Flight journey: మొదటిసారి ఫ్లైట్ ఎక్కుతున్నారా.. ఇవి వెంట తీసుకెళ్తే మీకు నో ఎంట్రీ..

విమానాశ్రయాల్లో కొన్ని నిబంధనలు కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మన లగేజీ, వెంట తీసుకువెళ్లే సామాన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వాటిని అధికారులు సీజ్ చేస్తుంటారు.
ఇంతకీ విమాన ప్రయాణాల్లో మీ వెంట క్యారీ చేయకూడని కొన్ని ఆహార పదార్థల గురించి మీకు తెలుసా.. అవేంటో చూద్దాం..


మీరు విదేశాల్లో ఉన్న మీ వాళ్ల కోసం అక్కడ లభించని ఎన్నో సరుకులను ప్యాక్ చేసి తీసుకెళ్తుండొచ్చు. అయితే, అందులో ఎండు కొబ్బరి లేకుండా చూసుకోండి. లేదంటే మిమ్మల్ని ఎయిర్ పోర్టు సిబ్బంది అడ్డుకుంటారు. ఎండుకొబ్బరి మాత్రమే ఎందుకు నిషేధించారంటే.. ఇందులో ఎండు కొబ్బరి లేదా కొబ్బరి పొడి మండే గుణాన్ని కలిగి ఉంటుంది. ఫ్లైట్ గాల్లో ఎగురుతున్న సమయంలో ఏదైనా ప్రమాదానికి గురైతే ఇలాంటి వస్తువులు ఆ తీవ్రతను మరింత పెంచుతాయి. అందుకే వీటిని ఫ్లైట్ లో తీసుకువెళ్లడం నిషేధించారు.

ద్రవ పదార్థాలు తీసుకెళ్లొద్దు..

ఇది తరచుగా విమానంలో ప్రయాణించే వారికి తెలిసిన విషయమే. మీ బ్యాగుల్లో 100 ఎంఎల్ కంటే ఎక్కువ ద్రవ పదార్థాలేమీ ఉండకూడదు. కూల్ డ్రింక్స్, సూప్ లు, సాస్, పెరుగు వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. అంతేకాదు బ్రెడ్ పై వేసుకునే పీ నట్ బటర్ ను కూడా అనుమతించరు. ఒకవేళ తీసుకువెళ్లాలనుకుంటే ద్రవాల రూపంలో కాకుండా సాలిడ్ ఫుడ్స్ ను మాత్రమే తీసుకువెళ్తే బెటర్.

పండ్లు, కూరగాయలు..

తాజా పండ్లుకూ, కూరగాయలను తీసుకెళ్లడం హానికరం కాదని అనిపించినప్పటికీ, అనేక దేశాలు వాటి దిగుమతికి సంబంధించి కఠినమైన నిబంధనలను కలిగి ఉన్నాయి. కొన్ని దేశాలు తెగుళ్ళు, వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి కొన్ని తాజా ఉత్పత్తుల ను కూడా నిషేధిస్తాయి. మీరు వెళ్లే చోట అలాంటి పరిమితులు ఉన్నయో లేదో చూసుకోండి. అయినప్పటకీ పండ్లు, కూరగాయలు మీ హ్యాండ్ బ్యాగేజీలో సులభంగా నలిగిపోతాయి. లేదా దెబ్బతింటాయి, అవి గజిబిజిగా మారి మీ ప్రయాణాన్ని కష్టతరం చేస్తాయి. వీటికి బదులు నిల్వ ఉండే ఫుడ్స్ ఫ్యాక్ చేసుకోవడం బెటర్.

ఘాటు వాసనలు వచ్చేవి..

వెల్లుల్లి వంటి కొన్ని రకాల ఘాటు పదార్థాలు మీ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవచ్చు. వీటిని ఎయిర్ పోర్టు సిబ్బంది బ్యాన్ చేయకపోయినప్పటికీ మీ హ్యాండ్ బ్యాగులో ఇవి ఉంటే అవి మీకు అసౌకర్యాన్ని కలిగించవచ్చు. మార్గమధ్యంలో వీటి గురించి తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేస్తే వాటిని తొలగించడానికి కూడా వీలుకాని పరిస్థితులుల తలెత్తవచ్చు. అందుకే హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ చేసేవారు వీటిని తీసుకెళ్లకపోవడమే బెటర్.

డైరీ ప్రాడక్ట్స్..

త్వరగా పాడైపోయే ఆహార పదార్థాలు.. ఉదాహరణకు డైరీ ప్రాడెక్ట్స్, మాంసం, సీ ఫుడ్ వంటి వాటిని కూడా విమాన ప్రయాణాల్లో అనుతించరు. ముఖ్యంగా మీరు క్యారీ చేసే హ్యాండ్ బ్యాుగులో వీటిని తీసుకెళ్లడం మీకు రిస్కే. ఇవి త్వరగా పాడైపోయి ఒక విధమైన చెడు వాసనను కలిగిస్తాయి. ఒక వేళ తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సి వస్తే.. వీటిని ఐస్ ప్యాకెట్స్ తో పాటు ప్యాక్ చేయించుకుని తీసుకువెళ్లాలి.

ప్యాక్ చేయకుండా తీసుకెళ్తున్నారా..

విమాన ప్రయాణాల్లో సీల్ చేయని లేదా ప్యాకింగ్ సరిగా లేని వస్తువులను తీసుకెళ్లడం అంత మంచిది కాదు. ఇవి సులభంగా చెల్లాచెదురవుతాయి. అంతేకాదు భద్రతా ప్రమాణాలకు విరుద్ధం. ఎల్లప్పుడూ సరిగ్గా ప్యాక్ చేయించిన వాటిని తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకోండి.