కొత్త వేతన సంఘంలో జీతం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ డీఏపై క్లారిటీ

కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ప్రకటించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఒకటే ఆసక్తి నెలకొంది. జీతం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డీఏ ఎంత పెరుగుతాయనే చర్చ నడుస్తోంది. కొత్త వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత పెరుగుతుందనే అంశంపై వివిధ రకాల వార్తలు వెలువడుతున్నాయి.


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే జీతాలు, డీఏ ఎంత పెరుగుతాయనే విషయంపై క్లారిటీ వస్తోంది. అదే సమయంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కీలకంగా మారనుంది. ప్రస్తుతం ప్రతి ఉద్యోగి లేదా పెన్షనర్ మదిలో ఇవే ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ఉద్యోగి జీతం పెంపులో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ఉద్యోగుల్లో ఇదే చర్చ నడుస్తోంది. కొత్త వేతన సంఘం ఎప్పుడు అమల్లోకి వస్తుంది, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత, డీఏ ఎంత ఉంటుందనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. వీటిని పరిగణలో తీసుకుని 8వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేటర్ మీ కోసం అందిస్తున్నాం.

8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డీఏను బట్టి జీతం ఎంత పెరుగుతుందనేది చెప్పవచ్చు. గతంలో వివిధ వేతన సంఘాలు అమలైనప్పుడు జీతం ఎంత శాతం పెరిగిందో పరిశీలిద్దాం. 1959లో 2వ వేతన సంఘంలో 14.20 శాతం పెంచాలని ప్రతిపాదించగా 1973లో 3వ వేతన సంఘం సమయంలో 20.60 శాతమైంది. 1986లో 4వ వేతన సంఘం సమయంలో 27.60 శాతంగా, 1996లో 5వ వేతన సంఘం సమయంలో 31 శాతంగా ప్రతిపాదించారు. ఇక 2006లో 6వ వేతన సంఘం సమయంలో 54 శాతం కాగా 2016లో 7 వ వేతన సంఘం సమయంలో 14.27 శాతంగా నిర్ణయించారు. అంటే సరాసరి 27 శాతంగా ఉంది.

ఇక జీతాల పెంపులో కీలకమైంది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. వేతన సంఘం సిఫార్సుల్లో ఇదే అత్యంత ముఖ్యమైంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటే దానిని బేసిక్ శాలరీతో గుణిస్తారు. అదే కొత్త జీతం అవుతుంది. గతంలోని వేతన సంఘాల్లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ గణాంకాలు ఇలా ఉన్నాయి. 2006లో ఏర్పాటైనా 6వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.86 కాగా, 2016లో 7 వ వేతన సంఘంలో 2.57 శాతం ఉంది. ఇక 2026 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.90 ఉండవచ్చని అంచనా

కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చే సమయానికి డీఏ 62 శాతం ఉంటే జీతం 24 శాతం పెరగవచ్చు. అదే 60 శాతానికి చేరుకుంటే 12 శాతం పెంపు ఉంటుంది. 61 శాతం ఉంటే మాత్రం 18 శాతం పెరుగుతుంది. 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.90 ఉంటే కనీస వేతనం 50 వేలు ఉన్నవారికి జీతం 95 వేలు అవుతుంది. డీఏ 61 శాతం కలుపుకుంటే 1,52,950 రూపాయలకు చేరుతుంది. 8వ వేతన సంఘం వచ్చే ఏడాది అంటే 2026 జనవరి నుంచి అమల్లోకి రావచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.