ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) లండన్ పర్యటనపై (London Tour) నేడు సీబీఐ కోర్టులో (CBI Court) తీర్పు వెలువడనుంది.
యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్ట్‌లో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే జగన్ (CM Jagan) విదేశీ పర్యటనకు వ్యతిరేకంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. కుటుంబంతో జెరూసలేం, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందని.. లండన్‌లో కుమార్తెలు ఉండడంతో వారితో ఉండేందుకు విదేశాలకు వెళుతున్నట్లు జగన్ చెప్పారు.
అయితే జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ (CBI) తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమాస్థుల కేసులో విచారణ జరుగుతోందని, అనుమతి ఇవ్వద్దని సీబీఐ వాదించింది. ఈ దశలో విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ స్పష్టం చేసింది.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇరువురి వాదనలు పూర్తి అయ్యాయి. మరికాసేపట్లో జగన్ లండన్ పర్యటనపై తీర్పు వెలువడనుంది. జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇస్తుందా?.. ఇవ్వదా? అనే ఉత్కంఠ నెలకొంది.