Friday, November 15, 2024

RGV: చనిపోయిన శ్రీదేవితో ఏంటా పనులు వర్మ.. ?

RGV: రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదం ఎక్కడ ఉంటే వర్మ అక్కడ ఉంటాడు అనడం కన్నా.. వివాదాన్ని కావాలనే కొనితెచ్చుకొనే వర్మ అని చెప్పడం బెస్ట్. ఒకప్పుడు ఎంత మంచి సినిమాలు తీసి ప్రశంసలు అందుకున్నాడో.. ఇప్పుడు చెత్త చెత్త సినిమాలు తీసి విమర్శలు అందుకుంటున్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. వర్మకు శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో అందరికి తెల్సిందే. ఇష్టం అని చెప్పడం కన్నా ఆమెకు వర్మ భక్తుడు అని చెప్పొచ్చు. ఆమె అందానికి వర్మ బానిస. ఈ విషయాన్ని ఆర్జీవీ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు కూడా.

వర్మ దర్శకత్వంలో శ్రీదేవి రెండు సినిమాల్లో నటించింది. గోవిందా గోవిందా, క్షణ క్షణం. రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. 2018 లో శ్రీదేవి మరణించింది. ఆరోజు ఎంతమంది ఎలా ఏడ్చారో తెలియదు కానీ, వర్మ మాత్రం పిచ్చివాడైపోయినట్లు తెలిపాడు. ఆమె స్వర్గంలో రంభ ఊర్వశి మేనక పక్కన ఉండి ఉంటుందని, మళ్లీ భూమిపైకి రావాలని మందుకొడుతూ ఎన్నో ట్వీట్స్ కూడా చేశాడు. అప్పుడే కాదు సమయం చిక్కినప్పుడల్లా.. వర్మ, శ్రీదేవిని తలుస్తూనే ఉంటాడు.

తాజాగా మరోసారి శ్రీదేవిని తలుచుకున్నాడు. కారులో శ్రీదేవి పక్కన కూర్చొని సిగరెట్ కాలుస్తున్న ఫోటోను వర్మ షేర్ చేశాడు. అదేంటి.. శ్రీదేవి చనిపోయింది కదా.. ఇప్పుడు ఆమె పక్కన కూర్చోవడం ఏంటి అని అనుకుంటున్నారా.. ? మరి.. పైన ఉన్న శ్రీదేవిని కూడా వర్మ కిందకు దించాడు అంటే పొరపాటే.. ఆయనే స్వర్గానికి వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. కారులో పక్కన ఉన్న ఒక అబ్బాయి ఫేస్ కు శ్రీదేవి ముఖాన్ని ఎడిట్ చేసి.. అచ్చు శ్రీదేవి కారు డ్రైవ్ చేస్తున్నట్లు చూపించాడు. సడెన్ గా చూస్తే.. నిజంగా శ్రీదేవినే కారు డ్రైవ్ చేస్తుంది అనుకోకుండా ఉండరు.

ఇక దీనికి ఆమెను చూడడానికి స్వర్గానికి వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. చనిపోయిన శ్రీదేవితో ఏంటా పనులు వర్మ.. ? అని కొందరు.. శ్రీదేవి పక్కన ఇంత గ్లామరస్ గా ఉన్న హీరో ఎవరు అని కామెంట్స్ చేస్తున్నారు.

Pushpa 2 The Rule: ఇది కదా అరాచకం అంటే..!! గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పుష్ప ఫస్ట్ సాంగ్..

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ ఎలా ఉండబోతుంది.?
కథలో ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయి.? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు లాభించింది. అంతే కాదు బన్నీ క్రేజ్ ఈ తర్వాత బీభత్సంగా పెరిగింది. ఎక్కడ చూసిన అల్లు అర్జున్ పేరే వినిపిస్తుంది.. పుష్ప డైలాగ్సే మారుమ్రోగుతున్నాయి. ఇక ఇప్పుడు పుష్ప కు కొనసాగింపుగా వస్తున్న పుష్ప 2 పై అంచనాలు భారీ ఏర్పడ్డాయి.

పుష్ప లో స్మగర్ల్ గా కనిపించిన అల్లు అర్జున్.. పుష్ప 2 లో సిండికేట్ మెంబర్ గా మారి ఆ సామ్రాజానికే కింగ్ అవుతాడు. ఈ క్రమంలో ఆతను ఎలాంటి సవాళ్ళను ఎదుర్కున్నాడు. విలన్స్ ను ఎలా ఎదిరించాడు అనేవి చూపించనున్నారు. ఇప్పటికే ఈ నుంచి విడుదలైన పోస్టర్ భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ నుంచి ఫిర్చ్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎప్పటిలానే అదిరిపోయే మ్యూజిక్ తో కట్టిపడేశారు. పుష్ప, పుష్ప , పుష్ప రాజ్ అంటూ సాంగ్ ఈ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మొదటి పార్ట్ లో పాటలని ఎంత సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాటలను బీట్ చేసేలా మ్యూజిక్ కంపోజ్ చేశారు దేవీ శ్రీ. ఈ ఒక్క సాంగ్ తో ఆ విషయం అర్ధమైపోతుంది. పాటతో పాటు బన్నీ లుక్స్ కూడా మెస్మరైజ్ చేస్తున్నాయి. మొత్తానికి పుష్ప 2 ఫిర్చ్ సాంగ్ పై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.

చిన్న ఏలకులు… పెద్ద ప్రయోజనం..! మాటల్లో చెప్పలేనన్ని, రాయలేనన్ని లాభాలు.. తెలిస్తే అవాక్కే..

అంతేకాదు..స్థూలకాయులు రాత్రిపూట గోరువెచ్చని నీళ్లల్లో కాస్త యాలకుల పొడి కలిపి తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. నరాల బలహీనత ఉన్నవారు, లైంగిక సామర్థ్యం లేనివారు ప్రతిరోజు..
ఏలకులు అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. అనేక తీవ్రమైన వ్యాధులను నివారించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఏలకులు సాధారణంగా రెండు రకాలు.. ఒకటి నలుపు, రెండు ఆకుపచ్చ. వంటగదిలో దొరికే ఏలకులు రుచికి, సువాసనకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అధిక రక్తపోటు ఉన్నట్లయితే, ఏలకులు తీసుకోవడం మంచిది. అంతేకాదు..ఏలకులు బరువు తగ్గడానికి సహాయపడే అనేక అంశాలను కలిగి ఉంటాయి. మీ ఆహారంలో ఏలకులను చేర్చుకోవటం వల్ల వేగంగా బరువు తగ్గడంతో పాటు మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఏలకులు మధుమేహంలో మేలు చేస్తుంది. ఏలకులలోని యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ప్రయోజనకరంగా పనిచేస్తాయి. జీర్ణవ్యవస్థను మెరుగు పరచడమే కాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధుల్ని కూడా అడ్డుకుంటాయి. ఏలకులలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నోటి క్యాన్సర్, చర్మ క్యాన్సర్ కణాలతో పోరాడడంలో సహాయపడతాయి. డిప్రెషన్ నుంచి బయట పడాలంటే యాలకుల టీకానీ, పాలుకానీ తాగితే మంచి ఉపశమనం కలిగిస్తుంది.

అధిక రక్తపోటును నియంత్రించడంలో పచ్చి ఏలకులు మేలు చేస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇది రక్త ప్రసరణను సాధారణీకరించడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్ మూలకాలను కలిగి ఉంటుంది. ఏలకులు దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆకుపచ్చ ఏలకులు వార్మింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి, రాత్రిపూట దీనిని ఉపయోగించడం వలన జలుబు, దగ్గు లేదా గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. రాత్రిపూట గోరువెచ్చని నీళ్లలో ఏలకులను కలుపుకుంటే త్వరగా ఉపశమనం పొందవచ్చు.
అంతేకాదు..స్థూలకాయులు రాత్రిపూట గోరువెచ్చని నీళ్లల్లో కాస్త యాలకుల పొడి కలిపి తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. నరాల బలహీనత ఉన్నవారు, లైంగిక సామర్థ్యం లేనివారు ప్రతిరోజు యాలకులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఏలకులు వాడితే ఫలితం ఉంటుంది. నెగెటివ్ ఆలోచనల నుంచి ఏలకులు మనల్ని రక్షిస్తాయి. అలాగే, కిడ్నీలోని మలినాలను తొలగించేందుకు కూడా ఏలకులు ఉపయోగపడతాయి. చర్మంపై నల్ల మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

Diet Tips for Kidney: చిన్న వయసులోనే కిడ్నీలో రాళ్లతో బాధ పడుతున్నారా? ఈ పండ్లు తిన్నారంటే రాళ్లు పడిపోతాయ్‌..

అనారోగ్యకరమైన జీవనం, క్రమరహిత ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి పలురకాల జీవనశైలి కారణాలు ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తాయి. ఇందులో కొలెస్ట్రాల్, డయాబెటిస్ కూడా ఉన్నాయి. శరీరంలో వీటి అసమానతల కారణంగా మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తాయి. వైద్యుల ప్రకారం.. నేటి కాలంలో 30, 40 ఏళ్లు నిండకముందే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. యువతలో ఎక్కువగా కనిపించే సమస్య కిడ్నీలో రాళ్లు..
అనారోగ్యకరమైన జీవనం, క్రమరహిత ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి పలురకాల జీవనశైలి కారణాలు ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తాయి. ఇందులో కొలెస్ట్రాల్, డయాబెటిస్ కూడా ఉన్నాయి. శరీరంలో వీటి అసమానతల కారణంగా మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తాయి. వైద్యుల ప్రకారం.. నేటి కాలంలో 30, 40 ఏళ్లు నిండకముందే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. యువతలో ఎక్కువగా కనిపించే సమస్య కిడ్నీలో రాళ్లు. పసుపు రంగులో లేదా ఎర్రటి రంగులో మూత్రం రావడం, దిగువ వీపులో నొప్పి, వికారం వంటివి మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నాయని సూచించే లక్షణాలు. కిడ్నీలో రాళ్లు ఉంటే నొప్పిని భరించాల్సిందే. సకాలంలో కిడ్నీ సమస్యలకు జాగ్రత్తలు తీసుకోకపోతే కోలుకోవడానికి సర్జరీ తప్పనిసరి అవుతుంది.

కిడ్నీ స్టోన్స్ ప్రధానంగా జీవనశైలి కారణంగా పేరుకుపోతాయి. తగినంత నీరు త్రాగకపోవడం నుంచి అనారోగ్యకరమైన ఆహారం తినడం వరకు అన్నీ కిడ్నీ సమస్యలను తీవ్రతరం చేస్తాయి. అలాగే ఆహారంలో ఆక్సలేట్, కాల్షియం అధికంగా ఉన్నా రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది. అయితే కిడ్నీలో రాళ్లను ఆహారం ద్వారా కూడా నివారించవచ్చు. ఈ కింది ఆహారాలు తినడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు..

సిట్రస్ పండ్లు
నిమ్మ, నారింజ, ముసాంబి, నిమ్మకాయలు వంటి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. సిట్రస్ పండ్లు డిటాక్సిఫైయర్‌లుగా పనిచేస్తాయి. ఇది మూత్రపిండాల పనితీరును పెంచుతుంది.
తగినంత నీరు త్రాతాలి
కిడ్నీ సమస్యలను నివారించడానికి పుష్కలంగా నీరు త్రాగాలి. మూత్రపిండాల పనితీరు శరీరం నుంచి విషాన్ని తొలగించడం. తగినంత నీరు త్రాగకపోతే ఇది సాధ్యం కాదు.

ఆహారంలో ఉప్పు తగ్గించాలి
చాలా మంది ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు తింటారు. ఇలా అదనపు ఉప్పు తినే అలవాటు మూత్రపిండాల సమస్యలను పెంచుతుంది. ఉప్పులో సోడియం ఉంటుంది. దీనిని మూత్రపిండాలు శరీరం నుంచి తొలగించలేవు. దీంతో కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి. సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.

కాఫీ వద్దు
ముఖ్యంగా వేసవిలో కాఫీ అలవాటు మరింత హాని తలపెడుతుంది. కిడ్నీ సమస్యలు ఉంటే కాఫీకి దూరంగా ఉండాలి. కాఫీలో చాలా కెఫిన్ ఉంటుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది.

RTC Bus: RTC కండక్టర్ ఓవరాక్షన్… ప్రయాణికుడికి లక్ష రూపాయల పరిహారం!

ప్రజలు ఎక్కువగా ఉపయోగించే రవాణా సాధనాల్లో ఆర్టీసీ ఒకటి. ప్రతి రాష్ట్రానికి సొంత ఆర్టీసీ సంస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ ద్వారా, వేలాది కేంద్ర గమ్యస్థానాలకు నిత్యం చేరుకుంటారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అనే భావన ప్రజల్లో బలంగా ఉంది. అందుకే ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు. అదేవిధంగా ఆర్టీసీ కూడా అనేక సౌకర్యాలతో ప్రజలకు సేవలు అందిస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రయాణికుల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు.

కానీ కొందరు ఉద్యోగులు అత్యుత్సాహంతో ఉన్నారు. అలా చేసిన ఓ కండక్టర్ వల్ల ఆర్టీసీకి రూ. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..తమిళనాడు రాష్ట్రానికి చెందిన దైవసిగమణి అనే 42 ఏళ్ల వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులోని విల్లుపురం నుంచి బెంగళూరు వెళ్లేందుకు కేఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అయితే భార్య, కుమార్తె కోసం ఆన్‌లైన్‌లో బస్సు టికెట్‌ బుక్‌ చేసి గతేడాది జూలై 2న రాత్రి 8 గంటలకు బస్సు ఎక్కాడు.

15 కిలోల వేరుశనగ నూనెను తమ వెంట తీసుకెళ్తున్నారు. కండక్టర్ జగదీష్ ఆయిల్ క్యాన్ ను గమనించి అదనంగా రూ.200 చెల్లించాలని డిమాండ్ చేశాడు. కానీ దైవసిగమణి నిరాకరించింది. రూ.50 మాత్రమే ఇస్తామని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్టీసీలో సీల్ లేని ఆయిల్ క్యాన్లను రవాణా చేయరాదని అధికారులు తెలిపారు. ఆయిల్ డబ్బా లేకుండా బస్సులో ప్రయాణం చేయనని దైవసిగమణి నిర్ణయించుకుంది.

దైవసిగమణి ఆయిల్ డబ్బా తీసుకుని అర్థరాత్రి బస్సు దిగింది. విచారణ చేపట్టిన వినియోగదారుల కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. టికెట్ తీసుకున్న ప్రయాణికుడిని మధ్యలో దించవద్దని బస్సు సిబ్బంది తెలిపారు. ఈ కేసులో బాధితురాలు దైవసిగమణికి రూ.లక్ష నష్టపరిహారంతో పాటు రూ.660 టిక్కెట్ డబ్బును తిరిగి చెల్లించాలని KSRTC ని కోర్టు ఆదేశించింది.

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. ఈసీ కీలక ఆదేశాలు.. ఎప్పటివరకంటే..

తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించింది ఈసీ. సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై అవమానకరంగా, అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినందుకు ఈసీ కేసీఆర్ ప్రచారంపై వేటు వేసింది. ఈరోజు రాత్రి 8 గంటల నుంచే ఈ నిబంధన అమలులో ఉండనున్నట్లు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఈసీ సీరియస్ అయింది.
తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించింది ఈసీ. సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై అవమానకరంగా, అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినందుకు ఈసీ కేసీఆర్ ప్రచారంపై వేటు వేసింది. ఈరోజు రాత్రి 8 గంటల నుంచే ఈ నిబంధన అమలులో ఉండనున్నట్లు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఈసీ సీరియస్ అయింది. గత నెల ఏప్రిల్ 6న కేసీఆర్ సిరిసిల్లలో నిర్వహించిన ప్రెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తగు చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన రాష్ట్ర ఎన్నికల అధికారి మే 1 రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ప్రచారం నిర్వహించకూడదని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాల ప్రకారం మే 3వ తేది రాత్రి 8 గంటల వరకు కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అనుమతి ఉండదు. దేశ వ్యాప్తంగా లోక్ సభ, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశం మొత్తం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.

ఈసీ ఆదేశాలపై కేసీఆర్ స్పందన..
ఈసీ తన లోక సభ ఎన్నికల ప్రచారాన్ని నిషేధించడంపై స్పందించారు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈసీ స్థానిక మాండలికాన్ని సరిగా అర్ధం చేసుకోలేకపోయిందన్నారు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బాగా చేయలేదన్నారు. కాంగ్రెస్ కొన్ని పదాలను తప్పుగా వక్రీకరించి ఈసీకి ఫిర్యాదు చేసిందన్నారు కేసీఆర్. తన బస్సుయాత్ర చూసి కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయన్నారు.

ఈ శామ్సంగ్ ఫోన్ లో రూ.20000 డిస్కౌంట్ ఆఫర్! ఫ్లిప్ కార్ట్ లో అమ్మకానికి సంబంధించిన వివరాలు

గతేడాది జనవరిలో విడుదలైన Samsung Galaxy S23 ప్రస్తుతం భారీ ధర తగ్గింపు ఆఫర్‌ను పొందుతోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే సేల్ సందర్భంగా ఈ కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ.44,999కి అందుబాటులో ఉంటుందని కంపెనీ ఇటీవల ప్రకటించింది. ఈ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.64,999కి విక్రయిస్తోంది. మే 3 నుంచి మే 9 వరకు జరగనున్న ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్‌లో భాగంగా Galaxy S23 మరియు Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌లపై Flipkart భారీ ధర తగ్గింపులను ప్రారంభించింది. Flipkart విడుదల చేసిన ప్రకటనల ప్రకారం, Galaxy S23 FE ధర రూ. 39,999 లోపు మరియు Galaxy S23 రూ. 44,999 అందించబడుతోంది.
ఈ Galaxy S23 ఫోన్ ప్రస్తుతం Flipkartలో రూ.64,999కి విక్రయించబడుతోంది. అంటే రూ.20000 తగ్గింపు లభించబోతోంది. ఇది గెలాక్సీ AI ఫీచర్లతో అత్యంత సరసమైన శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌గా ఉండబోతోంది. Samsung Galaxy S23 సిరీస్ కోసం ఇటీవల One UI 6.1 అప్‌డేట్‌ను విడుదల చేసింది. Galaxy AI కూడా ఈ ఫ్లాగ్‌షిప్‌కి తీసుకురాబడింది. ఇందులో సర్కిల్ టు సెర్చ్, ఫోటో అసిస్టెంట్, ఇంటర్‌ప్రెటర్ మరియు లైవ్ ట్రాన్స్‌లేట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. Snap Dragon 8 Zen 2 చిప్ సెట్‌ను కలిగి ఉన్న Galaxy S23 ఫోన్ 6.1-అంగుళాల 120Hz అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది.

ఇది హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 1,200 నిట్‌ల వరకు వెళ్లవచ్చు. ఇది 8GB RAMతో వస్తుంది మరియు 128 GB మరియు 256 GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్ మరియు 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, మీరు 4K వీడియోలను రికార్డ్ చేయగల 12MP సెల్ఫీ షూటర్‌ను పొందవచ్చు. ఇవన్నీ 25W వైర్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 3,900mAh బ్యాటరీతో వస్తాయి. రాబోయే ఫ్లిప్‌కార్ట్ సేల్ యొక్క ఈ ఆఫర్ గురించి వివరాలు ఇంకా అస్పష్టంగా ఉన్నప్పటికీ, శామ్‌సంగ్ రూ. 2,000 క్యాష్ బ్యాక్ ఉందని, ఈ డీల్ పరిమిత సమయం వరకు మే 2న ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అందుబాటులో ఉంటుందని బ్యాంక్ తెలిపింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో, Samsung Galaxy S24 సిరీస్‌ను ఆవిష్కరించడానికి కొన్ని రోజుల ముందు, కంపెనీ దాని మునుపటి కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ధరను తగ్గించింది. Gizbot తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్‌లతో సహా ఇతర సాంకేతిక వార్తలకు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. ఇది ఎప్పటికప్పుడు తాజా వార్తలను వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వినియోగదారులకు తెలియజేస్తుంది.

Bomb Threat: ఉలిక్కిపడిన నగరం.. మీ స్కూళ్లో బాంబు పెట్టాం.. 60కిపైగా బడులకు బెదిరింపులు

బాంబు బెదిరింపుతో(Bomb Threat) దేశ రాజధానిలో 60కిపైగా పాఠశాలలు వణికిపోయాయి. దీంతో అన్ని బడులకు సెలవులు ప్రకటించి.. విద్యార్థులను ఇళ్లకు పంపించివేశారు. ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది.

ఢిల్లీ: బాంబు బెదిరింపుతో(Bomb Threat) దేశ రాజధానిలో 60కిపైగా పాఠశాలలు వణికిపోయాయి. దీంతో అన్ని బడులకు సెలవులు ప్రకటించి.. విద్యార్థులను ఇళ్లకు పంపించివేశారు. ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరిం

పులు రావడం తీవ్ర కలకలం రేపింది. 60కిపైగా పాఠశాలలకు ఈ మెయిల్‌ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు పిల్లలను తీసుకెళ్లారు. విద్యార్థులు వెళ్లిన తరువాత అన్ని బడుల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసింది. తొలుత షాలిమార్ గార్డెన్‌లోని కాన్వెంట్ పాఠశాలకు మే 1న ఉదయం 7 గంటలకు మెయిల్ వచ్చింది. పాఠశాల యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. వారు వచ్చి పాఠశాలను తనిఖీ చేసినా.. బాంబు లభ్యం కాలేదు.

అలా 60కిపైగా పాఠశాలలకు బెదిరింపు కాల్స్ వెళ్లాయి. ఒకే వ్యక్తి అన్ని పాఠశాలలకు మెయిల్స్ పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. డీసీపీ అపూర్వ గుప్తా మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం నుంచి అనేక పాఠశాలలకు మెయిల్స్ వెళ్లాయి. అన్ని మెయిళ్ల సారాంశం ఒకటేనని.. పాఠశాలలో బాంబు పెట్టినట్లు అందులో ఉందని తెలిపారు.

ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ.. విద్యార్థులు, తల్లిదండ్రులు కంగారు పడాల్సిన అవసరం లేదని.. బడుల్లో బాంబును గుర్తించలేదని తెలిపారు. అవసరమైన చోట పాఠశాలల అధికారులు తల్లిదండ్రులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ మెయిల్ పంపడానికి ఉపయోగించిన ఐపీ అడ్రస్ సర్వర్ విదేశాల్లో(రష్యా) ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీలైనంత త్వరలో నిందితుడి వివరాలు తెలుసుకుంటామని చెబుతున్నారు.

నిలిచిన పరీక్షలు..

బాంబు బెదిరింపు కారణంగా ఢిల్లీలోని వివిధ పాఠశాలల్లో జరగాల్సిన పరీక్షలు నిలిచిపోయాయి. వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్‌ని త్వరలో వెల్లడిస్తామని పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి.

TS High Court: కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు నోటీసులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని వారిని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వారిపై అనర్హత పిటిషన్‌ను ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పీకర్ కార్యాలయానికి అందజేశారు.

హైదరాబాద్, మే1: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని వారిని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వారిపై అనర్హత పిటిషన్‌ను ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పీకర్ కార్యాలయానికి అందజేశారు.

ఈ నోటీసుల వ్యవహారంతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల‌పై అనర్హత వేయాలంటూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు కె.పి. వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్రమంలో వారిద్దరికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.

గతేడాది నవంబర్ చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. దాంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే వరంగల్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

కానీ తాను బీఆర్ఎస్ తరఫున ఎన్నికల బరిలో నిలబడడం లేదంటూ.. అందుకు కారణాలు వివరిస్తూ.. కేసీఆర్‌కు ఆమె లేఖ రాసింది. అనంతరం కడియం శ్రీహరితోపాటు ఆయన కుమార్తె కావ్య బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. రేవంత్ రెడ్డి సమక్షంలో మూడు రంగుల కండువా కప్పుకున్నారు. ఇక వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. మరోవైపు భద్రాచలం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు సైతం ఆ పార్టీ రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ నేపథ్యంలో ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా గెలిచి.. మరో పార్టీలోకి వెళ్లడంతో.. వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజన వేళ… అంటే 2014 ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో కేసీఆర్ అధికారాన్ని చేపట్టారు. ఆ క్రమంలో ఆయన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో పలు పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను సైతం తన కారు పార్టీలోకి తీసుకోవడం గమనార్హం.

AP News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పడ్డాయోచ్..ఇది నిజంగా నిజం

అమరావతి, మే ౧: వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బాధలు అన్నీ లేవు. ఒక్క తేదీన జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అసలు నెలలో జీతాలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగులు తమ జీతాల కోసం, పింఛనుదారుల పింఛన్ల కోసం ఎంతగా ఎదురుచూశారో తెలిసిందే. 12 రోజుల్లో ఎన్నికలు రానున్నందున, జీతాల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులను ఆశ్చర్యపరిచేందుకు ప్రభుత్వం ఈ నెలలో అనూహ్యంగా చర్యలు చేపట్టింది.
గత నాలుగున్నరేళ్ల తర్వాత మొదటి తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించిన దాఖలాలు లేవు. అయితే, ప్రభుత్వ ఉద్యోగులను ఆశ్చర్యపరుస్తూ మే 1 (నేడు) ఏపీ ప్రభుత్వం జీతాలు, పెన్షన్లు ఇచ్చింది. మే ౧౩న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. మే 1 బ్యాంకు సెలవు అయినప్పటికీ, ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్లు ఉదయం 10 గంటలకు ఖాతాల్లో జమ చేయబడ్డాయి. ఉద్యోగులు, పెన్షనర్లు వైసిపిపై పిచ్చి కోపం గా ఉన్నారని, వారు మొదటి తేదీన వేతనాలు, పెన్షన్లతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఎన్నికలు జరుగుతున్నప్పటి నుంచి మొదటి తేదీన జీతాలు చెల్లించామని వాట్సాప్ గ్రూపుల్లో వ్యంగ్య కథనాలు వెల్లువెత్తుతున్నాయి. మోడల్ కోడ్ అమలులో ఉందని, జీతాలు చెల్లించామని ఉద్యోగులు చెబుతున్నారు. ఎన్నికలు ఉన్నాయి… అందుకే జీతాలు చెబుతూ వాట్సాప్ గ్రూపుల ఉద్యోగులలో సందేశాలు ప్రసారం అవుతున్నాయి. ఏదేమైనా, నాలుగున్నర సంవత్సరాల తరువాత, జీతాలు మరియు పెన్షన్లు సరిగ్గా ఒక తేదీన వస్తున్నందున ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఇద్దరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మహిళల కోసం అద్భుతమైన పథకం.. ఏకంగా రూ. 32 వేలు!

పేదలు, మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అనేక పథకాలు అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం అనేక పథకాలను తీసుకువచ్చింది. అటువంటి పథకాలలో మహిళలకు చాలా ఉపయోగకరమైన పథకం కూడా ఉంది. మహిళలు 32 వేల వరకు పొందవచ్చు. ఈ పథకం పేరు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్. మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2023 ఏప్రిల్ 1న అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడాది బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించారు.

ఇది ఫిక్స్డ్ డిపాజిట్ పథకం. ఒక్క డిపాజిట్ చాలు. ఈ పథకంలో వెయ్యి రూపాయల నుండి 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇతర చిన్న పొదుపు పథకాలతో పోలిస్తే ఇది అధిక వడ్డీ రేటును కలిగి ఉంది. వార్షిక వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. మరింత ఖచ్చితమైన లాభాలను పొందవచ్చు. ఈ పథకం రెండు సంవత్సరాల తరువాత పరిపక్వం చెందుతుంది. అవసరమైతే మధ్యలో కొంత డబ్బును ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఎటువంటి వయోపరిమితి లేదు. మీరు ఏ వయసులోనైనా బాలికల పేరిట లేదా మహిళల పేరిట ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి, మీరు పోస్టాఫీసుకు వెళ్లి ఖాతా తెరవాలి.

మైనర్ బాలికపై గార్డియన్ ఖాతా తెరవవచ్చు. ఖాతా తెరవడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, కలర్ ఫోటో వంటి డాక్యుమెంట్లు అందుబాటులో ఉండాలి. నిబంధనల ప్రకారం.. మీరు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్లో పెట్టుబడి పెడితే, మీరు ఒక సంవత్సరం తర్వాత కొంత డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. ఆ సమయంలో డిపాజిట్ చేసిన మొత్తంలో 40 శాతం వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు 2 లక్షలు జమ చేస్తే.. మీరు దానిలో 80 వేలను ఉపసంహరించుకోవచ్చు. ఈ పథకంలో 50 వేల రూపాయలు పెట్టుబడి పెడితే.. రెండేళ్లలో రూ. 8, 011 వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో రూ. 58, 011 పొందుతారు.

లక్ష డిపాజిట్ చేస్తే.. వడ్డీ కింద రూ. 16, 022 పొందుతారు. అంటే రెండు సంవత్సరాల తరువాత మొత్తం మొత్తం రూ. 1,16,022 పొందవచ్చు. మీరు ఒక లక్ష 50 వేల డిపాజిట్ చేస్తే.. రెండు సంవత్సరాల తరువాత రూ. 24, 033 వడ్డీ లభిస్తుంది. అంటే మెచ్యూరిటీ సమయంలో మొత్తం మొత్తం రూ. 1,74,033 అందుకోనున్నారు. మీరు ఈ పథకంలో 2 లక్షలు పెట్టుబడి పెడితే, మీకు 32,044 రూపాయల వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో మొత్తం 2,32,044 రూపాయలు అందుతాయి. బయటి వారికి వడ్డీ ఇస్తే 2 లక్షలు తిరిగి ఇస్తారో లేదో తెలియదు. కానీ మీరు ఈ ప్రభుత్వ పథకంలో జమ చేస్తే మీ డబ్బుకు హామీ ఇవ్వబడుతుంది. కానీ ఈ పథకం నుండి ప్రయోజనం పొందడానికి, ఇది మార్చి 31,2025 వరకు సాధ్యమవుతుంది.

లక్కీ డ్రా: బంపరాఫర్.. ఓటు వేయండి ల్యాప్‌టాప్‌లు, డైమండ్ రింగ్‌లు తీసుకువెళ్ళండి

దేశంలో ఎక్కడ చూసినా పార్లమెంట్ ఎన్నికల హడావుడి నెలకొంది. అయితే ఓటింగ్ విషయంలో ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు సైతం బస్టాండ్‌లు, దుకాణాలకు వెళ్లి ఓటర్లకు ఓటింగ్‌లో పాల్గొనేలా అవగాహన కల్పించి పోలింగ్ శాతం పెంచిన విషయం విదితమే. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లా ఎన్నికల అధికారులు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు.
ఈ మేరకు నజరానాలు కూడా ప్రకటించారు. వచ్చి ఓటు వేసి ల్యాప్‌టాప్‌లు, డైమండ్ రింగ్‌లను గెలిపించండి అని నజరానా ప్రకటించారు. అంతే కాకుండా టీవీలు, ఫ్రిజ్‌లు, బైక్‌లు, స్కూటర్లను కూడా బహుమతులుగా అందించారు. ఇందుకోసం భోపాల్‌లోని కొన్ని చోట్ల కూపన్ బాక్సులను కూడా ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ వివరాలతో కూడిన ఫారమ్‌లను పూరించి కూపన్ బాక్సుల్లో వేయాలి. విజేతలకు ఓటు వేసినట్లు వేలిపై ఉన్న ఇంక్ ప్రింట్ చూపించి బహుమతి అందజేయనున్న సంగతి తెలిసిందే.
అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి, రెండో దశ ఓటింగ్ శాతం తక్కువగా ఉండడంతో అధికారులు ఈ బహుమతి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. తొలి దశలో 66.14 శాతం, రెండో దశలో 66.71 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ పేర్కొంది. అయితే పోలింగ్ శాతాన్ని ప్రకటించడంలో ఈసీ ఎందుకు జాప్యం చేస్తోందని అంతకుముందు విపక్షాలు ఆరోపిస్తూ.. తొలి విడత ఎన్నికలు జరిగి 11 రోజులు కాగా, రెండో దశ ఎన్నికలు జరిగి నాలుగు రోజులు అవుతున్న సంగతి తెలిసిందే.
మధ్యప్రదేశ్‌లో ఓటింగ్ శాతం తక్కువగా ఉండడంతో అధికారులు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల మూడో దశ పోలింగ్ మే 7న భోపాల్‌లో జరగనుంది.

మంచి ఆఫర్.. కేవలం రూ.57 వేలకే బెస్ట్ స్కూటీ!

పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందాలంటే వాహనదారులకు బెస్ట్ ఆప్షన్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్, కార్లను వాడడమే. ఎలక్ట్రిక్ టూవీలర్ ల ధరలు పెట్రోల్ తో నడిచే బైక్ ల ధరల రేంజ్ లో ఉండడంతో ఈవీల కొనుగోలు పట్ల మొగ్గు చూపుతున్నారు. ఈవీల వాడకంతో వాహనదారులకు డబ్బు ఆదా అవుతుంది. అంతే కాకుండా పర్యావరణానికి మేలుచేసినట్లు అవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు వస్తున్న ఆదరణతో ఆటో మొబైల్ కంపెనీలు నయా టెక్నాలజీతో అద్భుతమైన ఫీచర్లతో టూ వీలర్లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. మరి మీరు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ బైక్ కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ కంపెనీకి చెందిన స్కూటీపై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. కేవలం రూ. 57 వేలకే సొంతం చేసుకోవచ్చు.

ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ సంస్థ ఓలా కస్టమర్లను ఆకర్షించేందుకు స్కూటర్లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. సేల్స్ పెంచుకునేందుకు భారీ డిస్కౌంట్ ఆఫర్లను కస్టమర్లకు అందిస్తూ ఉంటుంది. ఓలాకు చెందిన ఎస్1ఎక్స్ బైక్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 79,999 కాగా, ప్రస్తుతం రూ. 69,999కే లభిస్తుంది. అయితే ఆఫర్ లో భాగంగా ఈ బైక్ ను కేవలం 57 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ బైక్ సింగిల్ ఛార్జ్ తో ఏకంగా 190కి.మీలు ప్రయాణించొచ్చు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 90 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 40కిమీ వేగాన్ని అందుకోగలదని కంపెనీ వెల్లడించింది. ఓలా ఎస్1ఎక్స్ ని మొత్తం ఏడు విభిన్న రంగు ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో రెడ్ వెలాసిటీ, మిడ్‌నైట్, వోగ్, స్టెల్లార్, ఫంక్, పోర్సిలైన్ వైట్, లిక్విడ్ సిల్వర్ వంటి రంగులు ఉన్నాయి. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్-II) పథకం ద్వారా సబ్సిడీని అందిస్తున్నారు. ఈ సబ్సిడీలో భాగంగా ఈ స్కూటర్ ను 57 వేలకే సొంతం చేసుకోవచ్చు.

కర్మ సిద్ధాంతం అంటే ఇదే.. యముడు పనిమనిషికి విదురుడిగా ఎందుకు జన్మించాల్సి వచ్చిందంటే

సనాతన హిందూ ధర్మంలో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. మానవ జన్మ గత జన్మలో చేసిన మంచి చెడుల పనుల ఆధారంగా నడుస్తుందని విశ్వాసం. ఇక ద్వాపర యుగం వరకూ కొంతమంది వ్యక్తులు ఏదోక శాపం కారణంగా జన్మను పొందవలసి వచ్చిందని విశ్వాసం.

ఇందుకు మనిషి మంచి చెడులను నిర్ణయించే యమధర్మ రాజు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఒక మహర్షి శాపం కారణంగా యముడు వితంతువు గర్భాన జన్మించవలసి వచ్చింది. అతనే విదురుడు. కురు సామ్రాజ్యంలో న్యాయకోవిదుడుగా ఖ్యాతిగాంచిన విదురుడే..యమ ధర్మ రాజు. పురాణాల ప్రకారం ఓ మహర్షి శాపం కారణంగా మహాభారత కాలంలో యముడు పనిమనిషికి జన్మించవలసి వచ్చింది.

మహర్షి మైత్రేయ సందేహాన్ని నివృత్తి చేశాడు

పురాణాల ప్రకారం మైత్రేయ మహర్షి విదురుడికి నువ్వు నిజానికి యమ ధర్మ రాజు అని చెప్పి సందేహాన్ని తీర్చాడు. మాండవ్య మహర్షి శాపం వల్ల నువ్వు మనిషి రూపంలో దాసి కొడుకుగా పుట్టవలసి వచ్చింది. ఈ శాపానికి గల కారణాన్ని విదురుడు అడిగినప్పుడు, ఒకసారి కొంతమంది దొంగలు ఒక రాజు ఖజానా నుండి డబ్బు అపహరించి పారిపోతున్నారని ఋషి చెప్పాడు. సైనికులు దొంగల కోసం నలువైపులా వెతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దొంగలు తప్పించుకోవడం కష్టమైంది. పరిగెడుతూనే దొంగలు దట్టమైన అడవి గుండా వెళుతున్నారు. ఆ అడవిలో మాండవ్య మహర్షి ఆశ్రమం ఉండేది. భయాందోళనలో దొంగలు దోచుకున్న డబ్బు మొత్తాన్ని ఆ ఆశ్రమంలో దాచిపెట్టి, అక్కడి నుంచి పారిపోయారు.

దొంగలను వెంబడిస్తూ రాజు సైనికులు మాండవ్య మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ వెదికిన తర్వాత ఆ ఆశ్రమంలో దోచుకున్న డబ్బు దొరికింది. సైనికులు ఋషిని దొంగగా భావించారు. అతనిని పట్టుకొని రాజు వద్దకు తీసుకెళ్ళారు. సైనికుల నుంచి అన్నీ తెలుసుకున్న రాజు ఆ మహర్షికి మరణశిక్ష విధించాడు.

ఉరి వేసినా మరణించని మహర్షి

మహర్షిని ఉరి తీస్తున్నప్పుడు మహర్షి మంత్రాలు పఠించడం ప్రారంభించాడు. రాజు సేవకులు అతన్ని ఉరితీశారు. అయినా ఆశ్చర్యకరంగా ఋషి చనిపోలేదు. సైనికులు సైతం ఉరివేసినా ఎందుకు చనిపోవడం లేదని ఆశ్చర్యపోయారు. ఈ వార్త రాజుకు తెలియడంతో అతను తన తప్పును గ్రహించి, ఋషికి క్షమాపణ చెప్పాడు.

అప్పుడు ఆ మహర్షి రాజుతో ఇలా అన్నాడు, “ఓ రాజా నేను నిన్ను క్షమిస్తాను కానీ నేను నిర్దోషి అయినా నాకు మరణశిక్ష విధించిన యమధర్మ రాజును క్షమించను?” దీనికి నేను యముడిని ఖచ్చితంగా శిక్షిస్తాను. అని చెప్పి తన తపస్సు శక్తితో యముడి దగ్గరకు చేరుకున్నాడు. నేను ఏ నేరం చేయనప్పుడు మరణశిక్ష ఎందుకు అనుభవించాల్సి వచ్చింది అని యముడిని అడిగాడు. కోపంతో ఉన్న మాండవ్య మహర్షిని చూసి యమధర్మరాజు కూడా భయపడ్డాడు. మహర్షికి కోపం వచ్చి తమను శపించే అవకాశం ఉందని భావించాడు.

యముడిని శపించిన మాండవ్య ఋషి

దీంతో యమధర్మ రాజు మాండవ్య ఋషితో మాట్లాడుతూ.. మీరు చిన్నతనంలో సీతాకోకచిలుకను ముల్లుతో పొడిచారని, ఆ పాపం వల్ల ఇప్పుడు ఇలా శిక్షింపబడ్డారని మహర్షితో చెప్పాడు. దీనిపై మాండవ్య మహర్షి మాట్లాడుతూ శాస్త్రాల ప్రకారం అజ్ఞానం వల్ల ఎవరైనా పాపం చేస్తే కలలో శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. నీవు నన్ను శాస్త్ర విరుద్ధముగా శిక్షించావు. కనుక నీవు దాసుని కుమారునిగా మనుష్యరూపంలో పుడతావని శాపం ఇచ్చాడు. మైత్రేయ మహర్షి ఇదంతా చెప్పి..ఈ శాపం కారణంగా యమధర్మ రాజు అయిన నువ్వు కురు వంశంలో దాసి కొడుకుగా విదురుగా జన్మించావని విదురుడితో చెప్పాడు.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని Mannam Web ధృవీకరించడం లేదు

SSC CHSL Notification 2024: SSC భారీ నోటిఫికేషన్.. ఇంటర్ అర్హతతో 3,712 పోస్టులు.. అప్లై చేశారా..!

SSC CHSL Notification 2024: ఇంటర్ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారికి భారీ శుభవార్త చెప్పింది.

3,712 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హతలు, వయస్సు వంటి మొదలైనవి ఇప్పుడు తెలుసుకుందాం..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ(10+2) లెవెల్ ఎగ్జామినేషన్ ద్వారా 3,712 ఖాళీలను భర్తీ చేయనుంది. ఎస్ఎస్‌సీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 8, 2024న ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రంలో లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్షా విధానం, ఫీజు, చివరి తేదీ వంటి మొదలైన విషయాలను కింద తెలుసుకుందాం..

మొత్తం పోస్టుల సంఖ్య
3,712

విభాగాలు
లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
డేటా ఎంట్రీ ఆపరేటర్/ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-ఏ

దరఖాస్తు విధానం
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా ఎస్ఎస్‌సీ వెబ్ సైట్ లో రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలు
ఇంటర్ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.

వయస్సు
ఈ పోస్టులకు అప్లై చేయలనుకునే అభ్యర్థుల వయస్సు.. 18 ఏళ్ల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వయోపరిమితి సడలింపు కూడా ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 08-04-2024
దరఖాస్తు చివరి తేదీ: 04-05-2024
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 10-05-2024 నుంచి 11-05-2024 తేదీల మధ్య మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశాన్ని SSC బోర్డు కల్పించింది.

పరీక్షా ఫీజు
సాధారణ అభ్యర్థులు రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ కు చెందిన వారికి ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ(10+2) లెవెల్ ఎగ్జామినేషన్ మూడు దశలుగా జరగుతుంది.
టైర్-1 పరీక్ష 1 నుంచి 5 & 8 నుంచి 12-07-2024 తేదీల్లో జరుగుతుంది.
టైర్-2 పరీక్షకు సంబంధించిన తేదీలను SSC బోర్డు వెల్లడించలేదు.
టైర్-3లో టైపింగ్ టెస్ట్ ఉంటుంది.

అయితే టైర్-1 పరీక్షలో అర్హత మార్కుల సాధించిన వారు మాత్రమే టైర్-2 పరీక్షకు అర్హులవుతారు. టైర్-2 పరీక్షలో కూడా సెలక్ట్ అయిన వారికి టైర్-3 టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ మూడు దశల్లో ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇందులో కూడా ఎవరైతే ఎంపిక అవుతారో వారికి ఉద్యోగం లభిస్తుంది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ(10+2) లెవెల్ ఎగ్జామినేషన్ కు అప్లై చేయాలకునే అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం www.ssc.nic.in వెబ్​సైట్​ ను సంప్రదించాలి.

AP : మా నాన్నను ఓడించండి: ఉప ముఖ్యమంత్రి కుమారుడు

మా నాన్నను ఓడించండి అంటూ ఉప ముఖ్యమంత్రి, అనకాపల్లి వైకాపా ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు కుమారుడు బూడి రవికుమార్‌ ప్రచారం చేస్తున్నారు.
మంగళవారం ఆయన సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఓ చిత్రంలో ”కన్న కొడుకుకు న్యాయం చేయలేనివారు ఓటేసిన ప్రజలకు ఏం న్యాయం చేయగలరు? ఆలోచించి ఓటు వేయండి. మా నాన్న బూడి ముత్యాలనాయుడిని ఓడించండి’ అని పేర్కొన్నారు. జిల్లాలో ఆ చిత్రం వైరల్‌ అవుతోంది.

Amazon Summer Sale: అమెజాన్ సేల్ భారీ ఆఫర్లతో రేపటి నుంచి స్టార్ట్ అవుతోంది.!

Amazon Summer Sale: అమెజాన్ ఇండియా ఎట్టకేలకు అతి పెద్ద సేల్ 2024 సమ్మర్ సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ నుండి భారీ డీల్స్ మరియు ఆఫర్లు అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది. ఈ సేల్ మే 2 వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుందని అమెజాన్ తెలిపింది. ఈ అప్ కమింగ్ అమెజాన్ సేల్ ఆఫర్స్, డీల్స్ మరియు ఇంకా ఏమేమి ఆఫర్ చేయబోతోందో ఒక లుక్కేద్దామా.

Amazon Summer Sale
అమెజాన్ అప్ కమింగ్ సేల్ ‘సమ్మర్ సేల్’ మే 2 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలవుతుంది. అయితే, Prime Members కోసం ఈ సేల్ 12 గంటల ముందు నుండే, అంటే 2వ తేదీ రాత్రి 12 గంటల నుండే ప్రారంభమవుతుంది. ఈ సేల్ క్లోజింగ్ డేట్ ను మాత్రం అమెజాన్ ఇండియా ఇంకా ప్రకటించ లేదు.

Amazon Summer Sale ఆఫర్స్ ఎలా ఉండనున్నాయి?
అమెజాన్ సమ్మర్ సేల్ ఆఫర్స్ గురించి మాట్లాడాలంటే ముందుగా బ్యాంక్ ఆఫర్స్ గురించి చెప్పవచ్చు. అమెజాన్ ఇండియా ఈ సమ్మర్ సేల్ ను ICICI, BOB మరియు OneCard బ్యాంక్స్ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది.

అందుకే, ICICI, BOB మరియు OneCard బ్యాంక్ ల కార్డ్స్ తో ఈ సేల్ నుండి వస్తువులను కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ ను అందిస్తుంది. అంటే, ఈ సేల్ నుండి ఈ మూడు బ్యాంక్ ల యూజర్లకు 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

ఇక ప్రత్యేకమైన ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ సేల్ నుండి Sample Mania, క్యాష్ రివార్డ్, అమెజాన్ కూపన్ డిస్కౌంట్ మరియు అమెజాన్ కాంబో వంటి మరిన్ని ఆఫర్లను కూడా అందిస్తోంది.

అమెజాన్ సమ్మర్ సేల్ నుండి స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్, TWS బడ్స్, హెడ్ ఫోన్, సౌండ్ బార్, AC లు, ఫ్రిడ్జ్ లు మరియు వాషింగ్ మెషిన్ వంటి మరిన్ని ప్రోడక్ట్స్ [పైన నఁగొప్ప డీల్స్ ను అందుకోవచ్చు.

Jagan Assets case new twist: జగన్ ఆస్తుల కేసు, కొత్త మలుపు..మళ్లీ మొదటికి?

Jagan Assets case new twist: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు కొత్త మలుపు తిరిగింది. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఈ కేసు వెనక్కి వెళ్తోంది. న్యాయమూర్తిని బదిలీ చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇంతకీ ఈ ఎత్తుగడ ఎవరిది? దీని వెనుక ఎవరున్నారు? ఇలా రకరకాల ప్రశ్నలు సామాన్యులను వెంటాడుతున్నాయి.

జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ఆయన కేసులపై పుష్కరకాలం పాటు విచారణ సాగుతూనే ఉంది. ఛార్జిషీట్ల నుంచి తమను తప్పించాలని కోరుతూ జగన్, విజయ సాయిరెడ్డి సహా ఇతర నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటీషన్లపై రావాల్సిన తీర్పు, అనుకోని పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. తీర్పు వస్తుందని చాలామంది ఆసక్తిగా ఎదురుచూశారు. హైకోర్టు ఇచ్చిన గడువు ఏప్రిల్ 30 (మంగళవారం)తో ముగిసింది. తీర్పు వెల్లడించాల్సిన న్యాయమూర్తి బదిలీ కావడంతో తిరిగి మొదటి నుంచి విచారణ చేపట్టాలని హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది.

అనారోగ్యం కారణంగా విచారణ పూర్తి చేయలేకపోయానని సీబీఐ కోర్టు న్యాయమూర్తి హైకోర్టుకు మంగళవారం లేఖ రాశారు. దీంతో డిశ్చార్జ్ పిటీషన్లలపై తదుపరి విచారణను ఈనెల 15కి వాయిదా పడింది. పిటీషన్లపై విచారణను కొత్త న్యాయమూర్తి తిరిగి విచారణ మొదలుపెట్టనున్నారు. దీంతో ఈ కేసు వ్యవహారం మళ్లీ మొదటికి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ కేసు మొదలైన ఇప్పటివరకు ఏడుగురు న్యాయమూర్తులు విచారణ చేపట్టారు. కేసు పూర్తి కాకముందే వాళ్లంతా బదిలీ అయ్యారు. దాదాపు 130 డిశ్చార్జ్ పిటీషన్లపై విచారణ పూర్తికావడానికి చాలా సమయం పట్టడంతో న్యాయమూర్తులు బదిలీ కావడంతో విచారణ మళ్లీ మొదటికి వస్తోంది. కొత్తగా వచ్చే జడ్జి మళ్లీ ఈ కేసులను మొదటి నుంచి వినాల్సిన పరిస్థితి నెలకొంది. మరో విషయం ఏంటంటే కొత్తగా వచ్చిన న్యాయమూర్తి రిటైర్‌‌మెంట్ వయస్సు దగ్గరపడిందని, ఆయన ఎక్కువకాలం ఉండరనే వార్తలు జోరందుకున్నాయి. డిశ్చార్జ్ పిటీషన్లకు దశాబ్ద కాలంపడితే ప్రధాన కేసులు ఎప్పుడు విచారణకు వస్తాయన్నది అసలు ప్రశ్న?

జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ 11, ఈడీ 9 ఛార్జిషీటు దాఖలు చేశాయి. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న జగన్, విజయసాయిరెడ్డి, ధర్మాన, మోపిదేవి, సబిత, గీతారెడ్డి, ఐఏఎస్ శ్రీలక్ష్మి, మాజీ ఐఏఎస్ మన్మోహన్ సింగ్, శామ్యూల్, బీపీ ఆచార్య, వెంకట్రామిరెడ్డిలతోపాటు పలువురు బిజినెస్‌మేన్లు ఉన్నారు. వీళ్లకు సంబంధించి దాదాపు 130 డిశ్చార్జ్ పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయి

Watch Video: విడాకుల ఆహ్వానం.. అత్తారింటికి వీడ్కోలు..! భారీ హంగామాతో పుట్టింటికి కూతురు..

2019 సంవత్సరంలో ఉర్వి ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. కూతురు పుట్టిన తర్వాత ఉర్వికి మరిన్ని అవహేళనలు మొదలయ్యాయి. క్రమంగా అత్తమామల ప్రవర్తనలో మార్పు రావడంతో ఆశిష్ కూడా పుట్టిన బిడ్డను కూడా పట్టించుకోకుండా ఉర్వికి దూరంగా ఉండటం మొదలుపట్టాడు. ఆ తర్వాత భార్యాభర్తలు విడివిడిగా జీవించడం ప్రారంభించారు. దూరం పెరిగిపోవడంతో కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
పెళ్లంటే అంత ఆశామాశీ వ్యవహారం కాదు. ఇరు కుటుంబాలు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసుకొని తమ అంతస్థుకు తగిన వారిని ఎంచుకుంటారు. ఇద్దరు మనుషులను ఒక్కటి చేసే బంధం రెండు కుటుంబాలను కలిపేలా ఉండేందుకు ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకుంటారు. వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఆ జంటను నిండు నూరేళ్లు కలిసిమెలిసి జీవించాలని దీవిస్తారు. కానీ, ఇటీవలి కాలంలో పెళ్లి అనే మాటకు అర్థాలు మార్చేస్తున్నారు కొందరు. చాలా జంటలు పెళ్లైన కొంత కాలానికే వివిధ కారణాల వల్ల విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తర్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అయితే, విడాకులు తీసుకున్న తన కూతురిని ఆ తల్లిదండ్రులు ఆదరించిన తీరు మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా, అందరి ప్రశంసలు అందుకునేదిగా ఉంది. భర్తతో విడాకులు తీసుకున్న తన కూతుర్ని బ్యాండ్ భాజాలతో తమ ఇంటికి తీసుకువచ్చాడు ఓ తండ్రి. విరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని నిరాలా నగర్‌కు చెందిన అనిల్-సవిత దంపతుల ఏకైక కుమార్తె ఉర్విని, ఆశిష్ రంజన్ అనే వ్యక్తితో 2016లో వివాహం జరిపించారు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఉర్వి ఇంజనీర్, ఆమె భర్త ఆశిష్ కూడా ఇంజనీరే. ఉర్వి ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తున్నారు. వివాహం తర్వాత ఇద్దరూ ఢిల్లీలో నివసిస్తున్నారు. కొంతకాలం వీరి కాపురం సాఫీగానే సాగింది. ఇంతలో, 2019 సంవత్సరంలో వీరికి ఒక కూతురు పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఉర్వికి మరిన్ని కష్టాలు, అవహేళనలు మొదలయ్యాయి. క్రమంగా అత్తమామల ప్రవర్తనలో మార్పు రావడంతో ఆశిష్ పుట్టిన బిడ్డను కూడా పట్టించుకోకుండా ఉర్వికి దూరంగా ఉండటం మొదలుపట్టాడు. ఆ తర్వాత భార్యాభర్తలు విడివిడిగా జీవించసాగారు. దీంతో విసిగిపోయిన ఉర్వీ భర్త నుంచి విడాకులు కోరింది. ఫిబ్రవరి 28న వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఈ విషయంతో ఉర్వి తల్లిండ్రులు ఆమెకు బాసటగా నిలబడ్డారు. పెళ్లి సమయంలో ఎలాగైతే తమ కూతుర్ని అత్త వారింటికి భాజా భజంత్రీలతో పంపించారో.. విడాకులు తీసుకున్న తర్వాత కూడా అలాగే తమ ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు ఆ తండ్రి. తమ కుమార్తెను తిరిగి తీసుకురావడానికి డప్పు వాయిద్యాలతో పెళ్లి ఊరేగింపులా ఉర్వి అత్తమామల ఇంటికి చేరుకున్నారు. అత్తారింటితో వీడ్కోలు చెబుతూ ఘనంగా పుట్టింటికి ఆహ్వానం పలికారు. ప్రస్తుతం ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kishan Bagaria: చదివింది పదో తరగతి.. 26 ఏళ్ళకే 400 కోట్లకు అధిపతి.. ఎలానో తెలుసా..?

పట్టుదల ఉంటే చాలు ఏదైనా సాధ్యమే, చదువు అనేది మనలో సంస్కారాన్ని, క్రమశిక్షణను పెంచడానికి మాత్రమే అని నిరూపించాడు ఓ 26 ఏళ్ల కుర్రాడు. చదివింది పదో తరగతి, అయినా ఐటీ రంగంలో తనదైన శైలిలో రానిస్తున్నారు. ఐటీ రంగంలో రానించాలంటే డిగ్రీ పట్టాలతో పనిలేదని, ప్రతిభ ఉంటే చాలు అని నిరూపించి, ఎవరూ ఊహించని రీతిలో.. ఐటీ రంగంలో దూసుకెళ్తున్నాడు కిషన్ బగారియా అనే 26 ఏళ్ల యువకుడు.

వివరాల్లోకి వెళితే.. అస్సాం రాష్ట్రానికి చెందిన కిషన్ బగారియా పదవ తరగతితో తన చదువుని ఆపేశారు. అయితే తాను ఏడవ తరగతిలో ఉన్నప్పటినుండే అనేక ఆన్లైన్ కోర్సులు నేర్చుకున్నారు. కాగా ఆన్లైన్ కోర్సులు మీద గ్రిప్ సాధించిన కిషన్, మేనేజింగ్ యాప్‌లు అన్నీ ఒకే చోట ఓపెన్ అయ్యేలా టెక్స్ట్ డాట్ కామ్ (Texts.com) అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు.

కాగా కిషన్ రూపొందించిన వెబ్‌సైట్‌, వోర్డ్ ప్రెస్ డాట్ కామ్ (wordpress.com) అధినేత మ్యాట్‌కు నచ్చడంతో కిషన్ వెబ్‌సైట్‌ను ఏకంగా 4 వందల కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. అలానే ఆ విభాగానికి కిషన్‌ని హెడ్‌గా నియమించారు.

Dental Care Tips: బ్రష్ చేసే సమయంలో చాలా మంది ఈ తప్పులు చేస్తారు.. 40 శాతం క్రిములు మీ నోట్లోనే..

దంతాలను సరిగ్గా శుభ్రంగా ఉంచుకుంటే, అవి మీ అందాన్ని పెంచుతాయి. అయితే చాలామంది సమస్య ఏమిటంటే బ్రష్ చేసే సరైన మార్గం తెలియదు. మురికి ప్రధానంగా చిగుళ్ళు, దంతాల మధ్య చిక్కుకుపోతుంది. మురికిని శుభ్రం చేయకపోతే, నోటి లోపల బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం పెరుగుతుంది. దీని కారణంగా దంతాల పై పొర పసుపు రంగులోకి మారుతుంది. నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంది. కనుక ఈ రోజు దంతాలు అందంగా ఆరోగ్యంగా ఉండేలా బ్రష్ చేయడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాం.

అందమైన చిరు నవ్వుకు చిరునామా శుభ్రమైన దంతాలు.. అవును ఆరోగ్యకరమైన శుభ్రమైన దంతాలు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి. దంతాలను శుభ్రంగా ఉంచుకోవడానికి, ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయడం ముఖ్యం. ఉదయం నిద్రలేచిన తర్వాత.. రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్ర పోయే ముందు రోజుకు రెండు సార్లు దంతాలను శుభ్రం చేసుకోవాలి. దంతాలను సరిగ్గా శుభ్రంగా ఉంచుకుంటే, అవి మీ అందాన్ని పెంచుతాయి. అయితే చాలామంది సమస్య ఏమిటంటే బ్రష్ చేసే సరైన మార్గం తెలియదు. మురికి ప్రధానంగా చిగుళ్ళు, దంతాల మధ్య చిక్కుకుపోతుంది. మురికిని శుభ్రం చేయకపోతే, నోటి లోపల బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం పెరుగుతుంది. దీని కారణంగా దంతాల పై పొర పసుపు రంగులోకి మారుతుంది. నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంది. కనుక ఈ రోజు దంతాలు అందంగా ఆరోగ్యంగా ఉండేలా బ్రష్ చేయడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాం.

రెండు నిమిషాల కంటే ఎక్కువ బ్రష్ చేయవద్దు: రోజుకు కనీసం రెండు సార్లు బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలని చాలా పరిశోధనల్లో తేలింది. దీనితో పాటు.. ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌ను ఉపయోగించండి. రెండు నిమిషాలకు మించి బ్రష్ చేయవద్దు.. ఎక్కువ సమయం దంతాలను బ్రష్ చేసి తప్పు చేయవద్దు.

ఇలాంటి బ్రష్ ఉపయోగించండి: దంత ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన బ్రష్‌ను ఉపయోగించడం చాలా ముఖ్యం. బ్రష్ సరిగ్గా లేకుంటే దంతాల నుండి మురికి బయటకు రాదు. హార్డ్ బ్రష్‌ను ఉపయోగిస్తే, అది పళ్ళమీద ఉన్న ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది. అదే విధంగా ఎక్కువ మృదువుగా ఉన్న బ్రష్‌ను ఉపయోగిస్తే కూడా దంతాలు శుభ్రం అవ్వదు. కనుక చాలా మృదువైన లేదా చాలా గట్టి బ్రష్‌ను దంతాలను శుభ్రం చేయడానికి ఉపయోగించవద్దు.

బ్రష్ చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగవద్దు: దంతాలను శుభ్రం చేసుకోవడానికి బ్రష్ చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి. ఇలా చేయడం వల్ల దంతాల బయటి పొర దెబ్బతింటుంది. అంతేకాదు సిగరెట్ లేదా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటే అది దంతాలను కూడా దెబ్బతీస్తుంది.

Gond Katira Benefits: గోండు కటీర గురించి విన్నారా..? ఊహించని ప్రయోజనాలు..! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Gond katira: గోండు కటీర లేదా గోధుమ బంక గురించి ఎప్పుడైనా విన్నారా..? ఇదొక జిగురు లాంటి ఆయుర్వేద ఔషధం. ఇది తెల్లని స్పటిక రూపంలో ఉంటుంది. ఇది నీటిలో కరిగినప్పుడు మెత్తగా ఉబ్బి మృదువుగా మారుతుంది. గోధుమ బంకను నీళ్లలో కలుపుకొని తాగొచ్చు. లేదంటే నిద్రపోయే ముందు వేడి పాలలో వేసుకొని తాగొచ్చు. రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవచ్చు.100 గ్రాముల గోధుమ బంక లో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్లు, సోడియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎలాంటి వాసన, రంగు లేనిది. కాబట్టి, దీన్ని నిమ్మరసం, లేదంటే షరబత్, శీతల పానీయం వంటి వాటితో కలిపి తాగొచ్చు. ఈ గోధుమ బంకలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

గోండు కటీర, లేదా గోధుమ బంకను జీవక్రియను పేగుల ఆరోగ్యానికి, మలబద్ధకం నివారించడానికి ఉపయోగపడుతుంది. మధుమేహం చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. ఎముకల దృఢత్వానికి, శరీరం నుండి టాక్సిన్లను తొలగించటానికి మలబద్ధం నివారణకు గోధుమ బంక సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్లను కలిగించే వైరస్, బ్యాక్టీరియాలతో శరీరం పోరాడేందుకు శక్తినిస్తుంది.

ఆడవారికి గోండు కటిరా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. గర్భిణీలు ఎక్కువగా అలసిపోతూ ఉంటారు. అలాంటి వారికి తక్షణ శక్తిని అందిస్తుంది. పాలిచ్చే తల్లుల్లో కూడా పాల ఉత్పత్తిని ఇది బాగా పెంచుతుంది. తల్లులకు అవసరమైనటువంటి క్యాల్షియన్ని ప్రోటీన్స్‌ని అందిస్తుంది. క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని దృఢంగా చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

ఈ గోండు కటీర చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫర్మేషన్ గుణాలు ముడతలు రాకుండా చర్మానికి మంచి మెరుపునిస్తుంది. స్పాట్ డిటెక్షన్, గాయం నయం అవడానికి కూడా ఉపయోగపడుతుంది.

గోధుమ బంక వల్ల జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగపడుతుంది. జుట్టు బలంగా, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ గోధుమ బంకలో ఎక్కువగా ఉండే క్యాల్షియం ప్రోటీన్స్ కంటెంట్ వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. కొత్త జుట్టు పెరిగేలా చేస్తుంది.

చాలా మంది గోధుమ బంకను బరువు నియంత్రించడానికి రకరకాలుగా వాడుతూ ఉంటారు. గోండు కటిరా వాడడం వల్ల ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో అధిక బరువుని కూడా నియంత్రిస్తుంది అంతేకాకుండా శరీరంలో నుంచి టాక్సీలను తొలగించి, మూత్రనాల శుద్ధికి కూడా ఇది తోడ్పడుతుంది.

TSEAPCET Hall Tickets 2024 -TS EAPCET 2024: టీఎస్ ఎప్‌సెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ ఇలా..!

TSEAPCET Hall Tickets 2024 PRINT TS EAPCET – 2024 HALL TICKET Telangana EAPCET 2024 Hall Tickets Download Hall ticket for TG EAPCET – 2024 TS Engineering, Agriculture and Pharmacy Common Entrance Test 2024 Hall Tickets

TSEAPCET Hall Tickets 2024 Schedule of Exam:

Date & Time of TS EAPCET-2024 Examination
Forenoon (FN) : 09.00 AM to 12.00 Noon
&Afternoon (AN) : 03.00 PM to 06.00 PM
Agriculture & Pharmacy (A&P) 07-05-2024 (FN & AN)
08-05-2024 (FN)
Engineering (E) 09-05-2024 (FN & AN)
10-05-2024 (FN & AN)
11-05-2024 (FN)

తెలంగాణలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఈఏపీసెట్) హాల్టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 7 నుంచి 11వ తేదీ వరకు టీఎస్ ఈఏపీసెట్ పరీక్షలు జరగనుండగా మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,41,548 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగానికి 1,00,260 మంది దరఖాస్తు చేసుకున్నారు. మిగతా అందరూ ఇంజినీరింగు దరఖాస్తు చేశారు.

Steps for downloading TS EAPCET 2024 Hall Tickets:

Enter Registration Number
Enter Qualifying Examination Hall Ticket No
Enter Date of Birth (dd/mm/yyyy)

TS EAPCET 2024 Hall Tickets click here

వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

LPG Cylinder Price Reduced : ప్రతినెలా 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను ప్రకటిస్తాయి చమురు సంస్థలు. దాదాపుగా ప్రతీసారి గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతుంది. కానీ.. వరుసగా రెండోనెల ఎల్ పీజీ సిలిండర్ ధరను తగ్గించాయి చమురు సంస్థలు. ఇందుకు కారణం దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉండటమేనంటున్నారు నిపుణులు. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.19 మేర తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మే 1, బుధవారం ప్రకటించాయి. సవరించిన రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.

తగ్గించిన ధరతో నేటి నుంచి దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్ పీజీ సిలిండర్ ధర రూ. 1745.50 ఉంది. ముంబైలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,74917.50 నుంచి రూ.1,698.50కి తగ్గింది. చెన్నైలో కూడా రూ.19 తగ్గింది.ప్రస్తుత ధర రూ.1,930 నుంచి రూ.1,911కు తగ్గింది. కోల్‌కతాలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ. 1,859గా ఉంది.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు గణనీయంగా తగ్గాయి. గతనెల వాణిజ్య సిలిండర్ ధర రూ.30 మేర తగ్గగా.. ఈ నెల రూ.19 మేర తగ్గింది. మొత్తంగా రూ.49 ధర తగ్గడంతో.. వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో.. ఎల్ పీజీ సిలిండర్ ధర తగ్గుతూ వస్తుంది. యూఎస్ లో ముడి చమురు నిల్వలు పెరగడం, మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ ఒప్పందంపై ఉన్న సందిగ్ధత చమురు ధరల తగ్గుదలకు కారణం కావొచ్చని తెలుస్తోంది.

AP VIDYADHAN Scholarships 2024 Notification, Online Apply

AP VIDYADHAN Scholarships 2024 Notification, Online Apply School Education – Sarojini Damodaran Foundation, Jayanagar, Bangalore – Providing scholarships to students to pursue higher education for economically weak families – Instructions – Issued.

Vidyadhan Scholarship Program from Sarojini Damodaran Foundation supports the college education of meritorious students from economically challenged families. The students are selected after completion of 10th grade /SSLC through a rigorous selection process including test and interview. Currently Vidyadhan program has around 8000 students across the following states: Kerala, Karnataka, Tamil Nadu, Pondicherry, Andhra Pradesh, Gujarat, Maharashtra, Telangana, Goa, Odisha, New Delhi, Ladhak, Bihar, Jarkhand, Punjab, Himachal Pradesh and Uttar Pradesh.

Those selected will be eligible for two year scholarship from the Foundation. If they continue to do well, they will be given scholarship for pursuing any degree course of their interest; these scholarships are directly through the foundation or external sponsors who have registered with the Foundation. The scholarship amount for graduation courses varies from Rs 10,000 to Rs 75,000 per year depending on the state, course, duration etc. The selected students will be required to attend the mentoring programs from the Foundation.

Vidyadhan scholarships is meant for students who passed the 10th class during the year 2024 in the State of Andhra Pradesh. The following are the eligibility criteria to get scholarships:

The annual income should be below 2 lakhs for the family.
Students must pass SSC during the year 2024.
In SSC, students must acquire marks above 90% or 9 CGPA, for Divyang above 75% or 7.5 CGPA.
This scholarship, to complete an Intermediate/Diploma
Students can get Rs 10000/- to 60,000/- based on their eligibility and their option to pursue their higher studies.
Require documents:

i. SSC pass certificate.

ii. Passport-size photo.

iii. Income certificate or ration card.

iv. Personal Email ID.

v. The students can apply through www.vidyadhan.org.

సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ ను శ్రీమతి. కుమారి శిబులాల్ మరియు ఎస్.డి.శిబులాల్ (ఇన్ఫోసిస్ కో ఫౌండర్) 1999 లో స్థాపించారు. ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 6000 * మంది విద్యార్ధులకు ఆర్థిక సహాయం అందించాము. 27,600 స్కాలర్షిప్స్ వితరణ చేయడం జరిగింది..

VIDYADHAN IS A PAN INDIA SCHOLARSHIP PROGRAM ఆర్ధికంగా వెనుకబడిన అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ విద్యాధాన్-2024

పదోతరగతి ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నోటిఫికేషన్ ఇవ్వబడుతుంది.

• కుటుంబ వార్షికాదాయం 2 లక్షల రూపాయలు లోపు ఉండాలి.

• విద్యార్ధులు 2024 విద్య సంవత్సరంలో 10 వ తరగతి లేదా SSC పాస్ అవ్వాలి..

• 10 వ తరగతి లో విద్యార్థులకు – 90% లేదా 9 CGPA; దివ్యాంగులైతే 75% లేదా.

• 7.5 CGPA విద్యార్థి కి మార్క్స్ వచ్చి ఉండాలి. ఈ స్కాలర్షిప్ ఇంటర్మీడియట్/డిప్లొమా పూర్తి చేయుటకు పొందవచ్చును..

• విద్యార్థి ప్రతిభను ఆధారంగా వారు ఎంచుకున్న పై చదువుల నిమిత్తం సుమారు రూ. 10,000/- నుండి రూ. . 60,000/- వరకు పొందగలరు.

అవసరమైన పత్రాలు:

10 వ తరగతి మార్క్ షీట్, పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆదాయ ధృవీకరణ పత్రం లేదా రేషన్ కార్డు, విద్యార్థి వ్యక్తిగత ఇమెయిల్ ఐడి

విద్యార్థులు నేరుగా వెబ్ సైట్ లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మా తరఫున విద్యార్థులను ఎంచుకునే అధికారం మరే ఇతర వ్యక్తికి గాని, సంస్థలకు గాని లేదు

Students can apply free of cost on the website directly. No other person or institutions have been authorized to select students on our behalf.

Andhra Pradesh Intermediate (1st year) Program 2024:

Scholarship Amounts

Scholarship amounts for 11th and 12th grades will be a maximum of Rs. 10,000/- year

Who Can Apply?

Students whose family annual income is less than Rs. 2 Lakhs and who have completed their 10th grade/SSC exam in the year 2024 from Andhra Pradesh. They should also have scored 90% or obtained 9 CGPA in their 10th Grade/SSC examination. The cutoff mark for students with disability is 75%. or 7.5 CGPA

Selection Process

SDF will shortlist the applicants based on their academic performance and the information provided in the application form. The shortlisted candidates will be invited for a short online test/interview. Students can apply free of cost on the website directly. No other person or institution has been authorized to select students on our behalf.

Important Dates:
7th June 2024: Application last date
23rd June 2024: Screening Test
7th July to 20th July 2024: Interview/Tests will be scheduled during this time frame. Exact date and location will be intimated to each of the shortlisted candidates.
Required Documents
Scanned copies of the following are required
10th Marksheet (If original marksheet is not available , you can upload provisional /online marksheet from the SSLC/CBSE/ICSC website.)
Photograph
Income Certificate (from a competent authority; ration card not accepted.)
Contact Details
For any clarifications send an email to vidyadhan.andhra@sdfoundationindia.com or call Vidyadhan Help Desk, Phone: 9663517131.
How To Apply? :
You need to have a personal Email Account to apply online. DO NOT USE THE EMAIL ID of cyber café/DTP centre since all future communications will be sent to the registered email id. If you do not have an email ID, please create a new account in www.gmail.com or with any other email service providers. Please memorize the email login and password for future use.
While registering a new account you will be asked for details like:
First Name: Please mention your first name as per your educational records.
Last Name: Please mention your last name as per your educational records.
Email ID: Please mention your email address and do not forget to regularly check this email account for our intimation. For future login, use the email id.
Vidyadhan Password: Please choose a complex password for the user name you have created above. The Password should have at least 8 characters. This password is not same as the password you have created for the email id. When you log into the vidyadhan application next time, you have to use the email id and the vidyadhan password you have created. Please remember it; do not write it anywhere for security reasons. If you forget the password then you can retrieve it by clicking “Forgot Password” link in the Home Page.
Click on “Apply Now ” button. An email will be sent to your email account with account activation link.
Please open your email in a new window and open the account activation email. Click on the activation link provided in that email. This will open the home page with a message that Account is activated and a login form to proceed further.
Please login with the email id and the vidyadhan password that you have entered in Step 2 above while registering a new account.
After you login you can see a link “Help” on the main menu. You can click on that link to read help and instructions for creating an application, updating and tracking it.
Please select the appropriate scholarship program from the list available programs and click on the ‘Apply Now’ button to create your application.
After creating the application you can edit it and make changes by clicking on Edit Application on top of the application.
After you complete the application and submit, you will get a message “submission successful”. However please note that the application will be considered complete only after you upload the mandatory documents and photograph.
Please check your email regularly for communication and updates from SDF.

Apply Online Website Link click here

Download AP VIDYADHAN Scholarships Notification

AP POLYCET Key 2024 AP POLYCET 2024 Official Answer Key Download

AP POLYCET Key 2024 AP POLYCET 2024 Official Answer Key Download

AP POLYCET Key 2024 Key released and Tentative date of declaration of results: 13-05-2024
The Common Entrance test i.e., POLYCET-2024 for admission into various Govt./Aided/Private/II shift Polytechnics in the state of Andhra Pradesh conducted on 27.04.2024 (SATURDAY). The final key of POLYCET-2024 has been placed on http://sbtetap.gov.in portal

పాలిసెట్ 2024 ప్రశ్న పత్రం యొక్క ప్రాధమిక “కీ“ ని రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి ద్వారా మంగళవారం విడుదల చేసినట్లు సాంకేతిక విద్య శాఖ కమిషనర్ చదలవాడ నాగారాణి తెలిపారు.

ప్రాధమిక “కీ” https://apsbtet.ap.gov.in వెబ్ సైట్ నందు అందుబాటులో ఉందన్నారు. “కీ” లో ఆభ్యంతరాలు ఉంటే వారు తమ అభ్యంతరాల్ని asexams.apsbtet@gmail.com కు మే 4వ తేదీ లోపు పంపవచ్చన్నారు. ఫైనల్ “కీ” మే 5వ తేదీన https://apsbtet.ap.gov.in వెబ్ సైట్లో అందుబాటులో ఉంచబడుతుందని కమిషనర్ ప్రకటించారు.

ఫలితాల ప్రక్రియను వేగవంతం చేసి మే 10 వ తేదీ లోపు ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తామని నాగ రాణి వివరించారు.

The Common Entrance test i.e., POLYCET-2024 for admission into various Govt./Aided/Private/II shift Polytechnics in the state of Andhra Pradesh conducted on 27-04-2024 (SATURDAY). The preliminary key of POLYCET-2024 has been placed on https://apsbtet.ap.gov.in portal. Any objections regarding key may please be informed through e-mail to asexams.apsbtet@gmail.com on or before 04/05/2024.The final Key will be placed on 05-05-2024

AP POLYCET 2024 Key click here

MRP అంటే ఏమిటి? అంతకుమించిన ధర అడిగితే ఏం చేయాలి? చట్టం ఏం చెబుతోంది.. పూర్తి వివరాలు ఇవి..

మార్కెట్లో మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన ధర ముందే నిర్ణయించి ఉంటుంది. దానినే మాగ్జిమమ్‌ రిటైల్‌ ప్రైస్‌(ఎంఆర్‌పీ) అని అంటారు. విక్రేత ఎవరైనా అంతకుమించిన ధరతో వస్తువులు విక్రయించకూడదు. అవసరమైతే ఆ ధర కన్నా తక్కువకు డిస్కౌంట్‌ ఇచ్చి విక్రయించుకోవచ్చు గానీ.. అంతకుమించి చేయకూడదు. ఇది కచ్చితమైన నిబంధన. అయితే ఇటీవల కాలంలో అసలు ఈ ఎంఆర్‌పీని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ ప్రతి ఒక్కరికీ దీనిపై కనీస అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. అసలు ఎంఆర్‌పీ అంటే ఏమిటి? దానిని ఎవరు నిర్ణయిస్తారు? ఎవరైనా వ్యాపారి ఈ ఎంఆర్‌పీ కన్నా ఎక్కువకు విక్రయిస్తే ఏం చేయాలి? ఫిర్యాదులు చేయాలంటే ఎక్కడ చేయాలి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎంఆర్‌పీ అంటే..
మ్యాగ్జిమమ్‌ రిటైల్‌ ప్రైస్‌(ఎంఆర్‌పీ) అనేది ఆ ఉత్పత్తి లేబుల్‌ లేదా ప్యాకేజింగ్‌పై ముద్రించి ఉంటుంది. ఎంఆర్‌పీలో ఉత్పత్తి ఖర్చులు, మార్కెటింగ్‌ ఖర్చులు, ట్రాన్స్‌పోర్టు ఖర‍్చులు, ఉత్పత్తిదారులు, విక్రేతల లాభాల మార్జిన్‌ కలిపి ఉంటుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఆ ఉత్పత్తి తయారీదారుడు లేదా విక్రేతలు ఎంఆర్‌పీ ధరలను నిర్ణయిస్తారు. ఇది ఆ ఉత్పత్తిపై వినియోగదారు నుంచి రిటైలర్‌ చట్టబద్ధంగా వసూలు చేయగల అత్యధిక మొత్తాన్ని ఈ ఎంఆర్‌పీ సూచిస్తుంది.

ఎంఆర్‌పీ అవసరమా?
ఎంఆర్‌పీ అనేది అధిక ధరలను వసూలు చేసే రిటైలర్ల నుంచి కస్టమర్ అయిన మీకు రక్షణ కల్పిస్తుంది. ఇది గందరగోళం, దోపిడీని నివారించడానికి బెంచ్‌మార్క్ ధరను ఏర్పాటు చేస్తుంది.

చట్టం ఏం చెబుతోంది..
మన దేశంలో 2009 లీగల్ మెట్రాలజీ చట్టం ప్యాక్ చేసి ఉన్న వస్తువుల విక్రయాన్ని నియంత్రిస్తుంది. దీని ప్రకారం ఉత్పత్తి లేబుల్‌లు లేదా ప్యాకేజింగ్‌పై ఎంఆర్‌పీని స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఆ లేబుల్‌పై ఎంఆర్‌పీ కన్నా ఎక్కువకు ఉత్పత్తులను విక్రయిస్తే చట్టరీత్యా నేరం అవుతుంది. దీనికి జరిమానాలతో పాటు ఇతర చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్రతి ప్యాక్‌పై వస్తువు నికర పరిమాణం, ఎంఆర్‌పీ, తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది.

ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు విక్రయిస్తే..
దుకాణదారుడు ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులను విక్రయిస్తే వినియోగదారులు దుకాణం నిర్వహించే సంబంధిత రాష్ట్రంలోని లీగల్ మెట్రాలజీ విభాగానికి ఫిర్యాదు చేయొచ్చు.
వినియోగదారులు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌ని 1800-11-4000/ 1915లో సంప్రదించవచ్చు లేదా వారి సంబంధిత జిల్లాల్లోని వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
8800001915కు ఎస్‌ఎంఎస్‌ చేయవచ్చు. ఎన్‌సీహెచ్‌ యాప్‌, ఉమాంగ్‌ యాప్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేయొచ్చు.వినియోగదారులు ఈ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదును కూడా ఫైల్ చేయవచ్చు.
ఫిర్యాదు చేయడానికి వన్-టైమ్ రిజిస్ట్రేషన్ అవసరం. రిజిస్ట్రేషన్ కోసం వెబ్ పోర్టల్ కి వెళ్లి లాగిన్ లింక్‌పై క్లిక్ చేసి, ఆపై అవసరమైన వివరాలను తెలియజేస్తూ సైన్ అప్ చేయండి, మీ ఈ-మెయిల్ ద్వారా ధ్రువీకరించండి. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ సృష్టించుకోవాల్సి ఉంటుంది.
నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ ద్వారా వినియోగదారులు సంతృప్తికర సమాధానం రాకపోతే అప్పుడు వినియోగదారుల కమిషన్‌ వద్ద అప్పీలుకు వెళ్లవచ్చు. అందుకోసం ఎన్‌సీఆర్‌డీసీ వెబ్‌ సైట్లోకి వెళ్లాలి. దానిలో రాష్ట్ర కమిషన్, జిల్లా కమిషన్ ఆప్షన్లు ఉంటాయి. వీటిల్లో ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారణ అయితే దుకాణదారునికి జరిమానా విధించబడవచ్చు. వినియోగదారుడు అధికంగా వసూలు చేసిన మొత్తానికి పరిహారం పొందేందుకు అర్హులు.
ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఎంఆర్‌పీ అనే ఏదైనా ఉత్పత్తిపై గరిష్ట ధర. అంతేకాని అది ఫిక్స్‌డ్‌ ధర కాదు. రిటైలర్లు వినియోగదారులను ఆకర్షించడానికి డిస్కౌంట్లు లేదా ప్రమోషన్లను అందించవచ్చు. అలాంటి సమయంలో ఎంఆర్‌పీ కన్నా తక్కువగా విక్రయాలు జరుగుతాయి.

మే 1 నుంచి కీలక మార్పులు.. మీ జేబుపై ప్రభావం ఉంటుందా? కొత్త నిబంధనలు

కొత్త సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచాయి. అయితే ఏప్రిల్ 30న ముగిసిన ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇది మొదటి నెల. సామాన్య ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అనేక నిబంధనలలో మే 1 నుంచి కొన్ని అంశాలలో నిబంధనలు మారనున్నాయి. ఈరోజు నుండి ఐసిఐసిఐ బ్యాంక్ పొదుపు ఖాతాలపై ఛార్జీలలో ఎల్‌పిజి సిలిండర్ ధరలో అనేక మార్పులు కనిపిస్తాయి. ఈ నెలలో డబ్బు సంబంధిత నియమాలలో ఎలాంటి మార్పులు చూడవచ్చో తెలుసుకుందాం.

యెస్ బ్యాంక్ కీలక నిర్ణయం

యెస్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, వివిధ రకాల పొదుపు ఖాతాల కనీస సగటు బ్యాలెన్స్‌లో మార్పులు జరిగాయి. ఇప్పుడు యెస్ బ్యాంక్ ప్రో మాక్స్ సేవింగ్స్ ఖాతాల కనీస సగటు బ్యాలెన్స్ రూ.50,000కి మార్చింది. గరిష్ట ఛార్జీ రూ.1000కి మార్చబడింది. ప్రో ప్లస్, యస్ రెస్పెక్ట్ ఎస్‌ఏ, యెస్ ఎసెన్స్ ఎస్‌ఏ ఖాతాల కోసం, కనీస సగటు బ్యాలెన్స్ పరిమితి రూ.25,000, గరిష్ట ఛార్జీ రూ.750. ఖాతా ప్రోలో కనీస నిల్వ రూ.10,000, దానిలో గరిష్ట ఛార్జీ రూ. 750.

మీ జేబులపై ప్రభావం

ఐసీఐసీఐ బ్యాంక్ కూడా సేవింగ్ కార్డులకు సంబంధించిన నిబంధనలను మార్చబోతోంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు డెబిట్ కార్డు కోసం రూ.99, పట్టణ ప్రాంతాల్లో రూ.200 వార్షిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు, 25 పేజీల చెక్ బుక్‌లకు ఎటువంటి రుసుము వసూలు చేయకూడదని బ్యాంక్ నిర్ణయించింది. అయితే ఆ తర్వాత చెక్ బుక్‌లోని ప్రతి పేజీకి రూ.4 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి లావాదేవీకి IMPS లావాదేవీ మొత్తం రూ. 2.50 నుండి రూ. 15 వరకు నిర్ణయించింది.

ప్రత్యేక ఎఫ్‌డీ చివరి తేదీ గురించి..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో చేరాలంటే మే 10 వరకు చేరవచ్చు. ఈ పథకంలో సీనియర్ సిటిజన్‌లకు 0.75% అదనపు వడ్డీ రేటు అందుబాటులో ఉంది. దీని ద్వారా వారు 5 నుండి 10 సంవత్సరాల ఎఫ్‌డీ పథకంపై 7.75% వడ్డీ రేటు ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు రూ. 5 కోట్ల వరకు డిపాజిట్ చేయవచ్చు.

ప్రతి నెలా ఒకటవ తేదీన, చమురు కంపెనీలు గృహ, వాణిజ్య ఎల్‌ఫీజీ గ్యాస్ సిలిండర్ల ధరలలో మార్పులు వస్తాయన్న విషయం అందరికి తెలిసిందే.ద అందుకే మే మొదటి తేదీన గ్యాస్ ధరలలో మార్పు జరిగాయి. డోమెస్టిక్‌ సిలిండర్‌ ధరపై రూ.19 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం.

ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. జీతాలు మళ్లీ పెరిగే చాన్స్!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్ డేట్ వచ్చింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన కీలక అంశం ఇది. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన వచ్చింది. ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్ వైజర్స్ అసోసియేషన్(ఐఆర్టీఎస్ఏ) ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) ఆధ్వర్యంలోని పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖకు ఈ ప్రతిపాదనను ఓ లేఖ ద్వారా తెలియజేసింది. దానిలో కొత్త సీపీసీ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించింది. కొత్త సీపీసీకి ఇదే సరైన సమయమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అసలు వేతన సంఘం అంటే ఏమిటి? అది ఎందుకు ఏర్పాటవుతుంది? ఎలా పనిచేస్తుంది? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

వేతన సంఘం(పే కమిషన్) అంటే..
వేతనం సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల స్ట్రక్చర్ ఎలా ఉంది? దానిలో చేయాల్సిన మార్పులు చేర్పులు ఏంటి? ఒకవేళ జీతాలు పెంచాలా? వంటి కీలక అంశాలు దీని ప్రతిపాదనల ద్వారానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సాధారణంగా, జీతం, అలవెన్సులు మరియు ఇతర సౌకర్యాలు/ప్రయోజనాలు/ సహా వేతనాల నిర్మాణాన్ని నియంత్రించే సూత్రాలను పరిశీలించడానికి, సమీక్షించడానికి, అభివృద్ధి చేయడానికి, మార్పులను సిఫార్సు చేయడానికి పది సంవత్సరాల వ్యవధిలో ఈ కేంద్ర పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. 3వ, 4వ, 5వ వేతన కమీషన్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, సర్వీస్ షరతుల కాలానుగుణ సమీక్ష కోసం శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశాయి.

8వ పే కమీషన్ – ఐఆర్టీఎస్ఏ డిమాండ్లు ఇవి..
ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్ వైజర్స్ అసోసియేషన్(ఐఆర్టీఎస్ఏ) నుంచి వచ్చిన లేఖలో అనేక కీలకమైన డిమాండ్‌లు ఉన్నాయి. మొదటి డిమాండ్ కొత్త కేంద్ర వేతన సంఘం ఏర్పాటు చేసి వివిధ వర్గాల ఉద్యోగుల జీతాలలో ఉన్న అసమానతలు, క్రమరాహిత్యాలను సరిదిద్దాలని కోరింది. అంతేకాకుండా, వేతనాలు అలవెన్సులు, పని పరిస్థితులు, ప్రమోషనల్ మార్గాలు, పోస్ట్ వర్గీకరణలకు సంబంధించి ఇప్పటికే ఉన్న అన్ని క్రమరాహిత్యాలను క్లియర్ చేయడానికి పే కమిషన్‌కు తగినంత సమయం కేటాయించాలని అసోసియేషన్ కోరుతోంది. ప్రస్తుతం ఉన్న అన్ని అవకతవకలను క్లియర్ చేయడానికి మరియు భవిష్యత్తులో అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా సమగ్ర సిఫార్సులు ఇవ్వడానికి తగిన సమయం ఉండేలా 8వ కేంద్ర వేతన సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ 8 వ వేతన సంఘం ఏర్పాటు జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు, జీతాల సవరణపై ప్రభావం చూపుతుంది.

Realme P1 5G Sale: రియల్‌మీ బడ్జెట్ 5జీ ఫోన్ సేల్ షురూ – రూ.15 వేలలోపే!

Realme P1 5G Flipkart Sale: రియల్‌మీ పీ1 5జీ (Realme P1 5G) స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. రియల్‌మీ పీ1 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌పై రన్ కానుంది. 45W సూపర్‌వూక్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని రియల్‌మీ పీ1 5జీలో అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై బేస్ అయిన రియల్‌మీ యూఐ 5.0 పని చేస్తుంది.

రియల్‌మీ పీ1 5జీ ధర ఎంత? (Realme P1 5G Price in India)
రియల్‌మీ పీ1 5జీ రెండు వేరియంట్లలో మనదేశంలో అందుబాటులోకి వచ్చింది. ప్రారంభ వేరియంట్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించారు. హై ఎండ్ వేరియంట్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. పీకాక్ గ్రీన్, ఫీనిక్స్ రెడ్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
రియల్‌మీ పీ1 5జీ స్పెసిఫికేషన్లు (Realme P1 5G Specifications)
రియల్‌మీ పీ1 5జీలో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేని కంపెనీ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. రెయిన్ వాటర్ టచ్ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో అందించారు. అంటే తడి చేతులతో కూడా ఫోన్‌ను ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉపయోగించవచ్చన్న మాట. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌పై రియల్‌మీ పీ1 పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే… ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. ఈ రెండిట్లో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌ కూడా ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.

ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ పీ1 5జీ రన్ కానుంది. రెండు జనరేషన్ల ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లు అందించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించాడు. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఐపీ54 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు.

Health

సినిమా