LIC Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. ఈ కంపెనీ ప్రతి ఒక్కరి కోసం అద్భుత మైన పాలసీలను రూపొందిస్తుంది.
ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికోసం తక్కువ మొత్తంలో ఎక్కువ ఆదాయం వచ్చే పాలసీలను ప్రవేశపెట్టి చాలా కుటుంబాలను ఆదుకుంటోంది. వారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తుంది. ఈ రోజుల్లో ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారి పెళ్లి గురించి నిత్యం తల్లిదండ్రులు ఆలోచిస్తూనే ఉంటారు. పెరిగిన ధరల వల్ల అమ్మాయి పెళ్లి ఏ విధంగా చేయాలని దిగులు చెందుతుంటారు. ఇలాంటి వారికోసం ఎల్‌ఐసీ ఒక సూపర్ ప్లాన్ ప్రవేశపెట్టింది. దానిపేరు ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ . ఇందులో నెలకు కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయడం వల్ల ఆమె పెళ్లి నాటికి లక్షల రూపాయలు పోగుచేయవచ్చు. ఈ పాలసీ గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ తీసుకోవాలంటే మీరు కనీసం 30 ఏళ్లు ఉండాలి. మీ బిడ్డకు కనీసం 1 సంవత్సరం వయస్సు ఉండాలి. ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ 25 సంవత్సరాలు అయినప్పటికీ మీరు 22 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 3 ఏళ్లు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. కూతురి వయస్సును బట్టి పాలసీ కాలపరిమితిని తగ్గించుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవడానికి
కుమార్తె జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, బ్యాంక్ పాస్ బుక్ ఉండాలి. ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీని తీసుకోవడానికి మీరు సమీపంలోని ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లి డెవలప్‌మెంట్ అధికారిని సంప్రదించవచ్చు. లేదంటే ఎల్‌ఐసీ ఏజెంట్‌ను సంప్రదించవచ్చు.
Related News
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సేవింగ్ స్కీమ్‌లు భద్రత, రాబడి రెండింటి పరంగా బాగా ప్రాచుర్యం పొందాయి. ఇందులో, పిల్లలు, వృద్ధులు, మహిళలకు వయస్సు ఆధారంగా పాలసీలు అందుబ...
Continue reading
LIC Public Notice: ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) బుధవారం పబ్లిక్ నోటీసు జారీ చేసింది. దేశ ప్రజలకు తీవ్ర హెచ్చరికల...
Continue reading
మీరు నెలవారీ పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే మంచి రాబడి అందించే పాలసీలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఎల్‌ఐసీ మీ కోసం ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉంది.
ఇది మంచి రాబడిని కూడా అందిస్తు...
Continue reading
మీ ఇంట్లో మీకు కూతురు ఉండి, ఆమె పెళ్లి గురించి ఆందోళన చెందుతుంటే ఈ వార్త మీకోసమే. రోజూ కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా మీ కుమార్తె పెళ్లి నాటికి లక్షల రూపాయలు పోగుచేయవచ్చు.
మ...
Continue reading
ఆర్థిక సమస్యల వల్ల చాలామంది బ్యాంకులలో, లోన్ ఆప్స్, ఫైనాన్షియల్ సంస్థలలో రుణాలు తీసుకుంటూ ఉంటారు. అయితే లోన్ ఆప్స్ లో అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఉంటారు.
ఫైనాన్షియల్ సంస్థలలో ఏదైనా త...
Continue reading
LIC పథకాలలో డబ్బును పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? ప్రత్యేకంగా మహిళల కోసం LIC అద్దిరిపోయే స్కీమ్స్ అందిస్తోంది. అందులో ఆధార్ శిలా స్కీమ్ మంచి బెనిఫెట్స్ అందిస్తోంది.
ఈ పథకంలో...
Continue reading
LIC Loan Against LIC Policy: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) అంటే ప్రజల్లో ఒక భరోసా. ఎల్‌ఐసీ పథకాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రజలు పెద్దగా సం...
Continue reading
LIC Kanyadan Policy: 'ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ'.. ఆడపిల్లలకు సంబంధించి ప్రముఖ బీమా సంస్థ ఎల్‌ఐసీ ప్రవేశపెట్టిన అద్భుతమైన పాలసీల్లో ఇదీ ఒకటి.
పేరులో ఉన్నట్లుగానే ఆడపిల్ల వివాహాన్ని ...
Continue reading
డబ్బును సేవ్ చేసుకోవడం అనేది కొందరికి మాత్రం ఉండే అలవాటు. అందరూ సేవ్ చేసుకుందాం అనుకుంటారు.. కానీ చేయలేరు. రిస్క్ లేకుండా పెట్టుబడితే మంచి ఫలితాలను పొందవచ్చు.
పోస్ట్ ఆఫీస్, ఎ...
Continue reading
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. జీవన్ ధార 2 పేరుతో యాన్యుటీ ప్లాన్‌ను లాంఛ్ చేసింది. జనవరి 22, 2024 నుంచి ఈ స్కీమ్ అందుబాటులోకి ...
Continue reading
రూ.150 పొదుపుతో రూ.31 లక్షలు
కన్యాదాన్ పాలసీలో రోజుకు రూ.151 చెల్లించాలి అంటే నెలకు రూ.4530 పొదుపు చేయాలి. 22 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత 25 ఏళ్లు పూర్తయిన తర్వాత రూ.31 లక్షలు పొందుతారు. ఈ మొత్తాన్ని కుమార్తె తదుపరి చదువుల కోసం లేదా ఆమె పెళ్లికోసం ఉపయోగించవచ్చు. ఇది కాకుండా కన్యాదాన్ పాలసీలో రోజుకు రూ.121 డిపాజిట్ చేస్తే అప్పుడు 27 లక్షల రూపాయలు వస్తాయి. ఈ పాలసీకి బీమా కూడా వర్తిస్తుంది. పాలసీదారుడు ఆకస్మికంగా మరణిస్తే కుటుంబం ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతే కాకుండా బీమా చేసినవారి తండ్రి ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు చెల్లిస్తారు.