Saturday, November 16, 2024

Health Tips: వీటిని రోజుకు రెండు తీసుకుంటే చాలు.. ఒంట్లో కొవ్వు మొత్తం మంచులా కరిగిపోతుంది..

అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువు పెరగడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.. అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి..
అందుకే చాలా మంది బరువు తగ్గించుకోవడం కోసం వింత ప్రయోగాలు చేస్తుంటారు.. అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.. అలాంటి డ్రై ఫ్రూట్స్ లలో ఒకటి అప్రికాట్.. దీన్ని ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అప్రికాట్ గురించి అందరికి తెలుసు.. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. ముఖ్యంగా విటమిన్ ఎ, సిలు అధికంగా ఉంటాయి.. బీటా కెరోటిన్, లుటీన్, పోటాషియం, యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.. అందుకే వీటిని రోజు మీ డైట్ లో చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.. అంతేకాదు కండరాల సంకోచాన్ని తగ్గిస్తుంది.. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది..
హైబీపిని కంట్రోల్ చెయ్యడంలో ఇవి సహాయ పడతాయి.. అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.. ఇక వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది.. అలాగే ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.. దాంతో ఎక్కువసేపు తినకుండా ఉంటారు.. కొవ్వు మొత్తం కరిగిపోతుంది.. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

రెండో శనివారం సెలవు ఎందుకో తెలుసా?

సెలవు వచ్చిందంటే చాలు చాలా మంది ఫుల్ హ్యాప్పీ గా ఉంటారు. స్కూల్ పిల్లల నుంచి ఉద్యోగుల వరకు సెలవుల కోసం వెయిట్ చేస్తుంటారు. అయితే ప్రతి వారంలో ఆదివారం సెలవు అనేది కామన్.
మళ్లీ ఏవైనా పండుగలైతే సెలవు తీసుకుంటాము. కానీ మనకు రెండో శనివారం కూడా హాలిడే ఉటుంది. భారతదేశంతో సహా అనేక దేశాల్లో ప్రతి నెల రెండో శనివారం బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాలయాలకు, కొన్ని ప్రైవేటు కంపెనీలకు హాలిడే ఉంటుంది. అయితే ఈ రెండో శనివారం సెలవు ఎందుకు ఉంటుందన్న సందేహం మీలో చాలామందికి వచ్చే ఉంటుంది. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు రెండో శనివారం సెలవు ఎందుకు? అసలు రెండో శనివారం సెలవు ఇవ్వడానికి గల కారణం ఏమిటి? కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారి, ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అతను సెలవుల్లో మాత్రమే తన వృద్ధ తల్లిదండ్రులను కలిసేందుకు స్వగ్రామానికి వెళ్లేవాడు. కొన్ని రోజులకు అది కూడా కుదిరేది కాదట. దీంతో అతని తల్లిదండ్రులు కొడుకును చూసేందుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారి ప్రతి నెలలో రెండో శనివారం అతని స్వగ్రామానికి వెళ్లటానికి సెలవు ఇచ్చాడట. దీంతో అప్పటి నుంచి బ్రిటీష్ ప్రభుత్వం అధికారికంగా సెలవు ఇవ్వడం ప్రారంభించింది.స్వాతంత్య్రం తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ సెలవును అనుసరిస్తూనే వస్తోంది.

బరితెగించిన ఉద్యోగుల సలహాదారు. కోడ్‌ను విస్మరించి మరీ ఉద్యోగులపై ఒత్తిడి చంద్రశేఖర్‌రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కారు. కోడ్‌ను ఉల్లంఘించి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల సంఘం నాయకుడిగా ఉన్న సమయంలోనే వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు పూర్తిగా ముసుగు తొలగించేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న విషయాన్ని ఉద్దేశ పూర్వకంగానే విస్మరించి..

వైసీపీకి ఓటు వేయాలంటూ ఉద్యోగులపై పరోక్షంగా ఒత్తిడి తేవడం ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ జగన్‌ సర్కార్‌కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మే 13న జరిగే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఉద్యోగులంతా ఓటు వేసి, జగన్‌ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో తాము అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామంటున్న విపక్ష నేతలకు సైతం హెచ్చరికలు చేశారు.”ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా.. ప్రతిపక్షాల మాట వింటారా? రూల్స్‌ అనేవి ప్రభుత్వం పెడుతుందా? ప్రతిపక్షాలు రూపొందిస్తాయా?

ఉద్యోగుల జోలికి వస్తే.. సహించేది లేదు” అని తీవ్రంగా హెచ్చరించారు. మంగళవారం అమరావతి సచివాలయంలో తన చాంబర్‌లో మీడియా సమావేశం నిర్వహించి, ప్రతిపక్ష పార్టీల నేతలకు తీవ్ర హెచ్చరికలు చేయడం గమనార్హం. ఇదేసమయంలో కోడ్‌ను ఉల్లంఘించి ప్రభుత్వ కార్యాలయంలో కూర్చుని ఉద్యోగులు ప్రభుత్వానికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుత సీఎం వలంటీర్‌, గ్రామ సచివాలయ వ్యవస్థ తెచ్చారని తెలిపారు. దీనికి మంచి పేరు రావడంతో ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. ప్రభుత్వాన్ని తప్పు పట్టడం ఫ్యాషన్‌ అయిపోయిందన్నారు. కాగా, చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా ఉన్న ఆయన వైసీపీ నాయకుడిగా మారి ఇలా ప్రచారం చేయడం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

బూడిద గుమ్మడితో ఇన్ని లాభాలా? కానీ వీళ్లు మాత్రం జాగ్రత్త!

ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నపేరు బూడిద గుమ్మడికాయ. వడియాలకోసమో, లేక గుమ్మానికి దిష్టికోసమో, స్వీట్‌కోసమే వినియోగించే గుమ్మడికాయ అనుకుంటే పొరబాటే.
శరీరంలోని వ్యర్ధాలను తొలగించేందుకు అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. పరగడుపున దీని జ్యూస్‌ తాగితే.. సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

దీన్నే వింటర్‌మిలన్‌ అనీ, సంస్కృతంలో కుష్మాండ , బృహత్ఫల, ఘృణావాస, గ్రామ్యకర్కటి, కర్కారు అని కూడా అంటారు. ఇది ఆరిజన్‌ ఎక్కడ అనేదానిపై స్పష్టత లేనప్పటికీ జపాన్, ఇండోనేషియా, చైనా లేదా ఇండో-మలేషియాలో పుట్టిందని ఊహిస్తున్నారు.

అపారమైన ఔషధ గుణాలకు గుమ్మడికాయ ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేద పానీయంగా భావించే గుమ్మడికాయ జ్యూస్‌తో ప్రస్తుతం, పొట్ట సమస్యలు, కాలేయ సమస్యలు , చర్మ సమస్యల చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇది ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది. చాలా మందికి రుచి నచ్చకపోవచ్చు, కానీ సప్లిమెంట్లు ఇతర ఆహార పదార్థాలలో లేని ఔషధ విలువలు ఇందులో చాలా ఉన్నాయి.
గుమ్మడికాయ జ్యూస్‌ రూపంలో తీసుకుంటే అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. చాలా సహజంగా శక్తినిచ్చే ఆహారాలలో ఒకటి ఇందులోని బయో యాక్టీవ్ న్యూట్రియంట్స్ దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం ఇస్తుందని నమ్మకం.

బూడిద గుమ్మడికాయలో 96 శాతం నీరు ఉంటుంది. 4 శాతంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, జింక్, కాల్షియమ్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్ , కాపర్, నియాసిన్, థయామిన్, రిబోఫ్లావిన్ విటమిన్ బి1, బి 2, బి3, బి5, బి6, విటమిన్ సీ ఉంటాయి.

బూడిద గుమ్మడికాయ ప్రోబయోటిక్ అంటే కడుపులో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది.జీర్ణక్రియను సమర్ధవంతంగా నిర్వహిస్తుంది. యాంటాసిడ్‌గా పనిచేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ మొదలైన సమస్యలను తగ్గిస్తుంది శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది. లివర్ పని తీరును మెరుగు పరుస్తుంది
బూడిద గుమ్మడికాయ రసంలో యాంజియోలైటిక్ లక్షణాలున్నాయి. ఇది నాడీ వ్యవస్థకుమంచిది. డిప్రెషన్‌, ఆందోళనతో బాధపడేవారికి చాలా మంచిది. మూర్ఛవ్యాధితో బాధపడేవారికి కూడా మేలు చేస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్‌ ఆప్షన్ బూడిద గుమ్మడికాయ జ్యూస్‌. కేలరీలు , కార్బోహైడ్రేట్లు తక్కువ, జీరో ఫాట్ లక్షణాలు పైగా ఫైబర్‌ ఎక్కువ. మధుమేహం ఉన్న వారికి మంచిది. ఉబకాయాన్ని నిరోధిస్తుంది కాబట్టి గుండె జబ్బుల రిస్క్ ను తగ్గిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.గుమ్మడికాయలో విటమిన్ B3 అధికం. శక్తినిస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌లెవెల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యానికి , సౌందర్యానికి మేలు చేస్తుంది. యాంటి ఏజింగ్‌గా పనిచేస్తుంది. ఫ్లవనాయిడ్స్ ఉన్నందున యాంటీ కేన్సర్‌గా పని చేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి పెంపొందిస్తుంది.

ఎవరు తాగకూడదు.
ఈ ప్రపంచంలో ప్రతిదానికీ లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయి. దీర్ఘంకాలం తీసుకుంటే లోహ మూలకాలు పేరుకు పోతాయి. జ్వరంతో బాధపడుతున్నవారు, చలువ గుణం కలిగి ఉన్నందున జలుబుతో బాధపడుతున్న వారు తినకూడదు. బ్రోన్కైటిస్ ,ఆస్తమా పేషంట్లు దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా గర్భిణి స్త్రీలు వైద్యుల సలహా మేరకే దీన్ని తీసుకోవాలి. మితంగా తీసుకున్నంతవరకే ఏ ఆహారమైనా ఔషధంగా పనిచేస్తుంది. ‘అతి సర్వత్రా వర్జయేత్‌’ దీన్ని మర్చిపోకూడదు.

ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్‌.. ఏప్రిల్‌ 1 నుంచి..

దేశంలో అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ డెబిట్ కార్డ్‌ల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేసింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఎస్‌బీఐ డెబిట్ కార్డ్‌లపై వార్షిక నిర్వహణ ఛార్జీలను రూ.75 పెంచింది. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. పెరిగిన చార్జీలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తాయి.

ఎస్‌బీఐ తమ కస్టమర్లకు అనేక రకాల డెబిట్ కార్డ్‌లను అందిస్తుంది. వాటికి తదనుగుణంగా వార్షిక నిర్వహణ రుసుమును వసూలు చేస్తుంది. ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం, దాని క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్‌లకు వర్తించే ప్రస్తుత వార్షిక నిర్వహణ ఛార్జీలు రూ. 125 ప్లస్‌ జీఎస్టీ ఉండగా ఏప్రిల్‌ 1 నుండి రూ. 200 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

అదేవిధంగా యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్‌ల నిర్వహణ రుసుములు రూ. 175 ప్లస్ జీఎస్టీ ఉండగా ఏప్రిల్ 1 తర్వాత రూ. 250 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. ఇక ప్లాటినం డెబిట్ కార్డ్ వార్షిక నిర్వహణ రుసుము ఏప్రిల్ 1 తర్వాత రూ. 250 ప్లస్ జీఎస్టీ నుండి రూ. 325 ప్లస్‌ జీఎస్టీకి పెరుగుతుంది.

Viral ప్రేమించిన వ్యక్తి కోసం రూ.2484 కోట్ల ఆస్తిని వదిలేసుకున్న మహిళ

మనిషిని బంధించే భావాలలో ప్రేమ ఒకటి.. దీని ముందు ఏదీ ఎక్కువ కాదు అనిపిస్తుంది. ఎంతటి త్యాగం అయినా చిన్నగానే అనిపిస్తుంది. అయితే ఈరోజుల్లో అంత స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ ఉంది భయ్యా..
అందరూ ప్రేమించామని మాటలు చెప్పేవాళ్లే..నిజంగా ప్రేమించే వాళ్లను మనం ఎక్కడో అరుదుగా చూస్తుంటాం.. ప్రేమించిన వ్యక్తి కోసం.. కుటుంబాన్ని వదులుకోవడానికి చాలా మంది మహిళలు ధైర్యం చేయరు.. వారిని ఆ బంధం కట్టిపడేస్తుంది. కానీ ప్రేమించిన వ్యక్తి కోసం 2500 కోట్ల ఆస్తిని వదిలేసుకున్న మహిళ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..!

మలేషియాకు చెందిన కోటీశ్వర కుటుంబానికి చెందిన ఓ మహిళ తన ప్రేమకు కుటుంబం అంగీకరించకపోవడంతో కుటుంబ ఆస్తులను వదిలేసి వచ్చింది. ఏంజెలిన్ ఫ్రాన్సిస్ మలేషియా వ్యాపారవేత్త కూ కే పెంగ్, మాజీ మిస్ మలేషియా పౌలిన్ సాయ్ కుమార్తె. చాలా ధనిక కుటుంబానికి చెందిన ఆమె అయినప్పటికీ ఓ సాధారణ వ్యక్తితో ప్రేమలో పడింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు, ఏంజెలిన్ తన క్లాస్‌మేట్ అయిన జెడిడియాతో ప్రేమలో పడింది. ఏంజెలిన్ తన ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పగా, వారు అంగీకరించలేదు.
ఏంజెల్ తండ్రి డబ్బు, ఆస్తి, హోదా వంటి కారణాలతో ఏంజెల్ ప్రేమను అంగీకరించలేదు. ఫలితంగా, ఆమె తన కుటుంబాన్ని విడిచిపెట్టి, తన ప్రేమికుడిని వివాహం చేసుకోవడం ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. కాబట్టి ఆమె తన ప్రేమికుడు జెడిడియా ఫ్రాన్సిస్‌ను వివాహం చేసుకోవడానికి వారసత్వంగా వచ్చిన $300 మిలియన్లను (దాదాపు రూ. 2,484 కోట్లు) తిరస్కరించింది.

ఏంజెలిన్, జెడిడియా 2008లో వివాహం చేసుకున్నారు. వారి కుటుంబాలకు దూరంగా నివసిస్తున్నారు. ఏంజెలిన్ మాదిరిగానే, జపాన్ యువరాణి మాకో కూడా 2021లో తన కళాశాల ప్రియుడు అయిన కీ కొమురోవాను వివాహం చేసుకోవడానికి తన రాయల్ బిరుదును వదులుకున్నారు. ప్రేమ కోసం ప్రజలు తమ జీవితంలో అత్యంత విలువైన వస్తువులను కూడా త్యాగం చేయగలరని ఇది చూపిస్తుంది. నిజమైన ప్రేమ అనేది భౌతిక ఆస్తులు లేదా ఆర్థిక స్థితి గురించి కాదు, ప్రేమ మరియు ఐక్యత వంటి ప్రాథమిక మానవ అవసరాలకు సంబంధించినది అని ఏంజెలిన్ కథ ద్వారా మరోసారి రుజువైంది.

Home loans: హోమ్ లోన్ ఉన్న వారికి గుడ్ న్యూస్.. ఈ చిట్కాతో వడ్డీ భారమే లేకుండా చేయొచ్చు..

సొoతిల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల. దాన్ని సాకారం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హోమ్ లోన్లపై ఎక్కువగా ఆధారపడతారు. మీకు వచ్చే ఆదాయం ఆధారంగా వివిధ బ్యాంకులు మీకు రుణాలను మంజూరు చేస్తాయి.
వాటితో మీరు సొంతింటిని కోనుగోలు చేసుకోవచ్చు. ఆ రుణానికి కొంత వడ్డీ కలిపి ప్రతినెలా బ్యాంకు లేదా రుణం ఇచ్చిన సంస్థకు ఈఎమ్ఐలు చెల్లించాలి. ఇది దాదాపు 20 ఏళ్ల వరకూ మీ ఎంచుకున్న కాలాన్ని బట్టి ఉంటుంది. అంతకాలం పాటు ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొంత కాలం చెల్లించిన దానిని మధ్యలో భారాన్ని తగ్గించుకోవడానికి మరో హోమ్ లోన్ తీసుకుని ఇది క్లియర్ చేయొచ్చా? అంటే చేయచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలా అంటే ప్రస్తుతం ఉన్న బ్యాంకు అందిస్తున్న వడ్డీ కంటే తక్కువ వడ్డీకి ఏదైనా బ్యాంక్ రుణం ఇస్తుందేమో తెలుసుకొని దానికి మీ రుణమొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

ఈ ఉదాహరణ చూడండి..

మీ వార్షిక ఆదాయం రూ.22 లక్షలు అనుకుందాం. మీరు 2021లో రూ. 70 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారు. దానికి 9 శాతం వడ్డీతో కలిసి నెలకు 55 వేలు ఈఎమ్ఐ కడుతున్నారు. మీ బాకీ తీరాలంటే దాదాపు 30 ఏళ్లు వాయిదాలు కట్టాలి. ఇక మీకు నెలకు రూ. 30 వేలు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోమ్ లోన్ వడ్డీరేటు, ఈఎమ్ఐ భారాన్ని తగ్గించుకోవడానికి, రుణదాతలను మార్చడానికి మీకు అవకాశం ఉంటుంది. అదెలా అంటే..

ముందుగా కొత్త రుణదాత వసూలు చేసే వడ్డీరేటు, మారడానికి విధించే అదనపు రుసుములు, మీ రుణం కాలవ్యవధి, మీ ఆర్థిక పరిస్థితి వంటి వాటిని పరిశీలించాలి.
పైనే తెలిపిన వివరాల ప్రకారం కొత్త రుణదాతకు మారడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. రూ. 70 లక్షల రుణం, 30 ఏళ్ల కాలపరిమితిని పరిగణనలోకి తీసుకుంటే వాయిదాల మొత్తం ఈ విధంగా ఉంటుంది.
మీ సిబిల్ 800 నుంచి 850 మధ్య ఉంటే మీకు 8.4 శాతం వడ్డీరేటు పడుతుంది. తద్వారా నెలవారీ ఈఎమ్ఐ రూ. 52,005గా ఉంటుంది. పాత ఈఎమ్ ఐతో పోల్చితే మీకు నెలకు రూ.2,995 ఆదా అవుతుంది.
మీ సిబిల్ స్కోర్ 740 నుంచి 799 మధ్య ఉంటే మీ తీసుకున్న రుణానికి 8.75 శాతం వడ్డీ రేటు విధిస్తారు. మీ ఈఎమ్ ఐ నెలకు 53,745 పడుతుంది. అంటే మీకు నెలకు రూ. 1,255 ఆదా అవుతుంది.
మీ వార్షిక ఆదాయం రూ. 22 లక్షలు, నెలవారీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి రూ. 30 వేలు కాబట్టి ఈఎమ్ఐ తక్కువగా ఉంటే మీ పొదుపు పెరుగుతుంది.
ముఖ్యంగా అదనపు ఖర్చులను పరిగణించాలి. ప్రస్తుత రుణదాతతో కూడా చర్చలు జరపాలి. రుణదాతను మార్చడం వల్ల కలిగే ప్రయోజనాన్ని కచ్చితంగా లెక్కవేయగలగాలి. దీర్ఘకాలిక ఉపయోగాలు, ఖర్చుల ఆధారంగా నిర్ణయం తీసుకోండి.

Motivation: పక్కవారిని నమ్మితే పనులు జరగవు, మిమ్మల్ని మీరే నమ్ముకోండి, ఈ పక్షి కథ అదే చెబుతోంది

Motivation: ఒక పక్షి పొలంలో గూడు కట్టుకుని పిల్లలతో హాయిగా నివసిస్తోంది. కొంతకాలానికి పంట కోతకు వచ్చింది. పక్షి, దాని పిల్లలు ఏ క్షణమైనా పొలం విడిచి వెళ్లేందుకు సిద్ధమవ్వాలి.
ఒకరోజు తల్లి పక్షి ఆహారం కోసం వెళ్ళింది. ఆ సమయంలో పిల్లలు మాత్రమే గూడులో ఉన్నాయి. వాటికి రైతు మాటలు వినిపించాయి. ‘రేపు నా స్నేహితుడుతో కలిసి వచ్చి కోతలు పూర్తి చేయాలి’ అని అన్నాడు. రైతు అన్న ఆ మాటలను పక్షి పిల్లలు తమ తల్లికి చెప్పాయి. ‘అమ్మా… ఈ రోజే మనమిక్కడ నుంచి వెళ్లిపోవాలి. రేపు ఉదయం రైతు తన స్నేహితుడుతో వచ్చి పంటలను కోసేస్తాడు’ అని చెప్పాయి.

దానికి తల్లి పక్షి ‘రేపు కోతలు జరగవు. భయపడకండి. రేపు మనం ఇక్కడ ఉండవచ్చు’ అని చెప్పింది. మరుసటి రోజు నిజంగానే కోతలు జరగలేదు. ఆరోజు రైతు మళ్లీ పొలానికి వచ్చాడు. తల్లి పక్షి ఆహారానికి వెళ్ళింది. అప్పుడు రైతు ‘స్నేహితులతో పని కావడం లేదు. ఈసారి బంధువులను ఎవరినైనా పిలిచి రేపు కోతలు పూర్తి చేస్తాను’ అని అన్నాడు. ఆ మాటలు విన్న పక్షిపిల్లలు తల్లి గూడుకు తిరిగి వచ్చాక చెప్పాయి. అప్పుడు కూడా తల్లి పక్షి ‘రేపు కూడా కోతలు జరగవు. నిశ్చింతగా ఉండండి’ అని అంది. నిజంగానే రైతు కోతలు మొదలుపెట్టలేదు. రైతు బంధువుల రాకపోవడంతో వాటిని ఆపేశాడు .

మరుసటి రోజు మళ్లీ తల్లి పక్షి ఆహారానికి వెళ్ళింది. రైతు పొలానికి వచ్చాడు. అతను చాలా అసహనంగా ఉన్నాడు. ‘స్నేహితులు రాలేదు, బంధువులు రాలేదు. వీళ్ళని నమ్ముకుంటే పనులు జరగవు. ఈసారి నేనే రేపు కోతలు కోసేస్తాను’ అని అన్నాడు. అదే విషయాన్ని పక్షి పిల్లలు తల్లికి చెప్పాయి. తల్లి ‘మనం ఇక్కడ నుంచి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఈరోజు రాత్రికి మనం కొత్త గూడు కట్టుకొని వెళ్ళిపోదాం’ అని అంది

పక్షపిల్లలు ‘అమ్మా… రైతు రెండు రోజులు నుంచి బంధువులను, స్నేహితులను తీసుకువచ్చి కోతలు కోయిస్తానని అంటున్నాడు. ఆ విషయం మేము మీకు చెప్పినా మీరు కంగారు పడలేదు. కానీ ఇప్పుడు తానే కోస్తానని సిద్ధమయ్యాడు. అది మాత్రం ఎలా నమ్మారు’ అని అడిగాయి.

