Blood Cholestrol : రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గాలా ? ఈ డ్రింక్స్ తాగితే త్వరగా కరిగిపోతుంది

www.mannamweb.com


Blood Cholestrol: కొలెస్ట్రాల్.. నూటికి 80 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ లెవర్స్ పెరిగితే అనారోగ్య సమస్యలు వస్తాయన్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే శరీరంలో చేరే చెడు కొలెస్ట్రాల్ ను ఎప్పటికప్పుడు కరిగించుకోవాలి. రోజూ వ్యాయామం చేయడంతో పాటు.. కొన్ని నేచురల్ డ్రింక్స్ తాగడం ద్వారా కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు.

వెల్లుల్లిలో చాలా ఔషధ గుణాలున్నాయంటారు. ఆల్లిసిన్, అజోన్, ఎస్-అలైల్ సిస్టీన్, ఎస్ – ఈథైల్ సిస్టీన్, డై అలైల్ సల్ఫైడ్ అనే ఆర్గానిక్ సమ్మేళనాలు వీటిలో ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. రోజూ ఉదయాన్నే పరగడుపున 2 పచ్చివెల్లుల్లి రెబ్బలను నెలరోజులపాటు తింటే.. మీ శరీర ఆకృతిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది.
గ్రీన్ టీ .. ఇది కూడా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. వీటిలో ఉండే పాలిఫినాల్స్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. రోజుకు 2-3 కప్పుల గ్రీన్ టీ తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.

ఆయుర్వేదం ప్రకారం ధనియాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోనూ ఇవి ఉపయోగపడతాయి. ఒక పాత్రలో నీటిని తీసుకుని.. అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా మరిగించాలి. బాగా మరిగిన ఈ నీటిని వడకట్టి దానిని ఒక కప్పు మోతాదులో రోజుకు రెండుసార్లు తాగాలి. ఇలా చేస్తే.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు త్వరగా కరిగిపోతుంది.

మెంతులు.. వీటిని రోజూ ఏదొక రకంగా వంటల్లో వాడుతూ ఉంటాం. వీటిలో విటమిన్ ఇ తో పాటు యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ ఫ్లా మేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలుంటాయి. కొలెస్ట్రాల్ ను గణనీయంగా తగ్గిస్తాయి. రాత్రిపూట 2 టీ స్పూన్ల మెంతులను ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి.. మరునాడు ఉదయాన్ని ఆ నీటిని తాగేసి.. మెంతుల్ని తినాలి.

ఒక పాత్రలో నీరుపోసి.. అందులో 2 టీ స్పూన్ల మెంతులు వేసి బాగా మరిగించి.. దానిని వడకట్టి ఒక కప్పు మోతాదులో తాగాలి. రోజుకు 2 సార్లు ఇలా చేస్తే.. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిపోతాయి.

ఉసిరికాయలు కూడా రక్తంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. ఉసిరికాయల్లో ఫినోలిక్ సమ్మేళనాలుంటాయి. ఉసిరికాయరసం చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు 30 ఎంఎల్ మోతాదులో ఉసిరి రసం తాగితే.. కొలెస్ట్రాల్ లెవల్స్ గణనీయంగా తగ్గుతాయి.