చాట్ GPT సేవలు ఆగిపోయాయి! AI వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

OpenAI ChatGPT సేవల్లో ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. భారతదేశం యునైటెడ్ స్టేట్స్‌లోని అనేక మంది వినియోగదారులు సేవలను ఉపయోగించలేకపోయారు. Open AI ఈ సమస్యను నిర్ధారించి, దానిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపింది. అయితే, సమస్య పరిష్కారానికి ఖచ్చితమైన సమయం తెలియజేయలేదు.

ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రజాదరణ, ట్రాఫిక్‌ను పొందిన OpenAI ChatGPT సేవల్లో మంగళవారం (జూన్ 10, 2025) అంతరాయం కలిగింది. ఇండియాతో పాటు యునైటెడ్ స్టేట్స్ అంతటా చాలా మంది వినియోగదారులు చాట్‌ జీపీటీని వినియోగించలేకపోయారు. తాము చాట్‌ జీపీటీని వినియోగించలేకపోతున్నాం, సేవల్లో అంతరాయం కలుగుతోంది అంటూ ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సమస్య భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:45 తర్వాత ప్రారంభమైంది. చాలా మంది వినియోగదారులు చాట్‌బాట్ కోర్ లక్షణాల ద్వారా ప్రభావితమయ్యారు.


సేవలలో అంతరాయాన్ని OpenAI నిర్ధారించింది

OpenAI అధికారిక స్టేటస్ పేజీ ప్రకారం, ChatGPT, Sora, API లు సహా బహుళ సేవలు ప్రస్తుతం పెరిగిన జాప్యం, ఎర్రర్ రేట్లను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యను చురుగ్గా పరిశీలిస్తున్నామని కంపెనీ ధృవీకరించినప్పటికీ, సమస్యకు పూర్తి పరిష్కారం కోసం ఎటువంటి కాల పరిమితి ప్రకటించలేదు. అంటే ఫలానా టైమ్‌లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పలేదు. సేవలు నిలిచిపోవడంతో సోషల్ మీడియా చాట్‌ జీపీటీ వినియోగదారుల ఫిర్యాదులు, అంతరాయం గురించి పోస్టులు, కామెంట్లు పెట్టారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.