Sunday, November 17, 2024

Curry Leaves With Garlic : రోజూ ఖాళీ కడుపుతో 5 కరివేపాకులు, ఒక వెల్లుల్లి రెబ్బను నమిలి తినండి.. ఏం జరుగుతుందో తెలుసా..?

Curry Leaves With Garlic : మనం వంటల్లో కరివేపాకును, వెల్లుల్లిని విరివిగా వాడుతూ ఉంటాము. కరివేపాకు అలాగే వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలుసు.
వీటిలో అనేక ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని వాడడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే వంటల్లో వాడడానికి బదులుగా వీటిని పరగడుపున తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకును, వెల్లుల్లిని పరగడుపున వాటిలో పోషకాలు మన శరీరానికి చక్కగా అందుతాయి. అలాగే వాటి వల్ల కలిగే ప్రయోజనాలను మనం మరింత అధికంగా పొందవచ్చు.

అయితే కరివేపాకును, వెల్లుల్లిని ఎంత మోతాదులో తీసుకోవాలి.. వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ఒక ఉదయం 5 కరివేపాకు ఆకులను, ఒక వెల్లుల్లిని బాగా నమిలి మింగాలి. తరువాత ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇలా కరివేపాకును,వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు, కొలెస్ట్రాల్ సులభంగా తొలగిపోతుంది. అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే వెల్లుల్లిని, కరివేపాకును కలిపి తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది.

Curry Leaves With Garlic

గుండె ఆరోగ్యం మెరుగపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. కరివేపాకును, వెల్లుల్లిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు, విష పదార్ఠాలు తొలగిపోతాయి. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండాఉంటాము. రోజూ ఉదయం పరగడుపున కరివేపాకు, వెల్లుల్లిని కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణాశయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. కంటిచూపు కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా కరివేపాకు, వెల్లుల్లిని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

IAS Dikshita Joshi Success Story : యూపీఎస్సీ కోచింగ్ లేకుండా మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ అధికారిణిగా దీక్షిత్ జోషి..!

IAS Dikshita Joshi Success Story : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి.
ప్రతి సంవత్సరం లక్షలాది మంది అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్షను రాస్తుంటారు. ఈ పరీక్షకు సన్నద్ధం కావడానికి చాలా మంది కోచింగ్‌లో అడ్మిషన్ తీసుకొని మరి పరీక్షకు సిద్ధమవుతారు. కానీ వారిలో యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించగలిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు.

ఇందులో పగలు, రాత్రి కష్టపడి పట్టుదలతో చదివే విద్యార్థులు ఉన్నారు. కొంతమంది మాత్రం ఎలాంటి కోచింగ్ అవసరం లేకుండా కూడా సొంతంగా అధ్యయనం ద్వారా అత్యంత క్లిష్టమైన సివిల్స్ పరీక్షల్లో టాప్ ర్యాంకర్లుగా నిలిచినవారు ఉన్నారు. అలా యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించిన ఒక ఐఏఎస్ IAS అధికారి సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆమె ఎవరో కాదు.. ఉత్తరాఖండ్‌కు చెందిన దీక్షితా జోషి.. ఎలాంటి కోచింగ్ లేకుండానే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ అధికారిణి అయ్యారు. ఉత్తరాఖండ్‌లో విద్యార్థుల ప్రతిభకు కొదవలేదు. ఎందుకంటే.. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన చాలా మంది ప్రతిభావంతులైన వ్యక్తులు కృషి, పట్టుదలతో మాత్రమే ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. వారి జాబితాలో హల్ద్వానీ నివాసి దీక్షితా జోషి పేరు కూడా చేరింది. పిలికోఠి ప్రాంతంలో నివసించే దీక్షిత జోషి యూపీఎస్సీ పరీక్షలో 58వ ర్యాంకు సాధించింది. దీంతో ఐఏఎస్‌ అధికారి కావాలనే ఆమె కల నెరవేరింది.

మొదటి ప్రయత్నంలోనే 58వ ర్యాంక్ :
ఐఏఎస్ దీక్షితా జోషి 2022 సంవత్సరంలో తన మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ర్యాంక్ 58తో పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆమె తండ్రి ఐకె పాండే నైనిటాల్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఆమె ఈ ర్యాంక్ వచ్చింది. ఐఏఎస్ అధికారిణి దీక్షిత విజయంలో ఆమె తల్లిదండ్రులు కూడా ఎంతోగానూ సహకరించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించింది.

IAS Dikshita Joshi Success Story

ఐఏఎస్ దీక్షిత జోషి ఎక్కడ చదివారంటే? :
దీక్షిత జోషి తల్లి ఇంటర్ కాలేజీలో లెక్చరర్. దీక్షితా ఆర్యమాన్ విక్రమ్ బిర్లా స్కూల్లో చదువుకుంది. హల్ద్వానీలో 10వ తరగతి, 12వ తరగతి పూర్తి చేసింది. ఆ తరువాత గ్రాడ్యుయేషన్ చదువుల కోసం జీబీ పంత్ యూనివర్శిటీలో అడ్మిషన్ పొందింది. ఐఐటీ మండిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు బాగా ప్రీపేర్ అయింది. ఎలాగైనా ఐఏఎస్ కావాలని పట్టుదలతో చదివింది. ఆమె నిరంతర కృషికి మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ అధికారిణి అయింది.

అభ్యర్థులకు దీక్షిత చెప్పిన టిప్స్ ఇవే :
ఐఏఎస్ దీక్షితా జోషి యూపీఎస్సీ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రత్యేక టిప్స్ అందించింది. అపజయానికి భయపడవద్దని ఆమె తెలిపింది. యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాలంటే ఏకాగ్రత చాలా ముఖ్యమని చెప్పింది. దాంతో పాటు, యూపీఎస్సీకి ప్రీపేర్ అయ్యే అభ్యర్థులు ఎన్‌సిఇఆర్‌టి (NCERT) పుస్తకాల నుంచి అవసరమైన నోట్స్ తయారు చేసుకోవాలని చెప్పింది. యూపీఎస్సీ కోసం సిద్ధమయ్యే ప్రతిఒక్క అభ్యర్థికి ఐఏఎస్ దీక్షిత్ జోషి సక్సెస్ స్టోరీ ఒక రోల్ మోడల్‌గా నిలిచింది.

మూడు లక్షల లోన్!.. సగానికి పైగా వడ్డీ కేంద్రమే కడుతుంది.. పూర్తి వివరాలివే!

దేశంలో పేదరికాన్ని పారద్రోలేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అన్ని వర్గాలను అభివృద్ధిపథంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాయి.
పేద వారిని, వివిధ రకాల వృత్తులపై ఆధారపడి జీవించే వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు పథకాల ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తుల వారిని ప్రోత్సహించేందుకు అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గతేడాది పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు, తక్కువ వడ్డీకే లోన్స్ అందిస్తోంది. మరి ఈ లోన్ పొందడానికి ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సెంట్రల్ గవర్నమెంట్ పీఎం విశ్వకర్మ పథకం ద్వారా చేతివృత్తుల వారికి లోన్స్ అందిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా మొత్తం 18 రకాల చేతి వృత్తి వర్గాలకు లబ్ధి చేకూరనున్నది. చేతివృత్తుల వారికి ట్రైనింగ్ ఇప్పించి ఆ తర్వాత రుణ సాయం కూడా అందిస్తుంది. ఈ పథకానికి అప్లై చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ సర్టిఫికెట్ తో పాటు ఐడీ కార్డు కూడా అందిస్తుంది. ట్రైనింగ్ సమయంలో రోజుకు రూ. 500 స్టైఫండ్ ఇస్తుంది. మొదట టూల్ కిట్స్ కోసం రూ. 15 వేల ఆర్థిక సాయం, ఆ తర్వాత 5 శాతం వడ్డీకే మూడు లక్షల లోన్ అందిస్తుంది.

మామూలుగా బ్యాంకులు 13 శాతం వార్షిక వడ్డీతో లోన్స్ ఇస్తాయి. కానీ ఈ విశ్వకర్మ పథకం ద్వారా లోన్ తీసుకున్నట్లైతే.. సగానికి పైగా అంటే 8 శాతం వడ్డీని కేంద్రమే చెల్లిస్తుంది. పీఎం విశ్వకర్మ పథకంలో ముందుగా రూ. లక్ష లోన్ పొందొచ్చు. ఈ లోన్ ను ఏడాదిన్నరలోగా(18నెలలు) చెల్లించాలి. ఆ తర్వాత మరో రెండు లక్షల లోన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ లోన్ ను రెండున్నరేళ్లలో (30నెలలు) చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారం చేయాలనుకునే వారికి కేంద్రం అందిస్తున్న గొప్ప పథకం ఇది.

స్వర్ణకారులు, విగ్రహాల తయారీదారులు, చెప్పులు కుట్టేవారు, తాపీ పనిచేసేవారు, సంప్రదాయ బొమ్మలు చేసేవారు, క్షురకులు, పూలదండలు చేసేవారు, దర్జీలు, వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, ఆయుధాలు తయారు చేసేవారు, ఇనుప పరికరాలు చేసే వారు, కమ్మరి, ఇంటి తాళాల తయారీదారులు, కుమ్మరి, రజకులు, చేప వలల తయారీదారులు వంటివారు పీఎం విశ్వకర్మ పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే.. ఆయా చేతి వృత్తి పనులు చేస్తున్న వారు అర్హులు. 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు, గత ఐదేళ్లలో ఇలాంటి పథకాల ద్వారా లోన్ పొందిన వారు అనర్హులు.

దరఖాస్తు చేసుకోదలిచిన వారు పీఎం విశ్వకర్మ పథకం అధికారిక వెబ్ సైట్ https://pmvishwakarma.gov.in/ లోకి వెళ్లాలి. మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. తర్వాత ఆధార్ కార్డు నంబర్ ఇవ్వాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ ఫారం వస్తుంది. ఆ ఫారంలో అవసరమైన వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. సంబంధిత అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశాక అర్హులైన వారిని ట్రైనింగ్ కు ఎంపిక చేసి ఆన్ లైన్ లోనే శిక్షణ ఇస్తారు. అర్హులైన చేతి వృత్తుల వారు అవసరమైన సర్టిఫికెట్లను తీసుకెళ్లి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకుని ప్రయోజనాలను అందుకోండి.

నీళ్లు ఎక్కువ తాగినా ఆరోగ్యానికి ప్రమాదమే.. రోజుకు ఎన్ని లీటర్లు తాగాలంటే..

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ పుష్కలంగా నీరు తాగాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు, కానీ మరీ ఎక్కువ నీరు తాగితే అది హాని కూడా కలిగిస్తుందట.
ఎందుకంటే ఏదైనా అతిగా చేయడం మంచిది కాదు. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మనిషి ఆరోగ్యం పాడైపోయిందని చాలాసార్లు వార్తల్లో చూసే ఉంటాం. కానీ మీరు త్రాగే నీరు మీ శరీరానికి సరిపోతుందా లేదా, ఎక్కువ అయ్యాయా ఎలా తెలుసుకోవచ్చు, ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నీళ్లు ఎక్కువగా తాగితే కలిగే ఫలితాలు..

ఎక్కువ నీరు త్రాగడం ద్వారా మెదడు సరిగా పనిచేయదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎక్కువ నీరు తాగడం వల్ల మన మెదడు కణాలలో నీటి పరిమాణం పెరుగుతుంది. దాని వల్ల కణాలు ఉబ్బి మెదడు పై ఒత్తిడి తెస్తాయట. అలాంటప్పుడు తీవ్రమైన తలనొప్పి వస్తుందని అలాగే పని పైన దృష్టి పెట్టలేరని చెబుతున్నారు. మెదడులో ఒత్తిడి పెరగడం వల్ల, హృదయ స్పందన తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. రక్తపోటు కూడా అధికమవుతుందట. శరీరంలో నీరు అధికంగా ఉండటం వల్ల, సోడియం లోపం ఏర్పడుతుందని చెబుతున్నారు. దీని కారణంగా మీరు త్వరలో హైపో నాట్రేమియాకు గురవుతారట. సోడియం మన శరీరానికి చాలా అవసరం, దాని పరిమాణం తక్కువగా ఉంటే శరీరంలోని కణాలు ఉబ్బుతాయని చెబుతున్నారు. ఈ సమస్య పెరిగితే వ్యక్తి కోమాలోకి వెళ్లి మృతి చెందే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

శరీరంలో నీరు ఎక్కువైతే కనిపించే లక్షణాలు..

1. మూత్రం రంగు

మనం నీరు ఎక్కువగా లేదా తక్కువ తాగినప్పుడల్లా మూత్రం రంగు మనకు సంకేతాలు ఇస్తాయి. ఎక్కువ నీరు తాగితే మూత్రం రంగు స్పష్టంగా, నీరులా కనిపిస్తుంది. అలాగే శరీరంలో నీటి పరిమాణం తగ్గితే మూత్రం రంగు లేత పసుపు రంగులో కనిపిస్తుంది.

2. వికారం
ఎక్కువ నీరు తాగడం వల్ల మూత్రపిండాల పై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా శరీరం నుండి అదనపు ద్రవాన్ని బయటకు తీయలేకపోతుంది. దీంతో శరీరంలో ద్రవం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా వాంతులు, వికారం రావచ్చు. దీని వల్ల రోజంతా అలసటగా అనిపించవచ్చు.

3. చేతులు, కాళ్ళలో నొప్పి, వాపు

నీరు ఎక్కువగా తాగే వారికి శరీరంలో వాపుతో పాటు నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఎక్కువ నీరు తాగినప్పుడు శరీరంలో సోడియం పరిమాణం తగ్గిపోయి కండరాలు బలహీనంగా మారి నొప్పి కూడా మొదలవుతుంది.

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌.. బెస్ట్ లీడర్ ఎవరో తెలుసా? సర్వేలో షాకింగ్!

తెలంగాణలో గత పదేళ్లుగా పాలన సాగించిన గులాబీ అధిపతి, ఉద్యమ నేత కేసీఆర్‌ను 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఓడించిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా కేసీఆర్ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని ఎన్నికల సమయంలో పలు సర్వేలు తెలిపాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఫలితాలు సైతం వచ్చాయి. కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డికే ప్రజలు పట్టం కట్టారు. 2023, డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు.

అయితే తెలంగాణ ఉద్యమ నేతగా ప్రజాధరణ ఉన్న కేసీఆర్ గుర్తింపు రాష్ట్రంలో తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో ప్రజలను ఎంతో చైతన్యం చేసిన కేసీఆర్ నేడు ప్రజాదరణ తగ్గినట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అయితే తాజాగా ఓ సర్వే ఫలితాలు షాక్‌కు గురిచేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు అని జై స్వరాజ్య టీవీ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఇద్దరిలో ఎవరు బెస్ట్ లీడర్ అని యూట్యూబ్‌లో పోలింగ్ పెట్టారు. ఈ సర్వేలో దాదాపు 16 వేల మందికి పైగా పాల్గొన్నారు. ఇందులో కేవలం 2 నెలలకు పైగా పాలన చేసిన రేవంత్ రెడ్డికి 73 శాతం ప్రజలు ఓటు వేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు కేవలం 27 శాతం మాత్రమే ఓట్లు వేశారు. ఉద్యమకాలంలో ఓ వెలుగు వెలిగిన కేసీఆర్ తాను చేసిన అవినీతి వల్లే బెస్ట్ లీడర్ కాలేకపోయారని పొలిటికల్ సర్కిల్లో ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ స్టేట్ చీఫ్ రేవంత్ రెడ్డికి ప్రజాదరణ పెరుగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

SSY: చిన్న పొదుపులతో మీ కూతురికి రూ.69 లక్షలు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు..!

Sukanya Samriddhi Yojana: ఒకప్పుడు ఆడ పిల్ల పుట్టిందంటే చాలా బాధ పడే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి చాలా వరకు మారింది. ఇప్పుడు ఆడ, మగ తేడా ఏం లేదు. ఎవరైనా ఒక్కటే అని అనుకుంటున్నారు. అయినప్పటికీ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు కట్నం తప్పనిసరిగా మారింది. చట్టం ప్రకారం కట్నం తీసుకోవడం నేరమైనప్పటికీ ఇది కొనసాగుతోంది. ఇప్పుడు ఆడ పిల్ల పుట్టగానే వారి పేరు పొదుపు చేయడం మొదలు పెడుతున్నారు.
అయితే ఆడ పిల్ల పేరుపై పొదుపు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చిన్న మొత్తాల్లో పొదుపు చేసే వారికి సుకన్య సమృద్ధి యోజన పథకం మంచి ఎంపికగా ఉంటుంది. ఈ పథకం కేవలం ఆడ పిల్లల కోసం ప్రవేశపెట్టారు. 10 ఏళ్ల లోపు ఉన్నవారే ఈ పథకంలో చేరవచ్చు. పాప పుట్టినప్పటి నుంచి పథకంలో చేరవచ్చు. కానీ పాపకు ఆధార్ కార్డు రావాలంటే టైమ్ పడుతుంది. ఆధార్ కార్డు వచ్చిన తర్వాత పథకంలో చేరవచ్చు.
ఈ పథకంలో సంవత్సరానికి కనిష్ఠంగా రూ.250 పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. సుకన్య సమృద్ధి యోజనలో చేరిన నుంచి 15 సంవత్సరాలు పొదుపు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంలో 8.2 శాతం వడ్డీ రేటు కొనసాగుతోంది. ఇది ప్రభుత్వ పథకం. ఇందులో కచ్చితమైన రాబడి ఉంటుంది. పాకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు పొదుపు చేసిన మొత్తంలో సగం వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది.
దీన్ని ఒకేసారి తీసుకోవచ్చు.. లేదా వాయిదాల్లో తీసుకోవచ్చు. ఉదాహణకు పాప వయస్సు ఐదేళ్లు ఉన్నప్పుడు సుకన్య సమృద్ధి యోజనలో చేరితే.. పాపకు 20 వచ్చ వరకు పొదుపు చేయాలి. మీరు సంవత్సరానికి రూ.1.50 వేలు పొదుపు చేస్తే 15 సంవత్సరాల్లో రూ.22,50,000 చెల్లిస్తారు. మధ్యలో విత్ డ్రా చేసుకోకుంటే.. పాపకు 25 సంవత్సరాలకు అస్సలు రూ.22,50,000, వడ్డీ రూ.46,77,578 మొత్తం కలిపి రూ.69,27,578 వస్తాయి.
మీరు 2024 పెట్టుబడి ప్రారంభిస్తే.. 2045లో మీ పాపకు మెచ్యూరిటీ సొమ్ము వస్తుంది. సుకన్య సమృద్ధి యోజనలో పొదుపు చేస్తే పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.

SBIలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్ష వరకు జీతం.. అర్హులు వీరే?

బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? బ్యాంకు ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. భారీ వేతనంతో బ్యాంకు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది.
మీరు ఈ ఉద్యోగాలను పొంది జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడిపోవచ్చు. పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఏ నోటిఫికేషన్ ను వదిలినా ఈ నోటిఫికేషన్ ను మాత్రం వదలొద్దు.

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 4వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు గడువు విధించారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ https://www.sbi.co.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

Strawberry growing: స్టాబెర్రీలను ఇంటి బాల్కనీలోనే కుండీల్లో సులువుగా పెంచేయండిలా

Strawberry growing: పిల్లలకు ఇష్టమైన పండ్లలో స్ట్రాబెర్రీ ఒకటి. స్ట్రాబెర్రీలను రోజువారీ డైట్లో చేర్చుకోమని పోషకాహారు నిపుణులు చెబుతూ ఉంటారు.
ఇవి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి సూపర్ మార్కెట్లలో అన్ని సీజన్లో లభిస్తాయి. తీపి, పుల్లని రుచిని కలిపి ఉండే ఈ పండ్లు మన రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. స్ట్రాబెర్రీలను ఇంటి బాల్కనీలోనే సులువుగా పెంచుకోవచ్చు. వీటికి ఎండతగిలే చోటు ఉంటే చాలు, సులువుగా పెరిగేస్తాయి.

స్ట్రాబెర్రీలను ఇంట్లోనే పెంచడం ఎలా?

స్ట్రాబెర్రీలను ఇంటి దగ్గర ఎలా పెంచాలో సులువైన పద్ధతులు ఇక్కడ మేము చెబుతున్నాము. స్ట్రాబెర్రీలను ముందుగా కొని తెచ్చుకోవాలి. వాటికి బయట వైపునే చిన్నచిన్న విత్తనాలు ఉంటాయి. ఆ సీడ్స్‌ను జాగ్రత్తగా తీసి ఒక టిష్యూ పేపర్ మీద పెట్టాలి. వాటికి ఎండ తగిలేలా కాసేపు ఉంచండి. ఒక కుండీలో పొడిగా ఉండే మట్టిని వేసి ఈ సీడ్స్ ను అందులో చల్లండి. ఎండ తగిలేచోట ఆ కుండీని నాలుగు గంటల పాటు ఉంచండి. కానీ నీరు వేయకండి. ఈ విత్తనాలు చల్లడానికి ముందే ఆ మట్టి పోషకాలతో నిండి ఉందో లేదో చూసుకోండి. వర్మీ కంపోస్ట్, కోకోపీట్, మట్టి అన్ని కలిపి ఆ కుండీలో వేయండి. ఇప్పుడు ఆ కుండీల్లో లోతుగా రంధ్రాలు చేసి ఈ సీడ్స్ ను అందులో వేయండి. ప్రతి సీడ్ కు మధ్య గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి.

ఇప్పుడు ఆ మట్టిపై నీళ్లు చల్లండి. మరీ ఎక్కువ నీళ్లు చల్లినా స్ట్రాబెర్రీలు మొలకెత్తకపోవచ్చు. అలాగని మరీ పొడిగా ఉన్నా కూడా అవి మొలకత్తలేవు. కాబట్టి చిన్న గ్లాస్ తో కుండీలో నీళ్లు చల్లుతూ ఉండండి. మట్టి తడిగా ఉండేలా చూసుకోండి.

మీరు బియ్యం కడిగే నీటిని, అరటి పండు తొక్కలను నానబెట్టిన నీటిని వేస్తూ ఉండండి. ఇవి మంచి ఫెర్టిలైజర్లుగా పనిచేస్తాయి. ఒక నెల రోజులపాటు ఇలా వాటిని కాపాడుకుంటే అవి మొక్కలుగా ఎదుగుతాయి. నెల రోజులు తర్వాత స్ట్రాబెర్రీలు కాయడం మొదలవుతుంది. ఏదైనా పండుకి డామేజ్ అయినట్టు అనిపిస్తే, ఆ పండును వెంటనే కట్ చేసి పడేయండి.లేకపోతే మిగతా పండ్లకు కూడా జెర్మ్స్ చేరవచ్చు.

బాల్కనీలో ఉండే చిన్న ఖాళీ ప్రదేశాల్లోనే కుండీలతో ఈ స్ట్రాబెర్రీ మొక్కలను పెంచుకోవచ్చు. ఒక్కసారి పెంచితే మీకే అలవాటైపోతుంది. పెద్ద కుండీల్లో పెంచుకుంటే స్ట్రాబెర్రీలు ఎక్కువగా వస్తాయి.

ఇంట్లోనే స్ట్రాబెర్రీలు పెంచుకోవడం వల్ల సేంద్రియ పద్ధతిలోనే అవి పెరుగుతాయి. ఎలాంటి రసాయనాలు చల్లాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవి ఎంతో ఆరోగ్యకరం అని చెప్పవచ్చు. ఎర్రటి ఈ పండును అనేక వంటల్లో భాగం చేసుకుంటారు. పిల్లలు చాకోలెట్ ద్రవంలో ఈ స్ట్రాబెర్రీను ముంచి తింటూ ఉంటారు. ఐస్ క్రీమ్, మిల్క్ షేక్, జామ్ రూపంలో కూడా వీటిని తినవచ్చు. ప్రతిరోజూ రెండు స్ట్రాబెర్రీలు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

AP NEWS : ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.15వేలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. తండ్రి ఆశయాలు సాధించేదిశగా ప్రజా పాలన కొనసాగిస్తున్నారు.
పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ముఖ్యంగా వైద్య, విద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమం కోసం ఆయన వివిధ పథకాలు అమలు చేస్తూ వారికి భరోసా ఇస్తున్నారు. ఇటీవల వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఈబీసీ నేస్తం (YSR EBC Nestam )అనే పథకాల ద్వారా మహిళలకు డబ్బులు అకౌంట్ లో జమచేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు షెడ్యూల్ రిలీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే..

ఏపీ మహిళలకు శుభవార్త.. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా అర్హులైన మహిళలకు డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతుంది. కర్నూల్ జిల్లాలో ఈ నెల 24వ తేదీన జరగబోయే కార్యక్రమంలో సీఎం జగన్ దీనికి సంబంధించిన బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. అగ్రవర్ణాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ఈ పథకం ద్వారా రూ.15 వేలు అకౌంట్ లో జమ అవుతున్న విషయం తెలిసిందే. 45 నుంచి 60 ఏళ్ల మద్య వయస్కు మహిళల ఈ పథకానికి అర్హులు. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో నెలకు రూ.12 వేలు ఆదాయం మాత్రమే ఉండాలి. అలాగే కుటుంబానికి మొత్తం భూములు 3 ఎకరాల చిత్తడి నేల లేదా పది ఏకరాల పొడి భూమి కానీ, తడి భూమి కానీ ఉండాలి.

ఈ పథకానికి కావలసిని అర్హత, డాక్యుమెంట్స్ ఎంటో చూద్దాం.. కుటుంబానికి 4 వీలర్ (ఆటో, ట్యాక్సీ, ఇతర వాహనాలు) ఉండకూడదు. కుటుంబ సభ్యులు ఇన్‌కం ట్యాక్స్ కట్టకూడదు. పట్టణ ప్రాంతాల్లో ఆస్తి లేదా మున్సిపాలిటీ లో 750 చదరపు అడుగుల కన్నా ఎక్కువ భూమి ఉండకూడదు. ఏపీ సేవా ద్వరా తీసుకున్న ఆదాయ, కుల, ధృవీకరణ పత్రాలు అందజేయాలి. వయసు ధృవీకరణ Integrated Certificate or Voter ID Card with Date of Birth or Tenth Mark Memo కోసం . Aadhaar Card, Residence Certificate, Two Passport Size Photographs, సమర్పించాలి.Bank Account… ఎన్‌పీసీఐ రన్నింగ్ లో ఉండాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి, పెన్షన్ దారుగా ఉండకూడదు. ఈ నిబంధనలో పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఉంది.

ఆ ఆలయంలో అమ్మవారికి 16 ప్రదక్షిణలు చేస్తే చాలు.. అప్పులు తీరిపోతాయంటూ

మనలో చాలామంది నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అప్పుల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఒక ఆలయానికి వెళ్లి అమ్మవారికి మొక్కి 16 ప్రదక్షిణలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయట.
అప్పులు ఉన్నవాళ్లు నిమిషాంబ దేవి ఆలయాన్ని సందర్శించడం వల్ల అప్పులు తీరిపోతాయట. బోడుప్పల్ లో( Boduppal ) ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరతాయని చాలామంది భావిస్తారు.

నిమిషాంబదేవిని( Nimishamba Devi ) ఏం కోరుకున్నా వేగంగా కోరికలు తీరతాయని భక్తులు చెబుతున్నారు. పెళ్లి కాని వాళ్లు ఈ దేవతను దర్శించుకోవడం వల్ల వేగంగా పెళ్లి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. 2006 సంవత్సరంలో హైదరాబాద్ లో( Hyderabad ) ఈ ఆలయాన్ని నిర్మించారని సమాచారం అందుతోంది. రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా హైదరాబాద్ కు చేరుకుని ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు.

నిమిషంలోగా ఈ ఆలయంలో కోరిక కోరుకోవాలని 21 సెకన్లు, 21 నిమిషాలు, 21 రోజుల్లోగా మన విఘ్నాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. కోరిన కోరికలు తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయాలని పండితులు వెల్లడిస్తున్నారు. హిందువులలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని( Temple ) దర్శించుకుంటే మంచిది. నిమిషాంబ దేవికి నిమ్మకాయలను సమర్పించి ఆ దండలను ఇంట్లో పెట్టుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.

నిమిషాంబదేవిని దర్శించుకోవడం వల్ల జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోవడంతో పాటు మంచి ఫలితాలు కలుగుతాయి. నిమిషాంబ దేవికి నిమ్మకాయలు, గాజులు, వస్త్రాలు సమర్పిస్తే మంచిది. గంజాం ప్రదేశంలో నిమిషాంబ దేవి అవతరించారు. భక్తి విశ్వాసాలతో అమ్మవారిని ప్రార్థించడం ద్వారా మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో నిమిషాంబ దేవికి ఆలయాలు ఉండగా దేవి భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా అనుకూల ఫలితాలను పొందవచ్చు.

శ్రీకృష్ణుడు 16 వేల వివాహాలు ఎందుకు చేసుకున్నాడో తెలుసా..

ద్వాపర యుగంలో విష్ణువు కృష్ణుడి రూపంలో భూమిపై జన్మించాడు. శ్రీ కృష్ణ పరమాత్ముడు ధర్మాన్ని రక్షించడానికి అనేక రకాల కృషి చేశాడు. మనిషి ధర్మం కోసం జీవించాలని శ్రీ కృష్ణుడు గీతలో అర్జునుడికి వివరించాడు.
అలాగే మనిషి తన జీవితాన్ని ఎలా గడపాలో పూర్తి జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాంటి శ్రీ కృష్ణుడికి సంబంధించిన ఆసక్తికరమైన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇంతకీ ఆ కథ ఏంటి అనుకుంటున్నారా అయితే ఇప్పుడు తెలుసుకుందాం.

16,000 మంది గోపికలతో పెళ్లి ?

పురాణాల ప్రకారం నరకాసురుడు చాలా మంది రాజులను ఓడించి, వారి కుమార్తెలను బంధించి, ఆ 16,000 మంది గోపికలను జైలులో పెట్టాడు. అప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా యుద్ధం చేసి నరకాసురుడిని సంహరించి 16,000 మంది గోపికలను చెర నుండి విడిపించాడు. అయితే అప్పటికే నరకాసురుడు చాలా మంది బాలికల కుటుంబాలను చంపాడు. మిగతా బాలికల కుటుంబ సభ్యులు వారు ఇంటిలోనికి రావడానికి నిరాకరించి వారిని విడిచిపెట్టారు.
అప్పుడు ఆ అమ్మాయిలందరూ శ్రీ కృష్ణ భగవానుని అభ్యర్థించారు. మీరు మా ప్రాణాలను కాపాడారు, కానీ ఇప్పుడు మేము ఒంటరిగా ఎక్కడికి వెళతాము అని. దాంతో శ్రీకృష్ణుడు ఆ అమ్మాయిలందరి గౌరవాన్ని కాపాడటానికి 16 వేల రూపాలలో కనిపించి వారిని వివాహం చేసుకున్నారు.

శ్రీకృష్ణుడికి 8 మంది రాణులు ?

అలాగే శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది రాణులు ఉన్నారు. వీరి పేర్లు రుక్మణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రబింద, సత్య, భద్ర, లక్ష్మణ.

ఆ గ్రామంలో మొత్తం 75 ఇళ్లు.. 51 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు..

సాధారణంగా ఏదైనా గ్రామంలో ఐఏఎస్ లేదా ఐపీఎస్( IAS or IPS ) ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారనే ప్రశ్నకు మెజారిటీ గ్రామాలలో ఒక్కరు కూడా ఉండరనే సమాధానం వినిపిస్తుంది.
ఐఏఎస్, ఐపీఎస్ కావడం సులువైన విషయం కాదు. అయితే ఒక గ్రామంలో మాత్రం 75 ఇళ్లు ఉండగా ఆ గ్రామంలో ఏకంగా 51 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉండటం గమనార్హం. ఆ ఊరిని నెటిజన్లు ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పిలుస్తున్నారు.

యూపీలోని జౌన్ పూర్ జిల్లాలోని మాధోపట్టి ( Madhopatti )ఈ గ్రామం పేరు కాగా లక్నోకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం పేరు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగుతోంది. పండుగలు వస్తే చాలు ఈ గ్రామం ఖరీదైన లగ్జరీ కార్లతో కళకళలాడుతుంది. ఒక గ్రామంలో 51 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉండటం అంటే అరుదైన రికార్డ్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రతి సంవత్సరం ఈ గ్రామం నుంచి సింగిల్ డిజిట్ లో విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతూ దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నారు. పెద్దపెద్ద నగరాలకు సైతం సాధ్యం కాని ఘనత ఈ గ్రామానికి సొంతమైందంటే ఈ గ్రామంలో ఏదో ప్రత్యేకత ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఎలాంటి కోచింగ్ సెంటర్లు లేని ఈ గ్రామం ఎన్నో గ్రామాలకు స్పూర్తిగా నిలుస్తుందని కొంతమంది చెబుతున్నారు.

దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో ఈ గ్రామంలోని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు సేవలు అందిస్తున్నారు. పిల్లలను ఐఏఎస్, ఐపీఎస్ లను చేస్తున్న ఈ గ్రామస్తులను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. మాధోపట్టి గ్రామానికి సంబంధించిన విషయాలు, విశేషాల గురించి తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ గ్రామం మరింత మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫర్లను అందించి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును మార్చాలని ఆశిద్దాం. ఈ గ్రామం ఆదర్శ గ్రామం అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌తో పులి: ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన వీడియో

ఢిల్లీ: కాలుష్యం ప్రస్తుత ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతుంది. నగరాలే కాదు అడవుల్లో కూడ కాలుష్యం వన్యప్రాణులకు ఇబ్బందులు చిక్కులు తెస్తుంది.
అడవుల్లో కూడ ప్లాస్టిక్ వస్తువులు చేరుతున్నాయి.ప్లాస్టిక్ అడవి జంతువులకు హాని కల్గిస్తున్నాయి. దీంతో జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అడవులు అంతరించిపోయి కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. దరిమిలా వాతావరణంలో అసాధారణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచంలో ఉష్ణోగ్రతలు కూడ పెరిగిపోతున్నాయి.

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ దీప్ కతికర్ తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్ లో తీసిన వీడియో వైరల్ గా మారింది. 2023 డిసెంబర్ లో తీసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఓ పులి వాటర్ హోల్ నుండి ప్లాస్టిక్ బాటిల్ ను నోటకర్చుకొని వెళ్లడం చర్చకు దారి తీసింది.నీటిలోని ప్లాస్టిక్ బాటిల్ను తీసుకొని నోటిలోకి తీసుకెళ్లడంతో వీడియో ప్రారంభమౌతుంది. అడవుల్లో కూడ ప్లాస్టిక్ కన్పించడంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోపై ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద స్పందించారు. అడవుల్లో ప్లాస్టిక్ ను దూరంగా ఉంచాలని ఆయన కోరారు. అడవుల్లో నాగరికత చెత్తను శుభ్రం చేయాలన్నారు. ప్లాస్టిక్ చెత్తను అడవుల వద్దకు తీసుకెళ్లడం మానుకోవాలని ఆయన కోరారు.
మానవాళికి కాలుష్యం నుండి అతి పెద్ద ఇబ్బంది. సౌకర్యం కోసం ఉపయోగించే ప్లాస్టిక్ కారణంగా తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. అడవులను కూడ ప్లాస్టిక్ వదలడం లేదు. ప్లాస్టిక్ తో వన్యప్రాణులు కూడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

Vastu Tips: వామ్మో.. అపరాజిత పుష్పాలతో అన్ని రకాల ప్రయోజనాల.. సంపద, శ్రేయస్సుతో పాటు..?

హిందూమతంలో పూల మొక్కలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల పూల మొక్కలు, కొన్ని పూలు విశేషమైన గొప్ప లక్షణాలను కలిగి ఉంటాయి. అటువంటి పూలలో అపరాజిత పుష్పాలు కూడా ఒకటి.
వీటినే
శంఖు పుష్పాలు అని కూడా పిలుస్తారు. గొప్ప ఆయుర్వేద లక్షణా లు కూడా అపరాజిత పుష్పాలకు ఉన్నాయి. ఉద్యానవనాలు, గృహాల అందాన్ని పెంచేందుకు నాటిన అపరాజిత మొక్కను ఆయుర్వేదంలో విష్ణుక్రాంత, గోకర్ణి మొదలైన పేర్లతో పిలుస్తారు. నెమలి ఈకల మాదిరిగా, శంఖు మాదిరిగా అందమైన షేప్ లో, ఈ అపరాజిత పుష్పాలు ఉంటాయి.

అపరాజిత పుష్పాలు విష్ణువుకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి పుష్పాలు. ఈ పుష్పాలంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. మాములుగా ఈ పుష్పాలు రెండు రంగులలో ఉంటాయి. తెలుపు రంగు, నీలం రంగు. తెలుపు రంగు అపరాజిత పుష్పాలు విష్ణు పూజకు వినియోగిస్తే, నీలం రంగు అపరాజిత పుష్పాలు శివునికి సమర్పిస్తారు. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడంలో కూడా నీలం రంగు అపరాజిత పుష్పాలను నివేదిస్తారు. హిందూధర్మం లోనే కాకుండా జ్యోతిష్యంలో కూడా అపరాజిత పుష్పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అపరాజిత పుష్పం సంపద శ్రేయస్సును ఆకర్షిస్తుంది.

బాగా డబ్బులు సంపాదించాలన్నా, ఉద్యోగం వ్యాపారంలో పురోగతి సాధించాలన్నా అపరాజిత మొక్కలను ఇంట్లో పెట్టుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే అపరాజిత మొక్కను ఇంట్లో పెంచుకోవాలి అనుకుంటే ఎక్కడపడితే అక్కడ దానిని పెంచకూడదు. కచ్చితంగా వాస్తు నియమాలను పాటించాలి. మొక్కను ఇంట్లో పెంచుకోవాలి అనుకునేవారు ఉత్తరం దిశలో పెడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఇంట్లో నీలిరంగు అపరాజిత మొక్కలు నాటితే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తగ్గుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. అపరాజిత పూలతో శని దేవుడికి పూజ చేస్తే శని దోషాలు తొలగిపోతాయి.ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే అపరాజిత మొక్కలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ మొక్కలను ఇంట్లో పెంచుకొని మీరు సంపదను రెట్టింపు చేసుకోవడంతో పాటు, ముసలి నుంచి గట్టెక్కండి.

LIC Policy: రూ.151 డిపాజిట్‌తో మీ చేతికి రూ.31 లక్షలు.. మీ బిడ్డ పెళ్లి కోసం ఎల్‌ఐసీ నుంచి సూపర్‌ పాలసీ

మీ ఇంట్లో మీకు కూతురు ఉండి, ఆమె పెళ్లి గురించి ఆందోళన చెందుతుంటే ఈ వార్త మీకోసమే. రోజూ కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా మీ కుమార్తె పెళ్లి నాటికి లక్షల రూపాయలు పోగుచేయవచ్చు.
మీరు ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీని సద్వినియోగం చేసుకోవడం ద్వారా కూతురి కోసం డబ్బు ఆదా చేసుకోవచ్చు. దీని కాల పరిమితి 13 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. LIC కన్యాదాన్ పాలసీని కూతురు పుట్టిన ఒకటి నుండి రెండు సంవత్సరాలలోపు ప్రారంభించడం వలన భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి. మీ బిడ్డ పెరిగి పెద్దదైన తర్వాత, చదువు, వివాహం కోసం ఈ డబ్బు మీకు ఎల్‌ఐసీ ద్వారా అందించడం జరిగింది. ముఖ్యంగా ఎల్‌ఐసి ముఖ్యంగా కుమార్తెల పెళ్లి కోసం ఎల్‌ఐసి కన్యాదాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. మీ కూతురు కోసం ఈ పథకాన్ని తీసకున్నట్లయితే ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.

రూ.151 డిపాజిట్ చేయడం ద్వారా రూ.31 లక్షలు:

మీరు ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ తీసుకోవాలనుకుంటే మీకు కనీసం 30 ఏళ్లు ఉండాలి. మీ బిడ్డకు కనీసం 1 సంవత్సరం వయస్సు ఉండాలి. ఈ ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ 25 సంవత్సరాలు అయినప్పటికీ, మీరు 22 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి. మిగిలిన 3 సంవత్సరాలు మీరు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.

కూతురి వయస్సును బట్టి ఈ పాలసీ కాలపరిమితిని తగ్గించుకోవచ్చని గమనించాలి. మీరు భవిష్యత్తులో మీ కుమార్తెకు 18 సంవత్సరాల వయస్సులో వివాహం చేయాలనుకుంటున్నట్లయితే LIC కన్యాదాన్ పాలసీ నిబంధనల ప్రకారం.. అమ్మాయికి కనీస వయస్సు ఉండటం చాలా ముఖ్యం. అంటే మీ బిడ్డకు కనీసం 18 ఏళ్లు ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఈ పాలసీని 17 ఏళ్లపాటు తీసుకోవచ్చు. ఈ పాలసీని తీసుకునే ముందు మీరు మీ సౌలభ్యం ప్రకారం సమయ పరిమితిని సర్దుబాటు చేసుకోవచ్చు.

LIC కన్యాదాన్ పాలసీని పొందేందుకు అవసరమైన పత్రాలు

కుమార్తె జనన ధృవీకరణ పత్రం
తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, పాన్ కార్డ్
పాస్‌పోర్ట్ సైజు ఫోటో
బ్యాంక్ పాస్ బుక్
LIC కన్యాదాన్ పాలసీని ఎలా తీసుకోవాలి?

ఎల్‌ఐసీ ద్వారా కన్యాదాన్ పాలసీని పొందడానికి మీరు మీ సమీపంలోని ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లి డెవలప్‌మెంట్ అధికారిని సంప్రదించవచ్చు. దీనితో పాటు, మీరు మీ స్థానిక ఎల్‌ఐసీ ఏజెంట్‌ను కూడా సంప్రదించవచ్చు.

31 లక్షల రూపాయలు ఎలా పొందాలి?

కన్యాదాన్ పాలసీలో మీరు రోజుకు రూ.151 చెల్లించాలి అంటే నెలకు రూ.4530 డిపాజిట్‌ చేయాలి. 22 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీని తర్వాత మీరు 25 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత రూ.31 లక్షలు పొందుతారు. మీరు ఈ మొత్తాన్ని మీ కుమార్తె తదుపరి చదువుల కోసం లేదా ఆమె వివాహం కోసం ఉపయోగించవచ్చు. ఇది కాకుండా కన్యాదాన్ పాలసీలో రోజుకు రూ.121 డిపాజిట్ చేస్తే అప్పుడు మీకు 27 లక్షల రూపాయలు వస్తాయి. అంతేకాకుండా ఎల్‌ఐసి కన్యాదాన్ పాలసీకి బీమా ప్లాన్ కూడా ఉంది. పాలసీదారుడు ఆకస్మికంగా మరణిస్తే కుటుంబం ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా బీమా చేసినవారి తండ్రి ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలను అందుకోవచ్చు.

Replacement Policy: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ యూజర్లకు బిగ్‌షాక్‌.. రీప్లేస్‌మెంట్ కావాలంటే ఇకపై ఇలా చేయాల్సిందే!

ఆన్లైన్ లో వస్తువులను ఆర్డర్‌ చేయడం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇంట్లో కూర్చుని కావాల్సిన ప్రోడక్ట్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా బుక్‌ చేసుకుంటున్నారు..
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కారణంగా ఈకామర్స్‌ దిగ్గజాలు వినియోగదారులకు మరింతగా దగ్గరవుతున్నారు. వివిధ రకాల ఆఫర్లు, డిస్కౌంట్లు అందించడంతో ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌ సైట్లను అనుసరిస్తున్నారు. మీరు అమెజాన్‌తో పాటు దేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ నుండి వస్తువులను కొనుగోలు చేస్తుంటే ఈ వార్త మీకోసమే. ఈ రెండు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు వాటి రీప్లేస్‌మెంట్ పాలసీలో పెద్ద మార్పును చేశాయి. మీరు కొనుగోలు చేసిన వస్తువు పాడైతే, మీరు దానిని వెంటనే మార్చలేరు. ఒక వస్తువును కొని దానిని మార్చడం కొంత ప్రాసెస్‌తో కూడుకున్నదిగా ఉండనుంది.

అమెజాన్‌తో ఫ్లిప్‌కార్ట్ కీలక మార్పు

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండూ తమ డిజిటల్ రీప్లేస్‌మెంట్ విధానాన్ని మార్చుకున్నాయి. ఈ కంపెనీలు 7 రోజుల్లో వస్తువుల మార్పిడి పథకాన్ని నిలిపివేసాయి. గతంలో ఈ కంపెనీలు దెబ్బతిన్న లేదా నాసిరకం వస్తువులను భర్తీ చేయడానికి అనుమతించేవి. బదులుగా అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు సేవా కేంద్రాలకు మార్గం చూపింది. మీరు దెబ్బతిన్న వస్తువును మార్చాలనుకుంటే మీరు సేవా కేంద్రాన్ని సందర్శించి అక్కడ వస్తువును ఇవ్వాలి. ఆ తర్వాత కొత్త ప్రోడక్ట్‌ వచ్చే వరకు ఈ సర్వీస్ సెంటర్లను సందర్శించాల్సి ఉంటుంది.

కస్టమర్లు ఇది వరకు ఇంట్లో కూర్చొని వస్తువులను మార్పిడి చేసుకునే సదుపాయాన్ని పొందేవారు. అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ ఈ నియమాన్ని మార్చడంతో ఇది కస్టమర్ సేవపై పెద్ద ప్రభావం చూపుతుంది. ఈ రెండు కంపెనీలు తమ ప్లాట్‌ఫారమ్‌లను 7 రోజుల రీప్లేస్‌మెంట్ నుండి 7 రోజుల సర్వీస్ సెంటర్ రీప్లేస్‌మెంట్‌కి మార్చాయి. దీని వల్ల కస్టమర్లకు కొంత కష్టంగా మారే అవకాశం ఉంది.

మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుండి డిజిటల్ వస్తువును కొనుగోలు చేసినట్లయితే మీరు స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్‌లు కొనుగోలు చేస్తే, మీ సమీపంలోని సర్వీస్ సెంటర్ లొకేషన్ గురించి సమాచారాన్ని పొందాలి.ప్రోడక్ట్‌ లోపభూయిష్టంగా ఉన్నట్లు తేలితే మీరు వెంటనే సర్వీస్‌ సెంటర్‌ను దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు. ప్రోడక్ట్‌ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అనే దాని గురించి సమాచారాన్ని పొందవచ్చు. అయితే ఈ విధానం వల్ల వినియోగదారులు విపరీతమైన ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.

Telangana: గుడ్‌న్యూస్‌.. ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు

ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 1/3 శాతం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక రోస్టర్‌ పాయింట్‌ కేటాయించకుండా ఓసీ, ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, క్రీడాకారుల విభాగాల్లో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
వర్టికల్‌ రిజర్వేషన్లకు గతంలో ఇచ్చిన జీవో నం.41/1996, జీవో నం.56/1996 ఉత్తర్వుల రద్దు చేసింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు, రాజ్యాంగ నియామక సంస్థలు, ఎయిడెడ్‌ విద్యాసంస్థలు, స్థానిక సంస్థల్లో నియామకాలకు సమాంతర రిజర్వేషన్లు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రాష్ట్ర సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌-1996 నిబంధనలు సాధారణ పరిపాలనశాఖ స్పెషల్‌గా జారీ చేస్తుందని తెలిపారు. మహిళలకు ఆయా కేటగిరీల్లో వర్టికల్‌ రిజర్వేషన్లు అమలు చేయకూడదని, రాజ్యాంగం రూల్స్‌ ప్రకారం సమాంతరంగా అమలు చేయాలని రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పుకు అనుగుణంగా టీఎస్‌పీఎస్సీ, ఇతర నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలుచేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మహిళాశిశు సంక్షేమశాఖ రోస్టర్‌పాయింట్‌ లేకుండా సమాంతర రిజర్వేషన్లు అమలు చేసేందుకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Betel leaf: ఓర్నీ.. ఈ ఆకుతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? రోజూ ఒకటి నమిలితే

గ్రామాల్లో రాత్రి భోజనం చేసిన తర్వాత తమలపాకులో వక్క వేసి నములతారు. ఇది ఎప్పట్నుంచో వస్తున్న ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది.
అలానే నోటి దుర్వాసన కూడా ఉండదు. ఇక ఇటీవలి రోజుల్లో వివిధ రకాల పాన్‌లు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. అయితే పాన్‌లు, కిల్లీల కోసం ఉపయోగించే.. తమలపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ తమలపాకులో అనేక వ్యాధులను దూరం చేసే శక్తి ఉంది.

* తమలపాకులతో పాటు తులసి ఆకులు, లవంగాలు, పచ్చకర్పూరం కలిపి రోజుకు రెండు పూటలా తీసుకుంటే కఫం, దగ్గు సమస్య దూరమవుతుంది.

* చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఉన్నవారు తమలపాకులను కొబ్బరినూనెలో కలిపి మెత్తగా నూరి తలకు పట్టిస్తే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి.

తమలపాకులను వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, తేనె కలిపి నమలడం వల్ల సిరల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
* తమలపాకుకు కొద్దిగా పసుపు రాసి పిల్లల తలకు పట్టిస్తే జలుబు సమస్య తగ్గుతుంది.

* గర్భిణీ స్త్రీలు తల్లిపాలు పెరగడానికి తమలపాకులు తీసుకోవడం మంచిది.

* చిన్న చిన్న గాయాల నుంచి రక్తస్రావం అవుతుంటే తమలపాకులను మెత్తగా రుబ్బి గాయంపై రాస్తే రక్తస్రావం ఆగుతుంది.

* తమలపాకును ఉప్పుతో నమిలి ఆ రసాన్ని మింగితే కడుపునొప్పి తగ్గుతుంది.

* తమలపాకును నమలడం వల్ల లాలాజల రసం పెరిగి జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

* భోజనం చేసిన తర్వాత ఆకులను తింటే.. నోటి దుర్వాసన దూరమై మౌత్ హెల్త్ బాగుంటుంది.
* మొటిమల వల్ల ముఖం నిండా అల్లుకుపోతే.. తమలపాకును మెత్తగా నూరి మొటిమల మీద రాస్తే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి.

* తమలపాకులను గ్రైండ్ చేసి కొబ్బరినూనెలో వేడిచేసి నొప్పి ఉన్న చోట రాస్తే పెయిన్ తగ్గుతుంది.

* తమలపాకులను రోజూ తింటే చిగుళ్లలో రక్తస్రావం ఆగుతుంది.

* బరువు తగ్గాలనుకునే వారు తమలపాకు కషాయాలను తయారు చేసి విరివిగా తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడి బరువు తగ్గుతారు.

* తమలపాకు రసంతో పాటు నిమ్మరసం కలిపి రాసుకుంటే దురద సమస్య తగ్గుతుంది.

* తలనొప్పిగా ఉంటే కర్పూరం, కొబ్బరినూనెలో తమలపాకుల రసాన్ని కలిపి నుదుటిపై రాసుకుంటే నయమవుతుంది.

School fee: హైదరాబాద్‌లో హార్ట్‌ఎటాక్ తెప్పిస్తున్న స్కూల్ ఫీజలు.. LKG పిల్లాడి ఫీజు వింటే ఫ్యూజులు ఔట్

Hyderabad News: ఆయా విద్యాసంస్థలు పిల్లల స్కూల్ ఫీజులను విపరీతంగా పెంచేస్తున్నాయి. హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ ప్రముఖ పాఠశాలలో నర్సరీ నుంచి LKGకి మారుతున్న నాలుగేళ్ల పిల్లాడి ఫీజు విని తల్లిదండ్రులకు హార్ట్‌ ఎటాక్ వచ్చినంత పనైంది.
ఏకంగా 65 శాతం ఫీజుల పెంపును అమలు చేసినట్లు ఆ పేరెంట్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

2023 విద్యా సంస్థలో 2.3 లక్షలుగా ఉన్న ఫీజులు 2024 నాటికి 3.7 లక్షలకు పెరిగాయని వారు పోస్ట్ చేశారు. తీరాచూస్తే ఆ పిల్లవాడు ఏప్రిల్‌లో LKG లో చేరబోతున్నాడని వెల్లడించారు. పాఠశాల అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ పెరుగుదలను సమర్థించుకున్నట్లు తెలిపారు. IB కరిక్యులమ్‌కు మారడాన్ని ఇందుకు కారణంగా పేర్కొన్నట్లు చెప్పారు.

‘మా పిల్లవాడిని ఆ పాఠశాలలో చేర్పించినప్పుడు, గ్రేడ్ 1 వరకు ఫీజు సాపేక్షంగా, స్థిరంగా ఉంటుందని మేము భావించాము. అయితే నర్సరీ నుంచి LKGకి చేరుకోవడంతో కొత్త ఫీజు బ్రాకెట్‌లో ఉంచారు. ఇది దాదాపు 70 శాతం ఎక్కువ’ అని తల్లిదండ్రులు పేర్కొన్నారు. అయితే వారి పెద్ద కుమారుడు కూడా ప్రస్తుతం అదే పాఠశాలలో 4వ తరగతి చదువుతుండటం విశేషం.

ఇంకో విచిత్రం ఏమిటంటే LKGకి ఆ పాఠశాల వసూలు చేస్తున్న కొత్త ఫీజు 3.7 లక్షలు కాగా.. 4వ తరగతి విద్యార్థికి 50 వేలు తక్కువగా అంటే 3.2 లక్షలు తీసుకుంటున్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు. ‘ఆర్థికంగా ఇది చాలా భారంగా ఉంటుంది. మేము ఇప్పుడు పిల్లవాడిని మరో పాఠశాలకు మార్చాలని ఆలోచిస్తున్నాము. అయితే ఇంత తక్కువ సమయంలో మరోచోట అడ్మిషన్ పొందడం మరొక సవాలు’ అంటూ మండిపడ్డారు.

‘ఈ ఏడాది నా కుమారుడిని 1వ తరగతిలో చేర్పించడానికి పాఠశాల కోసం వెతికాం. కూకట్‌పల్లిలోని దాదాపు 10 పాఠశాలలను సందర్శించాము. ఫీజులు దాదాపు 4 లక్షల వరకు ఉన్నాయి. వాటిలో అత్యల్పం 1 లక్ష. పాఠశాలలు క్లెయిమ్ చేసే విభిన్నమైన అంశం మౌలిక సదుపాయాలు. అయితే అకడమిక్స్ మరియు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ జూనియర్ క్లాస్‌లకు ప్రాథమిక దృష్టిగా ఉండాలి’ అని మరో యూజర్ చెప్పుకొచ్చారు.

అయితే నగరంలోని పాఠశాలల నిర్వాహకులు ఈ ఫీజు పెంపును సమర్థించారు. ‘చాలా పాఠశాలలు ఈ సంవత్సరం రుసుములను 8 నుంచి 10 శాతం పెంచాయి. అనుభవజ్ఞులైన సిబ్బందిని నిలుపుకోవడానికి మార్కెట్‌తో పోటీపడి ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఫీజుల పెంపులో మానవ వనరుల కోసం వెచ్చించే మొత్తమే అత్యధికంగా ఉంటోంది’ అని నగరంలోని CBSE స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధి పేర్కొన్నారు.

గుండె జబ్బులు రావొద్దు అంటే ఈ మూడు విషయాలు గుర్తుంచుకోండి చాలు

బిజీ లైఫ్ స్టైల్, చెడు ఆహారపు అలవాట్ల వల్ల మనుషుల్లో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతోంది. బిజీ లైఫ్ స్టైల్ ప్రభావం మన మొత్తం ఆరోగ్యంపై కనిపిస్తోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తగినంత నిద్ర లేకపోవడం, బరువు తగ్గడానికి అధిక ఆహార నియంత్రణ, ధూమపానం లేదా మద్యం సేవించడం వంటివి ఈ అలవాట్లు అన్నీ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిని మార్చుకోవడం చాలా ముఖ్యం. రక్తపోటు గుండె జబ్బులకు మూలకారణంగా పరిగణించబడుతుంది. కాబట్టి, మీ రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. మంచి నిద్రతో పాటు సోడియం తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా హై బీపీని అదుపులో ఉంచుకోవచ్చు.

మీ ఆహారం నుంచి సంతృప్త కొవ్వు అధికంగా ఉండే ఆహారాలను నివారించండి. నిజానికి, కొవ్వు పదార్ధాలు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను పెంచుతాయి. ఇవి ధమనులలో అడ్డంకులు ఏర్పడతాయి. ఈ పరిస్థితిని కరోనరీ ఆర్టరీ వ్యాధి అని కూడా అంటారు. ఆరోగ్యంగా ఉండటానికి, మీ ఆహారంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు మరియు ఆరోగ్యకరమైన స్నాక్స్ మాత్రమే చేర్చండి.

ఈ రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్ వల్ల వ్యాయామానికి సమయం దొరకడం లేదు, కానీ గుండె కండరాలను బలోపేతం చేయడానికి అనేక వ్యాయామాలు ఉన్నాయి. వ్యాయామం చేయని వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి, మీ వయస్సును పరిగణనలోకి తీసుకుని, మీరు కొంత సమయం వ్యాయామం చేయాలి.

అధిక ఊబకాయం గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది కాబట్టి మీరు ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉసిరి, బతువా, షింగోడా, అరబిక్, బెండకాయ మరియు బత్తాయి తినకూడదు. అంతే కాకుండా ఎలాంటి శారీరక సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. మీరు ఈ ముడింటిని మీ నియంత్రణలో ఉంచుకోగలిగితే.. మీకు గుండె సమస్యలు దరిచేరవు.

APలో ‘బర్డ్ ఫ్లూ’ కలకలం! 3 నెలలు చికెన్ షాపుల బంద్‌కు ఆదేశం!

ఇటీవల ప్రపంచంలో కొత్త కొత్త వైరస్ లు మనుషులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొత్త వైరస్ ల భారిన పడి జంతువులు, పక్షులు కూడా విల విలలాడిపోతున్నాయి.
డేంజరస్ వైరస్ లో ఒకటి బర్డ్ ఫ్లూ. ఈ వ్యాధి కోళ్లు, బాతులు, ఇతర పక్షి జాతులకు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే ప్రభావం చూపిస్తుంది. ఇది హెచ్5ఎన్1 (H5N1)అనే వైరస్ వల్ల వ్యాపిస్తుంది. గతంలో భారత్ లో బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం రేపింది. లక్షల సంఖ్యల్లో కోళ్లను చంపేశారు. కొన్ని చోట్ల అయితే ఒక్క రూపాయికి లేదా ఫ్రీగా ఇవ్వడం కూడా జరిగింది. దీంతో కోళ్ల పరిశ్రమ యాజమానులో భారీగా నష్టపోయారు. ఏపీలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పౌల్ట్రీ యాజమాన్యానికి మళ్లీ పిడుగు లాంటి వార్త కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఏపీలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే..

రెండేళ్ల క్రితం దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన ప్రళయం సృష్టించింది. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ తర్వాత కరోనా కొంతవరకు తగ్గుముఖం పట్టింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం అనుకుంటున్న సమయంలో తెలుగు ప్రజలకు మరో కొత్త వైరస్ కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం రేపుతుంది.వైరస్ కారణంగా జిల్లాలోని పొదలకూరు, కోవూరు మండలాల్లో భారీగా కోళ్ల మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. సమాచారం అందుకున్న జిల్లా అధికార యంత్రాంగాం కోళ్ల శాంపిల్స్ తీసుకొని భోపాల్ ల్యాప్ కి పంపించారు. తాజాగా రిపోర్ట్స్ లో కోళ్ల మృతికి కారణం బర్డ్ ఫ్లూ నే కారణం అని అధికారులు నిర్దారించారు.

నెల్లూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ అని తెలియగానే ప్రజలు భయాంతోళనకు గురి అయ్యారు. ఈ విషయంపై పశుసంవర్ధక శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ శుక్రవారం అత్యవసర భేటీ ఏర్పాటు చేసి ఈ వైరస్ ఇతర ప్రదేశాలకు వ్యాపించకుండా తక్షణమే జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయిన కోళ్లకు దాదాపు కిలో మీటర్ల దూరంలో 3 నెలల వరకు చికెన్ షాపులు మూసి వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైరస్ ని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ టిప్ ఫాలో అయితే కొన్న ప్రతి చీరకు బ్లౌజ్ కుట్టించే పనిలేదు!

ఎన్నిరకాల ట్రెండీ బట్టలు అందుబాటులోకి వచ్చినా ఆడవారికి చీరాల పై ఉండే మక్కువ ప్రత్యేకం. ఆ మక్కువతోనే చీరలు కొనేస్తారు. అయితే బీరువా నిండా ఎన్ని కొత్తచీరాలు ఉన్న సరే పండగలు పబ్బాలు వచ్చాయి అంటే కొత్త చీర కొనడానికి సిద్దం అయిపోతారు.
మరి ఇన్ని చీరలకు అన్నీ జాకెట్లు జత చేయడం సులభమైన పనా చెప్పండి ? కాదు కదా కానీ కొన్ని రంగుల బ్లౌజులతోనే దాదాపు మీరు చీరల్ని కట్టుకోవచ్చు అంటే నమ్ముతారా.. నమ్మరు కదా ? కానీ అది నిజం.

మరి అన్ని చీరలకు సరిగ్గా సరిపోయే రంగులేంటో చూద్దాం పదండి.. * ఎరుపు:- ఎరుపు రంగు బ్లౌజ్ ని మీరు చాలా వాటికి మీదకి వాడచ్చు ఉదాహరణకి నీలం ప్రింట్స్ ఉన్న శారీ పై లేదా ఎరుపు రంగు నప్పే ఏ సాలిడ్ కలర్ చీర మీదకైనా మీరు ఈ రెడ్ కలర్ బ్లౌజ్ వాడచ్చు. * పింక్:- పింక్ కలర్ అనేది దాదాపు అన్నీ రంగుల చీరల మీదకి బాగుంటుంది. ఉదాహరణకి ఏదైనా చీర మీద పింక్ కలర్ డిజైన్ ఉన్నా, లేదా బ్లూ లాంటి చీరల పై కాంట్రాస్ట్ లాగా, గ్రే లాంటి డల్ షేడ్స్ పైన, బ్రైట్ కలర్స్ లైక్ యెల్లోతో జత చేయచ్చు.
మెరూన్:- ఈ రంగు ట్రెడిషనల్ అలాగే పార్టీ వేర్ చీరల మీదకి చాలా బాగా నప్పుతుంది. ముదురు ఆకుపచ్చ, బంగారం లాంటి రంగులున్న చీరలకు మెరూన్ రంగు బ్లౌజ్ చాలా చాలా బాగా కనిపిస్తుంది. * నేవి బ్లూ:- బ్లూ అనేది దాదాపు అందరి ఫేవరెట్ కలర్. ఒకవేళ మీ దగ్గర ఈ కలర్ బ్లౌజ్ ఉన్నట్లైతే దీన్ని మీరు చాలా చీరల మీదకే మ్యాచ్ చేయచ్చు.

ఉదాహరణకి రెడ్, గ్రీన్, ఆరెంజ్ లాంటి రంగుల చీరల మీదకి ఈ బ్లౌజ్ బాగా నప్పుతుంది * గోల్డ్:- గోల్డ్ రంగు బ్లౌజ్ అయితే అన్ని రకాల చీరల మీద గుడ్డిగా వేసుకోవచ్చు. మీరు తీస్కున్న చీర మీద గోల్డ్ కలర్ డిజైన్ ఉంటే మాత్రం మీరింకేం ఆలోచించకుండా గోల్డ్ కలర్ బౌజ్ తో జత చేసేయండి. * బాటిల్ గ్రీన్:- ఒకవేళ మీ చీరల మీద పచ్చ రంగు బుటాస్ ఉన్నా, లేదా మీ చీర బార్డర్ పచ్చ రంగు ఉన్నట్లైతే మీరు నిర్మొహమాటంగా ఈ పచ్చ రంగు బ్లౌజ్ ని వేసుకోవచ్చు. అలాగే ఆ రంగుకి కాంట్రాస్ట్ గా నిలిచే మెరూన్, పింక్, ఆరెంజ్ లాంటి రంగులున్న చీరలను తప్పక ట్రై చేయండి.

* ఆరెంజ్ :- ఈ రంగు అయితే నలుపు, నీలం, గులాబీ, ఎరుపు, బ్రౌన్ లాంటి రంగులకి చక్కగా సరిపోతుంది. ఇవే కాక మీరు చీర మీద ఉండే చిన్న చిన్న ప్రింట్స్ ఆర్ కుందన్ వర్క్ తో జత చేయవచ్చు. * బ్లాక్:- మీ చీర మీద ఏమాత్రం బ్లాక్ కలర్ డిజైన్ ఉన్నా సరే మీరు వెంటనే దాన్ని ఈ నలుపు రంగు జాకెట్టుతో చీరని కట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు తీస్కునే ఏ బ్లౌజ్ అయినా సరే గోల్డెన్ డిజైన్ మాత్రమే ఉండాలి మరే ఏ రంగు కలిసిన అవి అన్నిటిమీదకి అంతలా నప్పవు కాబట్టి బ్లౌజ్ కొనే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకుని కొనండి.

Walking: వాకింగ్ చేస్తూ వారంలో మూడు కిలోలు, మూడు నెలల్లో 30 కిలోలు బరువు తగ్గొచ్చు, ఎలాగంటే…

Walking: ప్రపంచంలో ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఊబకాయం, అధిక బరువు. ఈ రెండింటి వల్లే ఎన్నో ఎన్నో ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం పెరిగిపోతోంది.
మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్, గుండెపోటు ఇవన్నీ రావడానికి ఊబకాయం దోహదపడుతుంది. కాబట్టి అధిక బరువును కచ్చితంగా తగ్గించుకోవాలి.

బరువును తగ్గించుకోవడం కోసం జిమ్ లో చేరి ఎంతో ఖర్చు పెడతారు కొంతమంది. నిజానికి అంత కష్టపడకుండానే కేవలం వాకింగ్ ద్వారానే బరువు తగ్గవచ్చు. ప్రతిరోజూ వాకింగ్ ఒకే సమయానికి చేయడం అలవాటు చేసుకోవాలి. ఒక్కరోజు కూడా ఆగకుండా ప్రతిరోజు వాకింగ్ చేసేవారు వారంలోనే మూడు కిలోలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వారానికి మూడు కిలోలు చొప్పున మూడు నెలల్లోనే 30 కిలోలు తగ్గే అవకాశం ఉంది.

