స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అభిరుచి గల నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన చిత్రం బ్రహ్మఆనందం. ఈ సినిమాకు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రఘు బాబు, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, దివిజా ప్రభాకర్, ఈటీవీ ప్రభాకర్, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మనందం మాట్లాడుతూ..
నా బతుకంతా ఇలాగైపోయింది. 45 సంవత్సరాల క్రితం నన్ను వెనుక నుంచి తోశారు. ఇప్పుడు ఇక్కడకు వచ్చి ఇలా పడ్డాను. ఇప్పుడు చాలా మంది చాలా సేపు మాట్లాడారు. నేను ఎంత సేపు మాట్లాడుతానో నాకు తెలియదు. ఎందుకంటే.. నా వెనుక ఉంది.. నా ముందు ఉంది. నా పక్కన ఉంది. చుట్టూ ఉన్న మా మెగాస్టార్ చిరంజీవి గారు అని ఎమోషనల్‌గా బ్రహ్మానందం స్పీచ్ ప్రారంభించారు.
ఈ సినిమా ఫంక్షన్‌లో ముందు తప్పకుండా గుర్తు పెట్టుకొని చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో నిర్మాత రాహుల్ యాదవ్ ఒకరు. మంచి ఫ్యాషన్ ఉన్న నిర్మాత. మేము కలిసి కూర్చొని పని చేసినప్పుడు రాహుల్‌లో మంచి అభిరుచి నిర్మాత అనిపించింది. నేను చూసి అతికొద్ది మంది ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ ఒకరు. బేవార్స్ తాత.. మొండి మనవడు అనే పాయింట్ సినిమాను అద్బుతంగా నిర్మించారు అని ప్రశంసలతో ముంచెత్తారు.
చివరగా నేను చిరంజీవి గురించి మాట్లాడాలనుకొంటున్నాను. ఆయన గురించి మాట్లాడటానికి నా ఒక్కడికే అర్హత ఉంది. 4 దశాబ్దాల నుంచి ఆయనతో అనుబంధం ఉంది. అత్తిలో లెక్చరర్‌గా పనిచేసే సమయంలో భీమవరంలో ఖైదీ సినిమా చూసినప్పుడు కుర్రాడు ఎవరో బాగా చేశారు అనే విషయం మనసులో అనిపించింది. నా భార్య గర్బవతి అని తెలిసిన తర్వాత వెంటనే లాక్కేల్లి ఖైదీ సినిమా చూయించాను. ఫైట్స్, డ్యాన్స్‌లో ఆయన ట్రెండ్ సెట్టర్ అని బ్రహ్మనందం అన్నారు.
కోరియోగ్రాఫర్లు, ఫైట్ మాస్టర్లకు సవాల్ విసిరిన యాక్టర్ చిరంజీవి. ఆయనకు ఎలా కంపోజ్ చేయాలనే ఛాలెంజ్‌ను విసిరిన వారిలో ఆయన ఒకరు. ఘరానా మొగుడు ఫంక్షన్ గుంటూరులో జరిగితే రెండు ఎకరాల్లో జనం కిక్కిరిసిపోయేవారు. అది చిరంజీవి చరిష్మా. ఆయనతో నా ట్రావెల్ విభిన్నమైనది. ఆయన వెంట నేను ఆల్షిషియన్ డాగ్ లా వెంటాడుతూ ఉండేవాడిని. చిరంజీవి కారులో ప్రయాణించే వీలు నాకే ఉండేది అని బ్రహ్మనందం చెప్పారు.
చిరంజీవి కేవలం డ్యాన్స్, ఫైట్స్ మాత్రమే కాదు.. కామెడీ కూడా అద్బుతంగా చేస్తాడు. ఆయన కామెడీ చూసి మేమంత భయపడ్డాం. ఆయన మా కంచెంలో రాయి వేస్తాడమే అనే భయం కలిగింది. చిరంజీవిని పొగడం కోసం రమ్మన లేదు. ఆయన ఏది చేసిన ఆశ్చర్యం. మనం చేయలేం. అలాంటి ఆశ్చర్యకరమైన జీవితాల్లో చిరంజీవి ఒకరు. ఆయన కారణ జన్ముడు అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఆయన చూడని చరిత్ర.. చేయని చరిత్ర ఉందా? అని బ్రహ్మానందం అన్నారు.