BIG BREAKING : బీఆర్ఎస్ MLA మాగంటి గోపీనాథ్ కన్నుమూత

బీఆర్ఎస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం(ఈరోజు) ఉదయం 5గంటలకు కన్నుమూశారు. గురువారం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని AIG ఆసుపత్రికి తరలించారు.


మూడు రోజులుగా మాగంటి గోపీనాథ్ వెంటిలేటర్ పై చికిత్స పొందతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. టీడీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్తానం మొదలైంది. 2018లో టీఆర్ఎస్‌లో చేరారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్‌గా ఉన్నారు.

1983లో టీడీపీతో మాగంటి రాజకీయాల్లోకి వచ్చారు. 1985 – 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 1987, 1988లో హుడా డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2014లో టీడీపీ తరపున జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 23లో ఆ పార్టీ నుంచే బరిలోకి దిగి హ్యాట్రిక్ విజయం సాధించారు. ప్రస్తుతం BRS హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.