Realme P1 5G Sale: రియల్‌మీ బడ్జెట్ 5జీ ఫోన్ సేల్ షురూ – రూ.15 వేలలోపే!

Realme P1 5G Flipkart Sale: రియల్‌మీ పీ1 5జీ (Realme P1 5G) స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. రియల్‌మీ పీ1 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌పై రన్ కానుంది. 45W సూపర్‌వూక్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని రియల్‌మీ పీ1 5జీలో అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై బేస్ అయిన రియల్‌మీ యూఐ 5.0 పని చేస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

రియల్‌మీ పీ1 5జీ ధర ఎంత? (Realme P1 5G Price in India)
రియల్‌మీ పీ1 5జీ రెండు వేరియంట్లలో మనదేశంలో అందుబాటులోకి వచ్చింది. ప్రారంభ వేరియంట్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించారు. హై ఎండ్ వేరియంట్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. పీకాక్ గ్రీన్, ఫీనిక్స్ రెడ్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
రియల్‌మీ పీ1 5జీ స్పెసిఫికేషన్లు (Realme P1 5G Specifications)
రియల్‌మీ పీ1 5జీలో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేని కంపెనీ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. రెయిన్ వాటర్ టచ్ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో అందించారు. అంటే తడి చేతులతో కూడా ఫోన్‌ను ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉపయోగించవచ్చన్న మాట. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌పై రియల్‌మీ పీ1 పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే… ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. ఈ రెండిట్లో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌ కూడా ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.

Related News

ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ పీ1 5జీ రన్ కానుంది. రెండు జనరేషన్ల ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లు అందించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించాడు. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఐపీ54 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *