులు నిల్వ ఉంటుంది. మరి ఇంత రుచిగా ఉండే చెట్టినాడ్ కారం పొడి టేస్ట్‌ని మీరు కూడా తినాలి అనుకుంటున్నారా? ఇంకెందుకు లేట్.. ఈ చెట్టినాడ్ కారం పొడిని ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చెట్టినాడ్ కారం పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు:
మినపప్పు, శనగ పప్పు, కంది పప్పు, నువ్వులు, ఉప్పు, కరివేపాకు , ఎండు మిర్చి, వేరుశనగ.

చెట్టినాడ్ కారం పొడి తయారీ విధానం:
ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కందిపప్పు, శనగ పప్పు, మినపప్పు ఒకే క్వాంటిటీలో తీసుకుని విడివిడిగా వేయించు కోవాలి. ఆ తర్వాత నువ్వులు కూడా పావు కప్పు తీసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుప్పెడు వేరు శనగ కూడా ఇలాగే వేయించి తీసుకోవాలి. ఆ నెక్ట్స్ కరివేపాకు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని.. చల్లారిన పప్పులను మిక్సీ జార్‌లో వేసి ఉప్పు, ఎండు మిర్చి వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పొడిని గాలి చొరబడని కంటైనర్‌లో వేసి నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ పొడిని ఇడ్లీ, దోశల మీద చల్లుకుని కాస్త నెయ్యి వేసుకుని తింటే.. వావ్ అని ఖచ్చితంగా అంటారు. అంత రుచిగా ఉంటుంది ఈ పొడి. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. ఎప్పుడు చట్నీలే కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మరింకెందుకు లేట్ మీరు కూడా చేయండి.

Hair Growth Tips: ఈ ఆయిల్స్‌తో మహత్యం.. మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా!

అందాన్ని పెంచడంలో జుట్టు కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. మీ హెయిర్ స్టైల్స్ బట్టి మీరు మరింత అందంగా కనిపిస్తూ ఉంటారు. ఉన్నది కొద్ది జుట్టు అయినా దాన్ని సరైన విధంగా మెయిన్‌టైన్ చేసుకుంటే అదే చక్కగా ఉంటుంది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ విధానంలో.. జుట్టు రాలిపోవడం అనేది జరుగుతుంది. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి, సరైన పోషణ లేకపోవడం, నిద్ర, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఇలా చాలా కారణాలు ఉంటాయి. జుట్టు‌ అందంగా కనిపించేందుకు మార్కెట్లో లభించే ఆయిల్స్, రకరకాల షాంపూలు వినియోగిస్తూ ఉంటారు. ఇవి అందరికీ పడవు. వీటితో మరిన్ని ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. అయితే సహజ నూనెలు ట్రై చేస్తే జుట్టు పెరగడాన్ని ఎవరూ ఆపలేరు. మరి జుట్టును పెంచడంలో సహాయ పడే ఆ నూనెలు ఏంటో? ఎలా తయారు చేస్తారో? ఇప్పుడు తెలుసుకుందాం.

కలోంజి ఆయిల్:
కలోంజిని ఆరోగ్య పరంగానే కాకుండా జుట్టును పెంచడంలో కూడా హెల్ప్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆయిల్ తయారు చేయడానికి.. ముందుగా కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ తీసుకుని.. డబుల్ బాయిలింగ్‌పై వేడి చేయాలి. ఇందులో ఒక చెంచా కలోంజి గింజలు వేసి ఓ ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత చల్లారబెట్టి.. ఓ సీసాలోకి తీసుకోవాలి. ఈ ఆయిల్‌లో అనేక పోషకాలు లభిస్తాయి. ఈ ఆయిల్‌ను రెండు రోజులకు ఓ సారి తలకు పట్టించి.. షాంపూ లేదా కుంకుడు కాయలతో స్నానం చేయాలి. ఈ ఆయిల్ జుట్టును పెంచడంలో చక్కగా ఉపయోగ పడుతుంది.

బాదం ఆయిల్:
జుట్టును ఆరోగ్యంగా ఉంచి పెంచడంలో బాదం ఆయిల్ చక్కగా పని చేస్తుంది. వారంలో రెండు సార్లు బాదం ఆయిల్ తలకు పట్టించి, స్నానం చేస్తే.. మంచి రిజల్ట్ ఉంటుంది. బాదం ఆయిల్ రాయడం వల్ల జుట్టు మూలాలు బలంగా మారతాయి. హెయిర్ సాఫ్ట్‌గా, చివర్లు చీలిపోకుండా ఉంటుంది.
కరివేపాకు ఆయిల్:
కరివేపాకుతో జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలుసు. ఇప్పుడు చెప్పబోయే ఈ ఆయిల్ జుట్టును పెంచడంలో చక్కగా హెల్ప్ చేస్తుంది. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని.. అందులో కరివేపాకులు వేసి.. డబుల్ బాయిలింగ్ పద్దతిలో ఓ ఐదు నిమిషాల పాటు మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టి గాజు సీసాలోకి తీసుకోవాలి.

పెరుగుతో వీటిని కలిపి తీసుకుంటే రోగాలకు వెల్కమ్ చెప్పినట్టే.. తస్మాత్ జాగ్రత్త

పాలను తోడుపెడితే పెరుగు వస్తుంది. దీనికి ఆయుర్వేదంలో మంచి స్థానం ఉంది. అంతేకాదు పెరుగు మంచి ఆహారం. ఎన్ని రకాల రుచికరమైన ఆహారాన్ని తిన్నా.. చివరిలో పెరుగుతో అన్నం రెండు ముద్దలైనా తినకపోతే భోజనం పూర్తి చేసినట్లు భావించరు కొందరు. ముఖ్యంగా పెరుగులో ఔషధగుణాలు ఉన్నాయి.. వేసవిలో చల్లదనం ఇస్తుందని ఎక్కువగా పెరుగుని తీసుకుంటారు. అయితే పెరుగుతో పాటు కొన్ని రకాల ఆహారపదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కదాని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకొక్కసారి తిన్నది అరగక పోవడం, అజీర్తి వంటి ఇతర సమస్యల బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ రోజు ఆరోగ్యానికి హానిని కలిగించే పెరుగుతో పాటు తీసుకోకూడదని ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం..
పెరుగుతో పాటు ఆమ్ల గుణాలున్న ఆహారాన్ని తినడం ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా నిమ్మజాతి పండ్లు, టొమాటో, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌, మసాలున్న ఆహరంతో పెరుగుని కలిపి తింటే పొట్టలో పీహెచ్‌ స్థాయులు అదుపు తప్పుతాయి. దీంతో అజీర్తి, పొట్టలో ఆమ్లత్వం పెరిగి అసౌకర్యంగా అనిపిస్తుంది. ఆరోగ్య పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. .

నాన్ వెజ్ తో పెరుగుని కలిపి తినవద్దు. చికెన్‌, మటన్‌.. వంటి మాంసాహారంతో పాటు చేపల కూర తిన్న తర్వాత పెరుగుని తినవద్దు అని పెద్దలు చెబుతారు. ఎందుకంటే ఈ రెండింటినీ ఒకేసారి తినడం వలన ఆహారం జీర్ణం అవదు. దీంతో కడుపు పట్టేసినట్లు అన్పించడమే కాదు కడుపు నొప్పితో ఇబ్బంది పడే చాన్స్ ఉందట. కనుక పొట్ట సంబంధిత సమస్యల్ని తెచ్చిపెట్టే పెరుగు మాంసాహార పదార్ధాలను తీసుకోవడం మానివేస్తే ఆరోగ్యానికి మంచిది.

వేసవిలో మాత్రమే కాదు అన్ని సీజన్స్ లోనూ రకరకాల సలాడ్స్ ను తీసుకుంటారు. అయితే కొంతమంది పెరుగు చిలికి క్రీమ్ అయ్యాక సలాడ్స్ ని గార్నిష్ చేయడానికి ఉపయోగిస్తారు. సలాడ్ లో కొన్ని రకాల పండ్లు ఉంటే పెరుగుని ఏ రూపంలో వాడినా అది మంచిది కాదని చెబుతున్నారు. ముఖ్యంగా మామిడి పండు, పనస తొనలు, ఆప్రికాట్‌ వంటి పండ్లు సలాడ్ లో ఉండే పెరుగుని ఉపయోగించవద్దు. ఈ పండ్లు శరీరంలో వేడి పుట్టించే స్వభావం కలిగి ఉంటే.. పెరుగులో చలువ చేసే గుణం ఉంటుంది. కనుక ఈ రెండింటినీ కలిపి ఏకకాలంలో తీసుకోవడం వలన శరీర ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. అప్పుడు శరీరంలో టాక్సిన్లు విడుదల అవుతాయి. అంతేకాదు స్కిన్ పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెరుగుతో పాటు వంకాయ సంబంధించిన ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. వంకాయల్లో ఉండే టానిన్‌ పెరుగుతో కలిస్తే జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.శరీరం గ్రహించే పోషకాల పై ఈ కాంబినేషన్ ప్రతికూల ప్రభావం చూపిస్తుందట.

ఆకుకూరల్ని పెరుగుతో కలిపి తీసుకుంటే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరల్లోని ఆక్సలేట్స్‌, పెరుగులోని క్యాల్షియ లోపం ఏర్పడేలా చేస్తాయి.

పెరుగుతో పాటు ప్రొబయోటిక్స్‌ ఎక్కువగా ఉండే పచ్చళ్లు, పులియబెట్టిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో ప్రొబయోటిక్‌ స్థాయి పెరిగిపోతుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెరుగు అన్నంలో కొంతమంది నూనె పదార్ధలైన వేపుళ్లు, చిప్స్ వంటి వాటిని కలిపి తింటారు. ఇలా చేయడం వలన ఒకొక్కసారి జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఏర్పడతాయట. వీటిని తిన్న తర్వాత కొందరు కడుపుబ్బరం, కడుపునొప్పి, అజీర్తి, గ్యాస్ట్రిక్‌ సమస్యలతో ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం జీర్ణక్రియను నెమ్మదించేలా ఈ కాంబినేషన్ చేస్తుందని చెబుతున్నారు.

Tirumala Tirupati: వామ్మో.. మళ్లీ చిరుతలొచ్చాయ్.. తిరుమలలో భయం.. భయం..

తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం రేపాయి. తాజాగా, అలిపిరి నడకమార్గంలో రెండు చిరుతలు కనిపించాయి. వాటిని చూసిన భక్తులు భయంతో గట్టిగా కేకలు వేశారు. ఆ శబ్ధానికి రెండు చిరుతలు అడవిలోకి పారిపోయాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుతలు కనిపించడంతో భయాందోళనకు గురవుతున్నారు భక్తులు.

అయితే, చిరుతల విషయం తెలుసుకున్న భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది స్పాట్ కు చేరుకుని పరిశీలించారు. అవి వెళ్లిన మార్గంలో.. వాటి జాడలను గుర్తించే పనిలో ఉన్నారు ఫారెస్ట్ సిబ్బంది. చిరుతల సంచారం దృష్ట్యా భక్తులను కొండపైకి గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు. నడకదారి భక్తులకు ఎటువంటి అపాయం తలెత్తకుండా అటవీశాఖ అధికారులు అప్రమత్తమై చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదిలాఉంటే.. కొద్దిరోజుల క్రితం తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో ఓ చిరుత కనిపించింది. తెల్లవారుజామున భక్తుల కారుకు చిరుత అడ్డొచ్చింది. కారు సీసీటీవీ కెమెరాలో చిరుత పులి దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుతను చూసిన వారు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. చిరుత రోడ్డు దాటి వెళ్లిపోవడంతో కారులో వెళ్తున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.

గతంలో తిరుమల కాలినడక మార్గంలో ఓ చిన్నారిని పొట్టనపెడ్డుకుంది చిరుత. లక్షిత అనే ఆరేళ్ల బాలికపై దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లి చంపేసింది. చిరుతకు బలైపోయిన చిన్నారిలా మరొకరి ప్రాణాలకు బలికాక ముందే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Vallabhaneni Vamsi: గన్నవరంలో మాయమై డల్లాస్‌లో వల్లభనేని వంశీ ప్రత్యక్షం.. ఎందుకా అని ఆరాతీస్తే..?

గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) అమెరికా వెళ్లారు. వాస్తవానికి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అమెరికా వెళ్లడం పెద్ద సంచలనం కలిగించే అంశమేమీ కాదు.

అయితే వంశీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆయన ఏ అడుగు వేసినా అది చర్చనీయాంశంగా మారుతోంది. 2019లో టీడీపీ టికెట్‌పై గెలిచిన వంశీ ఆ తర్వాత వైసీపీ పంచన చేరారు. రాజకీయాల్లో ఇది కూడా సాధారణ విషయమే. ఆ తర్వాత ఆయన వేసిన అడుగులు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని వివాదాస్పదం చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కొడుకు లోకేశ్‌ను ఉద్దేశించి వంశీ చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లోనే కాకుండా తెలుగువారందరి లోనూ వంశీపై వ్యతిరేకతను తీసుకొచ్చాయి. రాజకీయాల్లో నాయకులు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం సహజమే కానీ ఇంట్లోని మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటం అనే కొత్త విధానాన్ని వంశీ తీసుకొచ్చారు.

వంశీ ఓడిపోతే..!

ఈ పరిణామాలతో టీడీపీ అధిష్ఠానం మొదలు గ్రామస్థాయి నాయకులు వరకు వంశీ ఓటమి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా వంశీకి బలమైన ప్రత్యర్థిగా 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్‌ఆర్‌ఐ యార్లగడ్డ వెంకట్రావును తీసుకొచ్చారు. ఆయన నియోజకవర్గంలో బలంగా ఉన్న టీడీపీని మరింత బలోపేతం చేశారు. దీంతో 2024 ఎన్నికల్లో వంశీ ఓటమి ఖాయమని ఆయన అనుచరులే వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. ఈ ఎన్నికల్లో వంశీ ఓడిపోతే ఆ తర్వాత ఆయన పరిస్థితి ఏమిటన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఓహో.. ఇదా అసలు కథ!

ఈ నేపథ్యంలో వంశీ అమెరికా వెళ్లారన్న అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. వంశీ మే 17న అమెరికా వెళ్లారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కొడుకు చదువుల కోసం ఆయన అమెరికాలోని డల్లాస్‌ వెళ్లారని అనుచరులు చెబుతున్న మాట. అయితే టీడీపీ నాయకులు దీనికి భిన్నంగా చెబుతున్నారు. వంశీ అమెరికాలో శాశ్వతంగా స్థిరపడేందుకు సిద్ధమయ్యారని అందులో భాగంగా ఆయన అమెరికా వెళ్లారన్నది టీడీపీలో కొంతమంది నాయకుల వాదన. డల్లాస్‌లోని కొందరు ఎన్‌ఆర్‌ఐల ద్వారా టీడీపీ పెద్దలతో రాజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే అమెరికా వెళ్లారని మరికొంత మంది నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనా వంశీ అమెరికా పర్యటన నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

Poll violence: ఏపీలో 33 చోట్ల హింసాత్మక ఘటనలు.. డీజీపీకి సిట్‌ నివేదిక అందజేత!

ఏపీలో ఎన్నికల పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై సిట్‌ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాకు అందించింది. ఈ నివేదికను సిట్‌ చీఫ్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ డీజీపీకి అందజేశారు. మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించిన ఈ బృందం.. నిన్న అర్ధరాత్రి వరకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు గుర్తించారు. ఈ దమనకాండపై రెండు రోజులపాటు విచారణ జరిన సిట్‌.. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి పరిశీలించి విచారణ జరిపింది.

రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై సిట్‌ ఇచ్చిన 150 పేజీల నివేదికలో పలు కీలకాంశాలను పొందుపరిచింది. ఈ ఘటనలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లతో పాటు స్థానికులు, పోలీసులను విచారించి.. మూడు జిల్లాల్లో దాదాపు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు తేల్చింది. ఎఫ్‌ఐఆర్‌లో కొత్త సెక్షన్లు చేర్చే అంశంపైనా సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలా? వద్దా అనే అంశంపైనా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. హింస జరుగుతుందని తెలిసీ కొందరు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా సిట్‌ నిర్థరించింది. స్థానిక నేతలతో కుమ్మక్కైన పోలీసులు హింస జరుగుతున్నా.. మిన్నకుండిపోయారని ఈ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కొందరు పోలీస్‌ అధికారులపైనా కేసులు నమోదు చేసే అవకాశం కనబడుతోంది. ఈ ఘటనల్లో ఉపయోగించిన రాళ్లు, కర్రలు, రాడ్లు వంటి సామగ్రికి సంబంధించిన ఆధారాలూ సేకరించిన సిట్‌.. ఈ ఘటనలతో సంబంధం ఉన్న పలువురు రాజకీయ నేతల్ని సైతం అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలపైనా కొన్ని సిఫారసులు చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను డీజీపీ.. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ప్రభుత్వం ద్వారా అందించనున్నారు. ఈ ఘటనలపై పూర్తి నివేదికను ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని సిట్‌ కోరే అవకాశం ఉంది.

Sania Mirza: ఆ టాలీవుడ్ హీరో తో సానియా మీర్జా రెండో పెళ్లి..?

Sania Mirza: భారత టెన్నిస్ ప్లేయర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నాక సనా జావేద్ అనే నటిని రెండో పెళ్లి చేసుకున్నారు.

అయితే మొదట ఆయన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత రెండో పెళ్లి సానియా మీర్జాతో జరిగింది.కానీ రెండో పెళ్లి కూడా ఎన్నో రోజులు నిలవలేదు.

Sania Mirza second marriage with that Tollywood hero

ఈ జంటకు ఒక బాబు పుట్టాక ఇద్దరు విడాకులు తీసుకున్నారు.అయితే షోయబ్ మాలిక్ మళ్ళీ పెళ్లి చేసుకోవడంతో సానియా మీర్జా కూడా రెండో పెళ్లి చేసుకోవాలని,ఆమె భవిష్యత్తు ఇక్కడితో ఆగిపోకూడదని ఆమె అభిమానులు కొంతమంది భావిస్తున్నారు. అయితే తాజాగా సానియా మీర్జా ఓ టాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ రూమర్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. (Sania Mirza)

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా పాకిస్తాన్లోని ఒక టెలివిజన్ న్యూస్ షోలో పాల్గొన్న సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకోవడం ఎందుకు.. ఒంటరిగా ఉంటే సరిపోదా అని మాట్లాడింది.అయితే ఈమె మాటలకు పాక్ నటుడు నబిల్ జాఫర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. విడాకులు తీసుకోవడం అనేది దురదృష్టకరం.కానీ విడాకులు అయ్యాక జీవితం అయిపోయింది అని అనుకోకూడదు. మళ్ళీ ఆ చీకటి జీవితం నుండి వెలుగులోకి రావాలి.

ఖచ్చితంగా నీకు మంచి భాగస్వామి దొరికితే రెండో పెళ్లి చేసుకో సానియా అంటూ ఆయన సలహా ఇచ్చారు. అయితే సానియా మీర్జా విడాకులకు కారణం ఓ తెలుగు హీరో అని ఆమె విడాకుల సమయంలో ఒక రూమర్ చక్కర్లు కొట్టింది.అయితే ఆ తెలుగు హీరోతో ఉన్న ప్రేమని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఆ హీరోని పెళ్లి చేసుకోమని ఆమె అభిమానులు సలహాలు ఇస్తున్నారు

celing fans: రిమోట్ కంట్రోల్ సీలింగ్ ఫ్యాన్లపై భారీ తగ్గింపు. కరెంటు బిల్లు సగం తగ్గుతుంది

వేడి ఎక్కువగా ఉండడంతో ఇళ్లల్లో చల్లదనం కోసం ప్రజలు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్థిక స్థోమత కలిగినవాళ్లు తమ ఇళ్లలో ఏసీలను పెట్టించుకుంటున్నారు..మరికొందరు కూలర్లు లేదా ఫ్యాన్లతో గడిపేస్తున్నారు.

ఈ వేసవిలో మంచి సీలింగ్ ఫ్యాన్ కొనాలని చాలా మంది అనుకుంటుంటారు. ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల ఫ్యాన్‌లు అందుబాటులో ఉన్నాయి.. మీరు మీ ఇంటికి డిఫరెంట్ లుక్ ఇవ్వాలనుకుంటే రిమోట్‌తో ఉన్న ఫ్యాన్‌లు బెస్ట్. రిమోట్‌తో ఉన్న సీలింగ్ ఫ్యాన్లు అందంగా కనిపించడమే కాకుండా చాలా శక్తివంతమైనవి, సౌకర్యవంతంగా ఉంటాయి. అనేక ప్రముఖ కంపెనీలు రిమోట్ కంట్రోల్ సీలింగ్ ఫ్యాన్లపై మంచి డిస్కౌంట్ లు ఇస్తున్నాయి.

Crompton Energion Hyperjet 1200mm BLDC సీలింగ్ ఫ్యాన్ రిమోట్ కంట్రోల్‌తో వస్తుంది. Amazonలో దీని ధర రూ. 5,499, కానీ దానిపై 55% తగ్గింపు ఇవ్వబడుతోంది. తగ్గింపు తర్వాత దీని ధర రూ. 2499గా ఉంది. ఈ ఫ్యాన్ BEE 5 స్టార్ టెక్నాలజీతో వస్తుంది. ఇది 35Wని వినియోగిస్తుంది. దీంతో 50% వరకు విద్యుత్ ఆదా చేయవచ్చని కంపెనీ తెలిపింది. దానితో పాటు 2 సంవత్సరాల వారంటీ ఇవ్వబడుతుంది.

Atomberg Efficio ఆల్ఫా 1200mm BLDC సీలింగ్ ఫ్యాన్ రిమోట్ కంట్రోల్‌తో వస్తుంది. ఈ ఫ్యాన్ అమెజాన్‌లో రూ. 4,590కి లిస్ట్ చేయబడింది, అయితే దానిపై 42% తగ్గింపు ఇవ్వబడుతుంది. తగ్గింపు తర్వాత, ఈ ఫ్యాన్‌ను రూ. 2,649కి కొనుగోలు చేయవచ్చు.

ఈ సీలింగ్ ఫ్యాన్‌ను 5వ నంబర్‌లో పెట్టి రన్ చేస్తే అది 28W వినియోగిస్తుంది. ఇది ఇంట్లో 65% వరకు విద్యుత్తును ఆదా చేస్తుందని కంపెనీ తెలిపింది. దీనిపై కంపెనీ 2 సంవత్సరాల వారంటీని కూడా ఇస్తుంది. ఇది 5 స్టార్ రేటింగ్‌తో వస్తుంది.

Orient Electric 1200 mm Zeno BLDC సీలింగ్ ఫ్యాన్ కూడా రిమోట్ కంట్రోల్‌తో వస్తుంది. ఇది అమెజాన్‌లో రూ. 4,500కి లిస్ట్ చేయబడింది, అయితే 34% తగ్గింపు తర్వాత, కస్టమర్‌లు ఈ ఫ్యాన్‌ని కేవలం రూ. 2,949తో ఇంటికి తీసుకురావచ్చు.

ఈ సీలింగ్ ఫ్యాన్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ ఫ్యాన్ 5 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. ఇది ఇంట్లో 50% వరకు విద్యుత్తును ఆదా చేస్తుందని కంపెనీ తెలిపింది. గదిలో ఎక్కడి నుంచైనా రిమోట్‌ని ఉపయోగించి ఫ్యాన్ వేగాన్ని కంట్రోల్ చేయవచ్చు.

Bengaluru: బెంగళూరులో రేవ్ పార్టీ.. పట్టబడ్డ తెలుగు సినీ ప్రముఖులు

Bengaluru: బెంగళూరులో రేవ్ పార్టీ.. పట్టబడ్డ తెలుగు సినీ ప్రముఖులు.
ఇది తెలుగు రాష్ట్రాల్ని షేక్ చేసే బ్రేకింగ్ న్యూస్.. బెంగళూరులో జల్సా చేస్తూ పట్టుబడ్డ 100 మందికి సంబంధించిన బిగ్‌ బ్రేకింగ్‌.. ఈ పార్టీకి పలువురు లీడర్లు, టాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా హాజరైనట్టు బెంగళూరు మీడియా రిపోర్ట్ చేస్తోంది.

బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్‌పై సెంట్రల్‌ క్రైమ్ బ్రాంచ్‌ దాడి చేసింది. G.R ఫామ్‌హౌస్‌లో తెల్లవారుజాము 3గంటల వరకు పార్టీ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. తనిఖీల్లో డ్రగ్స్ కూడా పట్టుబడటం సంచలనంగా మారింది. 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బెంగళూరు, ఏపీ, తెలంగాణ నుంచి 100 మందికి పైగా హాజరయినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో 25 మందికి పైగా యువతులు ఉన్నట్లు చెబుతున్నారు.

GR ఫామ్‌హౌస్‌.. అంటే గోపాల్‌రెడ్డి ఫామ్‌హౌస్‌..? కాన్ కార్డ్ యజమాని గోపాల్‌రెడ్డి.. ఈయన ఫామ్‌హౌస్‌లో ఇంత పెద్ద పార్టీ ఎందుకు జరిగింది..? తెలంగాణకు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని హోస్ట్ చేసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌కి చెందిన వాసు పూర్తి డీటెయిల్స్ ఏంటి..? పుట్టినరోజును ఇంత గ్రాండ్‌గా ఎందుకు ప్లాన్ చేశారు..? 100 మందిని పిలిచారు.. ఇందులో VVIPలు, సెలబ్రిటీలు ఉన్నట్టుగా చెప్తున్నారు. దీనిపైనే ఇప్పుడు పూర్తి సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు బెంగళూరు ఎలక్ట్రానికిక్‌ సిటీ పోలీసులు. సెంట్రల్‌ క్రైమ్ బ్రాంచ్‌ ఇప్పటికే ఈ రేవ్ పార్టీపై కేసు నమోదు చేసింది.

