Friday, November 15, 2024

అమ్మాయిల షర్ట్ బటన్స్ ఎడమ వైపు, అబ్బాయిల షర్ట్ బటన్స్ కుడివైపు ఎందుకు ఉంటాయో తెలుసా?

మనం రోజూ వాడే వస్తువుల్లో కొన్ని తేడాలు గుర్తించం. కానీ మనం రోజూ వేసుకునే దుస్తులను గమనిస్తే ఒక డౌట్ తప్పకుండా వస్తుంది. అది ఏమిటంటే? ఎప్పుడైనా అమ్మాయిల షర్ట్స్, అబ్బాయిల షర్ట్స్ గమనిస్తే, మహిళలకు షర్ట్ బటన్స్ ఎడమ వైపు, పురుషుల షర్ట్ బటన్స్ కుడి వైపు ఉంటాయి. అసలు ఇలా ఎందుకు ఉంటుంది. దీని వెనుక గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వం యూరోపియన్ మహిళలు దుస్తులు ధరించిన విధానాన్ని అనుసరించి ఇలా గుండీలు ఉండే విధానంలో మార్పులు వచ్చాయని తెలుస్తోంది.అయితే అప్పట్లో శ్రీమంతులు ఎక్కువగా బటన్స్ ఉండే దుస్తులను వేసుకునే వారంట. ఇక వారి బట్టలను పని వారే దొడిగే వారంట.వారికి బటన్స్ పెట్టాలంటే సేవకులకు అనుగుణంగా ఉండేలా ఆడవారు ధరించే షర్టులకు ఎడమ వైపుకు అమర్చేవాళ్లట.అలా మహిళల షర్ట్‌కు ఎడమవైపు బటన్స్ అమర్చేవారంట.ఇదే కాకుండా చాలామంది మహిళలు తమ బిడ్డకు పాలు ఇచ్చేందుకు బిడ్డను ఎడమచేతిలో పట్టుకుని ఇస్తారని..అందుకని ఆడవాళ్ల షర్టు బటన్స్ ఎడమవైపు ఉండేలా ఏర్పాటు చేసి ఉంటారని చెబుతున్నారు.
అలాగే అప్పట్లో మగవారు ఎక్కువగా సైన్యంలో పనిచేసేవారు. సైనికులు ఎక్కువగా ఆయుధాలను కుడి చేతితో వాడుతారు కాబట్టి దుస్తులకు బటన్లు కుడి వైపున నిర్మించడం వల్ల ఎడమ చేతితో అన్బటన్ చేయడం వంటివి సులభంగా చేయవచ్చు. అలా మగవారికి కుడివైపున బటన్స్ ఏర్పాటయ్యాయంటారు.

ఈ చెట్టు కలప కిలో రూ. 7 లక్షలట.. ఇక మొత్తం చెట్టునే అమ్మితే…

ఎర్రచందనం చాలా ఖరీదైన కలప అని మనకు తెలుసు. అమ్మితే లక్షల్లోనే వస్తుంది. అంతకంటే ఖరీదైన కలప గురించి మీకు తెలుసా..? ఆ చెట్టు కలప కిలో 7లక్షలు. ఇక చెట్టు అమ్మితే వచ్చే డబ్బుతో లైఫ్‌ సెట్‌ అయిపోతుంది. ఈ చెట్టు పేరు ఆఫ్రికన్ బ్లాక్‌ వుడ్‌ చెట్టు.

ఈ చెట్టుల ఎక్కువగా ఆఫ్రికన్ కంట్రీలోని పొడిగా ఉండే ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ చెట్టు ఒక కేజీ చెక్క ధర 7 లక్షలు ఉంటుంది. అరుదుగా లభించే ఈ కలపనిచ్చే చెట్టు సుమారు 1 క్వింటా బరువు ఉంటుంది. ఈ కోణంలో చూస్తే ఒక్క చెట్టు ధర 7 కోట్లకు పైనే ఉంటుంది. షెహనాయ్, ఫ్లూట్, గిటార్ వంటి సంగీత వాయిద్యాలను తయారు చేయడానికి ఈ కలపను ఉపయోగిస్తారు. అంతే కాదు ఈ చెక్కను ఫర్నీచర్ తయారీకి కూడా ఉపయోగిస్తారు. అయితే దీనితో తయారైన ఫర్నీచర్ ఖరీదు ఎక్కువ కాబట్టి బాగా సౌండ్ పార్టీసే వాడుతుంటారు.

గంధపు చెక్కల మాదిరిగానే ఇది కూడా అరుదుగా ఉండటంతో విపరీతంగా రవాణా అవుతుంది. చెట్లు భారీ వృక్షాలుగా ఎదగక ముందే స్మగ్లర్లు నరికివేస్తున్నారు. ఈ చెట్టు పూర్తిగా ఎదగడానికి 60 సంవత్సరాలు పడుతుంది. అంతకుముందే స్మగ్లర్లు దానిని నరికి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇలా వేగంగా చెట్లను నరికివేయడం వల్ల వాటి సంఖ్య తగ్గి వాటి విలువ మరింత పెరుగుతుంది.

ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్‌ను రక్షించడానికి టాంజానియా వంటి దేశాలలో సాయుధ బలగాలు కూడా ఉంటాయట.. వారి భద్రతపై ఖర్చు కూడా పెద్ద మొత్తంలోనే ఉంటుంది. దీని కారణంగా ప్రజలు వాటిని పెంచడం మానేస్తున్నారు. ఈ చెట్లు చాలా అరుదుగా పెరుగాయి. అయితే మనకు ఇంట్రస్ట్‌ ఉంటే ఇవి మన దేశంలో కూడా పెంచుకోవచ్చు. దీనిని భారతదేశంలో నార్త్ ఇండియన్ రోజ్‌వుడ్ అని పిలుస్తారు. అయినప్పటికీ, ప్రజలు దానిని పెంచడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ చెట్లను వృక్షాలుగా మారేవరకు వాటి సంరక్షణకు పెట్టే ఖర్చు భరించగలగడం కష్టం.

chanakya niti : జీవితంలో విజయం కావాలంటే.. ఈ విషయం మరచిపోవద్దు..!

ఆచార్య చాణక్య చెప్పినట్లు మనం చేస్తే జీవితంలో ఎలాంటి కష్టమైనా కూడా తొలగిపోతుంది. చాణక్య చెప్పినట్లు చేస్తే జీవితంలో ఎలాంటి సమస్య అయినా కూడా మనం పరిష్కరించుకోవచ్చు. చాణక్య అనేక సమస్యలకి పరిష్కారాన్ని చూపించారు. చాణక్య లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది కూడా వివరించారు. మరి మనం లైఫ్ లో సక్సెస్ ని అందుకోవాలంటే కచ్చితంగా పాటించాల్సిన విషయాలు గురించి గుర్తుపెట్టుకుని ఆచరించాల్సినవి తెలుసుకుందాం.

చాణక్య చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ ని అందుకోవచ్చు. విజయం మనదే అవుతుంది మన జీవితంలో ఎన్నో కలలు కంటూ ఉంటాం విజయాన్ని పొందడం అంత తేలికమైనది కాదు. విజయాన్ని అందుకోవాలంటే దానికి తగ్గట్టుగా మనం కష్టపడాలి. కష్టపడితే తప్ప సక్సెస్ రాదు చాలామంది సక్సెస్ అందుకునేటప్పుడు దానికి తగ్గట్టుగా కష్టపడడం మానేస్తారు. దానితో సక్సెస్ ని చేరుకోలేకపోతుంటారు.

ఎప్పుడైనా సరే ఏదైనా చేరుకోవాలని అనుకుంటే లక్ష్యం లేకుండా దానిని మీరు చేరుకోలేరు కాబట్టి ఒక లక్ష్యాన్ని మొదట నిర్ణయించుకోండి. దాని కోసం పని చేయండి. అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం అలవాటు చేసుకోకండి. రుణాలు తీసుకోవడానికి లేదా ఆర్థిక పరిస్థితిని నాశనం చేయడానికి దారి తీస్తుంది ఎప్పుడూ కూడా అనుకూలతను అభివృద్ధి చేసుకోవాలి అతిగా ఆలోచనలు కోరికలు కలలు ఉండకూడదు. పెట్టుకున్న లక్ష్యం కోసం కష్టపడుతూ మీరు పని చేస్తున్నట్లయితే కచ్చితంగా సక్సెస్ ని అందుకోగలరు. బాధలేమి ఉండవు. హాయిగా మీరు అనుకున్నది పూర్తి చేయగలరు.

పిల్లల చదువులపై పొదుపు చేయాలా..? బెస్ట్‌ ఆప్షన్స్‌ ఇవే..!

పిల్లల చదువులు ఈరోజుల్లో చాలా ఖరీదు అయిపోయాయి. ఎల్‌కేజీ, యూకేజీలకు వేలకు వేలకు తీసుకుంటున్నారు. మనం ఇంకా హైలెవల్‌ మోడ్రన్‌ స్కూల్‌లో జాయిన్ చేపిస్తే లక్ష పట్టుకోవాల్సిందే. ఇలాంటి తరుణంలో పిల్లల ఉన్నత చదువులపై ముందు నుంచే పొదుపు చేయాలి. ఇందుకు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) చేయడం బెస్ట్ ఆప్షన్. హోమ్‌లోన్‌ లేదా ఇతర బాధ్యతలు ఉన్నా సరే, సరైన ప్రణాళికతో పిల్లల ఉన్నత విద్య కోసం ప్రత్యేకంగా సిప్‌ చేయడం కష్టమేమీ కాదు. ఈరోజు మనం ఈ అంశంపై మరింత క్లుప్తంగా తెలుసుకుందాం.

పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, ఆర్థిక లక్ష్యాలను అంచనా వేయాలి. బిడ్డకు ప్రస్తుతం ఐదు సంవత్సరాలు అనుకుంటే, దాదాపు 13 సంవత్సరాలలో కళాశాల విద్య ప్రారంభమవుతుంది. ఏటా సుమారు 10% రేటుతో పెరుగుతున్న ఉన్నత విద్య ఖర్చును కవర్ చేయడానికి, అప్పటికి దాదాపు రూ.70 లక్షలు కావాల్సి ఉంటుంది.

లక్ష్యాల దీర్ఘకాలిక స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ మనకు బెస్ట్‌ ఆప్షన్‌గా కనిపిస్తున్నాయి. ఈ ఫండ్స్‌ అధిక వృద్ధి, రిటర్న్స్‌ అందిస్తాయి. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు సాధించడానికి ఈక్విటీ ఫండ్స్‌ సరిపోతాయి. హోమ్ లోన్ EMI వంటి ఆర్థిక బాధ్యతలు కొనసాగుతున్నప్పటికీ, భవిష్యత్తు ఖర్చులపై ద్రవ్యోల్బణం ప్రభావం ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించడం చాలా ముఖ్యం.

పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించడానికి, కొన్ని ఫ్లెక్సీ క్యాప్ ఈక్విటీ ఫండ్స్‌లో SIP చేయవచ్చు. పోర్ట్‌ఫోలియోకు డైవర్సిటీ అందిస్తూ.. వివిధ రంగాలు, కంపెనీలలో పెట్టుబడులు పెడుతుంది. డైవర్సిఫికేషన్‌ వల్ల నష్టాల భయం తగ్గుతుంది. ఆర్థిక లక్ష్యాలను సాధించే అవకాశాలను పెంచుతుంది. ఉదాహరణకు పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, PGIM ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వంటి వాటిని పరిశీలించండి.

13 సంవత్సరాలలో పిల్లల విద్య కోసం రూ.70 లక్షలు సంపాదించడం ఆర్థిక లక్ష్యం. దీన్ని సాధించేందుకు సెలక్టెడ్‌ ఫండ్స్‌లో నెలవారీ రూ.18,000 సిప్‌ చేయాలి. 12% యావరేజ్‌ యాన్యువల్‌ రిటర్న్స్‌ అందితే.. పెట్టుబడి మొత్తం పిల్లల భవిష్యత్తు విద్యా అవసరాలకు భద్రత కల్పిస్తూ కావలసిన కార్పస్‌ను అందిస్తుంది.

ఇన్వెస్ట్‌మెంట్‌ జర్నీ ప్రారంభంలో సిప్‌ చేస్తున్న మొత్తం తక్కువగా అనిపిస్తుంది, దీనికి ఆందోళన అవసరం లేదు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. నెలకు రూ.12,000తో ప్రారంభించి.. ప్రతి సంవత్సరం 10% పెంచవచ్చు. ఈ విధానం ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో స్థిరంగా పని చేస్తూనే, ఆర్థిక సామర్థ్యాలకు అనుగుణంగా పెట్టుబడులను అడ్జస్ట్‌ చేసుకునే ఆప్షన్‌ అందిస్తుంది. మా జీతమే 20 వేలు ఉంటుంది ఇంత ఎక్కడా పెట్టేది అంటే.. పోస్ట్‌ ఆఫీస్‌లో ఇంకా చాలా స్కీమ్స్‌ ఉన్నాయి. కేవలం 1800తో మొదలుపెడితే చాలు.. నాకు ఇంకా పెళ్లే కాలేదు కాదా ఎందుకు ఇవన్నీ అనుకుంటారేమో.. ప్లానింగ్‌ ముందు నుంచే ఉంటే బరువు తగ్గుతుంది. మనిషై పుట్టాక పెళ్లి చేసుకోక తప్పదు, పిల్లలను కనగా తప్పదు. కాబట్టి మీకు ఇప్పుడు ఒక 26, 27 సంవత్సరాలు ఉంటే.. పోస్టాఫీసులో మంచి స్కీమ్స్‌ ఉన్నాయి. నెలకు కేవలం 1855 కడితే మీకు 50 ఏళ్లు వచ్చే సరికి 10లక్షల 72 వేలు వస్తాయి. ఆ డబ్బు మీ పిల్లల చదువుకు బాగా ఉపయోగపడుతుంది. అంత కంటే ఎక్కువ కావాలి అంటే. 2500 అయినా కట్టొచ్చు. ఏది ఏమైనా ముందు అయితే మీరు ఒక అడుగు ముందుకేసి వెళ్లి తెలుసుకోవాలి

ఫోన్‌ వెనుక డబ్బులు దాస్తున్నారా..? ప్రాణాలకే ప్రమాదం జాగ్రత్త

మనలో చాలామందికి.. ఫోన్‌ పౌచ్‌ వెనుక డబ్బులు, ఏదో ఒక రిసిప్ట్స్‌ దాచుకునే అలావాటు ఉంటుంది. ముఖ్యంగా మహిళలు అయితే కచ్చితంగా వంద నుంచి ఐదు వందల వరకూ ఎంతో కొంత ఫోన్‌ వెనుక దాచిపెడుతుంటారు. సడన్‌గా చేతిలో పర్స్‌ లేకపోయినా, ఫోన్‌లో నెట్‌ బ్యాలెన్స్‌ లేకపోయినా.. ఈ చిల్లర ఉంటే ఉపయోగడుతుంది.. ఫోన్‌ లేకుండా అయితే మనం ఎటూ పోం కదా అని అనుకుంటారు. ఇలాంటి కరెన్సీ నోట్లను చాలా మంది తమ ఫోన్ల వెనుక ఉంచుకోవడం మీరు చూసి ఉంటారు. అయితే ఇది ప్రమాదకరమని పలువురు అంటున్నారు. దాని వెనుక కారణం ఏంటంటే..

మీరు ఫోన్ కవర్ వెనుక డబ్బు ఉంచినట్లయితే ఈరోజుతో అలా చేయడం మానేయండి. ఎందుకంటే మీ ఈ అలవాటు మీకు ప్రాణాంతకం. ఫోన్ కవర్‌లో డబ్బు ఉంచడం వల్ల ఫోన్‌లో మంటలు చెలరేగే అవకాశాలు పెరుగుతాయట. నిత్యం వార్తల్లో ఫోన్ పేలుళ్లు, ఫోన్ మంటలు చూస్తూనే ఉంటాం. స్మార్ట్‌ఫోన్‌లోని కమాండ్ కారణంగా చాలా మంది చనిపోతారు.

డబ్బులకు మంటలకు కారణం ఏంట్రా అనుకుంటున్నారా..? సాధారణంగా మనం ఫోన్‌ని ఎక్కువసేపు ఉపయోగించినప్పుడు, ఎక్కువసేపు కాల్ చేస్తున్నప్పుడు, వీడియోలు చూసేటప్పుడు లేదా గేమ్‌లు ఆడేటప్పుడు, మీ ఫోన్ ప్రాసెసర్ పూర్తి వేగంతో పని చేస్తుంది. ప్రాసెసర్ వేడిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఫోన్ చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి ఫోన్ కవర్‌లో నోట్‌ పెట్టుకోవడం వల్ల మంటలు చెలరేగుతాయట.

నోట్లు కాగితంతో తయారవుతాయని మనకు తెలుసు. రసాయనాలు కూడా ఎక్కువ మోతాదులో వాడతారు. ఫోన్ వేడిని ఉత్పత్తి చేసినప్పుడు, ఒక రసాయన ప్రతిచర్య జరుగుతుంది, దీనివల్ల పేపర్ నోట్ కాలిపోతుంది. ఇలా జరగడం వల్ల పెద్ద ప్రమాదం జరిగి మొబైల్ పేలిపోయే ప్రమాదం ఉంది. ఇటీవల మొబైల్‌ పేలుడు కారణంగా ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది.

ఫోన్‌పై బిగుతుగా ఉన్న కవర్‌ను ఉంచితే, ఫోన్‌లో ఉత్పన్నమయ్యే వేడి సులభంగా బయటపడదు. కరెన్సీ నోటును ఇంత బిగుతుగా కవర్‌లో ఉంచితే ఫోన్ వేడెక్కడం వల్ల పేలిపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల ఫోన్‌పై బిగుతుగా ఉండే కవర్లు వాడకూడదని, కరెన్సీ నోట్లను ఫోన్ కవర్‌లో పెట్టుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి మీకు ఈ అలవాటు ఉంటే.. వెంటనే మానేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా ఈ అలవాటు ఉన్నా.. వెంటనే వారికి ఈ విషయం చెప్పండి.

టైర్లు ఎందుకు నల్లరంగులోనే ఉంటాయో తెలుసా..ఇందుకోసమే అట..!

మనంరోజు చూసే చాలా విషయాల్లో తెలియని అర్థాలు చాలా ఉంటాయి. చిన్నప్పుడైతే మనకు అన్ని సందేహాలే. ఇవి ఇలానే ఎందుకు ఉన్నాయి, వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారు ఇలాంటి ప్రశ్నలు మనం మనం అమ్మానాన్నలనో లేదా తాతలనో అడిగి విసిగిస్తాం. ముఖ్యంగా అబ్బాయిలకే ఇలాంటి డౌట్స్ వస్తాయి. కానీ ఆ వయసులో మనకు అన్ని తెలియకపోవచ్చు..ఇప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉండే ఉంటాయ్ కదా..అందులో ఒకటి..అసలు అన్ని వాహనాల టైర్లు ఎందుకు నల్లగా ఉంటాయి, రంగురంగలుగా ఎందుకు ఉండవు. ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా… అలా ఎందుకు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సైకిలుకు కానీ, కారుకు కానీ, మరే ఇతర వాహనానికైనా ఉండే టైర్లకు కొన్ని ముఖ్యమైన ధర్మాలు ఉండాలి. వాహనం ఎంత వేగంగా వెళుతున్నా టైరులో ఉండే ట్యూబులో గాలి తగ్గిపోకుండా ఉండాలి. రోడ్డుపై పోతున్నప్పుడు కలిగే రాపిడికి తట్టుకోగలిగే శక్తి ఉండాలి. ఎక్కువ కాలం మన్నేటంత దృఢత్వం ఉండాలి. మామూలు రబ్బరులో ఈ లక్షణాలన్నీ ఉండవు. అందుకని టైర్ల తయారీకి మామూలు రబ్బరులో కొన్ని ఇతర పదార్థాలను కలుపుతారు.

రబ్బరులో 35 శాతం ‘బ్యూటజీన్‌’ రబ్బరును కలుపుతారు. ఇది టైర్లకు రాపిడిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. మరో 65 శాతం ‘కార్బన్‌ బ్లాక్‌’ అనే పదార్థాన్ని కలుపుతారు. ఇది టైర్లను దృఢంగా ఉండేలా చేస్తుంది. వీటితో పాటు ఇంకా ప్రాసెసింగ్‌ ఆయిల్‌, ప్రొడక్షన్‌ వ్యాక్స్‌ తదితర పదార్థాలను కూడా కలిపి టైర్లను తయారు చేస్తారు. తాకిడిని తట్టుకునేంత సస్పెన్షన్‌ను ఇస్తుంది. దీని వల్లనే టైర్లకు నల్ల రంగు ఏర్పడుతుంది. టైర్లను కాల్చినపుడు దట్టమైన పొగ రావడానికి కారణం కూడా సరిగా మండని ఈ కర్బన రేణువులే అట. టైర్లలో ఎక్కువగా ఉండే కార్బన్‌బ్లాక్‌ అనేది ఇసుక నుంచి తయారయ్యే నల్లని పదార్థం. దీని వల్లనే టైర్లకు నల్లని రంగు వస్తుంది. ఇలా తయారైన టైర్లు అరిగిపోకుండా సుమారు లక్షాయాభైవేల కిలోమీటర్లు నడుస్తాయి.

మొదట తెలుపురంగులోనే ఉండేవట:
1895 లో టైర్లను కనుక్కున్నప్పుడు ఇవి తెలుపు రంగులోనే ఉండేవట. అప్పుడు టైర్లలో జింక్ ఆక్సైడ్ కలపటం వలన అవి తెల్లగా ఉండేవట. అయితే, టైర్లను ఎక్కువ కాలం మన్నేలా చేయడం కోసం, మరియు వాటి దృఢత్వాన్ని మరింత గా పెంచడం కోసం జింక్ ఆక్సైడ్ స్థానంలో కార్బన్ బ్లాకు వాడటం మొదలైంది. అలా టైర్లు నల్లగా మారాయి.

టైర్లను కార్బన్ బ్లాక్ కాంపౌండ్ ను ఉపయోగించి తయారు చేయడం వలన అవి ఆ ఉష్ణోగ్రతను తట్టుకుని నిలబడగలుగుతాయి. ఈ రకమైన రబ్బరు UV కిరణాల నుండి కూడా రక్షణ ఇవ్వగలదట. అయితే, యూవీ కిరణాల వలన టైర్ పని తీరు కొంత దెబ్బతినే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఇదిమానట సంగతి..టైర్లు నల్లగా ఉండటం వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని ఎ‌వరైనా అడిగితే ఇప్పుడు టక్కున సమాధానం చెప్పేయండి.

ఫోన్లో డేటా త్వరగా అయిపోతుందా..? ఈ టిప్స్‌ పాటించండి..!!

ఇంట్లో వైఫై ఉంటే.. ఎంత సేపు ఫోన్‌ వాడుతున్నాం, ఎంత డేటా అయిపోతుందనేది లెక్కనే ఉండదు. కానీ ఫోన్‌ డేటా అయితే.. వెంటనే అయిపోతుంది. ఇన్‌స్టాలో కాసేపు రీల్స్‌ చూస్తే చాలు.. 50% డేటా అయిపోయిందని మెసేజ్‌ వస్తుంది. కొన్నిసార్లు మనం ఏం వాడకునన్నా.. కూడా నెట్‌ త్వరగా అయిపోతుంది. అప్పుడు మనకు భలే కోపం వస్తుంది కదా..? ఈ సమస్య అందరికీ ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే డేటాను సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

మీ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి డేటా వినియోగాన్ని తరచుగా గమనించాలి. అవసరాలకు అనుగుణంగా డేటాను ఉపయోగించుకోవాలి. స్మార్ట్ ఫోన్‌ను తక్కువగా వినియోగించినా, డేటా త్వరగా అయిపోతే కస్టమర్ కేర్‌ను సంప్రదించాలి. సమస్యను పరిష్కరించాలని కోరాలి.

ఇంటర్నెట్ నుంచి ఫైల్స్, సినిమాలను డౌన్‌లోడ్ చేయడం వలన పెద్ద మొత్తంలో డేటా అయిపోతుంది. కచ్చితంగా అవసరం అయితే తప్ప, డౌన్ లోడ్ చేయడం మానుకోండి. అవకాశం ఉంటే వైఫై ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి.

మీరు జర్నీలో ఉన్నప్పుడు Netflix, HBO Max వంటి ప్లాట్‌ఫారమ్‌లలో మ్యూజిక్, వీడియో కంటెంట్‌ చూడాలి అనుకుంటే, Wi-Fiకి కనెక్ట్ అయినప్పుడు వాటిని డౌన్ లోడ్ చేసుకోవడం మంచిది. నేరుగా వీడియోలను చూడటం ద్వారా డేటా పూర్తిగా అయిపోతుంది.

హై క్వాలిటీ స్ట్రీమింగ్ ద్వారా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఎక్కువ డేటా అయిపోతుంది. అందుకే వీడియోలు చూసే సమయంలో క్వాలిటీ కాస్త తగ్గించుకుంటే డేటాను కాపాడుకోవచ్చు.

WhatsApp సహా మెసేజింగ్ యాప్స్‌లో సాధారణంగా ఫోటోలు, వీడియోలు, డియో ఫైల్స్ ఆటోమేటిక్ డౌన్‌లోడ్ కోసం డిఫాల్ట్ సెట్టింగ్‌లను కలిగి ఉంటాయి. మీరు Wi-Fiలో లేకుంటే మీ మొబైల్ డేటాను పూర్తిగా ఖాళీ చేసే అవకాశం ఉంటుంది. అందుకే డౌన్‌లోడ్ డిఫాల్ట్ సెట్టింగ్‌లను మార్చుకోవాలి. అవసరం అయితేనే, డౌన్ లోడ్ చేసుకోవాలి.

