IPLలో అట్టర్ ఫ్లాప్.. అయినా వరల్డ్ కప్ టీమ్​కు వైస్ కెప్టెన్.. హార్దిక్​పై నమ్మకానికి కారణాలివే!

టీ20 వరల్డ్‌ కప్ జట్టు ప్రకటన గురించి క్రికెట్ అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. టీమిండియా అనే కాదు ఇతర జట్ల విషయంలోనూ అందరిలోనూ ఎగ్జయిట్​మెంట్ నెలకొంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

అయితే భారత జట్టు ఎంపిక మాత్రం ఇతర టీమ్స్ కంటే ఇంకా ఎక్కువ అటెన్షన్ తీసుకుంది. దీనికి కారణం ప్రస్తుత క్రికెట్​లోని టాప్ స్టార్స్​లో ఎక్కువ మంది టీమిండియాలో ఉండటమే. నిన్నటి నుంచి వరల్డ్ కప్ స్క్వాడ్స్ ప్రకటన మొదలైంది. తొలుత న్యూజిలాండ్, ఆ తర్వాత సౌతాఫ్రికా, అనంతరం ఇంగ్లండ్ తమ ప్రపంచ కప్ జట్లను ప్రకటించాయి. పొట్టి కప్పులో ఆడే భారత జట్టు ఏదో కూడా ఇవాళ క్లారిటీ వచ్చేసింది. బీసీసీఐ టీ20 వరల్డ్ కప్ టీమ్​ను అనౌన్స్ చేసింది. అయితే ఆ జట్టుకు హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్ చేయడంతో అందరూ షాకయ్యారు.

భారత వరల్డ్ కప్ జట్టులో మిగతా వాళ్ల సెలెక్షన్ ఎలా ఉన్నా హార్దిక్ వైస్ కెప్టెన్సీ అంశమే ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది. చెత్తాటతో విమర్శల పాలవుతున్న అతడు.. ప్రపంచ కప్ జట్టులో ఉంటాడా? లేదా? కూడా అనుమానంగా మారింది. ఈ ఐపీఎల్​లో హార్దిక్ 9 మ్యాచుల్లో 197 రన్స్ చేసి 4 వికెట్లే తీశాడు. దీంతో అతడు అక్కర్లేదు.. ఆ ప్లేసులో ఇతర యంగ్​స్టర్స్​కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో టీమ్ అనౌన్స్​ చేసిన బీసీసీఐ.. పాండ్యాను జట్టులోకి తీసుకుంది. అతడికి బెర్త్ ఇవ్వడమే గాక ఏకంగా వైస్ కెప్టెన్​గానూ ప్రమోషన్ ఇచ్చింది. దీంతో బోర్డు ఎందుకిలా చేసింది? బీసీసీఐ పెద్దలకు అసలు ఏమైంది? ఏం చూసి హార్దిక్​కు ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు? టీమ్​లో చోటు ఇవ్వడమే గొప్ప అంటే ఇంకా వైస్ కెప్టెన్సీ కూడానా? అంటూ విమర్శకులు విరుచుకుపడుతున్నారు. అయితే నిశితంగా గమనిస్తే హార్దిక్ మీద బోర్డు నమ్మకం ఉంచడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి.

Related News

గత కొన్నేళ్లుగా టీమ్​లో హార్దిక్ రెగ్యులర్ ప్లేయర్ అనేది తెలిసిందే. గాయాలతో దూరమైనప్పుడు తప్పితే ప్రతి సిరీస్​లోనూ అతడు టీమ్​లో భాగంగా ఉన్నాడు. సింగిల్ హ్యాండ్​తో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్​లో హ్యూజ్ ఎక్స్​పీరియెన్స్ ఉండటం అతడికి ప్లస్ అయింది. ఒత్తిడిలోనూ ఎలా ఆడాలో పాండ్యాకు తెలిసి ఉండటం కలిసొచ్చింది. గతంలో ప్రెజర్ సిచ్యువేషన్స్​లో నుంచి టీమ్​ను ఒడ్డున పడేసిన ట్రాక్ రికార్డు ఉండటం సెలెక్టర్లకు మరింత భరోసాను ఇచ్చింది. రోహిత్​ వారసుడిగా ఫ్యూచర్ టీ20 టీమ్ కెప్టెన్​గా ముందు నుంచి అతడ్ని ప్రిపేర్ చేశారు. అందుకే ఐపీఎల్​లో ఫెయిలైనా హార్దిక్​పై నమ్మకం ఉంచి ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పించారు. పాండ్యా మీద కోచ్ ద్రవిడ్, బీసీసీఐ పెద్దలకు ఉన్న గురి కారణంగా అతడికి వైస్ కెప్టెన్సీ పోస్ట్ దక్కింది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *