ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL, ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. తక్కువ ధరల్లో రీఛార్జ్ ప్లాన్లను అందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మీరు తరచూ రీఛార్జ్ ల బాధ లేకుండా ఎక్కువ కాలం వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ కోసం చూస్తున్నారా.. అయితే BSNL మీ కోసం మంచి ఆప్షన్ తీసుకొచ్చింది. అదే BSNL రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్. దీనితో ఏకంగా 395 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు.
అంటే 13 నెలల పాటు కళ్లు చెదిరే ప్రయోజనాలను పొందొచ్చు. ఎయిర్‌టెల్, జియో, Vi లాంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు కూడా ఇంత లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఇవ్వడం లేదు. వాళ్ల వార్షిక ప్లాన్స్‌లోనూ 365 రోజులే వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ నెలనెలా రీఛార్జ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్లకి పర్ఫెక్ట్ ఛాయిస్.
* అపరిమితమైన ప్రయోజనాలు
ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే చాలు.. సంవత్సరం దాకా కాలింగ్, డేటా, SMS బెనిఫిట్స్ వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌లో మీకు ఇండియాలో ఏ నెట్‌వర్క్‌కైనా అన్లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ చేసుకోవచ్చు. కాల్స్ మాట్లాడడానికి టైమ్ లిమిట్ లేదు, ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చు. దీంతో హ్యాపీగా ఎవరితోనైనా మాట్లాడొచ్చు.
ఇంకా రోజుకి 100 ఫ్రీ SMSలు కూడా ఇస్తారు. మెసేజ్ లు ఎక్కువగా పంపించే వాళ్లకు, అది ఆఫీస్ పని కోసం అయినా, పర్సనల్ గా ఫ్రెండ్స్ కి మెసేజ్ లు పెట్టాలన్నా ఈ ప్లాన్ చాలా ఉపయోగపడుతుంది. SMS లు అయిపోతాయని భయం ఉండదు. 790GB డేటా కూడా పొందవచ్చు కాబట్టి సోషల్ మీడియా రోజు చెక్ చేసుకోవచ్చు.
* హై స్పీడ్ డేటా
BSNL రూ.2399 ప్లాన్‌లో రోజుకి 2GB హై-స్పీడ్ డేటా ఇస్తారు. అంటే మొత్తం వ్యాలిడిటీ అయిపోయే లోపు 790GB డేటా వాడుకోవచ్చు. వీడియోలు చూసేవాళ్లకి, ఇంటర్నెట్ లో బ్రౌజింగ్ చేసేవాళ్లకి, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్లకి ఈ ప్లాన్ ఉత్తమంగా నిలుస్తుంది.
ఒకవేళ రోజుకి 2GB డేటా మొత్తం వాడేసుకున్నా.. ఇంటర్నెట్ వాడుకోవచ్చు. స్పీడ్ మాత్రం 40Kbps కి తగ్గిపోతుంది. హై-స్పీడ్ డేటా అయిపోయినా మెసేజ్ లు పంపుకోవడం లాంటి బేసిక్ పనులు చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. ఉదాహరణకు వాట్సాప్ లో టెక్స్ట్ మెసేజ్లు పంపించుకోవచ్చు. చిన్నపాటి వెబ్‌సైట్లు కూడా యాక్సెస్ చేయవచ్చు.
* BSNL రూ.1999 ప్లాన్
ఒకవేళ ఇంకా తక్కువ ధరలో ప్లాన్ కావాలంటే BSNL రూ.1999 ప్లాన్ కూడా ఆఫర్ చేస్తోంది. దీని వ్యాలిడిటీ 365 రోజులు (12 నెలలు). ఈ ప్లాన్‌లో మొత్తం 600GB డేటా ఇస్తారు. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకి 100 ఫ్రీ SMSలు కూడా ఉంటాయి. రూ.2399 ప్లాన్‌తో పోలిస్తే ఇందులో డేటా కొంచెం తక్కువగా ఉంటుంది.
కానీ తక్కువ ధరలో లాంగ్-టర్మ్ ప్లాన్ కోసం చూస్తుంటే, ఇది మంచి ఆప్షన్. ఎందుకంటే 400 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఒకేసారి రూ.2399 పెట్టి లేనివారు ఈ ప్లాన్ ఎంచుకోవడం మంచి పని. BSNL లాంగ్ టర్మ్ ప్లాన్స్ చాలామంది సేవ్ చేస్తాయి. 395 రోజుల వ్యాలిడిటీ ఏ కంపెనీ ఇవ్వడం లేదు.
పైగా ప్రైవేట్ కంపెనీల ప్లాన్ల కంటే తక్కువ ధర. ఇంత తక్కువ ధరలో లాంగ్ టర్మ్ ప్లాన్ BSNL మాత్రమే ఇస్తోంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయవచ్చు, డైలీ SMS పంపించుకోవచ్చు. కాల్స్, మెసేజ్‌లకు ఎక్స్‌ట్రా ఛార్జీలు ఉండవు. BSNL తక్కువ ధరలో అదిరిపోయే ప్లాన్స్ అందిస్తోంది. లాంగ్-టర్మ్ ప్లాన్ కావాలనుకునేవారికి BSNL బెస్ట్ ఛాయిస్.
* ఐఫోన్ SE 4 త్వరలో లాంచ్
ఇదిలా ఉంటే, యాపిల్ కంపెనీ ఐఫోన్ SE 4ని త్వరలోనే లాంచ్ చేయబోతోంది. ఇండియాలో దీని స్టార్టింగ్ ధర సుమారు రూ.44,000 ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఐఫోన్ SE 3 లాంచ్ ధర కూడా దాదాపు ఇంతే ఉంది. అయితే ట్యాక్స్‌లు, మార్కెట్ పరిస్థితులు లాంటి కారణాల వల్ల ఇండియాలో ఫైనల్ ధర కొంచెం మారొచ్చు.