Thursday, November 14, 2024

నేటి నుంచి ఏపీలో కులగణన

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కులగణన ప్రారంభం కానుంది. ప్రతి గ్రామంలో వాలంటీర్లు ఈ కులగణనను నిర్వహించనున్నారు. ఈరోజు నుంచి పది రోజుల పాటు కులగణన జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నెల 28వ తేదీ వరకూ కులగణన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గతలో ఆరు జిల్లాల పరిధిలో ఏడు సచివాలయల పరిధిలో ప్రయోగాత్మకంగా కులగణనను చేపట్టారు.

పది రోజుల పాటు…

ఈరోజు నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కులగణన జరుగుతుంది. ఆన్ లైన్ లోనే కులగణన వివరాలను నమోదు చేయనున్నారు. ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు వివరాలు సేకరించనున్నారు. ఇంటి వద్ద అందుబాటులో లేని వారు ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకూ సచివాలయాల్లో నమోదు చేయించుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ ను రూపొందించి అందులో నమోదు చేస్తున్నారు.

pooja: శ్రీవారిని ఏడు శనివారాలు ఇలా పూజిస్తే..

శ్రీపాదాలు ( venkateswara swami) కొలిస్తే ఐశ్వర్యప్రాప్తి జరుగుతుందనేది పురాణాల మాట. అందుకే శ్రీవారిని పూజ చేస్తే ఇంట్లో ధనానికి లోటు ఉండదు.
ఏం చేస్తే ధనానికి లోటు ఉండదో ..తెలుసుకుందాం.

శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు ముగించి, పూజగదిని ( pooja) శుభ్రం చేసి వేంకటేశ్వర స్వామిని ( venkateswara swami) అలంకరించాలి. పూజ ప్రారంభించి సంకల్పం చెప్పుకోవాలి. బియ్యపుపిండి, పాలు, బెల్లం, అరటి పండు కలిపి దాంతో ప్రమిదను తయారు చేయాలి. ఇందులో ఏడు వత్తులు వేసి ఆవు నేతితో దీపం వెలిగించాలి. స్వామి వారికి కర్పూరం కలిపిన లడ్డు ఇష్టం . అది కుదిరినంత వరకు మీరే చేసి స్వామికి నైవేధ్యం ఇవ్వండి. స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజున వైష్ణవులు శ్రీహరిని నియమనిష్టలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి వేకువజామునే స్నానం చేసి తులసి( tulasi) కోట ముందు ఆవునేతితో గాని, నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించినవారికి అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి. స్వామి మీద నమ్మకం ఉంచండి.
శనివారం( satuarday) సాయంత్రం వేంకటేశ్వర( venkateswara swami) ఆలయంలో ఆవు నేయితో( ghee diya) దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా ఏడు శనివారాలు స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి చేపట్టిన పనులన్నీ నిరాటంకంగా సాగుతాయి. ఈ దీపం వల్ల ఇళ్లు, పెళ్లి అన్ని జరుగుతాయి.

Vastu Tips: చీపురు విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? వెంటనే అలర్ట్ అవ్వండి..

భారతీయులు వాస్తును ఎంతలా విశ్వసిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా ఇంట్లో ఉండే వస్తువుల విషయంలోనూ పాటిస్తుంటారు.
టీవీ, ఫ్రిడ్జ్‌, బీరువా ఇలా ప్రతీ వస్తువును ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలన్న అంశాలను వాస్తు శాస్త్రంలో స్పష్టంగా ప్రస్తావించారు. అయితే చివరికి చీపురు కూడా ఏ దిశలో ఉంచాలన్న విషయాన్ని కూడా వాస్తు శాస్త్రంలో తెలిపారు. ఇంతకీ చీపురు విషయంలో ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో ఉండే నత్యవసర వస్తువుల్లో చీపురు కూడా ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చీపురు లేకపోతే ఇంట్లో పని ముందుకు సాగదు. అలాంటి చీపురుకు సంబంధించి వాస్తు నియమాలు కూడా పాటించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. చీపురుని లక్ష్మీ దేవీగా భావిస్తుంటారు. అందుకే చీపురును ఎలా పడితే అలా ఉపయోగించకూడదని ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేయకూడదని చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. చీపురును ఇంట్లో సరైన దిశలోనే ఉంచాలని వాస్తు నిపుణులు చెబుతుంటారు.
ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చీపురుని ఎక్కడపడితే అక్కడ పడేయకుండా కేవలం పశ్చిమదిశలో మాత్రమే ఉంచాలని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే చీపురుని పెట్టడానికి నైరుతి దిశ కూడా అనువైనదిగా పండితులు చెబుతున్నారు. ఈ దిశలో కాకుండా మరే దిశలో ఉంచినా ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుందిన హెచ్చరిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం చీపురు ఎవరికీ కనిపించకుండా పెట్టాలి. ముఖ్యంగా బయటి వ్యక్తులకు ఇంట్లో ఉపయోగించే చీపురు కనిపించకూడదని చెబుతున్నారు.

Best Tea : పరిగడుపున ఈ టీ తాగితే ఎసిడిటీ, తలనొప్పి, బిపి, కొలెస్ట్రాల్ ఏమీ దరి చేరవు..!

Best Tea : మనలో చాలామందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిని తగ్గించుకోవడానికి.. తలనొప్పి నుంచి ఉపసమనం పొందడానికి ,పనివత్తిడి తగ్గించుకోవడానికి చాలా మంది టీ తాగుతూ ఉంటారు.
అయితే మామూలుగా మనం చక్కెరతో తయారు చేస్తూ ఉంటాం.. చెక్కర టీ తాగడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు.ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మనం చక్కటి ఈ విధంగా తాగొచ్చు.. అది బెల్లం టీ.మనకు మానసిక ఆనందాన్ని ఇచ్చే ఈ టి బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. బెల్లం టీం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు.

పాలు విరగకుండా రుచిగా ఈ బెల్లం టీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. తయారీకి కావలసిన పదార్థాలు బెల్లం తురుము నాలుగు టీ స్పూన్లు, కచ్చాపచ్చాగా దంచిన అల్లం ముక్కలు కొద్దిగా, కచ్చాపచ్చా దంచిన యలుకులు నాలుగు కావాలి. పాలు రెండు గ్లాసులు, నీళ్లు రెండు గ్లాసులు టీ పౌడర్ మూడు టీ స్పూన్లు.. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసి వేడి చేయాలి.ఇందులోనే టీ పౌడర్, బెల్లం తురుము యాలకులు, అల్లం ముక్కలు వేసి బాగా మరిగించాలి. డికాషన్ మరిగిన తర్వాత అందులో పాలను పోసి మరికొద్దిసేపు మరిగించాలి. తర్వాత ఈటీ ను వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లంటి తయారవుతుంది.

ఇది చాలా రుచిగా ఉంటుంది.రుచి తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బెల్లం టీం తాగడం వల్ల రక్తహీనత సమస్య దూరం అవుతుంది. ఉదయం పూట తాగడం వల్ల మలబద్దక సమస్య నివారించబడుతుంది. రక్తపోటుతో బాధపడేవారు బెల్లం టీం తాగడం వల్ల చక్కటి ఫలితాలు పొందవచ్చు.. ఇందులో అల్లం, మిరియాలు వేసి తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు బారిన పడకుండా ఉంటారు. షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా ఈ టీ ను నిర్భయంగా తాగవచ్చు. ఈ విధంగా బెల్లం టీం తయారు చేసుకొని తాగడం వల్ల రుచి తో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు..

Vastu Tips : వాస్తు టిప్స్ : ఇంట్లో ఈ బొమ్మ పెడితే.. పట్టిందల్లా బంగారమే అవుతుంది.. సంతోషంగా ఉంటారు..

Vastu Tips : జీవితంలో ఏ పని చేసినా సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరూ పరితపిస్తుంటారు. కానీ కొందరు ఎంత ప్రయత్నించినా.. అనేక అడ్డంకులు వస్తాయి. ఈ అడ్డంకులు రావడానికి కారణమేంటి?
అనేది తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అయితే అంతకంటే ముందుగానే సమస్య పరిష్కారం కోసం కొన్ని పనులు చేయాలి. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నంతసేపు ఏ పని చేసినా సాధ్యం కాదు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వస్తాయి. ఎప్పడూ ఎదో ఒక సమస్యతో ఆందోళనతో ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ బొమ్మను ఉంచితే అనుకున్న పనులు చేయగలుగుతారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఇంతకీ ఆ బొమ్మ ఏదంటే?

సర్వ జగత్తుకు వెలుగునిచ్చేది సూర్యుడు. సూర్యదేవుడు లేకపోతే జీవన మనుగడ సాధ్యం కాదు. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో సూర్యుడిని ప్రత్యేకంగా కొలుస్తారు. ఒక ఇల్లు సంతోషంగా ఉండాలంటే సూర్యుడి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు తూర్పు వైపు ఉండి.. ఉదయం సూర్యుడి కిరణాలు ఇంట్లో పడినట్లయితే అప్పుడు ఇంట్లో ఏడు గుర్రాల బొమ్మను ఉంచాలి. సూర్యుడి వాహనమైన ఈ బొమ్మను ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆ ఇంట్లో వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది.

వెలుగుతో పాటు వేడిని అందించే శక్తి సూర్యుడికి మాత్రమే ఉంది. రాగితో కూడిన సూర్యుడి ప్రతిమను తూర్పు వైపు కనిపించేలా ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో వ్యక్తుల మధ్య సంబంధాలు బాగుంటాయి. ఒకరికొకరు గౌరవం ఇస్తూ ఆనందంగా ఉంటారు. కొందరి ఇళ్లల్లో పిల్లలు ఎప్పుడూ అనారోగ్యంతో ఉంటారు. ఎన్ని మందులు వాడినా నయం కాని వారు ఉంటారు. అయితే వారి గదిలో సూర్యుడి విగ్రహం ఉంచడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇంట్లో గృహిణి ఆనందంగా ఉంటేనే ఇల్లు సంతోషంగా ఉంటుంది. గృహిణి ఎక్కువ సేపు వంటగదిలో ఉంటుంది. అందువల్ల వంటగదిలో కూడా రాగితో ఉన్న సూర్యుడి ప్రతిమ ఉంచడం వల్ల ఇంట్లో వాళ్లంతా ఆరోగ్యంగా ఉంటారు. వారికి అకారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. దేవుడి గదిలో కూడా రాగితో కూడిని సూర్యుడి ప్రతిమను ఉంచవచ్చు. అయితే సూర్యోదయం సమయంలో తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడం వల్ల అంతా మంచే జరుగుతుంది.

Wash Clothes: రాత్రిపూట దుస్తులు ఉతకకూడదా.. ఉతికితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని కొన్ని సమయాలలో కొన్ని పనులు చేయడం నిషిద్ధం. వాటి వల్ల ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి వాటిలో రాత్రిపూట దుస్తులు ఉతకకూడదు అన్న నియమం కూడా ఒకటి.
మరి రాత్రిపూట నిజంగానే బట్టలు ఉతకకూడదా? ఒకవేళ ఉతికితే ఏం జరుగుతుందో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట దుస్తులు ఉతకకూడదు లేదా ఆరబెట్టకూడదు. అలా చేయడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి రాత్రిపూట దుస్తులు ఉతికితే భవిష్యత్తులో చెడు ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

కాబట్టి రాత్రిపూట బట్టలు ఉతకడం ఆరేయడం లాంటివి అస్సలు చేయకండి. వాస్తు ప్రకారం, రాత్రిపూట దుస్తులు ఉతకడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది. అలాగే తడి దుస్తులు రాత్రిపూట బయట ఆరబెట్టకూడదు. అలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అడుగుపెడుతుందట. అంతేకాదు, మరుసటి రోజు ఉదయం ఈ బట్టలు ధరించడం ఒక వ్యక్తి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే, చేయాలి అనుకున్న ప్రతి పనికీ అంతరాయం కలిగే అవకాశం ఉంటుందట. రాత్రిపూట దుస్తులు ఉతకడం వల్ల మనస్సు చంచలంగా మారుతుంది. అంతేకాకుండా, ఒక వ్యక్తి అన్ని సమయాలలో ఒత్తిడికి గురవుతాడు.

కాబట్టి రాత్రిపూట దుస్తులు ఉతకడం తప్పు. కొన్ని కారణాల వల్ల మీరు రాత్రిపూట దుస్తులు ఉతకవలసి వస్తే, వాటిని బహిరంగ ప్రదేశంలో అంటే ఆకాశం కింద ఆరబెట్టవద్దు. ఇంటి లోపల ఆరపెట్టుకోవచ్చు. బహిరంగ ప్రదేశంలో ఆరబెట్టడం వల్ల వాటిపై సూక్ష్మక్రిములు వచ్చి చేరుతాయి. లేదా పక్షి మలమూత్రాలు దానిపై పడే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా సమస్య అవుతుంది.

Jobs: ఇండియన్ ఆయిల్‌లో జాబ్స్.. ఇంటర్ ఉంటే చాలు.. ఆకర్షనీయమైన శాలరీ

భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (IOCL) మరో జాబ్ నోటిఫికేషన్ జారీ చేసింది. పైప్‌లైన్స్ డివిజన్ పరిధిలోని 5 రీజియన్‌లలో 473 టెక్నికల్/ నాన్-టెక్నికల్ ట్రేడుల్లో అప్రెంటిస్‌ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

మరి ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్, అర్హత, లాస్ట్ డేట్ తదితర వివరాలు చూద్దామా..

మొత్తం 473 ఖాళీలు ఉండగా.. మెకానికల్, ఎలక్ట్రికల్, టీ అండ్‌ ఐ, హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్/ ఫైనాన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి. 12వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఆన్ లైన్ విధానంలో చేసుకోవాలి.

ఈ పోస్టులకు అప్లై చేసే వారి వయసు 12.01.2024 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఫిబ్రవరి 1, 2024గా నిర్ణయించారు. అప్లై చేసుకున్న వారికి ముందుగా రాత పరీక్ష నిర్వహించి.. అందులో సెలెక్ట్ అయిన వారికి ఆ తర్వాత వైద్య పరీక్ష చేస్తారు. ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. వీటన్నింటి తర్వాత చివరకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను అప్రెంటిస్‌ గా తీసుకుంటారు.
ఆన్ లైన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 18వ తేదీన రాత పరీక్ష ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలకు https://iocl.com/ వెబ్‌సైట్‌ సందర్శించండి.

????Job Alerts : వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరగలరు……

Jaggery Chapati: బెల్లం చపాతీల గురించి తెలుసా? ముఖ్యంగా చలికాలంలోనే వీటిని ఎందుకు తింటారంటే..!

చలికాలంలో శరీరం వెచ్చగా ఉండటం ఎంతో ముఖ్యం. బయటి వాతావరణానికి తగినట్టు శరీరం ఉష్ణాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే దానికి తగినట్టే ఆహారం తీసుకోవాలి.

చాలా ప్రాంతాలలో చలికాలంలో బెల్లం చపాతీలు తయారు చేసుకుని తింటారు. ఇవి తినడం వల్ల రుచి మొగ్గలు సంతృప్తి చెందడమే కాకుండా శరీరానికి వెచ్చదనం లభిస్తుందని చెబుతారు. సాంప్రదాయ ఆహారమైన బెల్లం చపాతీలు ఎలా తయారు చెయ్యాలో.. బెల్లం చపాతీలు తింటే కలిగే లాభాలేంటో తెలుసుకుంటే..

బెల్లం చపాతీలు తయారుచేసే విధానం..

బెల్లం చపాతీలు తయారుచేయడం చాలా సులభం. దీనికి కావలసిన పదార్థాలు ఇవీ..

గోధుమపిండి
బెల్లం
నెయ్యి
నువ్వులు
వేడినీరు
ఉప్పు.

గోధుమ పిండిలో అన్ని పదార్థాలు వేసి సాధారణంగా చపాతీలు తయారు చెయ్యడానికి పిండిని ఎలా కలుపుతారో అలా కలపాలి. ఈ పిండిని మరీ ఎక్కువగా పిసికి కలపడదు. ఇలా కలిపిన పిండి మీద తడిబట్ట కప్పి 15నిమిషాలు పక్కన ఉంచుకోవాలి.

15నిమిషాల తరువాత చపాతీలలాగా ఒత్తుకుని పెనం మీద మీడియం మంటలో నూనె లేదా నెయ్యి వేసి కాల్చుకోవాలి. వేడి వేడిగా ఉన్న బెల్లం చపాతీలను నెయ్యి లేదా తేనెతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. లేకపోతే ఉట్టివే తినేయచ్చు.

బెల్లం చపాతీల ప్రయోజనాలు..

బెల్లం చపాతీలు సహజమైన తీపితో చాలా రుచికరంగా ఉంటాయి. తీపి తినాలనేవారికి ఇవి తృప్తిని ఇస్తాయి. పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ తో పాటు ముఖ్యమైన ఖనిజాలన్నీ లభిస్తాయి. బెల్లంలో చక్కెరలు శరీరాన్ని తక్షణ శక్తని ఇస్తాయి.

బెల్లం చపాతీలు నెయ్యితో తయారుచేసి తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. నెయ్యి రుచిని పెంటడమే కాకుండా ఉష్ణోగ్రతను బ్యాలెన్డ్ గా ఉంచుతుంది. ఇందులో ఉపయోగించే నువ్వులు కూడా దీనికి దోహదం చేస్తాయి.

గోధుమపిండిలో ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఎక్కువసేపు ఆకలిని నియంత్రిస్తుంది. విటమిన్-బి, ఐరన్ వంటి పోషకాలను అందిస్తుంది.
బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. చలికాలపు సీజనల్ సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడతాయి.

Banking Rights: ప్రతి ఖాతాదారుడు బ్యాంకులో ఈ హక్కులు పొందుతాడు.. అవసరమైతే ఫిర్యాదు చేయవచ్చు..!

Banking Rights: దేశంలోని ప్రతి వ్యక్తికి బ్యాంకులో అకౌంట్‌ ఉంటుంది. ఆర్థిక కార్యకలాపాల కోసం ఈ అకౌంట్‌ను ఉపయోగిస్తాడు. బ్యాంకుకు సంబంధించిన అన్నిరూల్స్ ప్రతి ఖాతాదారుడు పాటిస్తాడు.
అంతేకాదు బ్యాంకుకు వెళ్లినప్పుడు అక్కడ బ్యాంకు నియమ నిబంధనల గురించి సూచించే బోర్డులు కూడాపెడుతారు. కానీ చాలామంది ఖాతాదారులకు తమకు బ్యాంకులో లభించే హక్కుల గురించి తెలియదు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి ఖాతాదారుడికి బ్యాంకులో చాలా రకాల హక్కులు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

బ్యాంకు నిబంధనలు

వాస్తవానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల కోసం కొన్ని నియమాలు సెట్ చేసింది. ఇందులో బ్యాంకుకు వచ్చే ఖాతాదారులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలో తెలియజేశారు. బ్యాంకు ఉద్యోగి ఎవరైనా అనవసరంగా వేధిస్తే ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మీకు సరైన పత్రాలు, భారతీయ పౌరసత్వం ఉంటే ఏ బ్యాంకులో అయినా సులభంగా ఖాతా తెరవవచ్చు. అధికారులు ఒప్పుకోపోతే మీరు ఫిర్యాదు చేయవచ్చు.
1. BSBDలోని మొత్తం అంటే బేసిక్ ఖాతా జీరోగా మారినట్లయితే బ్యాంక్ మీ ఖాతాను క్లోజ్‌ చేయకూడదు.

2. మీరు మీ బ్యాంక్ ఖాతాను తిరిగి ఓపెన్‌ చేసినట్లయితే బ్యాంక్ మీకు ఎలాంటి అదనపు రుసుము విధించదు.

3. చిరిగిన లేదా పాత నోటును ఎవరైనా మీకు ఇచ్చినట్లయితే మీరు బ్యాంకుకు వెళ్లి మార్చుకోవచ్చు. దానిని మార్చడానికి బ్యాంకు నిరాకరించకూడదు.

4. బ్యాంకులు వృద్ధులు, వికలాంగులకు అన్ని రకాల లావాదేవీల సౌకర్యాలను సింగిల్ విండోలో అందించాలి.
5. చెక్కుల సేకరణకు నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం తీసుకుంటే బ్యాంకు ఖాతాదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

6. బ్యాంకు నుంచి రుణం తీసుకునేటప్పుడు ఎవరైనా సెక్యూరిటీ ఇచ్చినట్లయితే ఆ రుణాన్ని తిరిగి చెల్లించిన 15 రోజులలోపు అతడి సెక్యూరిటీని తిరిగి అందించాలి.
7. టర్మ్ డిపాజిట్‌ను ముందస్తుగా విత్‌ డ్రా చేసుకోవడానికి బ్యాంక్ ఎవరినీ తిరస్కరించకూడదు. టర్మ్‌ పూర్తయ్యేలోపు ఎప్పుడైనా విత్‌ డ్రా చేసుకోవచ్చు.

8. బ్యాంక్ మీకు ఇచ్చిన కార్డు మీ అనుమతి లేకుండా యాక్టివేట్ అయి దాని నుంచి డబ్బులు డ్రా చేస్తే మీకు రెట్టింపు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

Dandruff and Head Lice: ఈ నూనె తలకు పట్టించి తలస్నానం చేశారంటే.. చుండ్రు, పేలు పరార్!

చలికాలం వచ్చిందంటే డల్ స్కిన్, చర్మం పొడిబారడం, కరుకుదనం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో వాతావరణంలో తేమ స్థాయి తక్కువగా ఉంటుంది. కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది.
ఇది సమస్యలను కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ కాలంలో చుండ్రు సమస్య కూడా తలెత్తుతుంది. తలలోని చర్మం పొడిగా మారి ఏడాది పొడవునా చుండ్రు సమస్య తలెత్తుతుంది. చుండ్రు వల్ల తల దురద పెట్టి, జుట్టు రాలడం ప్రారంభమవుతుంది.

చలికాలంలో ప్రతిరోజూ షాంపూ చేయడం సాధ్యం కాదు. దీంతో తలపై ఎక్కువగా నూనె, మురికి పేరుకుపోతుంది. జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలంటే వారానికి కనీసం రెండుసార్లు షాంపూ చేయాలి. ఇలా మూడు వారాలు చేస్తే సమస్య చాలా వరకు తొలగిపోతుంది.

ఇంట్లో తయారు చేసుకునే ఈ నూనె చుండ్రు సమస్యను పారదోలుతుంది. వేప ఆకులను ఎండలో ఉంచి బాగా ఎండబెట్టాలి. తర్వాత ఈ ఆకులను బాగా కడిగి, వడకట్టి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక కడాయిని గ్యాస్ మీద ఉంచి, చెంచా మెంతులు, ఒక చెంచా నల్ల జీలకర్ర వేసి, అందులో 150 గ్రాముల కొబ్బరినూనె వేసుకోవాలి. అందులో 50 గ్రాముల ఆవాల నూనె వేసుకోవాలి.

ఈ నూనెను తక్కువ మంటపై 15 నిమిషాలు కాగనివ్వాలి. అందులో వేప ముద్ద కూడా వేయాలి. ఈ నూనె కాగిన తర్వాత నల్లగా మారుతుంది. నల్లగా మారినతర్వాత గ్యాస్‌ను ఆపువేసి, మూతపెట్టి పక్కన ఉంచుకోవాలి.
పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలో తెల్లటి కాటన్ క్లాత్‌లో వడకట్టాలి. అంతే వేపనూనె రెడీ అయినట్లే. ఈ నూనె స్నానానికి రెండు గంటల ముందు రాసుకోవాలి. ఆ తర్వాత షాంపూ చేసుకుంటే చుండ్రుతో పాటు పేల సమస్య కూడా తొలగిపోతుంది.

Viral – Ireland Fan Wrote a Letter To Pawan: పవన్‌కు లెటర్ రాసిన ఐర్లాండ్ ఓడ కళాసి- కన్నీళ్లు పెట్టుకున్న జనసేనాని

Ireland Fan Letter To Pawan: జనసేన(Janasena) అధినేత పవన్కళ్యాణ్(Pawan Kalyan) తన సొంత పార్టీ విషయంలో ఎంతగా ఆలోచిస్తున్నారో అంతకంటే ఎక్కువగా ఆయన అభిమాను అంచనాలు పెట్టుకున్నారు.
పార్టీని వారు ఆదరించడమే కాదు.. ఎనలేని అభిమానం సైతం పెంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కూడా తపిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడెక్కడి నుంచో జనసేన అభిమానులు స్పందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచ దేశాల్లో ఉన్న పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పార్టీ నిలదొక్కుకోవాలని.. పవన్ కళ్యాణ్పుంజుకోవాలని ఆశిస్తున్నారు.

తాజాగా ఐర్లాండ్(Irland)లో గత 17 ఏళ్లుగా ఉంటున్న ఓ అభిమాని.. స్వయంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు లేఖ రాశారు. పార్టీని బలోపేతం చేయాలని.. 2014లో ఏర్పాటు చేసుకున్న పార్టీ 2019లో బలోపేతం అయిందని.. 2024లో బలంగా కలబడాలని ఆ అభిమాని పిలుపునిచ్చారు. తనను తాను.. `ఓడ కళాసీ`గా పరిచయం చేసుకున్న అభిమాని తన స్వదస్తూరి(Hand writing)తో ఈ లేఖను రాసి పవన్ కళ్యాణ్కు పంపించారు. యుద్ధ
సన్నద్ధతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆ అభిమాని పేర్కొన్నారు.

లేఖ సారాంశం ఇదీ..

అన్నా..
కష్టాలు, కన్నీళ్లు, రుణాలు దారుణాలు… కారణాలుగా చూపిస్తూ.. నా దేశాన్ని వదిలి విదేశాల్లో అవమానాల్లో ఆనందాలను వెతుక్కునే నాలాంటి వాళ్లెందరికో.. ఒక్కటే నీమీద ఆశ! ఎక్కడో బలీవియా అడవుల్లో(Baliviya Forest) అంతమై పోయిందని అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని ఒకటి కనిపెట్టకపోతావా?

సరికొత్త గెరిల్లా వార్ ఫైర్(Gerilla war Fire)ని మొదలెట్టకపోతావా? మన దేశాన్ని.. కనీసం మన రాష్ట్రాన్నయినా.. మార్చక పోతావా?

17 ఏళ్లుగా ఈ దేశం(Country)లో లేకపోయినా.. ఈ దేశంపై ప్రేమతో భారత పౌరసత్వాన్ని(Citizenship) వదులుకోలేక.. ఎదురు చూస్తున్న నాలాంటివాళ్లందరం.. మా కోసం నిలబడుతున్న నీకోసం బలపడతాం.

2014 – నిలబడ్డాం
2019 – బలపడ్డాం
2024 -బలంగా కలబడదాం!

కారుమీద ఎక్కేటప్పుడు జాగ్రత్త అన్నా.. కారు కూతలు కూసేవారిని పట్టించుకోకన్నా.. కారుమబ్బులు కమ్ముతున్నా… కార్యోన్ముఖుడివై వెళ్తున్న నీకు ఆ మహాశక్తి(Power full) అండగా ఉంటుందన్నా.. పవర్ స్టార్(Power Star)వి నువ్వే కదన్నా!! నువ్వు రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించే నాయకుడివి. – ఐర్లాండ్ నుంచి ఒక ఓడ కళాసి.

పవన్ ట్వీట్ ఇదీ!
“ఐర్లాండ్ దేశంలో ఓడ కళాసీగా పని చేస్తున్న నా జనసేన అభిమానీ నీ ఉత్తరం అందింది. చదివిన వెంటనే గొంతు దుఃఖంతో పూడిపోయింది. కన్నీరు) తెప్పించావు.. కార్యోన్ముఖుడిని చేశావు. – అని పవన్కళ్యాణ్ పేర్కొన్నారు.

అయితే.. ఇంత అభిమానాన్ని.. ఇంత మంది అభిమానులను సంపాయించుకున్న పవన్ కళ్యాణ్కు మరింత బాధ్యత పెరిగిందనే చెప్పాలి. కేవలం తన కళ్ల ముందు కనిపించే అభిమానులే కాకుండా.. తెరచాటున కూడా తనను అనుసరిస్తున్నవారు, గమనిస్తున్నవారు చాలా మందే ఉన్నారనేది `ఓడ కళాసీ` రూపంలో నిజమైందనే చెప్పాలి. మరి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిమానుల ఆశలను, వారి నమ్మకాన్ని మరింత ద్రుఢంగా నిలబెట్టుకునేందుకు ఎలా ముందుకు సాగుతారో చూడాలి. ఏదేమైనా.. పవన్కు మరింత బాధ్యత పెరిగిందని, ఇంకా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.

Walking Tips: వాకింగ్ ఎప్పుడు చేస్తే మంచిది, ఉదయమా.. సాయంత్రమా

Walking Tips: మనిషి శరీరంలో శారీరక శ్రమ తగ్గే కొద్దీ వివిధ రకాల వ్యాధులు సోకుతున్నాయి. ఇటీవలి జీవనశైలిలో శారీరక శ్రమకు ఆస్కారం లేకుండా పోవడంతో మధుమేహం, రక్తపోటు, గుండె వ్యాధులు వంటి సమస్యలు తలెత్తతున్నాయి.

వీటి నుంచి రక్షించుకోవాలంటే వాకింగ్ అనేది అత్యవసరం. అయితే వాకింగ్ ఉదయం చేస్తే మంచిదా లేక సాయంత్రం చేస్తే మంచిదా అనే సందేహం ఉంది.

ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు, ఫిట్ అండ్ హెల్తీగా ఉండటానికి వివిధ రకాల పోషకాలే కాదు శారీరక శ్రమ కూడా అవసరం. అందుకే వాకింగ్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. వివిధ రకాల అధ్యయనాల ప్రకారం వేర్వేరు సమయాల్లో చేసే వాకింగ్‌కు ప్రయోజనాలు కూడా అలానే వేర్వేరుగా ఉంటాయి. అంటే మార్నింగ్ వాకింగ్ ప్రయోజనాలు, ఈవెనింగ్ వాక్ ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి.

ఉదయం వేళ లేత ఎండలో వాకింగ్ లేదా సాయంత్రం చల్లగాలిలోవాకింగ్ రెండూ ప్రత్యేకమే. రెండింటి వల్ల ఆరోగ్యానికి ప్రయోజనముంటుంది. అయితే రెండింట్లో దేని ద్వారా ఎక్కువ లాభాలు కలుగుతాయనేదే అసలు ప్రశ్న. మార్నింగ్ వాకింగ్ వల్ల శరీరానికి కావల్సిన విటమిన్ డి సంపూర్ణంగా లభిస్తుంది. ఇది ఇమ్యూనిటీ పటిష్టం చేసేందుకు, ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతుంది. అంతే కాకుండా శరీరం మెటబోలిజం వేగవంతమౌతుంది. ఫలితంగా కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.

మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. అంటే స్లీప్ సైకిల్ మెరుగుపడుతుంది. ఉదయం వాకింగ్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ముఖ్యంగా ఒత్తిడి దూరమౌతుంది. రోజంతా ఎనర్జెటిక్‌గా ఉంటారు. దాంతోపాటు ఉదయం వేళ ఉండే ప్రశాంతమైన, స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఊపిరితిత్తులకు లాభదాయకం. అయితే శీతాకాలంలో మాత్రం మార్నింగ్ వాకింగ్ కాస్త ఇబ్బంది కల్గిస్తుంది. చలిగాలుల కారణంగా కీళ్ల నొప్పులు పెరుగుతాయి.

ఇక ఈవెనింగ్ వాక్ వల్ల రోజందా ఉండే అలసట, ఒత్తిడి దూరం చేయవచ్చు.శరీరంలోని కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. రాత్రి నిద్రించేముందు కాస్త వాకింగ్ చేయడం అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా రాత్రి వేళ ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అయితే ఈవెనింగ్ వాక్ వల్ల కాలుష్యం బారిన పడే ప్రమాదం లేకపోలేదు. ఈవెనింగ్ వాక్ చేసి అలసిపోవడం వల్ల సహజంగానే ఆకలి ఎక్కువగా ఉంటుంది. అందుకే సాధ్యమైనంతవరకూ మార్నింగ్ వాక్ అనేదే ఆరోగ్యానికి మంచిది.

Eat Food : మంచం పై కూర్చుని భోజనం చేస్తే ఆ ఇంట్లో వాళ్లకి జరిగేది ఇదే.!

Eat Food : చాలామంది భోజనం చేసే సమయంలో మంచం మీద కూర్చుని తింటూ ఉంటారు. హిందూ గ్రంధాల ప్రకారం మంచం మీద కూర్చుని భోజనం చేసేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు.

వాస్తవానికి ఈ నమ్మకం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటంటే ప్రతి పనికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ప్రశాంతమైన, శుభ్రమైన ప్రదేశంలో కూర్చుని ఆహారం తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిదని నమ్ముతారు. అదే సమయంలో మంచం మీద కూర్చున్నప్పుడు తినడం కూడా ఆహార నియమాల్లో నిషేధం. మంచం మీద కూర్చొని భోజనం చేయడం గ్రంథాలలో ఎందుకు నిషేధించబడిందో అలా తినడం వల్ల నష్టాలు ఏమిటో తెలుసుకుందాం. మన పూర్వీకులు వంటగదిలో కూర్చొని ఆహారం తినేవారు. ఎందుకంటే వంట గదిలో వేడి ఆహారాన్ని తినడం వల్ల పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని నమ్మకం.నిజానికి వంట గదిలో మనం నేలపై కూర్చొని ఆహారాన్ని తినవచ్చు. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. వంటగదిలో కూర్చొని భోజనం చేయడం కూడా రాహువును ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది.
అందుకే తినడానికి ఉత్తమమైన ప్రదేశం వంటగది అని చెప్తుంటారు. జ్యోతిష్యం శాస్త్రాల ప్రకారం మనం ఎల్లప్పుడూ ఆహారానికి గౌరవం ఇవ్వాలి. కానీ మనం మంచం మీద కూర్చొని తింటే మంచం పడుకునే స్థలం కాబట్టి ఆహారాన్ని అవమానించినట్లు అవుతుంది. అందుకే మంచం మీద భోజనం చేయడం లక్ష్మీదేవిని అగౌరవ పరచడం లాంటిదని అంటారు. తినడం అనేది బృహస్పతి రాహువులకు సంబంధించినదని కూడా నమ్ముతారు. రాహువును అశుభగ్రహంగా పరిగణిస్తారు. మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల రాహుకు కూడా కోపం వచ్చి ఐశ్వర్యం తగ్గుతుందని నమ్ముతారు.అలసట కారణంగా మనం తరచూ మంచం మీద కూర్చొని తినడం ప్రారంభిస్తాము. అయితే అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. బెడ్ సిట్టింగ్ తో మన ఆహారం మీద దృష్టి పెట్టలేము. చాలాసార్లు మనం బెడ్ మీద కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు లేదా లాప్టాప్ లో పనిచేస్తున్నప్పుడు టీవీని చూస్తాము. అటువంటి పరిస్థితుల్లో మన దృష్టి పూర్తిగా తినడంపై లేనప్పుడు మనం కూడా అతిగా తినడం చేస్తాము.

ఈ కారణంగా ఇది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. మంచం మీద కూర్చున్నప్పుడు శరీరం బంగిమ కూడా సరిగా ఉండదు. దాని కారణంగా ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది. మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల మంచం మీద కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి. దీని కారణంగా మీ నిద్రకు కూడా అంతరాయం కలుగుతుంది. మీరు భోజనం చేస్తున్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలను మంచంపై పడవేస్తే అది మీ నిద్రకు బంధం కలిగించే క్రిములను మంచం మీదకి వచ్చేలా చేస్తుంది. ఈ క్రిములు చర్మ సమస్యల వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తాయి. ఈ కారణాలన్నీ అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అలాగే ప్లేట్లో ఆహారాన్ని వదిలేయడం ఆహారాన్ని అగౌరపరచడమే అవుతుంది. ఇది డబ్బు ఆహార కొరతకు దారితీస్తుంది. కాబట్టి ఆహారాన్ని ఎప్పుడు ప్లేట్లో మిగిల్చకూడదు. మట్టికుండ ఉపయోగించండి మన గ్రంథాలలో మట్టికుండ చాలా అద్భుతమైనదిగా పరిగణించబడుతుంది. మట్టి కుండలో వండుకొని తింటే 100% పోషకాలు అందుతాయి. ఆరోగ్యంతోనే అదృష్టం వస్తుందని కూడా అంటారు…..

మీ ఇంట్లో ఎలుకలు ఉన్నాయా..? అయితే, ప్రాణాలకే ప్రమాదం.. బీకేర్‌ఫుల్‌..

Dangerous Diseases Spread by Rats : ఎలుకలు అందరి ఇళ్లల్లో ఉండటం కామన్.. ఇవి ఇళ్లల్లోని వస్తువులను, తినుబండారాలను ఆగం చేస్తాయి.. అంతేకాకుండా..
తీవ్ర చికాకును కలిగిస్తాయి.. అయితే, ఎలుకలు మురికిని వ్యాప్తి చేసే జంతువులు మాత్రమే కాదు.. అవి అనేక వ్యాధుల వాహకాలు కూడా.. ఎలుకల ద్వారా మనుషులకు వ్యాధులు కూడా వ్యాపిస్తాయి. ఇవి కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చని.. జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎలుకల ద్వారా వ్యాపించే కొన్ని వ్యాధులు దగ్గు, జలుబు వంటి ప్రారంభ లక్షణాలను చూపుతాయి. అందువల్ల, ఈ అనారోగ్యాలు తరచుగా సాధారణ జలుబు లేదా ఫ్లూగా తప్పుగా గుర్తిస్తాం.. అయినప్పటికీ, ఈ వ్యాధులను విస్మరించడం ప్రాణాంతకమని.. ఒక్కోసారి మరణానికి కూడా దారితీయవచ్చంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎలుకల ద్వారా వ్యాపించే 5 వ్యాధులు దగ్గు.. జలుబు లాగా కనిపిస్తాయి.. అవేంటో చూడండి..

లెప్టోస్పిరోసిస్: లెప్టోస్పిరోసిస్ అనేది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్.. ఇది ఎలుక మూత్రంతో సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, వాంతులు వంటి లక్షణాలను కలిగిస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో, ఇది మూత్రపిండాల వైఫల్యానికి లేదా మరణానికి కూడా దారితీస్తుంది.

ప్లేగు: ప్లేగు అనేది ఎలుకల కాటు ద్వారా వ్యాపించే బ్యాక్టీరియా సంక్రమణం.. ఈ ఇన్ఫెక్షన్ జ్వరం, అలసట, చెమట వంటి లక్షణాలను కలిగిస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో, ఇది మరణానికి కూడా దారి తీస్తుంది.

క్షయవ్యాధి: క్షయ అనేది ఊపిరితిత్తులను ప్రభావితం చేసే ఒక అంటు వ్యాధి. ఇది ఎలుకల మలం లేదా మూత్రంతో సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ దగ్గు, అలసట, బరువు తగ్గడం, జ్వరం వంటి లక్షణాలను కలిగిస్తుంది.

వైరల్ హెమరేజిక్ ఫీవర్: వైరల్ హెమరేజిక్ ఫీవర్ అనేది ఎలుకల కాటు ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ జ్వరం, రక్తస్రావం, అవయవ నష్టం వంటి లక్షణాలను కలిగిస్తుంది.

కలరా: కలరా అనేది కలుషితమైన ఆహారం లేదా నీటి వినియోగం ద్వారా వ్యాపించే బ్యాక్టీరియా సంక్రమణం. ఈ ఇన్ఫెక్షన్ విరేచనాలు, వాంతులు, కడుపు తిమ్మిరి, మంట వంటి లక్షణాలను కలిగిస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో, ఇది మరణానికి కూడా దారి తీస్తుంది.

ఎలుకల వల్ల వచ్చే వ్యాధులను నివారించడానికి మార్గాలు..

మీ ఇల్లు మరియు పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచండి.
మీ ఇంట్లోకి ఎలుకలు రాకుండా నిరోధించండి.
ఎలుకలు కుట్టడం, అవి తిరగకుండా నిరోధించుకోండి.
ఎలుకల వల్ల ఏదైనా వ్యాధి సోకిందని భావిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
మీకు తరచుగా దగ్గు, జలుబు ఉంటే, అది ఎలుకల ద్వారా వ్యాపించే కొన్ని వ్యాధుల లక్షణం కావచ్చు. అటువంటి పరిస్థితిలో, వైద్యునిచే తనిఖీ చేయడం అవసరం.

మధ్యాహ్నం అన్నానికి బదులుగా వీటిని తిన్నారంటే.. అధిక బరువు, డయాబెటీస్ సమస్యలే ఉండవ్..

అన్నంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మూడు పూటలా అన్నాన్నే తింటే మీ శరీర బరువు పెరగడంతో పాటుగా మీకున్న కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి.
అందుకే మధ్యాహ్నం అన్నానికి బదులుగా కొన్ని ఆహారాలను తింటే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.

మన దేశంలో చాలా మంది మూడు పూటలా అన్నాన్నే తింటుంటారు. అన్నం మనకు శక్తినిస్తుంది. కానీ బియ్యంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అన్నాన్ని ఎక్కువగా తింటే బరువు విపరీతంగా పెరిగిపోతారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. అందుకే అన్నాన్ని ఎక్కువగా తినడం మంచిది కాదు. మధ్యాహ్నం అన్నానికి బదులుగా వేరే ఆహారాలను తినొచ్చు. దీనివల్ల మధుమేహాన్ని నియంత్రించొచ్చు. అలాగే ఊబకాయం బారిన పడకుండా ఉండొచ్చు. మరి మధ్యాహ్నం అన్నానికి బదులుగా తినాల్సిన ఆ ఆహార పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం పదండి.

ఓట్స్

ఓట్స్ మంచి హెల్తీ ఫుడ్. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఒక కప్పు ఓట్ మీల్ లో 7.5 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఓట్స్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం ఓట్స్ తినడం వల్ల డయాబెటిస్ ను నియంత్రణలో ఉంటుంది. అలాగే బరువు కూడా తగ్గుతారు.

బార్లీ

బార్లీ కూడా మీ ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. మీకు తెలుసా? బియ్యం కంటే బార్లీలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉండే ఇవి ఆకలిని త్వరగా తగ్గించి మధుమేహాన్ని నియంత్రించడానికి ఎంతగానో సహాయపడతాయి.

బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ కూడా వైట్ రైస్ కంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. అందుకే రెడ్ రైస్ ఆకలిని నియంత్రిస్తుంది. అలాగే ఇది బరువు తగ్గడానికి కూడా మీకు సహాయపడుతుంది. అలాగే తెల్ల బియ్యం కంటే ఎర్ర బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని తీసుకోవచ్చు.

ఉప్మా

ఉప్మా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా కొవ్వు తక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మీ ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇది మీరు బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇదిడయాబెటిస్ ను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది.

GX-P2V Virus: చైనాలో మరో డేంజరస్ వైరస్‌.. ప్రపంచదేశాల్లో మరోసారి వైరస్ ఫియర్‌

ఇది అట్లాంటి ఇట్లాంటి కరోనా కాదు. కరోనా ‘కింగ్‌సైజ్’. మనల్ని చావు అంచుల దాకా తీసుకెళ్లిన కరోనా మహమ్మారి.. అవతారం మార్చుకుని మళ్లీ ముంచుకొస్తోంది.

కోట్లాదిమందిని మంచం పట్టించి, లక్షలాది మందిని మృత్యువుకి అప్పజెప్పిన అదే కరోనా.. మరో ఉప రకంతో ఉప్పెనై వస్తోంది. ఇది కనుక సోకిందంటే నేరుగా మరణమేనట. ఇంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ కొత్త వైరస్ పుట్టినిల్లు కూడా ఆ డ్రాగన్ కంట్రీయేనట.

మూడేళ్ల పాటు ప్రపంచాన్ని కుళ్లబొడిచిన కరోనా వైరస్‌ పుట్టినిల్లు చైనా. ఆవిషయం దాదాపుగా కన్‌ఫమ్ ఐంది. ఇప్పుడు అదే చైనా మరో డేంజరస్ వైరస్‌కి కేరాఫ్‌గా మారింది. పేరు GX-P2V. కోవిడ్19లా ఇది ఆగిఆగి వచ్చేది కాదు.. ఈ వైరస్‌ గనుక సోకిందంటే మరణాల రేటు 100 శాతం పక్కా అంటున్నారు నిపుణులు. ఇమ్యూనిటీలకు భయపడి వెనక్కి వెళ్లే ఛాన్సే లేదట. ఈ మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తున్నాయి.
కోవిడ్‌19కి మూల కారణమైన సార్స్‌-కొవ్‌-2 (sars cov 2) రకానికి చెందిందే జీఎక్స్‌_పీ2వీ. మొదటగా 2017లో దీన్ని మలేషియన్‌ పాంగోలిన్స్‌ జంతువుల్లో గుర్తించారు. తాజాగా ఇదే వైరస్‌ నుంచి కొత్త రకాన్ని చైనాలోని వ్యుహాన్ ల్యాబ్‌లో సీక్రెట్‌గా ఉత్పత్తి చేశారట. మొదటగా దీన్ని నాలుగు ఎలుకలపై పరిశోధించి చూశారట చైనా సైంటిస్టులు.

ఊపిరితిత్తులు, కళ్లు, ఎముకలు, శ్వాసనాళం, మెదడు పూర్తిగా దెబ్బతింటాయట. అలాగే శరీర బరువు తగ్గి, కళ్లు తెల్లబారి, కేవలం ఐదు రోజుల్లోనే ఈ ఎలుకలు నడవలేని స్థితికి చేరాయి. మూడురోజుల తర్వాత మెదడుపై వైరల్ లోడ్‌ భారీగా పెరిగి చనిపోయాయి. పొరబాటున ల్యాబ్ నుంచి ఇదే వైరస్‌ బైటికొచ్చి మనుషుల్లోకి ఎంటరైతే మటాషేనంటున్నారు నిపుణులు. ఇవే లక్షణాలతో వారం రోజుల్లోనే చనిపోతారనేది ప్రాధమిక అంచనా.
గతంలో కొవిడ్‌-19 సోకినవాళ్లను క్వారంటైన్‌లో ఉంచి, పక్కా మెడికేషన్‌తో రోగనిరోధక శక్తిని పెంచి, వైరస్‌ని శరీరంలోపలే చంపేసేవాళ్లం. అందుకే 70 కోట్ల మందికి కరోనా సోకితే 69 లక్షల మంది మాత్రమే మరణించారు. వ్యాక్సిన్లతో క్రమక్రమంగా రికవరీ రేటు పెరిగింది. డెత్‌రేటు ఒక్కశాతం దగ్గరే ఆగిపోయింది. కానీ.. చైనా ల్యాబ్స్‌లో తయారైనట్టు చెబుతున్న జీఎక్స్‌_పీ2వీ సోకితే వందకు వందమందీ చనిపోతారని, మానవ మనుగడే ఉండబోదని చెబుతున్నాయి రిపోర్టులు.

వూహాన్ ల్యాబ్‌లో జరిగిన తాజా పరిశోధనల విషయం గ్లోబల్ మీడియాలో రావడంతో యావత్ ప్రపంచం మళ్లీ ఉలిక్కిపడింది. మరోసారి డ్రాగన్ కంట్రీపై విరుచుకుపడటం మొదలైంది. ప్రాణాంతక వైరస్‌ను ప్రపంచ దేశాలపై జీవాయుధంగా ప్రయోగించాలనే కుట్రను చైనా మరోసారి అమలు చేస్తోందంటూ విమర్శలొస్తున్నాయి. అయితే జీఎక్స్ పీ2వీ వైరస్‌కు సంబంధించిన ప్రయోగాలతో వూహాన్‌ ల్యాబ్‌కు ఎటువంటి ప్రమేయం లేదంటోంది చైనా మీడియా. కానీ… ప్రపంచదేశాలన్నీ మరోసారి వైరస్ ఫియర్‌తో వణికిపోతున్నాయి.

Diabetes: రక్తంలో చక్కెరను పెరగనివ్వని ఆహారాలు ఇవే, మీ మెనూలో ఉండేలా చూసుకోండి

మనదేశంలో డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. వీరు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేలా చూసుకుంటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

అధిక చక్కెర, అధిక కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలను తినడం చాలా వరకు తగ్గించాలి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెంచని ఆహారాలను తినడం అలవాటు చేసుకోవాలి. కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉంటే వారి వారసులు మొదట్నించి జాగ్రత్త వహించాలి. వారికి ఎప్పుడైనా ఈ రోగం వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు తమ మెనూలో కచ్చితంగా ఉండాల్సిన ఆహారాలను కొన్ని ఉన్నాయి.

తెల్ల బియ్యం, ఎరుపు, బ్రౌన్ రైస్ నుంచి క్వినోవాకు మారడం మంచిది. క్వినోవా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
మైదాను పూర్తిగా వాడడం మానేయాలి.

దీనికి బదులుగా జొన్నపిండిని వినియోగించాలి.
కిడ్నీ బీన్స్, బ్లాక్ బీన్స్ వంటి కాయధాన్యాలు అధికంగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర పెరగకుండా పూర్తిగా అడ్డుకుంటుంది.
శనగ పప్పు, పెసరపప్పు వంటి పప్పులను వీలైనంత వరకు ఆహారంలో చేర్చుకోవాలి.
పాలకూర, కాలే వంటి ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోండి. బెర్రీ పండ్లను ప్రతి రోజూ తింటే మంచిది.

వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
బాదం, వాల్ నట్స్ వంటి గింజలను మెనూలో చేర్చుకోవాలి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి దోహదం చేస్తుంది.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే చేపలను తినాలి. ఇది గుండెకు మేలు చేస్తుంది.
కాలీఫ్లవర్, బ్రోకలీ వంటి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే వాటిని ప్రతి రోజూ తినాలి.
రక్తంలో చక్కెరను నియంత్రించడంలో వెల్లుల్లి సమర్థవంతంగా పనిచేస్తుంది.

ప్రతి ఆహారంలో కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేసి వండుకోవాలి.
అన్నింటికంటే ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు ఒక ఆర్డర్లో తినాలి. ముందుగా సలాడ్, వెజిటేబుల్స్, ఆ తర్వాత ప్రోటీన్స్, ఫ్యాట్స్ తీసుకోవాలి. పిండి పదార్థాలు , చక్కెర నిండి పదార్థాలను చివరిగా తీసుకోవాలి.

ఆకుకూరలు: బచ్చలికూర, కాలే, పాలకూర వంటి ఆకుకూరల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి, అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

బ్రోకలీ: ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండిన బ్రోకలీ తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది.

అవోకాడో: అవకాడో పండ్లు తినడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువ ప్రభావాన్ని చూపుతాయి.

బెర్రీలు: స్ట్రాబెర్రీస్, బ్లూ బెర్రీ పండ్లు వంటి వాటిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ పండ్లలో ఇతర పండ్లతో పోలిస్తే చక్కెర తక్కువగా ఉంటాయి.

నట్స్: వాల్ నట్స్, బాదం, పిస్తా వంటి వాటిలో రక్తంలో చక్కెరను తగ్గించే లక్షణాలు ఉంటాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ అధికంగా ఉంటాయి.

చియా సీడ్స్: ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చియా విత్తనాలు అధికంగా ఉంటాయి.రక్తంలో చక్కెర స్థాయిలను ఇవి స్థిరంగా ఉండేలా చేస్తుంది.

పెరుగు: పెరుగులో కార్బోహైడ్రేట్లు కంటెంట్ తక్కువ ఉంటుంది. ఇంట్లో తయారుచేసిన పెరుగును ప్రతిరోజూ ఒక కప్పు తినాల్సిన అవసరం ఉంది.

చేపలు: సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి రకాల చేపలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఇవి ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లను అందిస్తాయి.

గుడ్లు: గుడ్లలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.ప్రతిరోజూ ఒక గుడ్డును తింటే ఎంతో మంచిది. గుడ్లు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

ఆలివ్ ఆయిల్: ఆలివ్ నూనెలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు డయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

కాలీఫ్లవర్: కార్బోహైడ్రేట్లు దీనిలో తక్కువగా ఉంటాయి.దీనితో వండే ఆహారాలను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.

దాల్చినచెక్క: దాల్చిన చెక్కను కేవలం మసాలానే అనుకుంటారు. దీనితో వండిన ఆహారాలను తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

దోసకాయలు: అధిక నీటి కంటెంట్ కలిగిన కూరగాయలు ఇవి. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. డయాబెటిస్ పేషెంట్లు వీటిని తప్పకుండా తినాలి.

Breaking: గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. 14 మంది విద్యార్థుల మృతి

గుజరాత్‌ వడోదరలో ఘోర ప్రమాదం జరిగింది. హరాణీ సరస్సులో గురువారం పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 14 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు.
ప్రమాద సమయంలో పడవలో 23 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. రెస్క్యూ టీమ్ సరస్సు నుంచి ఐదుగురు పిల్లలను రక్షించింది. ప్రస్తుతం సరస్సులో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మొత్తం 27 మంది విహారయాత్ర భాగంగా బోటులో ఎక్కారు. అయితే ప్రమాదవశాత్తు సరస్సులో బోటు బోల్తా పడింది.

Arthritis Pain Relief Tips: కీళ్లు, మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయా.. వీటిని తింటే సెట్!

వయసు కాస్త పైబడగానే కీళ్ల, మోకాళ్ల నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ఈ నొప్పులు పెద్దలకు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు యంగ్ ఏజ్‌లోనే చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి.
దీనికి ముఖ్య కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం. అందులోనూ వింటర్ సీజన్ వచ్చిందంటే ఈ నొప్పులు మరింత ఎక్కువ అవుతాయి. అయితే వీటికి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల పండ్లు తీసుకుంటే చాలు వీటిని సెట్ చేసేయవచ్చు. రోజూ ఈ పండ్లను తింటే శీతా కాలంలో వచ్చే ఆర్థరైటిస్ నొప్పుల నుంచి రిలీఫ్ నెస్ పొందవచ్చు. ఈ నొప్పులు తగ్గేందుకు తీసుకోవాల్సిన పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయి పండ్లు:

బొప్పాయి పండ్లలో విటమిన్ సి, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, బీటా కెరోటీన్, ఎంజైమ్‌లు వంటివి ఉంటాయి. ఆర్థరైటిన్ నొప్పులు ఉన్న వారు బొప్పాయిని చలి కాలంలో తీసుకుంటే వాటి నుంచి ఉపశమనం పొంద వచ్చు. ఈ సమస్య నుంచి సులభంగా బయట పడొచ్చు. అంతేకాకుండా స్కిన్ కూడా హైడ్రేట్ అవుతుంది.

విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్:

విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తినడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. పైనాపిల్, నారింజ, ద్రాక్ష, నిమ్మ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ జాతికి చెందిన పండ్లు వంటివి తినడం వల్ల ఎంతో మేలు చేస్తుంది. కనుక రోజూ వీటిని తింటున్నా కూడా ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. వీటిల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్వలు ఉంటాయి. ఇవి శరీరంలో హానికర ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తాయి. కీళ్ల, మోకాళ్ల నొప్పులు ఉన్న వారు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా ఇవి తినడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.
చెర్రీ పండ్లు:

చెర్రీ పండ్లు కూడా కీళ్ల,మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి. వీటిల్లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనప్పుడల్లా వీటిని తింటే మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థరైటిస్ నొప్పుల నుంచి బయట పడొచ్చు.

యాపిల్:

ప్రతి రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదు. యాపిల్ సర్వ రోగ నివారిణిగా చెబుతూంటారు. యాపిల్ తిన్నా కీళ్ల, మోకాళ్ల నొప్పులు కంట్రోల్ అవుతాయి. రోజూ ఒక యాపిల్ తినడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

కోచింగ్‌ సెంటర్లకు కేంద్రం కీలక ఆదేశాలు

విద్యార్థుల ఆత్మహత్యలు, సౌకర్యాల లేమి, టీచర్ల కొరత, అధిక ఫీజులు వంటి సమస్యలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశ వ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కోచింగ్‌ సెంటర్‌లకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది.

16 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న విద్యార్ధులను కోచింగ్‌ సెంటర్‌లో చేర్చుకోరాదని వెల్లడించింది. సెకండరీ పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న తరువాత మాత్రమే విద్యార్ధులను చేర్చుకునేందుకు అనుమతినిచ్చింది.

►శిక్షణ కేంద్రాల్లో విద్యార్హత కలిగిన సిబ్బందిని నియమించుకోవాలి. వారు తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ కంటే తక్కువ అభ్యసించిన వారిని సిబ్బందిగా నియమించుకోరాదు.
►విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా.. ర్యాంకులు, మార్కుల గురించి ఎలాంటి హామీలు ఇవ్వకూడదు.
సిబ్బంది అర్హత, కోచింగ్‌ సెంటర్‌ వివరాలు, శిక్షణ అందించే కోర్సులు, వసతి సౌకర్యాలు, ఫీజు రిఫండ్‌ గురించిన సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరచాలి.
►కోచింగ్‌ సెంటర్‌లో ఇచ్చే శిక్షణకు సంబంధించి, అక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు సాధించిన ఫలితాల గురించి మోసపూరిత ప్రకటనలు చేయకూడదు.
► కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు సరిపోయే స్థలం కేటాయించి కనీస సౌకర్యాలు(విద్యుత్‌, వెంటిలేషన్, లైటింగ్, స్వచ్ఛమైన తాగునీరు,భద్రతా చర్యలు’ ఏర్పాటు చేయాలి.
► అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణనష్టం నివారించేందుకు భద్రతా ప్రమాణాలు పాటించాలి.
► శిక్షణ ఇచ్చే వ్యక్తి లేదా సంస్థ కోచింగ్‌ ప్రారంభించిన మూడు నెలల వ్యవధిలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
► ఒకవేళ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిర్వహిస్తుంటే.. గుర్తింపు రద్దవుతుంది.
► ఒకే పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చే సంస్థలు తప్పనిసరిగా ఆయా బ్రాంచ్‌లను రిజిస్ట్రేషన్‌ చేయాలి.
► కోచింగ్‌ తీసుకునే విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌తో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు కౌన్సెలింగ్‌ ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
►న్యాయమైన, సహేతుకమైన ఛార్జీలు, రుసుము రసీదులు, వాపసు విధానాలు వివరంగా ఉండాలి.

Viral : కాంచీపురంలో దారుణంగా కొట్టుకున్న పూజారులు

Viral : కాంచీపురంలోని ప్రసిద్ధ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పూజారులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చుట్టుపక్కల వారు తమను గమనిస్తున్నారనే విషయం కూడా మర్చిపోతారు.
కొట్టుకోవడంలో వారు పూర్తిగా మునిగిపోయారు. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం వైష్ణవ మతంలో ప్రసిద్ధి చెందింది. కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్ర జరుగుతుంది. కాగా, యాత్రలో తొలి పాట పాడడంపై వివాదం తలెత్తింది. అర్చకులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. నడిరోడ్డుపై అర్చకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటనను అక్కడ స్థానికులు సెల్ ఫోన్ లో బంధించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వీడియో వైరల్‌గా మారింది.

Pichukalu : పిచ్చుకలు ఇంట్లోకి పదే పదే వస్తున్నాయా.. దాని అర్థం ఏమిటో తెలుసా..?

Pichukalu : మన ఇంట్లోకి అనుకోకుండా కొన్నిసార్లు పక్షులు, కీటకాలు వస్తూ ఉంటాయి. వాటి వల్ల కొన్నిసార్లు శుభం కలుగుతుంది. కొన్నింటిని మనం లక్ష్మీ ప్రదంగా భావిస్తాం.

ఎటువంటి పక్షులు మన ఇంట్లోకి వస్తే శుభం కలుగుతుంది… మన ఇంట్లోకి రాకూడనటువంటి పక్షులు ఏవి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పిచుకుల మన ఇంట్లోకి ప్రవేశిస్తే చాలా మంచి జరుగుతుందని మన పెద్దలు చెబుతుంటారు.

పిచుకులు ఇంట్లోకి రావడాన్ని శుభ సూచకంగా భావించాలి. పిచుకలు ఇంట్లోకి వస్తే లక్ష్మీ ప్రదం. పిచుకలు ఇంట్లోకి వస్తే లక్ష్మీ కటాక్షం మరింత పెరుగుతుందని అర్థం. రెండు పిచుకలు ఇంట్లోకి వస్తే కళ్యాణం ఆ ఇంట్లో జరగబోతుందని లేదా సంతానం కలగబోతుందని అర్థం.
అలాగే కాకిని చూస్తే చాలా మంది భయపడిపోతుంటారు. కొందరు దీనిని అశుభంగా భావిస్తారు. కానీ కాకిని పితృ దేవతలకు ప్రతీకగా భావించాలి. కాకి ఎగురుతూ ఇంటికి వస్తే చాలా మంచిది.

పెద్దలు ఆశ్వీరదించడానికి వచ్చారని భావించాలి. బయటకు వెళ్లినప్పుడు కాకి తల మీద తనిత్తే ఏదో ప్రమాదం జరగబోతుందని , ఏదో చెడు జరగబోతుందని అర్థం. ఇక మూడవ పక్షి గుడ్లగూబ.

దీనిని చూస్తేనే అందరూ భయపడి పోతుంటారు. చూడడానికి ఈ గుడ్లగూబ చాలా భయకరంగా ఉంటుంది. కానీ గుడ్లగూబ ఇంట్లోకి వస్తే చాలా మంచిది. గుడ్లగూబ ఇంటికి వస్తే లక్ష్మీ రాబోతుందని అర్థం.

గుడ్లగూబ లక్ష్మీ దేవికి వాహనం కాబట్టి ఇది ఇంట్లోకి వచ్చిన శుభసూచకంగా భావించాలి. ఇక పాము ఇంట్లోకి వస్తే ఇంట్లో ఉన్న వ్యక్తులకు మానసిక వ్యధ ఎక్కువవుతుంది. ఏదో అశాంతి రాబోతుందని అర్థం.

కావున పాము ఇంట్లోకి రావడం అంత మంచిది కాదు. అలాగే కొండమిడతలు కానీ కందిరీగ వంటివి కానీ ఇంట్లోకి వస్తే చాలా శుభపద్రంగా చెప్పవచ్చు. కందిరీగలు వచ్చి ఇంట్లో గూడు కడితే చాలా మంచిది.

ఇది లక్ష్మీ కటాక్షానికి సంకేతం. కందిరీగలు కట్టిన గూడు మట్టితో బొట్టు పెట్టుకుంటే మంచి జరుగుతుంది. నెగెటివ్ ఎనర్జీ తగ్గుతుంది. మానసిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే గోడలపై బల్లులు లేని ఇళ్లే ఉండదు. బల్లులు ఇంట్లో ఉండడాన్ని శుభసూచకంగా భావిస్తారు.

శాస్త్రీయంగానూ బల్లులు ఇంట్లో ఉండడం మంచిది. కంటి మిడతల గురించి అందరికి తెలిసే ఉంటుంది. వర్షాకాల సమయంలో ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ కంటి మిడతలు అనేవి ఇంట్లోకి రావడం శుభానికి సంకేతం.

పూలు ఎక్కువగా ఉన్న ఇండ్లల్లోకి సీతాకోక చిలుకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తే ఇళ్లు పూల వనంలా ఆహ్లాదంగా మారిపోతుంది. ఇంట్లో ఉండేవారికి బాధలు తొలగిపోయి ఆనందంగా మారతారు.

సీతాకోక చిలుక ఇంట్లోకి వస్తే లక్ష్మీప్రదం. లక్ష్మీప్రదం అంటే డబ్బు ఒక్కటే కాదు సంతోషం, సంతానం, మనశాంతి. కరువు లేకుండా ఉండడం.

ఎవరి దగ్గర చేయిచాచకుండా ఉండడం. ఇవి అన్నీ కూడా లక్ష్మీతత్వాలే. సీతాకోక చిలుక ఇంట్లోకి వస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా తేలు, జర్రీ ఇంట్లోకి రావడం మంచి విషయం కానే కాదు.

ఇళ్లు శుభ్రంగా లేనప్పుడు, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు తేలు, జర్రీలు ఇంట్లోకి వస్తాయి. వీటి వల్ల చెడే ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు తేలు, జర్రులు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి.

మీ ఫోన్‌లో నెట్ స్పీడ్‌గా లేదా? ఈ సెట్టింగ్స్​ మార్చండి.. ఇక రాకెట్​ వేగమే!

How To Increase Mobile Internet Speed : మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉందా? నో టెన్షన్! ఫోన్‌లోని కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్‌ పొందవచ్చు.

అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇది స్మార్ట్ యుగం. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటుంది. అయితే.. వీరిలో చాలా మందిని వేధించే సమస్య.. ఇంటర్నెట్ స్లో! ఏదైనా సమాచారం కోసం వెతుకుతున్నప్పుడో.. యూపీఐ చెల్లింపులు చేస్తున్నప్పుడో.. ఆన్​లైన్​లో మూవీస్ చూస్తున్నప్పుడో.. నెట్ స్పీడ్ తక్కువగా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మీ ఫోన్‌లో నెట్‌ స్పీడ్‌ సరిగా లేదా? అయితే.. కొన్ని సెట్టింగ్స్​ మార్చుకోవడం ద్వారా ఇంటర్నెట్‌ స్పీడ్‌ పెంచుకోవచ్చని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. మరి.. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్‌ స్పీడ్‌ పెంచుకోవడానికి ఈ టిప్స్ పాటించండి :

మీ స్మార్ట్‌ ఫోన్‌లో నెట్‌ స్పీడ్‌ తక్కువగా ఉంటే ముందుగా ఫోన్‌ రీస్టార్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల నెట్‌ స్పీడ్‌ పెరుగుతుంది.

తర్వాత.. ఫోన్‌లో క్రాష్, కుకీస్​ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి.

స్మార్ట్‌ఫోన్‌లో డేటా సేవింగ్ మోడ్‌ ఆన్ చేయండి. ఇలా చేయడం వల్ల కూడా ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ వేగవంతం అవుతుంది.

ఒకేసారి చాలా యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ కావడం వల్ల ఇంటర్నెట్ వేగం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి, బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ క్లోజ్ చేయాలి.

కొంత మంది స్మార్ట్‌ ఫోన్‌లో ఆటోమేటిక్ అప్‌డేట్‌ సెట్టింగ్‌ను యాక్టివేట్‌ చేసుకుంటారు. దీనివల్ల ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గవచ్చు. అందువల్ల ఆటో అప్‌డేట్‌ సెట్టింగ్‌ను ఆఫ్‌ చేయండి.

ఫోన్‌లోని డేటా సెట్టింగ్స్​ ఒకసారి పరిశీలించండి. మీది 5G స్మార్ట్‌ఫోన్‌ అయి ఉండి.. డేటా సెట్టింగ్ 4G నెట్‌వర్క్‌లోనే ఉంటే కూడా నెట్‌ స్పీడ్‌ తక్కువగా ఉంటుంది.

మీ ఫోన్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్ వస్తే.. వాటిని స్కిప్ చేయకూడదు. వెంటనే ఇన్‌స్టాల్‌ చేసుకోండి. దీనివల్ల ఇంటర్నెట్‌ స్పీడ్‌ మెరుగవుతుంది.

చాలా మంది ఫోన్లలో పదుల సంఖ్యలో యాప్స్ ఉంటాయి. కానీ.. అందులో ఉపయోగించేవి మాత్రం కొన్ని మాత్రమే ఉంటాయి. మీ ఫోన్​లో కూడా ఉలా ఉంటే.. ఉపయోగించని యాప్‌లను అన్‌ ఇన్‌స్టాల్‌ చేయండి. దీనివల్ల స్పేస్‌ క్లియర్ అవుతుంది. నెట్‌ వేగం కూడా పెరుగుతుంది.

నెట్‌వర్క్‌ సరిగ్గా రాకపోతే.. మీ ఫోన్‌ను కొన్ని నిమిషాలపాటు ఎరోప్లెన్‌ మోడ్‌లో ఉంచండి. తరవాత నార్మల్‌ మోడ్ సెట్‌ చేయండి. నెట్​ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి త్వరగా పనిచేసే ఎఫెక్టివ్ టిప్ ఇది.

ఇన్ని చేసినా నెట్​ స్పీడ్​గా రాకపోతే.. ఒక్కసారి సిమ్‌ తీసి మళ్లీ వేయండి. ఇలా చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.

మీరు రెండు SIM కార్డ్‌లను ఉపయోగిస్తూ ఉంటే.. సెట్టింగ్స్​లో అందుబాటులో ఉన్న ఉత్తమ నెట్‌వర్క్‌ను ఎంపిక చేసుకోండి.

మీ డేటా లిమిట్‌ను చేరుకొని ఉంటే కూడా నెట్‌స్పీడ్ తగ్గవచ్చు. అప్పుడు మరింత డేటా కోసం ఇతర ప్లాన్లను అప్‌గ్రేడ్ చేసుకోండి.

విద్యార్థుల -పుట్టుమచ్చల నమోదు… వివరాలు. మరియు…

SSC Annual Exams – Moles For SSC Students To Write Nominal Rolls.

SSC విద్యార్థుల -పుట్టుమచ్చల నమోదు… వివరాలు.
మరియు…

1 నుంచి 10 తరగతుల ఆన్లైన్ లో అడ్మిషన్ ఎంట్రీ కి పు (మోల్స్) ఐడెంటిఫికేషన్ మార్క్స్ తప్పనిసరి – పుట్టుమచ్చల నమోదు… వివరాలు..

SSC విద్యార్థులు -పుట్టుమచ్చల నమోదు… వివరాలు.

★ Be careful about their location on the body ( left or right)

★ మచ్చ బాగా నల్లగా thick గా ఉంటే a black/dark mole on అని రాయాలి

★ మచ్చ light colour లో ఉంటే a light mole on అని రాయాలి.

★ అసలు మచ్చలు లేక పోతే scar ఏమైనా వుందా అని check చెయ్యాలి.

నుదురు- forehead
కనుబొమ్మ- Eyebrow
కనురెప్ప- eyelid
కణత -temple
చెవి -ear
చెంప -cheek
పై పెదవి – upper lip
కింది పెదవి – lower lip
గడ్డం- chin
భుజం-shoulder
ఛాతి- Chest

భుజం నుంచి మణికట్టు వరకు ( చేయి) =arm
{ భుజం నుండి మోచెయ్యి వరకు = arm, మోచెయ్యి నుండి మణికట్టు వరకు = forearm}అని కూడా రాయ వచ్చు}

మణికట్టు- wrist
బొటన వేలు- thumb
చూపుడు వేలు- index finger
ఉంగరం వేలు- ring finger
మధ్య వేలు- middle finger
చిన్న వేలు- little finger
అరచేయి- palm
మోచెయ్యి- elbow
బొడ్డు- navel
పొట్ట- abdomen
నడుము- waist
Hip = either side of the body below the waist and above the thigh.
తొడ- thigh
మోకాలు- knee
అరికాలు -foot
kలివేలు- toe
కాలి బొటనవేలు = hallux/ big toe/ great toe
రెండవ కాలి వేలు = long toe
మూడవ కాలి వేలు= third toe/ ring toe
నాల్గవ కాలి వేలు = fourth toe/ ring toe
ఐదవ కాలి వేలు = little toe/ pinky toe/ baby toe/ outermost toe/ distal toe
పాదం కింద భాగం- foot sole

Examples:
A dark mole on the upper lip.
A light mole near the right ear
A black mole on the right collar bone.
A light mole on the left cheek.
A scar on the right forearm.

A dark mole on the chest A light mole on the left abdomen.

Check Aadhaar Bank Account Linking Status

Even though Linking Aadhaar with Bank account is not mandatory as per Supreme court orders, State and Central Government working based on it. Know here how to check Aadhaar Bank account linking status,

How to Check the Aadhaar Bank Account Linking Status
Go to the Aadhaar website Website www.uidai.gov.in
Go to MyAadhaar Section
Click on Check Aadhaar Bank Account Linking Status
Enter 12 digits Aadhaar Number
Enter Security Code
Click on Send OTP
An OTP will be sent to our Registered Mobile Number
Enter OTP and Click on Submit
Status of Aadhaar Bank Account will be displayed with year of Mapped

Check Aadhaar Bank Account Linking Status

Child care leave of 180 days should be availed in 10 installments

Amendment orders on utilization of 180 days child care leave…

Child care leave of 180 days should be availed in 10 installments.

180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ వినియోగం పై సవరణ ఉత్తర్వులు…

180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ను 10 విడతలలో వినియోగించాలి.

G.O.MS.No.199 Fin. Dept. DT:19-10-2022

Download…Copy

Shifting the O/o the AP Board of Intermediate Education

Shifting the O/o the AP Board of Intermediate Education

BIE AP New Address Shifting the O/o. the Secretary, AP Board of Intermediate Education Rc.No. 002/D1/2021 Dated: 02.12.2021.

CIRCULAR

Sub:- BIE, AP, Vijayawada – Shifting the O/o. the Secretary, Board of Intermediate Education, Andhra Pradesh – Communication of new address Intimation – Regarding.

It is inform you that the O/o. the Secretary, Board of Intermediate Education, Andhra Pradesh, D.No.48-18-2/A & 48-18-1/A, Nagarjuna Nagar colony, Opp. NTR Health University, Vijayawada has been shifted to R.No.114/C3, 2, 3 & 4th floors of Eswar Elite, Beside Sono-vision, Tadepalle, Guntur for administrative convenience.

Hence, all are hereby directed to make further correspondence hereafter, to the newly shifted address as mentioned:

NEW ADDRESS:

Office of the Secretary,

Board of Intermediate Education, Andhra Pradesh,

R.No.114/C3, 2nd, 3rd & 4th floors,

Eswar Elite, Beside Sono-vision,

Tadepalle, Guntur District. Pincode: 522501.

Contact No. 9392911819, 08645-277702, 277703

????Age Calculator- మీ పుట్టిన తేదీని ఎంటర్ చేసి క్షణాల్లో మీవయసు సంవత్సరాలలో , వారాలలో మరియు గంటలలో తెలుసుకోవచ్చు..

Age Calculator – Date of birth needs to be earlier than the age at date.

The Age Calculator can determine the age or interval between two dates. The calculated age will be displayed in years, months, weeks, days, hours, minutes, and seconds.

Age Calculator- The Age Calculator can determine the age or interval between two dates
The age of a person can be counted differently in different cultures. This calculator is based on the most common age system. In this system, age grows at the birthday. For example, the age of a person that has lived for 3 years and 11 months is 3 and the age will turn to 4 at his/her next birthday one month later. Most western countries use this age system.

In some cultures, age is expressed by counting years with or without including the current year. For example, one person who is twenty years old is the same as one person who is in the twenty-first year of his/her life. In one of the traditional Chinese age systems, people are born at age 1 and the age grows up at the Traditional Chinese New Year instead of birthday. For example, if one baby was born just one day before the Traditional Chinese New Year, 2 days later, the baby will be at age 2 even though he/she is only 2 days old.

In some situations, the months and days result of this age calculator may be confusing, especially when the starting date is the end of a month. For example, we all count Feb. 20 to March 20 to be one month. However, there are two ways to calculate the age from Feb. 28, 2015 to Mar. 31, 2015. If thinking Feb. 28 to Mar. 28 as one month, then the result is one month and 3 days. If thinking both Feb. 28 and Mar. 31 as the end of the month, then the result is one month. Both calculation results are reasonable. Similar situations exist for dates like Apr. 30 to May 31, May 30 to June 30, etc. The confusion comes from the uneven number of days in different months. In our calculation, we used the former method.

Know Your Age… Through Age Calculator

Mobile Numbers of Collector,JC,SPs of 26 Districts in AP

Mobile Numbers of Collector,JC,SPs of 26 Districts in AP

 

NEW DISTRICT CODES – SCHOOL EDUCATION

NEW DISTRICT CODES – SCHOOL EDUCATION

 

Health

సినిమా