నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ సమయం వృధా చేసుకోవద్దు. మీ వయస్సు మీరక ముందే జీవితంలో సెటిల్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. ఇందుకోసం చక్కటి వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుంటే సరిపోతుంది.
బిజినెస్ చేయాలంటే పెట్టుబడి అనేది తప్పనిసరి మరి మీరు పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారా.. ఇంకా ఏమాత్రం ఎదురుచూడద్దు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముద్ర రుణాలను అందిస్తోంది. నిరుద్యోగ యువత కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ ముద్రా రుణాల పథకాన్ని ప్రవేశపెట్టింది. అన్ని ప్రభుత్వ బ్యాంకులో ముద్రా రుణాలను అందిస్తున్నాయి ఈ రుణాలను పొందడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించి చక్కటి ఆదాయం పొందే వీలుంది. ముద్ర రుణాల కోసం ఎలాంటి తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నట్లయితే ఆ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కూడా రుణం పొందే వీరుంది. ముద్ర రుణాలను 50 వేల నుంచి పది లక్షల వరకు పొందే అవకాశం ఉంది.
ఇప్పుడు ఏ వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఓ వినూత్నమైన వ్యాపార ఐడియా గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. . ప్రస్తుతం పట్టణాల్లో ఆరోగ్యం పట్ల అవగాహన చాలా పెరిగింది ఈ నేపథ్యంలో చిరుధాన్యాలతో చేసిన వంటకాలను తినేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీన్నే మీరు చక్కటి వ్యాపార అవకాశంగా మలుచుకునే వీలుంది.
చిరుధాన్యాలను ఇంగ్లీషులో మిల్లెట్స్ అంటారు. వీటితో చేసినటువంటి స్నాక్స్ విక్రయిస్తే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే మంచి రుచిగల స్నాక్స్ చిరుధాన్యాలతో మనం తయారు చేసుకునే వీలుంది. చిరుధాన్యాలతో మన సాంప్రదాయ స్నాక్స్ అయినా మురుకులు, సకినాలు, పకోడీలు, లడ్డూలు, వంటివి చేయవచ్చు. రాగులు, కొర్రలు, సజ్జలను ఉపయోగించి మీరు ఈ స్నాక్స్ తయారు చేయవచ్చు. సాంప్రదాయ రుచులను చిరుధాన్యాలతో అందిస్తే జనం ఆదరణ లభించే అవకాశం సులభంగా తగ్గుతుంది.
ఇక సాంప్రదాయ చిరుతిళ్ళతో పాటు మార్కెట్లో విరివిగా లభించే చిరుతిళ్లను కూడా ప్యాక్ చేసి విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా బిస్కెట్లు, కుకీస్, నూడుల్స్ వంటివి తయారుచేసి విక్రయించడం ద్వారా ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా చిరుధాన్యాలతో చేసిన బిస్కెట్లకు మంచి డిమాండ్ ఉంది. తర ఉద్యోగస్తులు విద్యార్థులు బిస్కెట్లను ఎక్కువగా తింటుంటారు. వీరికి చిరుధాన్యాలతో చేసిన బిస్కెట్లను పరిచయం చేస్తే మీకు మంచి సేల్స్ లభించే అవకాశం ఉంది. తద్వారా చక్కటి ఆదాయం కూడా పొందవచ్చు.
ఇక బిజినెస్ విషయానికి వస్తే చిరుధాన్యాలతో చేసిన చిరుతళ్లను విక్రయించడానికి ఒక బ్రాండ్ అవసరం కావున ముందుగా ఓ బ్రాండ్ ను సృష్టించుకుని చక్కటి ప్యాకింగ్ పద్ధతులను అవలంబించి. మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు. అంతేకాదు రుచి నాణ్యత పాటిస్తే మీ వ్యాపారం శాశ్వతంగా మార్కెట్లో నిలిచిపోతుంది.
నోట్: పైన పేర్కొన్న బిజినెస్ ఐడియా కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆదాయాలు, వ్యయం కేవలం అంచనా మాత్రమే. మీ పెట్టుబడులకు మీరే బాధ్యులు, మన్నం వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు.