CBI Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ బ్యాంకు డిగ్రీ అర్హతతో ఇటీవల 3,000 అప్రెంటిస్‌షిప్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఇందుకు అప్లికేషన్ ప్రాసెస్ గతంలోనే ముగిసింది. అయితే బ్యాంకు తాజాగా అప్లికేషన్ విండోను మళ్లీ ఓపెన్ చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవారు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
* జాబ్ రిక్రూట్ మెంట్..
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి కొన్ని నెలల క్రితమే నోటిఫికేషన్ ఇచ్చింది. అప్లికేషన్ ప్రాసెస్ 2024 ఫిబ్రవరి 21న ప్రారంభమై మార్చి 27న ముగిసింది. అయితే జూన్ 6న బ్యాంకు అప్లికేషన్ విండోను మళ్లీ రీఓపెన్ చేసింది. అభ్యర్థులు జూన్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ టెస్టు జూన్ 23న జరగనుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://centralbankofindia.co.in/en విజిట్ చేయవచ్చు.
* అప్లికేషన్ ఫీజు
ఈ పోస్టులకు అప్లై చేసుకునే SC, ST, EWS, మహిళా అభ్యర్థులు రూ.600 ఎగ్జామ్ ఫీజు చెల్లించాలి. దీనికి GST అదనం. PWBD అభ్యర్థులు రూ. 400 + GST, మిగతా అభ్యర్థులందరూ రూ. 800 + GST ఫీజు చెల్లించాలి.
* అర్హత, వయో పరిమితి
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసేవారు ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో కనీసం గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సమాన అర్హతలు ఉండాలి. అయితే 31.03.2020 తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే అప్లికెంట్స్ 1996 ఏప్రిల్ 1 నుంచి 2004 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది.
* స్టైఫండ్ ఎంత?
ఎంపికైన అభ్యర్థులకు రూ.15,000 స్టైఫండ్ చెల్లిస్తారు. ఇది అప్రెంటిస్‌షిప్ పొజిషన్ కాబట్టి ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ ఏవీ ఉండవు.
* సెలక్షన్ ప్రాసెస్
అప్లై చేసిన వారు ముందు ఎగ్జామ్ రాయాలి. రాత పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అలాగే లాంగ్వేజ్ ప్రొఫీషియన్సీ టెస్టు కూడా క్లియర్ చేయాలి. అప్లికెంట్స్‌కు తప్పనిసరిగా స్థానిక భాషపై పట్టు ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫీషియన్సీ ఉన్నట్లు ఒక సర్టిఫికెట్ కూడా సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.
* ఆన్ లైన్లో ఎగ్జామ్..
ఆన్‌లైన్ రిటెన్ ఎగ్జామ్‌లో మొత్తం 5 సెక్షన్లు ఉంటాయి. క్వాంటిటేటివ్, జనరల్ ఇంగ్లీష్, & రీజనింగ్ ఆప్టిట్యూడ్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్; బేసిక్ రిటైల్ లయబిలిటీ ప్రొడక్ట్స్; బేసిక్ రిటైల్ అసెట్ ప్రొడక్ట్స్; బేసిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్స్; బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మరిన్ని వివరాల కోసం అఫీషియల్ వెబ్‌సైట్ చెక్ చేయవచ్చు.