రాష్ట్రం(Andhra Pradesh)లో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పలు ప్రభుత్వ పథకాలు అమలు చేస్తోంది.
పేదలకు అండగా నిలబడేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్(Super Six) పథకాలను ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకొస్తుంది. ఇప్పటికే పలు హామీలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం(AP Government) కొత్త రేషన్ కార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ తరుణంలో ఏపీలో స్మార్ట్ కార్డుల(Smart Card) రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో QR కోడ్‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కొత్తవి వచ్చే నెల(ఆగస్టు)లో పంపిణీ చేయనుంది.
కొత్త రేషన్ కార్డు(New Ration Card)లో నేతల ఫొటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్ధిదారు ఫొటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారుడి రేషన్ కార్డు స్టేటస్‌ను చెక్ చేసుకునేందకు అవకాశం కూడా ఉంటుంది. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్ https://vswsonline.ap.gov.in/ ను సందర్శించాలి. హోమ్ పేజీలో ‘Service Request Status Check’ సెర్చ్ లింక్ లో రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇచ్చిన నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చాను నమోదు చేసి సెర్చ్‌పైనే క్లిక్ చేస్తే రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు.