వ్యాపారం చేయాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ సరైన అవగాహన లేకో, మార్కెట్ అవసరాలు ఎలా ఉన్నాయన్న అవగాహన లేకో చాలా మంది నష్టపోతుంటారు. అయితే సరైన ప్లానింగ్‌తో బిజినెస్ ప్రారంభిస్తే. ఊహకందని లాభాలు పొందొచ్చు. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం బంగారం ధరలు చుక్కలు తాకుతున్నాయి. పోయిన ఏడాది ఈ సమయానికి సుమారు రూ. 70 వేలున్న తులం బంగారం ధర ఇప్పుడు ఏకంగా రూ. 88 వేలు దాటేసింది. మరికొన్ని రోజుల్లో తులం బంగారం ధర ఏకంగా రూ. లక్షకు చేరువయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే పెరుగుతోన్న ఈ బంగారం ధరలు ఒక మంచి వ్యాపార అవకాశాన్ని కల్పిస్తోంది.
ఇంతకీ ఆ బిజినెస్ మరెంటో కాదు. గిల్ట్ నగల తయారీ. అదేనండి రోల్డ్ గోల్డ్ నగలు. బంగారం ధరలు ఆకాశన్నంటుతున్న తరుణంలో కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గుతోంది. అదే సమయంలో బంగారాన్ని ధరించాలన్న భయంగా ఉంటోంది. ముఖ్యంగా దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది గిల్ట్ నగలను ధరిస్తున్నారు. దీంతో వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది. కాబట్టి గిల్ట్ నగల వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు.
రోల్డ్‌గోల్డ్ నగల వ్యాపారం రెండు రకాలుగా మొదలు పెట్టవచ్చు. వీటిలో ఒకటి హొల్‌సేల్ బిజినెస్. అంటే ఈ నగలు తయారు చేసే సంస్థల వద్ద నేరుగా పెద్ద మొత్తంలో నగలు కొనుగోలు చేసి నేరుగా దుకాణాల్లో విక్రయించవచ్చు. ముందుగానే దుకాణాల నుంచి ఆర్డర్ తీసుకొని బల్క్‌గా కొనుగోలు చేసి కమిషన్ పొందొచ్చు. ఈ వ్యాపారంలో తక్కువ రిస్క్ ఉంటుంది. ఇక మీరే స్వయంగా రోల్డ్ గోల్డ్ నగలను తయారు చేసుకోవచ్చు కూడా.
ఇందుకోసం మార్కెట్లో మేకింగ్ మిషిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం ముందుగా రాగితో తయారు చేసే ఆబరణాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ ఆభరాణాలకు గోల్డ్ ప్లేటింగ్ వేస్తారు. రోల్డ్ గోల్డ్ తయారీకి సంబంధించిన మిషనరీ అందించే కొన్ని సంస్థలు ఉన్నాయి. వీరే నగలను ఎలా తయారు చేయాలో శిక్షణ కూడా ఇస్తారు. ఇక ఈ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించవచ్చు. సుమారు రూ. 5 లక్షల క్యాపిటల్‌తో ప్రారంభించే ఈ వ్యాపారంతో ప్రతీ నెల తక్కువలో తక్కువ రూ. 50 వేలు అయినా ఆర్జించవచ్చు.