ఎన్నికల ఫలితాల ముందే ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్..!!

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాల పైన ఉత్కంఠ సాగుతుంది. ప్రధాన పార్టీలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం నుంచి ఏపీకి కీలక సమాచారం అందింది.


రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రెండో ఐకానిక్ తీగల వంతెనకు ప్రతిపాదన సిద్ధమైంది. రాష్ట్రంలో రెండో తీగల వంతెన నిర్మాణానికి కసరట్టు జరుగుతుంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ మధ్య నంద్యాల, ఆత్మకూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ – కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది.

మరో వంతెన కోసం

ఇదే తరహాలో మరో వంతెనకు ప్రతిపాదిస్తుంది. ఆ నిర్మాణం సైతం ఏపీ తెలంగాణ సరిహద్దులోని కృష్ణానది పైన నిర్మించనుంది. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వేకి సమాంతరంగా ప్రస్తుతం ఉన్న పాత వంతెన స్థానంలో దానికి సమీపంలో కొత్తగా తీగల వంతెన నిర్మించేందుకు కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించిన డి పి ఆర్ సిద్ధమవుతోంది. గుంటూరు-కర్నూలు రోడ్డులో ఉన్న కుంట జంక్షన్ నుంచి దోర్నాల, శ్రీశైలం క్రాస్ రోడ్, సున్నిపెంట, దోమల పెంట మీదుగా హైదరాబాద్ కు వెళ్లే జాతీయ రహదారిని విస్తరిస్తుంది.

విస్తరణ పనులు
నల్లమల అటవీ ప్రాంతం పరిధిలో ఈ రహదారి అనేకచోట్ల 5.5 మీటర్ల నుంచి ఏడు మీటర్ల మేరకే ఉంది. దీనిని 10 మీటర్లకు పెంచుతుంది. ఇప్పటికే కుంట- దోర్నాల మధ్య 24.2 కిలోమీటర్ల మేర 20045 కోట్లతో విస్తరణ పనులు జరుగుతున్నాయి. దోర్నాల నుండి శ్రీశైలం క్రాస్ రోడ్, సున్నిపెంట మీదుగా కృష్ణా నదిపై వంతెన దాటే వరకు 53.5 కిలోమీటర్ల మేర విస్తరించేలా డిపిఆర్ ను కేంద్రం సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం కృష్ణానది పై ఉన్న వంతెన 1972లో నిర్మాణం చేసుకుంది. దీనికి సమీపంలోనే ఐకానిక్ తీగల వంతెన నిర్మించనుంది.

మారనున్న రూపు రేఖలు

ఇందుకోసం దాదాపు 1000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేసింది టీపీఎఫ్ కన్సల్టెంట్స్ అనే సంస్థ ద్వారా ఈ ప్యాకేజీ కి సంబంధించిన డిపిఆర్ ను సిద్ధం చేస్తున్నారు. ఇది తయారైతే వచ్చే ఏడాదిలోగా పనులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. ఈ ఐకానిక్ వంతెన కూడా అందుబాటులోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రూప రేఖలు రానున్నాయి. ఈ రెండు బ్రిడ్జిలు నిజంగానే ఐకానిక్ వంతెనలుగ నిలిచిపోనున్నాయి.