తల్లి పక్షి ‘ఇంతవరకు రైతు ఇతరుల సహాయం మీద ఆధారపడ్డాడు. వారి వల్ల పనులు జరగవని అర్థమైంది. ఈసారి తనే కోతలు కోసేందుకు సిద్ధమయ్యాడు.కాబట్టి కచ్చితంగా పంటను కోసేస్తాడు. ఇతరుల మీద ఆధారపడిన వ్యక్తి ఏ పనిని పూర్తి చేయలేడు. తనని తాను నమ్ముకుంటేనే పనిని పూర్తి చేయగలడు. అలాగే విజయం అయినా ఇతరుల సహాయం మీద ఆధారపడితే దక్కదు. మన మీద మనకు నమ్మకం ఉండి ముందుకు సాగితేనే దక్కుతుంది. ఈ రైతు కూడా తనని తాను నమ్ముకుని పొలంలోకి దిగుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కోతలు కోస్తాడు. మీరు కూడా పెద్దయ్యాక మిమ్మల్ని మీరే నమ్ముకోండి. ఎదుటివారిని నమ్మి గుడ్డిగా నిర్ణయాలు తీసుకోకండి’ అని చెప్పింది తల్లి పక్షి

ఇది అందరికీ వర్తిస్తుంది. స్నేహితులను, బంధువులను నమ్మి ముందుకు సాగే బదులు మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు సాగండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకునే శక్తి మీకు వస్తుంది. ఇతరుల సాయంతో సాధించిన విజయం కంటే… మిమ్మల్ని మీరు నమ్ముకొని కష్టపడి సాధించిన విజయం తీయటి గుర్తుగా మిగిలిపోతుంది.

7th pay Commission : కేంద్ర ఉద్యోగులకు 2 నెలల ఏరియర్స్​ పడేది ఎప్పుడంటే..

7th pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్​. పెరిగిన జీతాలు.. మార్చి 30న అందే అవకాశం ఉందని మీడియా కథనాలు సూచిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో మార్చి 31 ఆదివారం అయినప్పటికీ బ్యాంకులు పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలిచ్చిన తరుణంలో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది.

లేబర్ బ్యూరో ప్రతి నెలా విడుదల చేసే తాజా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (సీపీఐ-ఐడబ్ల్యూ) ఆధారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం (డీఏ) లెక్కిస్తారు.

డీఏ ఏరియర్స్​..

కేంద్ర ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపును ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇది.. 2024 జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. ఈ కారణంగా అలవెన్స్ 46శాతం నుంచి 50 శాతానికి పెరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి, ఫిబ్రవరి నెలల ఏరియర్స్​ ఉంటాయి.

హెచ్ ఆర్ ఏ సంగతేంటి?

Central government arrears news : డీఏతో పాటు ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ) కూడా పెరుగుతుందని, నగర వర్గీకరణను బట్టి ఉద్యోగులకు 30 శాతం వరకు హెచ్ఆర్ఏ లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చైల్డ్ కేర్ అలవెన్స్, చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్, హాస్టల్ సబ్సిడీ, ట్రాన్స్​ఫర్​ ట్రావెల్ అలవెన్స్, డ్రెస్ అలవెన్స్, గ్రాట్యుటీ సీలింగ్, మైలేజ్ అలవెన్స్ వంటి ఇతర ప్రత్యేక అలవెన్సులు కూడా పెరగవచ్చు. అయితే ఉద్యోగులు ఈ అలవెన్సులను తదనుగుణంగా క్లెయిమ్ చేసుకోవాలి.

చివరిసారిగా డీఏ పెంపు ఎప్పుడు జరిగింది?

2023 అక్టోబర్​లో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) నాలుగు శాతం పెరిగింది. ఫలితంగా.. డీఏ 46 శాతానికి చేరింది. ఈ నిర్ణయంతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి పొందారు.

7th pay Commission arrears : అయితే.. ఏరియర్స్​ పడటంపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

PM Surya Ghar: ఫ్రీ కరెంట్‌ ఇచ్చే పీఎం సూర్య ఘర్‌ పథకానికి ఎవరు అర్హులు, ఎవరు కాదు?

Eligibility For PM Surya Ghar Muft Bijli Yojana: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ వల్ల చాలా తక్కువ ఖర్చుతో (సబ్సిడీ పోను) ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు, సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.
తద్వారా, నెలకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వాడుకోవచ్చు, షాక్ కొట్టే కరెంటు బిల్లుల నుంచి విముక్తి పొందొచ్చు.

కొత్త రూఫ్టాప్ సోలార్ స్కీమ్ను (పీఎం సూర్య ఘర్ ముప్త్ బిజిలీ యోజన) తొలిసారిగా ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ తర్వాత, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, 2024 ఫిబ్రవరి 01న లోక్సభలో మధ్యంతర బడ్జెట్ సమర్పిస్తూ పథకం గురించి ప్రకటించారు.

ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

రూ.78 వేల వరకు సబ్సిడీ

కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం, 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్ సిస్టమ్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.30 వేలు సబ్సిడీ ఇస్తుంది. 2 కిలోవాట్ల ప్యానల్కు రూ.60 వేలు సబ్సిడీ, 3 కిలోవాట్ల సోలార్ ప్యానల్ సిస్టమ్కు రూ.78 వేలు సబ్సిడీ ఇస్తుంది.

తాకట్టు లేకుండా రుణం

సబ్సిడీ పోను, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు వెచ్చించే అదనపు ఖర్చును బ్యాంక్ లోన్ రూపంలో పొందొచ్చు. దీనిపై తక్కువ వడ్డీ తీసుకుంటారు. ఈ లోన్ కోసం బ్యాంక్లకు ప్రజలు ఎలాంటి పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రకటన ప్రకారం, ఇంటి పైకప్పుపై గరిష్టంగా 3 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర ఫలకాలు బిగించుకోవడానికి 7% వడ్డీ రేటుతో కొలేటరల్ ఫ్రీ లోన్ (తాకట్టు లేని రుణం) అందుబాటులో ఉంటుంది.

PM సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అర్హతలు, అనర్హతలు

దరఖాస్తు చేసుకునే వ్యక్తి భారతీయ పౌరుడై ఉండాలి.
దరఖాస్తు చేసే వ్యక్తి వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలి.
సోలార్ ప్యానెళ్ల వ్యవస్థ ఏర్పాటు చేయడానికి స్థలం ఉండాలి. దరఖాస్తుదారు వార్షిక వేతనం రూ. 1.5 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు.
పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రాధాన్యత ఉంటుంది.
కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా భారతీయులంతా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుదారు గానీ, అతని కుటుంబంలో గానీ ప్రభుత్వ ఉద్యోగి/ఉద్యోగులు ఉంటే, దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉండదు
దరఖాస్తుదారు దగ్గర అవసరమైన & సరైన పత్రాలు ఉండాలి.
దరఖాస్తుదారు బ్యాంక్ ఖాతా – ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి.

PM సూర్య ఘర్ యోజన కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు
ఆధార్ కార్డు
నివాస ధృవీకరణ పత్రం
విద్యుత్ బిల్లు
బ్యాంకు పాస్ బుక్
పాస్పోర్ట్ సైజు ఫోటో
రేషన్ కార్డు
మొబైల్ నంబర్
అఫిడవిట్
ఆదాయ ధృవీకరణ పత్రం

ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన 2024 ప్రయోజనాలు

దరఖాస్తుదారు నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా వినియోగించుకోవచ్చు.
300 యూనిట్లు మించి వాడితేనే బిల్లు చెల్లించాలి.
వాడుకోగా మిగిలిన విద్యుత్ను ప్రభుత్వానికి అమ్మొచ్చు.
వేల రూపాయల విద్యుత్ ఖర్చుల గురించి ఆందోళన ఉండదు.
విద్యుత్తు లేని వారి ఇళ్లలో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కొత్త విద్యుత్ కనెక్షన్లను కూడా ఏర్పాటు చేస్తుంది.

Center Point Of The Earth: భూమి మధ్యలో ఏ దేశం ఉందో తెలుసా? ఇదిగో దీని ప్రత్యేకత

Center Point Of The Earth: విశాల ప్రపంచంలో అద్భుతాలకు కొదువ లేదు. భూభాగాలు, పర్వత శిఖరాలు, సముద్ర మట్టం వంటి ఎన్నో ఆశ్చర్యకరమైనవి ఉన్నాయి. ఇక ఈ భూమిని కేంద్రంగా చేసుకొని ఎన్నో పరిశోధనలు కూడా చేస్తున్నారు.
కొన్ని అంచనాలకు అందేవి అయితే మరికొన్ని అందనివి. పోటీ పరీక్షల్లో కూడా భూమికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. మరి ఇందులో భాగంగానే భూమి మధ్యలో ఏ దేశం ఉందో మీకు తెలుసా?

భూమి గోళాకారంగా ఉందా? చదునుగా ఉందా అని ఎన్నో పరిశోధనలు చేస్తే చివరకు గోళాకారంగా ఉందని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అయితే భూమి మధ్యలో ఉండే దేశం పేరు ఏంటి అనే ప్రశ్నకు కూడా సమాధానం కనుగొన్నారు. ఈ దేశం పేరు ఘనా. దీన్ని ఊహాజనిత ప్రదేశంగా పేర్కొంటారు. అంతే వివరంగా చెప్పాలంటే.. భూమి మధ్యలో దేశం లేకపోతే ఘనాను భూమికి కేంద్రం అంటారు. మరి ఈ ఘనాను కేంద్రం అని ఎందుకు అంటారు అనే ప్రశ్న కూడా తలెత్తిందట. అది కూడా తెలుసుకోండి.

ఘనా భూమికి మధ్యలో ఉన్న ఆఫ్రికా దేశం. దీన్ని భూమికి కేంద్రంగా పరిగణిస్తారట. ఇక్కడి నుంచే భూమి వెడల్పులను కొలుస్తారు కూడా. ఘనా భూమి మధ్య నుంచి 380 మైళ్ల దూరంలో ఉంటుంది. ఇది భూమి మధ్యలో చాలా దగ్గరగా ఉన్నందుకు దీన్ని భూమి కోర్ అంటున్నారు. భూమికి మధ్యలో ఉండడం వల్ల ఇక్కడ వాతావరణం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ అత్యధిక వేడి ఉంటుందని తెలుస్తోంది. మే, జూన్ లలో బయటకు వెళితే మంటల్లో కాల్చినట్టుగా ఉంటుందట.

ఈ దేశం చుట్టు బంగారు గనులు ఉండేవట. దీంతో చాలా సంపన్న దేశంగా పేరు సంపాదించింది. ఇక్కడ ఉన్న బంగారాన్ని ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేయవచ్చని కూడా అంటారు. దీన్ని స్వాధీనం చేసుకోవడానికి పోర్చుగీస్, బ్రిటీషర్ల మధ్య ఎన్నో యుద్దాలు కూడా జరిగాయట. అయితే ఇక్కడ ప్రజల జీవన విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోనే మానవులు కట్టిన అతిపెద్ద సరస్సు, వోల్టా ఉంది.

KCR Family: చరిత్రలో తొలిసారి ఎన్నికలకు దూరంగా కేసీఆర్ ఫ్యామిలీ.. కారణం అదేనా!

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 23 ఏళ్ల క్రితం ఉపిరి పోసుకున్న ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. మారిన రాజకీయ పరిణామాలతో దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రస్తుత బీఆర్ఎస్‌గా మారింది.
రాజకీయాలే పరమావధిగా అవిర్భవించిన పార్టీ చరిత్రలో తొలిసారిగా పార్టీ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంటోంది.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అతని కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు 2004 నుండి ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీ రామారావు, కేసీఆర్ మేనల్లుడు టి.హరీష్ రావుల్లో ఎవరో ఒకరు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా ఎన్నికల బరిలోకి దిగలేదు. గతంలో ఎంపీగా గెలిచిన కవిత లిక్కర్ స్కామ్ కేసుతో ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో ఓడిపోయిన కేసీఆర్ కుమార్తె కె.కవిత ఈసారి పోటీ చేయడం లేదు. తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా ఉన్న ఆమెను ఇటీవల ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించింది. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది.

2001లో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కేసీఆర్ 2004లో కరీంనగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికై కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయ్యారు. 2006, 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన అదే స్థానాన్ని నిలబెట్టుకున్నారు.2009లో కేసీఆర్ మహబూబ్‌నగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ కాలంలోనే తెలంగాణ రాష్ట్ర లక్ష్యాన్ని సాధించడంలో విజయం సాధించారు.

2014లో తెలంగాణలో టీఆర్ఎస్ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. మరోసారి అసెంబ్లీకి ఎన్నికైన ఆయన కుమారుడు, మేనల్లుడు ఆయన కేబినెట్‌లో మంత్రులు అయ్యారు. ఏకకాలంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2018లో టీఆర్‌ఎస్‌ అధికారాన్ని నిలబెట్టుకోగా, 2019 ఎన్నికల్లో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ చేతిలో కవిత ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె శాసనమండలికి ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌ చేతిలో అధికారాన్ని కోల్పోయింది.

మే 13న ఎన్నికలు జరగనున్న మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను బీఆర్‌ఎస్ ప్రకటించింది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకం పాటించామని ఆ పార్టీ పేర్కొంది. అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ సామాజిక సమీకరణలను పరిశీలించి, తద్వారా అన్ని వర్గాల విశ్వాసాన్ని పొందేలా అభ్యర్థుల ఎంపిక చేసినట్లు గులాబీ పార్టీ నేతలు తెలిపారు. అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే వెనుకబడిన కులాల నుంచి ఆరుగురు, షెడ్యూల్డ్ కులాల నుంచి ముగ్గురికి, షెడ్యూల్డ్ తెగల నుంచి ఇద్దరికి, ఇతర కులాల నుంచి ఆరుగురికి బీఆర్ఎస్ టికెట్లు దక్కాయి.
2019లో తొమ్మిది స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు – నామా నాగేశ్వరరావు (ఖమ్మం), మాలోత్ కవిత (మహబూబాబాద్), మన్నె శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్‌నగర్)లకు మరోసారి అవకాశం కల్పించింది. ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు ఇతర పార్టీలకు ఫిరాయించగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక సిట్టింగ్ ఎంపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక ప్రజల మద్దతున్న నాయకులను ఎంపిక చేయడం ద్వారా, ప్రత్యర్థులతో పోలిస్తే వీరికి మంచి అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ భావిస్తోంది.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని, ఈ భావన మరింత బలపడుతోందని గులాబీ పార్టీ విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో తన విజయాన్ని నమోదు చేసేందుకు పార్టీ సన్నాహాలు చేస్తోంది. కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తమకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని గులాబీ పార్టీ పేర్కొంది. అన్ని నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజల ఆదరణ పొందేందుకు పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ త్వరలో నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

Viral రహస్యంగా రూ.వందలకోట్ల ఆస్తి.. కుమారుడికి తెలియకుండా దాచిన తండ్రి..!

వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని తన కుమారుడికి తెలియకుండా రహస్యంగా ఉంచాడో తండ్రి. 20 ఏళ్లు వచ్చిన తర్వాతే తమ సంపద గురించి అతడికి వెల్లడించాడట.
ఏటా రూ. 690 కోట్ల విలువైన వ్యాపారం చేసే మాలా ప్రిన్స్‌ బ్రాండ్‌ వ్యవస్థాపకుడి (multimillionaire in China) కుటుంబ కథ ఇది..!

చైనా (China)లో ప్రముఖ బ్రాండ్ మాలా ప్రిన్స్ వ్యవస్థాకుడు జాంగ్‌ యుడాంగ్‌. ఆయన కుమారుడు జాంగ్ జిలాంగ్‌. అతడు మీడియాతో మాట్లాడుతూ ఓ ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించారు. ”నాకు 20 ఏళ్లు వచ్చేవరకు మా కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి నా తండ్రి అబద్ధం చెప్పారు. మా నాన్న స్థాపించిన ఈ బ్రాండ్ గురించి తెలిసినప్పటికీ, వ్యాపారం అప్పుల్లో ఉందని తరచూ చెప్పేవారు. పింగ్‌జియాంగ్ కౌంటీలోని ఒక మధ్యతరగతి ఇంట్లో నా జీవితం సాగింది. కుటుంబం పేరు ఉపయోగించకుండానే నా విద్యాభ్యాసం పూర్తిచేశాను. గ్రాడ్యుయేషన్ తర్వాత అప్పులు తీర్చేందుకు ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలనుకొన్నాను. అయితే గ్రాడ్యుయేషన్ సమయంలో మాకున్న సంపద గురించి నాన్న బయటపెట్టారు’ అని వెల్లడించారు. ఈ రహస్యం బయటపడిన తర్వాతే ఆ కుటుంబం రూ.11 కోట్ల విలువైన విల్లాలోకి మారింది. ఒక సాధారణ వ్యక్తిగా పెరిగితేనే.. జీవితంలో విజయం సాధించడం కోసం కష్టపడి పనిచేస్తారనేది యుడాంగ్ అభిప్రాయం. అదే సూత్రాన్ని తన కుమారుడి పెంపకంలో ఉపయోగించారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు మాలా ప్రిన్స్‌లో ఈ కామర్స్ విభాగంలో జిలాంగ్ పనిచేస్తున్నారు. తన పనితీరు నచ్చితేనే సంస్థ బాధ్యతలు కట్టబెట్టడం గురించి ఆలోచిస్తానని తండ్రి చెప్పినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అతడు చెబుతున్నది నమ్మశక్యంగా లేదని, కల్పితంలా ఉందని కామెంట్లు పెట్టారు. మరొకరేమో..”నేను ఈ కథను నమ్ముతున్నాను. ఈ బ్రాండ్ ఇటీవలి కాలంలోనే యాడ్స్ ఇవ్వడం ప్రారంభించింది. ప్రిన్స్ గ్రాడ్యుయేట్ అవ్వడం వల్లేనేమో” అని రాసుకొచ్చారు.

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌కు కొత్త బాస్‌.. ఎవరీ పవన్‌ దావులూరి?

మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విండోస్, సర్ఫేస్‌ విభాగాలకు కొత్త బాస్‌ వచ్చారు. వీటిని నడిపించేందుకు ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి పవన్‌ దావులూరి (Pavan Davuluri)ని ఆ కంపెనీ నియమించింది.
ఈ విభాగానికి నాయకత్వం వహించిన పనోస్‌ పనయ్‌ (Panos Panay) గతేడాది అమెజాన్‌లో చేరడంతో ఆయన స్థానంలో పవన్‌కు బాధ్యతలు అప్పగించారు. మైక్రోసాఫ్ట్‌లో పవన్ 2001లో చేరారు. దాదాపు మూడేళ్లుగా కంపెనీలో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

పవన్‌.. ఐఐటీ మద్రాసులో తన గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1999లో అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ పట్టా అందుకున్నారు. కెరీర్ ప్రారంభం నుంచే మైక్రోసాఫ్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన.. 2001లో రిలయబిలిటీ కాంపోనెంట్ మేనేజర్‌గా పదవి చేపట్టారు. వీటితోపాటు మైక్రోసాఫ్ట్‌లో వివిధ పదవులు నిర్వహించారు. తాజా నియామకానికి ముందు ఆయన విండోస్ సిలికాన్ అండ్‌ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్‌కు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇటీవలే మైక్రోసాఫ్ట్‌లో డీప్‌మైండ్ విభాగం మాజీ సహ వ్యవస్థాపకుడు ముస్తఫా సులేమాన్‌ను ఏఐ బ్రాంచ్‌ అధిపతిగా ప్రకటించింది. ఆ తర్వాత పవన్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. తాజా నియామకంతో ఆయన అమెరికా టెక్‌ కంపెనీల్లో అత్యున్నత పదవులు చేపట్టిన భారతీయుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గతంలో విండోస్‌, సర్ఫేస్‌ విభాగాలకు వేర్వేరుగా అధిపతులు ఉండేవారు. తాజాగా పవన్‌కే రెండింటి బాధ్యతలనూ మైక్రోసాఫ్ట్‌ అప్పగించింది.

Credit Card: మహిళల ప్రత్యేక ప్రయోజనాల కోసం ‘దివా’ క్రెడిట్ కార్డును తెచ్చిన బ్యాంక్ ఇదే!!

Divaa Card
“Divaa” Credit Card variant is a newly launched Credit Card which comes with feature packed benefits and exclusive offers to Women

ఈకార్డు ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలుగనున్నాయో బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి.

18 నుంచి 70 ఏళ్ల మహిళలకు
కనీస వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు
ఆదాయ రుజువు లేకపోతే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై కూడా
యాడ్ఆన్ కార్డులు కూడా మహిళలకే
దరఖాస్తుకు పత్రాలు: శాలరీ స్లిప్, ఫామ్‌ 16, ఐటీ రిటర్న్స్, పాన్, ఆధార్
ప్రయోజనాలు:

ఏడాదికి 8 దేశీయ, 2 అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్
వార్షిక ఆరోగ్య ప్యాకేజీ
రూపే నెట్‌వర్క్‌లో వివిధ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, యూపీఐ బెనిఫిట్స్
1% ఇంధన సర్‌ఛార్జ్‌ రీయింబర్స్‌మెంట్
ట్రావెల్, హోటల్ రిజర్వేషన్లు, కన్సల్టెన్సీ సేవలపై రాయితీలు
లాక్మీ సెలూన్, నైకా, ఇక్సిగో, మింత్రా, ఫ్లిప్‌కార్డ్, బిగ్ బాస్కెట్, బుక్‌ మై షో, అర్బన్ క్లాప్ వంటి సైట్లలో డిస్కౌంట్
ప్రతి రూ.100 ఖర్చుకు రూ.2 రివార్డ్ పాయింట్స్
వార్షిక రుసుము రూ.499 (30 వేలు ఖర్చు చేస్తే మినహాయింపు)

100 రూ. పాత నోటా?! RBI ఇచ్చిన సూచనలేమిటి?

