చావా OTT లోకి అడుగుపెట్టింది.. తేదీ ఫిక్స్ అయింది

తెలుగులోనూ రీసెంట్గా రిలీజై మంచి వసూళ్లను సాధిస్తోంది. తెలుగు ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిచేలా చేస్తోంది. కానీ ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి నెట్టింట ఓ న్యూస్ చక్కర్లు కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఛావా సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇప్పటికీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమాను, ఏప్రిల్ 11 నుంచి నెట్‌ ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌ చేయడానికి రెడీ అవుతున్నట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఇక ఇదే విషయమై నెట్‌ఫ్లిక్స్ తొందర్లో తమ సోషల్ మీడియా వేదికగా ఓ అనౌన్స్ మెంట్ కూడా చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఇది నిజామా? గాలి వార్తా అనేది పక్కకు పెడితే.. ఇప్పుడీ న్యూస్ అక్రాస్ సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమాను ఓటీటీ వేదికగా మరోసారి అందరూ చూడ్డానికి విపరీతంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది.