లంచ్ బాక్స్‌లోకి అదిరిపోయే క్యాప్సికమ్ దమ్ రైస్..

www.mannamweb.com


క్యాప్సికమ్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి అవసరం అయ్యే పోషకాలు పుష్కలంగా లభ్యమవుతాయి. రుచి కూడా చాలా బాగుంటుంది. క్యాప్సికమ్‌తో చాలా వంటలు తయారు చేసుకోవచ్చు.

క్యాప్సికమ్‌తో చేసే వంటల్లో క్యాప్సికమ్ దమ్ రైస్ కూడా ఒకటి. లంచ్ బాక్స్‌లోకి డిఫరెంట్‌గా కావాలి అనుకునేవారు ఈ రైస్ ట్రై చేయవచ్చు. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సమయం కూడా పెద్దగా పట్టదు. త్వరగానే చేయవచ్చు. మరి ఈ క్యాప్సికమ్ దమ్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాప్సికమ్ దమ్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు:

క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, మిరియాల పొడి, ఆయిల్, పులావ్ దినుసులు.

క్యాప్సికమ్ దమ్ రైస్‌ తయారీ విధానం:

క్యాప్సికమ్ దమ్ రైస్‌ తయారు చేయడానికి ముందుగా.. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కగానే.. పులావ్ దినుసులు కొద్దిగా వేసి ఫ్రై చేయాలి. అనంతరం ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసి ఓ పది నిమిషాలు మగ్గించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి అన్నీ ఓ పది నిమిషాల పాటు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా వేసి ఫ్రై చేయాలి.

ఇవి కూడా బాగా వేగాక వండి చల్లార్చిన అన్నం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చివరగా మిరియాల పొడి కొద్దిగా చల్లి మళ్లీ అన్నం ఒకసారి కలిపి.. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే క్యాప్సికమ్ దమ్ రైస్ సిద్ధం. ఇలా లంచ్ బాక్స్‌లోకి త్వరగా టేస్టీగా ఉండే సిద్ధం చేసుకోవచ్చు. ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.