తరచుగా యాప్ అప్‌డేట్స్ నోటిఫికేషన్లు వస్తాయి. వీటిని అప్ డేట్ చేయడం వల్ల ఎక్కువ డేటా అయిపోతుంది. వైఫై ఉన్న సమయంలోనే యాప్స్‌ను అప్ డేట్ చేసుకోవడం మంచిది. అందుకే ఆటోమేటిక్ యాప్స్ అప్ డేట్ ఆప్షన్‌ను డిజేబుల్ చేయడం మంచిది.

Google Maps లాంటి GPS నావిగేషన్ యాప్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ, ఎక్కువగా డేటా తీసుకుంటాయి. చాలా యాప్స్ ఆఫ్‌లైన్ ఉపయోగం కోసం మ్యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని అందిస్తాయి. Wi-Fiకి కనెక్ట్ చేయబడినప్పుడు డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించడం ద్వారా డేటాను కాపాడుకోవచ్చు.

చాలా ఆండ్రాయిడ్ ఫోన్లు డేటా-సేవింగ్ మోడ్‌ను అందిస్తాయి. ఇది డేటా వినియోగాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.

5G వేగంగా డేటా ఇస్తుంది. 4Gతో పోలిస్తే ఎక్కువ డేటా, బ్యాటరీని వినియోగిస్తుంది. మీ స్మార్ట్ ఫోన్ 5G, 4Gకి సపోర్టు చేస్తే, 4Gకి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఇలా చేయడం వల్ల డేటాను సేవ్‌ చేసుకోవచ్చు.

బ్యాంకు లాకర్లో పెట్టిన రూ. 18 లక్షలు తినేసిన చెదపురుగులు.. చేతులెత్తేసిన బ్యాంకు

బ్యాంక్‌ లాకర్లో డబ్బులు, ముఖ్యమైన పత్రాలు లాంటివి దాచుకుంటారు.వాటికి మనం అద్దె కూడా చెల్లిస్తుంటారు. ఇంట్లో ఉంటే సేఫ్టీ కాదు అనుకోని ఇలా దాచుకుంటారు. మరీ బ్యాంకులో ఉంటే సేఫ్టీయేనా..? బ్యాంకు లాకర్లో పెట్టిన రూ. 18 లక్షలు చెదలు తినేశాయి.. దీనిపై బ్యాంకు ఎలా స్పందించిందో తెలుసా..?

ఓ తల్లి తన కూతురి పెళ్లి కోసం బ్యాంక్ లాకర్లో దాచుకున్న రూ.18లక్షల కరెన్సీ నోట్లను చెద పురుగులు తినేశాయి. ఎన్నో ఏళ్లుగా కూడబెట్టిన డబ్బు అది. చెదపురుగులు ఎలా వచ్చాయో, ఎప్పుడు వచ్చాయో గానీ కరెన్సీ నోట్లను మొత్తం తినేశాయి. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లో ఈ ఘటన జరిగింది. రిపోర్టుల ప్రకారం.. 2022 అక్టోబర్‌ నుంచి ఆ మనీ, బ్యాంక్ లాకర్‌లో ఉంచినట్లు తెలిసింది.

ఈమధ్య (RBI) KYC వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. అందులో భాగంగా బాధితురాలు.. బ్యాంకుకి వచ్చి లాకర్ తెరిచింది. ఆమె ట్యూషన్ చెప్పుకొని జీవిస్తుంది. ఓ చిన్న వ్యాపారం కూడా చేస్తోంది. అలా కూడబెట్టిన డబ్బును, కొన్ని నగలను లాకర్లో దాచుకుంది.రిపోర్టుల ప్రకారం.. ఆమె తన విలువైన వస్తువులను లాకర్లో సరైన పద్ధతిలో దాచుకోలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై ఇప్పుడు విచారణకు ఆదేశించారు. మహిళకు చెందిన విలువైన వస్తువులు ఎంతమేరకు దెబ్బతిన్నాయనే దానిపై అధికారులు పరిశీలిస్తున్నారు

ఇలా జరిగితే పరిహారం ఇస్తారా?:
ప్రభుత్వానికి చెందిన డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ (DICGC) ప్రకారం వ్యక్తిగత లాకర్ డ్యామేజ్‌లకు రూ.1 లక్ష కనీస పరిహారంగా ఇస్తారు. రిజర్వ్ బ్యాంక్ (RBI) రూల్స్ ప్రకారం లాకర్లలో ఉంచే వస్తువులకు బ్యాంకులు రక్షణ కల్పిస్తాయి. అంతవరకే వాటికి బాధ్యత ఉంటుంది. అయితే ఏం వస్తువులు పెడుతున్నారో వాటికి బ్యాంకులు బాధ్యత వహించవు. ఎవరు ఏం దాచుకున్నా, అవి పాడైతే, వాటికి పరిహారం ఇవ్వాల్సి న బాధ్యత బ్యాంకులకు ఉండదు.

ప్రకృతి విపత్తులు అంటే వరదలు, భూకంపాల వంటివి వచ్చి లాకర్లు డ్యామేజ్ అయితే, వాటికి బ్యాంకుల నుంచి పరిహారం లభించదు. లాకర్ చోరీ జరిగినా, అగ్ని ప్రమాదం జరిగినా, ఇతర డ్యామేజీ ఏదైనా జరిగితే మాత్రం బ్యాంకులు బాధ్యత వహిస్తాయి. పోయిన వాటికి పరిహారం చెల్లిస్తాయి. ఈ కేసులో ఆ మహిళకు పూర్తి పరిహారం దక్కే అవకాశాలు లేవని స్పష్టంగా తెలుస్తోంది. పాపం..ఎంతో కష్టపడి అంత డబ్బు దాచుకుంది. చివరికి ఇలా అయిపోయాయి. బ్యాంకు లాకర్లు వాడేవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండండి.!

సిల్వర్‌ ఛార్జడ్‌ నీళ్లు అంటే ఏంటో తెలుసా..? తాగితే బోలెడన్నీ లాభాలు.

పరగడుపున వాటర్‌ తాగితే ఆరోగ్యానికి మంచిదని తెలుసు.. దీన్ని ఇంకా మంచిగా చేయాలని కొందరు రాగిచెంబులో రాత్రంతా ఉంచిన నీళ్లు తాగుతారు. కానీ మీకు సిల్వర్‌ ఛార్జ్‌డ్ నీళ్ల గురించి తెలుసా..? ఇదేంటి ఫోన్‌ ఛార్జర్‌లా ఉంది అనుకుంటున్నారా..? ఇప్పుడు చాలా మంది ఈ నీళ్లు తాగుతున్నారు. వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అసలు ఇవి ఎలా చేయాలో చూద్దాం.

సిల్వర్‌ ఛార్జ్‌డ్‌ నీళ్లంటే ఏంటి
ఓ వెండి గ్లాసును గాని జగ్గును గాని తీసుకోండి. దాన్ని చక్కగా శుభ్రం చేసి రాత్రి పూట అందులో మంచి నీటిని నింపి మూత పెట్టండి. వెండి లోహానికి ఉన్న ఔషధ గుణాలు అన్నింటితో ఇప్పుడు ఆ నీరు ఛార్జ్‌ అయి ఉంటుంది. దీన్నే సిల్వర్ ఛార్జ్‌డ్‌ వాటర్‌ అంటారు. ఉదయాన్నే పరగడుపున ముందుగా ఈ నీటిని తాగండి. అలాగే రోజంతా ఆ గ్లాసుతోనే నీటిని తాగేందుకు ప్రయత్నించండి. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

వెండి నీటితో ప్రయోజనాలు:
ఇలా సిల్వర్‌ ఛార్జ్‌డ్‌ నీటిని తాగడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. శరీరం దృఢంగా మారుతుది. వ్యాధులు తొందరగా దరి చేరకుండా ఉంటాయి.

రాగిలానే వెండికి కూడా కార్సినియోజెనిక్‌ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో క్షార గుణాన్ని మెరుగుపరుస్తాయి. క్యాన్సర్‌ కణాలు సాధారణంగా ఆమ్ల లక్షణాలు ఎక్కువగా ఉన్న వారిలో వృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ ఈ నీరు తాగే వారికి క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.

వృద్ధాప్య లక్షణాలు తొందరగా దరి చేరకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ నీళ్లు తాగడం వల్ల ఎప్పుడూ మనలో కొత్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ ఉంటాయి. అందువల్ల చర్మం దీర్ఘ కాలం పాటు మెరుస్తూ యవ్వనంగా ఉంటుంది.

గర్భం ధరించిన స్త్రీలు ఇలా నీటిని తాగడం వల్ల ఇన్‌ఫెక్షన్ల లాంటివి తొందరగా దరి చేరకుండా ఉంటాయి కావాలనుకుంటే వీరు వెండి గిన్నెలో నీటిని మరిగించి కూడా తాగొచ్చు. దీని వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.

వెండి గ్లాసులో నీటిని తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది.
ఈ నీళ్లు తాదడం వల్ల జీర్ణ శక్తి మెరుగవుతుంది. తిన్నది సక్రమంగా అరుగుతుంది. దీని వల్ల మొత్తం ఆరోగ్యం కుదురుకుంటుంది.

ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వులు తేలికగా కరుగుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఈ నీళ్లు మంచి ఎంపిక

వ్యక్తి మెడ పొడవును బట్టి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పొచ్చు..!!

మనిషి ఆకారమే ఒక పెద్ద సైన్స్‌. ఆకారం ఒకేలా ఉన్నా.. రంగు, రూపు మాత్రం వేరుగా ఉంటాయి. వ్యక్తిత్వం వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి భిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఇలా ఉంటారని స్పష్టంగా చెప్పడం కష్టం. అయితే ఓ వ్యక్తి మెడ పొడవును చూసి ఈ విషయం తెలిసిపోతుందని మీకు తెలుసా?

మీ మెడ మీ గురించి ఏమి చెబుతుంది?
అవును, మెడ ఆకారాన్ని చూసి వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి యొక్క మెడ పొడవు, వంపు కొన్ని వ్యక్తిత్వ లక్షణాలతో ముడిపడి ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మీకు పొడవాటి మెడ లేదా పొట్టి మెడ ఉందా? పొడవాటి మెడ మీ వ్యక్తిత్వం గురించి ఏమి చెబుతుంది.

పొడవాటి మెడ
పొడవాటి మెడ (లాంగ్ నెక్) ఉన్న వ్యక్తి తన సమస్యను తానే పరిష్కరించుకోగలడని చూపిస్తుంది. అలాంటి వ్యక్తులు తమ జీవిత సమస్యలలో ఇతరులు తలదూర్చడం ఇష్టపడరు. తమ జీవితంలోని సమస్యల్ని తామే పరిష్కరించుకోవాలనుకుంటారు. ఎవరినీ తేలిగ్గా నమ్మొద్దు. వారిని అర్థం చేసుకునే కొంతమంది స్నేహితులను మాత్రమే వారు ఇష్టపడతారు. వారు తమ భాగస్వామి నుండి కూడా గోప్యతను ఆశిస్తారు.

చిన్న మెడ
చిన్న మెడ ఉన్న వ్యక్తులు విధేయులు, అంకితభావంతో ఉంటారు. ఎల్లప్పుడూ తన స్నేహితులకు మద్దతు ఇవ్వడానికి ఇష్టపడతాడు. అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ సంబంధాన్ని కొనసాగించగలరు. ఎందుకంటే దీర్ఘకాలిక సంబంధానికి కట్టుబడి ఉండే శ్రద్ధగల వ్యక్తి. సమాజానికి సహాయం చేయడానికి ముందు ఉంటారు. ఎందుకంటే అవి చాలా సహాయకారిగా ఉంటాయి. కానీ అలాంటి వ్యక్తులు ఈ ఉపయోగకరమైన నాణ్యతతో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ఇతరులకు సమయం ఇవ్వకుండా స్వీయ సంరక్షణకు ఎక్కువ సమయం కేటాయించడం మంచి పద్ధతి. ఇది మీరు సంతోషంగా ఉండటానికి సహాయపడుతుంది.

మీడియం లెంథ్‌ మెడ
మీడియం లెంథ్‌ మెడ కలిగి ఉంటే, మీరు జీవితంలో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడే వ్యక్తి. మీరు అన్నింటికంటే శాంతి, సామరస్యానికి విలువ ఇస్తారు. మీరు క్లిష్ట పరిస్థితుల్లో మధ్యవర్తిగా గుర్తిస్తారు. ఇది సంఘర్షణ పరిస్థితులను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. మీరు అనవసర వాదనలకు దూరంగా ఉండాలన్నారు. ఇది మీ భాగస్వామితో సామరస్యంగా జీవించడానికి మీకు సహాయపడుతుంది. మీడియం పొడవు మెడ ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ ఇతరుల సమస్యను పరిష్కరించడం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. తద్వారా తమను తాము ఇబ్బందులకు గురిచేసుకుంటారు.

అత్యధిక భాషలు ఉన్న దేశాల్లో భారత్‌ది నాల్గో స్థానం.. నెంబర్‌ వన్‌ ఏది..?

భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి దాని స్వంత భాషలు ఉన్నాయి. రాష్ట్రంలో మాండలికాలు ఉన్నాయి. కొన్ని భాషలకు లిపి లేదు. కేవలం మాటలకే పరిమితం అయ్యాయి. అయితే, ప్రస్తుతం భారతదేశంలో మాట్లాడే భాషల సంఖ్య 453. ప్రపంచంలో అత్యధిక భాషలు ఉన్న దేశాల్లో భారత్‌ది నాల్గవ స్థానం. మరి మొదటి స్థానంలో ఏ దేశం ఉంది..?

ప్రతి దేశానికి అధికారిక భాషలు ఉన్నాయి. రాష్ట్రాలు, సంఘాలు మరియు తెగల మధ్య అనేక భాషలు ప్రబలంగా ఉన్నాయి. భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి అధికార భాష ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో అనేక మాండలికాలు ఉన్నాయి. సంస్కృతం సహా అనేక భాషలు పుస్తకాలకే పరిమితమయ్యాయి. చాలా భాషలు అంతరించిపోయాయి. అయితే భారతదేశంలో భాషా వైవిధ్యం, సాంస్కృతిక వైవిధ్యం, దుస్తులు, జీవన విధానం, ఆహారపు అలవాట్లు జిల్లాను బట్టి మారుతూ ఉంటాయి. అత్యధికంగా మాట్లాడే భాషల్లో భారతదేశం నాల్గవ స్థానంలో ఉంది. కర్ణాటకలో కన్నడ రాష్ట్ర భాష అయితే, మాండలికాల జాబితా చాలా పెద్దది.
ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలు ఉన్న దేశం పాపువా న్యూ గినియా. ఇక్కడ దాదాపు 840 భాషలు మాట్లాడతారు.
రెండో స్థానంలో ఇండోనేషియా ఉంది. ఇండోనేషియాలో 710 భాషలు, నైజీరియా 524 భాషలతో 3వ స్థానంలో ఉన్నాయి.
నాలుగో స్థానం భారత్‌ది కాగా, 335 భాషలతో అమెరికా 5వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాలో 319 భాషలు మరియు చైనాలో 305 భాషలు ఉన్నాయి.

పాకిస్తాన్ భౌగోళికంగా చిన్నది అయినప్పటికీ, అనేక భాషలు ఉన్నాయి. బలూచి మరియు సింధ్‌తో సహా ప్రతి ప్రావిన్స్‌లో వేర్వేరు భాషలు, ఆపై కమ్యూనిటీల భాషలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పాకిస్థాన్‌లో 85 భాషలు మాత్రమే మిగిలి ఉన్నాయి. 40కి పైగా భాషలు అంతరించిపోతున్నాయి. హమాస్ దాడి చేసిన ఇజ్రాయెల్‌లో 53 భాషలు మాట్లాడతారు. ఈ పాలస్తీనాలో 10 భాషలు ఉన్నాయి.

చెట్లకు కుర్చీలు పెంచుతున్న రైతు.. ఇప్పుడు ఆర్డర్‌ చేస్తే ఏడేళ్లకు డెలివరీ..!

 

ప్రపంచం అద్భుతాలు, సాహసాల వైపు పరుగులు పెడుతుంది. ఒకరిని మించి ఒకరు కొత్తకొత్త విషయాలను కనిపెడుతున్నారు, సృష్టిస్తున్నారు. పొలాల్లో కూరగాయలు, పండ్లు పండించడం మనకు తెలుసు.. కుర్చీలు పండించడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. కుర్చీలను చెట్లతో తయారు చేస్తారు.. కానీ ఏకంగా చెట్లకే కుర్చీలను పండిస్తే.. ఇంకా అర్థంకాలేదా.. అయితే ఈ కథ మొత్తం చదవాల్సిందే..!
గావిన్ మున్రో అనే వ్యక్తి తన పొలంలో కుర్చీలు పెంచుతుంటాడు. అతను ఇంగ్లాండ్‌లోని డెర్బీషైర్ డీల్స్ నివాసి. ఈ విచిత్రమైన వ్యవసాయానికి చాలా సమయం మరియు శ్రమ పడుతుంది, కానీ లాభం చాలా ఉంది, వినేవారికి కూడా ఇలాంటి వ్యాపారం చేయాలని అనిపిస్తుంది. అతను తయారు చేసిన కుర్చీలకు చాలా దేశాల్లో డిమాండ్ ఉంది. పొలాల్లో పండే ఈ కుర్చీల ధర లక్షల్లో ఉంటుంది.
గావిన్ కలపను కత్తిరించి తయారు చేసే కుర్చీలను నేరుగా చెట్లపై పెంచుతారు. ఇది చెట్లకు వేలాడుతున్న పండులా కనిపిస్తుంది. దీని కోసం, గావిన్ విల్లో అనే ప్రత్యేక చెట్టును ఉపయోగిస్తాడు. విల్లో చెట్టు కొమ్మలు చాలా సరళంగా ఉంటాయి. అదేవిధంగా, ఓక్, యాష్ మరియు సైకమోర్ వంటి బలమైన తీగలు ఉన్న చెట్లను కూడా ఫర్నిచర్ పెంచడానికి ఉపయోగిస్తారు. చెట్ల తీగలను కుర్చీలుగా మార్చడానికి గావిన్ ఇనుప ఫ్రేమ్‌లను ఉపయోగిస్తాడు. ఈ ఫ్రేమ్‌ల లోపల చెక్క కుర్చీని అమర్చి పెంచుతారు. కుర్చీల ఆకారం చెడిపోకుండా ఉండటానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చెట్టు కత్తిరిస్తాడట.
ఒక్క కుర్చీ ఖరీదు రూ.6 నుంచి 7 లక్షలు
గావిన్ భార్య ఆలిస్ కూడా అతడి వ్యాపారంలో సమానంగా సాయం చేస్తుంది. కుర్చీలు తయారు చేయడానికి సమయం పడుతుంది, కాబట్టి ఎవరైనా కుర్చీలు కొనాలనుకుంటే, కనీసం 7 సంవత్సరాల ముందుగానే ఆర్డర్ చేస్తారు. 5-6 సంవత్సరాలలో కుర్చీలు అందుబాటులో ఉంటాయి. ఒక్కో కుర్చీ ఖరీదు రూ.6 నుంచి 7 లక్షలు ఉంటుందట. ఈ విషయం విన్నాకా.. మీకు నవ్వాలో ఏడ్వాలో అర్థంకావడం లేదా..! చెట్లకు కుర్చీలను పండించడమే ఒక వింత అంటే.. వాటిని ఇన్ని లక్షలు పోసీ కొనడం ఇంకో వింత..!నిజంగా ఈ ఐడియా ఆ గావిన్‌కు ఎలా వచ్చిందో..! అని విషయం తెలిసిన నెటిజన్లు అంటున్నారు.. మీరేమంటారో..!

స్నానానికి ముందు ఈ పొరపాటు చేస్తే గీజర్‌ పేలిపోయే అవకాశం ఉంది

ఈరోజుల్లో గీజర్‌ అందరి ఇళ్లలో ఉంటుంది. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నానం చేయడానికి తక్షణమే వేడినీరు లభిస్తుంది. ఇప్పుడు ఇంకా చలికాలం కావడంతో ఉదయం పూట వేడినీళ్లు కావాలి. అందులోనూ నిముషంలో నీరు వేడిగా మరియు కావలసిన ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో కూడా గీజర్ ఉంటే, ఈరోజు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, గీజర్ పేలిపోయిందని మనం తరచుగా వింటుంటాం. కాబట్టి మీకు ఈ భయం ఉంటే ఈ జాగ్రత్తలు పాటించండి.
మీ ఇంటి గీజర్ నేరుగా వాటర్ ట్యాంక్‌కు కనెక్ట్ చేయబడి ఉంటే, వాటర్ ట్యాంక్ ఖాళీ చేయబడితే గీజర్ వేడెక్కవచ్చు. కాబట్టి నీరు లేనట్లయితే గీజర్‌ వేయకండి. నీరు లేకున్నా గీజర్‌ ఆన్‌ చేస్తే.. అది ఖచ్చితంగా వేడెక్కుతుంది మరియు తద్వారా పేలిపోతుంది. కాబట్టి గీజర్‌ను ఆన్ చేసే ముందు, మీ వాటర్ ట్యాంక్‌లో నీరు ఉందో లేదో తనిఖీ చేయండి. నీరు లేకపోతే, బటన్‌ను ఆన్ చేయవద్దు.
గీజర్ యొక్క వైరింగ్ దెబ్బతిన్నట్లయితే లేదా మీరు ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్‌ను గమనించినట్లయితే, మీరు వెంటనే దాన్ని మరమ్మతు చేయడం గురించి ఆలోచించాలి. ఎందుకంటే చాలా సార్లు గీజర్‌లు వైరింగ్‌ను చాలా వేడిగా చేస్తాయి మరియు అది పేలుడు సంభావ్యతను కూడా పెంచుతుంది. ఇది కాకుండా, డిమాండ్ ఒత్తిడి చాలా వరకు పెరుగుతుంది. కాబట్టి వైరింగ్ సరిగ్గా లేదని మీరు గమనించినట్లయితే, వెంటనే దాన్ని పరిష్కరించండి.
చాలా మంది తరచుగా గీజర్ బటన్‌ను ఆఫ్ చేయడం మర్చిపోతుంటారు. ఇలా చేయడం ద్వారా, మీరు పీపాలో నుంచి నీళ్లు బయిటికి రావడమునకు వేసివుండే చిన్న గొట్టాన్ని ఆఫ్ చేసినప్పటికీ, గీజర్ పూర్తి సమయం వేడి చేయబడుతుంది. ఇది మీ విద్యుత్ బిల్లును పెంచుతుంది, నీటి నాణ్యత క్షీణిస్తుంది. గీజర్ దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అంతే కాదు గీజర్ ఎక్కువ సేపు కొనసాగితే పేలుడు సంభవించే అవకాశం కూడా ఉంది. కాబట్టి అవసరం మేరకే గీజన్‌ను ఆన్‌ చేసి ఉంచండి. పని అయిన వెంటనే ఆఫ్‌ చేయండి.

ఈ భాగాల్లో పుట్టుమచ్చలు ఉంటే డబ్బుకు లోటు ఉండదు

ప్రతి ఒక్కరి శరీరంపై ఎక్కడో ఒక దగ్గర పుట్టుమచ్చలు ఉంటాయి.. పుట్టు మచ్చలు అంటే.. పుట్టుకతో వస్తాయి అని చాలా మంది అనుకుంటారు. నిజానికి ఇవి పుట్టగానే రావు.. పెరిగేకొద్ది వస్తాయి. సాముద్రిక శాస్త్రం ప్రకారం.. శరీరంలోని కొన్ని భాగాల్లో ఉండే పుట్టు మచ్చలను అదృష్ట మచ్చలు అంటారు. ఇవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయట.. ఇంతకీ ఆ లక్కీమోల్స్‌ ఏంటో చూద్దామా..!

నుదిటిపై పుట్టుమచ్చ చాలా మంచి సంకేతంగా చెప్పబడుతుంది. ఇది మీ జీవితంలో శ్రేయస్సును పెంచుతుంది. ముఖ్యంగా నుదిటి మధ్యలో పుట్టుమచ్చ ఉంటే, అది శ్రేయస్సు మరియు జ్ఞానానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. మీ నుదిటికి కుడి వైపున ఉన్న పుట్టుమచ్చ మీ వ్యాపారంలో లేదా వైవాహిక జీవితంలో మంచి ఫలితాలను ఇస్తుంది.

కొందరికి గడ్డం మీద మచ్చ ఉంటుంది. ఇది వారి అందాన్ని పెంచుతుంది. కానీ వారు చాలా మొండిగా ఉంటారని అంటున్నారు. అదేవిధంగా, కుడి గడ్డం మీద పుట్టుమచ్చ దౌత్య స్వభావానికి చిహ్నం.

చెంపపై పుట్టుమచ్చ ఉంటే, వారు చాలా నిజాయితీపరులని అంటారు. అలాగే, వారు చాలా తెలివైన వారని చెబుతారు. ఇలాంటి వారికి క్రీడలంటే ఆసక్తి ఉంటుంది.

సాముద్రిక శాస్త్రం ప్రకారం, మీ పుట్టుమచ్చ నాభి దగ్గర ఉంటే, అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. స్త్రీకి కుడి వైపున పుట్టుమచ్చ ఉంటే, స్త్రీలు మంచి ఆర్థిక జీవితాన్ని కలిగి ఉంటారు,

మీ పై పెదవికి కుడి లేదా ఎడమ మూలలో పుట్టుమచ్చ ఉంటే, మీకు ఆహారం కొరత ఉండదు. మీ పెదవులపై మచ్చ ఉంటే, మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. పెదవి క్రింద పుట్టుమచ్చ నటన మరియు నాటక కళలలో అదృష్టాన్ని తెస్తుంది.

కుడి పాదంలో పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. మీ కుటుంబ జీవితంలో మీరు ఎప్పటికీ లోపించడం లేదు. కానీ ఎడమ వైపున పుట్టుమచ్చ ఉంటే ఆర్థిక సమస్యలు, జీవిత భాగస్వామితో సమస్యలు ఉంటాయి.

మొదటి ‘అఘోరీ’ ఎవరు? తంత్ర మంత్రం వెనుక ఉన్న నిజం మీకు తెలుసా?

కుంభమేళాలో లేదా స్మశాన వాటిక దగ్గర మీరు తరచుగా సాధువులు నగ్నంగా లేదా నల్లని వస్త్రాలు ధరించి, బూడిదతో కప్పబడి, మాట్టెడ్ జుట్టుతో మరియు మెడలో ఎముకల దండతో కనిపిస్తారు. తంత్ర మంత్రంలో తెలిసిన ఈ ప్రత్యేక ఋషిని అఘోరి అంటారు.

అఘోరాలు గురించి మీరు చాలానే వినే ఉంటారు. శ్మశానవాటికకు వచ్చే శరీరాలను పూజించడమే కాకుండా సగం కాలిన శరీరాలను కూడా తింటారని అంటారు. అఘోరీలు తంత్ర సాధన ద్వారా ఎవరినైనా నాశనం చేయగలరని జనాలు నమ్ముతారు. ఈ వార్తల్లో ఎంత నిజముందో, ఎంత అబద్ధమో లోతుకు వెళితేనే తెలుస్తుంది. నిజానికి అఘోరీలు భైరవ రూపంగా పరిగణించబడే శివుని భక్తులు. అఘోరీలు పునర్జన్మ చక్రం నుంచి మోక్షాన్ని కోరుకునే మోనిస్టులుగా పరిగణిస్తారు. అసలు మొదటి అఘోరీ బాబా ఎవరో తెలుసా..?

శివుడు అఘోర శాఖ స్థాపకుడిగా పరిగణించబడ్డాడు. శివుడు స్వయంగా అఘోరా శాఖను ప్రతిపాదించాడని చెబుతారు. అవధూత భగవాన్ దత్తాత్రేయను అఘోర శాస్త్రానికి గురువుగా కూడా పరిగణిస్తారు. అఘోరీ సంప్రదాయాన్ని కొనసాగించిన మొదటి అఘోరీ బాబా కీనారామ్. కొన్ని మూలాల ప్రకారం, అతను శైవిజం యొక్క అఘోరీ శాఖ యొక్క మూలంగా పరిగణించబడ్డాడు. అతను శివుని అవతారంగా కూడా పరిగణించబడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లా సకల్దిహా తహసీల్ పరిధిలోని రామ్‌గఢ్ గ్రామంలో క్షత్రియ కుటుంబంలో 1658లో జన్మించినట్లు చెప్పబడే బాబా కీనారామ్‌లో అఘోరీలు తమ మూలాన్ని గుర్తించారు. అఘోరీలు 1658లో భాద్రపద కృష్ణపక్షంలో జన్మించారు. ఆ రోజే పుట్టాడు. చతుర్దశి నాడు 150 సంవత్సరాలు జీవించాడు. సెప్టెంబరు 21, 1771న అఘోరాచార్య బాబా కీనారామ్ సమాధి చేశారు. అఘోరా సంప్రదాయానికి కేంద్రంగా పరిగణించబడుతున్న బాబా కీనారామ్ ప్రదేశం, క్రింగ్-కుండ్, వారణాసిలోని పురాతన ఆశ్రమం.

బాబా కీనారామ్ పుట్టిన తర్వాత 3 రోజుల పాటు ఏడవలేదని, తల్లి పాలు తాగలేదని చెబుతారు.. అతను పుట్టిన నాల్గవ రోజున ముగ్గురు సన్యాసులు (సదాశివ భక్తులు: బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్) అతని వద్దకు వచ్చి బిడ్డను తమ చేతుల్లోకి తీసుకున్నారు. పిల్లవాడి చెవిలో ఏదో గుసగుసలాడగానే, ఆశ్చర్యంగా ఏడవసాగాడు.

Pushpa2 : విడుదలకు ముందే 800 కోట్లు..చరిత్ర సృష్టించిన ‘పుష్ప 2’!

టాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రాలలో అభిమానులతో పాటు, దేశ వ్యాప్తంగా ఆడియన్స్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప : ది రూల్’.
ఈ సినిమా ఈ ఏడాది ఆగష్టు 15 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని కూడా విడుదల చెయ్యబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి జరుగుతున్నా ప్రీ రిలీజ్ బిజినెస్ ని చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఆడియో రైట్స్, సాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ ఇలా అన్నీ కలిపి ఈ సినిమాకి దాదాపుగా 800 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. ఇది టాలీవుడ్ లోనే ఆల్ టైం రికార్డుగా చెప్తున్నారు. ఇక నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కి అయితే జాక్పాట్ అనే చెప్పాలి. విడుదలకు ముందే ఈ స్థాయి బెంచ్ మార్క్స్ ని ఏర్పాటు చేసిందంటే, ఇక విడుదల తర్వాత ఈ చిత్రం బాహుబలి రికార్డ్స్ ని దాటేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

Pushpa 2 Teaser : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2. ఈ మూవీ కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
గత ఏడాది అల్లు అర్జున్ బర్త్ డేకి ఒక చిన్న వీడియోని రిలీజ్ చేసిన ఆకట్టుకునే మూవీ టీం.. ఆ తరువాత మరో కంటెంట్ ని రిలీజ్ చేయలేదు. మళ్ళీ ఏడాది తరువాత అల్లు అర్జున్ బర్త్ డేకి టీజర్ ని తీసుకు వస్తున్నారు.

ఆల్రెడీ ఏప్రిల్ 8న పుష్ప 2 టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ కచ్చితమైన టైంని అనౌన్స్ చేయలేదు. తాజాగా ఆ టైంని అనౌన్స్ చేస్తూ అప్డేట్ ఇచ్చారు. రేపు ఉదయం 11.07 నిమిషాలకు టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ టీజర్ ఆడియన్స్ కి కచ్చితంగా గూస్‌బంప్స్ తెప్పిస్తుందని చెబుతున్నారు.
కాగా ఈ టీజర్ ని జాతర సీక్వెన్స్ తో కట్ చేసారని తెలుస్తుంది. సినిమాలో ఈ సీక్వెన్స్ హైలైట్ ఉండబోతుందట. జాతర బ్యాక్ డ్రాప్ లో ఓ సాంగ్ అండ్ అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ ఉండబోతుందట. ఇప్పుడు ఆ హైలైట్ సీక్వెన్స్ తోనే టీజర్ ని సిద్ధం చేసారని, దేవిశ్రీ ప్రసాద్ కూడా అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

Sabja Seeds Benefits : వేసవిలో రోజూ సబ్జా గింజలను తీసుకుంటే ఎలాంటి సమస్యా దరిచేరదు

వేసవి కాలం వచ్చింది. వేసవి తాపాన్ని చల్లార్చి మన ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాన్ని వెతుక్కునే సమయం ఇది. తీవ్రమైన వేడితో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ సమయంలో మంచి ఆహారం తీసుకోవాలి. మానవ శరీరాన్ని డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. వేసవిలో సరైన ఫుడ్ తీసుకోకుంటే.. ఇది డీహైడ్రేషన్, పోషకాహారలోపానికి దారితీస్తుంది.

మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మీ ఆహారంలో చేర్చుకోగల అనేక ఆహారాలు ఉన్నాయి. తక్షణమే అందుబాటులోకి వచ్చే చవకైనవి ఉపయోగించడం ఉత్తమం. సబ్జా గింజలు అందులో ఒకటి. ఈ వేసవిలో సబ్జా గింజలను ఎందుకు తీసుకోవాలి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం.

సబ్జా గింజలు వాటి పొడి బరువును 4 రెట్లు వరకు నీటిలో పెంచుకుంటాయి. జెల్లీ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి. ఈ హైడ్రోజెల్ ప్రాథమికంగా ఎలక్ట్రోలైట్స్, నీటికి మూలం. ఇది వేసవి చెమట సమయంలో మీరు కోల్పోయిన అన్ని ఆర్ద్రీకరణను పునరుద్ధరిస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం సబ్జా గింజలు మీ పేగులపై జీర్ణక్రియ తర్వాత ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఇది పేగులను నయం చేయడంలో సహాయపడుతుంది. వేసవిలో వేడి, అధిక సూర్యరశ్మి, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా ఇది పేగు కదలికలో సమస్యలను కలిగిస్తుంది. వేసవిలో ఎసిడిటీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. సబ్జా విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

సబ్జా గింజల్లో విటమిన్ ఇ, క్రోమియం వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ చర్యను మెరుగుపరచడంలో, మధుమేహాన్ని మెరుగ్గా నియంత్రించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్ యాక్టివిటీ ఆరోగ్యకరమైన చర్మానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా వేసవిలో మొటిమల సమస్యలు, వడదెబ్బ ఎక్కువగా ఉన్నప్పుడు, క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

సబ్జా గింజలు డైటరీ ఫైబర్‌తో నిండి ఉన్నాయి. ఇది ఆకలిని అణిచివేస్తుంది. అతిగా తినడం, అధిక కేలరీల తీసుకోవడం నిరోధిస్తుంది. ఇందులోని ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ కంటెంట్ శరీరంలో కొవ్వును వేగంగా కాల్చడానికి సహాయపడుతుంది.

వేసవిలో మలబద్ధకం అనేది సాధారణ సమస్య. కానీ సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉన్నందున మీ పేగు కదలికలు మెరుగుపడతాయి. అందువల్ల మలబద్ధకాన్ని సులభంగా నయం చేయవచ్చు.

1-2 టీస్పూన్ల సబ్జా గింజలను తీసుకుని వాటిని ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టండి. మీరు వాటిని మీ స్మూతీస్, పెరుగు, జ్యూస్‌లలో కలపవచ్చు. మీకు ఇష్టమైన డెజర్ట్‌లకు జోడించవచ్చు. వేసవిలో సబ్జా గింజలు తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి.

Health Benefits of Finger Millets: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రాగులు ట్రై చేయండి.. పక్కా వెయిట్ లాస్

xr:d:DAGAsgn3asY:117,j:1954986262559824014,t:24040613

Health Benefits of Finger Millets: పూర్వకాలంలో ఏది తిన్నా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు బాగా పనిచేసేవి. కానీ ఇప్పుడు ఏది తిన్నా ఆరోగ్యాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయి. ఒకప్పుడు రాగిసంకటి, రాగి జావ, జొన్న గడక, అంబలి, చద్దన్నం వంటివి చేసుకుని తిని మన పెద్దలు ఎక్కువ కాలం పాటు బతికేశారు. ఇప్పుడు కూడా వారు ఇవే తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే వీటిలో ఏముంది అనుకుంటే మాత్రం పొరపాటే. ఆరోగ్యానికి ఇవి సంజీవని లాంటివి. వీటిని తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలైనా భయంతో పారిపోవాల్సిందే మరి. అయితే ఫైబర్ ఎక్కువగా ఉండే రాగులను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం.

రాగులు శరీర ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. రాగి పిండితో తయారుచేసే రాగి జావా, దోషలు, రాగి సంకటి వంటివి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా శరీర బరువును తగ్గించుకునేందుకు రాగులు చాలా బాగా ఉపయోగపడతాయట. రాగుల్లో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తరచూ ఫిట్‌గా ఉండాలనుకునే వారు తరచూ రాగి జావ తాగితే మేలు. ఇక గుండె సమస్యలు ఉన్నవారికి కూడా రాగి జావలో ఉండే మెగ్నీషియం, పొటాషియంలు ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతాయి. కాలేయంలో కొవ్వు పేరుకోకుండా రాగుల్లో ఉండే పోషకాలు సహాయపడతాయి. దీనికి ఫలితంగా గుండె సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

డయాబెటీస్..

రాగుల జావ లేదా రాగి దోష వంటివి తరచూ ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ బారి నుంచి తప్పించుకోవచ్చు. రాగుల్లో ఉండే అధిక ఫైబర్ రక్తంలోని చెక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.

జీర్ణక్రియ..

రాగుల్లో ఫైబర్​ అధికంగా ఉండడం మూలంగా జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మలబద్ధకం, కడుపుబ్బరం, అరుగుదల వంటి అనేక సమస్యలను రాగులు నయం చేస్తాయి. అంతేకాదు ఎముకల బలానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. రాగి జావను తరచూ తీసుకోవడం వల్ల ఎముకల్లో బలం పెరుగుతుంది. ముఖ్యంగా పాలిచ్చే తల్లులకు రాగులు చాలా ఉపయోగపడతాయి.

Vivo T2x 5G : వివో టాప్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్

xr:d:DAGBtwm3nCU:6,j:6278441988216440985,t:24040709

Vivo T2x 5G : స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరు మొబైల్‌తోనే కాలాన్ని గడుపుతున్నారు. మొబైల్ కంపెనీలు కూడా కొత్తకొత్త ఫోన్లను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నాయి. కొనుగోలుదారులు కూడా కొత్త ఫీచర్లతో వచ్చిన ఫోన్లను యూజ్ చేసేందుకు ఇంటరెస్ట్ చూపుతున్నారు. అలానే సేల్స్‌లో టాప్‌లో ఉండే ఫోన్లను వినియోగించేందుకు ఇష్టపడుతున్నారు.

ఈ నేపథ్యంలో పాపులర్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఓ వివో ఫోన్ పై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ స్పెషల్ ఆఫర్‌తో ఫోన్ ఫ్లిప్‌‌కార్ట్‌లో ఉంది. ఆ వివరాలు ఏంటో చూడండి.

Vivo నుంచి వచ్చిన T2x 5G స్మార్ట్‌ఫోన్ ఎంతో ప్రత్యేకమైనది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై ఏకంగా రూ.7000 వేలు డిస్కౌంట్ ఇస్తుంది. Vivo T2x ధర రూ. 17,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న డిస్కౌంట్ ప్రకారం రూ.10,999కే ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ అంతటితో అయిపోలేదు.. ఎక్స్‌ఛేంజ్ బోనస్ కింద రూ. 8,650 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో వేగంగా అమ్ముడుపోతున్న ఫోన్ ఇది.

Vivo T2x 5G స్మార్ట్‌ఫోన్ 6.59 ఇంచెస్ ఫుల్ హె‌చ్‌డీ ప్లస్ ఐపిఎస్ ఎల్‌సీడి డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఇది 240 హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే 650 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో MediaTek Dimension 1300 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ హైపర్ ఇంజిన్ 3.0 టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.

Vivo T2x 5G స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఇది f/1.8 ఎపర్చర్‌తో వస్తుంది. అలానే 2మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ షూటర్ ఉంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. దీంతో మంచి సెల్ఫీలను తీసుకోవచ్చు.

బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 6000 ఎమ్ఏహెచ్ బిగ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింజ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కనెక్టివిటీ కోసం Vivo T2x 4G LTE, Wi-Fi, డ్యూయల్ సిమ్ సపోర్ట్, బ్లూటూత్ వంటివి ఉన్నాయి.

EC Notice To CM Jagan: సీఎం జగన్‌కు ఈసీ నోటీసు..

xr:d:DAF_lDtPUYY:3,j:221098330729648236,t:24031710

EC Notics To AP CM Jagan: ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా సీఎం జగన్ మోహన్ రెడ్డికి నోటీసు ఇచ్చారు. సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభా ప్రసంగాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య సీఈఓకు కంప్లైంట్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ఆయన కంప్లైంట్‌లో పేర్కొన్నారు.

వర్ల రామయ్య కంప్లైంట్‌పూ స్పందించిన సీఈఓ ముకేశ్ కుమార్ మీనా జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు 48 గంటల్లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో స్పష్టం చేశారు. వీటిపై స్పందించకపోతే ఈసీ చర్యలు అనివార్యం అని పేర్కొన్నారు. ఇక నోటీసుపై సీఎం జగన్ ఎలా స్పందిదస్తారో వేచి చూడాలి.

కాగా పెన్షన్లను చంద్రబాబు అడ్డుకున్నారని.. 31 మంది వృద్ధుల మృతి కారణమయ్యారని బాబుపై జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు సాడిస్ట్ అని పేర్కొన్నారు. మదనపల్లి, పూతలపట్టులో జగన్ చంద్రబాబును పసుపతి అంటూ సంభోదించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత వర్ల రామయ్య ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. జగన్ వ్యాఖ్యలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించాయని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సీఈఓ.. ఆదివారం సీఎం జగన్‌కు నోటీసు జారీ చేసింది.

మండే ఎండల్లో APవాసులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్

భానుడి భగభగలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడి పోతున్నారు. ఉదయం 10 గంటలు దాటితో బయటకు వచ్చే పరిస్థితి ఉండటం లేదు. ఏ జిల్లా చూసినా మండే ఎండలు చెమటలు పట్టించేస్తున్నాయి. అధికారులు కూడా అత్వసరం అయితేనే బయటకు రావాలి అంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు గరిష్టంగా 44 డిగ్రీలు దాటేస్తున్నాయి. సూర్యూడి ప్రతాపం మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఏపీకి వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ లో సూర్యూడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు చేరుకుంటున్నాయి. శనివారం పగటిపూట ఉష్ణోగ్రతలు చూస్తే ఏకంగా 7 జిల్లాల్లో 45 డిగ్రీలు నమోదు అయ్యింది. ఏప్రిల్ నెల మొదటి వారంలోనే ఇలాంటి ఎండలు అంటే మేనాటికి పరిస్థితి ఏంటంటూ ప్రజలు బెబేలెత్తిపోతున్నారు. అనకాపల్లి, నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలో గరిష్టంగా 44.9 వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అలాగే అత్యధిక జిల్లా ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు నమోదు అయ్యింది. ఈ ఎండలు, ఉక్కపోత నుంచి ఏపీలో పలు జిల్లాల ప్రజలకు ఉపశమనం లభించనుంది. వాతావరణ శాఖ వచ్చే 3 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించిది.

చాలా జిల్లాల్లో గత పది రోజులుగా ఎండలు తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అయితే కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. మార్చి ఆఖరి వారం నుంచి తీవ్రమైన ఎండ, వేడి, ఉక్కపోతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వార్త ఆనందాన్ని ఇస్తోంది. కోస్తా, రాయలసీమ ప్రజలు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండే ఎండల్లో చల్లని కబురు చెప్పారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తీవ్రమైన ఎండల నేపథ్యంలో వాతావరణ శాఖ మాత్రమే కాకుండా.. ఆరోగ్య నిపుణులు కూడా పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఎండలో తిరగకపోవడమే మంచిది అంటున్నారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వచ్చినా కూడా నేరుగా ఎండలో తిరగొద్దని చెప్తున్నారు. గొడుగు తీసుకెళ్లడం లేదా క్యాప్ ధరించడం చేస్తే మంచిది అంటున్నారు. అలాగే కళ్లకు అద్దాలు, ఫుల్ హ్యాండ్స్ చేతులు, కాటన్ వస్త్రాలు ధరిస్తే మంచిదని చెప్తున్నారు. సాయంత్ర 4 గంటల వరకు బయటకు రాకపోవడమే ఉత్తమం అని చెప్తున్నారు. అలాగే శరీరం హైడ్రేడెట్ గా ఉండేలా చూసుకోవాలి అంటున్నారు. కచ్చితంగా మంచినీళ్లు తాగుతూ ఉండాలి. కొబ్బరినీళ్లు, పళ్ల రసాలు, సీజనల్ ఫ్రూట్స్ తింటూ ఉంటే మంచిది.

AC Buying: మీరు కొత్త ఏసీ కొనబోతున్నారా? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

ఏప్రిల్‌లో వేడిగాలులు ప్రజలకు చెమటలు పట్టిస్తున్నాయి. మాసం ప్రారంభం కావడంతో శరీరం ఉక్కపోతకు గురవుతోంది. ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతోంది. పెరుగుతున్న వేడితో మార్కెట్‌లో ఏసీకి డిమాండ్‌ పెరుగుతోంది. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు అందరూ ఏసీలు కొంటున్నారు. మీరు కూడా ఈ సంవత్సరం కొత్త AC కొనుగోలు చేయబోతున్నట్లయితే 5 ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి. తద్వారా మీరు మీ డబ్బును వృధా చేయకుండా, ఏసీ కొనుగోలు చేసిన తర్వాత ఎటువంటి సమస్యలను ఎదుర్కొకుండా ఉంటారు.

ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు గుర్తుంచుకోవలసిన 5 విషయాలు. ఇది వారికి డబ్బు ఆదా చేస్తుంది. సమయం ఆదా అవుతుంది. వారు వేడి నుండి ఉపశమనం పొందుతారు.

ఈ 5 విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి:

  1. ఏసీని కొనుగోలు చేసేటప్పుడు దాని శీతలీకరణ సామర్థ్యాన్ని ఖచ్చితంగా తనిఖీ చేయండి. అంటే కొనుగోలు చేసేటప్పుడు ఏసీ ఎంత కూలింగ్‌ను అందిస్తోంది? ఎంత త్వరగా గదిని చల్లబరుస్తుంది అని ఖచ్చితంగా తనిఖీ చేయండి. ఇవి తెలుసుకున్న తర్వాత మాత్రమే కొనండి.
  2. ఏసీ కొనేటపుడు మీ గది సైజును ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకుని గది పరిమాణం ప్రకారం ఏసీని కొనుగోలు చేయండి. ఉదాహరణకు మీ గది చిన్నగా ఉంటే చిన్న ఏసీని కొనండి. గది పెద్దగా ఉంటే పెద్ద ఏసీని కొనండి. తద్వారా తక్కువ సమయంలోనే గది త్వరగా చల్లబడి, ఏసీ ఎక్కువసేపు నడపాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు గది పెద్దగా ఉంటే 1.5 టన్ను లేదా 2 టన్నుల ఏసీని కొనుగోలు చేయాలి. గది చిన్నగా ఉంటే 1 టన్ను ఏసీ సరిపోతుంది. ఎప్పుడూ తక్కువ పవర్ వినియోగించే 5 స్టార్ ఏసీని కొనుగోలు చేయాలి.
  3. ఏసీని కొనుగోలు చేసేటప్పుడు ఫైవ్ స్టార్ ఏసీని మాత్రమే కొనుగోలు చేయండి. ఇది తక్కువ సమయంలో గదిని వేగంగా చల్లబరుస్తుంది. ఇది విద్యుత్ బిల్లును పెంచదు. మీ విద్యుత్ ఖర్చును కూడా పెంచదు. 5 స్టార్ ఏసీ మిమ్మల్ని రెట్టింపు ఖర్చు నుండి ఆదా చేస్తుంది.
  4. గది చాలా చిన్నదిగా ఉంటే విండో ఏసీని ఎంచుకోండి. అది మీ గదిని వేగంగా చల్లబరుస్తుంది. విండో ఏసీ కూడా చౌకగా ఉంటుంది. దీని వల్ల మీ డబ్బు కూడా ఆదా అవుతుంది.
  5. ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ఏసీ సరైన ధరను తనిఖీ చేయండి. చాలా సార్లు ప్రజలు మార్కెట్‌లో ఖరీదైన ధరకు కూడా చౌకైన ఏసీని విక్రయిస్తారు. ఆ ఏసీ నాణ్యత బాగుండదు. తర్వాత మీరే ఇబ్బంది పడాతారు. ఏసీని కొనుగోలు చేసేటప్పుడు ఎవరూ మోసపోకుండా ఉండేందుకు దాని ధరను ముందుగానే తెలుసుకోండి.

ఇన్వర్టర్ ఏసీ ఎందుకు కొనాలి?

ఇన్వర్టర్ ఏసీ సాధారణ ఏసీ కంటే మరింత సమర్థవంతమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది ఎక్కువ శీతలీకరణతో తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. చాలా వరకు స్మార్ట్ ఏసీ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తాయి. తక్కువ కరెంటు బిల్లు కావాలంటే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఇన్వర్టర్ ఏసీని కొనుగోలు చేయాలి. ఇన్వర్టర్ ఏసీ గది ఉష్ణోగ్రత ప్రకారం శీతలీకరణ చేస్తుంది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఇది ఏసీ కంప్రెసర్‌ను పునఃప్రారంభించి, అద్భుతమైన శీతలీకరణ అనుభవాన్ని అందిస్తుంది.

Broom Vastu Tips: చీపురును ఏ దిక్కులో పెడితే ఇంటికి శుభం కలుగుతుంది?

ప్రతీ ఇంట్లోని చీపుర్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇల్లు శుభ్రంగా ఉండాలంటే చీపురు ఖచ్చితంగా కావాలి. ఒక్క రోజు కూడా ఇల్లు తుడవక పోయినా.. ఇల్లు ఇల్లులా ఉండదు. ఇల్లు తుడిచిన తర్వాత.. చీపుర్లను ఏదో ఒక మూలన పెడుతూ ఉంటారు. అయితే కొంత మంది మాత్రం.. చీపుర్లను ఎక్కువగా వంట గదిలో పెడుతూ ఉంటారు. చీపుర్లను వంట గదిలో పెట్టకూడదని జ్యోతిష్యులు చెబుతారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. వంటింట్లో చీపురు పెట్టడం వల్ల..

ప్రతీ ఇంట్లోని చీపుర్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇల్లు శుభ్రంగా ఉండాలంటే చీపురు ఖచ్చితంగా కావాలి. ఒక్క రోజు కూడా ఇల్లు తుడవక పోయినా.. ఇల్లు ఇల్లులా ఉండదు. ఇల్లు తుడిచిన తర్వాత.. చీపుర్లను ఏదో ఒక మూలన పెడుతూ ఉంటారు.

అయితే కొంత మంది మాత్రం.. చీపుర్లను ఎక్కువగా వంట గదిలో పెడుతూ ఉంటారు. చీపుర్లను వంట గదిలో పెట్టకూడదని జ్యోతిష్యులు చెబుతారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

వంటింట్లో చీపురు పెట్టడం వల్ల.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులపై చెడు ప్రభావం పెరుగుతుంది. దీని కారణంగా కుటుంబంలో కలహాలు అనేవి పెరుగుతాయి.

చీపురు అనేది లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే చీపురును తన్నకూడదు, పడేయకూడదని అంటూ చెప్తారు. కాబట్టి చీపురును ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని నిపుణులు అంటున్నార. దీని వల్ల మీ ఇంటి ఆనందం, శ్రేయస్సు అనేవి తగ్గుతాయి.

అలాగే సైన్స్ ప్రకారం చీపురును వంటింట్లో పెట్టడం వల్ల బ్యాక్టీరియా పెరిగే అవకాశం కూడా ఉంది. చీపురుతో అన్ని ప్రదేశాలను తుడుస్తారు. కాబట్టి చీపురులో ఖచ్చితంగా బ్యాక్టీరియా ఉంటుంది. వంటదిలో ఉంచడం వల్ల బ్యాక్టీరియా.. ఆహారాలపైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాగా చీపురును.. దక్షిణ లేదా పడమర దిక్కుల్లో ఉంచడాన్ని శుభప్రదంగా భావిస్తారు.

Hydration Drinks: వేసవిలో తొందరగా అలసిపోతున్నారా? శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచే 5 సూపర్ పానీయాలు ఇవీ..!

వేసవికాలం తీవ్రత పెరిగింది. ఇంకొన్ని రోజుల్లో అది విశ్వరూపం చూపిస్తుంది. ఇప్పటికే మండిపోతున్న ఎండల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శరీరంలో నీటిశాతం దారుణంగా పడిపోతోంది. దీని కారణంగా వడదెబ్బ కూడా సులభంగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా ఈ వేసవిలో శరీరం రోజంతా హైడ్రేట్ గా ఉండాలన్నా, ఎండ వేడిమి నుండి బయటపడాలన్నా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచే పానీయాలు తీసుకోవడం మంచిది. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచే 5 సూపర్ పానీయాలు కింద ఇవ్వబడ్డాయి. వీటిని తీసుకుంటే అలసట అనేది మిమ్మల్ని టచ్ చేయదు..

కొబ్బరి నీరు..

వేసవిలో ఎక్కువ డిమాండ్ కొబ్బరి నీటికే.. వేసవిలో విరేచనానికి వెళ్లినప్పుడు, రోజువారీ వ్యాయామం చేసినప్పుడు శరీరం నీటిశాతాన్ని చాలా కోల్పోతుంది. శరీరం కోల్పోయిన నీటిని తిరిగి భర్తీ చేయాలన్నా, శరీరానికి శక్తి లభించాలన్నా కొబ్బరినీరు ది బెస్ట్. కొబ్బరి నీటిలో డీహైడ్రేషన్ ను నిరోధించే ఎలక్ట్రోలైట్లు ఉంటాయి.
నిమ్మరసం..

విటమిన్-సి పుష్కలంగా కలిగిన నిమ్మరసం వేసవిలో రిఫ్రెష్ మూడ్ ఇస్తుంది. విటమిన్-సి గొప్ప యాంటీ ఆక్సిడెంట్ కావడంతో రోగనిరోధక శక్తిని పెంచి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో కూడా సహాయం చేస్తుంది.

ఇన్ఫ్యూజ్డ్ డ్రింక్స్..

ఇన్ఫ్యూజ్డ్ డ్రింక్స్ శరీరంలో టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. దోసకాయ, స్ట్రాబెర్రీ, పుదీనా, అల్లం, నారింజ వంటి కూరగాయలు, పండ్లు, ఆకులు మొదలైనవి ఇన్ఫ్యూజ్డ్ డ్రింక్స్ తయారీకి ఉపయోగించవచ్చు. ఇవన్నీ కొన్ని గంటల పాటూ నీటిలో ఉంచి ఆ తరువాత ఆ నీటిని తాగాలి.

దానిమ్మ జ్యూస్..

దానిమ్మ రసం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది గుండె, మెదడు, ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చెమట రూపంలో శరీరం కోల్పోయే నీటిని తిరిగి భర్తీ చేయడంలో దానిమ్మ సహాయపడుతుంది. శరీరానికి ఐరన్ ను కూడా బాగా అందిస్తుంది.

గ్రీన్ టీ..

గ్రీన్ టీ శరీరానికి రిఫ్రెష్ అనుభూతిని ఇస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి, శరీరాన్ని డిటాక్స్ చేయడానికి కూడా సహాయపడతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Sorghum: జొన్నల వల్ల ఇన్ని లాభాలా.. తెలిస్తే వదిలిపెట్టరు

జొన్నలు.. ఈ పేరు చెప్పగానే ఒక్కొకరి ముఖంలో ఒక్కో రియాక్షన్ కనిపిస్తుంది. పిల్లలైతే జొన్న రొట్టెలను చూస్తేనే ఆమడ దూరానికి పారిపోతారు. పెద్దల్లో ఈ తరం వారు ఎక్కువగా జొన్న రొట్టెలు తినడానికి ఇష్టపడరు. అయితే గోధుమ రొట్టెలతో పోల్చితే జొన్న రొట్టెల్లో పోషకాలు చాలా ఎక్కువ.

జొన్నలు తృణధాన్యాల రకం కిందకి వస్తాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది షుగర్, బీపీ, అల్సర్ వంటి అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరంతా ఇప్పుడు జొన్నల వైపు ఆసక్తి చూపుతున్నారు. వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ఉద్బవించిన జొన్నలు ఆరోగ్యకర ఆహారంగా పేరుపొందాయి. జొన్నలను పిండి లేదా సిరప్‌గా తీసుకున్నా ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవచ్చు. మెరుగైన జీర్ణక్రియ, ఆరోగ్యవంతమైన గుండె, బరువుని అదుపులో ఉంచేందుకు ఇవి ఉపయోగపడతాయి. జొన్నల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పోషకాలు..

జొన్నలు ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో గణనీయమైన మొత్తంలో ప్రొటీన్, ఫైబర్, భాస్వరం, ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాల వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

జీర్ణ వ్యవస్థ..

జొన్నలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పేగుల కదలికలకు సహాయం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఫైబర్ ప్రీబయోటిక్‌గా కూడా పనిచేస్తుంది. ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియాను పోషిస్తుంది. జొన్నలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.

షుగర్ స్థాయిలు..

జొన్నలు తక్కువ గ్లైసెమిక్‌ని కలిగి ఉంటాయి. మధుమేహం కలిగి ఉన్నవారు తమ శరీరంలో ఉన్న చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయాలనుకుంటే జొన్నలు బెస్ట్ ఆప్షన్. జొన్నలను భోజనంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌లో వచ్చే స్పైక్‌లు, క్రాష్‌లను నివారించవచ్చు. ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

గుండెలో..

జొన్నలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జొన్నలో ఉండే ఫినోలిక్ సమ్మేళనాలు వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెండూ హృదయ సంబంధ వ్యాధులతో ముడిపడి ఉంటాయి. జొన్నలోని అధిక ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత తగ్గిస్తుంది.

బరువు నియంత్రణ..

తినే ఆహారంలో రోజూ జొన్నలను చేర్చుకుంటే బరువు అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలన్నా జొన్నలు బాగా ఉపయోగపడతాయి. ఇందులోని అధిక ఫైబర్, ప్రొటీన్లు ఉంటాయి.

Grounding: గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఇవీ..!

ఆరోగ్యం కోసం అందరూ వాకింగ్ చేయడం సహజం. సాధారణంగా వాకింగ్ గురించి బోలెడు వివరణలు, మరెన్నో పద్దతులు చెబుతుంటారు. అయితే కొందరు మాత్రం పచ్చగడ్డి మీద చెప్పుల్లేకుండా నడిస్తే మంచిదని చెప్పడం వినే ఉంటారు. అసలు చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద నడవడం నిజంగానే ఆరోగ్యానికి మంచిదా? దీని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి? వైద్యశాస్త్రం దీని గురించి ఏం చెబుతోంది తెలుసుకుంటే..

మనస్సు, శరీరానికి కనెక్షన్..

గడ్డిపై చెప్పులు లేకుండా నడవడాన్ని గ్రౌండింగ్ లేదా ఎర్తింగ్ అని అంటారు. ఇది శరీరానికి, భూమికి మధ్య అనుబంధాన్ని ఏర్పరిచే గొప్ప మార్గం. ఇందులో భూమి నుండి శరీరానికి ఎలక్ట్రాన్ లను బదిలీచేయడం జరుగుతుంది. ఇది మంటను తగ్గిస్తుంది, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. శరీరంలో సహజంగా విద్యుత్ సమతుల్యతను ప్రోత్సహిస్తుంది.

ఒత్తిడి..

గడ్డిపైన నడవడం వల్ల మనస్సు, శరీరం పై ఒత్తిడి తగ్గుతుంది. ఇది ప్రశాంతతను చేకూరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గడంలో సహాయపడుతుంది. చెప్పులు లేకుండా భూమి మీద నడిచినప్పుడు ఒకానొక వైబ్రేషన్ పాదాల గుండా శరీరంలోకి ప్రసరించడం అనుభూతి చెందవచ్చు.

శక్తి ప్రవాహం..

శరీరంలో ఉండే వేలాది నరాలు పాదాల అరికాళ్ల వద్ద ముగుస్తాయి. చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలలో ఉండే రిఫ్లెక్స్ పాయింట్లు ప్రేరేపించబడతాయి. శరీరం అంతటా మెరుగైన ప్రసరణను, రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది శరీరంలో శక్తి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

పాదాల సమస్యలు..

కాళ్లకు చెప్పులు లేకుండా పచ్చ గడ్డి మీద నడవడం వల్ల పాదాలకు ఎనలేని శక్తి లభిస్తుంది. ఇది పాదాలకు సంబధించి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి..

మట్టిలో ఉండే సూక్ష్మజీవుల ప్రభావం కారణంగా రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. అనారోగ్యాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరానికి ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు బహిర్గతమవుతాయి. ఇది ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ కు సపోర్ట్ చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది.

Lowest Home Loan: ఈ బ్యాంకుల్లో అత్యల్ప వడ్డీ రేటుకే హోమ్ లోన్స్!

మీరు మొదటిసారిగా హోమ్ లోన్(home loan) తీసుకోవాలని ఆలోచిస్తున్నారా. అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే గృహ రుణం విషయంలో వడ్డీ రేటు(interest rates) కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఏఏ బ్యాంకుల్లో(banks) వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తప్పనిసరిగా పరిశీలించాలి. ఈ క్రమంలో మీకు తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణం ఇచ్చే బ్యాంకును ఎంచుకుంటే మీకు సౌలభ్యంగా ఉంటుంది. అయితే వడ్డీ రేట్లు మీ ఆదాయం, లోన్ రీపేమెంట్ సామర్థ్యం మీ లోన్(loan) అర్హతను నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
అంతేకాదు బ్యాంకుల నుంచి గృహ రుణ వడ్డీ రేట్లు(home loan interest rates) రుణం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి క్రెడిట్ స్కోర్, మొత్తం రుణం, కాల వ్యవధిని బట్టి కూడా నిర్ణయిస్తారు. మీ ఆస్తులు, అప్పులు, మీ పొదుపు చరిత్ర, మీ ఉద్యోగ భద్రత మొదలైనవి కూడా రుణం పొందడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

10 బ్యాంకుల్లో గృహ రుణ వడ్డీ రేట్లు (ఏప్రిల్ 7, 2024 నాటికి) (రూ. 30 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు)

1. బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణ వడ్డీ రేట్లు 8.30% నుంచి 10.75% వరకు ఉన్నాయి

2. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణ వడ్డీ రేట్లు 8.35% నుంచి 10.90% వరకు ఉన్నాయి

3. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.35% నుంచి 11.15% వరకు ఉన్నాయి

4. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) గృహ రుణ వడ్డీ రేట్లు 8.40% నుంచి 10.05% వరకు ఉన్నాయి

5. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.40% నుంచి 10.15% వరకు ఉన్నాయి

6. UCO బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.45% నుంచి 10.30% వరకు ఉన్నాయి

7. HDFC బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.50% నుంచి ప్రారంభం

8. కోటక్ మహీంద్రా బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.70% నుంచి ప్రారంభం

9. ICICI బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.75% నుంచి ప్రారంభం

10. యాక్సిస్ బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.75% నుంచి ప్రారంభం

ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యల్ప గృహ రుణ వడ్డీ రేట్లను సంవత్సరానికి 8.30 శాతం నుంచి అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, LIC హౌసింగ్ ఫైనాన్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై సంవత్సరానికి 8.35 శాతం నుంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. గృహ రుణ దరఖాస్తుదారులకు అందించే చివరి వడ్డీ రేట్లు వారి క్రెడిట్ స్కోర్, లోన్ మొత్తం, వృత్తి ప్రొఫైల్ సహా పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది.

YS Family Politics : వైఎస్ విజయమ్మ రెండు కళ్ల సిద్ధాంతం – జగన్, షర్మిల ఇద్దరికీ సపోర్ట్ సాధ్యమేనా ?

YS Vijayamma supports Jagan Or Sharmila : వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందు ఇడుపుల పాయలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ కార్యక్రమానికి జగన్ తల్లి విజయలక్ష్మి వచ్చారు. కుమారుడ్ని ఆశీర్వదించారు. ఈ పరిణామం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. తల్లి విజయలక్ష్మి మద్దతు జగన్‌కు ఉన్నట్లేనా అని చర్చించుకున్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనకు ఇడుపుల పాయకు వచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమెతో పాటు ప్రత్యేక విమానంలో విజయలక్ష్మి వచ్చారు. కుమార్తె షర్మిలను కూడా ఆశీర్వదించారు. అంటే.. అటు కుమారుడికి.. ఇటు కుమార్తెకు కూడా ఆమె మద్దతుగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఒకరిపై ఒకరు రాజకీయం చేసుకుంటున్నారు. జగన్ విమర్శలు చేస్తున్నారు. షర్మిల జగన్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇద్దరి వైపు ఉండటం సాధ్యం కాదు. మరి విజయలక్ష్మి మద్దతు ఎవరికి ఉంటుంది ?

పిల్లలిద్దరూ చెరో రాష్ట్రంలో రాజకీయాలు చేస్తారనుకున్న విజయలక్ష్మి

షర్మిల నేరుగా తన అన్నతో ఢీకొనడానికి ఇష్టం లేకే తెలంగాణలో పార్టీ పెట్టారని గతంలో ప్రచారం జరిగింది. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు విజయమ్మ పూర్తి మద్దతుగా నిలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి.. తన కుమార్తె కు అండగా ఉండాలి కాబట్టి.. వెళ్తున్నానని చెప్పుకున్నారు. పిల్లలిద్దరూ చెరో రాష్ట్రంలో రాజకీయం చేయాలని దేవుడు రాసి పెట్టారని చెప్పుకున్నారు. తెలంగాణలో వైఎస్ఆర్‌సీపీ పోటీ చేయడం లేదు కాబట్టి అన్నా చెల్లెళ్ల మధ్య సవాల్ జరిగే అవకాశం కనిపించ లేదు.అందుకే విజయమ్మకు కూడా ఇద్దరి మధ్య ఎవరో తేల్చుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. జగన్ ఓటమే లక్ష్యంగా షర్మిల పని చేస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు తీసుకుని అవినాష్ రెడ్డి హత్య కేసును మెయిన్ లీడ్ గా తీసుకుని జగన్ ను కార్నర్ చేస్తున్నారు. ఐదేళ్ల కిందట వివేకా హత్య జరిగినప్పుడు ఈ కుటుంబం అంతా ఐక్యంగా ఉంది. అందరూ వివేకానందరెడ్డి హత్య విషయంలో అప్పటి సీఎం చంద్రబాబునే కార్నర్ చేశారు. కానీ ఐదేళ్లు అయ్యే సరికి సీన్ మరిపోయింది. ఆ కుటుబంంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

ఒకరిపై ఒకరి విమర్శలతో విజయలక్ష్మికి ఇరకాటం

ఇప్పుు ఏపీలో రాజకీయాలు పూర్తిగా మరిపోయాయి. తాను స్థాపించిన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేసి ఏపీలో అధికారంమ చేపట్టాలన్న లక్ష్యంతో షర్మిల పని చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక బలమున్న చోటే వెదుక్కోవాలి. లేకపోతే కష్టం. తెలంగాణలో ఆమె ప్రభావం దాదాపుగా లేదని ఇక ఏటూ తేల్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి మొహమాటాలు వదిలేయాలని అనుకున్నారు. ఇలాంటి సమయంలో పిల్లల్లో విజయమ్మ సపోర్ట్ ఎవరికి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు విజయమ్మ కూతురు వైపే మొగ్గు చూపారు. కూతురుకు అండగా నిలవడమే ప్రాధాన్యతాంశంగా తీసుకున్నారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా రాజీనామా చేసినప్పుడు అదే చెప్పారు. ఇద్దరు బిడ్డలు రెండు రాష్ట్రాల్లో రాజకీయం చేస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు ఒకరిపైకి ఒకరు రాజకీయం చేసే పరిస్థితులు వచ్చాయి. షర్మిల ఏపీకి వచ్చేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత షర్మిలను కట్టడి చేయాలని విజయమ్మపై జగన్‌ ఒత్తిడి తెచ్చారన్న ప్రచారం జరిగింది. అయితే ఏవీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు రాజకీయం తెరమీదకు వచ్చేసింది

రెండు కళ్లల్లో ఏదో ఒకదానికే మద్దతు ఇవ్వాల్సిన సందర్భం !

తన ఇద్దరు పిల్లలు తనకు రెండు కళ్లని విజయమ్మ చెబుతూ వస్తున్నారు. అప్పుడు ఆమె రెండు కళ్లల్లో ఏదోక కంటికే ప్రాధాన్యం ఇవ్వక తప్పదన్న వాదన వినిపిస్తోంది. షర్మిళ వైపే విజయమ్మ నిలబడితే జగనుకు నైతికంగా భారీ దెబ్బ తగిలినట్టే భావిస్తారు. అందుకే జగన్మోహన్ రెడ్డి తల్లి మద్దతు కోసం ప్రయత్నించారు. విజయమ్మ కూడా .. జగన్ కు వ్యతిరేకంగా లేరు. ఆయన అధికారం పోవాలని విజయమ్మ కోరుకోలేరు. అలాగని.. కుమార్తెను కాదని ఆయనకు మద్దతుగా ఉండలేని పరిస్థితి. అయినా జగన్ మోహన్ రెడ్డి అడిగినందున.. తాను ప్రచారం ప్రారంభించే ముందు ఇడుపుల పాయ ప్రార్థనలకు హాజరయ్యారు. కానీ ఒక్క మాట కూడా జగన్ కు మద్దతుగా మాట్లాడలేదు. అలాగే షర్మిల చేపట్టిన అభ్యర్థుల ప్రకటన రాజకీయ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అయితే కుమార్తెకు మద్దతుగా వచ్చారు తప్ప.. ఆమె రాజకీయ ప్రకటన.. వ్యాఖ్యలు చేయలేదు.

ఇద్దరికీ మద్దతు అంతర్గతంగానే.. రాజకీయ ప్రచారమేమీ ఉండకపోవచ్చు !

ఎవరికీ మద్దతు ఇవ్వకుండా విజయమ్మ తటస్థంగా ఉంటారని వైసీపీ వర్గాలు నమ్ముతున్నాయి. కానీ ప్రస్తుతం విజయమ్మ షర్మిల వద్దే ఉంటున్నారు. రెండు, మూడు సార్లు షర్మిలతో కనిపిస్తే.. కుమార్తెకే ఆమె మద్దతు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇది సీఎం జగన్‌కు ఇబ్బందే. అందుకే మధ్యేమార్గంగా.. ఇడుపుల పాయలో ప్రార్థనలు చేసే సందర్భాల్లో జగన్ వెంట ఉండేలా ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూస్తే.. విజయమ్మ గతంలోలా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే పరిస్థితి లేదని భావిస్తున్నారు. తన బిడ్డను మరోసారి గెలిపించాలని ఆమె నోరారా కోరలేరు. ఎందుకంటే ఇద్దరు బిడ్డలు అధికారం కోసం పోరాడుతున్నారు. ఏ బిడ్డ కోసం అన్నది ఆమె తేల్చుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితి వైఎస్ విజయమ్మను ఒత్తిడికి గురి చేసేదే.

మెట్రో ప్రయాణికులకు షాక్.. అవన్నీ రద్దు చేస్తూ నిర్ణయం..

హైదరాబాద్ మెట్రో వచ్చాక ప్రజా రవాణా ఎంతో సులభమైన విషయం తెలిసిందే. పైగా ప్రభుత్వం మెట్రో విస్తరణ పనులను వేగవంతం కూడ్ చేస్తున్నారు. ఈ మెట్రో సర్వీస్ వల్ల నగరంలో ప్రజలకు ప్రయాణం ట్రాఫిక్ తిప్పలు లేకుండా సులభంగా జరుగుతోంది. పైగా ఇది ఎండాకాలం కావడంతో మెట్రో ప్రయాణానికి డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాకిచ్చింది. మెట్రో ప్రయాణంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మెట్రో ప్రయాణికులకు ఇస్తున్న రెండు రాయితీలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వార్త విన్న తర్వాత మెట్రో ప్రయాణికులు షాకవుతున్నారు.

హైదరాబాద్ మెట్రో మధ్యలో కొంత డిమాండ్ తగ్గిన విషయం తెలిసిందే. పైగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉండనే ఉంది. అయితే ప్రయాణికులను ఆకర్షించేందుకు హైదరాబాద్ మెట్రో కొన్ని రాయితీలను అందిస్తూ ఉంటుంది. వచ్చే ప్రయాణికులు తక్కువ ధరకే తమ గమ్యస్థానాలు చేరేందుకు వీలుగా ఈ రాయితీలు ఉంటాయి. కానీ, ఇప్పుడు మెట్రో సర్వీసులకు డిమాండ్ పెరిగిపోయింది. రాష్ట్రంలో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నగర ప్రజలు బస్సులు, వ్యక్తిగత వాహనాల కంటే మెట్రో ప్రయాణమే సౌకర్యవంతంగా భావిస్తున్నారు. అందుకే మెట్రో ప్రయాణానికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ డిమాండ్ ని క్యాష్ చేసుకునే పనిలో హైదరాబాద్ మెట్రో పడినట్లు కనిపిస్తోంది.

అధిక రద్దీ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఉన్న రెండు రాయితీలను తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రూ.59 హాలిడే కార్డు ఉంటుంది. ఆ హాలిడే కార్డు సదుపాయాన్ని ఇక నుంచి రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మెట్రో ప్రయాణంలో ప్రయాణికులకు ఇచ్చే 10 శాతం రాయితీని కూడా రద్దు చేసేందుకు హైదరాబాద్ మెట్రో నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రద్దు నిర్ణయాలు మెట్రో ప్రయాణంపై ప్రభావం చూపుతాయా అంటే? ఏమాత్రం చూపవనే చెప్పాలి. ఎందుకంటే ఇంతటి విపరీతమైన ఎండల్లో ఎవరూ బైకులపై ప్రయాణం చేయాలి అనుకోరు. మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో బస్సులు కచ్చితంగా రద్దీగా ఉంటున్నాయి. అలాంటి సందర్భాల్లో ఎవరైనా కచ్చితంగా మెట్రో ప్రయాణానికే మొగ్గు చూపుతారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకునే.. మెట్రో కూడా ఈ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బ్యాంక్‌ లోన్లు తీసుకున్న వారికి అలర్ట్.. RBI గవర్నర్ కీలక ప్రకటన!

భారతీయ రిజర్వ్ బ్యాంక్ నేడు కీలక వడ్డీ రేట్లను ప్రకటించింది. 7వ సారి కూడా రెపో రేటును ఏమాత్రం మార్చలేదు. రెపో రేటు ప్రస్తుతం 6.5 శాతంగా కొనసాగిస్తున్నట్లుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఆరు మంది సభ్యులతో ఏప్రిల్ 3 వ తేదీన ప్రారంభమైన ఆర్బీఐ మొనెటరీ పాలసీ కమిటీ సమావేశం ఈరోజు (శుక్రవారం, ఏప్రిల్5) తో ముగిసింది. తర్వాత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తాజా ద్రవ్య విధాన ప్రకటన సమర్పించనున్నారు. ఈ సందర్భంగా ఆర్ధిక వ్యవస్థపై కీలక విషయాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కీలకమైన రేట్లపై ఎంపీసీ తీసుకున్న నిర్ణయాలను ఆయన తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రస్తుతం రెపో రేటు యథాతథంగా ఉంచేందుకు ద్రవ్య పరపతి కమిటీ ఏక పక్షంగా నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. కొంత కాలంగా ఆర్థిక వృద్ది గాడిలో పడిందని.. అన్ని అంచనాలు దాటివేస్తున్నామని అన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉందని ఆయన తెలిపారు. ఇక డిసెంబర్ నాటికి 5.7 శాతంగా ఉన్న ద్రవ్యోల్భణం 2 మాసాల్లో 5.1 శాతనికి తగ్గింది అని తెలిపారు. ఈ క్రమంలో జీడీపీ అంచనాల గురించి ఆయన కీలక ప్రకటన చేశారు. 2024-25 సంవత్సరానికి గాను జీడీపీ వృద్ది రేటు ఏడు శాతం ఉంటుందని అంచనా వేశారు. ఈ ఏడాది జూన్ మాసానికి ఆర్బీఐ మొనేటరీ పాలసీ కమిటీ తదుపరి సమావేశం ఉంటబోతుందని తెలిపారు.

అప్పటి వరకు ఇదే రెపో రేట్ కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. ద్రవ్యోల్భణం తమ టార్టెట్ కి దగ్గరగానే ఉందని అన్నారు. కోర్ ద్రవ్యోల్భణం గత తొమ్మిది నెలలుగా దిగివస్తుందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుత ద్రవ్యోల్భణం రేటు, యూఎస్ ఫెడ్ నుంచి వస్తున్న సంకేతాలను బట్టి మన దేశంలో వడ్డీ రేట్లను తగ్గించే శుభవార్త ఉంటుందని అందరూ భావించారు. దీని వల్ల ఈఎంఐ భారం కొంత మేర తగ్గుతుండొచ్చని భావించారు. కానీ వడ్డీ రేట్లు యధాతథం అనే వార్త రావడంతో బ్యాంక్ లోన్లు తీసుకున్న వారికి ఏడోసారి నిరాశే మిగిలింది. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Health

సినిమా