Boiled Banana: అరటిపండు ఉడకబెట్టుకుని తింటే ఈ రోగాలన్నీ నయమవుతాయ్

మీరు అరటి పండు ఎలా తింటున్నారు? అదేం ప్రశ్న తొక్క తీసుకుని తింటామని చెప్తారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ ఊపందుకుంది. అదేంటో తెలుసా..?
అరటిపండుని బాగా ఉడకబెట్టుకుని తినడం. అదేమీ కఠినమైన పదార్థం కాదు కదా ఉడకబెట్టడానికి మెత్తగానే ఉంటుంది కదా అని కొందరు అనుకుంటారేమో. కానీ అరటిపండు ఉడకబెట్టుకుని తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెప్తున్నారు.


అరటిపండుని దాని తొక్కతో సహా ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడకబెట్టడం వల్ల అవి మరింత మృదువుగా, టీపీగా, క్రీమ్ గా మారిపోతుంది. దాంట్లో పీనట్ బటర్, తేనె, దాల్చిన చెక్క పొడి వంటి వాటిని వేసుకుని తింటే అద్భుతంగా ఉందని చెప్తున్నారు.

అన్నట్టు మీకో విషయం తెలుసా మన దేశంలో తొక్క తీసి అరటి పండు తింటారేమో కానీ వివిధ దేశాలలో తొక్కతో సహా వాటిని ఉడకబెట్టి రకరకాల వంటల్లో వేసుకుంటారు.

థాయ్ సంస్కృతిలో ఉడికించిన అరటిపండ్లను మెత్తగా చేసి కొబ్బరి పాలతో కలిపి క్లూయ్ బూట్ చి అనే డెజర్ట్ తయారు చేస్తారు. అది అక్కడ చాలా ఫేమస్. ఇతర ప్రాంతాల్లో ఉడకబెట్టిన అరటిపండ్లను బనానా బ్రెడ్ తయారుచేయడానికి ఉపయోగిస్తారు.

ఇది ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫేమస్. ఉడికించిన అరటిపండు అల్పాహారంగా లేదా డెజర్ట్ గా తీసుకున్నా అందులోని కేలరీల్లో మాత్రం ఎ మాత్రం మార్పు ఉండదు.

పోషకాలు పెరుగుతాయా?

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం అరటిపండుని ఉడకబెట్టడం వల్ల దానిలోని పోషకాల లభ్యత పెరుగుతుంది. అందులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ శరీరానికి మరింత త్వరగా అందుతాయి. ఉడకబెట్టడం వాళ్ళ అందులోని పిండి పదార్థాలు పెరుగుతాయి. శక్తిని అందిస్తుంది.

అంతే కాదు అరటిపండు ఉడకబెట్టింది తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కొందరు నమ్ముతారు. ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీరానికి వెచ్చదనం, విశ్రాంతిని ఇస్తుంది. అదనంగా తీపి తినాలనే కోరికలను తగ్గిస్తుంది.

ఎందుకు ఉడకబెట్టాలి?

అరటిపండ్లు ఉడకబెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే వాటి ఆకృతి, రుచి మారుస్తుంది. మృదువుగా మారిపోతాయి. నమలడం, మింగడం సులభం అవుతుంది. ఉడకబెట్టడం వల్ల వేడి కారణంగా అందులోని సహజ చక్కెరలని విచ్చిన్నం చేస్తుంది. ఇది పచ్చి అరటిపండ్ల కంటే తియ్యగా ఉంటుంది.

ప్రయోజనాలు..

అరటిపండ్లు ఉడకబెట్టడం వల్ల కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే సులభంగా జీర్ణంఅవుతుంది. పచ్చి అరటిపండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొంతమందికి జీర్ణం కావడం కష్టతరం చేస్తుంది.

ఉడకబెట్టడం వల్ల ఫైబర్ విచ్చిన్నమవుతుంది. దీని వల్ల పండులోని పోషకాలను శరీరం సులభంగా గ్రహించేలా చేస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్న వారికి ఇది మరింత సహాయపడుతుంది.

చైనీస్ సంప్రదాయ వైద్యంలో ఉడికించిన అరటిపండు మలబద్ధకం లేదా దగ్గుతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయపడుతుందని నమ్ముతారు.

అలాగే ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఉడకబెట్టిన అరటిపండు అతిసారం చికిత్సకి ఉపయోగిస్తారు.