ఈ రేవ్‌ పార్టీకి హైఎండ్‌, పోష్‌ కార్లు చాలా వచ్చాయ్‌. వాటిల్లో ఓ బెంజ్‌ కార్‌ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దానికి కారణం.. ఆ కార్‌పై ఏపీ MLA కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్టిక్కర్‌ ఉంది. దీనిపై టీవీ9 ప్రతినిధి ఎమ్మెల్యే కాకాణిని కాంటాక్ట్ చేసినప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ కారుతో తనకు ఎలంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ కారు తనది కాదని.. తన పేరును ఎవరో వాడుకుంటున్నారని చెప్పారు.

రేవ్ పార్టీకి చాలా మంది సెలబ్రిటీలు కూడా హాజరైనట్టు చెప్తున్నారు. టాలీవుడ్‌కి చెందిన కొందరిని పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. కన్నడ మీడియాలో నటి హేమ పేరు సర్కులేట్ అవుతోంది. దీనిపై క్లారిటీ కోసం టీవీ9 రిపోర్టర్‌ హేమను కాంటాక్ట్ చేశారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని హేమ స్పష్టం చేశారు. రేవ్‌ పార్టీలో తాను ఉన్నట్టు కన్నడ ఛానెల్స్‌లో, మీడియాలో వచ్చిన వార్తల్ని ఖండించారు.

గుడివాడలో నానికి ఓటమి తప్పదా?

ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ స్థాపకుడు ఎన్‌టి రామారావు గెలిచారు. కొడాలి శ్రీ వెంకటేశ్వరావు (నాని) నాలుగు సార్లు వరుసగా గుడివాడ నుంచి గెలిచారు.

రెండు సార్లు టీడీపీ నుంచి రెండు సార్లు వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో నాని మంత్రిగా రెండున్నర ఏళ్లు పనిచేశారు. గత ఎన్నికల్లో 18,969 ఓట్ల మెజారిటీ వచ్చింది. 2024 ఎన్నికల్లో నాని గెలుపు ఓటములపై పందేలు కూడా జరుగుతున్నాయి. నాని గెలిచే అవకాశాలు చాలా తక్కువనే ప్రచారం సాగుతోంది.

ఓటు కొనుగోలుకు మూడువేలుఒక్కో ఓటు కొనుగోలుకు మూడు వేల వంతున కొడాలి నాని డబ్బలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 2,04,271య ఓట్లు ఉన్నాయి. ఇందులో లక్షన్నర ఓట్లు నాని కొనుగోలు చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నియోజకవర్గంలో గుడివాడ టౌన్, రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో గుడివాడ టౌన్, గుడ్లవల్లేరు మినహాయిస్తే నందివాడ, గుడివాడ రూరల్‌ మండలాల్లో నానికి మెజారిటీ వస్తుందనే ప్రచారం సాగుతోంది. గుడ్లవల్లేరులో తెలుగుదేశం పార్టీకే మెజారిటీ వస్తుందని, గుడివాడ పట్టణంలో నానికి మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని సమాచారం. నాని వర్గీయులు డబ్బలు పంచడంలో ముందున్నా గుడివాడ పట్టణంలోని 10,11,12 వార్డుల్లో నాని నుంచి డబ్బలు ఓటర్లకు అందలేదు. ఈ మూడు వార్డుల్లో పంచేందుకు డబ్బులు తీసుకున్న వారు స్వాహా చేశారు. చివరకు ఎన్నికల రోజు డబ్బులు ఇవ్వలేదని తేలింది. ఈ వార్డలకు చెందిన ముగ్గురు వ్యక్తలు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నానికి కనిపిస్తే సమస్యలు వస్తాయని భావించిన వీరు పట్టణం వదిలి వెళ్లారు. వీరు తెలుగుదేశం పార్టీ వారి వద్ద కూడా డబ్బులు తీసుకని వైఎస్సార్‌సీపీ డబ్బులు పంచకుండా ఆగారా? నాని డబ్బులు స్వాహా చేసి మిన్నకున్నారా అనేది తేలాల్సి ఉంది. గుడివాడ పట్టణంలో వైఎస్సార్‌సీపీకి ఓట్లు తగ్గే అవకాశం ఉందని సమాచారం.తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనిగండ్ల రాము ముందుగా రెండున్నర వేలు ఓటుకు చొప్పున పంపిణీ చేశారు. నాని ఓటుకు మూడు వేలు ఇచ్చారని తెలియగానే మిగిలిన ఐదు వందలు కూడా ముందుగా డబ్బులు తీసుకున్న ఓటర్లకు చేర్చారు. రాము వైపు నుంచి ఓటర్లకు పంచిన ప్రతి రూపాయి ఓటరుకు చేరింది. నాని నుంచి పంపిణీ చేసిన డబ్బులు ఎక్కువ మంది ఓటర్లకు చేరలేదు. ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న నాని ఎందుకు బోల్తా పడ్డారనేదానిపై చర్చ సాగుతూనే ఉంది. రాముకు గుడివాడ పట్టణంలో మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. నియోజకవర్గంలో ఎస్సీల ఓట్లు సుమారు 50వేలకు పైగానే ఉన్నాయి. ఇందులో మాలలు ఎక్కువగా ఉన్నారు. మాదిగలు కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో వేశారని చెప్పలేము. మొత్తం ఓట్లలో పోలయిన ఓట్లు 1,68,537 ఓట్లు. ఇవే కాకుండా 3066 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు, 160 హోం ఓట్లు కాగా మొత్తం 1,71,763 ఓట్లు పోలయ్యాయి. మొత్తం మీద 84.09 శాతం పోల్‌ కావడంతో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానికులు చెబుతున్నారు.అభ్యర్థులు ఇద్దరూ అందుబాటులో ఉండేవారు కాదుకొడాలి నాని, వెనిగండ్ల రాములు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వారు కాదు. గెలవగానే నాని నియోజకవర్గంలో ఉండటం కంటే వేరే ప్రాంతాల్లో ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. నెలకోసారి కూడా నియోజకవర్గంలో కనిపించని పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచి ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకుని వారికి ఆర్థిక సాయం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. రాము పరిస్థితి కూడా ఇదే. ఈయన మొదటి సారిగా రాజకీయాల్లోకి దిగినా గుడివాడలో ఎప్పుడూ ఉండలేదు. విదేశాల్లో వ్యాపారాలు ఉన్నందున నెలకోసారి కూడా గుడివాడలో కనిపిస్తాడో లేదో ననే అనుమానాలు ఓటర్లలో ఉన్నాయి.వ్యక్తులను చూసా.. పార్టీలను చూసా…2024 ఎన్నికల్లో గుడివాడలో పోటీ చేసిన అభ్యర్థులను చూసి ఓటర్లు ఓట్లు వేశారా? పార్టీలను చూసి ఓట్లు వేశారా? అనే అంశంపై ఎక్కువ చర్చ జరుగుతోంది. ప్రధానంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని, పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రెడ్డిని చూసి మాత్రమే ఓటర్లు ఓటు వేశారని పలువురు ఓటర్లు చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న రామును చూసి మాత్రమే ఓట్లు వేస్తున్నామని, టీడీపీని చూసి కాదని పలువురు ఓటర్లు చెప్పడం విశేషం.

Iran: 17గంటల తర్వాత దొరికిన హెలికాఫ్టర్ శిథిలాలు..ఇరాన్ అధ్యక్షుడి మృతి

Iran: 17గంటల తర్వాత దొరికిన హెలికాఫ్టర్ శిథిలాలు..ఇరాన్ అధ్యక్షుడి మృతి
Iran: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం కూలిపోయింది. ఘటన జరిగి చాలా గంటలు గడిచిన తర్వాత హెలికాప్టర్ ఆచూకీ లభించినట్లు తెలుస్తోంది. సహాయక బృందం ప్రమాద స్థలానికి చేరుకుందని అధికారులు తెలిపారు. పలు ఇరాన్ మీడియా ఛానెల్‌లు రైసీ హెలికాప్టర్ శకలాలను రెస్క్యూ టీమ్‌లు కనుగొన్నాయని చెప్పాయి. అయితే, అధ్యక్షుడు, అతని సహచరులు ప్రాణాలతో బయటపడ్డారా లేదా అనే దానిపై రెడ్ క్రెసెంట్ సమాచారం అందించలేదు. మరో ఇరానీ మీడియా ప్రమాద స్థలంలో ఎవరూ సజీవంగా ఉన్నట్లు ఎటువంటి సంకేతాలు కనుగొనబడలేదని తేల్చింది.

ప్రెసిడెంట్ రైసీతో హెలికాప్టర్‌లో ఎవరు ఉన్నారు?
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు హెలికాప్టర్‌లో విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలెక్ రహ్మతి, తబ్రిజ్ రాయల్ ఇమామ్ మొహమ్మద్ అలీ అల్హాషెమ్, ఒక పైలట్, సెక్యూరిటీ చీఫ్ , ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారని ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ తెలిపింది.
ప్రమాదం గురించి తదుపరి సమాచారం అందుబాటులో లేదు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు, ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్-అబ్దుల్లాహియాన్ కూడా కాన్వాయ్ హెలికాప్టర్‌లో ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడి కాన్వాయ్‌లో మూడు హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిలో రెండు హెలికాప్టర్లు వారి గమ్యస్థానంలో సురక్షితంగా ల్యాండ్ చేయబడ్డాయి. పైలట్ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదానికి దారితీసింది. సహాయక చర్యల కోసం 16 బృందాలను రంగంలోకి దించారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63 ఏళ్లు) తూర్పు అజర్‌బైజాన్‌కు వెళ్తున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజర్‌బైజాన్ సరిహద్దు నగరం జోల్ఫా సమీపంలో ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి ఆనకట్టను ఆయన ప్రారంభించాల్సి ఉంది. అరస్ నదిపై ఇరు దేశాలు నిర్మించిన మూడో డ్యామ్ ఇది. అధ్యక్షుడి కాన్వాయ్‌లో తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ కూడా ఉన్నారు.

ఇబ్రహీం రైసీ ఎవరు?
రైసీ ఇరాన్‌లో మతతత్వ పాలనకు గట్టి మద్దతుదారు. రైసీ ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీకి సన్నిహిత సహచరుడు. అతని వారసుడిగా గుర్తించబడ్డాడు. అతను 1988లో ఖైదీలను సామూహికంగా ఉరితీసినందుకు అమెరికా, ఇతర దేశాల నుండి ఆంక్షలను ఎదుర్కొంటున్నాడు. గతంలో ఇరాన్ న్యాయవ్యవస్థను నడిపాడు. 2021 అధ్యక్ష ఎన్నికల్లో రైసీ తన ప్రత్యర్థులందరినీ దూరం పెట్టి తక్కువ ఓటింగ్‌తో గెలుపొందడం వివాదాస్పదమైంది. అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో నైతిక చట్టాలను కఠినతరం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఉక్కుపాదంతో అణచివేశారు.

LIC Scheme: రోజు రూ.45 డిపాజిట్‌తో మెచ్యూరిటీ తర్వాత రూ.25 లక్షలు.. అదిరిపోయే ఎల్‌ఐసీ ప్లాన్‌!

ఎల్‌ఐసీ పథకం ఆర్థిక భద్రతకు దీటుగా నిలుస్తోంది. ఇది అన్ని వయసుల వారికి సరిపోయేలా వివిధ రకాల ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. వీరిలో జీవన్ ఆనంద్ పలిశివరుమానాలకు ప్రసిద్ధి. కనీస పెట్టుబడి రూ.45తో ఈ పాలసీ రూ. 25 లక్షలు ఆదాయం సమకూరుతోంది. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకునే పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా చేస్తుంది.జీవన్ ఆనంద్ పాలసీ మెచ్యూరిటీ సమయంలో పాలసీ హోల్డర్లు గణనీయమైన మొత్తం మొత్తాన్ని అందుకుంటారు. ఇది వారి ఆర్థిక భవిష్యత్తును మార్చడానికి వారికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. రోజుకు రూ. 45 లేదా వార్షిక ప్రీమియం రూ. 1358 పెట్టుబడి పెట్టడం ద్వారా 35 సంవత్సరాల పాటు జీవన్ ఆనంద్ పాలసీని పొందవచ్చు. ఈ పాలసీ మెచ్యూరిటీ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది పాలసీదారులకు వారి నిర్దిష్ట అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా అనేక రకాల ఎంపికలను అందిస్తుంది. కనీస హామీ మొత్తం రూ. 1 లక్ష, నిర్ణీత గరిష్ట పరిమితి లేదు. వ్యక్తులు తమ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పాలసీని అనుకూలీకరించడానికి అనుమతిస్తుంది. ప్రతి నెలా రూ.1358 పెట్టుబడి పెడితే 35 ఏళ్లలో మొత్తం రూ.5 లక్షల 70 వేల 500 డిపాజిట్ అవుతుంది. పాలసీ మెచ్యూరిటీపై రూ. 5 లక్షల సమ్ అష్యూర్డ్ రూ. 8 లక్షల 60 వేలు బోనస్‌గా, రూ. 11 లక్షల 50 వేలు కూడా ఫైనల్ బోనస్‌కు అదనంగా ఇవ్వనున్నారు. పాలసీ వ్యవధి కనీసం 15 సంవత్సరాలు ఉంటే పాలసీ వ్యవధిలో బోనస్ రెండుసార్లు చెల్లించబడుతుందని గమనించాలి.

పన్ను మినహాయింపు

జీవన్ ఆనంద్ పాలసీ పన్ను-రహిత ప్రయోజనాలను అందించనప్పటికీ, ఇది పాలసీదారులకు ప్రమాదవశాత్తు మరణం, వైకల్యం కలిగిన రైడర్, ప్రమాద ప్రయోజన రైడర్, కొత్త టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్, కొత్త క్రిటికల్ బెనిఫిట్ రైడర్‌తో సహా నాలుగు రకాల రైడర్‌లను అందిస్తుంది. పాలసీదారు మరణించిన సందర్భంలో పాలసీ డెత్ బెనిఫిట్‌లో 125 శాతం పొందేందుకు నామినీకి అర్హత ఉంటుంది.

LIC Kanyadan Policy: ఆడపిల్లల కోసం ఎల్ఐసీ సరికొత్త పాలసీ.. నెలకు రూ.3600 పెట్టుబడితో 28 లక్షల రాబడి

భారతదేశంలో బీమా రంగంలో ఎల్ఐసీ అత్యంత ప్రజాదరణ పొందింది. ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలను ప్రకటిస్తూ అగ్రగామిగా నిలుస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కుమార్తెల కోసం సరికొత్త పాలసీను ప్రకటించింది. ప్రతి నెల రూ.3600 మొత్తాన్ని డిపాజిట్ చేస్తే మీకు రూ.28 లక్షల రిటర్న్ వచ్చేలా కొత్త పాలసీను అందిస్తుంది. కన్యాదాన్ పేరుతో లాంచ్ చేసిన ఈ పాలసీ కుమార్తెల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ పథకంలో పెట్టుబడి పెడితే వారి కుమార్తెల వివాహానికి ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.28 లక్షలను పొందవచ్చు. రోజుకు రూ. 121 డిపాజిట్ చేయడం అంటే నెలకు సుమారుగా రూ.3600 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో మీ పిల్ల ఒక సంవత్సరం వయస్సు నుంచి 25 సంవత్సరాల మధ్య డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. ముఖ్యంగా కన్యాదాన్ పాలసీదారుడు మధ్యలో మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు బీమా కంపెనీ నుండి రూ. 10 లక్షల మొత్తాన్ని పొందుతారు. అదనంగా మీరు ఇందులో ఎక్కువ డబ్బు డిపాజిట్ చేయవలసిన అవసరం లేదు

కుమార్తెల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎల్‌ఐసీ కన్యా దాన్ పాలసీని రూపొందించారు. కుమార్తె వయస్సు కనీసం 1 సంవత్సరం అలాగే తండ్రి వయస్సు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అర్హత ఉంటుంది. అలాగే ఇందులో పెట్టుబడి పెడితే మీకు మంచి మొత్తంలో పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం 1961 కింద 80సీ కింద పాలసీదారులు రూ. 1.5 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు.

బ్రౌన్ రైస్ తినడం వల్ల బరువు తగ్గుతుందా..? మామూలు బియ్యంతో పోలిస్తే ఇవే ఎందుకు స్పెషల్..

Health Benefits of Brown Rice: వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్ చాలా ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. బ్రౌన్ రైస్ ను ముడి-బియ్యం లేదా దంపుడు బియ్యం అంటారు. ఈ బియ్యం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అనేక ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. వాస్తవానికి, బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే తక్కువగా ప్రాసెస్ అవుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అయితే, బ్రౌన్ రైస్ తింటే త్వరగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే, సాధారణంగా బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేస్తారు. దీనివల్ల పోషకాలు తక్కువ అవుతాయి. బ్రౌన్ రైస్ అలా కాదు.. కేవలం బయటి పొట్టు మాత్రమే తొలగిస్తారు. దీంతో ఊక, సూక్ష్మక్రిమి పొర అలాగే ఉంటుంది. చాలా పోషకాలు కలిగిన ఈ బియ్యం గోధుమ లేదా లేత గోధుమ రంగులో ఉంటుంది. తెల్ల బియ్యం పొట్టు, ఊక పొరతోపాటు బాగా పాలిష్ అవుతుంది.. అందుకే సాధారణ బియ్యం కంటే.. బ్రౌన్ రైస్ లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. కావున, బ్రౌన్ రైస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

ఒక కప్పు బ్రౌన్ రైస్‌లోని పోషకాలు ఇలా ఉంటాయి..
కేలరీలు – 248
ఫైబర్ – 3.2 గ్రా
కొవ్వు – 2 గ్రా
కార్బోహైడ్రేట్లు – 52 గ్రా
ప్రోటీన్ – 5.5 గ్రా
ఐరన్ – డివి 6 శాతం
మెగ్నీషియం- 19 శాతం
భాస్వరం – 17 శాతం
జింక్ – 13 శాతం
మాంగనీస్ – 86శాతం
సెలీనియం- శాతం
థయామిన్ (B1)-30 శాతం
నియాసిన్ (B3)-32 శాతం
పిరిడాక్సిన్ (B6) – 15 శాతం
పాంతోతేనిక్ యాసిడ్ (B) – 15 శాతం మేర పోషకాలు ఉంటాయి..
బరువు తగ్గడానికి ఇది ఎంత ఉపయోగకరంగా ఉంటుంది?
బ్రౌన్ రైస్ ప్రాసెస్ చేసిన ఆహారాల కంటే వేగంగా బరువును నియంత్రిస్తుంది. అంటే బరువు తగ్గించే గుణాలన్నీ బ్రెయిన్ రైస్‌లో ఉన్నాయి. ఉదాహరణకు, 1 కప్పు (158 గ్రాములు) బ్రౌన్ రైస్‌లో 3.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అయితే, 1 కప్పు తెల్ల బియ్యంలో 1 గ్రాము కంటే తక్కువ ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వంటగదిలో చిన్న బల్లిలతో విసిగిపోయారా? ఇంటి మూలలో 3 వస్తువులను ఉంచండి, 2 నిమిషాల్లో అదృశ్యం

కొన్ని సాధారణ ఉపాయాలను ఉపయోగించి, మీరు బల్లిని తరిమికొట్టవచ్చు. (How To Get Rid From Lizards) బల్లి కిటికీలు లేదా తలుపు పగుళ్ల ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తారు.

ఒక బల్లి వచ్చిన తర్వాత, ఇంట్లో చిన్న బల్లులు ఏర్పడతాయి. బల్లులును మీ ఇంటి నుండి దూరంగా ఉంచడానికి మీరు తీసుకోవలసిన కొన్ని సాధారణ దశలు ఉన్నాయి. (ఇంటి చుట్టూ ఉన్న బల్లులను ఎలా వదిలించుకోవాలి)

1) బ్లాక్ పెప్పర్ స్ప్రే

నల్ల మిరియాలు నీరు చుండ్రును వదిలించుకోవడానికి ఒక గొప్ప ఎంపిక. బ్లాక్ పెప్పర్ స్ప్రే శరీరంలో మంటను నివారిస్తుంది. కాబట్టి ఇంట్లోని ప్రతి మూలలో ఎండుమిర్చి పిచికారీ చేసేలా చూసుకోండి. ఈ పరిహారంతో, మీరు దోమలను తరిమికొట్టవచ్చు.

2) నాఫ్తలీన్ మాత్రలు

బట్టలు నుండి చిన్న కీటకాలను తొలగించడానికి మీరు నాఫ్తలీన్ బంతులను ఉపయోగించవచ్చు. ఈ పరిహారం సహాయంతో, బల్లులను ఇంటిని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. మీకు నాఫ్తలీన్ లేకపోతే, మీరు వాటిని ఇంటి మూలల్లో ఉంచవచ్చు, ఇది బల్లులను ఇంట్లో నుండి పారిపోవడానికి సహాయపడుతుంది.

3) ఉల్లిపాయ మరియు వెల్లుల్లి

ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి యొక్క సువాసన చాలా బలంగా ఉంటుంది, ఇది బల్లులకు అస్సలు ఇష్టం ఉండదు. మీరు ఈ ముక్కలను ఇంటి మూలలో ఉంచవచ్చు. దాని రసాన్ని తీసి ఇంట్లోని వివిధ ప్రదేశాలలో పిచికారీ చేయాలి. తద్వారా పొరలు చుట్టూ తిరగవు. ఉల్లిపాయ రసాన్ని తీసి స్ప్రే బాటిల్‌లో నింపి, ప్రభావిత ప్రాంతంలో ఈ స్ప్రేని అప్లై చేయండి. అలా బల్లుల ఇంట్లోకి రాడు.

1) నాఫ్తలీన్ బంతులు బల్లి ఇంట్లోకి రాకుండా నిరోధించగలవు. మీరు దానిని వంటగది అల్మారాలు, నిల్వ రాక్లు మరియు సింక్ కింద నిల్వ చేయవచ్చు. ఈ బంతులను ఇంట్లో ఆహార నిల్వ నుండి వేరుగా ఉంచండి.

2) ఇంట్లో పచ్చి ఆహారం లేకుండా చూసుకోండి. పచ్చి ఆహారం కారణంగా, ఇంట్లో గరిష్ట సంఖ్యలో కీటకాలు మరియు తెగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కిచెన్ క్యాబినెట్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. చెత్త డబ్బాలను సరిగ్గా కడగాలి. ఇది పాలి ఇంటికి దూరంగా ఉండటానికి సహాయపడుతుంది.

ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు..! కారణం తెలిసి వైద్యులే షాక్..

ఓ మహిళ కిడ్నీ నుంచి 300కు పైగా రాళ్లను తొలగించారు వైద్యులు. ఆ స్త్రీ తన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి నీళ్లకు బదులు ప్రతిరోజూ శీతల పానీయాలు, జ్యూస్ లు మాత్రమే తాగేది. ఈ కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగించి తయారు చేసిన పానీయాన్ని అతిగా సేవించడంతో మహిళ అస్వస్థతకు గురైంది. ఆమె సమస్యను గుర్తించడానికి డాక్టర్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు, ఆమె కుడి కిడ్నీ ద్రవంతో ఉబ్బినట్లు, వందలాది రాళ్లు ఉన్నట్లు గుర్తించారు.

బాధితురాలికి సీటీ స్కాన్‌ నిర్వహించిన వైద్యులు..ఆమె కిడ్నీలో 5 మిల్లీమీటర్ల రాళ్లు, 2 సెంటీమీటర్ల సైజులో ఉన్నట్లు గుర్తించారు. అంతే కాకుండా రక్తపరీక్షలో తెల్లరక్తకణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీనికి గల కారణాలను తెలుసుకునేందుకు వైద్యులు అన్ని పరీక్షలు చేయగా, ఆమె చుక్క నీరు కూడా తాగలేదని తేలింది. నీళ్లకు బదులు బబుల్ టీ, ఫ్రూట్ జ్యూస్, ఆల్కహాలిక్ డ్రింక్స్ తాగడం వల్ల హైడ్రేట్ అవుతుందని డాక్టర్‌కి చెప్పింది. దీంతో ఆమె కిడ్నీలో చాలా రాళ్లు ఏర్పడ్డాయని వైద్యులు నిర్ధారించారు. 2 గంటల శస్త్రచికిత్స తర్వాత, వైద్యులు ఆమె కిడ్నీలో సుమారు 300 రాళ్లను తొలగించారు.

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణాలు:
తక్కువ నీరు తీసుకోవడం, బరువు తగ్గించే శస్త్రచికిత్స లేదా ఉప్పు లేదా చక్కెర అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్యలు తలెత్తుతాయి. అలాగే వ్యాయామం చేయని వారి శరీరంలో కిడ్నీ స్టోన్ సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు తగ్గాలంటే ఎక్కువ నీరు తాగాలి. శరీరంలో తగినంత నీరు లేకపోతే, మూత్రపిండాలలో రాళ్లు సులభంగా పేరుకుపోతాయి. శరీరంలో డీహైడ్రేషన్ వల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. సాధారణంగా స్త్రీల కంటే పురుషుల్లో కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Health

సినిమా