వాకింగ్‌తో బరువు ఎలా తగ్గవచ్చు?
ఎన్నో అధ్యయనాలు చెప్పిన ప్రకారం గంటపాటు స్పీడుగా వాకింగ్ చేస్తే ఏడు రోజుల్లో మూడు కిలోల బరువు తగ్గవచ్చు. ఇలా 12 వారాలపాటు అంటే మూడు నెలల పాటు ప్రతి రోజూ స్కిప్ చేయకుండా గంటపాటు వేగంగా నడిస్తే 30 కిలోలు సులువుగా తగ్గవచ్చు. 30 కిలోలు కాకపోయినా ఎంత తక్కువగా వేసుకున్నా కూడా 20 కిలోలు తగ్గే అవకాశం ఉంది. కాకపోతే వాకింగ్ చేసేటప్పుడు చాలా వేగంగా నడవాలి. చెమటలు పట్టాలి. కొంతమంది చాలా కూల్‌గా, మెల్లగా నడుచుకుంటూ వెళ్తారు. అలాంటి వాకింగ్ వల్ల బరువు తగ్గే అవకాశం తక్కువ. వేగంగా నడుస్తూ చేసే వాకింగ్ వల్ల ఉపయోగం ఉంటుంది.

ఆహారం కూడా…
కేవలం వాకింగ్ ఒక్కటే కాదు, ప్రతిరోజూ గంట వాకింగ్ చేస్తున్న సమయంలో ఆహార నియంత్రణను పాటించాలి. అధిక కొవ్వు ఉండే పదార్థాలు తీసుకోకూడదు. అలాగే పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నవి తినకూడదు. పండ్లు, తాజా కూరగాయలతో వండిన ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మాంసాహారాన్ని తగ్గించాలి. అధిక కొలెస్ట్రాల్ ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ ఆహారపు అలవాట్లను పాటిస్తూ వాకింగ్ చేస్తే మీకు నెల రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

వాకింగ్ చేసేటప్పుడు ఏదో అలా షికారుకు వెళ్లినట్టు కాకుండా వేగంగా నడవాలి. మొదటిరోజు కాస్త కష్టంగా అనిపించవచ్చు, ఒక వారం రోజులు చేస్తే అలవాటైపోతుంది. వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గడమే కాదు, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మతిమరుపు వంటి సమస్యలు రావు. గుండెకు కూడా వాకింగ్ ఎంతో మేలు చేస్తుంది. రక్త సరఫరా శరీరంలో సవ్యంగా జరిగి గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అధిక రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజు వాకింగ్ చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల బీపీ పెరగకుండా అదుపులో ఉంటుంది. ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు వాకింగ్ చేస్తే మంచిది. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు వాకింగ్ చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు.

కింద పడినా పగలని టెక్నాలజీతో హానర్ ఫోన్! ధర ఎంతంటే..

హానర్ ఎక్స్9 బీ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో రన్ అవుతుంది. ఇందులో హానర్ మ్యాజిక్ ఓఎస్ యూఐ ఉంటుంది.
చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హువాయికి చెందిన హానర్ బ్రాండ్ నుంచి త్వరలో ఓ సరికొత్త మొబైల్ లాంఛ్ అవ్వనుంది. ఇందులో ‘అల్ట్రా బౌన్స్ బ్యాక్ డిస్‌ప్లే’ అనే ప్రత్యేక ఫీచర్‌‌తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేస్తే.. హానర్ నుంచి ‘హానర్ ఎక్స్9 బీ’ అనే స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్‌లోకి రానుంది. ఫిబ్రవరి 15వ తేదీన స్మార్ట్ ఫోన్ లాంఛ్ అవ్వనున్నట్టు హానర్‌టెక్ అఫీషియల్ ఎక్స్(ట్విటర్) పేజీ ప్రకటించింది. అయితే ఇందులో సరికొత్త అల్ట్రా బౌన్స్ డిస్‌ప్లేను వాడారట. అంటే ఫోన్ ఏ యాంగిల్‌లో కింద పడినా డిస్‌ప్లేకు ఎలాంటి హాని జరగదన్న మాట.
హానర్ ఎక్స్9 బీ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో రన్ అవుతుంది. ఇందులో హానర్ మ్యాజిక్ ఓఎస్ యూఐ ఉంటుంది. డిస్‌ప్లే విషయానికొస్తే 6.78 అంగుళాల 1.5కే అమోలెడ్ స్క్రీన్‌ ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్‌లో వెనుకవైపు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇందులో 35 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5800 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. అయితే బాక్స్‌లో ఛార్జర్ ఉండకపోవచ్చు. హానర్ ఎక్స్9బీ స్మార్ట్ ఫోన్.. 8జీబీ/12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లతో రానుంది. 5జీ సపోర్ట్ చేస్తుంది. బాక్స్‌లో ఇయర్ ఫోన్స్ అందిస్తున్నారు. అలాగే 12 నెలల స్క్రీన్, బ్యాక్ కవర్ ప్రొటెక్షన్, 24 నెలల వారంటీ కూడా ఉంది. రెండు సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్స్, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నారు. ధర రూ.25,000 నుంచి రూ.30,000 మధ్యలో ఉండొచ్చు.

Jonna Pindi Samosa: జొన్న పిండి సమోసాలను ఇలా 10 నిమిషాల్లో తయారు చేసుకోండి..

Jonna Pindi Samosa Recipe In Telugu: సాయంత్రం స్నాక్స్‌లో భాగంగా ఏదో ఒకటి తినండి మనసున అస్సలు పట్టదు.. అందుకే చాలామంది ఉల్లి పకోడా, సమోసా లాంటివి ఇంట్లోనే వేడివేడిగా తయారు చేసుకొని తింటారు.
కొంతమంది అయితే మిరపకాయ బజ్జీలు, వేయించిన పల్లీలు కూడా తీసుకుంటూ ఉంటారు.. అధ్యయనాల ప్రకారం భారతీయులు ఎక్కువగా సాయంత్రం చిరుదిండ్లలో భాగంగా సమోసానే ఎక్కువగా తీసుకుంటున్నారని తేలింది. అయితే ప్రతిరోజు సమోసాలు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు రావచ్చు. ఎందుకంటే సమోసాను తయారు చేసుకునే పిండిలో ఎక్కువగా మైదా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మైదాతో తయారుచేసిన సమోసాలను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు రావచ్చు.

ఆరోగ్యంగా సమోసాలు తినాలనుకునేవారు మైదా పిండికి బదులుగా జొన్న పిండితో తయారుచేసిన వాటిని కూడా తీసుకోవచ్చు. జొన్న పిండితో తయారుచేసిన ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్న శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వీటిని మధుమేహం, బరువు తగ్గాలనుకునే వారు కూడా తీసుకోవచ్చు. కాబట్టి తరచుగా మైదాపిండి సమోసాకు బదులుగా జొన్నపిండితో తయారు చేసిన సమోసాను తీసుకోవడం ఎంతో మంచిది. అయితే ఈ సమోసాలు తయారు చేయడం కూడా చాలా సులభం దీని తయారీ పద్ధతి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే..

జొన్న సమొసాకు కావలసిన పదార్థాలు:
ఒక కప్పు జొన్నపిండి
ఒక కప్పు గోధుమపిండి
ఒక కప్పు ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప
సమోసా వేయించడానికి నూనె
ఉడికించిన బటానీలు
పచ్చిమిర్చి
తగినన్ని ఉల్లిపాయలు
పోపు దినుసులు

తయారీ విధానం:
ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని తగినంత నీరు పోసి బాగుగా పిండి ముద్దగా చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత ఈ పిండిని పక్కకు పెట్టుకొని ఆలును కర్రీ స్టఫింగ్‌లా తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో తగినంత నూనె వేసుకుని పోపు దినుసులు ఉల్లి బటానీలు బంగాళదుంప వేసుకొని కర్రీలా తయారు చేసుకోవాలి.

ఆ తర్వాత పక్కన పెట్టిన పిండి ముద్దలను చిన్న ముద్దలుగా చేసి పూరి సైజ్లో రుద్దుకొని, దీని మీద బంగాళదుంప మిశ్రమాన్ని ఉంచి త్రిభుజాకారంలో చేసి నూనెలో వేయించు కోవాలి. అంతే సులభమైన పద్ధతిలో ఎంతో హెల్తీ అయిన జొన్న సమోసాలు రెడీ అయినట్టే..

Business Idea: కేవలం రెండు లక్షలతో బిజినెస్..ఏటా రూ.28 లక్షలకుపైగా ఆదాయం!

కేవలం రెండు లక్షల రూపాయలతో మంచి వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా. అయితే మీరు ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే. మీరు ఈ వ్యాపారాన్ని ఏ సీజన్‌లోనైనా చేసుకోవచ్చు.
ఈ వ్యాపారం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. అదే టొమాటో సాస్ బిజినెస్. అయితే దీనిని ఎలా ప్రారంభించాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, లాభాలు ఎలా ఉంటాయానేది ఇప్పుడు తెలుసుకుందాం.

మంచి డిమాండ్

ప్రస్తుతం టొమాటో సాస్‌ను అనేక మంది పలు రకాల ఆహారాలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా బ్రెడ్, పిజ్జా, రోల్స్, చౌ మెయిన్, బర్గర్‌లు వంటి వివిధ రకాల స్నాక్స్‌లో వినియోగిస్తున్నారు. దీంతో దీనికి మార్కెట్లో పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. అంతేకాదు టొమాటో సాస్ లేకుండా చాలా మంది ఆయా ఆహారాలను తీసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో టమోటా సాస్ వ్యాపారం చేయడం ద్వారా మంచి లాభాలను ఆర్జించవచ్చు.

పన్నెండు నెలలు..

ప్రపంచంలోని టొమాటో ఉత్పత్తిదారులలో భారతదేశం టాప్ దేశాలలో ఒకటిగా ఉంది. టొమాటోలు పన్నెండు నెలలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఈ వ్యాపారం చేయడం సులభం అవుతుంది. టొమాటో సాస్ చేయడానికి ముందు మొదట మీరు టమోటాలు కొనాలి. పండిన టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఆవిరి కెటిల్‌లో ఉడకబెట్టాలి. ఆ తరువాత టమోటా పేస్ట్ తయారవుతుంది. అప్పుడు దాని నుంచి విత్తనాలు, ఫైబర్ వేరు చేయాలి. తర్వాత వెనిగర్‌, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, మిరియాలు, ఉప్పు, పంచదార కలిపిన రసంలో కలుపాలి. అది చెడిపోకుండా ఉండేందుకు కొన్ని రసాయనాలను కూడా ఉపయోగిస్తారు.

రుణ సౌకర్యం కూడా
ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి మార్కెట్లో సేల్ చేయాలి. టొమాటో సాస్ తయారీ యంత్రాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని ఇన్‌స్టాల్ చేయడానికి పెద్ద స్థలం అవసరం లేదు. ఓ నివేదిక ప్రకారం ఈ వ్యాపారంలో సంవత్సరానికి 28 నుంచి 40 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చని తెలుస్తోంది. మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద రుణాన్ని కూడా పొందవచ్చు. అయితే ఈ వ్యాపారానికి దాదాపు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

AP News: డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ధర్మాసనం ముందు పిటిషన్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ విచారణకు అనుమతి కోరారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ధర్మాసనం ముందు పిటిషన్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ విచారణకు అనుమతి కోరారు. ఎస్‌జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదిస్తున్నారు.
బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన పది లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని న్యాయవాది తెలిపారు. దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఎన్సీటీఈ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని పిటిషనర్ వెల్లడించారు. తప్పులతడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషన్‌పై అత్యవసర విచారణ సోమవారం చేపడతామని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

కేసు వివరాలు…

ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఎస్‌జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడo.. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ పేర్కొన్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఎస్‌జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడo.. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ పేర్కొన్నారు. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన పది లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఎన్సీటీఈ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని పిటిషనర్ పేర్కొన్నారు.
తప్పులతడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన బొల్లా సురేష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ హైకోర్టు రిజిస్టార్‌ని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ కోరనున్నారు. ఈ పిటిషన్‌పై రేపు వాదనలు జరిగే అవకాశం ఉంది. కేవలం రోజుల వ్యవధిలో పరీక్షలకు సన్నద్ధం కావాలంటూ రాజకీయ ప్రయోజనాలతో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారని పిటిషనర్ పేర్కొన్నారు.

Jobs: ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి.. ఈజీ గా జాబ్ కొట్టండి

1500కు పైగా కంపెనీలు సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులను దత్తత తీసుకుంటున్నాయి. ఇప్పటికే వేలాది మందిని ప్రముఖ కంపెనీలు దత్తత తీసుకున్నాయి.

Jobs: Software రెండు దశాబ్దాలుగా అధిక జీతంతో కూడిన ఉద్యోగం. దేశ విదేశాల్లోని పెద్ద పెద్ద కంపెనీలు మంచి జీతంతో ఉద్యోగాలు ఇస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇంజినీరింగ్ చదివించేలా చేస్తున్నారు. పిల్లలు కూడా B.Tech తర్వాత software ఉద్యోగంలో చేరితే జీవితంలో సెటిల్ అయిపోవచ్చని అనుకుంటారు. కానీ engineering చేసిన వారిలో 60 శాతం మంది ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. నైపుణ్యం లేకపోవడం, భాషా నైపుణ్యం లేకపోవడం తదితర కారణాలతో చాలా మంది ఉద్యోగాలకు ఎంపిక కావడం లేదు.. చివరకు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగం రాకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి.

If you do this, the job will be perfect..

అయితే నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చేందుకు చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అయితే ఈ విషయం చాలా మందికి తెలియక ఇబ్బందులు పడుతున్నారు. IT company లో ఉద్యోగం రావాలంటే Software skills ఉంటే చాలు. మీ శాఖ మరియు మీ శాతం మిమ్మల్ని ఆపదు.

More than 1500 companies..

More than 1500 companies.. Software skills ఉన్న engineering విద్యార్థులను దత్తత తీసుకుంటున్నాయి. ఇప్పటికే వేలాది మందిని ప్రముఖ కంపెనీలు దత్తత తీసుకున్నాయి. మీరు కూడా ఈ జాబితాలో చేర్చబడతారు మరియు సందడి వస్తుంది. దీని కోసం అగ్రశ్రేణి కెరీర్ నిపుణులు మార్గనిర్దేశం చేస్తున్నారు. మీరు కూడా దత్తత జాబితాలో చేరాలనుకుంటే, మీరు bit.ly/BookFreeDemo-softwarejobs.is క్లిక్ చేసి చేరవచ్చు మరియు ఇక్కడ డెమో పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి.

ఈ చెట్టు కాయను దంచి తలకు పట్టిస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది..!

ఆహారం, అస్తవ్యస్థమైన జీవనశైలి కారణంగా చాలా మంది అకాలంగా జుట్టు నెరిసిపోవటం, రాలిపోవటం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఇప్పుడు ఈ సమస్య నుండి బయటపడటానికి చాలా మంది చాలా రకాల ట్రీట్‌మెంట్లు పాటిస్తుంటారు.

మార్కెట్‌లో దొరికే వివిధ రకాలైన రసాయనాలతో కూడి హెయిర్‌ డైలు వాడుతుంటారు. కొందరు తెల్లజుట్టును నల్లగా మార్చుకోవటానికి వంటింటి చిట్కాలను కూడా పాటిస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇప్పుడు చాలా మంది తెల్ల జుట్టు, జుట్టు రాలిపోయే సమస్యను పరిష్కరించేందుకు గానూ సతమతమవుతున్నారు. అందుకోసం వేల వేలు డబ్బు ఖర్చు చేస్తున్నారు కూడా. అయితే మీరు జుట్టు సమస్యలకు ఉసిరికాయ, షికాకాయ్ పొడిని ఉపయోగించవచ్చు. ఇది మీ గ్రే హెయిర్ ని సహజంగా నల్లగా మారుస్తుంది.

ఉసిరి..

ఉసిరి లేదా ఇండియన్ గూస్బెర్రీ మీ జుట్టు సమస్యలకు ఉత్తమమైన ఇంటి నివారణలలో ఒకటి. మీ హెయిర్‌ కేర్‌ రోటీన్‌లో ఉసిరిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీరు అందమైన, పొడవాటి, మెరిసే జుట్టును పొందగలుగుతారు. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్‌ ఇ, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండే ఉసిరి అకాల జుట్టు నెరుపును దూరం చేస్తుంది.

విధానం: నాలుగైదు ఉసిరికాయలను తీసుకుని వాటిని ముందుగా ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని మెత్తని పేస్ట్‌లా మిక్సి పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయ పేస్ట్‌ను మీ తలపై అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత మీ జుట్టును శుభ్రంగా వాష్‌ చేసుకోండి. ఇది జుట్టుకు చాలా రకాలుగా మేలు చేస్తుంది. దీన్ని అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. చుండ్రు నయం అవుతుంది. అంతే కాకుండా తెల్లజుట్టును నల్లగా మార్చేందుకు ఉసిరి పొడిని కూడా ఉపయోగించవచ్చు.

బ్లాక్ టీ..

బ్లాక్ టీ మీ జుట్టును నల్లగా చేసి చక్కని మెరుపును ఇస్తుంది. ఇది కూడా మీ జుట్టును మృదువుగా చేస్తుంది.

విధానం: ఒక కప్పు నీరు తీసుకుని మరిగించాలి. వేడినీటిలో రెండు టీస్పూన్ల టీ ఆకులను వేయాలి. ఇప్పుడు ద్రావణంలో ఒక టీస్పూన్ ఉప్పు కలపండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మీ జుట్టు అంతటా బాగా పట్టించాలి. ఈ ద్రావణాన్ని మీ జుట్టులో సుమారు 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై సాధారణ నీటితో మీ జుట్టును కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయండి. మీ జుట్టు సమస్యలు తీరిపోతాయ్‌. దీంతో మీ కేశాలు ఆరోగ్యంగా, అందమైన మెరిసే జుట్టును పొందుతారు.

మెంతిపొడి, ఉసిరి పొడి, నిమ్మరసం..

మెంతులు, ఉసిరి జుట్టు సమస్యలకు చక్కటి చికిత్సగా పని చేస్తుంది. ఈ రెండు కూడా మీ జుట్టును ఆరోగ్యంగా, బలంగా చేస్తుంది.

విధానం: రెండు టీస్పూన్ల ఉసిరి పొడి, రెండు టీస్పూన్ల మెంతిపొడి తీసుకోండి. ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నీరు, ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి కలపండి. బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేసి తలకు అప్లై చేయండి. దాదాపు 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మీరు షాంపూ ఉపయోగించాల్సిన అవసరం లేదు.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

Tea : పొద్దున్నే టీ బదులు దీని తాగండి.. 90 కి పైగా రోగాలును నయం చేస్తుంది..!

తరచూ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా.. నరాల బలహీనత ఇబ్బంది పెడుతుందా.. పని ఒత్తిడి వల్ల చిన్న వయసులోనే ఈ పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారా….
అయితే మీకోసమే ఒక చక్కని డ్రింక్ మీకు చెప్పబోతున్నాను..కీళ్ల నోప్పులు తగ్గడం మాత్రమే కాకుండా మీ బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది. అలాగే మీరు రోజంతా చాలా చురుగ్గా ఆరోగ్యంగా చలాకిగా ఉంటారు. మన ఇంట్లో దొరికే సింపుల్ ఇంగ్రిడియంట్స్ తో ఈ అద్భుతమైన డ్రింక్ తయారు చేసుకొని తాగితే హాస్పిటల్ కి వెళ్ళే పని లేకుండా అద్భుతంగా మోకాళ్ళ నొప్పులు నరాల బలహీనత చక్కగా తగ్గుతుంది. అంతేకాకుండా మీ బాడీలో ఉండే అన్ని రకాల సమస్యలకు ఈ ఒక్క డ్రింక్ చక్కని సమాధానం చెబుతుంది. మరి ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో వీటికి ఏమేం కావాలో ఈ డ్రింక్ మన శరీరంలో ఎలా పనిచేస్తుంది అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం అయితే ప్రస్తుతం విపరీతమైన పని ఒత్తిడి పెరిగి సరైన ఆహారం తీసుకోక సక్రమమైన జీవనశైలి విధానం లేక వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా అనేకమంది అనారోగ్య సమస్యల బారిన పడుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు.
మరి డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. ముందుగా హాఫ్ టీ స్పూన్ ధనియాలు తీసుకొని ఒక బౌల్ లో వేసుకోండి. ధనియాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ప్రకృతి పరంగా లభించిన ధనియాలు అనేక వైద్య పరమైన లక్షణాలు కలిగి ఉండడం వల్ల సహజ రూపంలో మనం తీసుకోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిని తప్పించవచ్చని అనేక పరిశోధనలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం తీసుకునే ఇంగ్రిడియంట్స్ జీలకర్ర ఇది కూడా ఒక హాఫ్ తీసుకొని డ్రై రోస్ట్ చేసి ఈ బౌల్ లో వేసుకోండి. జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఆహారం చేరడం కాకపోయినా కాస్త జీలకర్ర అలా వేసుకుంటే కూడా చక్కగా అరిగిపోతుంది ఆహారం జీలకర్రతో తలనొప్పి నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. అలాగే వాము.

వాములో ఉండే క్యాల్షియం పొటాషియం ఐరన్ గుండెజబ్బులు రాకుండా రక్షిస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజు ఉదయం ఏమి తినకుండా వామునీటిని తాగితే అధిక బరువు సమస్య తగ్గుతుంది. ఇప్పుడు ఈ మూడింటిని కూడా ఒక బౌల్ లో వేసుకున్నారు కదా.. ఇందులో ఇప్పుడు ఒక గ్లాసున్నర వరకు నీళ్లు వేసి మూత పెట్టి రాత్రంతా ఉంచిన ఈ వాటర్ ని ఉదయాన్నే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి స్టవ్ వెలిగించి బాగా మరిగించండి. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకొని పరగడుపున ఏమి తినకముందే ఈ వాటర్ ని చక్కగా టీ తాగుతున్నట్లుగా తాగండి. మీ బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది. మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి. మీ నరాలు చాలా ఉత్తేజంగా అవుతాయి. అలాగే పొట్ట కూడా చక్కగా శుభ్రమైపోతుంది…

Health

సినిమా