ఉచిత ఆధార్ అప్డేట్ పై కేంద్రం కీలక నిర్ణయం!

ఉచిత ఆధార్ అప్డేట్ గడువుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ గడువును మరి కొద్ది రోజుల పాటు పొడిగించింది. ఉచిత ఆధార్ అప్డేట్ గడువు రేపటితో ముగుస్తున్న నేపధ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఈ గడువును మరో మూడు నెలల పాటు పెంచుతున్నట్లు ప్రకటించింది.


ఈ గడువును సెప్టెంబర్ 14, 2024 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆధార్ కార్డులో ఏమైనా తప్పుల సవరణకు మరో అవకాశం లభించినట్లు అయ్యింది. ఈ నిర్ణయంతో ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకునేవారు ఆన్ లైన్ లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.

కాగా భారతదేశంలో ఎక్కడికి వెళ్లినా ఆధార్ కార్డును ఒక గుర్తింపు కార్డు కింద పరిగణిస్తారు. ఆధార్ నిబందనల ప్రకారం ప్రతి పదేళ్లకు ఒకసారి వ్యక్తికి సంబందించిన వివరాలను అప్డేట్ చేసుకోవాలి.

దీని కోసం సరైన దృవపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఉచిత ఆధార్ అప్డేట్ కోసం కేంద్రం జూన్ 14 వరకు గడువు విధించింది. ఈ గడువు రేపటితో ముగుస్తుండటంతో మరో సారి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువు అనంతరం కూడా ఎప్పటిలాగే ఆధార్ కేంద్రాలలో రూ.50 రుసుముతో అప్డేట్ చేసుకోవచ్చు.