Burj Khalifa: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం.. బుర్జ్ ఖలీఫా ఓనర్ ఎవరో తెలుసా?
దుబాయ్ అని చెప్పగానే ముందుగా గుర్తొచ్చే పేరు బుర్జ్ ఖలీఫా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మంగా పేరుపొందిన బుర్జ్ ఖలీఫా..అత్యంత ఎత్తైన నిర్మాణంగానే కాకుండా అనేక కోణాల్లో పలు రకాల ప్రత్యేకతలు కలిగి ఉంది.
దుబాయ్ ఇసుకపై ఉన్నందున దీనిని నిర్మించడం కూడా చాలా కష్టంగా మారింది. ఇసుకపై నిర్మిస్తే, భవనం కూలిపోయే అవకాశం ఉంది, అందువల్ల ఈ భవనం ఇంజనీరింగ్ కోణం నుండి కూడా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. దీని ఎత్తు 828 మీటర్లు. ఈ బిల్డింగ్ మొత్తం 163 అంతస్తులను కలిగి ఉంది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో బుర్జ్ ఖలీఫా ఫొటోలు, వీడియోలు చాలామంది అప్ లోడ్ చేస్తుంటారు. దుబాయ్ వెళ్లినవాళ్లు తప్పకుండా ఈ బిల్డింగ్ ను సందర్శిస్తారు..వెళ్లనివాళ్లు ఆ వీడియోలను,ఫొటోలను సోషల్ మీడియాలో చూసి ఆనందిస్తుంటారు. అయితే అసలు బుర్జ్ ఖలీఫాగా పిలువబడే ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరు? ఏ కంపెనీ దీనిని నిర్మించిందో తెలుసా?
బుర్జ్ ఖలీఫాగా పిలువబడే బిల్డింగ్ ఓనర్ పేరు ‘మహమ్మద్ అల్బర్(Mohamed Alabbar)’. ఇతను ‘EMAAR’ ప్రాపర్టీస్ కంపెనీకి ఓనర్. మొత్తం 3 కంపెనీలు సంయుక్తంగా ఈ బిల్డింగ్ ను నిర్మించాయి. వీటిలో దక్షిణ కొరియా దిగ్గజం Samsung C&T, బెల్జియంకి చెందిన బెసిక్స్, UAEకి చెందిన అరబ్టెక్ ఉన్నాయి.
మహమ్మద్ అల్బర్
ఈ భవన నిర్మాణ పనులు 2004 జనవరిలో ప్రారంభమయ్యాయి. ఈ భవనాన్ని జనవరి 2010లో ప్రారంభించారు. ఇది కాకుండా, బుర్జ్ ఖలీఫా పేరు మీద 8 ప్రపంచ రికార్డులు కూడా ఉన్నాయి, ఇందులో ఎత్తైన భవనం, ఎత్తైన లిఫ్ట్ రికార్డు కూడా ఉన్నాయి.
95 కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది
బుర్జ్ ఖలీఫా పర్యావరణ దృక్కోణం నుండి కూడా నిర్మించబడింది. ప్రతి సంవత్సరం, భవనం నుండి 15 మిలియన్ గ్యాలన్ల నీరు నిలకడగా సేకరించబడుతుంది. ఈ నీటితో చెట్లు, మొక్కలకు నీరందుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బుర్జ్ ఖలీఫా పై భాగం 95 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తుంది.