ఢిల్లీ మార్చి 25: పాత రూ.100 నోట్లను బ్యాన్ చేయబోతున్నారు కాబట్టి వీలైనంత త్వరగా మీ పాత నోట్లను బ్యాంకులకు తిరిగి ఇచ్చి కొత్త నోట్లను పొందండి అంటూ వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వ్యాపించిన ఓ సందేశం..
ఇదేదో తెలియక ప్రజలను అయోమయంలో పడేస్తోంది. నిజమో, అబద్ధమో కొందరు బ్యాంకులను సందర్శిస్తారు.ఇచ్చిన వారు చాలా మంది ఉన్నారు.

ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000/- డినామినేషన్ నోట్లను బ్యాంకుకు తిరిగి ఇవ్వాలని మరియు భర్తీ డబ్బును పొందాలని సూచించింది. అంతకుముందు 2017 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం 500, 1000 డినామినేషన్ నోట్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాంటప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా 100, 200, 500, 1000 డినామినేషన్ల కొత్త నోట్లను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 6 ఏళ్ల తర్వాత మళ్లీ కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ 2000 రూపాయల నోట్లను తయారు చేశాయి.

ఇప్పుడు మళ్లీ పాత 100 రూపాయల నోట్లను బ్యాన్ చేయనున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. అయితే ఇందులో నిజం లేదని బ్యాంకు స్పష్టం చేసింది.వంద రూపాయల పాత నోటును నిషేధించలేదు!వంద రూపాయల పాత నోటు చెల్లదని వార్తలు రావడంతో ఎట్టకేలకు ఆర్బీఐ దీనిపై స్పష్టత ఇచ్చింది. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయంలో అయోమయానికి గురికావద్దని సూచించారు. రూ.100 నోట్లను మార్చి 31 వరకు మాత్రమే వినియోగించవచ్చని, ఆ తర్వాత మళ్లీ ఉపయోగించకూడదని పుకార్లు వ్యాపించాయి.

అందువల్ల ప్రజలు తమ వద్ద ఉన్న పాత వంద రూపాయల నోట్లను తిరిగి ఇవ్వడానికి బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.అందువల్ల కొత్త మరియు పాత రెండు వందల రూపాయల నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అన్నారు. ఇక నుంచి ఇలాంటి వార్తలు మీకు అందితే భయపడకండి, సరైన సమాచారం తెలుసుకున్న తర్వాతే ముందుకు సాగండి. అయితే మళ్లీ ఏదైనా నోటును బ్యాన్ చేస్తే దానిపై బ్యాంకు అధికారిక ప్రకటన చేసి నోట్ల మార్పిడికి తగిన సమయం ఇస్తుందని.. ఓవరాల్ గా సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం అంతా నిజం కాదని మరోసారి రుజువైంది. కాబట్టి వాట్సాప్‌లో వచ్చే తప్పుడు సమాచారానికి దూరంగా ఉండండి మరియు అలాంటి సందేశాలను ఎవరికీ ఫార్వార్డ్ చేయవద్దు.

స్టూడెంట్స్​కు గుడ్ న్యూస్.. వరుసగా 7 రోజులు సెలవులు! ఎందుకంటే..?

తెలుగు రాష్ట్రల్లోని స్కూల్, కాలేజీలు చదువుతున్న విద్యార్థులకు వరుస సెలవులతో పండగ వాతవరణం నెలకొంది. ఎప్పుడెప్పుడు సెలవు దొరుకుంతదా హాయిగా విశ్రాంతి తీసుకుందాం అనుకునే విద్యార్థులకు ఈ ఏడాది మొత్తం పండగాల కారణంగా వరుస హాలిడేస్ రాబోతున్నాయి. ఇప్పటికే హోలీ పండుగ కారణంగా వరుసగా రెండు రోజులు సెలవులు దొరకడంతో పిల్లలు ఆనందగా హోలీ పండుగను నిర్వహించుకున్నారు. ఇక సెలవులు ముగియడంతో నేటి నుంచి మళ్లీ స్కూల్, కాలేజీలు అంటూ పరుగులు పెట్టాలి. దీంతో మళ్లీ ఏ పండుగ వస్తుందా.. ఎప్పుడు సెలువులు ఇస్తారా అని క్యాలెండర్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి హాలిడేస్ కోసం ఎదురుచూసే విద్యార్థులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. మళ్లీ స్కూల్ పాఠశాలలు వరుసగా 7 రోజులు పాటు సెలవులు ఇవ్వనున్నారు. ఎందుకంటే..

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రల్లో విద్యార్థులకు ఒంటి పూట బడులు కొనసాగుతున్నాయి. అలాగే మరో వైపు విపరీతమైన ఎండలు ఉండడంతో ఈఏడాది త్వరాగా వేసవి సెలవులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. కనుక ఆ పరీక్షలు ముగియగానే మిగిలిన తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అనంతరం భారీగా వేసవి సెలవులు ఇవ్వవచ్చు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ఏప్రిల్ నెలలో విద్యార్థులకు వరుసగా 7 రోజులు సెలవులు రానున్నాయి. అయితే ఈ హాలిడేస్ అనేవి ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 17 వరకు వరుసగా పాఠశాలలకు, కాలేజీలకు ఇవ్వనున్నారు. కారణమేమిటంటే.. ఈ ఏప్రిల్ నెలలో ఉగాది, రంజాన్ , శ్రీరామనవమి సందర్భంగా వారం రోజుల్లో వరుసగా 4 రోజలు సెలవులు రానున్నాయి.

అలాగే వీటితో పాటు అదనంగా.. రెండో శనివారం, ఆదివారం కూడా ఉండటంతో.. ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 17 వరకు వరుసగా పాఠశాలలకు సెలవులు రానున్నాయి. అదే విధాంగా కాలేజీలకు కూడా సెలువులు ఇవ్వనున్నారు. ఇక వేసవి సెలవులు ఏప్రిల్ 18 కానీ, ఏప్రిల్ 20 నుంచి కానీ ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే తిరిగి జూన్ 13వ తేదీ వరకు ఈ వేసవి సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ క్రమంలోనే ఈ ఏడాది వేసవి సెలవులు దాదాపు 50 రోజలు పాటు ఇచ్చే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కూడా ఇంచుమించు ఇవే సెలవులు ఉండే అవకాశం ఉందని సమాచారం.

అర ఎకరంలో 60 బోర్లు!.. ఐకమత్యంతో ఏదైనా సాధ్యమే అంటున్న రైతులు

అర ఎకరంలో ఒకటి రెండు కాదు ఏకంగా 60 బోర్లు వేసి రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. సాధారణంగా ఒక బోరు వేస్తే పక్క పొలంలో ఇంకొక బోరు వేసుకోవడానికి రైతులు అంగీకరించరు.
అలాంటిది ఐకమత్యంతో ఒకే చోట 60 బోర్లు వేసి వ్యవసాయం చేస్తూ.. ఐకమత్యంతో ఉంటే ఏది అయినా సాధ్యం అని అనంతపురం రైతులు నిరూపిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని మడుగుపల్లిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటంతో దాన్ని నివారించేందుకు గ్రామప్రజలందరూ కలిసి సమీష్టి నిర్ణయం తీసుకున్నారు.

అందరూ సమీష్టిగా ఒకే చోట బోర్లు వేసుకొని భూఅంతర్భాగం నుంచి పైపుల ద్వారా పొలాలకు నీటిని చేరవేస్తూ కరువును నివారిస్తున్నారు. ఇప్పటికీ ఆ ఊరిలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా కొందరు రైతులు ఒకరితో ఒకరు మాట్లాడుకోరని, అయినా సరే వ్యవసాయం విషయంలో కలిసి మెలిసి ఉంటామని చెబుతున్నారు. గతంలో గుడి వద్ద 140 బోర్లు ఉండేవని అక్కడ నీరు తగ్గిపోవడంతో మరో చోట బోర్లు వేసుకున్నామని అంటున్నారు. ఇప్పుడు ఉన్న చోట అర ఎకరం భూమిలో 60 బోర్లు వేశామని, అవి నిరంతరం నీళ్లు అందించడంతో వ్యవసాయం చేసుకుంటున్నామని చెబుతున్నారు.

Gautam Adani: జియోతో పోటీకి సిద్ధమవుతున్న అదానీ.. ఉచిత 5G ఇంటర్నెట్‌ ఇవ్వనున్నారా?

భారతదేశంలో ముఖేష్ అంబానీ జియో ప్రారంభించిన తర్వాత టెలికాం పరిశ్రమలో కొత్త చరిత్ర సృష్టించారు. అప్పటి నుంచి జియో ఏకపక్ష పాలన సాగిస్తోంది. జియో కనెక్షన్లు దేశంలోని ప్రతి మూలకు, గ్రామాలకు గ్రామాలకు చేరుకున్నాయి. జియోకు పోటీగా ఎవరూ లేరని తెలుస్తోంది. అయితే గౌతమ్ అదానీ కంపెనీ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. భారతదేశంలో స్పెక్ట్రమ్ వేలం మే 20 నుండి ప్రారంభమవుతుంది…
భారతదేశంలో ముఖేష్ అంబానీ జియో ప్రారంభించిన తర్వాత టెలికాం పరిశ్రమలో కొత్త చరిత్ర సృష్టించారు. అప్పటి నుంచి జియో ఏకపక్ష పాలన సాగిస్తోంది. జియో కనెక్షన్లు దేశంలోని ప్రతి మూలకు, గ్రామాలకు గ్రామాలకు చేరుకున్నాయి. జియోకు పోటీగా ఎవరూ లేరని తెలుస్తోంది. అయితే గౌతమ్ అదానీ కంపెనీ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. భారతదేశంలో స్పెక్ట్రమ్ వేలం మే 20 నుండి ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి మార్చి 8న వారికి డీఓటీ నోటీసు కూడా పంపింది. స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు అదానీ గ్రూప్ సీఈవో గౌతమ్ అదానీ ఓ సమావేశంలో సూచన చేశారు. ఇందులో మేం పాల్గొంటున్నామని చెప్పారు. అటువంటప్పుడు గౌతమ్ అదానీ 5G ఇంటర్నెట్ సర్వీస్ హక్కులను పొందవచ్చని అంచనా. అదేంటంటే ఫాస్ట్ ఇంటర్నెట్ సర్వీస్‌లో అదానీ గ్రూప్ డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది.
దీనికి సంబంధించి గౌతమ్ అదానీ ట్విట్టర్‌లో ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. టెలికాం రంగంలోకి ప్రవేశించడంపై ఆయన అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కొన్ని నివేదికలు వారు కొత్త కంపెనీతో అడుగుపెట్టవచ్చని చెబుతున్నారు. అయితే దీనిపై అదానీ కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. టెలికాం మార్కెట్‌లోకి గౌతమ్ అదానీ ప్రవేశానికి సంబంధించి పెద్దగా ఎలాంటి అప్‌డేట్ లేదు. అయితే గౌతమ్ అదానీ ఇండస్ట్రీలోకి వస్తే ముఖేష్ అంబానీ, సునీల్ మిట్టల్ లాంటి వ్యాపారవేత్తలతో పోటీ పడతాడా? అలాంటి ప్రశ్న తలెత్తుతుంది.

గౌతమ్ అదానీ 5G ఇంటర్నెట్ సర్వీస్ సెక్టార్‌లో భారీ వాటాను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. అత్యధిక బిడ్డర్ కూడా తదుపరి ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఖచ్చితంగా అదానీ గ్రూప్‌ని నేరుగా వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీస్ ప్రాసెస్‌లోకి ప్రవేశించేలా చేస్తుంది. గౌతమ్ అదానీ ఈ మార్కెట్‌లోకి ప్రవేశించి ఉచిత ఇంటర్నెట్ సేవలను అందించడం ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తారని అంచనా. వాస్తవానికి, ప్రస్తుతానికి, ఇవి కేవలం బయట వినిపించే మాటలేనని, మరో రెండు నెలల్లో పూర్తి స్పష్టత వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

733 Jobs : రైల్వేలో 733 జాబ్స్.. ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ సహా ఎన్నో పోస్టులు

733 Jobs : రైల్వే ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎదురు చూస్తున్నారా ? ఇది మంచి అవకాశం. రైల్వేలో 733 అప్రెంటిస్​పోస్టుల భర్తీకి సౌత్​ ఈస్ట్ సెంట్రల్​ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది.
అయితే ఈ నియామకం ఒప్పంద ప్రాతిపదికన జరగనుంది. అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగణంగా టెన్త్, ఇంటర్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. అత్యధికంగా ఫిట్టర్​ పోస్టులు 187, ఎలక్ట్రీషియన్​ పోస్టులు 137, కోపా (COPA) పోస్టులు 100, వైర్​మెన్ పోస్టులు 80, పెయింటర్​ పోస్టులు 42, కార్పెంటర్ పోస్టులు 38 ఉన్నాయి. వీటితో పాటు డ్రాఫ్ట్​మెన్​ (సివిల్​) – 10, ఎలక్ట్రో మెకానిక్​ – 5, మెషినిస్ట్ – 4, ప్లంబర్​ – 25, మెకానిక్​ (RAC) – 15, ఎస్​ఎండబ్ల్యూ – 4, స్టెనో (ఇంగ్లీష్​) – 27, స్టెనో (హిందీ) – 19, డీజిల్ మెకానిక్​ – 12, టర్నర్​ – 4, వెల్డర్​ – 18, కెమికల్ లేబరేటరీ అసిస్టెంట్​ – 4, డిజిటల్ ఫొటోగ్రాఫర్​ – 2 పోస్టులు(733 Jobs) ఉన్నాయి.

పై ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.టెన్త్​, ఇంటర్, ఐటీఐ​ల్లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత వారికి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాదిపాటు అప్రెంటీస్​షిప్​ ట్రైనింగ్ ఇస్తారు. అభ్యర్థులు సౌత్ ఈస్ట్​ సెంట్రల్​ రైల్వే అధికారిక వెబ్​సైట్​ https://www.apprentice shipindia.gov.in ద్వారా అప్లికేషన్ ఫామ్‌ను సమర్పించాలి. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ ఏప్రిల్​ 12.

ఉదయాన్నే ఇలా చేస్తే జిమ్‌కు వెళ్లకుండానే బరువు తగ్గొచ్చు.. ఒక్క గ్లాసు నీటితో మటాష్ అంతే..

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా మనం తీసుకుంటున్న ఆహారం.. జీవనశైలే దీనికి కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా భారతదేశంలోని ప్రజలు జిడ్డుగల ఆహారాలు, తీపి వంటకాలను చాలా ఇష్టపడతారు. దీని కారణంగా ఊబకాయానికి గురవుతారు. ఒక్కసారి బరువు పెరిగితే తగ్గించుకోవడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి రోజువారీ జీవితంలో సమయం కేటాయించి వ్యాయామశాలకు వెళ్లడానికి తగినంత సమయం లేదు. అలాగే ప్రతి ఒక్కరూ సరైన ఆహారం గురించి చెప్పే డైట్ నిపుణుడిని పొందలేరు. అందుకే.. అలాంటి వారి కోసం ఇంట్లోనే తయారకు చేసుకునే ఓ డ్రింక్ ను పరిచయం చేయబోతున్నాం.. ఇప్పుడు మీరు సులభంగా బరువు తగ్గాలనుకుంటే మీరు ఈ ప్రత్యేకమైన డ్రింక్ సహాయం తీసుకోవచ్చు.. అదేంటో తెలుసుకోండి..

వాము నీరు సహాయంతో ఈజీగా బరువు తగ్గొచ్చు..

బరువు తగ్గడానికి వాము ఎఫెక్టివ్ రెమెడీ అని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఆయుర్వేద, ఔషధ గుణాలతో నిండి ఉంది. వాము నీటిని తాగడం వల్ల పొట్ట, నడుము కొవ్వు తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఈ మసాలా దినుసు వాము నీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వాము నీటిని ఎలా ఉపయోగించాలి..

రోజూ ఉదయం ఏమీ తినకుండా వాము నీటిని తాగితే త్వరగా బరువు తగ్గడంతోపాటు పొట్ట కూడా తగ్గుతుంది.

వాము నీటిని కొద్దిగా వేడి చేసిన తర్వాత కూడా తాగవచ్చు. ఇంకా మీకు మంచి ఫలితాలు కావాలంటే మీ రోజువారీ ఆహారంలో వాము వినియోగాన్ని పెంచుకోవచ్చు..

బరువు తగ్గడానికి కొంచెం వామును ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగడంతోపాటు తినండి.

ఇలా నెల రోజుల పాటు వాము నీటిని తాగితే మీ శరీరంలో తేడాను గుర్తించవచ్చు.. ఇంకా బరువును కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు..
మీరు రాత్రిపూట వామును నీటిలో నానబెట్టడం మరచిపోతే, ఉదయం, ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా వామును కలపండి. దానిని ఒక పాత్రలో ఉడకబెట్టండి. అందులో 5-6 తులసి ఆకులను వేసి మరిగించండి.. అనంతరం గోరువెచ్చగా అయ్యాక ఫిల్టర్ చేసి తాగండి..

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం..

పింఛను 4 వేలు -ఉద్యోగులకు పిఆర్సి, పంచాయతీలకు నిధులు

యుద్ధానికి అందరూ సిద్ధం కావాలి : కుప్పంలో చంద్రబాబుతిరుపతి : తాము అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా ఒకటిన నాలుగు వేల రూపాయలు పింఛను ఇంటికే తీసుకొచ్చి అందిస్తామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
లాయర్లకు, జర్నలిస్టులకు, మహిళలకు, టీచర్లకు, ఉద్యోగులకు సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలిస్తామని తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఆయన చిత్తూరు జిల్లా కుప్పం వచ్చారు. ఈ సందర్భంగా కుప్పంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికలు వచ్చాయని, యుద్ధానికి అందరూ సిద్ధం కావాలని టిడిపి శ్రేణులను కోరారు. 40 రోజులు అలుపెరగకుండా కష్టపడితే విజయం మనదేనన్నారు. ‘కుప్పంలో లక్ష మెజార్టీకి సిద్ధమా?’ అంటూ కార్యకర్తలను, పార్టీ శ్రేణులను ఉత్సాహపర్చారు. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి ఇస్తామని, అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు నిధులు కేటాయించి పూర్వ వైభవం, ప్రజాపాలన తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఎన్డిఎతో పొత్తు తప్పనిసరని సమర్థించుకున్నారు. బిజెపితో పొత్తును ముస్లిం, మైనార్టీ సోదరులు వేరుగా భావించవద్దని, వారి ప్రయోజనాలను కాపాడతానని చెప్పుకొచ్చారు.
పేదవారికి అన్నం పెట్టాలని అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే, జగన్ వచ్చాక వాటిని ధ్వంసం చేశారన్నారు. జగన్ పది రూపాయలిచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నారని, దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు. వైసిపి నాయకులు భూ కబ్జాలకు పాల్పడడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతు న్నారని, అందుకు కడప జిల్లా ఒంటిమిట్ట పద్మశాలీ కుటుంబమే తాజా ఉదాహరణని పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్, గంజాయి ప్రభుత్వం రాజ్యమేలుతోంది. మత్తుకు బానిసై యువత చెడ్డదారి పడుతోంది. జాతి నిర్వీర్యం అవుతోంది.’ అని అన్నారు. వలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని తెలిపారు.

Weight Loss Drink: రోజూ ఇవి నానబెట్టి పరగడుపు తాగితే నెలరోజుల్లో స్థూలకాయం మాయం

Weight Loss Drink: బరువు తగ్గించుకునేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ చాలా సందర్భాల్లో ఆశించిన ఫలితాలు దక్కవు. వర్కవుట్స్ చేయడం, డైటింగ్ చేయడం, వ్యాయామం, యోగా, వాకింగ్ ఇలా ఎన్నిచేసినా నిష్ప్రయోజనంగా ఉంటుంది ఒక్కోసారి.
ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉండవచ్చు.

సాధారణంగా చాలామంది ఆయిలీ ఫుడ్స్, స్వీట్స్ తినడాన్ని ఇష్టపడుతుంటారు. యువత అయితే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్‌పై మక్కువ చూపిస్తుంటారు. ఫలితంగా బరువు పెరిగిపోతుంటుంది. ఒకసారి బరువు పెరిగిందంటే ఇక నియంత్రణ అనేది చాలా కష్టమైపోతుంది. బిజీ లైఫ్ కారణంగా జిమ్ లేదా వర్కవుట్స్ చేసేందుకు సమయం ఉండకపోవచ్చు. ఆహారపు అలవాట్ల గురించి కూడా అవగాహన ఉండకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఇంట్లో తయారు చేసుకునే హోమ్ మోడ్ డ్రింక్‌తో అద్భుతాలు చూడవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా వేగంగా బరువు తగ్గించుకోవచ్చంటున్నారు. బరువు తగ్గించేందుకు వాము నిజంగానే ఓ అద్భుతమైన ఔషధం. ఇందులో ఆయుర్వేద గుణాలు చాలా మెండుగా ఉంటాయి. వాము నీపు తాగడం వల్ల నడుము చుట్టూ ఉండే కొవ్వు వేగంగా కరుగుతుంది.
రోజూ ఉదయం వేళ పరగడుపున వాము నీరు తాగడం అలవాటు చేసుకుంటే బరువు చాలా వేగంగా కరుగుతుంది. బెల్లీ ఫ్యాట్ సమస్య ఉంటే తొలగిపోతుంది. వాము నీటిని గోరువెచ్చగా వేడి చేసి తాగవచ్చు. రోజువారీ డైట్‌లో వాము నీళ్లను భాగంగా చేసుకుంటే మరింత మెరుగైన ఫలితాలు చూడవచ్చు. బరువు తగ్గించే ప్రక్రియ కోసం 25 గ్రాముల వామును నీట్లో నానబెట్టి రాత్రంతా ఉంచాలి. ఉదయం ఆ నీళ్ళను పరగడుపున తాగాలి.

నెలరోజులు క్రమం తప్పకుండా వాము నీటిని తాగితే మీ శరీరంలో మీకే తెలియని చాలా మార్పులు గమనించవచ్చు. రాత్రి నానబెట్టకపోయినా ఉదయం వాము నీళ్లలో ఉడకబెట్టి చల్లార్చి తాగినా అంతే ఫలితాలుంటాయి. ఇందులో 5-6 తులసి ఆకులు వేస్తే మరింత మంచిది. కేవలం వారాల వ్యవధిలో బరువు తగ్గించుకోవచ్చు.

Tiles Cleaning Tips : టైల్స్ మీద మరకలు ఉంటే ఈజీగా తొలగించే టిప్స్.. ట్రై చేయండి

అపరిశుభ్రమైన టైల్స్ మీ ఇంటి రూపాన్ని మార్చేస్తాయి. ఆకర్షణ, అందాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా కిచెన్ టైల్స్ సరిగా చూసుకోకుంటే అంతే సంగతులు. అధ్వానంగా తయారవుతాయి.
ఇటువంటి మరకలు మీ ఇంటి మొత్తం రూపాన్ని పాడు చేస్తాయి. తగిన జాగ్రత్తలు, శుభ్రపరిచే నియమాలతో రసాయనాల అవసరం లేకుండా మీ ఇంటి టైల్స్ అందంగా చేసుకోవచ్చు. మెరిసేలా చేయవచ్చు.

సౌందర్య సాధనాలు, గ్రీజు, వంట నూనె వంటి చమురు ఆధారిత పదార్థాల వల్ల ఏర్పడే మరకలు టైల్స్ రంగు మారడానికి కారణమవుతాయి. మరకల మూలాన్ని సమర్థవంతంగా తొలగించడానికి రసాయన పరిష్కారాలను ఉపయోగించడం అవసరం కావచ్చు. పండ్లు, కాగితం, ఆహారం, టీలు, కాఫీ, మూత్రం, పొగాకు, పక్షి రెట్టలు, ఆకులు వంటి పదార్థాల వల్ల ఏర్పడే మరకలు వివిధ రంగులుగా టైల్స్ మీద అలానే ఉండిపోతాయి.

బూజు, నాచు, ఆల్గే, శిలీంధ్రాలు, లైకెన్లు వంటి జీవసంబంధమైన పదార్థాల వల్ల కూడా మరకలు ఏర్పడతాయి. వీటిని కొంచెం జాగ్రత్తగా కడిగితే మీ టైల్స్ తలతల మెరిసిపోతాయి.
వేడి నీటితో నిండిన బకెట్‌లో అరకప్పు వెనిగర్, అర టేబుల్ స్పూన్ డిష్ సోప్ కలపడం ద్వారా శుభ్రపరిచే ద్రావణాన్ని సిద్ధం చేయండి. ఎక్కువ మెుత్తంలో సబ్బును ఉపయోగించవద్దని గుర్తుంచుకోండి. ఎందుకంటే సబ్బు మరకలు కూడా అంటుకోవచ్చు.

మెుదట సబ్బు నీటి ద్రావణం, తుడిచే కర్ర ఉపయోగించి టైల్ ను శుభ్రం చేయండి. తర్వాత సాధారణ వేడి నీటితో తుడుచుకోవాలి. నేలను గాలిలో పొడిగా ఉంచుకోవచ్చు. అయితే శుభ్రమైన గుడ్డతో తుడిస్తే ఇంకా మంచిది.

బాత్రూమ్ టైల్స్ ఇలా శుభ్రం చేయండి

మీ బాత్రూమ్ టైల్స్ నుండి నీటి మరకలను శుభ్రం చేయడానికి అవసరమైన సామాగ్రిని ముందుగానే సేకరించాలి. తెలుపు లేదా ఆపిల్ సైడర్ వెనిగర్, బేకింగ్ సోడా, బ్రష్, శుభ్రమైన గుడ్డ, వెచ్చని నీరు తీసుకోవాలి. వైట్ వెనిగర్‌తో పోలిస్తే, యాపిల్ సైడర్ వెనిగర్ కొంచెం ఎక్కువ ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది మొండి మరకలను కూడా తొలగించడంలో మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఒక గిన్నెలో వెచ్చని నీరు, వెనిగర్ సమాన భాగాలను కలపడం ద్వారా శుభ్రపరిచే ద్రావణాన్ని సిద్ధం చేయండి. ఏదైనా వెనిగర్ ఉపయోగించవచ్చు, కానీ తెలుపు లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. ఆ వాటర్ ను బాత్రూమ్ టైల్స్ పై చల్లండి. మిశ్రమంలో స్పాంజి లేదా గుడ్డను నానబెట్టి, ప్రభావిత ప్రాంతాలపై 5 నుండి 15 నిమిషాల పాటు సున్నితంగా రుద్దండి.

వృత్తాకార కదలికలో ప్రతి మరకను బ్రష్ లేదా టూత్ బ్రష్‌తో అది మాయమయ్యే వరకు సున్నితంగా రుద్దాలి. అధిక శక్తిని ఉపయోగించడం మానుకోండి. ఇది టైల్స్ ను పాడుచేస్తుంది. మరక అదృశ్యమైన తర్వాత వెచ్చని నీటితో, తడిగా ఉన్న గుడ్డతో ద్రావణాన్ని శుభ్రం చేసుకోండి.

మీరు స్క్రబ్బింగ్ పూర్తి చేసిన తర్వాత మీ టైల్స్ పూర్తిగా ఆరబెట్టడం చాలా ముఖ్యం. ఏదైనా చిన్న మరకలు ఉంటే.., తేమను తొలగించడానికి మీరు తక్కువ వేడి మీద టవల్ లేదా హెయిర్ డ్రయ్యర్‌ని ఉపయోగించవచ్చు. టైల్స్‌పై మిగిలి ఉన్న కొద్దిపాటి తేమ కూడా భవిష్యత్తులో అదనపు మరక, రంగు పాలిపోవడానికి కారణమవుతుందని గుర్తుంచుకోండి.

నీటి మరకలను తొలగించే చిట్కాలు

టైల్స్ నుండి నీటి మరకలను తొలగించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. స్ప్రే బాటిల్‌లో నీరు, వెనిగర్‌ను సమాన భాగాలుగా కలపండి. నీటి మరకలపై ద్రావణాన్ని స్ప్రే చేసి, కొన్ని నిమిషాలు అలాగే ఉండనివ్వండి. బ్రష్‌తో స్క్రబ్ చేసి నీటితో శుభ్రం చేసుకోండి.

బేకింగ్ సోడాను కొద్ది మొత్తంలో నీళ్లతో కలిపి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్‌ను నీటి మరకలపై అప్లై చేసి 10-15 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. బ్రష్‌తో స్క్రబ్ చేసి నీటితో శుభ్రం చేసుకోండి.

తాజా నిమ్మరసాన్ని నీటి మరకలపై పిండండి. కొన్ని నిమిషాలు అలాగే ఉండనివ్వండి. మృదువైన బ్రష్‌తో రుద్ది శుభ్రం చేసుకోవాలి.

Janasena List: జనసేన అభ్యర్థుల జాబితా రిలీజ్.. ఎవరు ఎక్కడి నుంచంటే

Janasena List: జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కూటమిలో భాగంగా ఈ పార్టీ 18 స్థానాలకు అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది.
జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో మొత్తం 21 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పుడు 18 పేర్లను విడుదల చెయ్యడంతో ఇంకా అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం సౌత్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చెయ్యాల్సి ఉంది.
జనసేన తరపున కాకినాడ లోక్ సభ స్థానం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు.

అసెంబ్లీ స్పీకర్ గా ప్రముఖ యాంకర్

కఠోర శ్రమ, అంకితభావం, అదృష్టం ఉంటే ప్రతి మనిషికి జీవితంలో ఆశించిన ఫలితాలు వస్తుంటాయి. ఇలాంటి ఘటనలో భారత్‌లు ఎన్నో జరిగాయి. సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ టీ అమ్మే బాలుడి నుంచి అనేక సవాళ్లను ఎదుర్కోని భారత ప్రధానిగా ఎదిగారు.
అలాగే పేపర్ బాయ్ గా పని చేసిన అబ్దుల్ కలాం రాష్ట్రపతి గా ఎదిగిన సందర్భం భారత్ లోనే జరిగింది.

ఇలాంటి పరిణామమే మరోకటి చోటు చేసుకుంది. మిజోరాం కు చెందిన ఓ టీవీ యాంకర్ ఎన్నికల్లో గెలుపొంది.. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ స్పీకర్ గా ఎదిగింది. అంతే కాదు తమ రాష్ట్ర చరిత్రలో మొదటి సారి ఓ మహిళా అభ్యర్థి స్పీకర్ గా అయిన ఘనత కూడా బారిల్ వన్నేహా సాంగ్ కే దక్కింది. మొదట చిన్న చానెల్ యాంకర్ నుంచి టీవీ యాంకర్, ఆ తర్వాత సోసల్ మీడియాలో ఇన్ ఫ్లేయెన్సర్ గా ఎదిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐజాల్ సౌత్ 3 నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా.. 33 ఏళ్ల వయస్సులోనే మిజోరం లో యువ ఎమ్మెల్యేగా, ప్రస్తుతం మొట్టమొదటి మహిళా స్పీకర్ గా బారిల్ వన్నేహా సాంగ్ చరిత్రలోకి ఎక్కింది.

Chanakya Niti: డబ్బు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ దగ్గర డబ్బు నిలవదు.

Chanakya Niti: డబ్బు కోసం ఎన్నో పాట్లు పడుతుంటారు చాలా మంది. కానీ ఈ డబ్బును సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు. వచ్చిన డబ్బును వచ్చినట్టుగానే హృదా చేసేవారు.
అనవసరాలకు ఖర్చు చేసేవారు ఎక్కువగా ఉంటారు. అయితే ఆడంబరాలకు పోయి విచ్చలవిడిగా ఖర్చు పెడతారు మరికొందరు. అయితే ఈ డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా నిలవ ఉండదు అంటున్నారు కొందరు. ఇంతకీ డబ్బు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

డబ్బుల విషయంలో కొన్ని టిప్స్ పాటించాల్సిందే. మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకోండి. డబ్బును ఎప్పుడు దాచిపెట్టకూడదు. కానీ దీన్ని సరైన స్థలంలో పెట్టుబడిగా పెట్టాలి. అన్యాయాన్ని అనుసరించే వ్యక్తి వెంట డబ్బు ఉండేదట. అలాంటి వారితో నిత్యం డబ్బు సమస్యలు చుట్టుముడుతాయట. ఇక కొందరు దానకర్ణులు ఉంటారు. అయితే దానం చేయడం మంచి విషయమే. కానీ అతిగా దానం నష్టాలను తెచ్చిపెడుతుందట. పొదుపు చేయడం, ఆదా చేయడం నేర్చుకోవాలి.
ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి. ఖర్చులు అదుపు చేసుకోవాల్సిందే. లేదంటే పొదుపు అసలే ఉండదు. ఖర్చులు, పొదుపై అవగాహన, నియంత్రణ ఉంటే కచ్చితంగా మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది. డబ్బును చూసి ఎప్పుడు కూడా గర్వ పడకూడదు. అంతేకాదు అహం కూడా ఉండకూడదు.. గౌరవం ఉండాలి. డబ్బుతో మీకు ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయో తెలుసుకోండి. కావలసిన వాటి కోసం ప్రణాళికను రూపొందించుకోవాలి. మీ పనులు ఇతరులకు హానీ చేయవద్దు అని గుర్తు పెట్టుకోండి.

డబ్బు విలువ తెలుసుకోవడానికి.. మీతో ఉండే వ్యక్తులు ముఖ్య పాత్ర పోషిస్తారు. మీ విలువ ప్రేరేపించే ప్రోత్సహించే వ్యక్తులతో స్నేహం చేయాలి అని గుర్తుపెట్టుకోండి. ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండాలి అని తెలుసుకోండి. ఈ విధంగా మీరు డబ్బు విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

Health Tips: అన్ని వ్యాధులకు ఆన్సర్ ఈ చెట్టు వేర్లు.

అశ్వగంధ గురించి తెలుగు లోగిళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దీన్ని వేలాది సంవత్సరాలుగా సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తున్నారు.
స్త్రీ, పురుషులు ఇద్దరికీ దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి. అశ్వగంధలో మన మెదడుని కూల్ చేస్తుంది. పనితీరును మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ కరిగిస్తుంది.. హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది.. ఒత్తిడి, హైబీపీని కూడా తగ్గిస్తుంది. ఇంకా ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం…

అశ్వగంధను పాలలో మరిగించి, ఆ తర్వాత ఎండబెట్టి పొడి చేసి, ఈ పొడిని పాలు, తేనెతో కలిపి సేవిస్తే వెన్నునొప్పి తగ్గుతుంది.
అశ్వగంధ వేరును గ్రైండ్ చేసి పాలు లేదా నెయ్యిలో కలుపుకుని తీసుకుంటే రక్తహీనత సమస్య కూడా నయమవుతుంది.
అశ్వగంధ, శతావరి సమపాళ్లలో తీసుకుని కషాయం చేసి, పాలలో కలుపుకుని తాగితే లైంగిక సమస్యలు దూరమవుతాయి.
అశ్వగంధ చూర్ణాన్ని పాలలో కలిపి రోజుకు రెండుసార్లు సేవిస్తే లైంగిక నపుంసకత్వానికి చక్కటి హోం రెమెడీ.
ఒక చెంచా అశ్వగంధ పొడిని పాలలో కలుపుకుని ఉదయం, సాయంత్రం తీసుకుంటే రుతుక్రమంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అశ్వగంధ కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణ సమస్యలన్నీ నయమవుతాయి.
అశ్వగంధ వేరు జామకాయ రసం, నెయ్యి, తేనె సమపాళ్లలో కలిపి సేవిస్తే కంటి సమస్యలు నయమవుతాయి.
డిప్రెషన్‌తో బాధపడే వారు అశ్వగంధ పొడి, చిలకడ దుంపలను మిశ్రమం చేసి… గ్లాస్ పాలలో కలుపుకుని రోజు తాగితే రిలీఫ్ ఉంటుంది
నిద్ర సమస్య ఉంటే ఈ అశ్వగంధ పొడిని పాలతో కలిపి తాగితే ఈ వ్యాధి కూడా నయమవుతుంది.
( ఇది ఇంటర్నెట్ నుంచి తీసుకున్న సమాచారం. ఈ హోం రెమెడీస్‌ను ఫాలో అయ్యే ముందు నిపుణుడిని సంప్రదించడం మంచిది.)

ఆమెకూ పోలీస్‌ డ్రెస్‌ వేసి యువతకు వల , రూ.3 కోట్లకు ముంచేశారు

టూ టౌన్‌ ఎస్‌ఐగా అవతారమెత్తిన సస్పెండైన సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌

రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసం
ఒక్కొక్కరి నుంచి రూ.12 నుంచి రూ.15 లక్షల వసూలు
ముగ్గుర్ని పెళ్లాడిన ఘనుడు

ఆమెకూ పోలీస్‌ డ్రెస్‌ వేసి యువతకు వల

డమ్మీ పిస్టల్‌తో బెదిరించి పరారైన నిందితులు

మిస్సింగ్‌ కేసు దర్యాప్తులో అసలు వ్యవహారం బట్టబయలు.?

పోలీసుల అదుపులో రమేష్‌, ప్రవీణ

విశాఖ సిటీ: ఒక మిస్సింగ్‌ కేసు.. పెద్ద మిస్టరీని బట్టబయలు చేసింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను రూ.3 కోట్లకు ముంచేసిన ఘరానా నకిలీ పోలీసు వ్యవహారమిది. ఎస్‌ఐగా అవతారమెత్తి.. తన చేతిలో మోసపోయిన యువతినే బుట్టలో వేసుకొని.. ఆమెతో కలిసి అనేక మందిని దోచుకున్న సస్పెన్షన్‌కు గురైన సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ హనుమంతు రమేష్‌ (47) వ్యవహారం ఇపుడు నగరంలో సంచలనం రేకెత్తిస్తోంది. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.12 నుంచి రూ.15 లక్షలు వసూలు చేసిన దగ్గర నుంచి.. నకిలీ రైల్వే వెబ్‌సైట్‌ తయారీ.. హాల్‌ టికెట్ల జారీ.. విజయవాడలో ఒక హోటల్‌లో ఉత్తుత్తి ప్రవేశ పరీక్ష నిర్వహణ.. హైదరాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో ఇంటర్వ్యూల పేరుతో హడావుడి.. నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు జారీ.. ఇలా అనేక మంది నిరుద్యోగులను నిలువు దోపిడీ చేసిన ఆ రహస్య దంపతుల తెలివితేటలకు పోలీసులు సైతం విస్తుపోయారు. వివరాల్లోకి వెళితే..

విధుల్లో నిర్లక్ష్యంతో సస్పెన్షన్‌
శ్రీకాకుళం జిల్లా మొళియాపుట్టు ప్రాంతానికి చెందిన హనుమంతు రమేష్‌ వీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పనిచేస్తున్నాడు. 2022 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్‌కు బదిలీ అయినప్పటికీ అతడు విధుల్లో చేరలేదు. దీంతో దీర్ఘకాలం సెలవు తీసుకోవడంతో సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు అతడ్ని సస్పెండ్‌ చేశారు. ప్రస్తుతం రమేష్‌ పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అడవివరం ప్రాంతంలో ఆర్‌ఆర్‌ టవర్స్‌లో నివాసముంటున్నాడు.

ఎస్‌ఐగా అవతారమెత్తి..
సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా సస్పెన్షన్‌కు గురైన రమేష్‌ విశాఖ టూటౌన్‌ ఎస్‌ఐగా అవతారమెత్తాడు. తన నివాస ప్రాంతంలోనే కాకుండా పెందుర్తిలో కొన్ని సామాజిక వర్గాల పెద్దలను పరిచయం చేసుకున్నాడు. రైల్వే శాఖలో కొంత మంది ఉన్నతాధికారులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని అందరికీ చెప్పుకొచ్చాడు. రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో అనేక మంది నిరుద్యోగులు రమేష్‌ మాటలు విశ్వసించి రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు సమర్పించుకున్నారు.

యువతులకు వల..
రమేష్‌ యువతులకు వల వేయడంలో సిద్ధహస్తుడు. ముందు ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు ఆమె అక్కపై కన్నేసి ఆమెను కూడా పెళ్లాడాడు. ఆ ఇద్దరితోనే ఆగిపోలేదు. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని విశాలాక్షినగర్‌ ప్రాంతానికి చెందిన ప్రవీణ అనే యువతి నుంచి కూడా రమేష్‌ రూ.15 లక్షల వరకు డబ్బు తీసుకొని మోసం చేశాడు. ఉద్యోగం రాకపోయే సరికి ప్రవీణ తండ్రి రమేష్‌ను గట్టిగా నిలదీశాడు. దీంతో అతడు తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేశాడు. అయితే ప్రవీణను మాత్రం సింహాచలంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. రమేష్‌తో కలిసి ప్రవీణ కూడా పోలీస్‌ అని చెప్పుకుంటూ నిరుద్యోగులకు వల వేసింది.

డమ్మీ పిస్టల్‌తో బెదిరించి
రోజులు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో అభ్యర్థులు రమేష్‌ను నిలదీయడం ప్రారంభించారు. ఒకసారి అత డి ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగారు. తమకు డబ్బులు ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించా రు. దీంతో రమేష్‌ తన వద్ద ఉన్న డమ్మీ మెటల్‌ పిస్టల్‌ను చూపించి వారిని బెదిరించాడు. అనంతరం విశాఖ నుంచి ప్రవీణతో కలిసి పరారయ్యాడు.

మిస్సింగ్‌ ఫిర్యాదుతో వెలుగులోకి?
తన భర్త కనిపించడం లేదని రమేష్‌ భార్య ఈ ఏడాది జనవరి 24వ తేదీన పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ దర్యాప్తులో అనేక విస్తుపోయే వాస్తవాలు పోలీసుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. వారికి అందిన సమాచారం ప్రకారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రమేష్‌, ప్రవీణలపై నెల రోజుల పాటు నిఘా పెట్టారు. సాంకేతికత సహాయంతో వారు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో కొంత మంది బాధితులు పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదులు ఆధారంగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు హైదరాబాద్‌కు వెవెళ్లి రమేష్‌, ప్రవీణలను అదుపులోకి తీసుకున్నారు.
రహస్యంగా విచారణ..
నిరుద్యోగులను నిలువునా ముంచిన ఇద్దరినీ పోలీస్‌ ఉన్నతాధికారులు రహస్యంగా విచారిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉండడంతో వివరాలు వెల్లడించడం లేదు. అయితే ఇప్పటికే కీలకమైన ఆధారాలు సేకరించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. త్వరలోనే వీరిని అరెస్టు చూపించే అవకాశాలు ఉన్నాయి.

నకిలీ వెబ్‌సైట్‌.. ఉత్తుత్తి పరీక్ష
నిరుద్యోగులను నుంచి రూ.కోట్లు కాజేసేందుకు రమేష్‌, ప్రవీణ అడుగడుగునా మోసాలకు తెరతీశారు. అభ్యర్థులను నమ్మించేందుకు వీరు ఏకంగా నకిలీ రైల్వే వెబ్‌సైట్‌ను రూపొందించారు. దాని ద్వారా అభ్యర్థులకు మెయిల్స్‌ ద్వారా ఉద్యోగ సమాచారాన్ని పంపించే వారు. నకిలీ హాల్‌ టికెట్లు జారీ చేశారు. విజయవాడలో ఒక హోటల్‌లో ఉత్తుత్తి పరీక్ష సైతం నిర్వహించారు. అంతటితో ఆగకుండా కొద్ది రోజులకు ఇంటర్వ్యూ ఉందని హైదరాబాద్‌లో డీఆర్‌ఎం కార్యాలయానికి రావాలని మెసేజ్‌లు పంపించారు. అభ్యర్థులు అక్కడికి వెళ్లగా రమేష్‌ వారిని రిసీవ్‌ చేసుకున్నాడు.

ఉన్నతాధికారులతో మాట్లాడి వస్తానని చెప్పి కొంత సేపు కార్యాలయంలో తిరిగి వచ్చాడు. ప్రస్తుతం అధికారులు బిజీగా ఉన్నారని మరోసారి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పి అభ్యర్థులను అక్కడి నుంచి పంపించేశాడు. వీరికి ఉద్యోగాలు వచ్చేశాయని నకిలీ నియామక పత్రాలు చూపిస్తూ మరికొంత మంది నుంచి కూడా డబ్బులు వసూలు చేశాడు.

పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోల్ రాజీనామా

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో దేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోల్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆయన జాతీయ ఎన్నికల కమిషనర్లు గా ఉన్న ముగ్గురిలో గోయెల్ ఒకరు. అయితే ఆయన తన రాజీనామకు సంబంధించిన కారణాలు మాత్రం ప్రకటించలేదు. గోయెల్ రాజీనామాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించగా.. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కాగా ఆయన పదవీ కాలం 2027 వరకు ఉన్నప్పటికి అనూహ్యంగా మధ్యలో అది కూడా పార్లమెంట్ ఎన్నికల వేళ రాజీనామా చేయడంతో అందరూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Health

సినిమా