తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేంకటేశుని భక్తులు ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో టీటీడీ మూడు నెలల ముందుగానే శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఇతర సేవ టిక్కెట్లు, గదుల బుక్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తోంది. అయితే, తాజాగా ఆగష్టు కోటా దర్శనం టిక్కెట్లను మే 19న విడుదల కానున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వెంకటేశుని దర్శనార్థం నిత్యం ఎంతో మంది భక్తులు తపిస్తూ ఉంటారు. అయితే ఆన్‌లైన్ దర్శన కోటా విడుదల చేసింది ఆగస్టు నెలకి సంబంధించిన ఆర్జిత సేవలు ప్రత్యేక దర్శనంతో పాటు గదులు బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో 19వ తేదీ ఉదయం 10:00 నుంచి లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది. ఇది 21వ తేదీ 10 గంటల వరకు కొనసాగుతుంది. 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు ఎంపికైన వారు డబ్బులు చెల్లిస్తే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది.
ఇక స్వామి వారి ఉంజాల్, ఆర్జిత, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ ఆగస్టు నెలకోటా 22వ తేదీన విడుదల చేస్తారు. వర్చువల్ సేవ టికెట్లు సంబంధించింది కూడా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
23వ తేదీ ఉదయం అంగ ప్రదక్షిణ టోకెట్లు విడుదల చేస్తారు. అదే రోజు శ్రీ వాణి ట్రస్ట్ టికెట్లు కూడా ఉదయం 11 గంటల నుంచి టీటీడీ అందుబాటులో ఉంచనుంది. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
ఇక మే 24వ తేదీ ఆగస్టు నెల కోటాకు సంబంధించిన ప్రత్యేక దర్శనం రూ.300 టికెట్లు కూడా ఆన్‌లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి గదులు బుకింగ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.