గురువారం (జూన్ 12) మధ్యాహ్నం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ప్రయాణీకుల విమానం బోయింగ్ డ్రీమ్‌లైన్ 787 కుప్ప కూలిపోయింది. ఇందుకు సఃంబంధించి భయానక చిత్రాలు బయటకు వస్తున్నాయి. అహ్మదాబాద్‌లోని మేఘనినగర్ ప్రాంతంలో భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. విమానం అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెలులుండగా. విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారని చెబుతున్నారు.
విమానంలో 242 మంది
కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విమానానికి కెప్టెన్ సుమిత్ సభర్వాల్ నాయకత్వం వహించారు. ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ఉన్నారని DGCA తెలిపింది.
ఫైలట్ ఎవరు..? అతని అనుభవం ఎంత?
విమాన కెప్టెన్ సుమిత్ సభర్వాల్ 8200 గంటల LTC అనుభవం ఉంది. కో-పైలట్‌కు 1100 గంటల విమానయాన అనుభవం ఉంది. TC ప్రకారం, విమానం అహ్మదాబాద్ నుండి 1339 IST (0809 UTC)కి రన్‌వే 23 నుండి బయలుదేరింది. రన్‌వే 23 నుండి టేకాఫ్ అయిన వెంటనే, విమానం విమానాశ్రయ వెలుపల నేలపై కూలిపోయింది. ప్రమాద స్థలం నుండి భారీ నల్లటి పొగ వెలువడటం కనిపించింది” అని DGCA తెలిపింది.
ప్రమాదంపై ఎయిర్ ఇండియా ప్రకటన
ప్రమాదంపై ఎయిర్ ఇండియా ప్రకటన వెలువడింది. అహ్మదాబాద్-లండన్ గాట్విక్ వెళ్తున్న AI171 విమానం ప్రమాదానికి గురైందని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం, ఈ సంఘటన గురించి సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు.
ఘటనాస్థలానికి సీఎం భూపేంద్ర
ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సూరత్ నుండి అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు. యుద్ధ ప్రాతిపదికన తక్షణ సహాయ చర్యలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సూచనలు ఇచ్చారు. గాయపడిన ప్రయాణీకులకు తక్షణ చికిత్స అందించాలని కూడా ఆయన కోరారు.
ప్రమాదస్థలికి చేరుకుంటున్న సహాయక బృందాలు
గాంధీనగర్ నుండి 90 మంది సిబ్బందితో కూడిన జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) యొక్క 3 బృందాలను విమానం కూలిపోయిన ప్రదేశానికి పంపారు. వడోదర నుండి మొత్తం 3 బృందాలను పంపుతున్నారు.
విమానంలో గుజరాత్ మాజీ సీఎం
అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.
ప్రమాద సమయంలో 242 మంది ప్రయాణికులు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం (జూన్ 12) భారీ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 242 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. అన్ని విమానాశ్రయ మార్గాలు మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
Post Views: 67
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.