LIC Policy: రూ.151 డిపాజిట్‌తో మీ చేతికి రూ.31 లక్షలు.. మీ బిడ్డ పెళ్లి కోసం ఎల్‌ఐసీ నుంచి సూపర్‌ పాలసీ

మీ ఇంట్లో మీకు కూతురు ఉండి, ఆమె పెళ్లి గురించి ఆందోళన చెందుతుంటే ఈ వార్త మీకోసమే. రోజూ కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా మీ కుమార్తె పెళ్లి నాటికి లక్షల రూపాయలు పోగుచేయవచ్చు.
మీరు ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీని సద్వినియోగం చేసుకోవడం ద్వారా కూతురి కోసం డబ్బు ఆదా చేసుకోవచ్చు. దీని కాల పరిమితి 13 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. LIC కన్యాదాన్ పాలసీని కూతురు పుట్టిన ఒకటి నుండి రెండు సంవత్సరాలలోపు ప్రారంభించడం వలన భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి. మీ బిడ్డ పెరిగి పెద్దదైన తర్వాత, చదువు, వివాహం కోసం ఈ డబ్బు మీకు ఎల్‌ఐసీ ద్వారా అందించడం జరిగింది. ముఖ్యంగా ఎల్‌ఐసి ముఖ్యంగా కుమార్తెల పెళ్లి కోసం ఎల్‌ఐసి కన్యాదాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. మీ కూతురు కోసం ఈ పథకాన్ని తీసకున్నట్లయితే ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

రూ.151 డిపాజిట్ చేయడం ద్వారా రూ.31 లక్షలు:

మీరు ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ తీసుకోవాలనుకుంటే మీకు కనీసం 30 ఏళ్లు ఉండాలి. మీ బిడ్డకు కనీసం 1 సంవత్సరం వయస్సు ఉండాలి. ఈ ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ 25 సంవత్సరాలు అయినప్పటికీ, మీరు 22 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి. మిగిలిన 3 సంవత్సరాలు మీరు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.

Related News

కూతురి వయస్సును బట్టి ఈ పాలసీ కాలపరిమితిని తగ్గించుకోవచ్చని గమనించాలి. మీరు భవిష్యత్తులో మీ కుమార్తెకు 18 సంవత్సరాల వయస్సులో వివాహం చేయాలనుకుంటున్నట్లయితే LIC కన్యాదాన్ పాలసీ నిబంధనల ప్రకారం.. అమ్మాయికి కనీస వయస్సు ఉండటం చాలా ముఖ్యం. అంటే మీ బిడ్డకు కనీసం 18 ఏళ్లు ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఈ పాలసీని 17 ఏళ్లపాటు తీసుకోవచ్చు. ఈ పాలసీని తీసుకునే ముందు మీరు మీ సౌలభ్యం ప్రకారం సమయ పరిమితిని సర్దుబాటు చేసుకోవచ్చు.

LIC కన్యాదాన్ పాలసీని పొందేందుకు అవసరమైన పత్రాలు

కుమార్తె జనన ధృవీకరణ పత్రం
తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, పాన్ కార్డ్
పాస్‌పోర్ట్ సైజు ఫోటో
బ్యాంక్ పాస్ బుక్
LIC కన్యాదాన్ పాలసీని ఎలా తీసుకోవాలి?

ఎల్‌ఐసీ ద్వారా కన్యాదాన్ పాలసీని పొందడానికి మీరు మీ సమీపంలోని ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లి డెవలప్‌మెంట్ అధికారిని సంప్రదించవచ్చు. దీనితో పాటు, మీరు మీ స్థానిక ఎల్‌ఐసీ ఏజెంట్‌ను కూడా సంప్రదించవచ్చు.

31 లక్షల రూపాయలు ఎలా పొందాలి?

కన్యాదాన్ పాలసీలో మీరు రోజుకు రూ.151 చెల్లించాలి అంటే నెలకు రూ.4530 డిపాజిట్‌ చేయాలి. 22 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీని తర్వాత మీరు 25 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత రూ.31 లక్షలు పొందుతారు. మీరు ఈ మొత్తాన్ని మీ కుమార్తె తదుపరి చదువుల కోసం లేదా ఆమె వివాహం కోసం ఉపయోగించవచ్చు. ఇది కాకుండా కన్యాదాన్ పాలసీలో రోజుకు రూ.121 డిపాజిట్ చేస్తే అప్పుడు మీకు 27 లక్షల రూపాయలు వస్తాయి. అంతేకాకుండా ఎల్‌ఐసి కన్యాదాన్ పాలసీకి బీమా ప్లాన్ కూడా ఉంది. పాలసీదారుడు ఆకస్మికంగా మరణిస్తే కుటుంబం ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా బీమా చేసినవారి తండ్రి ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలను అందుకోవచ్చు.

Related News