నిర్మాతలను భయపెడుతున్న బులిరాజు, రెమ్యునరేషన్ భారీగా డిమాండ్

నిర్మాతలను భయపెడుతున్నాడట బులిరాజు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తన తండ్రిని ఏదైనా అంటే బూతులతో భయపెట్టిన ఈ బుడ్డోడు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ను మాత్రం తన రెమ్యునరేషన్ తో భయపెడుతున్నాడట. ఇంతకీ ఇందులో నిజం ఎంత.?


ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నారు పెద్దలు. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో కొనసాగుతున్న యాక్టర్స్ నుంచి పెద్దగా డిమాండ్స్ ఉండవు కాని.. ఇప్పుడిప్పుడే వస్తున్న నటులు మాత్రం ఒక్క సినిమా హిట్ అయితే చాలు నెక్ట్స్ సినిమాకు రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. నిర్మాతల నుంచి గట్టిగా లాగాలని ప్రయత్నిస్తున్నారు. అది హీరోలైనా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు అయినా.. ఎవరైనా సరే డిమాండ్ విషయంలో మాత్రం తగ్గేది లేదు అంటున్నారు.