బిజినెస్ చెయ్యాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది.. అయితే సరైన బిజినెస్ ను ఎంపిక చేసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.. ఈరోజుల్లో ఎక్కువగా పాపు్లారిటీ సంపాదించుకున్న ఫుడ్ అంటే పానీపూరి..
సాయంత్రం 4 గంటలు అయితే చాలు వైన్ షాపుల కన్నా కూడా పానీపూరి బండి చుట్టు సందు లేకుండా ఉంటారు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కంటే ఎక్కువగా పానీపూరి బండి వాళ్లు, మ్యాగి బండి వాళ్లు సంపాదిస్తున్నారని. దీనికి చదువక్కర్లేదు. కేవలం పానీపూరీ ఎలా చేయాలో తెలిస్తే చాలు. నిజానికి ఇది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియానే. అయితే పానీపూరి బండి కాకుండా అందులో వాడే పూరిలు అమ్మి ఓ కుటుంబం నెలకు 5 లక్షలు సంపాదిస్తుంది. మీకు పానీపూరి చేయడం రాకపోతే.. ఇలాంటి వ్యాపారం చేయొచ్చు.. ఆ కుటుంబం గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళితే.. పుత్తూరు తాలూకాలోని దారందకుక్కు మానే గ్రామానికి చెందిన మనోజ్‌ని పానీపూరీ బిజినెస్ చేస్తున్నాడు. ఇతను రుచికరంగా అనేక వెరైటీలలో పానీపూరీలను సిద్ధం చేసి ఫుడ్ లవర్స్ కోసం విక్రయిస్తున్నాడు.. గతంలో ఎన్నో బిజినెస్ లను చేశాడు.. జాబ్ లు చేశాడు.. కానీ ఏ ఒక్కటి కూడా సరైన ఆదాయాన్ని ఇవ్వలేక పోయాయి.. పానీపూరికి డిమాండ్ ఉందని ఇంట్లో చర్చించి ఇంట్లో పూరీలు తయారు చేసి పానీ-పూరీ అమ్మేవారికి విక్రయించడం ప్రారంభించాడు. అతను ఆటో రిక్షా నడపడం ఆపలేదు. కుటుంబం ప్రతిరోజూ 5 కిలోల పూరీలను మాన్యువల్‌గా తయారు చేసి కొంత అదనపు డబ్బుకు విక్రయించేవాడు..
ఈ వ్యాపారంలో లాభాలు మెరుగ్గా ఉండటంతో ఇదే బిజినెస్ ను పూర్తిగా ప్రారంభించాడు..టెక్నాలజీతో సౌరశక్తితో నడిచే పూరీ తయారీ యంత్రాన్ని కొనుగోలు చేశాడు. యంత్రం ఖరీదు రూ.2.9 లక్షలు. కానీ సోలార్ కావడంతో రూ.70 వేలు సబ్సిడీ వచ్చింది. యంత్రాన్ని సెల్కో విక్రయిస్తుంది. సబ్సిడీని కూడా పొందేలా కంపెనీ అతనికి మార్గనిర్దేశం చేసింది. అతను తన పెరట్లో ఒక చిన్న పూరీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిరోజూ కనీసం 40 కిలోల పూరీలను తయారు చేసేవాడు.. మొత్తానికి అతను చుట్టు పక్కల కూడా పాపులర్ అయ్యాడు.. ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచాడు..